aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

34. సూరా సబా

34:1  الْحَمْدُ لِلَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَلَهُ الْحَمْدُ فِي الْآخِرَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తానికి యజమాని అయిన అల్లాహ్‌యే సకల స్తోత్రాలకు అర్హుడు. పరలోకంలో కూడా ప్రశంసలు ఆయనకే తగును. ఆయన వివేక సంపన్నుడు, (ప్రతిదీ) తెలిసినవాడు.
34:2  يَعْلَمُ مَا يَلِجُ فِي الْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ السَّمَاءِ وَمَا يَعْرُجُ فِيهَا ۚ وَهُوَ الرَّحِيمُ الْغَفُورُ
భూమిలోనికి వెళ్ళేదీ, దానినుండి వెలువడేదీ, ఆకాశం నుంచి దిగేదీ, అందులోకి ఎక్కిపోయేదీ - అంతా ఆయనకు తెలుసు. ఆయన పరమ కృపాశీలుడు, క్షమాగుణం కలవాడు.
34:3  وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَأْتِينَا السَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّي لَتَأْتِيَنَّكُمْ عَالِمِ الْغَيْبِ ۖ لَا يَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَلَا أَصْغَرُ مِن ذَٰلِكَ وَلَا أَكْبَرُ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
"మాపై ప్రళయం వచ్చిపడదు" అని అవిశ్వాసులు అంటున్నారు. "ఎందుకు రాదు? అగోచరాల జ్ఞాని అయిన నా ప్రభువు సాక్షిగా! అది మీపై తప్పకుండా వస్తుంది. రవ్వంత వస్తువు కూడా - అది ఆకాశాలలో ఉన్నా, భూమిలో ఉన్నా - ఆయన నుండి గోప్యంగా లేదు. దాని కన్నా చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా, ప్రతిదీ ఒక స్పష్టమైన గ్రంథంలో (లిఖిత పూర్వకంగా) ఉంది" అని వారికి చెప్పు.
34:4  لِّيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۚ أُولَٰئِكَ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి (ప్రళయం వస్తుంది). ఇలాంటి వారి కోసమే మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి ఉన్నాయి.
34:5  وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ
మరెవరయితే మా ఆయతులను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశారో వారి కొరకు అత్యంత దుర్భరమైన, బాధాకరమైన శిక్ష ఉంది.
34:6  وَيَرَى الَّذِينَ أُوتُوا الْعِلْمَ الَّذِي أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ هُوَ الْحَقَّ وَيَهْدِي إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ
(ఓ ముహమ్మద్‌-స!) నీ ప్రభువు తరఫున నీపై అవతరించినది (ఆసాంతం) సత్యమని, అది సర్వాధిపతి, స్తోత్రనీయుడైన అల్లాహ్‌ మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తుందన్న సంగతిని జ్ఞానం వొసగబడిన వారు చూస్తారు.
34:7  وَقَالَ الَّذِينَ كَفَرُوا هَلْ نَدُلُّكُمْ عَلَىٰ رَجُلٍ يُنَبِّئُكُمْ إِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ إِنَّكُمْ لَفِي خَلْقٍ جَدِيدٍ
అవిశ్వాసులు ఇలా అనసాగారు: "మీరు పగిలి తునాతునకలై పోయిన తరువాత, మీరు మళ్లీ సరికొత్త సృష్టిలోనికి వస్తారని మీకు సమాచారం అందజేసే వ్యక్తిని మీకు చూపమంటారా?!
34:8  أَفْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَم بِهِ جِنَّةٌ ۗ بَلِ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ فِي الْعَذَابِ وَالضَّلَالِ الْبَعِيدِ
"అతను (స్వయంగానే) అల్లాహ్‌కు అబద్ధాలు ఆపాదిస్తున్నాడో లేక అతనికి పిచ్చిపట్టిందో (మాకు తెలియదు)!" కాదు, (యదార్థమేమిటంటే) పరలోకంపై నమ్మకం లేనివారు మాత్రమే శిక్షకు, బహుదూరపు అపమార్గానికి లోనై ఉన్నారు.
