aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

33. సూరా అల్ ఆహ్ జాబ్

33:1  يَا أَيُّهَا النَّبِيُّ اتَّقِ اللَّهَ وَلَا تُطِعِ الْكَافِرِينَ وَالْمُنَافِقِينَ ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
ఓ ప్రవక్తా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండు. అవిశ్వాసులకు, కపటులకు విధేయత చూపకు. నిశ్చయంగా అల్లాహ్‌యే మహాజ్ఞాని, మహావివేకి.
33:2  وَاتَّبِعْ مَا يُوحَىٰ إِلَيْكَ مِن رَّبِّكَ ۚ إِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
నీ ప్రభువు తరఫు నుంచి నీవద్దకు వచ్చే వహీని అనుసరిస్తూ ఉండు. మీరు చేసే ప్రతి పనీ అల్లాహ్‌కు బాగా తెలుసు.
33:3  وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
నువ్వు అల్లాహ్‌ను మాత్రమే నమ్ముకో. కార్యసిద్ధికి అల్లాహ్‌ ఒక్కడే చాలు.
33:4  مَّا جَعَلَ اللَّهُ لِرَجُلٍ مِّن قَلْبَيْنِ فِي جَوْفِهِ ۚ وَمَا جَعَلَ أَزْوَاجَكُمُ اللَّائِي تُظَاهِرُونَ مِنْهُنَّ أُمَّهَاتِكُمْ ۚ وَمَا جَعَلَ أَدْعِيَاءَكُمْ أَبْنَاءَكُمْ ۚ ذَٰلِكُمْ قَوْلُكُم بِأَفْوَاهِكُمْ ۖ وَاللَّهُ يَقُولُ الْحَقَّ وَهُوَ يَهْدِي السَّبِيلَ
ఏ మనిషి శరీరంలోనూ అల్లాహ్‌ రెండు హృదయాలను ఉంచలేదు. మీరు మీ భార్యల్లో ఎవరినయినా మీ తల్లులుగా ప్రకటించినంతమాత్రాన అల్లాహ్‌ వారిని (నిజంగానే) మీ తల్లులుగా చేయలేదు. మీ దత్తపుత్రులను కూడా మీ (కన్న) కొడుకులుగా చేయలేదు. ఇవన్నీ మీ నోటిమాటలే. అల్లాహ్‌ సత్యం పలుకుతున్నాడు. ఆయన (రుజు) మార్గం చూపుతున్నాడు.
33:5  ادْعُوهُمْ لِآبَائِهِمْ هُوَ أَقْسَطُ عِندَ اللَّهِ ۚ فَإِن لَّمْ تَعْلَمُوا آبَاءَهُمْ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ وَمَوَالِيكُمْ ۚ وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُم بِهِ وَلَٰكِن مَّا تَعَمَّدَتْ قُلُوبُكُمْ ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
దత్తపుత్రులను వారి (కన్న) తండ్రుల సంబంధంతోనే పిలవండి. అల్లాహ్‌ దృష్టిలో ఇదే న్యాయం. ఒకవేళ వారి (కన్న) తండ్రులెవరో మీకు తెలీకపోతే, అట్టి పరిస్థితిలో వారు మీ ధార్మిక సోదరులు, స్నేహితులు అవుతారు. మరుపు వల్ల మీచేత ఏదన్నా (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయపూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే. అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు.
33:6  النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ ۖ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ ۗ وَأُولُو الْأَرْحَامِ بَعْضُهُمْ أَوْلَىٰ بِبَعْضٍ فِي كِتَابِ اللَّهِ مِنَ الْمُؤْمِنِينَ وَالْمُهَاجِرِينَ إِلَّا أَن تَفْعَلُوا إِلَىٰ أَوْلِيَائِكُم مَّعْرُوفًا ۚ كَانَ ذَٰلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا
దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. మరి దైవగ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు ఇతర విశ్వాసుల, ముహాజిర్ల కన్నా పరస్పరం ఎక్కువ హక్కుదారులు. ఒకవేళ మీరు మీ స్నేహితుల యెడల సద్వ్యవహారం (ఏదన్నా) చేయదలిస్తే అది వేరే విషయం. ఈ ఉత్తర్వు (దైవ) గ్రంథంలో లిఖితమై ఉంది.
