aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

37. సూరా అస్ సాఫ్ఫాత్

37:1  وَالصَّافَّاتِ صَفًّا
వరుస తీరి నిలబడేవారి (దైవ దూతల) తోడు!
37:2  فَالزَّاجِرَاتِ زَجْرًا
మరి తీవ్రంగా మందలించేవారి తోడు!
37:3  فَالتَّالِيَاتِ ذِكْرًا
మరి (అల్లాహ్‌) ఉపదేశాన్ని పఠించేవారి తోడు!
37:4  إِنَّ إِلَٰهَكُمْ لَوَاحِدٌ
నిస్సందేహంగా మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే.
37:5  رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ
(ఆయన) ఆకాశాలకు, భూమికి, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు, సూర్యోదయ బిందువులకు ప్రభువు.
37:6  إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ
మేము సమీప ఆకాశాన్ని నక్షత్రాల (అందం)తో ముస్తాబు చేశాము.
37:7  وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ
తలబిరుసు అయిన ప్రతి షైతాను బారి నుంచి దాన్ని కాపాడాము.
37:8  لَّا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ
పైలోకాల్లోని దైవదూతల (మాటల)ను వారు (షైతానులు) చెవియొగ్గి కూడా వినలేరు. (ఒకవేళ వారలా చేస్తే) అన్ని వైపుల నుంచీ విసరివేయబడతారు.
37:9  دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
తరిమివేయబడుతూ, మరియు వారి కొరకు శాశ్వతమైన శిక్ష కలదు.
37:10  إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ
ఒకవేళ వారిలో ఎవడయినా ఏదైనా ఒకటీ అరా మాటను ఎగరేసుకుపోయినట్లయితే తక్షణమే మండే ఒక అగ్నిజ్వాల అతన్ని వెంబడిస్తుంది.
37:11  فَاسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَا ۚ إِنَّا خَلَقْنَاهُم مِّن طِينٍ لَّازِبٍ
కాస్త వారిని అడిగి చూడు: వారిని సృష్టించటం కష్టతరమా? లేక (వారు గాకుండా) మేము చేసిన ఇతర సృష్టి కష్టతరమా? మేము వారిని (మనుషులను) బంకమన్నుతో సృష్టించాము.
37:12  بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ
కాదు, నువ్వేమో (వారి తిరస్కార వైఖరిపై) ఆశ్చర్యపోతుంటే, వారేమో ఎగతాళి చేస్తున్నారు.
37:13  وَإِذَا ذُكِّرُوا لَا يَذْكُرُونَ
వారికి నచ్చజెప్పినపుడు ఏమాత్రం పట్టించుకోరు.
37:14  وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ
ఏదైనా మహిమను చూసినప్పుడు, దాన్ని వేళాకోళంగా తీసుకుంటారు.
37:15  وَقَالُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
ఇంకా వారిలా అంటారు : "ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు.
37:16  أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
"ఏమిటీ, మేము మరణించి, మట్టిలో కలిసి, ఎముకలుగా మారిన తరువాత కూడా (మేము నిజంగానే) లేపబడతామా?
37:17  أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ
"మా పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా? (వారు కూడా బ్రతికించబడతారా?)"
37:18  قُلْ نَعَمْ وَأَنتُمْ دَاخِرُونَ
"అవును (లేపబడతారు). మీరు పరాభవంపాలు (కూడా) అవుతారు" అని నువ్వు వారికి చెప్పు.
37:19  فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
అది ఒకే ఒక్క గద్దింపు మాత్రమే. అంతే! వారు (బిక్కబోయి) దిక్కులు చూడటం మొదలెడతారు.
37:20  وَقَالُوا يَا وَيْلَنَا هَٰذَا يَوْمُ الدِّينِ
"అయ్యో! మా పాడుగాను! ఇదే ప్రతిఫలపు దినము (లాగుందే!)" అని అంటారు.
37:21  هَٰذَا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ
"మీరు ధిక్కరిస్తూ వచ్చిన తీర్పుదినం ఇదే" (అని వారితో అనబడుతుంది).
