aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

39. సూరా అజ్ జుమర్

39:1  تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన, వివేకవంతుడైన అల్లాహ్‌ తరఫున జరిగింది.
39:2  إِنَّا أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَّهُ الدِّينَ
(ఓ ముహమ్మద్‌ - సఅసం!) మేమీ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వైపుకు పంపాము. కాబట్టి నువ్వు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు - ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ!
39:3  أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ
జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్‌కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, "ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్‌ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ"ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్‌ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు.
39:4  لَّوْ أَرَادَ اللَّهُ أَن يَتَّخِذَ وَلَدًا لَّاصْطَفَىٰ مِمَّا يَخْلُقُ مَا يَشَاءُ ۚ سُبْحَانَهُ ۖ هُوَ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ
అల్లాహ్‌ (ఎవరినయినా) సంతానంగా చేసుకోదలచుకుంటే, తన సృష్టితాలలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. (కాని) ఆయన పరమ పవిత్రుడు. ఆ అల్లాహ్‌ ఒకే ఒక్కడు, తిరుగులేనివాడు.
39:5  خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ يُكَوِّرُ اللَّيْلَ عَلَى النَّهَارِ وَيُكَوِّرُ النَّهَارَ عَلَى اللَّيْلِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۗ أَلَا هُوَ الْعَزِيزُ الْغَفَّارُ
ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. ఆయన రాత్రిని పగటిపై, పగటిని రాత్రిపై చుట్టివేస్తున్నాడు. సూర్యచంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు. (వాటిలో) ప్రతిదీ నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంది. ఆయనే అపార శక్తిమంతుడు, పాపాలను క్షమించేవాడు అని తెలుసుకోండి!
39:6  خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ الْأَنْعَامِ ثَمَانِيَةَ أَزْوَاجٍ ۚ يَخْلُقُكُمْ فِي بُطُونِ أُمَّهَاتِكُمْ خَلْقًا مِّن بَعْدِ خَلْقٍ فِي ظُلُمَاتٍ ثَلَاثٍ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ
ఆయన మిమ్మల్నందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. మరి దాంతోనే దాని జతను కూడా చేశాడు. ఇంకా మీ కోసం పశువులలో ఎనిమిది (రకాల) పెంటి - పోతులను అవతరింపజేశాడు. ఆయన మిమ్మల్ని, మీ మాతృగర్భాలలో - మూడేసి చీకట్లలో - ఒకదాని తరువాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. రాజ్యాధికారం ఆయనదే. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మరలాంటప్పుడు మీరు ఎటు తిరిగిపోతున్నారు?
39:7  إِن تَكْفُرُوا فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنكُمْ ۖ وَلَا يَرْضَىٰ لِعِبَادِهِ الْكُفْرَ ۖ وَإِن تَشْكُرُوا يَرْضَهُ لَكُمْ ۗ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
ఒకవేళ మీరు తిరస్కార వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్‌కు మీ అవసరం ఎంతమాత్రం లేదు (అన్న విషయాన్ని తెలుసుకోండి). తన దాసుల కృతఘ్నతా ధోరణిని ఆయన ఇష్టపడడు. మీరు గనక కృతజ్ఞతాపూర్వకంగా మసలుకుంటే, దాన్ని ఆయన మీ కోసం ఇష్టపడతాడు. బరువును మోసే వాడెవడూ ఇంకొకరి బరువును మోయడు. మరి మీరంతా మరలి పోవలసింది మీ ప్రభువు వైపునకే. మీరు చేస్తూ ఉన్న కర్మలను ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన ఆంతర్యాల్లోని విషయాన్ని సయితం ఎరిగినవాడు.
39:8  وَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَا رَبَّهُ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِّنْهُ نَسِيَ مَا كَانَ يَدْعُو إِلَيْهِ مِن قَبْلُ وَجَعَلَ لِلَّهِ أَندَادًا لِّيُضِلَّ عَن سَبِيلِهِ ۚ قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِيلًا ۖ إِنَّكَ مِنْ أَصْحَابِ النَّارِ
మనిషికి ఎప్పుడైనా, ఏదైనా ఆపద వచ్చిపడితే తన ప్రభువు వైపుకు మరలి ఆయన్ని(అదేపనిగా) మొరపెట్టుకుంటాడు. మరి అల్లాహ్‌ అతనికి తన వద్ద నుంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అంతకు మునుపు అతను దేనికోసం (కడుదీనంగా) మొరపెట్టుకున్నాడో దాన్ని మరచిపోతాడు. అల్లాహ్‌ మార్గం నుంచి (ఇతరుల్ని కూడా) పెడత్రోవ పట్టించడానికి అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం మొదలెడతాడు. (ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : "నీ తిరస్కార వైఖరి లాభాలను కొన్నాళ్ళపాటు అనుభవించు. తుదకు నువ్వు నరక వాసులలో చేరేవాడివే."