33:7  وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۖ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో) మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము- (ముఖ్యంగా) నీ నుండి, నూహ్‌ నుండి, ఇబ్రాహీం నుండి, మూసా నుండి, మర్యమ్‌ కుమారుడైన ఈసా నుండి. మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము -
33:8  لِّيَسْأَلَ الصَّادِقِينَ عَن صِدْقِهِمْ ۚ وَأَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا أَلِيمًا
అల్లాహ్‌ సత్యవంతులను వారి సత్యత గురించి ప్రశ్నించటానికి. అవిశ్వాసుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
33:9  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ جَاءَتْكُمْ جُنُودٌ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا وَجُنُودًا لَّمْ تَرَوْهَا ۚ وَكَانَ اللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. మీపై సైనిక దళాలు దండెత్తి వచ్చినప్పుడు మేము వాటిపై ప్రచండమైన పెనుగాలిని, మీకు కానరాని సైన్యాలను పంపాము. మీరు చేస్తున్నదంతా అల్లాహ్‌ చూస్తూనే ఉన్నాడు.
33:10  إِذْ جَاءُوكُم مِّن فَوْقِكُمْ وَمِنْ أَسْفَلَ مِنكُمْ وَإِذْ زَاغَتِ الْأَبْصَارُ وَبَلَغَتِ الْقُلُوبُ الْحَنَاجِرَ وَتَظُنُّونَ بِاللَّهِ الظُّنُونَا
(శత్రువులు) మీపైకి పైతట్టునుంచీ, లోతట్టునుంచీ దండెత్తి వచ్చినప్పుడు (మీరు) కళ్ళు తేలవేసినప్పుడు, (మీ) గుండెలు గొంతుల దాకా వచ్చేసినప్పుడు, మీరు అల్లాహ్‌ విషయంలో రకరకాల అనుమానాలకు లోనయ్యారు.
33:11  هُنَالِكَ ابْتُلِيَ الْمُؤْمِنُونَ وَزُلْزِلُوا زِلْزَالًا شَدِيدًا
అప్పుడు విశ్వాసులు పరీక్షించబడ్డారు. తీవ్రంగా కుదిపివేయబడ్డారు.
33:12  وَإِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ مَّا وَعَدَنَا اللَّهُ وَرَسُولُهُ إِلَّا غُرُورًا
ఆ సమయంలో కపటులు, హృదయాలలో (అనుమానపు) రోగం ఉన్నవారు, "అల్లాహ్‌, ఆయన ప్రవక్త మాతో చేసిన వాగ్దానం మోసం తప్ప మరేమీ కాదు" అని చెప్పసాగారు.
33:13  وَإِذْ قَالَت طَّائِفَةٌ مِّنْهُمْ يَا أَهْلَ يَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَارْجِعُوا ۚ وَيَسْتَأْذِنُ فَرِيقٌ مِّنْهُمُ النَّبِيَّ يَقُولُونَ إِنَّ بُيُوتَنَا عَوْرَةٌ وَمَا هِيَ بِعَوْرَةٍ ۖ إِن يُرِيدُونَ إِلَّا فِرَارًا
అప్పుడు వారిలోని ఒక వర్గం ఈ విధంగా గగ్గోలు చెందింది: "ఓ యస్రిబ్‌ (మదీనా) వాసులారా! ఇక మీరిక్కడ ఉండటానికి అవకాశమే లేదు. తిరుగు ముఖం పట్టండి." మరి వారిలోని ఒక బృందం, "మా ఇండ్లు సురక్షితంగా లేవు" అని చెప్పి దైవప్రవక్త (స) నుంచి అనుమతి కోరసాగింది. మరి (చూడబోతే) అవి అభద్రంగా ఏమీలేవు. (అసలు) వారి ఉద్దేశం పలాయనం చిత్తగించాలన్నదే.
33:14  وَلَوْ دُخِلَتْ عَلَيْهِم مِّنْ أَقْطَارِهَا ثُمَّ سُئِلُوا الْفِتْنَةَ لَآتَوْهَا وَمَا تَلَبَّثُوا بِهَا إِلَّا يَسِيرًا
ఒకవేళ (మదీనా) నగరం నలువైపుల నుంచీ (శత్రువులు) చొచ్చుకు వచ్చి, అరాచకం సృష్టించమని వారిని కోరితే దానికి వారు తప్పకుండా అలా చేస్తారు. చాలా కొద్దిగా తప్ప ఆలస్యం చేయరు.
33:15  وَلَقَدْ كَانُوا عَاهَدُوا اللَّهَ مِن قَبْلُ لَا يُوَلُّونَ الْأَدْبَارَ ۚ وَكَانَ عَهْدُ اللَّهِ مَسْئُولًا
ఇదివరకు వారు, తాము వెన్ను చూపము అని అల్లాహ్‌కు మాటిచ్చి ఉన్నారు. అల్లాహ్‌తో చేసిన బాస గురించి తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
33:16  قُل لَّن يَنفَعَكُمُ الْفِرَارُ إِن فَرَرْتُم مِّنَ الْمَوْتِ أَوِ الْقَتْلِ وَإِذًا لَّا تُمَتَّعُونَ إِلَّا قَلِيلًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "మీరు చావు నుండి లేదా వధ బారి నుండి భయపడి పారిపోతే ఈ పారిపోవటం మీకేమాత్రం ప్రయోజనం కలిగించదు. అట్టి పరిస్థితిలో మీరు కొద్దిపాటి ప్రయోజనాన్ని మాత్రమే పొందుతారు.
33:17  قُلْ مَن ذَا الَّذِي يَعْصِمُكُم مِّنَ اللَّهِ إِنْ أَرَادَ بِكُمْ سُوءًا أَوْ أَرَادَ بِكُمْ رَحْمَةً ۚ وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
వారిని అడుగు: "ఒకవేళ అల్లాహ్‌ మీకు ఏదన్నా కీడు కలుగ జేయాలనుకున్నా లేక మీపై దయజూపాలనుకున్నా ఆయన నుండి మిమ్మల్ని కాపాడగలవాడెవడు? (లేక అడ్డుకోగల వాడెవడు?) వారు తమ కోసం అల్లాహ్‌ తప్ప ఏ సంరక్షకుణ్ణీ, ఏ సహాయకుణ్ణీ పొందలేరు.
33:18  قَدْ يَعْلَمُ اللَّهُ الْمُعَوِّقِينَ مِنكُمْ وَالْقَائِلِينَ لِإِخْوَانِهِمْ هَلُمَّ إِلَيْنَا ۖ وَلَا يَأْتُونَ الْبَأْسَ إِلَّا قَلِيلًا
మీలో ఇతరులను అడ్డుకునేవారెవరో, తమ సోదరులనుద్దేశించి, "మా దగ్గరకు వచ్చేయండి" అని చెప్పేవారెవరో అల్లాహ్‌కు (బాగా) తెలుసు. వారు ఎప్పుడో గాని యుద్ధానికి రారు.
33:19  أَشِحَّةً عَلَيْكُمْ ۖ فَإِذَا جَاءَ الْخَوْفُ رَأَيْتَهُمْ يَنظُرُونَ إِلَيْكَ تَدُورُ أَعْيُنُهُمْ كَالَّذِي يُغْشَىٰ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَإِذَا ذَهَبَ الْخَوْفُ سَلَقُوكُم بِأَلْسِنَةٍ حِدَادٍ أَشِحَّةً عَلَى الْخَيْرِ ۚ أُولَٰئِكَ لَمْ يُؤْمِنُوا فَأَحْبَطَ اللَّهُ أَعْمَالَهُمْ ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
వారు మీకు తోడ్పడే విషయంలో (పరమ) పీనాసులు. మరి భయాందోళనల పరిస్థితి ఎదురైనప్పుడు, చచ్చిపోయేవాడు కను గుడ్లు తేలవేసినట్లు, వారు నీ వైపు అదేపనిగా చూడటాన్ని నువ్వు గమనిస్తావు. ఆ తరువాత భయోత్పాతం వీడిపోతున్నప్పుడు, తమ పదునైన నాలుకలతో కోతలు కోస్తూ, నీ దగ్గరకు వస్తారు. విపరీతమైన ధనవ్యామోహం ఉన్నవారు. వారసలు విశ్వసించనే లేదు. అల్లాహ్‌ వారి కర్మలన్నింటినీ వృధా గావించాడు. అలా చేయటం అల్లాహ్‌కు చాలా తేలిక.
