aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

38. సూరా సాద్

38:1  ص ۚ وَالْقُرْآنِ ذِي الذِّكْرِ
సాద్‌. హితబోధతో నిండిన ఖుర్‌ఆన్‌ సాక్షిగా!
38:2  بَلِ الَّذِينَ كَفَرُوا فِي عِزَّةٍ وَشِقَاقٍ
అసలు (ఈ) తిరస్కారులు అహంకారానికి, మొండితనానికి లోనై ఉన్నారు.
38:3  كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ فَنَادَوا وَّلَاتَ حِينَ مَنَاصٍ
మేము వారికి మునుపు కూడా ఎన్నో సముదాయాలను సర్వనాశనం చేశాము. మరి వారు (ఆఖరి క్షణాలలో) కేకలు పెట్టారు. కాని అది వారు తప్పించుకునే సమయం కాదు కదా!
38:4  وَعَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ ۖ وَقَالَ الْكَافِرُونَ هَٰذَا سَاحِرٌ كَذَّابٌ
తమ వద్దకు హెచ్చరించేవాడొకడు స్వయంగా తమలో నుంచే వచ్చాడే! అని వారు ఆశ్చర్యపోయారు. "ఇతడొక మాంత్రికుడు, అబద్ధాలకోరు" అని అవిశ్వాసులు అన్నారు.
38:5  أَجَعَلَ الْآلِهَةَ إِلَٰهًا وَاحِدًا ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ عُجَابٌ
(వారింకా ఇలా అన్నారు) "ఏమిటి? ఇతగాడు ఇంతమంది దేముళ్ళను ఒకే ఆరాధ్య దైవంగా చేసేశాడా? నిజంగా ఇది వింతగా ఉందే!"
38:6  وَانطَلَقَ الْمَلَأُ مِنْهُمْ أَنِ امْشُوا وَاصْبِرُوا عَلَىٰ آلِهَتِكُمْ ۖ إِنَّ هَٰذَا لَشَيْءٌ يُرَادُ
వారి నాయకమన్యులు ఈ విధంగా చెబుతూ వెళ్ళిపోయారు: "పదండ్రా. మీరు మీ దేముళ్ళ (పూజాపునస్కారాల) పైనే గట్టిగా నిలబడండి. నిశ్చయంగా ఈ మాటలో (మీకు వ్యతిరేకంగా) ఏదో మర్మం ఉంది.
38:7  مَا سَمِعْنَا بِهَٰذَا فِي الْمِلَّةِ الْآخِرَةِ إِنْ هَٰذَا إِلَّا اخْتِلَاقٌ
"ఈ విషయాన్ని మేము వెనుకటి మతధర్మంలో కూడా వినలేదు. ఇదొక కల్పిత విషయం తప్ప మరేమీ కాదు.
38:8  أَأُنزِلَ عَلَيْهِ الذِّكْرُ مِن بَيْنِنَا ۚ بَلْ هُمْ فِي شَكٍّ مِّن ذِكْرِي ۖ بَل لَّمَّا يَذُوقُوا عَذَابِ
"ఏమిటీ, మనందరిలో కేవలం అతనొక్కడిపైనే దైవవాణి అవతరించిందా!?" అసలు విషయమేమిటంటే వారు నా సందేశం (వహీ) విషయంలో సంశయానికి లోనయ్యారు. అదికాదు, ఇంతవరకు వారసలు నా శిక్ష రుచి చూడలేదు.
38:9  أَمْ عِندَهُمْ خَزَائِنُ رَحْمَةِ رَبِّكَ الْعَزِيزِ الْوَهَّابِ
పోనీ వాళ్ళ దగ్గర శక్తిమంతుడు, పరమదాత అయిన నీ ప్రభువు కారుణ్య నిధులుగానీ ఉన్నాయా?
