aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

42. సూరా ఆష్ షూరా

42:1  حم
హా మీమ్‌.
42:2  عسق
ఐన్‌ సీన్‌ ఖాఫ్‌.
42:3  كَذَٰلِكَ يُوحِي إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ
ఇదే విధంగా అపార శక్తిమంతుడూ, వివేచనాపరుడైన అల్లాహ్‌ నీకూ, నీకు పూర్వం గతించిన వారికీ వహీ (సందేశము)ని పంపిస్తూ వచ్చాడు.
42:4  لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ
ఆకాశాలలో, భూమిలో ఉన్నవన్నీ ఆయనవే. ఆయన మహోన్నతుడు, చాలా గొప్పవాడు.
42:5  تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ مِن فَوْقِهِنَّ ۚ وَالْمَلَائِكَةُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيَسْتَغْفِرُونَ لِمَن فِي الْأَرْضِ ۗ أَلَا إِنَّ اللَّهَ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
ఆకాశం వారిపై నుంచి పగిలి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లే ఉంది. మరి దైవదూతలంతా స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. భూవాసుల మన్నింపు కోసం వారు వేడుకుంటున్నారు. విన్నావా! నిస్సందేహంగా అల్లాహ్‌యే క్షమించేవాడు, కృపాకరుడు.
42:6  وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ اللَّهُ حَفِيظٌ عَلَيْهِمْ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ
ఆయన్ని వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారిని అల్లాహ్‌ కనిపెట్టుకునే ఉన్నాడు. వాళ్ల (వ్యవహారాల)కు నువ్వు బాధ్యుడవు కావు.
42:7  وَكَذَٰلِكَ أَوْحَيْنَا إِلَيْكَ قُرْآنًا عَرَبِيًّا لِّتُنذِرَ أُمَّ الْقُرَىٰ وَمَنْ حَوْلَهَا وَتُنذِرَ يَوْمَ الْجَمْعِ لَا رَيْبَ فِيهِ ۚ فَرِيقٌ فِي الْجَنَّةِ وَفَرِيقٌ فِي السَّعِيرِ
అలాగే నీవు ఉమ్ముల్‌ ఖురా (మక్కా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికి, సందేహానికి ఆస్కారమేలేని, అందరూ సమావేశమయ్యే రోజు గురించి అప్రమత్తం చేయటానికి మేము నీ వద్దకు అరబీ ఖుర్‌ఆన్‌ను వహీ చేశాము. (తీర్పు అనంతరం) ఒక వర్గం స్వర్గంలో ఉండగా, మరో వర్గం నరకాగ్నిలో ఉంటుంది.
42:8  وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَهُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِن يُدْخِلُ مَن يَشَاءُ فِي رَحْمَتِهِ ۚ وَالظَّالِمُونَ مَا لَهُم مِّن وَلِيٍّ وَلَا نَصِيرٍ
అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారందరినీ ఒకే సముదాయంగా చేసి ఉండేవాడు. అయితే ఆయన తాను తలచిన వారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. దుర్మార్గులను కాపాడే వాడు, సహాయపడేవాడెవడూ ఉండడు.
42:9  أَمِ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۖ فَاللَّهُ هُوَ الْوَلِيُّ وَهُوَ يُحْيِي الْمَوْتَىٰ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఏమిటి, వారు అల్లాహ్‌ను వదలి ఇతరుల్ని తమ కార్యసాధకులుగా చేసుకున్నారా? (యదార్థమేమిటంటే) అల్లాహ్‌యే కార్యసాధకుడు, ఆయనే మృతులను బ్రతికిస్తాడు, ఆయన ప్రతిదానిపై అధికారం కలవాడు.
42:10  وَمَا اخْتَلَفْتُمْ فِيهِ مِن شَيْءٍ فَحُكْمُهُ إِلَى اللَّهِ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبِّي عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ
ఏ ఏ విషయంలో మీరు విభేదించారో, దానికి సంబంధించిన తీర్పు అల్లాహ్‌కే అప్పగించబడుతుంది. ఈ అల్లాహ్‌యే నా ప్రభువు. ఆయన్నే నేను నమ్ముకున్నాను. ఆయన వైపునకే నేను మరలుతున్నాను (అని ఓ ప్రవక్తా! నువ్వు వారికి చెప్పు).
