aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్

41:1  حم
హా మీమ్‌.
41:2  تَنزِيلٌ مِّنَ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(ఇది) అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన వాని తరఫునుంచి అవతరింపజేయబడినది.
41:3  كِتَابٌ فُصِّلَتْ آيَاتُهُ قُرْآنًا عَرَبِيًّا لِّقَوْمٍ يَعْلَمُونَ
(ఇది) ఎటువంటి గ్రంథమంటే, దీని వాక్యాలు చాలా విపులంగా వివరించబడ్డాయి. జ్ఞానమున్న జనుల కోసం అరబీలో ఉన్న ఖుర్‌ఆన్‌ ఇది.....
41:4  بَشِيرًا وَنَذِيرًا فَأَعْرَضَ أَكْثَرُهُمْ فَهُمْ لَا يَسْمَعُونَ
శుభవార్తను ఇచ్చేది, హెచ్చరిక చేసేది కూడా. అయినప్పటికీ వారిలోని అధికులు విముఖత చూపారు. అందుకే వారు (కనీసం) విననైనా వినటం లేదు.
41:5  وَقَالُوا قُلُوبُنَا فِي أَكِنَّةٍ مِّمَّا تَدْعُونَا إِلَيْهِ وَفِي آذَانِنَا وَقْرٌ وَمِن بَيْنِنَا وَبَيْنِكَ حِجَابٌ فَاعْمَلْ إِنَّنَا عَامِلُونَ
వారిలా అన్నారు : "నువ్వు దేని వైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలలో ఉన్నాయి. మా చెవులలో భారం ఉంది. నీకూ - మాకూ మధ్య ఒక (అడ్డు) తెర ఉంది. కాబట్టి నీ పనేదో నువ్వు చేసుకో. మా పనిని మేము చేసి తీరుతాము."
41:6  قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَاسْتَقِيمُوا إِلَيْهِ وَاسْتَغْفِرُوهُ ۗ وَوَيْلٌ لِّلْمُشْرِكِينَ
(ఓ ప్రవక్తా!) వారికీ విధంగా చెప్పు: "నేనూ మీలాంటి మానవమాత్రుణ్ణే. 'మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్‌ ఒక్కడే' అనే వహీ (వాణి) నా వద్దకు వస్తుంది. కనుక మీరంతా ఆయన వైపునే (నిజాయితీగా) నిలబడండి. మన్నింపు కోసం ఆయన్ని అర్థించండి." ఈ ముష్రిక్కులకు వినాశం ఉంది.
41:7  الَّذِينَ لَا يُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ كَافِرُونَ
వారు జకాత్‌ ఇవ్వరు. పరలోకాన్ని కూడా తిరస్కరిస్తుంటారు.
41:8  إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
నిశ్చయంగా విశ్వసించి, సత్కార్యాలు చేసినవారి కొరకు ఎన్నటికీ అంతంకాని పుణ్యఫలమున్నది.
41:9  قُلْ أَئِنَّكُمْ لَتَكْفُرُونَ بِالَّذِي خَلَقَ الْأَرْضَ فِي يَوْمَيْنِ وَتَجْعَلُونَ لَهُ أَندَادًا ۚ ذَٰلِكَ رَبُّ الْعَالَمِينَ
(ఓ ప్రవక్తా! వారికి) నువ్వు ఇలా చెప్పు: ఏమిటి, రెండు రోజులలో భూమిని సృష్టించిన వానినే (అల్లాహ్‌ను) మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారా? ఆయనే (వాస్తవానికి) సకల లోకాలకు ప్రభువు సుమా!
41:10  وَجَعَلَ فِيهَا رَوَاسِيَ مِن فَوْقِهَا وَبَارَكَ فِيهَا وَقَدَّرَ فِيهَا أَقْوَاتَهَا فِي أَرْبَعَةِ أَيَّامٍ سَوَاءً لِّلسَّائِلِينَ
మరి ఆయనే భూమిలో, దానిపై నుంచి పర్వతాలను పాతిపెట్టాడు. అందులో శుభాన్ని పొందుపరిచాడు. అందులో (నివసించే వారికొరకు) ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులో సమకూర్చాడు. ఇదంతా (కేవలం) నాలుగు రోజుల్లో అయిపోయింది. ఇది అడిగేవారికి తగిన విధంగా ఉంది.