38:10  أَمْ لَهُم مُّلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ فَلْيَرْتَقُوا فِي الْأَسْبَابِ
లేదా భూమ్యాకాశాల, వాటి మధ్యనున్న సమస్త వస్తువులపై అధికారం గానీ వారి సొంతమయిందా? ఒకవేళ అయి వుంటే ఇంకేం? త్రాళ్ళు వేసి (ఆకాశానికి) ఎక్కిపోవాలి?
38:11  جُندٌ مَّا هُنَالِكَ مَهْزُومٌ مِّنَ الْأَحْزَابِ
ఇది కూడా (పెద్ద పెద్ద) సైనిక కూటములలో ఓడిపోయిన ఒక (చిన్న) సైనిక దళమే సుమా!
38:12  كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَفِرْعَوْنُ ذُو الْأَوْتَادِ
వీరికి మునుపు నూహ్‌ జాతివారు, ఆద్‌ వారు, మేకులు గల ఫిరౌను వారు కూడా ధిక్కరించారు.
38:13  وَثَمُودُ وَقَوْمُ لُوطٍ وَأَصْحَابُ الْأَيْكَةِ ۚ أُولَٰئِكَ الْأَحْزَابُ
సమూదువారు, లూత్‌ జాతివారు, అయికావారు (కూడా ధిక్కరించినవారే). వారే (పెద్ద పెద్ద) సైనిక పటాలాల వారు.
38:14  إِن كُلٌّ إِلَّا كَذَّبَ الرُّسُلَ فَحَقَّ عِقَابِ
వారిలో దైవప్రవక్తలను ధిక్కరించని వారంటూ ఎవరూ లేరు. అందువల్ల నా శిక్ష వారిపై ఖరారు అయ్యింది.
38:15  وَمَا يَنظُرُ هَٰؤُلَاءِ إِلَّا صَيْحَةً وَاحِدَةً مَّا لَهَا مِن فَوَاقٍ
వారు ఒకే ఒక్క కేక కోసం నిరీక్షిస్తున్నారు. అందులో ఎలాంటి తెరిపి కూడా ఉండదు.
38:16  وَقَالُوا رَبَّنَا عَجِّل لَّنَا قِطَّنَا قَبْلَ يَوْمِ الْحِسَابِ
"ప్రభూ! మా (మంచీచెడుల) భాగమేదో లెక్కల దినానికి ముందే మాకు ఇచ్చేయకూడదా?!" అని వారంటున్నారు.
38:17  اصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاذْكُرْ عَبْدَنَا دَاوُودَ ذَا الْأَيْدِ ۖ إِنَّهُ أَوَّابٌ
(ఓ ప్రవక్తా!) వారు చెప్పే మాటలపై ఓపిక పట్టు. మా దాసుడైన దావూదు (అలైహిస్సలాం)ను జ్ఞాపకం చేసుకో! అతడు మహాశక్తిమంతుడు. నిశ్చయంగా అతను (అల్లాహ్‌ వైపునకు) అధికంగా మరలేవాడు.
38:18  إِنَّا سَخَّرْنَا الْجِبَالَ مَعَهُ يُسَبِّحْنَ بِالْعَشِيِّ وَالْإِشْرَاقِ
మేము పర్వతాలను అతని అదుపులోపెట్టాము. అవి అతనితో పాటే సాయంత్రం పూట, ఉదయం పూట (మా) పవిత్రతను కొనియాడేవి.
38:19  وَالطَّيْرَ مَحْشُورَةً ۖ كُلٌّ لَّهُ أَوَّابٌ
అలాగే, పక్షులను కూడా గుమిగూడిన స్థితిలో. అవన్నీ కలసి అతనితో పాటే (దైవం వైపుకు) మరలేవి.
38:20  وَشَدَدْنَا مُلْكَهُ وَآتَيْنَاهُ الْحِكْمَةَ وَفَصْلَ الْخِطَابِ
మేమతని రాజ్యవ్యవస్థను పటిష్ట పరిచాము. అతనికి వివేకాన్ని ప్రసాదించాము. (వివాదాస్పద) విషయాలపై తీర్పు చేయటం (కూడా నేర్పాము).