33:20  يَحْسَبُونَ الْأَحْزَابَ لَمْ يَذْهَبُوا ۖ وَإِن يَأْتِ الْأَحْزَابُ يَوَدُّوا لَوْ أَنَّهُم بَادُونَ فِي الْأَعْرَابِ يَسْأَلُونَ عَنْ أَنبَائِكُمْ ۖ وَلَوْ كَانُوا فِيكُم مَّا قَاتَلُوا إِلَّا قَلِيلًا
(దండెత్తి వచ్చిన) సైన్యాలు ఇంతవరకూ తిరిగి వెళ్ళలేదనే వారు భావిస్తున్నారు. ఒకవేళ సైన్యాలు(మళ్లీ) వచ్చిపడినట్లయితే, తాము ఎడారుల్లో పల్లెవాసులతోనే ఉండి, మీ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటే బావుండేదే' అని కోరుకుంటారు. ఒకవేళ వారు మీ మధ్యలో వున్నా (ఒరిగేదేమీ లేదు. వారు) అంతంత మాత్రంగానే పోరాడతారు.
33:21  لَّقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا
నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది- అల్లాహ్‌ పట్ల, అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు.
33:22  وَلَمَّا رَأَى الْمُؤْمِنُونَ الْأَحْزَابَ قَالُوا هَٰذَا مَا وَعَدَنَا اللَّهُ وَرَسُولُهُ وَصَدَقَ اللَّهُ وَرَسُولُهُ ۚ وَمَا زَادَهُمْ إِلَّا إِيمَانًا وَتَسْلِيمًا
విశ్వాసులు (అవిశ్వాసుల) సేనలను చూడగానే (అప్రయత్నంగా) ఇలా అన్నారు: "అల్లాహ్‌, ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే. అల్లాహ్‌, ఆయన ప్రవక్త చెప్పింది నిజమే." ఆ సంఘటన వారి విశ్వాసాన్ని, ఆత్మ సమర్పణాభావాన్ని మరింత అధికం చేసింది.
33:23  مِّنَ الْمُؤْمِنِينَ رِجَالٌ صَدَقُوا مَا عَاهَدُوا اللَّهَ عَلَيْهِ ۖ فَمِنْهُم مَّن قَضَىٰ نَحْبَهُ وَمِنْهُم مَّن يَنتَظِرُ ۖ وَمَا بَدَّلُوا تَبْدِيلًا
విశ్వాసులలో కొందరు అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన వారున్నారు. కొందరు తమ వాగ్దానాన్ని నెరవేర్చుకోగా, మరి కొందరు (అవకాశం కోసం) ఎదురు చూస్తున్నారు. వారు (తమ పోరాట స్ఫూర్తిలో) ఎలాంటి మార్పు రానివ్వలేదు.
33:24  لِّيَجْزِيَ اللَّهُ الصَّادِقِينَ بِصِدْقِهِمْ وَيُعَذِّبَ الْمُنَافِقِينَ إِن شَاءَ أَوْ يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
(ఎందుకంటే) అల్లాహ్‌ సత్యవంతులకు వారి సత్యత యొక్క ప్రతిఫలం వొసగటానికి, ఇంకా (అల్లాహ్‌) తాను కోరితే కపటులను శిక్షించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి (ఇదంతా జరిగింది). అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు.
33:25  وَرَدَّ اللَّهُ الَّذِينَ كَفَرُوا بِغَيْظِهِمْ لَمْ يَنَالُوا خَيْرًا ۚ وَكَفَى اللَّهُ الْمُؤْمِنِينَ الْقِتَالَ ۚ وَكَانَ اللَّهُ قَوِيًّا عَزِيزًا
అల్లాహ్‌ అవిశ్వాసులను వారి కోపం (రగులుతున్న) స్థితిలోనే వెనక్కి తరిమాడు. (అక్కడ) వారు ఏ లాభాన్నీ పొందలేదు. విశ్వాసుల పక్షాన యుద్ధం చేయటానికి అల్లాహ్‌యే సరిపోయాడు. అల్లాహ్‌ మహాబలుడు, ప్రాబల్యం కలవాడు.
33:26  وَأَنزَلَ الَّذِينَ ظَاهَرُوهُم مِّنْ أَهْلِ الْكِتَابِ مِن صَيَاصِيهِمْ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ فَرِيقًا تَقْتُلُونَ وَتَأْسِرُونَ فَرِيقًا
వారికి (అంటే అవిశ్వాసులకు) తోడ్పడిన గ్రంథవహులను కూడా అల్లాహ్‌ వారి కోటల నుంచి దించేశాడు. (మీపట్ల) వారి గుండెలలో గుబులును నింపేశాడు. (దాంతో) మీరు వారిలోని ఒక వర్గాన్ని వధించసాగారు, మరో వర్గాన్ని బందీలుగా పట్టుకోసాగారు.
33:27  وَأَوْرَثَكُمْ أَرْضَهُمْ وَدِيَارَهُمْ وَأَمْوَالَهُمْ وَأَرْضًا لَّمْ تَطَئُوهَا ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرًا
ఇంకా ఆయన వారి భూములకు, వారి ఇండ్లకు, వారి సిరిసంపదలకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీరు కాలు మోపని భూమిని కూడా (ఆయన మీ పాదాక్రాంతం చేశాడు). అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు సుమా!
33:28  يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا
ఓ ప్రవక్తా! నీ భార్యలకు ఇలా చెప్పు: "మీరు గనక ప్రాపంచిక జీవితాన్ని, దాని తళుకు బెళుకులను కోరుకుంటూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి, మిమ్మల్ని ఉత్తమరీతిలో సాగనంపుతాను -
33:29  وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا
"కాని ఒకవేళ అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, పరలోక నిలయాన్ని పొందాలన్నదే మీ లక్ష్యమైతే, మీలోని సద్వర్తనుల కోసం అల్లాహ్‌ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు."
33:30  يَا نِسَاءَ النَّبِيِّ مَن يَأْتِ مِنكُنَّ بِفَاحِشَةٍ مُّبَيِّنَةٍ يُضَاعَفْ لَهَا الْعَذَابُ ضِعْفَيْنِ ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
ఓ ప్రవక్త సతీమణులారా! మీలో ఎవరయినాసరే స్పష్టంగా అసభ్యకరమైన చేష్టకి పాల్పడినట్లయితే ఆమెకు రెండింతల శిక్ష విధించబడుతుంది. ఇది అల్లాహ్‌కు చాలా తేలిక.
33:31  وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَا أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا
మరి మీలో ఎవరు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరుస్తారో, సదాచరణ చేస్తారో ఆమెకు మేము రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కోసం మేము గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము.
33:32  يَا نِسَاءَ النَّبِيِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ النِّسَاءِ ۚ إِنِ اتَّقَيْتُنَّ فَلَا تَخْضَعْنَ بِالْقَوْلِ فَيَطْمَعَ الَّذِي فِي قَلْبِهِ مَرَضٌ وَقُلْنَ قَوْلًا مَّعْرُوفًا
ఓ ప్రవక్త సతీమణులారా! మీరు సాధారణ స్త్రీల వంటివారు కారు. మీరు (అల్లాహ్‌కు) భయపడేవారే అయితే సుతిమెత్తని శైలిలో మాట్లాడకండి. దాని వల్ల హృదయంలో (దురాలోచనా) రోగం ఉన్నవాడు అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే ఉత్తమ రీతిలోనే మాట్లాడండి.
33:33  وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّهَ وَرَسُولَهُ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا
మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి. జకాతు ఇస్తూ ఉండండి. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్‌ అభిలాష.
33:34  وَاذْكُرْنَ مَا يُتْلَىٰ فِي بُيُوتِكُنَّ مِنْ آيَاتِ اللَّهِ وَالْحِكْمَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا
మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్‌ ఆయతులను, ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మృదుస్వభావి, అన్నీ తెలిసినవాడు.
33:35  إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالْحَافِظِينَ فُرُوجَهُمْ وَالْحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا
నిశ్చయంగా ముస్లిం పురుషులు - ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు - విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు- విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు - సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు - సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు - అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు - దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు - ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు - కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే పురుషులు - స్మరించే స్త్రీలు - వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
33:36  وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّهُ وَرَسُولُهُ أَمْرًا أَن يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ ۗ وَمَن يَعْصِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ ضَلَّ ضَلَالًا مُّبِينًا
(చూడండి) అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారం లోనయినా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికి గానీ, స్త్రీకి గానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త!).