34:9  أَفَلَمْ يَرَوْا إِلَىٰ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ إِن نَّشَأْ نَخْسِفْ بِهِمُ الْأَرْضَ أَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِّنَ السَّمَاءِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّكُلِّ عَبْدٍ مُّنِيبٍ
ఏమిటీ, వారు తమకు ముందూ, వెనుకా ఉన్న ఆకాశాన్ని, భూమిని చూడటం లేదా? మేము గనక తలచుకుంటే వారిని భూమిలో కూరుకుపోయేలా చేయగలము లేదా వారిపై ఆకాశపు తునకను పడవేయగలము. (మనస్ఫూర్తిగా) మరలే ప్రతి దాసునికి ఇందులో సూచన ఉంది.
34:10  وَلَقَدْ آتَيْنَا دَاوُودَ مِنَّا فَضْلًا ۖ يَا جِبَالُ أَوِّبِي مَعَهُ وَالطَّيْرَ ۖ وَأَلَنَّا لَهُ الْحَدِيدَ
ఇంకా మేము దావూదుకు మా తరఫునుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. "ఓ పర్వతాల్లారా! అతనితో కలసి స్తోత్రగానం చేయండి" (అని ఆజ్ఞాపించాము). పక్షులకు కూడా (ఇదే విధంగా ఆదేశించాము). ఇంకా అతని కొరకు మేము ఇనుమును మెత్తబరచాము.
34:11  أَنِ اعْمَلْ سَابِغَاتٍ وَقَدِّرْ فِي السَّرْدِ ۖ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
"పరిపూర్ణమైన కవచాలను నిర్మించు. కడియాలను సరిగ్గా- సమతూకంతో - అమర్చు. ఇంకా, మీరంతా సదాచరణ చేయండి. నేను మీరు చేసేదంతా చూస్తున్నాను (అని నమ్మండి)" అని ఆదేశించాము.
34:12  وَلِسُلَيْمَانَ الرِّيحَ غُدُوُّهَا شَهْرٌ وَرَوَاحُهَا شَهْرٌ ۖ وَأَسَلْنَا لَهُ عَيْنَ الْقِطْرِ ۖ وَمِنَ الْجِنِّ مَن يَعْمَلُ بَيْنَ يَدَيْهِ بِإِذْنِ رَبِّهِ ۖ وَمَن يَزِغْ مِنْهُمْ عَنْ أَمْرِنَا نُذِقْهُ مِنْ عَذَابِ السَّعِيرِ
ఇంకా - మేము సులైమాను కోసం గాలిని అదుపులో ఉంచాము. దాని ప్రొద్దుటి (ప్రయాణ) గమ్యం ఒక మాసానికి, సాయంత్రపు గమ్యం కూడా ఒక మాసానికి సమానంగా ఉండేది. ఇంకా మేము అతని కోసం కరిగిన రాగి ఊటను ప్రవహింపజేశాము. ఇంకా - అతని ప్రభువు ఆజ్ఞపై జిన్నులు అతని చెప్పుచేతల్లో ఉండి, అతని ముందర పనిచేసేవి. వారిలో ఎవరు మా ఆజ్ఞలను ఉల్లంఘించినా మేము వాడికి జ్వలించే అగ్ని శిక్షను చవి చూపిస్తాము.
34:13  يَعْمَلُونَ لَهُ مَا يَشَاءُ مِن مَّحَارِيبَ وَتَمَاثِيلَ وَجِفَانٍ كَالْجَوَابِ وَقُدُورٍ رَّاسِيَاتٍ ۚ اعْمَلُوا آلَ دَاوُودَ شُكْرًا ۚ وَقَلِيلٌ مِّنْ عِبَادِيَ الشَّكُورُ
వారు (ఆ జిన్నులు) అతని కోసం అతను కోరినదల్లా చేసి పెట్టేవారు - (ఉదాహరణకు :) ఎత్తయిన కట్టడాలు, ప్రతిమలు, కోనేరుల్లాంటి గంగాళాలు, పొయ్యిలపైనే స్థిరంగా ఉండే దేగిశాలు. "ఓ దావూదు కుటుంబీకులారా! ఇందుకు కృతజ్ఞతగా సదాచరణ చెయ్యండి." నా దాసులలో కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేవారు బహుకొద్దిమంది మాత్రమే.