37:22  احْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَأَزْوَاجَهُمْ وَمَا كَانُوا يَعْبُدُونَ
"దుర్మార్గులనూ, వారితో జతకట్టినవారినీ, వారు ఎవరెవరినయితే పూజించేవారో వారందరినీ ప్రోగుచేయండి.
37:23  مِن دُونِ اللَّهِ فَاهْدُوهُمْ إِلَىٰ صِرَاطِ الْجَحِيمِ
అల్లాహ్‌ను వదలిపెట్టి (సుమా)! మరి వారందరికీ జ్వలించే అగ్ని (నరకం) దారి చూపండి.
37:24  وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْئُولُونَ
"అయితే కాస్త వాళ్ళను ఆపండి. వారికి (కొన్ని ముఖ్యమైన) ప్రశ్నలు వేయాల్సివుంది.
37:25  مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
"అవును, మీకేమైపోయిందీ? (ఇప్పుడు) మీరు ఒండొకరికి సహాయం చేసుకోవటం లేదేమిటి?" (అని వారు ప్రశ్నించబడతారు).
37:26  بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ
అది కాదు. ఈ రోజు (వారందరూ) ఆత్మసమర్పణ చేసుకున్నారు.
37:27  وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
వారు ఒకరింకొకరి వైపు తిరిగి ('త్వం' అంటే 'త్వం' అని) ప్రశ్నించుకోసాగారు.
37:28  قَالُوا إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ الْيَمِينِ
"మీరు మా దగ్గరకు కుడి వైపు నుంచి వచ్చేవారు కదా! (ఇప్పుడేమంటారు?)" అని అడుగుతారు.
37:29  قَالُوا بَل لَّمْ تَكُونُوا مُؤْمِنِينَ
వారిలా సమాధానమిస్తారు : "అదేం కాదు. అసలు విశ్వాసం అనేది మీలోనే లేకపోయింది.
37:30  وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَانٍ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَاغِينَ
"మేమెలాంటి పెత్తనమూ మీపై చెలాయించలేదు. నిజానికి మీరే తిరుగుబాటు జనంగా వ్యవహరించారు.
37:31  فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَا ۖ إِنَّا لَذَائِقُونَ
"కనుక మన ప్రభువు వాక్కు ఇప్పుడు మనందరిపై రూఢీ అయిపోయింది. మనమంతా (శిక్షను) రుచి చూడవలసి ఉంది.
37:32  فَأَغْوَيْنَاكُمْ إِنَّا كُنَّا غَاوِينَ
"సరే, మేము మిమ్మల్ని దారి తప్పించాము. మేము సయితం స్వయంగా దారి తప్పినవారము" (అని వారు జవాబు ఇస్తారు).
37:33  فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ
కాబట్టి ఆ రోజు వారంతా శిక్షలో భాగస్తులవుతారు.
37:34  إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ
మేము అపరాధుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తాము.
37:35  إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ
"అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడ"ని వారితో అన్నప్పుడు వారు అహంకారంతో విర్రవీగేవారు.
37:36  وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ
"పిచ్చిపట్టిన ఒక కవి చెప్పినంత మాత్రాన మేము మా పూజ్య దైవాలను వదులుకోవాలా?" అని అనేవారు.
37:37  بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ
(కాదు కాదు) వాస్తవానికి అతను (ప్రవక్త) సత్యాన్నే తీసుకుని వచ్చాడు. దైవప్రవక్తలందరినీ (సత్యవంతులుగా) ధృవీకరిస్తున్నాడు.
37:38  إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ
మీరు మాత్రం బాధాకరమైన శిక్షను చవిచూడటం ఖాయం.
37:39  وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
మీరు చేసుకున్న (పాపిష్టి) పనుల ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది.
37:40  إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
అయితే అల్లాహ్‌ ఎన్నుకున్న దాసులు మాత్రం (ఆ శిక్ష నుంచి సురక్షితంగా ఉంటారు).
37:41  أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
నిర్ధారిత ఆహారం వారికి ప్రత్యేకం.