41:11  ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ وَهِيَ دُخَانٌ فَقَالَ لَهَا وَلِلْأَرْضِ ائْتِيَا طَوْعًا أَوْ كَرْهًا قَالَتَا أَتَيْنَا طَائِعِينَ
తరువాత ఆయన పొగ(మాదిరి)గా ఉన్న ఆకాశం వైపు దృష్టిని మరల్చాడు. మరి దానినీ, భూమినీ ఉద్దేశించి, "మీకు ఇష్టం ఉన్నాసరే, ఇష్టం లేకున్నాసరే (ఉనికిలోకి) వచ్చేయండి" అన్నాడు. "మేము ఇష్టపూర్వకంగా వచ్చేశాము" అని అవి పలికాయి.
41:12  فَقَضَاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ فِي يَوْمَيْنِ وَأَوْحَىٰ فِي كُلِّ سَمَاءٍ أَمْرَهَا ۚ وَزَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِمَصَابِيحَ وَحِفْظًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
అంతే! రెండు రోజులలో సప్తాకాశాలను చేసేశాడు. ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న 'వహీ'ని పంపాడు. ఇంకా మేము సమీప ఆకాశాన్ని (క్రింది ఆకాశాన్ని) దీపాలతో ముస్తాబు చేశాము. (వాటి ద్వారా) దాన్ని సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా సర్వాధిక్యుడు, జ్ఞానసంపన్నుడైన అల్లాహ్‌ నియామకం.
41:13  فَإِنْ أَعْرَضُوا فَقُلْ أَنذَرْتُكُمْ صَاعِقَةً مِّثْلَ صَاعِقَةِ عَادٍ وَثَمُودَ
అప్పటికీ వాళ్ళు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికీ విధంగా చెప్పేయ్‌ : "ఆద్‌ సమూద్‌ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను."
41:14  إِذْ جَاءَتْهُمُ الرُّسُلُ مِن بَيْنِ أَيْدِيهِمْ وَمِنْ خَلْفِهِمْ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ ۖ قَالُوا لَوْ شَاءَ رَبُّنَا لَأَنزَلَ مَلَائِكَةً فَإِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ
ప్రవక్తలు వారి దగ్గరకు వారి ముందు వైపు నుంచీ, వెనుక వైపునుంచీ వచ్చి "మీరు అల్లాహ్‌ను తప్ప మరొకరిని ఆరాధించకండి" అని చెప్పినపుడు, "మా ప్రభువు గనక కోరితే, ఆయన (తన) దూతలనే పంపి ఉండేవాడు. అందుకే మీకు ఇచ్చి పంపబడిన దానిని మేము త్రోసిపుచ్చుతున్నాం" అని చెప్పారు.
41:15  فَأَمَّا عَادٌ فَاسْتَكْبَرُوا فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَقَالُوا مَنْ أَشَدُّ مِنَّا قُوَّةً ۖ أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَهُمْ هُوَ أَشَدُّ مِنْهُمْ قُوَّةً ۖ وَكَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
ఆద్‌ (జాతి వారి) విషయానికి వస్తే, వారు ఏ హక్కూ లేకుండానే భువిలో చెలరేగిపోయారు. "బలపరాక్రమాలలో మాకన్నా మొనగాడెవడున్నాడు?' అని (బీరాలు) పలికారు. ఏమిటి, తమను పుట్టించిన అల్లాహ్‌ తమకన్నా ఎంతో బలవంతుడన్న సంగతి వారికి స్ఫురించలేదా? (కడ దాకా) వారు మా ఆయతులను తిరస్కరిస్తూనే ఉండేవారు.
41:16  فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِي أَيَّامٍ نَّحِسَاتٍ لِّنُذِيقَهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَخْزَىٰ ۖ وَهُمْ لَا يُنصَرُونَ
ఎట్టకేలకు మేము వారికి, ప్రాపంచిక జీవితంలోనే అవమానకరమైన శిక్షను రుచి చూపించటానికి - దుర్దినాలలో వారిపై భయంకరమైన ఓ పెనుగాలిని పంపాము. పరలోక శిక్ష ఇంతకన్నా పరాభవంతో కూడుకున్నది సుమా! మరి (అక్కడ) వారికెలాంటి సహాయమూ అందదు.