42:11  فَاطِرُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَمِنَ الْأَنْعَامِ أَزْوَاجًا ۖ يَذْرَؤُكُمْ فِيهِ ۚ لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ
భూమ్యాకాశాలను పుట్టించినవాడు ఆయనే. ఆయన మీకోసం మీ నుండే మీ జతలను చేశాడు. పశువుల జతలను కూడా చేశాడు. ఈ విధంగా (ఇలలో) మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూచేవాడు.
42:12  لَهُ مَقَالِيدُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
భూమ్యాకాశాల తాళం చెవులు ఆయనవే. ఆయన తాను కోరిన వారికి ఉపాధిని విస్తృతంగా ఇస్తాడు, (మరి తాను కోరిన వారికి) తగ్గించి ఇస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ తెలిసిన వాడు.
42:13  شَرَعَ لَكُم مِّنَ الدِّينِ مَا وَصَّىٰ بِهِ نُوحًا وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰ ۖ أَنْ أَقِيمُوا الدِّينَ وَلَا تَتَفَرَّقُوا فِيهِ ۚ كَبُرَ عَلَى الْمُشْرِكِينَ مَا تَدْعُوهُمْ إِلَيْهِ ۚ اللَّهُ يَجْتَبِي إِلَيْهِ مَن يَشَاءُ وَيَهْدِي إِلَيْهِ مَن يُنِيبُ
ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్‌ నూహ్‌కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకూ నిర్ధారించాడు. దానినే (ఓ ముహమ్మద్‌- సఅసం!) మేము నీ వైపుకు (వహీ ద్వారా) పంపాము. దాని గురించే ఇబ్రాహీముకు, మూసాకు, ఈసా (అలైహిముస్సలాం)కు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలనీ, అందులో చీలిక తీసుకురావద్దనీ (వారికి) ఉపదేశించాము. (ఓ ముహమ్మద్‌ - సఅసం!) నువ్వు ఏ విషయం వైపునకు వారిని పిలుస్తున్నావో అది బహుదైవారాధకులకు చాలా భారంగా తోస్తుంది. అల్లాహ్‌ తాను కోరిన వారిని (తన కార్యం కొరకు) ఎన్నుకుంటాడు. తన వైపు మరలే వానికి ఆయన సన్మార్గం చూపుతాడు.
42:14  وَمَا تَفَرَّقُوا إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى لَّقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ أُورِثُوا الْكِتَابَ مِن بَعْدِهِمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ
వాళ్లు తమ వద్దకు 'జ్ఞానం' వచ్చిన మీదటే విభేదించుకున్నారు - (అదీ కేవలం) తమ మధ్యగల పంతాల కారణంగానే! 'ఒక నిర్ణీత కాలం కోసం' అనే నీ ప్రభువు మాట ముందుగానే ఖరారై ఉండకపోతే వాళ్ల వ్యవహారం (ఎప్పుడో) తేలిపోయి ఉండేది. వాళ్ల తరువాత గ్రంథం ప్రసాదించబడిన వారు కూడా దాని విషయంలో చాలా తొలచి వేసే అనుమానానికి లోనై ఉన్నారు.
42:15  فَلِذَٰلِكَ فَادْعُ ۖ وَاسْتَقِمْ كَمَا أُمِرْتَ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ ۖ وَقُلْ آمَنتُ بِمَا أَنزَلَ اللَّهُ مِن كِتَابٍ ۖ وَأُمِرْتُ لِأَعْدِلَ بَيْنَكُمُ ۖ اللَّهُ رَبُّنَا وَرَبُّكُمْ ۖ لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ ۖ لَا حُجَّةَ بَيْنَنَا وَبَيْنَكُمُ ۖ اللَّهُ يَجْمَعُ بَيْنَنَا ۖ وَإِلَيْهِ الْمَصِيرُ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని దాని వైపునకే పిలుస్తూ ఉండు. నీకు ఆదేశించబడిన దానిపై నిలకడగా ఉండు. వాళ్ల మనోవాంఛలకనుగుణంగా మాత్రం నడవకు. వాళ్లకు ఇలా చెప్పేయ్‌: "అల్లాహ్‌ అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్నీ నేను విశ్వసించాను. మీ మధ్య న్యాయం చేయాలని నాకు ఆజ్ఞాపించబడింది. అల్లాహ్‌యే మా ప్రభువు, మీ ప్రభువు కూడాను. మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. మాకూ - మీకు మధ్య ఎలాంటి వితండవాదానికి తావు లేదు. అల్లాహ్‌ మనందరినీ సమావేశపరుస్తాడు. కడకు ఆయన వద్దకే మరలి పోవలసిఉంది."