37:42  فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ
(అందులో రకరకాల) పండ్లు, ఫలాలు ఉంటాయి. వారు అపూర్వంగా సత్కరించబడతారు -
37:43  فِي جَنَّاتِ النَّعِيمِ
అనుగ్రహభరితమైన స్వర్గవనాలలో!
37:44  عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
ఆసనాలపై ఎదురెదురుగా (ఆసీనులై) ఉంటారు.
37:45  يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ
ప్రవహించే మధువులా మధుపాత్రలు వారి ముందు పదే పదే సమర్పించబడుతూ ఉంటాయి.
37:46  بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ
అదెంతో స్వచ్ఛంగా, సేవించేవారికి కమ్మగా ఉంటుంది.
37:47  لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
దానివల్ల (తల) నొప్పి రాదు, మతి చలించటం జరగదు.
37:48  وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ
వారి దగ్గర చూపులు క్రిందికి వాలి ఉండే పెద్ద పెద్ద కన్నులు గల మగువలు ఉంటారు.
37:49  كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
వారు చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన గ్రుడ్డుల మాదిరిగా (కోమలంగా, స్వచ్ఛంగా) ఉంటారు.
37:50  فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَاءَلُونَ
మరి వారు (స్వర్గవాసులు) ఒండొకరి వైపుకు తిరిగి ప్రశ్నలు వేసుకుంటారు.
37:51  قَالَ قَائِلٌ مِّنْهُمْ إِنِّي كَانَ لِي قَرِينٌ
వారిలో ఒకతను ఇలా అంటాడు: "నాకొక స్నేహితుడుండేవాడు.
37:52  يَقُولُ أَإِنَّكَ لَمِنَ الْمُصَدِّقِينَ
"అతను నాతో, 'ఏమిటీ? (ప్రళయ దినం వస్తుందని) ధృవీకరించే వారిలో నువ్వూ చేరిపోయావా?' అని అనేవాడు.
37:53  أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَدِينُونَ
"ఏమిటి, మనం మరణించి, మట్టిలో కలిసి, ఎముకలుగా మారిపోయిన మీదట మాకు ప్రతిఫలం ఇవ్వబడుతుందా?" (అని అనేవాడు).
37:54  قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ
"ఏం? మీరతన్ని తొంగిచూస్తారా?" అంటాడు.
37:55  فَاطَّلَعَ فَرَآهُ فِي سَوَاءِ الْجَحِيمِ
తొంగిచూడగానే అతను నరకం మధ్యలో (కాలుతూ) కనిపిస్తాడు.
37:56  قَالَ تَاللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
అతను (స్వర్గవాసి) ఇలా అంటాడు : "అల్లాహ్‌ సాక్షి! నువ్వు నన్ను కూడా నాశనం చేసి ఉండేవాడివే.
37:57  وَلَوْلَا نِعْمَةُ رَبِّي لَكُنتُ مِنَ الْمُحْضَرِينَ
"నా ప్రభువు అనుగ్రహమే గనక లేకుండా ఉంటే నేను కూడా (నేరస్తులుగా నరకానికి) పట్టి తేబడిన వారిలో ఉండేవాణ్ణి.
37:58  أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
ఆ మొదటి చావే తప్ప మనకిక చావులేదు (అన్నది నిజమేనా?)
37:59  إِلَّا مَوْتَتَنَا الْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
మనకిక శిక్ష కూడా పడదట కదా! (ఇదీ నిజమేనా? అని స్వర్గవాసి తన తోటి సావాసులతో అంటాడు)."
37:60  إِنَّ هَٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِيمُ
నిస్సందేహంగా ఇదే గొప్ప సాఫల్యం.
37:61  لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ الْعَامِلُونَ
ఇటువంటి దాని (సాఫల్యం) కోసం పని చేసేవారు పని చేయాలి.
37:62  أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ
ఈ ఆతిథ్యం మంచిదా? లేక జఖ్ఖూమ్‌ (నరకంలోని జెముడు) వృక్షం (మంచిదా?)
37:63  إِنَّا جَعَلْنَاهَا فِتْنَةً لِّلظَّالِمِينَ
దానిని మేము దుర్మార్గుల కోసం పరీక్షగా చేసి ఉంచాము.