34:14  فَلَمَّا قَضَيْنَا عَلَيْهِ الْمَوْتَ مَا دَلَّهُمْ عَلَىٰ مَوْتِهِ إِلَّا دَابَّةُ الْأَرْضِ تَأْكُلُ مِنسَأَتَهُ ۖ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ الْجِنُّ أَن لَّوْ كَانُوا يَعْلَمُونَ الْغَيْبَ مَا لَبِثُوا فِي الْعَذَابِ الْمُهِينِ
మరి మేము అతనిపై మరణ శాసనాన్ని అమలు పరచినప్పుడు, అతని చేతికర్రను తింటూవున్న చీడ పురుగు తప్ప వేరెవరూ అతని చావు కబురును వారికి (జిన్నులకు) తెలియ పరచలేదు. మరి అతను (సులైమాను) పడిపోయినప్పుడు, తమకే గనక రహస్య విషయాల జ్ఞానం ఉండి ఉంటే ఇంతటి అవమానకరమైన యాతనకు లోనయ్యేవారం కాము అని జిన్నులు తెలుసుకున్నారు.
34:15  لَقَدْ كَانَ لِسَبَإٍ فِي مَسْكَنِهِمْ آيَةٌ ۖ جَنَّتَانِ عَن يَمِينٍ وَشِمَالٍ ۖ كُلُوا مِن رِّزْقِ رَبِّكُمْ وَاشْكُرُوا لَهُ ۚ بَلْدَةٌ طَيِّبَةٌ وَرَبٌّ غَفُورٌ
సబా జాతి వారి కొరకు వారి నివాస స్థలంలోనే (దైవ శక్తికి సంబంధించిన) ఒక సూచన ఉండేది. వారికి కుడి వైపునా, ఎడమ వైపునా రెండు తోటలుండేవి. "మీ ప్రభువు ప్రసాదించిన ఉపాధిని తినండి, ఆయనకు కృతజ్ఞులై ఉండండి" (అని మేము వారికి సూచించి ఉన్నాము). పట్నమేమో ఉత్తమమైనది, ప్రభువేమో మన్నించేవాడు.
34:16  فَأَعْرَضُوا فَأَرْسَلْنَا عَلَيْهِمْ سَيْلَ الْعَرِمِ وَبَدَّلْنَاهُم بِجَنَّتَيْهِمْ جَنَّتَيْنِ ذَوَاتَيْ أُكُلٍ خَمْطٍ وَأَثْلٍ وَشَيْءٍ مِّن سِدْرٍ قَلِيلٍ
కాని వారు వైముఖ్య ధోరణిని అవలంబించారు. మేము వారిపై ఉధృతమైన వరద (నీరు)ను పంపాము. ఇంకా మేము వారి (నవనవలాడే) తోటలను రెండు (నాసిరకపు) తోటలుగా మార్చివేశాము. వాటి పండ్లు వగరుగా ఉండేవి. (అందులో ఎక్కువగా) ఝూవుక వృక్షాలు, కొన్ని రేగి చెట్లు ఉండేవి.
34:17  ذَٰلِكَ جَزَيْنَاهُم بِمَا كَفَرُوا ۖ وَهَلْ نُجَازِي إِلَّا الْكَفُورَ
వారి కృతఘ్నతా వైఖరికి బదులుగా మేము ఇచ్చిన ప్రతిఫలం (శిక్ష) ఇది! మా మేళ్ళను మరచిన వారికి మేము ఇలాంటి (కఠిన) శిక్షనే విధిస్తాము.