42:16  وَالَّذِينَ يُحَاجُّونَ فِي اللَّهِ مِن بَعْدِ مَا اسْتُجِيبَ لَهُ حُجَّتُهُمْ دَاحِضَةٌ عِندَ رَبِّهِمْ وَعَلَيْهِمْ غَضَبٌ وَلَهُمْ عَذَابٌ شَدِيدٌ
ఎవరయితే అల్లాహ్‌ విషయాన్ని (ప్రజలు) ఒప్పుకున్న మీదట, అందులో వివాదాన్ని మొదలెడతారో, వారి పిడివాదం వారి ప్రభువు దృష్టిలో నిరర్థకమైనది. వారిపై (దేవుని) ఆగ్రహం పడుతుంది. వారి కొరకు కఠినమైన శిక్ష ఉంది.
42:17  اللَّهُ الَّذِي أَنزَلَ الْكِتَابَ بِالْحَقِّ وَالْمِيزَانَ ۗ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ قَرِيبٌ
అల్లాహ్‌యే గ్రంథాన్ని సత్యబద్ధంగా అవతరింపజేశాడు. త్రాసును కూడా (అవతరింపజేశాడు). నీకేం తెలుసు? బహుశా ప్రళయం దగ్గరపడిందేమో!
42:18  يَسْتَعْجِلُ بِهَا الَّذِينَ لَا يُؤْمِنُونَ بِهَا ۖ وَالَّذِينَ آمَنُوا مُشْفِقُونَ مِنْهَا وَيَعْلَمُونَ أَنَّهَا الْحَقُّ ۗ أَلَا إِنَّ الَّذِينَ يُمَارُونَ فِي السَّاعَةِ لَفِي ضَلَالٍ بَعِيدٍ
దాన్ని నమ్మనివారే దాని గురించి ఆత్రం చేస్తున్నారు. దాన్ని నమ్మేవారు మాత్రం దానికి భయపడుతూ ఉన్నారు. అది రావటం సత్యమని (తథ్యమని) వారికి తెలుసు. గుర్తుంచుకోండి! ఆ గడియ విషయంలో గోల చేసేవారు బహుదూరపు అపమార్గంలో పడి ఉన్నారు.
42:19  اللَّهُ لَطِيفٌ بِعِبَادِهِ يَرْزُقُ مَن يَشَاءُ ۖ وَهُوَ الْقَوِيُّ الْعَزِيزُ
అల్లాహ్‌ తన దాసుల పట్ల ఎంతో మృదువుగా వ్యవహరిస్తాడు. తాను కోరిన వారికి విస్తృతంగా ఉపాధిని ఇస్తాడు. ఆయన గొప్ప బలశాలి, ప్రాబల్యం కలవాడు.
42:20  مَن كَانَ يُرِيدُ حَرْثَ الْآخِرَةِ نَزِدْ لَهُ فِي حَرْثِهِ ۖ وَمَن كَانَ يُرِيدُ حَرْثَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَا لَهُ فِي الْآخِرَةِ مِن نَّصِيبٍ
ఎవరయితే పరలోక పంటను ఆశిస్తాడో, మేమతనికి అతని పంటలో సమృద్ధిని ఇస్తాము. మరెవరయితే ఇహలోక పంటను ఆశిస్తాడో అతనికి మేము అందులో నుంచే ఎంతో కొంత ఇస్తాము. ఇలాంటి వ్యక్తికి పరలోకంలో ఏ భాగమూ ఉండదు.
42:21  أَمْ لَهُمْ شُرَكَاءُ شَرَعُوا لَهُم مِّنَ الدِّينِ مَا لَمْ يَأْذَن بِهِ اللَّهُ ۚ وَلَوْلَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِيَ بَيْنَهُمْ ۗ وَإِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఏమిటి, అల్లాహ్‌ అనుమతితో నిమిత్తం లేకుండానే తమ కోసం ఏవైనా ధర్మాదేశాలను నిర్ధారించే (అల్లాహ్‌) భాగస్థులను గాని వారు కలిగి ఉన్నారా? 'తీర్పు'కు సంబంధించిన మాటే గనక ఖరారై ఉండకపోయినట్లయితే వీళ్ల మధ్య (ఇప్పుడే) వ్యవహారం తేల్చివేయబడేది. నిజానికి (ఇలాంటి) దుర్మార్గుల కోసమే వ్యధాభరితమైన శిక్ష ఉన్నది.
42:22  تَرَى الظَّالِمِينَ مُشْفِقِينَ مِمَّا كَسَبُوا وَهُوَ وَاقِعٌ بِهِمْ ۗ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فِي رَوْضَاتِ الْجَنَّاتِ ۖ لَهُم مَّا يَشَاءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ
ఈ దుర్మార్గులు తాము చేసుకున్న దానిపై భయపడటం నువ్వు చూస్తావు. అది (ఆ పాపం) వారిపై పడి తీరుతుంది. మరెవరయితే విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారు స్వర్గవనాలలో ఉంటారు. వారు కోరినదల్లా వారికి వారి ప్రభువు వద్ద లభిస్తుంది. అదే అసలు గొప్ప అనుగ్రహం.
42:23  ذَٰلِكَ الَّذِي يُبَشِّرُ اللَّهُ عِبَادَهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۗ قُل لَّا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا إِلَّا الْمَوَدَّةَ فِي الْقُرْبَىٰ ۗ وَمَن يَقْتَرِفْ حَسَنَةً نَّزِدْ لَهُ فِيهَا حُسْنًا ۚ إِنَّ اللَّهَ غَفُورٌ شَكُورٌ
విశ్వసించి, ('సున్నత్‌' ప్రకారం) సత్కార్యాలు చేసిన తన దాసులకు అల్లాహ్‌ ఇచ్చే శుభవార్త ఇదే! (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "దీనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటంలేదు. కాని బంధుత్వ ప్రేమను మాత్రం కోరుతున్నాను." ఎవడయినా మంచి చేస్తే మేమతని మంచిలో మరింత వృద్ధినిస్తాము. నిశ్చయంగా అల్లాహ్‌ అపారంగా మన్నించేవాడు, (సేవలకు తగ్గ) గుర్తింపునిచ్చేవాడూను.
42:24  أَمْ يَقُولُونَ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا ۖ فَإِن يَشَإِ اللَّهُ يَخْتِمْ عَلَىٰ قَلْبِكَ ۗ وَيَمْحُ اللَّهُ الْبَاطِلَ وَيُحِقُّ الْحَقَّ بِكَلِمَاتِهِ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
"ఏమిటి, ఇతను (దైవప్రవక్త - స) అల్లాహ్‌కు వ్యతిరేకంగా అబద్ధం కల్పించాడని వారంటున్నారా?" అల్లాహ్‌యే గనక తలిస్తే నీ హృదయానికి సీలు వేస్తాడు. అల్లాహ్‌ అసత్యాన్ని చెరిపివేసి, సత్యాన్ని తన వచనాల ద్వారా సత్యంగా నిలిపి ఉంచుతాడు. ఆయన ఆంతర్యాల్లో దాగివున్న విషయాలను సైతం ఎరిగినవాడు.
42:25  وَهُوَ الَّذِي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَعْفُو عَنِ السَّيِّئَاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ
ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, వారి తప్పులను మన్నిస్తాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు.
42:26  وَيَسْتَجِيبُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۚ وَالْكَافِرُونَ لَهُمْ عَذَابٌ شَدِيدٌ
ఆయన విశ్వసించి, సదాచరణ చేసే వారి (విన్నపాల)ని వింటాడు. తన కృపతో వారికి మరింతగా అనుగ్రహిస్తాడు. మరి అవిశ్వాసులకేమో చాలా కఠిన శిక్ష పడుతుంది.
42:27  وَلَوْ بَسَطَ اللَّهُ الرِّزْقَ لِعِبَادِهِ لَبَغَوْا فِي الْأَرْضِ وَلَٰكِن يُنَزِّلُ بِقَدَرٍ مَّا يَشَاءُ ۚ إِنَّهُ بِعِبَادِهِ خَبِيرٌ بَصِيرٌ
మరి అల్లాహ్‌ గనక తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధిని ప్రసాదిస్తే వారు భువిలో చెలరేగిపోతారు. కాని ఆయన మాత్రం ఒక లెక్క ప్రకారం - తాను కోరినదాన్ని అవతరింపజేస్తూ ఉంటాడు. తన దాసుల సంగతిని ఆయన బాగా ఎరిగినవాడు. (ఆయన వారిని) గమనిస్తూ ఉన్నాడు.