37:64  إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِي أَصْلِ الْجَحِيمِ
నిశ్చయంగా ఆ వృక్షం వేరు నరకం వేరు (అట్టడుగు భాగం) నుంచి మొలకెత్తుతుంది.
37:65  طَلْعُهَا كَأَنَّهُ رُءُوسُ الشَّيَاطِينِ
దాని పండ్ల గుత్తులు షైతానుల తలల మాదిరిగా ఉంటాయి.
37:66  فَإِنَّهُمْ لَآكِلُونَ مِنْهَا فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
మరి (నరకవాసులు) దాన్నుంచే తింటారు. దాంతోనే తమ పొట్టలు నింపుకుంటారు.
37:67  ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ
మరి దానిపైన సలసలా కాగే నీళ్లు త్రాగేందుకు ఇవ్వబడతాయి.
37:68  ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ
మరి వారంతా తరలించబడేది మండే (నరక) అగ్ని వైపునకే.
37:69  إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ
తమ తాతముత్తాతలను వీరు భ్రష్టమార్గంలో నడుస్తుండగా చూశారు.
37:70  فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ
అయినప్పటికీ వారి పాద చిహ్నాలలోనే పరుగులు తీశారు.
37:71  وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ
వీరికి మునుపు కూడా ఎందరో పూర్వీకులు పెడదారి పట్టి ఉన్నారు.
37:72  وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ
వాళ్ల మధ్య కూడా మేము హెచ్చరించే వారిని పంపి ఉన్నాము.
37:73  فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ
మరి హెచ్చరించబడిన వారికి పట్టిన గతేమిటో నువ్వే చూడు!
37:74  إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
అల్లాహ్‌ ఎన్నుకున్నదాసులు తప్ప. (వారు మాత్రం ఆ దుష్పరిణామం నుంచి రక్షించబడ్డారు).
37:75  وَلَقَدْ نَادَانَا نُوحٌ فَلَنِعْمَ الْمُجِيبُونَ
నూహ్‌ మమ్మల్ని పిలిచాడు. మరి మేము (పిలుపుకు) ఎంత చక్కగా బదులు పలుకుతామో (చూడండి!)
37:76  وَنَجَّيْنَاهُ وَأَهْلَهُ مِنَ الْكَرْبِ الْعَظِيمِ
మేము అతన్నీ, అతని ఇంటివారిని ఆ ఘోరమైన ఆపద నుంచి కాపాడాము.
37:77  وَجَعَلْنَا ذُرِّيَّتَهُ هُمُ الْبَاقِينَ
అతని సంతానాన్ని మాత్రమే మేము మిగిలి ఉండేలా చేశాము.
37:78  وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మిగిల్చి ఉంచాము.
37:79  سَلَامٌ عَلَىٰ نُوحٍ فِي الْعَالَمِينَ
సమస్త లోకాలలో నూహుపై శాంతి కలుగుగాక!
37:80  إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
సద్వర్తనులకు మేము ఇలాగే ప్రతిఫలం ప్రసాదిస్తాము.
37:81  إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిశ్చయంగా అతను విశ్వసించిన మా దాసులలోని వాడు.
37:82  ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
అటుపిమ్మట మేము ఇతరులను ముంచివేశాము.
37:83  وَإِنَّ مِن شِيعَتِهِ لَإِبْرَاهِيمَ
అతని (నూహ్‌) మార్గాన్ని అవలంబించిన వారిలో ఇబ్రాహీమ్‌ (కూడా) ఉన్నాడు.
37:84  إِذْ جَاءَ رَبَّهُ بِقَلْبٍ سَلِيمٍ
అతను నిర్మల హృదయంతో తన ప్రభువు వద్దకు వచ్చినప్పుడు...
37:85  إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَاذَا تَعْبُدُونَ
(అతను) తన తండ్రితో, తన జాతి వారితో ఇలా అన్నాడు: "మీరు వేటిని పూజిస్తున్నారు?