33:37  وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّهُ أَحَقُّ أَن تَخْشَاهُ ۖ فَلَمَّا قَضَىٰ زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا لِكَيْ لَا يَكُونَ عَلَى الْمُؤْمِنِينَ حَرَجٌ فِي أَزْوَاجِ أَدْعِيَائِهِمْ إِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا
(ఓ ప్రవక్తా! ఆ సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకో) అల్లాహ్‌ అనుగ్రహించిన వ్యక్తితో, నువ్వు సయితం ఉపకారం చేసినవానితో "నువ్వు నీ భార్యను నీ దగ్గరే ఉండనివ్వు, అల్లాహ్‌కు భయపడు" అని చెప్పేవాడివి. కాని అల్లాహ్‌ బయటపెట్టాలని ఉన్న ఒక విషయాన్ని నువ్వు నీ మనసులోనే దాచిపెట్టావు. నువ్వు జనులకు భయపడేవాడివి. నిజానికి నువ్వు భయపడటానికి అల్లాహ్‌యే ఎక్కువ హక్కుదారుడు. మరి జైద్‌ ఆ స్త్రీతో తన లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. దత్తపుత్రులు తమ భార్యల లాంఛనాలన్నీ పూర్తిచేసిన తరువాత (వారికి విడాకులిచ్చిన పిమ్మట) వారి భార్యల (ను వివాహమాడే) విషయంలో ముస్లింలు ఎలాంటి సంకోచానికీ లోనుకాకుండా ఉండేటందుకు మేమిలా చేశాము. అల్లాహ్‌ ఆజ్ఞ అమలు జరిగి తీరవలసిందే.
33:38  مَّا كَانَ عَلَى النَّبِيِّ مِنْ حَرَجٍ فِيمَا فَرَضَ اللَّهُ لَهُ ۖ سُنَّةَ اللَّهِ فِي الَّذِينَ خَلَوْا مِن قَبْلُ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ قَدَرًا مَّقْدُورًا
అల్లాహ్‌ తన ప్రవక్త కోసం నిర్ధారించిన దానిని ప్రవక్త అవలంబించటం ఏ విధంగానూ ఆక్షేపణీయం కాదు. పూర్వం గతించిన వారిలో కూడా దేవుని ఈ సంప్రదాయమే ఉండేది. అల్లాహ్‌ ఆజ్ఞ నిర్ణీత లక్ష్యాలతో కూడుకున్నదై ఉంటుంది.
33:39  الَّذِينَ يُبَلِّغُونَ رِسَالَاتِ اللَّهِ وَيَخْشَوْنَهُ وَلَا يَخْشَوْنَ أَحَدًا إِلَّا اللَّهَ ۗ وَكَفَىٰ بِاللَّهِ حَسِيبًا
వారంతా (దైవప్రవక్తలంతా) అల్లాహ్‌ సందేశాలను అందజేసేవారు. అల్లాహ్‌కు మాత్రమే భయపడేవారు. అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడేవారు కారు. లెక్క తేల్చటానికి అల్లాహ్‌ ఒక్కడే చాలు.
33:40  مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ ۗ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
(ప్రజలారా!) ముహమ్మద్‌ (సఅసం) మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్‌ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.
33:41  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించండి.
33:42  وَسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا
ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి.
33:43  هُوَ الَّذِي يُصَلِّي عَلَيْكُمْ وَمَلَائِكَتُهُ لِيُخْرِجَكُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ وَكَانَ بِالْمُؤْمِنِينَ رَحِيمًا
మీపై తన కరుణానుగ్రహాలను పంపేవాడు ఆయనే. ఇంకా ఆయన దూతలు కూడా (మీపై కారుణ్యం కురవాలని ప్రార్థిస్తారు)- ఆయన మిమ్మల్ని చీకట్ల నుంచి వెలికితీసి వెలుగు వైపుకు తీసుకు వచ్చేటందుకు! అల్లాహ్‌ విశ్వాసుల పాలిట అపార కరుణామయుడు.
33:44  تَحِيَّتُهُمْ يَوْمَ يَلْقَوْنَهُ سَلَامٌ ۚ وَأَعَدَّ لَهُمْ أَجْرًا كَرِيمًا
వారు ఆయన్ని (అల్లాహ్‌ను) కలుసుకున్న రోజున, వారికి 'సలాం'తో స్వాగత సత్కారాలు లభిస్తాయి. వారి కోసం అల్లాహ్‌ గౌరవప్రదమైన పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
33:45  يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا
ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేమే నిన్ను (ప్రవక్తగా ఎన్నుకుని) సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించే వానిగా చేసి పంపాము.