38:21  وَهَلْ أَتَاكَ نَبَأُ الْخَصْمِ إِذْ تَسَوَّرُوا الْمِحْرَابَ
మరి తగవుపడిన వారి సమాచారంగాని నీకు అందిందా? అప్పుడు వారు గోడదూకి (అతని) ప్రార్థనా గదిలోకి వచ్చేశారు.
38:22  إِذْ دَخَلُوا عَلَىٰ دَاوُودَ فَفَزِعَ مِنْهُمْ ۖ قَالُوا لَا تَخَفْ ۖ خَصْمَانِ بَغَىٰ بَعْضُنَا عَلَىٰ بَعْضٍ فَاحْكُم بَيْنَنَا بِالْحَقِّ وَلَا تُشْطِطْ وَاهْدِنَا إِلَىٰ سَوَاءِ الصِّرَاطِ
వారు దావూదు (అలైహిస్సలాం)ను సమీపించగానే అతను వారి పట్ల భీతి చెందాడు. వారు ఇలా విన్నవించుకున్నారు : "భయపడకండి. మేమిద్దరం తగాదా పడ్డాము. మాలో ఒకరింకొకరిపై అన్యాయానికి పాల్పడ్డారు. కాబట్టి తమరు మా ఇద్దరి మధ్య న్యాయసమ్మతంగా తీర్పుచేయండి. అన్యాయం మాత్రం చేయకండి. మాకు సరైన దారి చూపండి.
38:23  إِنَّ هَٰذَا أَخِي لَهُ تِسْعٌ وَتِسْعُونَ نَعْجَةً وَلِيَ نَعْجَةٌ وَاحِدَةٌ فَقَالَ أَكْفِلْنِيهَا وَعَزَّنِي فِي الْخِطَابِ
"ఇతను నా సోదరుడు. ఇతని దగ్గర తొంభై తొమ్మిది గొర్రెలున్నాయి. నా దగ్గర మాత్రం ఒకే ఒక్క గొర్రె ఉన్నది. అయినా ఈ ఒక్కదానిని కూడా తనకే ఇచ్చేయమని ఇతనంటున్నాడు. వాదనలో నాతో చాలా పరుషంగా వ్యవహరిస్తున్నాడు."
38:24  قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ إِلَىٰ نِعَاجِهِ ۖ وَإِنَّ كَثِيرًا مِّنَ الْخُلَطَاءِ لَيَبْغِي بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَقَلِيلٌ مَّا هُمْ ۗ وَظَنَّ دَاوُودُ أَنَّمَا فَتَنَّاهُ فَاسْتَغْفَرَ رَبَّهُ وَخَرَّ رَاكِعًا وَأَنَابَ ۩
అతను (దావూదు) ఇలా అన్నాడు: "ఇతను తన గొర్రెలతో పాటు నీ గొర్రెనొక్క దానిని కూడా కలుపుకుంటానని అడిగి నీపై అన్యాయానికి ఒడిగడుతున్నాడు. భాగస్వాములలో చాలామంది (ఇలాంటి వారే అయి ఉంటారు. వారు) ఒండొకరిపై అన్యాయానికి పాల్పడుతూ ఉంటారు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మాత్రం అలా చేయరు. కాని అలాంటి వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు." (అంతే!) మేము అతన్ని పరీక్షిస్తున్నామన్న సంగతిని దావూదు గ్రహించాడు. మరి తన ప్రభువును క్షమాభిక్ష కోరసాగాడు. కడుదీనంగా మోకరిల్లాడు. (ఏకాగ్రతతో తన ప్రభువు వైపునకు) మరలాడు.
38:25  فَغَفَرْنَا لَهُ ذَٰلِكَ ۖ وَإِنَّ لَهُ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَآبٍ
మేము కూడా అతని (ఆ తప్పు)ని మన్నించాము. నిశ్చయంగా అతను మా వద్ద సామీప్యం పొందినవాడు, మంచి స్థానం పొందినవాడు.
38:26  يَا دَاوُودُ إِنَّا جَعَلْنَاكَ خَلِيفَةً فِي الْأَرْضِ فَاحْكُم بَيْنَ النَّاسِ بِالْحَقِّ وَلَا تَتَّبِعِ الْهَوَىٰ فَيُضِلَّكَ عَن سَبِيلِ اللَّهِ ۚ إِنَّ الَّذِينَ يَضِلُّونَ عَن سَبِيلِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ بِمَا نَسُوا يَوْمَ الْحِسَابِ
ఓ దావూద్‌! మేము నిన్ను భువిలో వారసుడి (ఖలీఫా)గా చేశాము. కనుక నువ్వు ప్రజల మధ్య సత్య (న్యాయ) బద్ధంగా తీర్పులు ఇస్తూ ఉండు. నీ మనోవాంఛలను అనుసరించకు. అన్యధా అవి నిన్ను అల్లాహ్‌ మార్గం నుంచి తప్పిస్తాయి. అల్లాహ్‌ మార్గం నుంచి తప్పిపోయిన వారికి కఠిన శిక్ష పడటం ఖాయం. ఎందుకంటే వారు లెక్కల దినాన్ని విస్మరించారు.
38:27  وَمَا خَلَقْنَا السَّمَاءَ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا بَاطِلًا ۚ ذَٰلِكَ ظَنُّ الَّذِينَ كَفَرُوا ۚ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِنَ النَّارِ
మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వాటిని లక్ష్య రహితంగా పుట్టించలేదు. ఇది అవిశ్వాసుల ఆలోచన మాత్రమే. కాబట్టి అవిశ్వాసులకు (నరక) అగ్ని నుండి వినాశం తప్పదు.
38:28  أَمْ نَجْعَلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَالْمُفْسِدِينَ فِي الْأَرْضِ أَمْ نَجْعَلُ الْمُتَّقِينَ كَالْفُجَّارِ
ఏమిటి? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని భూమిలో (నిత్యం) కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేసేస్తామా? లేక భయభక్తులు గలవారిని పాపాత్ములతో సమానంగా చేస్తామా?
38:29  كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ
ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము.
38:30  وَوَهَبْنَا لِدَاوُودَ سُلَيْمَانَ ۚ نِعْمَ الْعَبْدُ ۖ إِنَّهُ أَوَّابٌ
మేము దావూదుకు సులైమాను (అనే కొడుకు)ను ప్రసాదించాము. అతను ఎంతో మంచి దాసుడు, (నిత్యం మా వైపుకు) మరలేవాడు.
38:31  إِذْ عُرِضَ عَلَيْهِ بِالْعَشِيِّ الصَّافِنَاتُ الْجِيَادُ
అతని ముందు (ఒకనాడు) సాయం సమయాన అతివేగంగా పరుగెత్తే మేలు జాతి అశ్వాలు తేబడినప్పుడు...
38:32  فَقَالَ إِنِّي أَحْبَبْتُ حُبَّ الْخَيْرِ عَن ذِكْرِ رَبِّي حَتَّىٰ تَوَارَتْ بِالْحِجَابِ
అతనిలా అన్నాడు : "నేను నా ప్రభువు ధ్యానంపై ఈ (మేలు జాతి అశ్వ) సంపద పట్లగల మోజుకు ప్రాధాన్యతనిచ్చాను. ఈలోగా (సూర్యుడు) తెరచాటుకు వెళ్ళి పోయాడు.
38:33  رُدُّوهَا عَلَيَّ ۖ فَطَفِقَ مَسْحًا بِالسُّوقِ وَالْأَعْنَاقِ
"వాటిని మళ్లీ నా దగ్గరకు తీసుకురండి." తరువాత (అతను) వాటి పిక్కలను, మెడలను నిమరసాగాడు.
38:34  وَلَقَدْ فَتَنَّا سُلَيْمَانَ وَأَلْقَيْنَا عَلَىٰ كُرْسِيِّهِ جَسَدًا ثُمَّ أَنَابَ
మేము సులైమానును పరీక్షించాము. అతని సింహాసనంపై ఒక దేహాన్ని పడవేశాము. తరువాత అతను (మా వైపు) మరలాడు.
38:35  قَالَ رَبِّ اغْفِرْ لِي وَهَبْ لِي مُلْكًا لَّا يَنبَغِي لِأَحَدٍ مِّن بَعْدِي ۖ إِنَّكَ أَنتَ الْوَهَّابُ
"ప్రభూ! నన్ను మన్నించు. నాకు తప్ప ఇతరులెవరివల్లా కాని సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా నీవు గొప్ప ప్రదాతవు" అని వేడుకున్నాడు.
38:36  فَسَخَّرْنَا لَهُ الرِّيحَ تَجْرِي بِأَمْرِهِ رُخَاءً حَيْثُ أَصَابَ
అందుచేత మేము గాలిని అతని అదుపాజ్ఞలలో ఉంచాము. అది అతని ఆదేశానుసారం మలయమారుతంలా (వీస్తూ) అతను కోరినచోటికల్లా చేర్చేది.
38:37  وَالشَّيَاطِينَ كُلَّ بَنَّاءٍ وَغَوَّاصٍ
(బలాఢ్యులైన) జిన్నాతులను కూడా (అతని స్వాధీనంలో ఉంచాము), అన్ని రకాల కట్టడాలు కట్టేవారిని, గజ ఈతగాళ్ళను,
38:38  وَآخَرِينَ مُقَرَّنِينَ فِي الْأَصْفَادِ
సంకెళ్ళలో బంధించబడి ఉండే ఇతర జిన్నాతులను కూడా (వశపరచాము).
38:39  هَٰذَا عَطَاؤُنَا فَامْنُنْ أَوْ أَمْسِكْ بِغَيْرِ حِسَابٍ
ఇదీ మా అనుగ్రహం! ఇక నువ్వు (ఎవరికైనా) ఉపకారం చేసినా, ఆపి ఉంచినా నీ నుండి లెక్క తీసుకోబడదు.
38:40  وَإِنَّ لَهُ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَآبٍ
అతనికి మా దగ్గర మంచి సామీప్యం ఉంది. చాలా మంచి గమ్యస్థానం కూడా.
38:41  وَاذْكُرْ عَبْدَنَا أَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الشَّيْطَانُ بِنُصْبٍ وَعَذَابٍ
మా దాసుడైన అయ్యూబ్‌ (అలైహిస్సలాం)ను జ్ఞప్తికి తెచ్చుకో. "షైతాను నన్ను దుఃఖానికి, బాధకు లోను చేశాడు" అని అతను తన ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు,
38:42  ارْكُضْ بِرِجْلِكَ ۖ هَٰذَا مُغْتَسَلٌ بَارِدٌ وَشَرَابٌ
"నీ కాలిని (నేలకేసి) కొట్టు. ఇది స్నానం చేయటానికి, త్రాగటానికి చల్లని నీరు" (అని మేము సూచించాము).
38:43  وَوَهَبْنَا لَهُ أَهْلَهُ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنَّا وَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ
మరి మేమతనికి, అతని పరివారాన్నంతటినీ (తిరిగి) ప్రసాదించాము. వారితో పాటు మరి అంతమందిని కూడా మా (ప్రత్యేక) కృపతో అనుగ్రహించాము - విజ్ఞులకు గుణపాఠం కాగలిగేందుకు!
38:44  وَخُذْ بِيَدِكَ ضِغْثًا فَاضْرِب بِّهِ وَلَا تَحْنَثْ ۗ إِنَّا وَجَدْنَاهُ صَابِرًا ۚ نِّعْمَ الْعَبْدُ ۖ إِنَّهُ أَوَّابٌ
"గడ్డిపరకల కట్టను చేత్తో పట్టుకుని కొట్టు. ప్రమాణ భంగానికి పాల్పడకు" (అని మేమతనికి సెలవిచ్చాము). వాస్తవానికి మేమతన్ని సహనశీలునిగా పొందాము. నిశ్చయంగా అతను మంచి దాసుడు, (ప్రభువు వైపు) అమితంగా మరలేవాడు.