37:86  أَئِفْكًا آلِهَةً دُونَ اللَّهِ تُرِيدُونَ
"అల్లాహ్‌ను వదలి స్వయం కల్పిత ఆరాధ్యదైవాలను కోరుకుంటున్నారా?
37:87  فَمَا ظَنُّكُم بِرَبِّ الْعَالَمِينَ
"ఇంతకీ సకల లోకాల ప్రభువు గురించి మీరేమనుకుంటున్నారు?"
37:88  فَنَظَرَ نَظْرَةً فِي النُّجُومِ
తర్వాత అతను నక్షత్రాల వైపు ఒకసారి దృష్టిని సారించాడు.
37:89  فَقَالَ إِنِّي سَقِيمٌ
"నేను రోగగ్రస్తుణ్ణి అయ్యాను" అన్నాడు.
37:90  فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ
అందువల్ల వారంతా ముఖం త్రిప్పుకుని, వెళ్ళిపోయారు.
37:91  فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
అప్పుడతను (మెల్లగా) వారి దేవుళ్ళ వద్దకు వెళ్ళి, 'మీరు తినరేమిటి?' అన్నాడు.
37:92  مَا لَكُمْ لَا تَنطِقُونَ
"అసలు మీకేమైపోయిందీ? మీరు కనీసం మాట్లాడరే?!" (అని అన్నాడు).
37:93  فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ
ఆ తరువాత కుడిచేత్తో వాటిని (ఎడాపెడా) వాయించసాగాడు.
37:94  فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ
వారు (ఆ విగ్రహారాధకులు) అతని దగ్గరకు పరుగులు తీస్తూ వచ్చారు.
37:95  قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
వారితో అతనిలా అన్నాడు: "ఏమిటి? మీరు (మీ స్వహస్తాలతో) చెక్కిన శిలలను పూజిస్తారా?"
37:96  وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
"మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించిన వాడు అల్లాహ్‌యే కదా!"
37:97  قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ
వారిలా అన్నారు : "ఇతని కోసం ఓ కట్టడం (భారీ కొలిమి) నిర్మించండి. ఆ తరువాత ఇతన్ని మండే అగ్ని (గుండం)లో పడవేయండి."
37:98  فَأَرَادُوا بِهِ كَيْدًا فَجَعَلْنَاهُمُ الْأَسْفَلِينَ
వారు అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నదలిచారు. అయితే మేము వారినే బోల్తా కొట్టించాము.
37:99  وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ
అతను (ఇబ్రాహీమ్‌) ఇలా అన్నాడు : "నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు.
37:100  رَبِّ هَبْ لِي مِنَ الصَّالِحِينَ
"నా ప్రభూ! నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు" (అని ప్రార్థించాడు).
37:101  فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ
అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము.
37:102  فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ
మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, "ఒరేయ్‌ చంటీ! నేను నిన్ను 'జిబహ్‌' చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు" అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. "నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్‌ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు" అని ఆ బాలుడు అన్నాడు.
37:103  فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ
మరి వారిరువురూ (దైవాజ్ఞను) శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు.
37:104  وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيمُ
అప్పుడు మేమతన్ని పిలిచాము - "ఓ ఇబ్రాహీం!
37:105  قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
"నువ్వు కలను నిజంచేసి చూపావు." నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.
37:106  إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ
యదార్థానికి అదొక బహిరంగ పరీక్ష!
37:107  وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ
మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము.
37:108  وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
ఇంకా భావి తరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిల్చి ఉంచాము.
37:109  سَلَامٌ عَلَىٰ إِبْرَاهِيمَ
ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక!
37:110  كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాము.
37:111  إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.
37:112  وَبَشَّرْنَاهُ بِإِسْحَاقَ نَبِيًّا مِّنَ الصَّالِحِينَ
మరి మేమతనికి, సద్వర్తనులలో ఒకడైన ఇస్‌హాఖ్‌ ప్రవక్త గురించిన శుభవార్తను ఇచ్చాము.