33:46  وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُّنِيرًا
ఇంకా - అల్లాహ్‌ ఆజ్ఞచే ఆయన వైపుకు పిలిచేవానిగా, వెలుగును విరజిమ్మే దీపంగా (చేసి పంపాము).
33:47  وَبَشِّرِ الْمُؤْمِنِينَ بِأَنَّ لَهُم مِّنَ اللَّهِ فَضْلًا كَبِيرًا
విశ్వసించిన వారికి అల్లాహ్‌ తరఫున గొప్ప అనుగ్రహం ఉందన్న శుభవార్తను నువ్వు వారికి వినిపించు.
33:48  وَلَا تُطِعِ الْكَافِرِينَ وَالْمُنَافِقِينَ وَدَعْ أَذَاهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
అవిశ్వాసుల, వంచకుల మాట వినకు. (వారి తరఫున జరిగే) వేధింపులను లెక్కచేయకు. అల్లాహ్‌నే నమ్ముకో. కార్య సాధకునిగా అల్లాహ్‌ (ఒక్కడే) చాలు.
33:49  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نَكَحْتُمُ الْمُؤْمِنَاتِ ثُمَّ طَلَّقْتُمُوهُنَّ مِن قَبْلِ أَن تَمَسُّوهُنَّ فَمَا لَكُمْ عَلَيْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّونَهَا ۖ فَمَتِّعُوهُنَّ وَسَرِّحُوهُنَّ سَرَاحًا جَمِيلًا
ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులైన స్త్రీలను వివాహమాడినపుడు, వారిని తాకకముందే మీరు వారికి విడాకులిస్తే, అట్టి పరిస్థితిలో మీరు లెక్కించే గడువు కాలం (ఇద్దత్‌) పూర్తిచేయమని వారిని కోరే అధికారం మీకు లేదు. కాబట్టి వారికి ఎంతో కొంత ముట్టజెప్పి ఉత్తమ రీతిలో సాగనంపండి.
33:50  يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا أَحْلَلْنَا لَكَ أَزْوَاجَكَ اللَّاتِي آتَيْتَ أُجُورَهُنَّ وَمَا مَلَكَتْ يَمِينُكَ مِمَّا أَفَاءَ اللَّهُ عَلَيْكَ وَبَنَاتِ عَمِّكَ وَبَنَاتِ عَمَّاتِكَ وَبَنَاتِ خَالِكَ وَبَنَاتِ خَالَاتِكَ اللَّاتِي هَاجَرْنَ مَعَكَ وَامْرَأَةً مُّؤْمِنَةً إِن وَهَبَتْ نَفْسَهَا لِلنَّبِيِّ إِنْ أَرَادَ النَّبِيُّ أَن يَسْتَنكِحَهَا خَالِصَةً لَّكَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۗ قَدْ عَلِمْنَا مَا فَرَضْنَا عَلَيْهِمْ فِي أَزْوَاجِهِمْ وَمَا مَلَكَتْ أَيْمَانُهُمْ لِكَيْلَا يَكُونَ عَلَيْكَ حَرَجٌ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
ఓ ప్రవక్తా! నువ్వు మహర్‌ సొమ్మును చెల్లించిన నీ భార్యలను నీ కోసం ధర్మ సమ్మతం చేశాము. ఇంకా - విజయ ప్రాప్తిగా అల్లాహ్‌ నీకు ప్రసాదించిన బానిస స్త్రీలను, నీతోపాటు వలస వచ్చిన నీ పినతండ్రి, పెత్తండ్రి కుమార్తెలను, నీ మేనత్తల పుత్రికలను, నీ మేనమామ కూతుళ్ళను, నీ పిన్నమ్మ, పెద్దమ్మల కుమార్తెలను కూడా నీకు ధర్మసమ్మతం చేశాము. మరి విశ్వసించిన ఒక స్త్రీ తనను తాను దైవప్రవక్తకు అర్పించుకోదలిస్తే- అట్టి పరిస్థితిలో దైవప్రవక్త కూడా ఆమెను పెండ్లాడదలిస్తే- పెండ్లాడవచ్చు. (ఓ ప్రవక్తా!) ఈ మినహాయింపు విశ్వాసులందరికీ కాకుండా నీకొక్కనికే ప్రత్యేకం. సాధారణ ముస్లింలకు వారి భార్యల, వారి బానిస స్త్రీల విషయంలో ఏ ఏ ఆదేశాలను నిర్థారించి ఉన్నామో మాకు బాగా తెలుసు. నీకెలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉండేటందుకే (మేము నీకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాము). అల్లాహ్‌ ఎంతగానో క్షమించేవాడు, మరెంతగానో కరుణించేవాడు.
