aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

49. సూరా అల్ హుజురాత్

49:1  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
49:2  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు.
49:3  إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِندَ رَسُولِ اللَّهِ أُولَٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
ఎవరైతే దైవప్రవక్త సమక్షంలో అణకువతో (తగ్గు స్వరాలలో) మాట్లాడుతారో వారి హృదయాలను అల్లాహ్ ధర్మ నిష్ఠ (తఖ్వా) కోసం పరికించాడు. వారికి మన్నింపుతో పాటు గొప్ప ప్రతిఫలం కూడా ఉంది.
49:4  إِنَّ الَّذِينَ يُنَادُونَكَ مِن وَرَاءِ الْحُجُرَاتِ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
(ఓ ప్రవక్తా!) కుటీరాల వెనుక నుంచి నిన్ను కేకలేసి పిలుస్తున్న వారిలో చాలా మందికి (బొత్తిగా) బుద్ధిలేదు.
49:5  وَلَوْ أَنَّهُمْ صَبَرُوا حَتَّىٰ تَخْرُجَ إِلَيْهِمْ لَكَانَ خَيْرًا لَّهُمْ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
నీవంతట నీవుగా వారి దగ్గరకు వెడలి వచ్చేవరకూ వారు గనక ఓపిక పట్టి ఉంటే, అది వారి కోసం ఎంతో ఉత్తమం అయి ఉండేది. అల్లాహ్ క్షమాగుణం కలవాడు. దయా స్వభావి.
49:6  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن جَاءَكُمْ فَاسِقٌ بِنَبَإٍ فَتَبَيَّنُوا أَن تُصِيبُوا قَوْمًا بِجَهَالَةٍ فَتُصْبِحُوا عَلَىٰ مَا فَعَلْتُمْ نَادِمِينَ
ఓ విశ్వాసులారా! ఎవడయినా దుర్వర్తనుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, దాని నిజానిజాలను నిర్ధారించుకోండి. అన్యథా మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి, తరువాత చేసిన దానిపై సిగ్గుతో కుంచించుకు పోవలసిన పరిస్థితి రావచ్చు.
49:7  وَاعْلَمُوا أَنَّ فِيكُمْ رَسُولَ اللَّهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِي كَثِيرٍ مِّنَ الْأَمْرِ لَعَنِتُّمْ وَلَٰكِنَّ اللَّهَ حَبَّبَ إِلَيْكُمُ الْإِيمَانَ وَزَيَّنَهُ فِي قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ
మీ మధ్య దైవప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా తెలుసుకోండి. చాలా విషయాలలో అతను గనక మీరు కోరినట్లుగా మసలుకుంటే మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. కాని అల్లాహ్ విశ్వాసాన్ని మీకు ప్రియతమం చేశాడు. దాన్ని మీ హృదయాలలో శోభాయమానంగా చేశాడు. అవిశ్వాసం పట్ల, దుర్వర్తన పట్ల, అవిధేయత పట్ల మీకు రోత కలిగేలా చేశాడు. ఇలాంటి వారే సన్మార్గ గాములు -
49:8  فَضْلًا مِّنَ اللَّهِ وَنِعْمَةً ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
అల్లాహ్ కృపవల్ల, ఆయన అనుగ్రహం వల్ల! అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకసంపన్నుడు.
49:9  وَإِن طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا ۖ فَإِن بَغَتْ إِحْدَاهُمَا عَلَى الْأُخْرَىٰ فَقَاتِلُوا الَّتِي تَبْغِي حَتَّىٰ تَفِيءَ إِلَىٰ أَمْرِ اللَّهِ ۚ فَإِن فَاءَتْ فَأَصْلِحُوا بَيْنَهُمَا بِالْعَدْلِ وَأَقْسِطُوا ۖ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
ఒకవేళ ముస్లింలలోని రెండు పక్షాల వారు పరస్పరం గొడవపడితే వారి మధ్య సయోధ్య చేయండి. మరి వారిలో ఒక పక్షంవారు రెండవ పక్షం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసే వర్గం దైవాజ్ఞ వైపు మరలివచ్చే వరకూ మీరు వారితో పోరాడండి. వారు గనక మరలివస్తే వారి మధ్య న్యాయసమ్మతంగా సయోధ్య కుదర్చండి. సమభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా సమభావంతో వ్యవహరించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
49:10  إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
విశ్వాసులు (ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి – తద్వారా మీరు కరుణించబడవచ్చు.
49:11  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَسْخَرْ قَوْمٌ مِّن قَوْمٍ عَسَىٰ أَن يَكُونُوا خَيْرًا مِّنْهُمْ وَلَا نِسَاءٌ مِّن نِّسَاءٍ عَسَىٰ أَن يَكُنَّ خَيْرًا مِّنْهُنَّ ۖ وَلَا تَلْمِزُوا أَنفُسَكُمْ وَلَا تَنَابَزُوا بِالْأَلْقَابِ ۖ بِئْسَ الِاسْمُ الْفُسُوقُ بَعْدَ الْإِيمَانِ ۚ وَمَن لَّمْ يَتُبْ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