37:113  وَبَارَكْنَا عَلَيْهِ وَعَلَىٰ إِسْحَاقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِ مُبِينٌ
ఇంకా మేము అతని (ఇబ్రాహీము)పైనా, ఇస్‌హాఖ్‌పైనా శుభాలను కురిపించాము. వారిద్దరి సంతతిలో కొందరు సజ్జనులైతే, మరికొందరు తమ ఆత్మలకు తీరని అన్యాయం చేసుకున్నారు.
37:114  وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
మరి మేము మూసా, హారూనులకు కూడా ఉపకారం చేశాము.
37:115  وَنَجَّيْنَاهُمَا وَقَوْمَهُمَا مِنَ الْكَرْبِ الْعَظِيمِ
వారినీ, వారి జాతివారినీ పెద్ద పీడన నుండి రక్షించాము.
37:116  وَنَصَرْنَاهُمْ فَكَانُوا هُمُ الْغَالِبِينَ
మేము వారికి సహాయపడగా, వారే విజయం సాధించారు.
37:117  وَآتَيْنَاهُمَا الْكِتَابَ الْمُسْتَبِينَ
మరి వారిద్దరికి మేము సవివరమైన (తేటతెల్లమైన) గ్రంథం ప్రసాదించాము.
37:118  وَهَدَيْنَاهُمَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
ఇంకా వారికి రుజుమార్గం వైపు దర్శకత్వం వహించాము.
37:119  وَتَرَكْنَا عَلَيْهِمَا فِي الْآخِرِينَ
రాబోయే తరాలలో వారి కీర్తి మిగిలి ఉండేలా చేశాము.
37:120  سَلَامٌ عَلَىٰ مُوسَىٰ وَهَارُونَ
మూసా, హారూనులపై శాంతి కలుగుగాక!
37:121  إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
నిశ్చయంగా మేము సజ్జనులకు ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
37:122  إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిస్సందేహంగా వారిద్దరూ విశ్వాసులైన మా దాసుల్లో చేరిన వారు.
37:123  وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ
మరి నిశ్చయంగా ఇలియాస్‌ కూడా ప్రవక్తలలోని వాడే.
37:124  إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ
అతను తన జాతి వారితో ఇలా అన్నాడు: "మీరు అల్లాహ్‌కు భయపడరా?
37:125  أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ
"మీరు బాల్‌ (అనే విగ్రహము)ను ప్రార్థిస్తూ, సర్వోత్తమ సృష్టికర్త (అయిన అల్లాహ్‌)ను వదలిపెడుతున్నారేమిటి?
37:126  اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ
అంటే మీ ప్రభువు, మీ తాతముత్తాతల ప్రభువైన అల్లాహ్‌ను"
37:127  فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
కాని వారతన్ని ధిక్కరించారు. కనుక వారు తప్పనిసరిగా (శిక్ష నిమిత్తం) హాజరు పరచబడతారు.
37:128  إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
అల్లాహ్‌ ఎన్నుకున్న దాసులు తప్ప! (వారు మాత్రమే రక్షించబడతారు).
37:129  وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
మేమతని మంచి ప్రస్తావనను భావితరాల వారిలో మిగిల్చి ఉంచాము.
37:130  سَلَامٌ عَلَىٰ إِلْ يَاسِينَ
ఇలియాస్‌పై శాంతి కలుగుగాక!
37:131  إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
సదాచార సంపన్నులకు మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తుంటాము.
37:132  إِنَّهُ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
నిశ్చయంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.
37:133  وَإِنَّ لُوطًا لَّمِنَ الْمُرْسَلِينَ
మరి లూత్‌ కూడా ప్రవక్తలలోని వాడే.
37:134  إِذْ نَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
మేము అతన్నీ, అతని కుటుంబీకులందరినీ కాపాడాము-
37:135  إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
వెనుక ఉండిపోయిన వారితో చేరిన ఆ ముసలావిడను తప్ప!
37:136  ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
ఆ తరువాత మేము ఇతరులందరినీ నాశనం చేసి వేశాము.
37:137  وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
మీరు ప్రభాత సమయాలలో, ఆ ప్రదేశాల మీదుగా సాగిపోతూ ఉంటారు.
37:138  وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
ఇంకా రాత్రివేళల్లో కూడా. అయినా మీరు అర్థం చేసుకోరా?
