Translation
| 44. సూరా అద్ దుఖాన్ 44:1 حم హా మీమ్. 44:2 وَالْكِتَابِ الْمُبِينِ స్పష్టమైన ఈ గ్రంథం తోడు! 44:3 إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రియందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము. 44:4 فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ ఆ రాత్రియందే కీలకమైన ప్రతి ఉత్తర్వూ జారీ చేయబడుతుంది. 44:5 أَمْرًا مِّنْ عِندِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ మా వద్ద నుండే ఆజ్ఞ రూపంలో! (ప్రవక్తలను) పంపేది కూడా మేమే. 44:6 رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ నీ ప్రభువు దయానుగ్రహం వల్ల. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. 44:7 رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ మీరు గనక నమ్మగలిగితే ఆయనే భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్తానికీ ప్రభువు. 44:8 لَا إِلَٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తున్నాడు, ఆయనే చంపుతున్నాడు. ఆయనే మీ ప్రభువు, పూర్వీకులైన మీ తాతముత్తాతలకు కూడా (ఆయనే) ప్రభువు. 44:9 بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ అది కాదు, వారు సంశయానికి లోనై, ఆడుకుంటున్నారు. 44:10 فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُّبِينٍ కనుక నువ్వు, ఆకాశం స్పష్టమయిన పొగను తీసుకువచ్చే రోజు కోసం ఎదురు చూడు. 44:11 يَغْشَى النَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌ అది మనుషుల్ని ముట్టడిస్తుంది. అదొక వ్యధాభరితమైన శిక్ష. 44:12 رَّبَّنَا اكْشِفْ عَنَّا الْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ (అప్పుడు వారు) "మా ప్రభూ! ఈ విపత్తును మా నుండి దూరం చేయి. మేము నిజంగానే విశ్వసిస్తాము" (అని ప్రాధేయపడతారు). 44:13 أَنَّىٰ لَهُمُ الذِّكْرَىٰ وَقَدْ جَاءَهُمْ رَسُولٌ مُّبِينٌ ఉపదేశం ఇప్పుడు వారికి ఎలా లాభదాయకం అవుతుంది? - అన్నీ విడమరచి చెప్పే ప్రవక్త వారి వద్దకు (ఎప్పుడో) వచ్చేశాడు. 44:14 ثُمَّ تَوَلَّوْا عَنْهُ وَقَالُوا مُعَلَّمٌ مَّجْنُونٌ అయినా వాళ్లు అతన్నుండి ముఖం త్రిప్పుకున్నారు. "ఇతను (ఇతరుల చేత మాటలు) నేర్పబడిన పిచ్చివానిలా ఉన్నాడు" అని అన్నారు. 44:15 إِنَّا كَاشِفُو الْعَذَابِ قَلِيلًا ۚ إِنَّكُمْ عَائِدُونَ మేము ఈ విపత్తును కొద్దిగా తొలగిస్తాము. (కాని ఏం లాభం?) మీరు మళ్లీ యధాస్థితి (అవిశ్వాస స్థితి)కి వస్తారు. 44:16 يَوْمَ نَبْطِشُ الْبَطْشَةَ الْكُبْرَىٰ إِنَّا مُنتَقِمُونَ ఏ రోజున మేము మిమ్మల్ని చాలా గట్టిగా పట్టుకుంటామో (ఆ రోజు) మీపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాము. 44:17 وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَاءَهُمْ رَسُولٌ كَرِيمٌ వీరికి పూర్వం ఫిరౌన్ జాతి వారిని (కూడా) మేము పరీక్షించాము. వాళ్ల దగ్గరకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చాడు. 44:18 أَنْ أَدُّوا إِلَيَّ عِبَادَ اللَّهِ ۖ إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ (అతనిలా అన్నాడు): "దైవదాసులను నాకప్పగించండి. నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుణ్ణి అయిన ప్రవక్తను. 44:19 وَأَن لَّا تَعْلُوا عَلَى اللَّهِ ۖ إِنِّي آتِيكُم بِسُلْطَانٍ مُّبِينٍ "మీరు అల్లాహ్ ముందు తలబిరుసుతనం ప్రదర్శించకండి. నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకువచ్చాను. 