39:9  أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ ۗ قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ
ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు - ఇద్దరూ సమానులు కాగలరా?). చెప్పండి - తెలిసినవారు, తెలియనివారు ఒక్కటేనా? బుద్ధిమంతులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు.
39:10  قُلْ يَا عِبَادِ الَّذِينَ آمَنُوا اتَّقُوا رَبَّكُمْ ۚ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۗ وَأَرْضُ اللَّهِ وَاسِعَةٌ ۗ إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : "విశ్వసించిన ఓ నా దాసులారా! మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసినవారికి మేలు జరుగుతుంది. అల్లాహ్‌ భూమి ఎంతో విశాలమైనది. సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది."
39:11  قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّهَ مُخْلِصًا لَّهُ الدِّينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "ఆరాధనను అల్లాహ్‌కే ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని నాకు ఆజ్ఞాపించబడింది."
39:12  وَأُمِرْتُ لِأَنْ أَكُونَ أَوَّلَ الْمُسْلِمِينَ
"ఆజ్ఞను శిరసావహించే వారిలో నేను తొలివాణ్ణి కావాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది."
39:13  قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
"నేను గనక నా ప్రభువుకు అవిధేయత చూపినట్లయితే, ఆ మహాదినాన పడే శిక్షను గురించి భయపడుతున్నాను" అని కూడా చెప్పు.
39:14  قُلِ اللَّهَ أَعْبُدُ مُخْلِصًا لَّهُ دِينِي
ఇలా చెప్పు: "నేను మాత్రం నా దాస్యాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించి, ఆయన్నే ఆరాధిస్తాను.
39:15  فَاعْبُدُوا مَا شِئْتُم مِّن دُونِهِ ۗ قُلْ إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ
"మీరు ఆయన్ని వదలి ఎవరెవరిని పూజించదలుస్తున్నారో పూజించుకోండి." ఇంకా ఇలా చెప్పు: "ప్రళయదినాన తాము నష్టపోయినదిగాక, తమ పరివారానికి కూడా నష్టం చేకూర్చినవారే పూర్తిగా నష్టపోయినవారు. బాగా వినండి! ఘోరమైన నష్టం ఇదే."
39:16  لَهُم مِّن فَوْقِهِمْ ظُلَلٌ مِّنَ النَّارِ وَمِن تَحْتِهِمْ ظُلَلٌ ۚ ذَٰلِكَ يُخَوِّفُ اللَّهُ بِهِ عِبَادَهُ ۚ يَا عِبَادِ فَاتَّقُونِ
వారిని పైనుంచీ, క్రిందినుంచీ అగ్ని మేఘాలు (జ్వాలలు) ఆవరిస్తూ ఉంటాయి. వాటి (యాతన) గురించి అల్లాహ్‌ తన దాసులను భయపెడుతున్నాడు. "ఓ నా దాసులారా! అందుకే నాకు భయపడండి."
39:17  وَالَّذِينَ اجْتَنَبُوا الطَّاغُوتَ أَن يَعْبُدُوهَا وَأَنَابُوا إِلَى اللَّهِ لَهُمُ الْبُشْرَىٰ ۚ فَبَشِّرْ عِبَادِ
మరెవరయితే తాగూత్‌ (షైతాన్‌) దాస్యానికి దూరంగా ఉన్నారో, (సంపూర్తిగా) అల్లాహ్‌ వైపునకు మరలారో, వారు శుభవార్తకు అర్హులు. కనుక (అటువంటి) నా దాసులకు (ఓ ముహమ్మద్‌!) శుభవార్తను వినిపించు.
39:18  الَّذِينَ يَسْتَمِعُونَ الْقَوْلَ فَيَتَّبِعُونَ أَحْسَنَهُ ۚ أُولَٰئِكَ الَّذِينَ هَدَاهُمُ اللَّهُ ۖ وَأُولَٰئِكَ هُمْ أُولُو الْأَلْبَابِ
వారు మాటను శ్రద్ధగా వింటారు. అందులోని మంచి విషయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు. అల్లాహ్‌ సన్మార్గం చూపినది వారికే. బుద్ధికలవారు కూడా వారే.
39:19  أَفَمَنْ حَقَّ عَلَيْهِ كَلِمَةُ الْعَذَابِ أَفَأَنتَ تُنقِذُ مَن فِي النَّارِ
ఏ వ్యక్తికి వ్యతిరేకంగా శిక్షా వాక్కు ఖరారైపోయిందో, అగ్నికి ఆహుతి అయిపోయిన (అటువంటి) వాణ్ణి నువ్వు బయటికి తీయగలవా?
39:20  لَٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِّن فَوْقِهَا غُرَفٌ مَّبْنِيَّةٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَعْدَ اللَّهِ ۖ لَا يُخْلِفُ اللَّهُ الْمِيعَادَ
అయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారికోసం (అంతస్తులుగా కట్టబడిన) మేడలున్నాయి. వాటిపై (మరిన్ని) అంతస్తులు నిర్మించబడి ఉన్నాయి. మరి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉన్నాయి. అల్లాహ్‌ వాగ్దానం ఇది. అల్లాహ్‌ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు.
39:21  أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَلَكَهُ يَنَابِيعَ فِي الْأَرْضِ ثُمَّ يُخْرِجُ بِهِ زَرْعًا مُّخْتَلِفًا أَلْوَانُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَجْعَلُهُ حُطَامًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ
ఏమిటి, నువ్వు చూడలేదా? - అల్లాహ్‌ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, దాన్ని భూగర్భంలోని ఊటలలోనికి చేరుస్తున్నాడు. మరి దాని ద్వారా రకరకాల పంటల్ని ఉత్పన్నం చేస్తున్నాడు. మరి అవి ఎండిపోతాయి. అప్పుడు నువ్వు వాటిని పసుపు రంగులో చూస్తావు. తరువాత వాటిని పొట్టుపొట్టుగా చేసేస్తాడు. విజ్ఞుల కోసం ఇందులో మహోపదేశం ఉంది.
39:22  أَفَمَن شَرَحَ اللَّهُ صَدْرَهُ لِلْإِسْلَامِ فَهُوَ عَلَىٰ نُورٍ مِّن رَّبِّهِ ۚ فَوَيْلٌ لِّلْقَاسِيَةِ قُلُوبُهُم مِّن ذِكْرِ اللَّهِ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُّبِينٍ
ఏ వ్యక్తి హృదయాన్ని అల్లాహ్‌ ఇస్లాం కోసం విప్పాడో, (అతను గుణపాఠం నేర్చుకోని వ్యక్తిలాంటివాడు కాగలడా?) అతడు తన ప్రభువు తరఫు నుంచి వచ్చిన కాంతిపై ఉన్నాడు. అల్లాహ్‌ స్మరణ పట్ల ఎవరి హృదయాలు (మెత్తబడకుండా) కరకుగా మారాయో వారికి వినాశం తప్పదు. వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు గురై ఉన్నారు.
39:23  اللَّهُ نَزَّلَ أَحْسَنَ الْحَدِيثِ كِتَابًا مُّتَشَابِهًا مَّثَانِيَ تَقْشَعِرُّ مِنْهُ جُلُودُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ ثُمَّ تَلِينُ جُلُودُهُمْ وَقُلُوبُهُمْ إِلَىٰ ذِكْرِ اللَّهِ ۚ ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
అల్లాహ్‌ అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక కలిగి ఉండే, పదేపదే పునరావృతం అవుతూ ఉండే ఆయతులతో కూడిన గ్రంథం రూపంలో ఉంది. దాని వల్ల తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు, హృదయాలు అల్లాహ్‌ స్మరణపట్ల మెత్తబడి పోతాయి. ఇదీ అల్లాహ్‌ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సన్మార్గానికి తెస్తాడు. మరి అల్లాహ్‌ ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం చూపేవాడెవడూ ఉండడు.
39:24  أَفَمَن يَتَّقِي بِوَجْهِهِ سُوءَ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَقِيلَ لِلظَّالِمِينَ ذُوقُوا مَا كُنتُمْ تَكْسِبُونَ
ఎవరయితే ప్రళయదినాన దుర్భరమైన శిక్ష పడకుండా తన ముఖాన్ని డాలుగా పెట్టుకుంటాడో (అతను ప్రళయదినాన నిశ్చింతగా ఉండేవానితో సమానం కాగలడా?) "మీరు సంపాదించుకున్న దాని రుచిని చూడండి" అని ఆ దుర్మార్గులతో అనబడుతుంది.
39:25  كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَاهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ
వారి పూర్వీకులు (కూడా) ధిక్కరించారు. మరి వారిపై వారు ఊహించనైనా లేని చోటునుంచి శిక్ష వచ్చిపడింది.
39:26  فَأَذَاقَهُمُ اللَّهُ الْخِزْيَ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
అల్లాహ్‌ ప్రాపంచిక జీవితంలోనే వారికి అవమానం రుచి చూపించాడు. పరలోక యాతనైతే ఇంతకన్నా ఎంతో పెద్దది. ఈ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు!
39:27  وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ
నిశ్చయంగా మేము ఈ ఖుర్‌ఆనులో ప్రజల కొరకు అన్ని రకాల ఉపమానాలను వివరించాము - బహుశా వారు హితబోధను గ్రహిస్తారేమోనని!
39:28  قُرْآنًا عَرَبِيًّا غَيْرَ ذِي عِوَجٍ لَّعَلَّهُمْ يَتَّقُونَ
(ఈ) ఖుర్‌ఆన్‌ అరబీలో ఉంది. ఇందులో ఎలాంటి వక్రతా లేదు. (దీని ద్వారా) వారు బహుశా భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు.
39:29  ضَرَبَ اللَّهُ مَثَلًا رَّجُلًا فِيهِ شُرَكَاءُ مُتَشَاكِسُونَ وَرَجُلًا سَلَمًا لِّرَجُلٍ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
అల్లాహ్‌ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు: ఒక (బానిస) వ్యక్తి ఉన్నాడు. అతను విరుద్ధ భావాలు గల అనేకమంది భాగస్వాముల క్రింద ఉన్నాడు. రెండవ వ్యక్తి ఒక్కనికే చెందినవాడు (ఒక యజమానికి చెందిన బానిస). వారిద్దరూ సమానులవుతారా? ప్రశంసలన్నీ అల్లాహ్‌ కొరకే. కాని వారిలో చాలా మంది తెలియనివారు.
39:30  إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.
39:31  ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ
తర్వాత మీరంతా ప్రళయదినాన మీ ప్రభువు ఎదుట గొడవపడతారు.
39:32  فَمَنْ أَظْلَمُ مِمَّن كَذَبَ عَلَى اللَّهِ وَكَذَّبَ بِالصِّدْقِ إِذْ جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ
అల్లాహ్‌పై అబద్ధాలు చెప్పే వాడి కంటే, తన వద్దకు సత్య ధర్మం వచ్చినప్పుడు దాన్ని అసత్యమని ధిక్కరించేవాడి కంటే పరమదుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకం కాక మరేమవుతుందీ??
39:33  وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ ۙ أُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
ఎవరయితే సత్యధర్మాన్ని తీసుకువచ్చాడో, మరెవరయితే దాన్ని సత్యమని ధృవీకరించాడో అటువంటి వారే భయభక్తులు గలవారు.
39:34  لَهُم مَّا يَشَاءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ جَزَاءُ الْمُحْسِنِينَ
వారికోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే.
39:35  لِيُكَفِّرَ اللَّهُ عَنْهُمْ أَسْوَأَ الَّذِي عَمِلُوا وَيَجْزِيَهُمْ أَجْرَهُم بِأَحْسَنِ الَّذِي كَانُوا يَعْمَلُونَ
అల్లాహ్‌ వారి దురాచరణలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సదాచరణలకుగాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వటానికి (ఈ వ్యవస్థను నెలకొల్పుతాడు).
39:36  أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ ۖ وَيُخَوِّفُونَكَ بِالَّذِينَ مِن دُونِهِ ۚ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
ఏమిటి, తన దాసునికి అల్లాహ్‌ సరిపోడా? వీళ్లు నిన్ను అల్లాహ్‌ తప్ప ఇతరుల గురించి భయపెడుతున్నారు. అల్లాహ్‌ అపమార్గం పట్టించిన వానికి మార్గం చూపించగల వాడెవడూ లేడు.
39:37  وَمَن يَهْدِ اللَّهُ فَمَا لَهُ مِن مُّضِلٍّ ۗ أَلَيْسَ اللَّهُ بِعَزِيزٍ ذِي انتِقَامٍ
అల్లాహ్‌ మార్గం చూపినవానిని ఎవడూ అపమార్గం పట్టించలేడు. ఏమిటి, అల్లాహ్‌ ప్రాబల్యం కలవాడు, ప్రతీకారం చేసే వాడు కాడా?
39:38  وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ
ఆకాశాలను, భూమిని సృష్టించిన వాడెవడు? అని నువ్వు గనక వారిని అడిగితే, "అల్లాహ్‌" అని వారు తప్పకుండా చెబుతారు. వారితో చెప్పు : "సరే! చూడండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని పిలుస్తున్నారో వారు, అల్లాహ్‌ నాకేదన్నా కీడు చేయదలిస్తే, ఆ కీడును తొలగించగలరా? పోనీ, అల్లాహ్‌ నన్ను కటాక్షించదలిస్తే, వారు ఆయన కృపను అడ్డుకోగలరా?" ఇలా అను: "నాకు అల్లాహ్‌ చాలు. నమ్మేవారు ఆయన్నే నమ్ముకుంటారు."
39:39  قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ
ఇలా చెప్పు : "నా జాతి ప్రజలారా! మీరున్న స్థితిలో మీరు ఆచరిస్తూ ఉండండి. నేను కూడా ఆచరిస్తున్నాను. త్వరలోనే మీరు తెలుసుకుంటారు -
39:40  مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ
"పరాభవానికి గురిచేసే శిక్ష ఎవరిపై రానున్నదో, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై పడుతుందో! (మీకే తెలుస్తుంది)."
39:41  إِنَّا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ لِلنَّاسِ بِالْحَقِّ ۖ فَمَنِ اهْتَدَىٰ فَلِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ
(ఓ ముహమ్మద్‌ - సఅసం!) జనుల కోసం మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వద్దకు పంపాము. కాబట్టి ఎవడయినా దారికి వస్తే అతను తన స్వయానికే మేలు చేసుకున్నాడు. మరెవరయినా దారితప్పితే ఆ పెడదారి (పాపం) అతని మీదే పడుతుంది. నీవు వారికి బాధ్యుడవు కావు.
39:42  اللَّهُ يَتَوَفَّى الْأَنفُسَ حِينَ مَوْتِهَا وَالَّتِي لَمْ تَمُتْ فِي مَنَامِهَا ۖ فَيُمْسِكُ الَّتِي قَضَىٰ عَلَيْهَا الْمَوْتَ وَيُرْسِلُ الْأُخْرَىٰ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
అల్లాహ్‌యే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటున్నాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదలిపెడుతున్నాడు. చింతన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
39:43  أَمِ اتَّخَذُوا مِن دُونِ اللَّهِ شُفَعَاءَ ۚ قُلْ أَوَلَوْ كَانُوا لَا يَمْلِكُونَ شَيْئًا وَلَا يَعْقِلُونَ
ఏమిటి, వారు అల్లాహ్‌ను వదలి (వేరితరులను) సిఫార్సు చేసేవారుగా చేసుకుంటున్నారా? "వారికి ఏ అధికారం లేకున్నా, తెలివి లేకపోయినా (మీరు వారిని సిఫార్సు కోసం నిలబెడతారా?)?" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
39:44  قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا ۖ لَّهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
"సిఫారసు అంతా అల్లాహ్‌ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. కడకు మీరంతా ఆయన వైపునకే మరలించబడతారు" అని చెప్పు.
39:45  وَإِذَا ذُكِرَ اللَّهُ وَحْدَهُ اشْمَأَزَّتْ قُلُوبُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ ۖ وَإِذَا ذُكِرَ الَّذِينَ مِن دُونِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ
అల్లాహ్‌ ఒక్కని గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని వారి గుండెలు అక్కసుతో ఉడికిపోతాయి. మరి అల్లాహ్‌ తప్ప ఇతరుల గురించి చెప్పినప్పుడు మాత్రం అవి ఆనందంతో విప్పారుతాయి.
39:46  قُلِ اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِي مَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
(ఓ ప్రవక్తా! నువ్వు ఇలా) అను: "ఓ అల్లాహ్‌! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాలను గురించి తెలిసినవాడా! నీ దాసులు విభేదించుకుంటున్న విషయాలపై నీవు మాత్రమే తీర్పు చేస్తావు."