41:17  وَأَمَّا ثَمُودُ فَهَدَيْنَاهُمْ فَاسْتَحَبُّوا الْعَمَىٰ عَلَى الْهُدَىٰ فَأَخَذَتْهُمْ صَاعِقَةُ الْعَذَابِ الْهُونِ بِمَا كَانُوا يَكْسِبُونَ
ఇకపోతే సమూద్‌ (జాతి) వారు; మేము వారికి కూడా సన్మార్గం చూపించాము. అయినప్పటికీ వారు మార్గదర్శనంపై అంధత్వానికే ప్రాధాన్యత ఇచ్చారు. మరి వారి దురాగతాలకు బదులుగా వారిని (నిలువెల్లా) అవమానకరమైన శిక్ష యొక్క గర్జన కబళించింది.
41:18  وَنَجَّيْنَا الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
మరయితే విశ్వాసులను, భక్తిపరాయణులను మాత్రం మేము (ఆ విపత్తు నుంచి) కాపాడాము.
41:19  وَيَوْمَ يُحْشَرُ أَعْدَاءُ اللَّهِ إِلَى النَّارِ فَهُمْ يُوزَعُونَ
ఏ రోజున అల్లాహ్‌ విరోధులు నరకాగ్ని వైపుకు సమీకరించబడతారో, అప్పుడు వారంతా (పలు సమూహాలుగా) విడగొట్టబడతారు.
41:20  حَتَّىٰ إِذَا مَا جَاءُوهَا شَهِدَ عَلَيْهِمْ سَمْعُهُمْ وَأَبْصَارُهُمْ وَجُلُودُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్లు, వారి చర్మాలు సయితం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి.
41:21  وَقَالُوا لِجُلُودِهِمْ لِمَ شَهِدتُّمْ عَلَيْنَا ۖ قَالُوا أَنطَقَنَا اللَّهُ الَّذِي أَنطَقَ كُلَّ شَيْءٍ وَهُوَ خَلَقَكُمْ أَوَّلَ مَرَّةٍ وَإِلَيْهِ تُرْجَعُونَ
"మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిచ్చారు?" అని వారు తమ చర్మాలనుద్దేశించి అడుగుతారు. "అన్ని వస్తువులకూ మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాహ్‌యే మాకూ మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. ఆయనే మిమ్మల్ని తొలిసారి పుట్టించాడు. మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు" అని సమాధానమిస్తాయి.
41:22  وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ
"మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు."
41:23  وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ
"మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు."
41:24  فَإِن يَصْبِرُوا فَالنَّارُ مَثْوًى لَّهُمْ ۖ وَإِن يَسْتَعْتِبُوا فَمَا هُم مِّنَ الْمُعْتَبِينَ
ఈ స్థితిలో వీరు ఓర్పు వహించినా (వహించకపోయినా), నరకాగ్నే వారి నివాసం. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్థించినా క్షమించబడరు.
41:25  وَقَيَّضْنَا لَهُمْ قُرَنَاءَ فَزَيَّنُوا لَهُم مَّا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَحَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِهِم مِّنَ الْجِنِّ وَالْإِنسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ
మేము వారి వెంట కొందరు సహవాసులను నియమించాము. వారేమో వీరికి ముందూ వెనుకా ఉన్న వీరి కర్మలను అందమైనవిగా కనిపించేలా చేశారు. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల, మానవ జాతుల విషయంలో ఖరారైన అల్లాహ్‌ వాక్కే వీరి విషయంలో కూడా జరిగింది. నిశ్చయంగా వీరు నష్టపోయిన వారయ్యారు.
41:26  وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَسْمَعُوا لِهَٰذَا الْقُرْآنِ وَالْغَوْا فِيهِ لَعَلَّكُمْ تَغْلِبُونَ
అవిశ్వాసులు ఇలా అన్నారు: "ఈ ఖుర్‌ఆన్‌ను అస్సలు వినకండి. (అది పఠించబడినప్పుడు) గోల (గలాటా) చేయండి. బహుశా (అలాగైనా) మీది పైచేయి కావచ్చు."