44:20 وَإِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ "మీరు రాళ్లు రువ్వి నన్ను చంపే ప్రయత్నం నుంచి నా ప్రభువూ, మీ ప్రభువూ అయిన అల్లాహ్ను నేను శరణు వేడుతున్నాను. 44:21 وَإِن لَّمْ تُؤْمِنُوا لِي فَاعْتَزِلُونِ "ఒకవేళ మీకు నాపై నమ్మకం లేకపోతే, నా నుండి వేరై పోండి." 44:22 فَدَعَا رَبَّهُ أَنَّ هَٰؤُلَاءِ قَوْمٌ مُّجْرِمُونَ (కాని ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవటంతో) అతను, "(ఓ ప్రభూ!) ఈ జనులు పాపాత్ములు" అంటూ తన ప్రభువును ప్రార్థించాడు. 44:23 فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ "సరే! రాత్రికి రాత్రే నువ్వు నా దాసులను తీసుకుని వెళ్ళిపో. ఖచ్చితంగా మీరు వెంబడించబడతారు. 44:24 وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ "నువ్వు సముద్రాన్ని నిలిచి (చీలి) ఉన్న స్థితిలోనే వదలి వెళ్ళిపో. అయితే ఈ సైన్యం మాత్రం ముంచివేయబడుతుంది" (అని మేమతనికి సూచించాము). 44:25 كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ వారు ఎన్నో తోటలను, ఊటలను వదలిపోయారు. 44:26 وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ మరెన్నో పచ్చని పొలాలను, చక్కని నిలయాలను, 44:27 وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ ఇంకా తాము అనుభవిస్తూ ఉండే విలాసవంతమైన వస్తువులను కూడా (వదలిపోయారు). 44:28 كَذَٰلِكَ ۖ وَأَوْرَثْنَاهَا قَوْمًا آخَرِينَ అంతా ఇట్టే అయిపోయింది. మేము మరో జాతి వారిని వాటన్నింటికీ వారసులుగా చేశాము. 44:29 فَمَا بَكَتْ عَلَيْهِمُ السَّمَاءُ وَالْأَرْضُ وَمَا كَانُوا مُنظَرِينَ వారి స్థితిపై నింగీ, నేలా రోదించలేదు. వారికి (కనీసం) గడువు కూడా లభించలేదు. 44:30 وَلَقَدْ نَجَّيْنَا بَنِي إِسْرَائِيلَ مِنَ الْعَذَابِ الْمُهِينِ నిస్సందేహంగా మేమే ఇస్రాయీలు సంతతిని (అత్యంత) అవమానకరమైన శిక్ష (పీడన) నుంచి విడిపించాము. 44:31 مِن فِرْعَوْنَ ۚ إِنَّهُ كَانَ عَالِيًا مِّنَ الْمُسْرِفِينَ ఫిరౌన్ తరఫున జరిగే (పీడన నుంచి)! నిశ్చయంగా వాడు మహా తలబిరుసు, బరితెగించిపోయినవాడు. 44:32 وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى الْعَالَمِينَ మేము జ్ఞానంతోనే వారికి (ఇస్రాయీలీయులకు) లోకవాసులపై ప్రాధాన్యతను వొసగాము. 44:33 وَآتَيْنَاهُم مِّنَ الْآيَاتِ مَا فِيهِ بَلَاءٌ مُّبِينٌ ఇంకా, మేము వారికి స్పష్టమైన పరీక్ష గల సూచనలను ఇచ్చాము 44:34 إِنَّ هَٰؤُلَاءِ لَيَقُولُونَ వాళ్లు (మక్కా తిరస్కారులు) ఇలా అంటున్నారు - 44:35 إِنْ هِيَ إِلَّا مَوْتَتُنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ "ఇక్కడ (ఈ ప్రపంచంలో) మాకు వచ్చే మొదటి మరణమే తప్ప మరొకటిలేదు. మళ్లీ మేము తిరిగి లేపబడటమనేది ఉండదు. 44:36 فَأْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ "ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే మా తాతముత్తాతలను (తిరిగి) తీసుకురండి!" 44:37 أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ أَهْلَكْنَاهُمْ ۖ إِنَّهُمْ كَانُوا مُجْرِمِينَ ఏమిటి, వీళ్లు గొప్పవారా లేక 'తుబ్బా' జాతి వారు, వారికి పూర్వం గతించిన వారు గొప్పవారా? మేము వాళ్ళందరినీ అంత మొందించాము. ఎందుకంటే వాళ్లు పాపాత్ములుగా తయారయ్యారు. 44:38 وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులను ఏదో తమాషాగా (ఆషామాషీగా) సృష్టించలేదు. 