39:47  وَلَوْ أَنَّ لِلَّذِينَ ظَلَمُوا مَا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ مِن سُوءِ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَبَدَا لَهُم مِّنَ اللَّهِ مَا لَمْ يَكُونُوا يَحْتَسِبُونَ
దుర్మార్గానికి ఒడిగట్టే వారి వద్ద భూమి యందలి సమస్తమూ ఉన్నా, దాంతోపాటు మరి అంతటి సంపద ఉన్నా ఘోర శిక్ష నుండి తప్పించుకోవటానికి ప్రళయ దినాన వారు దాన్నంతటినీ కూడా - పరిహారంగా - ఇచ్చివేస్తారు. వారు ఊహించి కూడా ఉండనిది అల్లాహ్‌ తరఫున వారి ముందు ప్రస్ఫుటమవుతుంది.
39:48  وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
వారు చేసుకున్న దురాగతాల దుష్ఫలితాలన్నీ వారికి ఎదురవుతాయి. దేని గురించి వారు వేళాకోళం చేసేవారో అదే వారిని చుట్టుముట్టుతుంది.
39:49  فَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلْنَاهُ نِعْمَةً مِّنَّا قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَىٰ عِلْمٍ ۚ بَلْ هِيَ فِتْنَةٌ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
మనిషికి ఏదన్నా ఆపద వచ్చిపడినప్పుడు అతడు మమ్మల్ని (సహాయం కోసం) మొరపెట్టుకోసాగుతాడు. మరి మేమతనికి మా తరఫునుండి ఏదైనా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే "ఇది నా ప్రజ్ఞా పాటవాల మూలంగా నాకు ఇవ్వబడింద"ని అంటాడు. కాదు, వాస్తవానికి అదొక పరీక్ష. కాని వారిలో చాలా మంది ఈ విషయాన్ని గ్రహించరు.
39:50  قَدْ قَالَهَا الَّذِينَ مِن قَبْلِهِمْ فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ
వారి పూర్వీకులు కూడా అదే మాటన్నారు. కాని వారు ఆర్జించినదేదీ వారికి ఎంతమాత్రం ఉపయోగపడలేదు.
39:51  فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا ۚ وَالَّذِينَ ظَلَمُوا مِنْ هَٰؤُلَاءِ سَيُصِيبُهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَمَا هُم بِمُعْجِزِينَ
మరి వారి దురాగతాల దుష్ఫలితాలన్నీ వారిపైనే పడ్డాయి. ఇక వీరిలోని పాపాత్ములు చేసిన పాపకార్యాల దుష్ఫలితాలు కూడా వీరిపై వచ్చిపడతాయి. వీరు మమ్మల్ని (ఎట్టి పరిస్థితిలోనూ) అశక్తుల్ని చేయలేరు.
39:52  أَوَلَمْ يَعْلَمُوا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
ఏమిటి, అల్లాహ్‌ తాను కోరిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడనీ, పరిమితం కూడా చేయగలడని వారికి తెలియదా? విశ్వసించే జనుల కోసం ఇందులో (గొప్ప) సూచనలున్నాయి.
39:53  قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا مِن رَّحْمَةِ اللَّهِ ۚ إِنَّ اللَّهَ يَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: "తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.
39:54  وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ مِن قَبْلِ أَن يَأْتِيَكُمُ الْعَذَابُ ثُمَّ لَا تُنصَرُونَ
"మీపై విపత్తు వచ్చిపడకముందే మీరు మీ ప్రభువు వైపునకు మరలండి. ఆయనకు విధేయత చూపండి. ఆ తరువాత మీకెలాంటి సహాయమూ లభించదు.
39:55  وَاتَّبِعُوا أَحْسَنَ مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُم مِّن قَبْلِ أَن يَأْتِيَكُمُ الْعَذَابُ بَغْتَةً وَأَنتُمْ لَا تَشْعُرُونَ
"మీకు తెలియకుండానే మీపై అకస్మాత్తుగా ఆపద వచ్చి పడకముందే, మీ ప్రభువు తరఫు నుండి మీకు పంపబడిన ఉత్తమ విషయాన్ని అనుసరించండి."
39:56  أَن تَقُولَ نَفْسٌ يَا حَسْرَتَا عَلَىٰ مَا فَرَّطتُ فِي جَنبِ اللَّهِ وَإِن كُنتُ لَمِنَ السَّاخِرِينَ
"అప్పుడు ఏ ప్రాణి అయినా, 'అయ్యో! ఏమి దురవస్థ నాది! నేను అల్లాహ్‌ విషయంలో లోటు చేశానే! నేను గేలిచేసే వారిలో ఉండిపోయానే!?' అని చెబుతుందేమో! (ఆ పరిస్థితి రాకూడదు సుమా!)