41:27  فَلَنُذِيقَنَّ الَّذِينَ كَفَرُوا عَذَابًا شَدِيدًا وَلَنَجْزِيَنَّهُمْ أَسْوَأَ الَّذِي كَانُوا يَعْمَلُونَ
కాబట్టి మేము తప్పకుండా ఈ అవిశ్వాసులకు చాలా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము. వారు చేస్తూ ఉండిన పరమ దుష్కార్యాలకు తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాము.
41:28  ذَٰلِكَ جَزَاءُ أَعْدَاءِ اللَّهِ النَّارُ ۖ لَهُمْ فِيهَا دَارُ الْخُلْدِ ۖ جَزَاءً بِمَا كَانُوا بِآيَاتِنَا يَجْحَدُونَ
అల్లాహ్‌ విరోధులకు శిక్ష(గా లభించవలసింది) ఈ నరకాగ్నే. అందులో వారి శాశ్వత నివాస గృహం ఉంటుంది. మా ఆయతులను త్రోసిపుచ్చినందుకు (వారికి లభించిన) ప్రతిఫలం ఇది.
41:29  وَقَالَ الَّذِينَ كَفَرُوا رَبَّنَا أَرِنَا اللَّذَيْنِ أَضَلَّانَا مِنَ الْجِنِّ وَالْإِنسِ نَجْعَلْهُمَا تَحْتَ أَقْدَامِنَا لِيَكُونَا مِنَ الْأَسْفَلِينَ
(అప్పుడు) అవిశ్వాసులు, "మా ప్రభూ! మమ్మల్ని పెడదారి పట్టించిన జిన్నులను, మనుషులను కాస్త చూపించు. వాళ్ళను మేము మా పాదాల క్రింద వేసి, (నరకంలో) అట్టడుగు స్థానానికి పోయేలా తొక్కి వేస్తాము" అని విన్నవించుకుంటారు.
41:30  إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا تَتَنَزَّلُ عَلَيْهِمُ الْمَلَائِكَةُ أَلَّا تَخَافُوا وَلَا تَحْزَنُوا وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
"మా ప్రభువు అల్లాహ్‌ మాత్రమే " అని పలికి, దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవదూతలు దిగివచ్చి, (ఇలా అంటూ ఉంటారు): "మీరు భయపడకండి. దుఃఖించకండి. మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి.
41:31  نَحْنُ أَوْلِيَاؤُكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۖ وَلَكُمْ فِيهَا مَا تَشْتَهِي أَنفُسُكُمْ وَلَكُمْ فِيهَا مَا تَدَّعُونَ
"ప్రాపంచిక జీవితంలో కూడా మేము మీ నేస్తాలుగా ఉంటూవచ్చాము. పరలోకంలో కూడా ఉంటాము. మీ మనసు కోరినదల్లా, మీరు అడిగినదల్లా అందులో మీకు లభిస్తుంది.
41:32  نُزُلًا مِّنْ غَفُورٍ رَّحِيمٍ
"క్షమాశీలి, దయాశీలి (అయిన అల్లాహ్‌) తరఫున లభించే ఆతిథ్యమిది."
41:33  وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ
అల్లాహ్‌ వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ 'నేను విధేయుల (ముస్లింల)లో ఒకడను' అని పలికేవాని మాటకంటే మంచిమాట మరెవరిది కాగలదు?
41:34  وَلَا تَسْتَوِي الْحَسَنَةُ وَلَا السَّيِّئَةُ ۚ ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ فَإِذَا الَّذِي بَيْنَكَ وَبَيْنَهُ عَدَاوَةٌ كَأَنَّهُ وَلِيٌّ حَمِيمٌ
మంచీ - చెడు (ఎట్టి పరిస్థితిలోనూ) సమానం కాలేవు. (ఓ ప్రవక్తా!) చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తరువాత (నువ్వే చూద్దువుగాని), నీకూ- తనకూ మధ్య బద్ధవిరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణస్నేహితుడైపోతాడు.
41:35  وَمَا يُلَقَّاهَا إِلَّا الَّذِينَ صَبَرُوا وَمَا يُلَقَّاهَا إِلَّا ذُو حَظٍّ عَظِيمٍ
అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగుతారు.