44:39 مَا خَلَقْنَاهُمَا إِلَّا بِالْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ పైగా మేము వాటిని సత్య (ప్రణాళికా) బద్ధంగానే సృజించాము. కాని వారిలో చాలామందికి తెలీదు. 44:40 إِنَّ يَوْمَ الْفَصْلِ مِيقَاتُهُمْ أَجْمَعِينَ నిశ్చయంగా తీర్పుదినం, వారందరి కోసం నిర్ణయించబడిన ఒక (వాగ్దాన) సమయం. 44:41 يَوْمَ لَا يُغْنِي مَوْلًى عَن مَّوْلًى شَيْئًا وَلَا هُمْ يُنصَرُونَ ఆ రోజు ఏ స్నేహితుడూ మరో స్నేహితునికి ఏ కాస్త కూడా పనికిరాడు. మరి వారికెలాంటి సహాయం కూడా లభించదు. 44:42 إِلَّا مَن رَّحِمَ اللَّهُ ۚ إِنَّهُ هُوَ الْعَزِيزُ الرَّحِيمُ కాని అల్లాహ్ ఎవరినయినా కనికరిస్తే అది వేరే విషయం. నిశ్చయంగా ఆయన సర్వాధిక్యుడు, దయాశీలి. 44:43 إِنَّ شَجَرَتَ الزَّقُّومِ నిశ్చయంగా జెముడు వృక్షం (జఖ్ఖూమ్ చెట్టు). 44:44 طَعَامُ الْأَثِيمِ పాపాత్ముల ఆహారంగా ఉంటుంది. 44:45 كَالْمُهْلِ يَغْلِي فِي الْبُطُونِ అది నూనె గసి లాగా ఉంటుంది. కడుపులోకి పోయి ఉడుకుతూ ఉంటుంది. 44:46 كَغَلْيِ الْحَمِيمِ సలసలా కాగే నీరు మాదిరిగా ఉడుకుతూ ఉంటుంది! 44:47 خُذُوهُ فَاعْتِلُوهُ إِلَىٰ سَوَاءِ الْجَحِيمِ "వాడ్ని పట్టుకోండి. ఈడ్చుకుంటూ పోయి నరకాగ్ని నడి బొడ్డున పడవెయ్యండి." 44:48 ثُمَّ صُبُّوا فَوْقَ رَأْسِهِ مِنْ عَذَابِ الْحَمِيمِ "పిదప అతని నెత్తి మీద సలసలా కాగే నీరును – శిక్షగా - కుమ్మరించండి" (అని కేక వేయబడుతుంది). 44:49 ذُقْ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْكَرِيمُ రుచిచూడు! నువ్వు గొప్ప శక్తిమంతునిలా, మర్యాదస్తునిలా వుండే వాడివిగా! 44:50 إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِ تَمْتَرُونَ దేనిపట్ల మీరు సందిగ్ధంలో పడ్డారో అది ఇదే (అని వారితో అనబడుతుంది). 44:51 إِنَّ الْمُتَّقِينَ فِي مَقَامٍ أَمِينٍ నిశ్చయంగా దైవభీతి పరాయణులు సురక్షిత (ప్రశాంత) స్థలంలో ఉంటారు. 44:52 فِي جَنَّاتٍ وَعُيُونٍ ఉద్యానవనాల, చెలమల మధ్యన... 44:53 يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَابِلِينَ పల్చటి సిల్కు వస్త్రాలను, దళసరి పట్టు వస్త్రాలను ధరించి ఎదురెదురుగా ఆసీనులై ఉంటారు. 44:54 كَذَٰلِكَ وَزَوَّجْنَاهُم بِحُورٍ عِينٍ (భక్తిపరాయణుల పట్ల) ఇలాగే వ్యవహరించబడుతుంది. (అంతేకాదు) పెద్ద పెద్ద కన్నులు గల (హూరు) అందగత్తెలతో మేము వారి వివాహం జరిపిస్తాము. 44:55 يَدْعُونَ فِيهَا بِكُلِّ فَاكِهَةٍ آمِنِينَ వారక్కడ నిక్షేపంగా (కూర్చొని) అన్నిరకాల పండ్లు ఫలాదులను తెప్పించుకుంటూ ఉంటారు. 44:56 لَا يَذُوقُونَ فِيهَا الْمَوْتَ إِلَّا الْمَوْتَةَ الْأُولَىٰ ۖ وَوَقَاهُمْ عَذَابَ الْجَحِيمِ మొదటిసారి వచ్చిన మరణం తప్ప, మరింకా వారు అక్కడ మరణం రుచి చూడటమనేదే ఉండదు. నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ్ వారిని రక్షించాడు. 44:57 فَضْلًا مِّن رَّبِّكَ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ ఇది కేవలం నీ ప్రభువు కృప మాత్రమే. చాలా గొప్ప విజయమంటే ఇదే. 44:58 فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ (ఓ ప్రవక్తా!) వారు ఉపదేశాన్ని గ్రహించేటందుకుగాను మేము దీనిని (ఈ ఖురానును) నీ భాషలో సులభతరం చేశాము. 44:59 فَارْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ కనుక నువ్వు కూడా నిరీక్షించు, వారు కూడా నిరీక్షిస్తున్నారు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |