aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

45. సూరా అల్ జాసియ హ్

45:1  حم
హా మీమ్‌.
45:2  تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేచనాపరుడైన అల్లాహ్‌ తరఫున జరిగింది.
45:3  إِنَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّلْمُؤْمِنِينَ
నిశ్చయంగా ఆకాశాలలో, భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి.
45:4  وَفِي خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِن دَابَّةٍ آيَاتٌ لِّقَوْمٍ يُوقِنُونَ
స్వయంగా మీ పుట్టుకలోనూ, ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కొరకు సూచనలున్నాయి.
45:5  وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا أَنزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِن رِّزْقٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ الرِّيَاحِ آيَاتٌ لِّقَوْمٍ يَعْقِلُونَ
రేయింబవళ్ళ రాకపోకలలోనూ, అల్లాహ్‌ ఆకాశం నుంచి ఉపాధిని (వర్షం రూపంలో) కురిపించి, భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులోనూ బుద్ధీజ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి.
45:6  تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۖ فَبِأَيِّ حَدِيثٍ بَعْدَ اللَّهِ وَآيَاتِهِ يُؤْمِنُونَ
ఇవి అల్లాహ్‌ వాక్యాలు. వీటిని మేము నీకు ఉన్నదున్నట్టుగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్‌ మరియు ఆయన సూచనల (ను కాదన్న) తరువాత ఇక ఏ విషయాన్ని విశ్వసిస్తారు(ట)!?
45:7  وَيْلٌ لِّكُلِّ أَفَّاكٍ أَثِيمٍ
అబద్ధాలకోరు, పాపాత్ముడైన ప్రతి ఒక్కరికీ మూడుతుంది.
45:8  يَسْمَعُ آيَاتِ اللَّهِ تُتْلَىٰ عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ
వాడెలాంటివాడంటే, తన ముందు అల్లాహ్‌ వాక్యాలను చదివి వినిపించినప్పుడు, వాటిని విని, ఆ తర్వాత అసలు వాటిని విననే లేదన్నట్లుగా అహంకారంతో మొండికేస్తాడు. కనుక అలాంటి వారికి బాధాకరమైన శిక్షపడుతుందన్న వార్తను వినిపించు.
45:9  وَإِذَا عَلِمَ مِنْ آيَاتِنَا شَيْئًا اتَّخَذَهَا هُزُوًا ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ
మా వాక్యాలలోని ఏదైనా విషయం అతనికి తెలిసినప్పుడు, దాన్ని ఎగతాళి చేస్తాడు. అవమానకరమైన శిక్ష ఉన్నది ఇలాంటి వారికోసమే.
45:10  مِّن وَرَائِهِمْ جَهَنَّمُ ۖ وَلَا يُغْنِي عَنْهُم مَّا كَسَبُوا شَيْئًا وَلَا مَا اتَّخَذُوا مِن دُونِ اللَّهِ أَوْلِيَاءَ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
వారికి ముందు నరకం ఉన్నది. వారు సంపాదించుకున్నదేదీ వారికెలాంటి ప్రయోజనం చేకూర్చదు. అల్లాహ్‌ను వదలి వారు ఆశ్రయించిన సంరక్షకులు కూడా వారికి పనికి రారు. వారికోసం చాలా ఘోరమైన యాతన (సిద్ధంగా) ఉంది.
45:11  هَٰذَا هُدًى ۖ وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ
ఇదే (అసలు సిసలు) మార్గదర్శిని. మరెవరయితే తమ ప్రభువు సూచనలను త్రోసిపుచ్చారో వారికొరకు అత్యంత బాధాకరమైన - వణుకుపుట్టించే - శిక్ష ఉన్నది.
45:12  اللَّهُ الَّذِي سَخَّرَ لَكُمُ الْبَحْرَ لِتَجْرِيَ الْفُلْكُ فِيهِ بِأَمْرِهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
అల్లాహ్‌యే మీ కోసం సముద్రాన్ని వశపరిచాడు - ఆయన ఆజ్ఞతో అందులో ఓడలు నడవటానికి, మరి మీరు ఆయన కృపను (ఉపాధిని) అన్వేషించటానికి, ఇంకా - మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి.