34:18  وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ الْقُرَى الَّتِي بَارَكْنَا فِيهَا قُرًى ظَاهِرَةً وَقَدَّرْنَا فِيهَا السَّيْرَ ۖ سِيرُوا فِيهَا لَيَالِيَ وَأَيَّامًا آمِنِينَ
మరి మేము వారికీ - మేము శుభాలు ప్రోదిచేసి ఉంచిన పట్టణాలకూ మధ్య దారిలో కానవచ్చే మరికొన్ని జనపదాలను కూడా ఉంచాము. వాటి మధ్య ప్రయాణ మజిలీలను కూడా మేము తగురీతిలో నిర్ధారించాము. "రేయింబవళ్ళు సురక్షితంగా వాటిలో సంచరిస్తూ ఉండండి" (అని వారికి సూచించాము).
34:19  فَقَالُوا رَبَّنَا بَاعِدْ بَيْنَ أَسْفَارِنَا وَظَلَمُوا أَنفُسَهُمْ فَجَعَلْنَاهُمْ أَحَادِيثَ وَمَزَّقْنَاهُمْ كُلَّ مُمَزَّقٍ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
కాని వారు, "మా ప్రభూ! మా ప్రయాణ మజిలీల దూరాలను పెంచు" అని అన్నారు. వారు తమకు తామే అన్యాయం చేసుకున్నందువల్ల మేము వారిని (పూర్వ) గాథలుగా మార్చి వేశాము. వారిని పూర్తిగా చిందరవందర చేసి వేశాము. నిశ్చయంగా సహనం వహించి కృతజ్ఞతలర్పించే ప్రతి ఒక్కరికీ ఇందులో (ఈ వృత్తాంతంలో) ఎన్నో సూచనలున్నాయి.
34:20  وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ إِبْلِيسُ ظَنَّهُ فَاتَّبَعُوهُ إِلَّا فَرِيقًا مِّنَ الْمُؤْمِنِينَ
వారి విషయంలో తాను ఊహించినది నిజమని షైతాను నిరూపించాడు. విశ్వాసులకు చెందిన ఒక సమూహం తప్ప మిగిలిన జనులంతా వాడిని అనుసరించారు.
34:21  وَمَا كَانَ لَهُ عَلَيْهِم مِّن سُلْطَانٍ إِلَّا لِنَعْلَمَ مَن يُؤْمِنُ بِالْآخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِي شَكٍّ ۗ وَرَبُّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ
నిజానికి షైతానుకు వారిపై ఎలాంటి అధికారం లేకుండింది. కాని పరలోకాన్ని విశ్వసించేవారిని మేము పరలోకంపట్ల సంశయానికి గురైన వారినుంచి వేరుపరచటానికి ఇలా చేశాము. నీ ప్రభువు ప్రతి విషయాన్నీ కనిపెట్టుకుని ఉన్నాడు.
34:22  قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు.
34:23  وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ ۚ حَتَّىٰ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ
ఆయన వద్ద - ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప- (ఒకరి) సిఫారసు (ఇంకొకరికి) ఏమాత్రం ఉపకరించదు. తుదకు వారి హృదయాలలోని ఆందోళన తొలగించబడిన తరువాత, "ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి?" అని అడుగుతారు. "సత్యమే పలికాడు. ఆయన మహోన్నతుడు, ఘనాఘనుడు" అని వారు చెబుతారు.
34:24  قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُلِ اللَّهُ ۖ وَإِنَّا أَوْ إِيَّاكُمْ لَعَلَىٰ هُدًى أَوْ فِي ضَلَالٍ مُّبِينٍ
"ఆకాశాల నుంచి, భూమి నుంచీ మీకు ఉపాధిని సమకూర్చే వాడెవడు?" అని వారిని అడుగు. 'అల్లాహ్‌యే' అని వారికి చెప్పు. "మరయితే (వినండి) మేమో లేక మీరో నిశ్చయంగా సన్మార్గంలోనయినా ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టతకైనా లోనై ఉన్నాము" (అని చెప్పండి).