ఓ విశ్వాసులారా! పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు. ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తిపొడుచుకోకండి. ఒండొకరికి చెడ్డపేర్లను ఆపాదించకండి. విశ్వసించిన తరువాత తన సోదరుణ్ణి చెడ్డపేరుతో అవమానించటం ఎంత పాపం! మరెవరైతే పశ్చాత్తాపం చెందరో (ఈ ధోరణిని మానుకొనరో) వారే దుర్మార్గులు.
49:12  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اجْتَنِبُوا كَثِيرًا مِّنَ الظَّنِّ إِنَّ بَعْضَ الظَّنِّ إِثْمٌ ۖ وَلَا تَجَسَّسُوا وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ
ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా! కూపీలు లాగకండి. మీలో ఎవరూ ఇంకొకరి గురించి వీపు వెనక చెడుగా (చాడీలు) చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడూను.
49:13  يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنَاكُم مِّن ذَكَرٍ وَأُنثَىٰ وَجَعَلْنَاكُمْ شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقَاكُمْ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ
ఓ మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు.
49:14  قَالَتِ الْأَعْرَابُ آمَنَّا ۖ قُل لَّمْ تُؤْمِنُوا وَلَٰكِن قُولُوا أَسْلَمْنَا وَلَمَّا يَدْخُلِ الْإِيمَانُ فِي قُلُوبِكُمْ ۖ وَإِن تُطِيعُوا اللَّهَ وَرَسُولَهُ لَا يَلِتْكُم مِّنْ أَعْمَالِكُمْ شَيْئًا ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
“మేము విశ్వసించాము” అని పల్లెవాసులు అంటున్నారు. (ఓ ప్రవక్తా!) వారికిలా చెప్పు : “నిజానికి మీరింకా విశ్వసించలేదు. కాని ‘(వ్యతిరేక ధోరణిని మానుకొని) లొంగిపోయాము (ఇస్లాం స్వీకరించాము)’ అని మాత్రం అనండి. వాస్తవానికి విశ్వాసం ఇంకా మీ హృదయాలలో ప్రవేశించనే లేదు. మీరు గనక అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపితే, ఆయన మీ కర్మల (ప్రతిఫలం) లో ఏ మాత్రం కోత విధించడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి.”
49:15  إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا وَجَاهَدُوا بِأَمْوَالِهِمْ وَأَنفُسِهِمْ فِي سَبِيلِ اللَّهِ ۚ أُولَٰئِكَ هُمُ الصَّادِقُونَ
అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను (దృఢంగా)విశ్వసించి, తరువాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉంటూ, తమ ధనప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారే విశ్వాసులు. వారే సత్యవంతులు.
49:16  قُلْ أَتُعَلِّمُونَ اللَّهَ بِدِينِكُمْ وَاللَّهُ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
వారికి చెప్పు: “ఏమిటీ, మీ ధార్మికత గురించి మీరు అల్లాహ్ కే తెలియపరచాలనుకుంటున్నారా? భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ కు తెలుసు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.”
49:17  يَمُنُّونَ عَلَيْكَ أَنْ أَسْلَمُوا ۖ قُل لَّا تَمُنُّوا عَلَيَّ إِسْلَامَكُم ۖ بَلِ اللَّهُ يَمُنُّ عَلَيْكُمْ أَنْ هَدَاكُمْ لِلْإِيمَانِ إِن كُنتُمْ صَادِقِينَ
తాము ఇస్లాం స్వీకరించి నీకేదో ఉపకారం చేసినట్లుగానే వారు మాట్లాడుతున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీ ఇస్లాం స్వీకరణకు సంబంధించిన ఉపకారం నాపై పెట్టకండి. వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే (తెలుసుకోండి), అల్లాహ్ విశ్వాసమార్గం చూపి మీకు మహోపకారం చేశాడు.
49:18  إِنَّ اللَّهَ يَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ بَصِيرٌ بِمَا تَعْمَلُونَ
“భూమ్యాకాశాలలో ఉన్న రహస్య విషయాలన్నీ అల్లాహ్ కు బాగా తెలుసు (అన్న సంగతిని మీరు గ్రహించాలి). మీరు చేసేదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు.”


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.