39:57  أَوْ تَقُولَ لَوْ أَنَّ اللَّهَ هَدَانِي لَكُنتُ مِنَ الْمُتَّقِينَ
"లేదా 'అల్లాహ్‌ గనక నాకు సన్మార్గం చూపి ఉంటే నేను కూడా భయభక్తులు గలవారిలో చేరి ఉండేదాన్నేమో!' అని చెబుతుందేమో!
39:58  أَوْ تَقُولَ حِينَ تَرَى الْعَذَابَ لَوْ أَنَّ لِي كَرَّةً فَأَكُونَ مِنَ الْمُحْسِنِينَ
"లేదా శిక్షను చూసిన తరువాత, 'ఎలాగయినాసరే నేను తిరిగి (ప్రపంచానికి) పంపబడితే నేను సజ్జనులలో చేరుతాను' అని పలుకుతుందేమో! (మీకు ఆ దురవస్థ రాకూడదనే ఈ విషయాలన్నీ విడమరచి చెప్పబడ్డాయి)."
39:59  بَلَىٰ قَدْ جَاءَتْكَ آيَاتِي فَكَذَّبْتَ بِهَا وَاسْتَكْبَرْتَ وَكُنتَ مِنَ الْكَافِرِينَ
"అదికాదు, నిశ్చయంగా నా సూచనలు నీ వద్దకు వచ్చాయి. కాని నువ్వు వాటిని ధిక్కరించావు. గర్వాతిశయంతో విర్రవీగావు. అసలు నువ్వు అవిశ్వాసులలో ఒకడవు" (అని అనబడుతుంది).
39:60  وَيَوْمَ الْقِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللَّهِ وُجُوهُهُم مُّسْوَدَّةٌ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْمُتَكَبِّرِينَ
ఎవరయితే అల్లాహ్‌పై అబద్ధాలు చెప్పారో, ప్రళయదినాన వారి ముఖాలు నల్లగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. ఏమిటి, గర్వంతో విర్రవీగే వారి నివాస స్థలం నరకం కాదా?
39:61  وَيُنَجِّي اللَّهُ الَّذِينَ اتَّقَوْا بِمَفَازَتِهِمْ لَا يَمَسُّهُمُ السُّوءُ وَلَا هُمْ يَحْزَنُونَ
మరెవరయితే భయభక్తులతో మెలిగారో వారిని అల్లాహ్‌, వారి సాఫల్యంతో సహా కాపాడుతాడు. వారిని ఏ బాధ కూడా తాకదు. వారికి ఏ దుఃఖం ఉండదు.
39:62  اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
అన్ని వస్తువులనూ సృష్టించినవాడు అల్లాహ్‌యే. అన్ని వస్తువులకూ సంరక్షకుడు కూడా ఆయనే.
39:63  لَّهُ مَقَالِيدُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
భూమ్యాకాశాల తాళం చెవులకు యజమాని ఆయనే. అల్లాహ్‌ సూచనలను తిరస్కరించినవారే (చివరకు) నష్ట పోయేవారు.
39:64  قُلْ أَفَغَيْرَ اللَّهِ تَأْمُرُونِّي أَعْبُدُ أَيُّهَا الْجَاهِلُونَ
"ఓ అజ్ఞానులారా! అల్లాహ్‌ను వదలి ఇతరులను పూజించమని మీరు నాకు చెబుతారా?" అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
39:65  وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : "ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు."
39:66  بَلِ اللَّهَ فَاعْبُدْ وَكُن مِّنَ الشَّاكِرِينَ
కాదు, నువ్వు మాత్రం (ఒక్కడైన) అల్లాహ్‌నే ఆరాధించు. కృతజ్ఞతలు తెలుపుకునే వారిలో చేరిపో.
39:67  وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
వారసలు అల్లాహ్‌ను గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయ దినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు. వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు - ఎంతో ఉన్నతుడు.
39:68  وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ ۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخْرَىٰ فَإِذَا هُمْ قِيَامٌ يَنظُرُونَ
మరి శంఖం ఊదబడగానే ఆకాశాలలో, భూమిలో ఉన్న వారంతా స్పృహ తప్పి పడిపోతారు - కాని అల్లాహ్‌ కోరిన వారు మాత్రం (స్పృహ కోల్పోరు)! మళ్లీ శంఖం పూరించబడగానే వారంతా ఒక్కసారిగా లేచి చూస్తూ ఉంటారు.