41:36  وَإِمَّا يَنزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ ۖ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఒకవేళ (ఏ సమయంలోనయినా) షైతాను తరఫున నీకు ఏదయినా దుష్ప్రేరణ కలిగితే అల్లాహ్‌ శరణు వేడుకో. నిస్సందేహంగా ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
41:37  وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి.
41:38  فَإِنِ اسْتَكْبَرُوا فَالَّذِينَ عِندَ رَبِّكَ يُسَبِّحُونَ لَهُ بِاللَّيْلِ وَالنَّهَارِ وَهُمْ لَا يَسْأَمُونَ ۩
అయినప్పటికీ వారు గనక అహంకారంతో హఠం చేస్తే (చేయనివ్వు) నీ ప్రభువు దగ్గర ఉన్నవారు (దైవదూతలు) అహో రాత్రులు ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. (ఈ పనిలో ఎన్నటికీ) వారు విసిగిపోరు.
41:39  وَمِنْ آيَاتِهِ أَنَّكَ تَرَى الْأَرْضَ خَاشِعَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ ۚ إِنَّ الَّذِي أَحْيَاهَا لَمُحْيِي الْمَوْتَىٰ ۚ إِنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆయన శక్తిసూచనలలో మరొకటేమిటంటే నేల అణగి మణగి ఉండటాన్ని నువ్వు చూస్తావు. మరి దానిపై మేము వర్షం కురిపించగానే అది చిగురిస్తూ, ఉబికి వస్తుంది. ఈ నేలను బ్రతికించినవాడే నిస్సందేహంగా మృతులను కూడా బ్రతికిస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల అధికారం గలవాడు.
41:40  إِنَّ الَّذِينَ يُلْحِدُونَ فِي آيَاتِنَا لَا يَخْفَوْنَ عَلَيْنَا ۗ أَفَمَن يُلْقَىٰ فِي النَّارِ خَيْرٌ أَم مَّن يَأْتِي آمِنًا يَوْمَ الْقِيَامَةِ ۚ اعْمَلُوا مَا شِئْتُمْ ۖ إِنَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మా వాక్యాల విషయంలో వక్ర వైఖరిని అవలంబిస్తున్న వారు మా దృష్టిలో లేకుండా లేరు. (చెప్పండి!) అగ్నిలో పడవేయబడేవాడు మేలా? లేక ప్రళయ దినాన సురక్షితంగా (ప్రశాంత స్థితిలో) వచ్చేవాడు మేలా? మీరు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోండి. ఆయన మీరు చేసే పనులన్నిటినీ చూస్తూనే ఉన్నాడు.
41:41  إِنَّ الَّذِينَ كَفَرُوا بِالذِّكْرِ لَمَّا جَاءَهُمْ ۖ وَإِنَّهُ لَكِتَابٌ عَزِيزٌ
తమ వద్దకు హితోపదేశం (ఖుర్‌ఆన్‌) వచ్చేసినప్పటికీ, దాన్ని త్రోసిపుచ్చిన వారు (కూడా మా నుండి దాగిలేరు). అదొక ప్రతిష్ఠాత్మకమైన గ్రంథం.
41:42  لَّا يَأْتِيهِ الْبَاطِلُ مِن بَيْنِ يَدَيْهِ وَلَا مِنْ خَلْفِهِ ۖ تَنزِيلٌ مِّنْ حَكِيمٍ حَمِيدٍ
అసత్యం దాని దరిదాపుల్లోకి కూడా - దాని ముందునుండిగానీ, దాని వెనుక నుండిగానీ - రాజాలదు. (ఎందుకంటే) అది మహా వివేకవంతుడు, ప్రశంసనీయుడైన అల్లాహ్‌ తరఫున అవతరింపజేయబడినది.
41:43  مَّا يُقَالُ لَكَ إِلَّا مَا قَدْ قِيلَ لِلرُّسُلِ مِن قَبْلِكَ ۚ إِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ وَذُو عِقَابٍ أَلِيمٍ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం గతించిన ప్రవక్తలతో చెప్పబడినదే నీకూ చెప్పబడుతోంది. నిశ్చయంగా నీ ప్రభువు క్షమకలవాడు, వ్యధాభరితంగా శిక్షించేవాడు కూడా.