42:28  وَهُوَ الَّذِي يُنَزِّلُ الْغَيْثَ مِن بَعْدِ مَا قَنَطُوا وَيَنشُرُ رَحْمَتَهُ ۚ وَهُوَ الْوَلِيُّ الْحَمِيدُ
ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట (ఆకాశం నుంచి) వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఆయనే తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనే కార్యసాధకుడు, ప్రశంసనీయుడు.
42:29  وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَثَّ فِيهِمَا مِن دَابَّةٍ ۚ وَهُوَ عَلَىٰ جَمْعِهِمْ إِذَا يَشَاءُ قَدِيرٌ
భూమ్యాకాశాల సృష్టి, వాటిలో ప్రాణుల సర్వవ్యాప్తి కూడా ఆయన నిదర్శనాలలోనివే. మరి తాను కోరినప్పుడు వారందరినీ సమీకరించే శక్తి కూడా ఆయనకుంది.
42:30  وَمَا أَصَابَكُم مِّن مُّصِيبَةٍ فَبِمَا كَسَبَتْ أَيْدِيكُمْ وَيَعْفُو عَن كَثِيرٍ
మీపై ఏ ఆపదలొచ్చిపడినా, అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల (పాపాల) ఫలమే. ఆయనైతే (వాటిలో) చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు.
42:31  وَمَا أَنتُم بِمُعْجِزِينَ فِي الْأَرْضِ ۖ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
మీరు భూమిలో (పారిపోయి) మమ్మల్ని లొంగదీయటం అనేది జరగని పని. మీకు అల్లాహ్‌ తప్ప మరో కార్యసాధకుడుగానీ, సహాయకుడుగానీ లేడు.
42:32  وَمِنْ آيَاتِهِ الْجَوَارِ فِي الْبَحْرِ كَالْأَعْلَامِ
సముద్రంలో నడిచే పర్వతాల్లాంటి ఓడలు (కూడా) ఆయన నిదర్శనాలలోనివే.
42:33  إِن يَشَأْ يُسْكِنِ الرِّيحَ فَيَظْلَلْنَ رَوَاكِدَ عَلَىٰ ظَهْرِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
ఆయన గనక తలచుకుంటే గాలిని స్థంభింపజేయగలడు. అప్పుడు ఆ ఓడలు సముద్రంపైనే నిలిచిపోతాయి. నిశ్చయంగా ఇందులో సహనం వహించే, కృతజ్ఞులై ఉండే ప్రతి ఒక్కరి కొరకు సూచనలున్నాయి.
42:34  أَوْ يُوبِقْهُنَّ بِمَا كَسَبُوا وَيَعْفُ عَن كَثِيرٍ
లేదా (ఆయన) వారి దురాగతాల మూలంగా వారిని ముంచివేసినా (ఆశ్చర్యం లేదు). ఆయన మటుకు (వారి) తప్పులెన్నింటినో మన్నిస్తూ ఉంటాడు.
42:35  وَيَعْلَمَ الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِنَا مَا لَهُم مِّن مَّحِيصٍ
మా సూచనల విషయంలో జగడం చేసేవారికి, తాము పారిపోయి ఆశ్రయం పొందే చోటు ఏదీ లేదని తెలిసివచ్చేలా చేయటానికి (మేమీ విధంగా చేస్తాము).
42:36  فَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ وَأَبْقَىٰ لِلَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
మరి మీకు ఏది ఇవ్వబడినా అది ప్రాపంచిక జీవితపు (తాత్కాలిక) సంపద మాత్రమే. అల్లాహ్‌ దగ్గర ఉన్నది ఇంతకన్నా మేలైనది, శాశ్వితమైనది. విశ్వసించి, కేవలం తమ ప్రభువును నమ్ముకునేవారికి మాత్రమే అది లభిస్తుంది.
42:37  وَالَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ وَإِذَا مَا غَضِبُوا هُمْ يَغْفِرُونَ
(మరి ఈ భాగ్యవంతుల గుణగణాలు ఎటువంటివంటే) వారు పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు (కూడా) క్షమిస్తారు.