34:25  قُل لَّا تُسْأَلُونَ عَمَّا أَجْرَمْنَا وَلَا نُسْأَلُ عَمَّا تَعْمَلُونَ
"మేము చేసిన తప్పులను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం గానీ, మీ కర్మలను గురించి మమ్మల్ని ప్రశ్నించటంగానీ జరగదు" అని వారికి చెప్పు.
34:26  قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيمُ
"మన ప్రభువు మనందరినీ సమావేశపరచి ఆ తరువాత మన మధ్య సత్యబద్ధంగా తీర్పుచేస్తాడు. ఆయన తీర్పులు చేసేవాడు, సర్వం తెలిసినవాడు" అని చెప్పు.
34:27  قُلْ أَرُونِيَ الَّذِينَ أَلْحَقْتُم بِهِ شُرَكَاءَ ۖ كَلَّا ۚ بَلْ هُوَ اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ
"సరే, మీరు అల్లాహ్‌కు భాగస్వాములుగా ఖరారు చేసి, ఆయనతో కలుపుతున్నటువంటి వారిని కాస్త నాక్కూడా చూపించండి! అలాంటి వారెవరూ లేరు. వాస్తవానికి ఆయనే అల్లాహ్‌- సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
34:28  وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
(ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు.
34:29  وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ
"నువ్వు సత్యవంతుడవే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పు?" అని వారంటున్నారు.
34:30  قُل لَّكُم مِّيعَادُ يَوْمٍ لَّا تَسْتَأْخِرُونَ عَنْهُ سَاعَةً وَلَا تَسْتَقْدِمُونَ
"వాగ్దాన దినం ఖచ్చితంగా నిర్ధారితమై ఉంది. దానికన్నా ఒక ఘడియ కూడా మీరు వెనక్కి జరగలేరు, ముందుకు పోలేరు" అని వారికి చెప్పు.
34:31  وَقَالَ الَّذِينَ كَفَرُوا لَن نُّؤْمِنَ بِهَٰذَا الْقُرْآنِ وَلَا بِالَّذِي بَيْنَ يَدَيْهِ ۗ وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ مَوْقُوفُونَ عِندَ رَبِّهِمْ يَرْجِعُ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ الْقَوْلَ يَقُولُ الَّذِينَ اسْتُضْعِفُوا لِلَّذِينَ اسْتَكْبَرُوا لَوْلَا أَنتُمْ لَكُنَّا مُؤْمِنِينَ
"మేము ఈ ఖుర్‌ఆన్‌నుగానీ, దీనికి పూర్వం వచ్చిన గ్రంథాలనుగానీ ఎట్టి పరిస్థితిలోనూ నమ్మము" అని అవిశ్వాసులు అంటున్నారు. ఈ దుర్మార్గులు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడి, వారు ఒండొకరిని నిందించుకుంటున్నప్పుడు నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది! బలహీనులు పెద్దలమనుకున్న వారినుద్దేశించి, "మీరే గనక లేకుండా ఉంటే మేము విశ్వాసులమై ఉండేవారం" అని అంటారు.
34:32  قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا لِلَّذِينَ اسْتُضْعِفُوا أَنَحْنُ صَدَدْنَاكُمْ عَنِ الْهُدَىٰ بَعْدَ إِذْ جَاءَكُم ۖ بَلْ كُنتُم مُّجْرِمِينَ
"ఏమిటీ, మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన తరువాత దాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? (లేదు కదా!) పైగా మీరంతట మీరే అపరాధానికి ఒడిగట్టారు" అని పెద్దలు బలహీన జనులకు సమాధానమిస్తారు.