38:45  وَاذْكُرْ عِبَادَنَا إِبْرَاهِيمَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ أُولِي الْأَيْدِي وَالْأَبْصَارِ
ఇంకా మా దాసులైన ఇబ్రాహీము, ఇస్‌హాఖు, యాఖూబు (అలైహిముస్సలాం) లను కూడా జ్ఞాపకం చేసుకో. వారు చేతులు గలవారు, కళ్లుగలవారు.
38:46  إِنَّا أَخْلَصْنَاهُم بِخَالِصَةٍ ذِكْرَى الدَّارِ
మేము వారిని ఒకానొక ప్రత్యేక విషయానికై - అంటే పరలోక స్మరణ నిమిత్తం - ప్రత్యేకించాము.
38:47  وَإِنَّهُمْ عِندَنَا لَمِنَ الْمُصْطَفَيْنَ الْأَخْيَارِ
వారంతా మా వద్ద ఎన్నుకోబడినవారు, ఉత్తములు.
38:48  وَاذْكُرْ إِسْمَاعِيلَ وَالْيَسَعَ وَذَا الْكِفْلِ ۖ وَكُلٌّ مِّنَ الْأَخْيَارِ
ఇస్మాయీల్‌, యసా, జుల్‌ కిఫ్ల్‌ (అలైహిముస్సలాం) లను కూడా జ్ఞాపకం చేసుకో. వారంతా ఉత్తముల సమూహానికి చెందినవారు.
38:49  هَٰذَا ذِكْرٌ ۚ وَإِنَّ لِلْمُتَّقِينَ لَحُسْنَ مَآبٍ
ఇదొక ఉపదేశం. నిశ్చయంగా భక్తి పరాయణుల కోసం చాలా మంచి నివాసముంటుంది.
38:50  جَنَّاتِ عَدْنٍ مُّفَتَّحَةً لَّهُمُ الْأَبْوَابُ
శాశ్వితమైన స్వర్గవనాలున్నాయి. వాటి ద్వారాలు వారికోసం తెరువబడి ఉన్నాయి.
38:51  مُتَّكِئِينَ فِيهَا يَدْعُونَ فِيهَا بِفَاكِهَةٍ كَثِيرَةٍ وَشَرَابٍ
వాటిలో వారు నిక్షేపంగా దిండ్లకు ఆనుకుని, బోలెడు పండ్లను, పానీయాలను తెప్పించుకుంటూ ఉంటారు.
38:52  وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ أَتْرَابٌ
వారి దగ్గర చూపులు క్రిందికి వాలి ఉండే సమవయస్కులైన సుందరీమణులుంటారు.
38:53  هَٰذَا مَا تُوعَدُونَ لِيَوْمِ الْحِسَابِ
ఇదీ లెక్కల దినానికి సంబంధించి మీతో చేయబడిన వాగ్దానం.
38:54  إِنَّ هَٰذَا لَرِزْقُنَا مَا لَهُ مِن نَّفَادٍ
ఇదీ మా ప్రసాదిత ఉపాధి! దీనికి అంతం అంటూ ఉండదు.
38:55  هَٰذَا ۚ وَإِنَّ لِلطَّاغِينَ لَشَرَّ مَآبٍ
ఇదీ (పుణ్యఫలం) సంగతి. మరి తలబిరుసుల కొరకు చాలా చెడ్డ నివాసం ఉంది.
38:56  جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ
(అది) నరకం - దానికి వారు ఆహుతి అవుతారు. (ఆహ్‌!) ఎంతచెడ్డ పాన్పు అది!
38:57  هَٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
ఇదీ (వారి గతి)! దాన్ని వారు రుచి చూడాలి. మరిగే నీళ్లు, చీము నెత్తురు,
38:58  وَآخَرُ مِن شَكْلِهِ أَزْوَاجٌ
అదిగాకుండా, అలాంటివే రకరకాల శిక్షలు ఉంటాయి.