42:38  وَالَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمْ وَأَقَامُوا الصَّلَاةَ وَأَمْرُهُمْ شُورَىٰ بَيْنَهُمْ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
ఇంకా, వారు తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు. నమాజును నెలకొల్పుతారు. వారి (ప్రతి) పని పరస్పర సలహా సంప్రతింపుల ద్వారా జరుగుతుంది. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా పేరున) ఖర్చుపెడతారు.
42:39  وَالَّذِينَ إِذَا أَصَابَهُمُ الْبَغْيُ هُمْ يَنتَصِرُونَ
తమపై దౌర్జన్యం జరిగినప్పుడు, ప్రతీకారం మటుకు తీర్చుకుంటారు.
42:40  وَجَزَاءُ سَيِّئَةٍ سَيِّئَةٌ مِّثْلُهَا ۖ فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
అపకారానికి బదులు అటువంటి అపకారమే. కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ దుర్మార్గులను ప్రేమించడు.
42:41  وَلَمَنِ انتَصَرَ بَعْدَ ظُلْمِهِ فَأُولَٰئِكَ مَا عَلَيْهِم مِّن سَبِيلٍ
తనకు అన్యాయం జరిగిన మీదట ఎవరైనా (సరిసమానంగా) ప్రతీకారం తీర్చుకుంటే, అలాంటి వారిపై (నిందలు మోపే) మార్గమేదీ లేదు.
42:42  إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَظْلِمُونَ النَّاسَ وَيَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి, అకారణంగా భువిలో అరాచకాన్ని సృష్టించేవారిని మాత్రమే (నిందార్హులుగా నిలబెట్టే) మార్గముంటుంది. అలాంటి వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది.
42:43  وَلَمَن صَبَرَ وَغَفَرَ إِنَّ ذَٰلِكَ لَمِنْ عَزْمِ الْأُمُورِ
మరెవడయినా సహనం వహించి, క్షమాభిక్షపెడితే, నిస్సందేహంగా అది సాహసోపేతమైన పనులలో (ఒకటిగా) పరిగణించబడుతుంది.
42:44  وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِن وَلِيٍّ مِّن بَعْدِهِ ۗ وَتَرَى الظَّالِمِينَ لَمَّا رَأَوُا الْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَىٰ مَرَدٍّ مِّن سَبِيلٍ
అల్లాహ్‌ ఎవరినయినా దారితప్పిస్తే, ఇక ఆ తరువాత అతన్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మరి నువ్వే చూద్దువు గాని, దుర్మార్గులు శిక్షను చూచినపుడు, "మేము తిరిగి వెళ్ళే మార్గం ఏదైనా ఉందా?!" అని అంటూ ఉంటారు.
42:45  وَتَرَاهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَاشِعِينَ مِنَ الذُّلِّ يَنظُرُونَ مِن طَرْفٍ خَفِيٍّ ۗ وَقَالَ الَّذِينَ آمَنُوا إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ الظَّالِمِينَ فِي عَذَابٍ مُّقِيمٍ
ఇంకా నువ్వే చూస్తావు - వాళ్లు (నరకం) ఎదుట తేబడినప్పుడు, అవమానభారంతో కృంగిపోతుంటారు. దొంగ చూపులు చూస్తుంటారు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు: "ఈ ప్రళయదినాన తమ స్వయాన్ని, తమ ఇంటివారలను నష్టానికి గురిచేసినవారే వాస్తవానికి నష్టం పొందినవారు." నిశ్చయంగా దుర్మార్గులు శాశ్విత యాతనలో పడి ఉన్నారని తెలుసుకోండి.
42:46  وَمَا كَانَ لَهُم مِّنْ أَوْلِيَاءَ يَنصُرُونَهُم مِّن دُونِ اللَّهِ ۗ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِن سَبِيلٍ
అల్లాహ్‌ తప్ప వారిని ఆదుకునే మిత్రులెవరూ ఉండరు. అల్లాహ్‌ దారి తప్పించినవారికి మరేమార్గమూ ఉండదు.