34:33  وَقَالَ الَّذِينَ اسْتُضْعِفُوا لِلَّذِينَ اسْتَكْبَرُوا بَلْ مَكْرُ اللَّيْلِ وَالنَّهَارِ إِذْ تَأْمُرُونَنَا أَن نَّكْفُرَ بِاللَّهِ وَنَجْعَلَ لَهُ أَندَادًا ۚ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ وَجَعَلْنَا الْأَغْلَالَ فِي أَعْنَاقِ الَّذِينَ كَفَرُوا ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
మరి (దానికి బదులుగా) ఈ బలహీన ప్రజలు పెద్దలతో ఇలా అంటారు: "(లేదు లేదు) రేయింబవళ్ళు మీరు పన్నిన కుట్ర ఇది! అల్లాహ్‌ను తిరస్కరించమనీ, ఆయనకు సహవర్తులుగా ఇతరులను కల్పించమని మీరు జారీ చేసే ఆజ్ఞలే మా అవిశ్వాసానికి కారణభూతం అయ్యాయి." శిక్షను చూడగానే లోలోపలే వారంతా పశ్చాత్తాపపడతారు. మేము అవిశ్వాసుల మెడలలో ఇనుప పట్టాలు వేస్తాము. వారు చేసుకున్న కర్మల ఫలితమే వారికి ఇవ్వబడుతుంది.
34:34  وَمَا أَرْسَلْنَا فِي قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ
మరి మేము ఏ పట్టణంలో, హెచ్చరించేవాణ్ణి పంపినా అక్కడి సంపన్న వర్గాలవారు, "నీకిచ్చి పంపబడిన దానిని మేము త్రోసి పుచ్చుతున్నాం" అని చెప్పేశారు.
34:35  وَقَالُوا نَحْنُ أَكْثَرُ أَمْوَالًا وَأَوْلَادًا وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
"మేము సిరిసంపదలలో, సంతాన భాగ్యంలో ఎంతో అధికులము. మేము శిక్షించబడటమనేది జరగని పని" అని వారన్నారు.
34:36  قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "నా ప్రభువు తాను కోరిన వారి ఉపాధిని విస్తృతం చేస్తాడు. (తాను కోరిన వారికి) కుంచింప జేస్తాడు. కాని చాలామంది (ఈ యదార్థాన్ని) గ్రహించరు.
34:37  وَمَا أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُم بِالَّتِي تُقَرِّبُكُمْ عِندَنَا زُلْفَىٰ إِلَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَأُولَٰئِكَ لَهُمْ جَزَاءُ الضِّعْفِ بِمَا عَمِلُوا وَهُمْ فِي الْغُرُفَاتِ آمِنُونَ
మీ సిరిసంపదలుగానీ, మీ సంతానంగానీ మా సన్నిధిలో (అంతస్తుల రీత్యా) మిమ్మల్ని ఏమాత్రం దగ్గరకు చేర్చలేవు. అయితే ఎవరైనా విశ్వసించి, సదాచరణ చేస్తే, అటువంటి వారికి వారి ఆచరణకు బదులుగా రెండింతల ప్రతిఫలం ఉంటుంది. వారు ఎత్తయిన మేడలలో సురక్షితంగా ఉంటారు.
34:38  وَالَّذِينَ يَسْعَوْنَ فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ فِي الْعَذَابِ مُحْضَرُونَ
మరెవరయితే మా ఆయతులను లొంగ దీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారో వారు శిక్షకు హాజరుపరచబడతారు.
34:39  قُلْ إِنَّ رَبِّي يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ ۚ وَمَا أَنفَقْتُم مِّن شَيْءٍ فَهُوَ يُخْلِفُهُ ۖ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "నా ప్రభువు తన దాసులలో తాను తలచిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు. మరి తాను తలచిన వారికి కుదిస్తాడు. (అల్లాహ్‌ మార్గంలో) మీరు ఏది ఖర్చు చేసినా ఆయన దానికి (సంపూర్ణ) ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అందరి కన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత.
34:40  وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ يَقُولُ لِلْمَلَائِكَةِ أَهَٰؤُلَاءِ إِيَّاكُمْ كَانُوا يَعْبُدُونَ
ఆ రోజు అల్లాహ్‌ వారందరినీ సమీకరించి, "ఏమిటి, వీళ్లు మిమ్మల్ని పూజించేవారా?" అని దూతలను అడుగుతాడు.
34:41  قَالُوا سُبْحَانَكَ أَنتَ وَلِيُّنَا مِن دُونِهِم ۖ بَلْ كَانُوا يَعْبُدُونَ الْجِنَّ ۖ أَكْثَرُهُم بِهِم مُّؤْمِنُونَ
"(ఓ అల్లాహ్‌!) నీవు పవిత్రుడవు. మా రక్షకుడవు నువ్వు మాత్రమే గాని వీళ్లు కాదు. అసలు వీళ్లు జిన్నులను పూజించే వాళ్ళు. వీరిలో చాలా మంది వాళ్ళనే (జిన్నులనే) నమ్ము కున్నారు" అని వారు సమాధానమిస్తారు.
34:42  فَالْيَوْمَ لَا يَمْلِكُ بَعْضُكُمْ لِبَعْضٍ نَّفْعًا وَلَا ضَرًّا وَنَقُولُ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ النَّارِ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ
కనుక ఈ రోజు మీలో పరస్పరం ఎవరికీ ఎటువంటి లాభాన్ని గానీ, నష్టాన్నిగానీ చేకూర్చే అధికారం లేదు. "మీరు త్రోసి పుచ్చుతూ వచ్చిన అగ్నిశిక్ష రుచి చూడండి" అని మేము దుర్మార్గులతో అంటాము.
34:43  وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَٰذَا إِلَّا رَجُلٌ يُرِيدُ أَن يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُكُمْ وَقَالُوا مَا هَٰذَا إِلَّا إِفْكٌ مُّفْتَرًى ۚ وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
వారి ముందు స్పష్టమైన మా ఆయతులు పఠించబడినప్పుడు, "ఈ వ్యక్తి మిమ్మల్ని మీ తాతముత్తాతల ఆరాధ్య దైవాల నుంచి ఆపదలుస్తున్నాడు (అంతకుమించి మరేమీ లేదు)" అని అంటారు. "ఇదొక కల్పిత అబద్ధం" అని కూడా అంటారు. వాస్తవానికి సత్యం వారివద్దకు వచ్చేసినప్పటికీ "ఇది స్పష్టమైన ఇంద్రజాలం తప్ప మరేమీ కాదు" అని అవిశ్వాసులు అంటారు.
34:44  وَمَا آتَيْنَاهُم مِّن كُتُبٍ يَدْرُسُونَهَا ۖ وَمَا أَرْسَلْنَا إِلَيْهِمْ قَبْلَكَ مِن نَّذِيرٍ
మరి మేము వారికి (మక్కావాసులకు), వారు చదివేందుకు (లోగడ) గ్రంథాలు ఇచ్చి ఉండటంగానీ, నీకు మునుపు వారి వద్దకు పంపటం గానీ జరగలేదు.
34:45  وَكَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَمَا بَلَغُوا مِعْشَارَ مَا آتَيْنَاهُمْ فَكَذَّبُوا رُسُلِي ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
వారి పూర్వీకులు కూడా మా బోధనలను త్రోసిపుచ్చారు. మేము వారికి ప్రసాదించిన దానిలో పదో వంతుకు కూడా వీరు చేరుకోలేదు. మొత్తానికి వారు నా ప్రవక్తలను ధిక్కరించారు. మరి నా శిక్ష ఎంత (కఠినంగా ఉండిందో చూడు!)
34:46  قُلْ إِنَّمَا أَعِظُكُم بِوَاحِدَةٍ ۖ أَن تَقُومُوا لِلَّهِ مَثْنَىٰ وَفُرَادَىٰ ثُمَّ تَتَفَكَّرُوا ۚ مَا بِصَاحِبِكُم مِّن جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ لَّكُم بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيدٍ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "నేను మీకు చేసే ఉపదేశం ఒక్కటే - మీరు అల్లాహ్‌ కోసం (మంకుతనం మాని) ఇద్దరిద్దరు చొప్పున లేదా ఒక్కొక్కరు చొప్పున సంసిద్ధులై ఆలోచించండి - మీ ఈ సహచరునికి ఎలాంటి ఉన్మాదంలేదు, తీవ్రమైన శిక్ష రాకముందే అతడు కేవలం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు" (అన్న సంగతి మీకిట్టే బోధపడుతుంది)."