41:44  وَلَوْ جَعَلْنَاهُ قُرْآنًا أَعْجَمِيًّا لَّقَالُوا لَوْلَا فُصِّلَتْ آيَاتُهُ ۖ أَأَعْجَمِيٌّ وَعَرَبِيٌّ ۗ قُلْ هُوَ لِلَّذِينَ آمَنُوا هُدًى وَشِفَاءٌ ۖ وَالَّذِينَ لَا يُؤْمِنُونَ فِي آذَانِهِمْ وَقْرٌ وَهُوَ عَلَيْهِمْ عَمًى ۚ أُولَٰئِكَ يُنَادَوْنَ مِن مَّكَانٍ بَعِيدٍ
ఒకవేళ మేము ఈ ఖుర్‌ఆను (గ్రంథము)ను అరబ్బీయేతర ఖుర్‌ఆన్‌గా చేసివుంటే, "దీని వాక్యాలు స్పష్టంగా ఎందుకు వివరించబడలేదు? (ఇదేమిటయ్యా!) ఇదేమో అరబ్బీయేతర గ్రంథమూను, నువ్వేమో అరబీ ప్రవక్తవా!" అని వారు చెప్పి ఉండేవారు. (ఓ ప్రవక్తా!) నువ్వు వారికి చెప్పేయి: "ఇది విశ్వసించిన వారికోసం మార్గదర్శిని, ఆరోగ్య ప్రదాయిని. కాని విశ్వసించని వారి చెవులలో మాత్రం బరువు (చెవుడు) ఉంది. పైగా ఇది వారి పాలిట అంధత్వంగా పరిణమించింది. వారు బహు దూరపు చోటు నుంచి పిలువబడే జనుల్లా ఉన్నారు."
41:45  وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ ۗ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ
మేము మూసాకు (కూడా) గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము. మరైతే అందులో కూడా విభేదించుకోవటం జరిగింది. నీ ప్రభువు తరఫున ముందుగానే (ఆ) విషయం నిర్ధారించబడకుండా ఉంటే, వీళ్ళ మధ్య వ్యవహారం ఎప్పుడో తేల్చేయబడి ఉండేది. వీళ్లు ఆ విషయంలో తీవ్రంగా వ్యాకులపరిచే సందేహానికి లోనై ఉన్నారు.
41:46  مَّنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهِ ۖ وَمَنْ أَسَاءَ فَعَلَيْهَا ۗ وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ
ఎవరయినా సత్కార్యం చేస్తే తన మేలు కోసమే చేసుకుంటాడు. మరెవరయినా దుష్కార్యానికి ఒడిగడితే దాని దుష్ఫలితం అతని మీదే పడుతుంది. నీ ప్రభువు మాత్రం (తన) దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.
41:47  إِلَيْهِ يُرَدُّ عِلْمُ السَّاعَةِ ۚ وَمَا تَخْرُجُ مِن ثَمَرَاتٍ مِّنْ أَكْمَامِهَا وَمَا تَحْمِلُ مِنْ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَيَوْمَ يُنَادِيهِمْ أَيْنَ شُرَكَائِي قَالُوا آذَنَّاكَ مَا مِنَّا مِن شَهِيدٍ
ప్రళయ ఘడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్‌కే ఉందని అనటం సమంజసం. ఆయనకు తెలియకుండా ఏ ఫలము కూడా తన గుబురు గలీబు నుంచి బయటకు రావటంగానీ, ఏ ఆడదీ గర్భందాల్చటంగానీ, ప్రసవించటంగానీ జరగదు. "నా భాగస్వాములు ఎక్కడున్నారు?" అని అల్లాహ్‌ (ముష్రిక్కులను) పిలిచి వాకబు చేసిననాడు, "మాలో ఎవడూ దానికి (సంబంధించి) సాక్ష్యమిచ్చేవాడు లేడని నీతో విన్నవించుకున్నాము" అని వారంటారు.