37:139  وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ
నిస్సందేహంగా యూనుస్‌ (కూడా) మా ప్రవక్తలలోని వాడే.
37:140  إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
అతను (తన జనుల నుండి) పలాయనం చిత్తగించి నిండు నౌక వద్దకు చేరుకున్నప్పుడు,
37:141  فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
చీటీలు వేయటం జరిగింది. చివరకు అతనే ఓడిపోయాడు.
37:142  فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ
తరువాత అతన్ని చేప మ్రింగేసింది. అప్పుడు అతను తన్ను తానే నిందించుకోసాగాడు.
37:143  فَلَوْلَا أَنَّهُ كَانَ مِنَ الْمُسَبِّحِينَ
ఒకవేళ అతను గనక (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే...
37:144  لَلَبِثَ فِي بَطْنِهِ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
పునరుత్థానదినం వరకు చేప కడుపులోనే ఉండిపోయేవాడు.
37:145  فَنَبَذْنَاهُ بِالْعَرَاءِ وَهُوَ سَقِيمٌ
తరువాత మేమతన్ని (సముద్ర తీర) మైదానంలో పడవేశాము. అప్పుడతను అస్వస్థతకు గురై ఉన్నాడు.
37:146  وَأَنبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
అతనికి నీడనిచ్చే ఒక తీగచెట్టును అతనిపై మొలకెత్తించాము.
37:147  وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
మరి మేమతన్ని ఒక లక్షమంది, అంతకన్నా ఎక్కువ మంది వైపుకే (ప్రవక్తగా) పంపాము.
37:148  فَآمَنُوا فَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
వారు విశ్వసించారు. అందువల్ల మేము వారిని కొంత కాలంపాటు సుఖ సౌఖ్యాలతో వర్థిల్లజేశాము.
37:149  فَاسْتَفْتِهِمْ أَلِرَبِّكَ الْبَنَاتُ وَلَهُمُ الْبَنُونَ
వారిని అడుగు: నీ ప్రభువుకు (కేవలం) కుమార్తెలూను, వారికేమో కుమారులా?
37:150  أَمْ خَلَقْنَا الْمَلَائِكَةَ إِنَاثًا وَهُمْ شَاهِدُونَ
పోనీ, మేము దైవదూతలను ఆడవారుగా సృష్టించినప్పుడు వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారా ఏమి?
37:151  أَلَا إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
నిశ్చయంగా వీరు తమ కల్పిత మాటలు చెబుతున్నారు సుమా!
37:152  وَلَدَ اللَّهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
అల్లాహ్‌కు సంతానముంది (అంటున్నారు). వాస్తవానికి వారు అబద్ధమాడుతున్నారు.
37:153  أَصْطَفَى الْبَنَاتِ عَلَى الْبَنِينَ
ఏమిటి? అల్లాహ్‌ (తన కోసం) కొడుకులకు బదులుగా కూతుళ్ళను ఎంపిక చేసుకున్నాడా?
37:154  مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
అసలేమైపోయింది మీకు? ఈ మేరకు ఎలా నిర్ణయిస్తున్నారు?
37:155  أَفَلَا تَذَكَّرُونَ
మీరు ఆ మాత్రం కూడా గ్రహించలేరా?
37:156  أَمْ لَكُمْ سُلْطَانٌ مُّبِينٌ
పోనీ, మీ దగ్గర దానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణం ఏదైనా ఉందా?
37:157  فَأْتُوا بِكِتَابِكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
మరి మీరు సత్యవంతులే అయితే మీ పుస్తకాన్నే తీసుకుని రండి!
37:158  وَجَعَلُوا بَيْنَهُ وَبَيْنَ الْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ الْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
ఆఖరికి వారు అల్లాహ్‌కు - జిన్నాతులకు మధ్య కూడా బంధుత్వ సంబంధాన్ని కల్పించారు. వాస్తవానికి తాము (ఇలాంటి మిథ్యా విశ్వాసం గలవారు శిక్ష నిమిత్తం) హాజరు పరచబడతామన్న సంగతి స్వయంగా జిన్నాతులకు కూడా తెలుసు.