39:69  وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ الْكِتَابُ وَجِيءَ بِالنَّبِيِّينَ وَالشُّهَدَاءِ وَقُضِيَ بَيْنَهُم بِالْحَقِّ وَهُمْ لَا يُظْلَمُونَ
భూమి తన ప్రభువు జ్యోతితో ధగధగా మెరిసిపోతుంది. కర్మల పత్రాలు హాజరు పరచబడతాయి. ప్రవక్తలు, సాక్షులు రప్పించబడతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు చేయబడుతుంది. వారికి అన్యాయం అనేది జరగదు.
39:70  وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ أَعْلَمُ بِمَا يَفْعَلُونَ
ప్రతి ప్రాణికీ - అది చేసుకున్న దాన్ని బట్టి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రజలు చేసేవన్నీ ఆయనకు బాగా తెలుసు.
39:71  وَسِيقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا فُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَتْلُونَ عَلَيْكُمْ آيَاتِ رَبِّكُمْ وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا ۚ قَالُوا بَلَىٰ وَلَٰكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذَابِ عَلَى الْكَافِرِينَ
అవిశ్వాసులు గుంపులు గుంపులుగా నరకం వైపు తోలబడతారు. వారు అక్కడకు చేరుకోగానే దాని ద్వారాలు తెరువబడతాయి. "ఏమిటి? మీ ప్రభువు వాక్యాలను చదివి వినిపించే, ఈ దినం రానున్నదని మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు - మీలో నుంచి - ఎవరూ రాలేదా?" అని అక్కడి పర్యవేక్షకులు వారిని అడుగుతారు. దానికి వారు "ఎందుకు రాలేదు? (వచ్చారు). కాని అవిశ్వాసులపై శిక్షా ఉత్తర్వు ఖరారై పోయింది" అని చెబుతారు.
39:72  قِيلَ ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
"ఇక నరక ద్వారాలలో ప్రవేశించండి. మీరు శాశ్వతంగా ఉండాల్సింది అక్కడే. తలబిరుసుల నివాస స్థలం చాలా చెడ్డది" అని అనబడుతుంది.
39:73  وَسِيقَ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ إِلَى الْجَنَّةِ زُمَرًا ۖ حَتَّىٰ إِذَا جَاءُوهَا وَفُتِحَتْ أَبْوَابُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلَامٌ عَلَيْكُمْ طِبْتُمْ فَادْخُلُوهَا خَالِدِينَ
మరెవరయితే తమ ప్రభువుకు భయపడుతూ ఉండేవారో, వారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు పంపబడతారు. తుదకు వారు అక్కడకు చేరుకునేటప్పటికే దాని ద్వారాలు తెరువబడి ఉంటాయి. స్వర్గ పర్యవేక్షకులు వారినుద్దేశ్యించి, "మీపై శాంతి కురియుగాక! మీరు హాయిగా ఉండండి. శాశ్వతంగా ఉండేటందుకు ఇందులో ప్రవేశించండి" అంటారు.
39:74  وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي صَدَقَنَا وَعْدَهُ وَأَوْرَثَنَا الْأَرْضَ نَتَبَوَّأُ مِنَ الْجَنَّةِ حَيْثُ نَشَاءُ ۖ فَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
"అల్లాహ్‌కే కృతజ్ఞతలు. ఆయన మాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మమ్మల్ని ఈ భూమికి వారసులుగా చేశాడు. ఇక స్వర్గంలో మేము కోరిన చోటల్లా ఉంటాము. మొత్తానికి (మంచి) కర్మలు చేసేవారికి లభించే ప్రతిఫలం ఎంత గొప్పది!" అని వారు అంటారు.
39:75  وَتَرَى الْمَلَائِكَةَ حَافِّينَ مِنْ حَوْلِ الْعَرْشِ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ ۖ وَقُضِيَ بَيْنَهُم بِالْحَقِّ وَقِيلَ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
మరి నువ్వు, దైవదూతలు దైవ సింహాసనం చుట్టూ చేరి, తమ ప్రభువు పవిత్రతను కొనియాడటాన్ని, స్తోత్రం చేయటాన్ని చూస్తావు. వారి మధ్య న్యాయబద్ధంగా తీర్పు చేయబడుతుంది. "సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు" అని అనబడుతుంది


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.