45:13  وَسَخَّرَ لَكُم مَّا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ جَمِيعًا مِّنْهُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
ఇంకా భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నింటినీ ఆయన - తన తరఫున - మీ సేవలో ఉండేటట్లుగా చేశాడు. నిశ్చయంగా యోచన చేసేవారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
45:14  قُل لِّلَّذِينَ آمَنُوا يَغْفِرُوا لِلَّذِينَ لَا يَرْجُونَ أَيَّامَ اللَّهِ لِيَجْزِيَ قَوْمًا بِمَا كَانُوا يَكْسِبُونَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ ఒక వర్గం వారికి, వారు చేసుకున్న దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి కదా; అందుకే అల్లాహ్‌ తరఫున గడ్డు దినాలు రావని నిక్షేపంగా ఉన్నవారిని క్షమించి వదలి పెట్టమని నువ్వు విశ్వాసులకు చెప్పు.
45:15  مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهِ ۖ وَمَنْ أَسَاءَ فَعَلَيْهَا ۖ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ
ఎవడయినా సత్కార్యం చేస్తే తన స్వయం కొరకే చేసుకుంటాడు. మరెవడయినా దుష్కార్యానికి ఒడిగడితే దాని పాపఫలం స్వయంగా అతని మీదే పడుతుంది. తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకే మరలించబడతారు.
45:16  وَلَقَدْ آتَيْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَى الْعَالَمِينَ
మరి మేము ఇస్రాయీలు సంతతి వారికి గ్రంథాన్నీ, రాజ్యాధికారాన్ని, ప్రవక్తా పదవిని ప్రసాదించాము. ఇంకా మేము వారికి పవిత్రమైన ఆహారాన్ని (మంచి మంచి వస్తువులను) వొసగాము. అంతేకాదు, లోకవాసులపై వారికి ఆధిక్యతను కూడా అనుగ్రహించాము.
45:17  وَآتَيْنَاهُم بَيِّنَاتٍ مِّنَ الْأَمْرِ ۖ فَمَا اخْتَلَفُوا إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۚ إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
మరి ధర్మానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలను కూడా వారికి ఇచ్చాము. కాని తీరా జ్ఞానం వచ్చేసిన పిమ్మట వారు తమ మధ్య గల ద్వేషం, శత్రుత్వం కారణంగా విభేదించుకున్నారు. వారు ఏ ఏ విషయాలలో విభేదించుకుంటున్నారో, దానికి సంబంధించిన తీర్పును - వారి మధ్య - ప్రళయదినాన నీ ప్రభువు చెబుతాడు.
45:18  ثُمَّ جَعَلْنَاكَ عَلَىٰ شَرِيعَةٍ مِّنَ الْأَمْرِ فَاتَّبِعْهَا وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ لَا يَعْلَمُونَ
తర్వాత మేము నిన్ను ధర్మానికి సంబంధించిన (రాచ)బాటపై నిలబెట్టాము. కనుక (ఓ ముహమ్మద్‌ - స!) నువ్వు దీనినే అనుసరించు. అజ్ఞానుల ఆకాంక్షలను అనుసరించకు.
45:19  إِنَّهُمْ لَن يُغْنُوا عَنكَ مِنَ اللَّهِ شَيْئًا ۚ وَإِنَّ الظَّالِمِينَ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۖ وَاللَّهُ وَلِيُّ الْمُتَّقِينَ
(బాగా గుర్తుంచుకో!) అల్లాహ్‌ ముందు వాళ్ళెవరూ ఏ విధంగానూ నీకు ఉపయోగపడరు. ఈ దుర్మార్గులు ఒండొకరికి స్నేహితులుగా ఉంటారు. మరి భయభక్తులు గలవారికి అండగా అల్లాహ్‌ ఉంటాడు సుమా!
45:20  هَٰذَا بَصَائِرُ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةٌ لِّقَوْمٍ يُوقِنُونَ
ఇది (ఈ ఖుర్‌ఆన్‌) ప్రజలకు ముందు చూపును ఇచ్చే సూచనల సమాహారం. నమ్మి నడుచుకునే జనం కోసం మార్గదర్శిని, కారుణ్యప్రదాయిని.