38:59  هَٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۖ لَا مَرْحَبًا بِهِمْ ۚ إِنَّهُمْ صَالُو النَّارِ
ఇదిగో! మీతోపాటే (నరకానికి) ఆహుతి అయ్యే మరో జట్టు వచ్చింది. వారి కొరకు ఎలాంటి స్వాగత సన్నాహాలు లేవు. వారు అగ్నికి ఆహుతి కానున్నారు.
38:60  قَالُوا بَلْ أَنتُمْ لَا مَرْحَبًا بِكُمْ ۖ أَنتُمْ قَدَّمْتُمُوهُ لَنَا ۖ فَبِئْسَ الْقَرَارُ
వారు (తమను పెడత్రోవ పట్టించిన నాయకులను ఉద్దేశించి) ఇలా అంటారు: "కాదు. అసలు స్వాగతానికి నోచుకోనిది మీరే. దీనిని మా ముందు తెచ్చి పెట్టింది కూడా మీరే కదా! కాబట్టి ఉండటానికి బహుచెడ్డ స్థలమే ఉంది."
38:61  قَالُوا رَبَّنَا مَن قَدَّمَ لَنَا هَٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِي النَّارِ
వారు (అనుచరులు ఇంకా) ఇలా అంటారు : "మా ప్రభూ! మా కొరకు ముందు నుంచే (అవిశ్వాస పోకడను) తీసినవారికి నరకయాతనను రెండింతలు చేయి."
38:62  وَقَالُوا مَا لَنَا لَا نَرَىٰ رِجَالًا كُنَّا نَعُدُّهُم مِّنَ الْأَشْرَارِ
వారు (ఇంకా) ఇలా అంటారు : "మనం దుష్టజనులుగా జమ కట్టినవారు మనకిక్కడ కనిపించటం లేదేమిటి?
38:63  أَتَّخَذْنَاهُمْ سِخْرِيًّا أَمْ زَاغَتْ عَنْهُمُ الْأَبْصَارُ
"ఏమిటీ, మనమే వాళ్లను ఆట పట్టించామా? లేక మన చూపులు వారి నుంచి తొలగిపోయాయా?"
38:64  إِنَّ ذَٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ أَهْلِ النَّارِ
నరకవాసుల మధ్య ఈ రకమయిన ఘర్షణ తప్పకుండా జరిగి తీరుతుంది.
38:65  قُلْ إِنَّمَا أَنَا مُنذِرٌ ۖ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ
(ఓ ప్రవక్తా!) వారికిలా చెప్పు : "నేనైతే హెచ్చరించేవాణ్ణి మాత్రమే. ఒక్కడు, తిరుగులేనివాడు అయిన అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడు.
38:66  رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا الْعَزِيزُ الْغَفَّارُ
"ఆయన భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్తానికీ ప్రభువు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి."
38:67  قُلْ هُوَ نَبَأٌ عَظِيمٌ
(ఇంకా ఇలా) చెప్పు: "అది చాలా గొప్ప విషయం.
38:68  أَنتُمْ عَنْهُ مُعْرِضُونَ
"కాని మీరు దాన్ని లక్ష్యపెట్టడం లేదు.
38:69  مَا كَانَ لِيَ مِنْ عِلْمٍ بِالْمَلَإِ الْأَعْلَىٰ إِذْ يَخْتَصِمُونَ
"ఊర్ధ్వలోక సదస్సులో తలెత్తిన వివాదం గురించి నాకేమీ తెలీదు.
38:70  إِن يُوحَىٰ إِلَيَّ إِلَّا أَنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ
"నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే అన్న సందేశమే నా వద్దకు వస్తుంది."
38:71  إِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِّن طِينٍ
నీ ప్రభువు దైవదూతలతో, "నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను" అని అన్నాడు.