42:47  اسْتَجِيبُوا لِرَبِّكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُ مِنَ اللَّهِ ۚ مَا لَكُم مِّن مَّلْجَإٍ يَوْمَئِذٍ وَمَا لَكُم مِّن نَّكِيرٍ
(ప్రజలారా!) తప్పించనలవికాని ఆ రోజు అల్లాహ్‌ తరఫున రాకమునుపే, మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజు మీకు ఏ ఆశ్రయమూ లభించదు, దాక్కొని ఆగంతకుల్లా వ్యవహరించేందుకు తగినచోటు కూడా దొరకదు.
42:48  فَإِنْ أَعْرَضُوا فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ إِنْ عَلَيْكَ إِلَّا الْبَلَاغُ ۗ وَإِنَّا إِذَا أَذَقْنَا الْإِنسَانَ مِنَّا رَحْمَةً فَرِحَ بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَإِنَّ الْإِنسَانَ كَفُورٌ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే, మేము నిన్ను వారిపై కావలివానిగా చేసి పంపలేదు సుమా! సందేశాన్ని అందజేయటం వరకే నీ బాధ్యత. మేము మనిషికి మా కారుణ్యం రుచిని చూపించినపుడు అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఒకవేళ వారిపై వారి స్వయంకృతాల మూలంగా ఏదైనా ఆపద వచ్చిపడితే, మానవుడు మా మేలునంతా మరచిపోతాడు.
42:49  لِّلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ يَهَبُ لِمَن يَشَاءُ إِنَاثًا وَيَهَبُ لِمَن يَشَاءُ الذُّكُورَ
భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్‌దే. (ఆయన) తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరినవారికి ఆడపిల్లల్ని ఇస్తాడు, తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు.
42:50  أَوْ يُزَوِّجُهُمْ ذُكْرَانًا وَإِنَاثًا ۖ وَيَجْعَلُ مَن يَشَاءُ عَقِيمًا ۚ إِنَّهُ عَلِيمٌ قَدِيرٌ
లేదా వారికి మగపిల్లలను, ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతాన హీనులుగా చేసేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు.
42:51  وَمَا كَانَ لِبَشَرٍ أَن يُكَلِّمَهُ اللَّهُ إِلَّا وَحْيًا أَوْ مِن وَرَاءِ حِجَابٍ أَوْ يُرْسِلَ رَسُولًا فَيُوحِيَ بِإِذْنِهِ مَا يَشَاءُ ۚ إِنَّهُ عَلِيٌّ حَكِيمٌ
ఏ మానవమాత్రునితోనూ, అల్లాహ్‌ (నేరుగా) సంభాషించటం అనేది జరగదు. అయితే వహీ ద్వారా లేదా తెర వెనుక నుంచీ లేదా ఒక దూతను పంపటం ద్వారా (ఇది సంభవమే). మరి ఆ దూత అల్లాహ్‌ ఆజ్ఞననుసరించి అల్లాహ్‌ కోరిన సందేశాన్ని (వహీ రూపంలో) అందజేస్తాడు. నిశ్చయంగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు.
42:52  وَكَذَٰلِكَ أَوْحَيْنَا إِلَيْكَ رُوحًا مِّنْ أَمْرِنَا ۚ مَا كُنتَ تَدْرِي مَا الْكِتَابُ وَلَا الْإِيمَانُ وَلَٰكِن جَعَلْنَاهُ نُورًا نَّهْدِي بِهِ مَن نَّشَاءُ مِنْ عِبَادِنَا ۚ وَإِنَّكَ لَتَهْدِي إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అలాగే (ఓ ముహమ్మద్‌ - సఅసం!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు ఒక 'రూహ్‌' (ఆత్మ)ను పంపాము. అంతకుముందు నీకు గ్రంథమంటే ఏమిటో, విశ్వాసమంటే ఏమిటో తెలీదాయె. కాని మేము దాన్ని జ్యోతిగా చేశాము. దాని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి సన్మార్గం చూపుతున్నాము. నిస్సందేహంగా (ఓ ముహమ్మద్‌-స!) నువ్వు (ప్రజలకు) రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహిస్తున్నావు...
42:53  صِرَاطِ اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ أَلَا إِلَى اللَّهِ تَصِيرُ الْأُمُورُ
....భూమ్యాకాశాల్లోని సమస్తానికీ యజమాని అయిన అల్లాహ్‌ మార్గం వైపుకు (నడిపిస్తున్నావు). తుదకు సమస్త వ్యవహారాలూ అల్లాహ్‌ వద్దకే చేరతాయి సుమా!


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.