45:21  أَمْ حَسِبَ الَّذِينَ اجْتَرَحُوا السَّيِّئَاتِ أَن نَّجْعَلَهُمْ كَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَوَاءً مَّحْيَاهُمْ وَمَمَاتُهُمْ ۚ سَاءَ مَا يَحْكُمُونَ
పాపిష్టి పనులు చేసినవారు, తమనూ, విశ్వసించి మంచి పనులు చేసే వారినీ మేము సమానంగా చేస్తామనీ, వారిరువురి జీవన్మరణాలు ఒకే విధంగా ఉండేలా చేస్తామనీ అనుకుంటున్నారా? వాళ్ళ తీర్పు చాలా ఘోరమైనది.
45:22  وَخَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَلِتُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
భూమ్యాకాశాలను అల్లాహ్‌ ఎంతో సమతూకంతో సృష్టించాడు - ప్రతి ప్రాణికీ తాను సంపాదించుకున్నదాని సంపూర్ణ ప్రతిఫలం ఇవ్వబడటానికి! వారికెలాంటి అన్యాయం జరగదు.
45:23  أَفَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَٰهَهُ هَوَاهُ وَأَضَلَّهُ اللَّهُ عَلَىٰ عِلْمٍ وَخَتَمَ عَلَىٰ سَمْعِهِ وَقَلْبِهِ وَجَعَلَ عَلَىٰ بَصَرِهِ غِشَاوَةً فَمَن يَهْدِيهِ مِن بَعْدِ اللَّهِ ۚ أَفَلَا تَذَكَّرُونَ
తన మనోవాంఛను ఆరాధ్యదైవంగా చేసుకున్న వాడ్ని నువ్వు చూశావా? అంతా తెలిసినప్పటికీ - అల్లాహ్‌ అతన్ని అపమార్గానికి లోను చేశాడు. అతని చెవులకూ, అతని హృదయానికి సీలు వేశాడు. అతని కళ్లపై కూడా తెరను వేసేశాడు. ఇప్పుడలాంటి వ్యక్తిని - అల్లాహ్‌ తర్వాత - సన్మార్గానికి తెచ్చే వాడెవడుంటాడు? ఏమిటి, ఇప్పటికీ మీరు విషయాన్ని గ్రహించరా?
45:24  وَقَالُوا مَا هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنَا إِلَّا الدَّهْرُ ۚ وَمَا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَظُنُّونَ
"మా జీవితం మటుకు ఈ ప్రాపంచిక జీవితమే. మేము చస్తున్నాము, బ్రతుకుతున్నాము. కాలం తప్ప మరేదీ మమ్మల్ని చంపటం లేదు" అని వారంటారు. (నిజానికి) వారికి దీని గురించి బొత్తిగా తెలియదు. వారు కేవలం ఊహాస్త్రాలను సంధిస్తూ పోతున్నారు.
45:25  وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ مَّا كَانَ حُجَّتَهُمْ إِلَّا أَن قَالُوا ائْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ
మరి వాళ్లముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, "ఒకవేళ మీరు సత్యవంతులే అయితే మా తాత ముత్తాతలను (బ్రతికించి) తీసుకురండి" అని చెప్పటం తప్ప వారి దగ్గర మరో ఆధారం ఏమీ ఉండదు.
45:26  قُلِ اللَّهُ يُحْيِيكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "అల్లాహ్‌యే మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. మరి ఆయనే మిమ్మల్ని చంపుతున్నాడు. తరువాత ఆయనే మిమ్మల్ని ప్రళయదినాన సమీకరిస్తాడు. ఇందులో సందేహానికి తావేలేదు." కాని చాలామంది తెలుసుకోరు.
45:27  وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَخْسَرُ الْمُبْطِلُونَ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌కే చెందుతుంది. ఏ రోజున ప్రళయ ఘడియ నెలకొంటుందో ఆనాడు అసత్యవాదులు తీవ్రంగా నష్టపోతారు.