37:159  سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ
(అల్లాహ్‌ విషయంలో) వారు చెప్పే విషయాలకు అల్లాహ్‌ పవిత్రుడు.
37:160  إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
చిత్తశుద్ధిగల అల్లాహ్‌ దాసులు తప్ప (వారు మాత్రమే ఇలాంటి అభూత కల్పనలకు దూరంగా ఉంటారు)!
37:161  فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
నిశ్చయంగా మీరూ, మీ (బూటకపు) దైవాలు (అందరూ ఏకమైనా సరే)
37:162  مَا أَنتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ
ఏ ఒక్కరినీ (అల్లాహ్‌ వైపునుంచి) దారి తప్పించలేరు -
37:163  إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ
నరకాగ్నికి ఆహుతి అయ్యేవానిని తప్ప!
37:164  وَمَا مِنَّا إِلَّا لَهُ مَقَامٌ مَّعْلُومٌ
"మాలో ప్రతి ఒక్కరి స్థానం (శ్రేణి) నిర్ధారితమై ఉంది.
37:165  وَإِنَّا لَنَحْنُ الصَّافُّونَ
"ఇంకా, మేము (దైవారాధన నిమిత్తం) వరుస తీరి నిలబడ్డాము.
37:166  وَإِنَّا لَنَحْنُ الْمُسَبِّحُونَ
"ఆయన (అల్లాహ్‌) పవిత్రతను కొనియాడుతున్నాము" (అని దైవదూతలు పలుకుతారు).
37:167  وَإِن كَانُوا لَيَقُولُونَ
వారు (అవిశ్వాసులు) ఇలా అనేవారు -
37:168  لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ الْأَوَّلِينَ
"మా వద్దనే గనక పూర్వీకుల మాదిరి ఉపదేశం ఉండి ఉంటే...
37:169  لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
"మేము కూడా ఎంపిక చేయబడిన అల్లాహ్‌ దాసులై ఉండే వారము."
37:170  فَكَفَرُوا بِهِ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
కాని (తీరా ఖుర్‌ఆన్‌ వచ్చాక) వారు దానిని తిరస్కరించారు. సరే. తొందరగానే వారు తెలుసుకుంటారు.
37:171  وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ
మా ప్రియతమ దాసులైన ప్రవక్తలకు మేమిచ్చిన మాట ఇంతకుముందే నెరవేరింది.
37:172  إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ
నిశ్చయంగా వారు మాత్రమే విజయం సాధిస్తారు.
37:173  وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ
మరి నిశ్చయంగా మా సైన్యాలే గెలుపొందుతాయి.
37:174  فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
కనుక (ఓ ప్రవక్తా!) కొంతకాలం పాటు వాళ్ళను పట్టించుకోకు.
37:175  وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
మరి వాళ్ళను గమనిస్తూ ఉండు. మున్ముందు (తమకు పట్టే దుర్గతిని) వాళ్ళూ చూసుకుంటారు.
37:176  أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
ఏమిటి? వాళ్లు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా?
37:177  فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ
మరి (వినండి!) మా శిక్ష వారి మైదానంలో వచ్చి వాలినప్పుడు, హెచ్చరించబడిన వారి పాలిట ఆ ఉదయం దారుణంగా ఉంటుంది.
37:178  وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
కనుక (ఓ ప్రవక్తా!) కొన్నాళ్ళపాటు వాళ్ళను గురించి ఆలోచించకు.
37:179  وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
కాకపోతే వాళ్ళను చూస్తూ ఉండు. వాళ్ళు కూడా (త్వరలోనే) చూసుకుంటారు.
37:180  سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ
గౌరవనీయుడగు నీ ప్రభువు, వారు (ముష్రిక్కులు) కల్పించి చెప్పే విషయాలకు అతీతుడు, పరమ పవిత్రుడు.
37:181  وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ
ప్రవక్తలపై శాంతి కురియుగాక!
37:182  وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
సమస్త స్తోత్రాలు సకల లోక ప్రభువైన అల్లాహ్‌కే చెందుతాయి.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.