34:47  قُلْ مَا سَأَلْتُكُم مِّنْ أَجْرٍ فَهُوَ لَكُمْ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
(ఇంకా ఈ విధంగా) చెప్పు: "ఒకవేళ నేను మీ నుండి ఏదన్నా ప్రతిఫలాన్ని ఆపేక్షించి ఉంటే, దాన్ని మీరే ఉంచుకోండి. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఆయన ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడు."
34:48  قُلْ إِنَّ رَبِّي يَقْذِفُ بِالْحَقِّ عَلَّامُ الْغُيُوبِ
(ఈ విధంగా కూడా) చెప్పు: "నా ప్రభువు సత్యాన్ని పంపిస్తున్నాడు. ఆయన అగోచర విషయాలన్నీ తెలిసినవాడు."
34:49  قُلْ جَاءَ الْحَقُّ وَمَا يُبْدِئُ الْبَاطِلُ وَمَا يُعِيدُ
(ఇంకా ఇలా) చెప్పు : "సత్యం వచ్చేసింది. అసత్యం ఇంతకు ముందు కూడా ఏమీ చెయ్యలేకపోయింది. ఇక మీదట కూడా ఏమీ చెయ్యజాలదు."
34:50  قُلْ إِن ضَلَلْتُ فَإِنَّمَا أَضِلُّ عَلَىٰ نَفْسِي ۖ وَإِنِ اهْتَدَيْتُ فَبِمَا يُوحِي إِلَيَّ رَبِّي ۚ إِنَّهُ سَمِيعٌ قَرِيبٌ
(ఇంకా ఈ విధంగా కూడా) చెప్పెయ్యి: "ఒకవేళ నేను గనక పెడదోవ పడితే, నా పెడదోవ (పాపం) నాపైనే పడుతుంది. ఒకవేళ నేను సన్మార్గాన ఉంటే, అది నా ప్రభువు నాకు పంపిన వహీ మూలంగానే. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అతి చేరువలో ఉన్నవాడు."
34:51  وَلَوْ تَرَىٰ إِذْ فَزِعُوا فَلَا فَوْتَ وَأُخِذُوا مِن مَّكَانٍ قَرِيبٍ
వారు (అవిశ్వాసులు) భయకంపితులై, తప్పించుకుని పారిపోయేదిక్కు తోచక, చాలా దగ్గరి స్థలం నుంచే పట్టుబడినప్పుడు నువ్వు చూస్తే (ఎంత బావుండు!)
34:52  وَقَالُوا آمَنَّا بِهِ وَأَنَّىٰ لَهُمُ التَّنَاوُشُ مِن مَّكَانٍ بَعِيدٍ
అప్పుడు వారు, "మేము దీనిని (ఖుర్‌ఆన్‌ను) విశ్వసించాము" అనంటారు. కాని అంత దూరస్థలం నుంచి వారు (ఆశించిన వస్తువును) ఎలా అందుకుంటారు?
34:53  وَقَدْ كَفَرُوا بِهِ مِن قَبْلُ ۖ وَيَقْذِفُونَ بِالْغَيْبِ مِن مَّكَانٍ بَعِيدٍ
అంతకు ముందైతే వాళ్ళు దాన్ని త్రోసిపుచ్చారు. బహుదూరం నుంచి, చూడకుండానే కోతలు కోసేవారు.
34:54  وَحِيلَ بَيْنَهُمْ وَبَيْنَ مَا يَشْتَهُونَ كَمَا فُعِلَ بِأَشْيَاعِهِم مِّن قَبْلُ ۚ إِنَّهُمْ كَانُوا فِي شَكٍّ مُّرِيبٍ
మరి (ఇప్పుడు) వారికీ - వారి ఆకాంక్షలకు మధ్య అడ్డు తెరవేయబడింది. లోగడ వీళ్ళలాంటి వీరి పూర్వీకుల పట్ల కూడా ఈ వ్యవహారమే జరిగింది. వారు కూడా (వీళ్ళ మాదిరిగానే) వ్యాకులపరిచే సంశయంలో పడి ఉండేవారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.