45:28  وَتَرَىٰ كُلَّ أُمَّةٍ جَاثِيَةً ۚ كُلُّ أُمَّةٍ تُدْعَىٰ إِلَىٰ كِتَابِهَا الْيَوْمَ تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
ప్రతి మానవ సముదాయం మోకాళ్ళపై పడి ఉండటాన్ని, ప్రతి వర్గం తన కర్మల పత్రం వైపునకు పిలువబడటాన్ని నువ్వు చూస్తావు. "ఈ రోజు మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం మీకు లభిస్తుంది.
45:29  هَٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ
"ఇదిగో, ఇదీ మా రికార్డు. మీ గురించి (ఇది) ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం" (అని వారితో అనబడుతుంది).
45:30  فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُدْخِلُهُمْ رَبُّهُمْ فِي رَحْمَتِهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْمُبِينُ
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని మాత్రం వారి ప్రభువు తన కారుణ్యంలోకి తీసేసుకుంటాడు. స్పష్టమైన సాఫల్యమంటే ఇదే.
45:31  وَأَمَّا الَّذِينَ كَفَرُوا أَفَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَاسْتَكْبَرْتُمْ وَكُنتُمْ قَوْمًا مُّجْرِمِينَ
కాని ఎవరయితే తిరస్కరిస్తారో (వారితో నేనిలా అంటాను), "ఏమిటి నా వాక్యాలు మీకు చదివి వినిపించబడలేదా? అయినా మీరు పొగరును ప్రదర్శించారు. అసలు మీరు (ముందు నుంచే) అపరాధ జనులు."
45:32  وَإِذَا قِيلَ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَالسَّاعَةُ لَا رَيْبَ فِيهَا قُلْتُم مَّا نَدْرِي مَا السَّاعَةُ إِن نَّظُنُّ إِلَّا ظَنًّا وَمَا نَحْنُ بِمُسْتَيْقِنِينَ
"అల్లాహ్‌ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందనీ, ప్రళయం సంభవించటంలో సందేహమే లేదని చెప్పబడినప్పుడల్లా, 'ప్రళయం అంటే ఏమిటో మాకు తెలీదు. కాకపోతే దానికి సంబంధించి ఏదో ఊహా మాత్రంగా ఆలోచన వస్తూ ఉంటుంది. అంతేగాని మేము దాన్ని నమ్మబోము' అని మీరు అనేవారు."
45:33  وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
వారి కర్మల దుష్ఫలితాలు వారి ముందు తేటతెల్లమైనాయి. దేన్ని గురించి వారు పరిహసించేవారో అదే వారిని చుట్టు ముట్టింది.
45:34  وَقِيلَ الْيَوْمَ نَنسَاكُمْ كَمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُم مِّن نَّاصِرِينَ
వారితో ఇలా అనబడింది : "మీరు ఈనాటి మీ సమావేశాన్ని ఎలా మరచిపోయారో అలాగే మేము కూడా మిమ్మల్ని మరచిపోతాము. మీ నివాసం ఇక నరకమే. ఇక్కడ మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ లేడు."
45:35  ذَٰلِكُم بِأَنَّكُمُ اتَّخَذْتُمْ آيَاتِ اللَّهِ هُزُوًا وَغَرَّتْكُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ فَالْيَوْمَ لَا يُخْرَجُونَ مِنْهَا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
"ఎందుకంటే మీరు అల్లాహ్‌ వాక్యాలను వేళాకోళంగా తీసుకున్నారు. ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసంలో పడవేసింది." కనుక ఈ రోజు వీళ్లు నరకం నుంచి తీయబడటంగానీ, వీళ్ళ సంజాయిషీని ఆమోదించటంగానీ జరగదు.
45:36  فَلِلَّهِ الْحَمْدُ رَبِّ السَّمَاوَاتِ وَرَبِّ الْأَرْضِ رَبِّ الْعَالَمِينَ
కాబట్టి ఆకాశాల ప్రభువు, భూమండల ప్రభువు, సమస్త లోకాల ప్రభువు అయిన అల్లాహ్‌ మాత్రమే స్తుతించదగినవాడు.
45:37  وَلَهُ الْكِبْرِيَاءُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
భూమ్యాకాశాలలో పెద్దరికం ఆయనకే చెల్లుతుంది.ఆయనే ఆధిక్యతగలవాడు,వివేచనాపరుడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.