38:72  فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ
"నేనతన్ని (సంపూర్ణంగా) తీర్చిదిద్ది, అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు, మీరంతా అతనికి సాష్టాంగ ప్రణామం చేయాలి" (అన్నాడు).
38:73  فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ
అప్పుడు దైవదూతలంతా (ఆదంకు) సాష్టాంగపడ్డారు.
38:74  إِلَّا إِبْلِيسَ اسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
ఇబ్లీసు తప్ప! (అతను మాత్రం సాష్టాంగపడలేదు) వాడు గర్వం ప్రదర్శించి, తిరస్కారుల కోవలో చేరాడు.
38:75  قَالَ يَا إِبْلِيسُ مَا مَنَعَكَ أَن تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَيَّ ۖ أَسْتَكْبَرْتَ أَمْ كُنتَ مِنَ الْعَالِينَ
"ఓ ఇబ్లీస్‌! నేను నా స్వహస్తాలతో సృష్టించిన వానిముందు సాష్టాంగపడకుండా ఏ విషయం నిన్ను ఆపింది? నువ్వు గర్వపడుతున్నావా? లేక నువ్వు ఉన్నత శ్రేణికి చెందినవాడివా?" అని (అల్లాహ్‌) అడిగితే,
38:76  قَالَ أَنَا خَيْرٌ مِّنْهُ ۖ خَلَقْتَنِي مِن نَّارٍ وَخَلَقْتَهُ مِن طِينٍ
"నేను అతనికంటే ఘనుడను. (ఎందుకంటే) నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతన్నేమో మట్టితో సృష్టించావు" అని వాడు సమాధానమిచ్చాడు.
38:77  قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
(అప్పుడు అల్లాహ్‌ ఈ విధంగా) సెలవిచ్చాడు : "నువ్విక్కణ్ణుంచి వెళ్ళిపో. నువ్వు ధూత్కరించబడ్డావు.
38:78  وَإِنَّ عَلَيْكَ لَعْنَتِي إِلَىٰ يَوْمِ الدِّينِ
"తీర్పుదినం వరకూ నీపై నా శాపం ఉంటుంది."
38:79  قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
"ప్రభూ! అలాగయితే వారు తిరిగి లేపబడే రోజు వరకూ నాకు గడువు ఇవ్వు" అని (ఇబ్లీసు) విన్నవించుకోగా,
38:80  قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
"నీకు గడువు ఇవ్వబడింది" అని (అల్లాహ్‌) సెలవిచ్చాడు.
38:81  إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
"సమయం నిర్ధారించబడివున్న రోజు వరకే" (అన్నాడు).
38:82  قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
ఇబ్లీసు పలికాడు: "మరయితే నీ గౌరవమర్యాదల సాక్షిగా (చెబుతున్నాను) - అందరినీ నేను పెడదారి పట్టిస్తాను."
38:83  إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ
"ఎంపిక కాబడిన కొంతమంది నీ దాసులను తప్ప!" (అని అన్నాడు).
38:84  قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ
"సరే! సత్యం మాత్రం ఇదే! నేను సత్యమే పలుకుతాను" అని అల్లాహ్‌ అన్నాడు.
38:85  لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ
"(అదేమిటంటే) నీతోనూ, నిన్ను అనుసరించే వారందరితోనూ నేను నరకాన్ని నింపుతాను" (అని చెప్పాడు).
38:86  قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَا أَنَا مِنَ الْمُتَكَلِّفِينَ
(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : "నేను ఈ పనికిగాను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటంలేదు. ఇంకా - నేను మభ్యపెట్టేవాడిని కూడా కాను.
38:87  إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَالَمِينَ
-"ఇది లోకవాసులందరి కోసం ఆసాంతం ఒక జ్ఞాపిక (హితబోధ).
38:88  وَلَتَعْلَمُنَّ نَبَأَهُ بَعْدَ حِينٍ
"దీని వాస్తవికతను మీరు అనతికాలంలోనే (క్షుణ్ణంగా) తెలుసుకుంటారు."


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.