41:48  وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَدْعُونَ مِن قَبْلُ ۖ وَظَنُّوا مَا لَهُم مِّن مَّحِيصٍ
అంతకు మునుపు వారు ఎవరెవరినయితే పూజించేవారో వాళ్ళంతా వారి నుండి అదృశ్యమైపోయారు. ఇక తమకు ఎక్కడా రక్షణ లేదని వారు అర్థం చేసుకుంటారు.
41:49  لَّا يَسْأَمُ الْإِنسَانُ مِن دُعَاءِ الْخَيْرِ وَإِن مَّسَّهُ الشَّرُّ فَيَئُوسٌ قَنُوطٌ
మేలును అర్థించటంలో మానవుడు (ఎప్పటికీ) అలసిపోడు. అతనికేదైనా కీడు కలిగితే మాత్రం ఆశలన్నీ వదులుకుని నిస్పృహ చెందుతాడు.
41:50  وَلَئِنْ أَذَقْنَاهُ رَحْمَةً مِّنَّا مِن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَٰذَا لِي وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّجِعْتُ إِلَىٰ رَبِّي إِنَّ لِي عِندَهُ لَلْحُسْنَىٰ ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِينَ كَفَرُوا بِمَا عَمِلُوا وَلَنُذِيقَنَّهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ
కష్టాలు వచ్చిన తర్వాత మేమతనికి మా కారుణ్యం రుచిని చూపినట్లయితే "అదెలాగూ నాకు దక్కవలసిందే (ఆ యోగ్యత నాలో ఉంది గనక). ప్రళయ ఘడియ నెలకొంటుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేను నా ప్రభువు వద్దకు మరలించబడినా, నిశ్చయంగా ఆయన దగ్గర నాకు మంచి (స్థానమే) లభిస్తుంది" అని బీరాలు పలుకుతాడు. ఇలాంటి తిరస్కారులకు మేము తప్పకుండా వారు ఏమేమి చేశారో తెలియపరుస్తాము. వారికి దుర్భరమైన యాతనను చవిచూపిస్తాము.
41:51  وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ وَإِذَا مَسَّهُ الشَّرُّ فَذُو دُعَاءٍ عَرِيضٍ
మానవునిపై మేము మా అనుగ్రహాలను కురిపించినప్పుడు, అతడు ముఖం త్రిప్పుకుంటాడు, తన(కు నచ్చిన) ప్రక్కకు తిరిగి పోతాడు. తనపై ఆపద వచ్చిపడినప్పుడు మాత్రం సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవాడిగా మారిపోతాడు.
41:52  قُلْ أَرَأَيْتُمْ إِن كَانَ مِنْ عِندِ اللَّهِ ثُمَّ كَفَرْتُم بِهِ مَنْ أَضَلُّ مِمَّنْ هُوَ فِي شِقَاقٍ بَعِيدٍ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "చూడండి! ఒకవేళ ఈ ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ తరఫునుంచి వచ్చి ఉంటే, మరి మీరు దానిని తిరస్కరిస్తే, (దాన్ని) వ్యతిరేకించటంలో బహుదూరం వెళ్ళిపోయిన వ్యక్తి కన్నా మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?"
41:53  سَنُرِيهِمْ آيَاتِنَا فِي الْآفَاقِ وَفِي أَنفُسِهِمْ حَتَّىٰ يَتَبَيَّنَ لَهُمْ أَنَّهُ الْحَقُّ ۗ أَوَلَمْ يَكْفِ بِرَبِّكَ أَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
త్వరలోనే మేము వారికి మా సూచనలను జగతిలోనూ చూపిస్తాము, స్వయంగా వారి(ఉనికి)లోనూ చూపిస్తాము. తుదకు సత్యమిదే అనే విషయం వారికి తేటతెల్లమవుతుంది. ఏమిటి, నీ ప్రభువు ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడనే విషయం చాలదా?
41:54  أَلَا إِنَّهُمْ فِي مِرْيَةٍ مِّن لِّقَاءِ رَبِّهِمْ ۗ أَلَا إِنَّهُ بِكُلِّ شَيْءٍ مُّحِيطٌ
(నీకు) తెలుసా! వీళ్లు తమ ప్రభువును కలుసుకునే విషయమై అనుమానానికి గురై ఉన్నారు. గుర్తుంచుకో! ఆయన ప్రతి వస్తువునూ ఆవరించి ఉన్నాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.