33:51  تُرْجِي مَن تَشَاءُ مِنْهُنَّ وَتُؤْوِي إِلَيْكَ مَن تَشَاءُ ۖ وَمَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَيْكَ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَن تَقَرَّ أَعْيُنُهُنَّ وَلَا يَحْزَنَّ وَيَرْضَيْنَ بِمَا آتَيْتَهُنَّ كُلُّهُنَّ ۚ وَاللَّهُ يَعْلَمُ مَا فِي قُلُوبِكُمْ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَلِيمًا
(ఓ ముహమ్మద్‌-స! వంతుల విషయంలో) వారిలో నువ్వు కోరినవారిని దూరంగా ఉంచవచ్చు. నువ్వు కోరినవారిని నీ దగ్గర ఉంచుకోవచ్చు. ఒకవేళ నువ్వు దూరంగా ఉంచిన వారిలో కూడా ఎవరినయినా నువ్వు నీ దగ్గరకు పిలుచుకుంటే నీపై ఏ దోషమూ లేదు. దీనిద్వారా వారి కళ్లు చల్లబడతాయనీ, వారు ఆవేదన చెందకుండా ఉంటారనీ, నువ్వు వారికి ఏది ఇచ్చినా దానిపై వారంతా సంతృప్తి చెందుతారని ఎక్కువగా ఆశించవచ్చు. మీ హృదయాలలో ఏముందో అల్లాహ్‌కు (బాగా) తెలుసు. అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు.
33:52  لَّا يَحِلُّ لَكَ النِّسَاءُ مِن بَعْدُ وَلَا أَن تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ إِلَّا مَا مَلَكَتْ يَمِينُكَ ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ رَّقِيبًا
ఇక దీని తరువాత, వేరితర స్త్రీలు నీ కొరకు ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా ఇతర స్త్రీలను భార్యలుగా చేసుకోవటం కూడా నీకు సమ్మతం కాదు - వారి అందచందాలు నీకు ఎంత నచ్చినాసరే! అయితే (విజయ ప్రాప్తిగా) నీ స్వాధీనంలోకి వచ్చినవారైతే అది వేరే విషయం. అల్లాహ్‌ అన్నింటినీ కనిపెట్టుకుని ఉన్నాడు సుమా!
33:53  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَدْخُلُوا بُيُوتَ النَّبِيِّ إِلَّا أَن يُؤْذَنَ لَكُمْ إِلَىٰ طَعَامٍ غَيْرَ نَاظِرِينَ إِنَاهُ وَلَٰكِنْ إِذَا دُعِيتُمْ فَادْخُلُوا فَإِذَا طَعِمْتُمْ فَانتَشِرُوا وَلَا مُسْتَأْنِسِينَ لِحَدِيثٍ ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ يُؤْذِي النَّبِيَّ فَيَسْتَحْيِي مِنكُمْ ۖ وَاللَّهُ لَا يَسْتَحْيِي مِنَ الْحَقِّ ۚ وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَاعًا فَاسْأَلُوهُنَّ مِن وَرَاءِ حِجَابٍ ۚ ذَٰلِكُمْ أَطْهَرُ لِقُلُوبِكُمْ وَقُلُوبِهِنَّ ۚ وَمَا كَانَ لَكُمْ أَن تُؤْذُوا رَسُولَ اللَّهِ وَلَا أَن تَنكِحُوا أَزْوَاجَهُ مِن بَعْدِهِ أَبَدًا ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ عِندَ اللَّهِ عَظِيمًا
ఓ విశ్వాసులారా! మీకు అనుమతి లేనిదే మీరు ప్రవక్త ఇండ్లలోకి వెళ్ళకండి. భోజనార్థం మీకు పిలుపు అందినపుడు మాత్రం వెళ్ళండి. అయితే భోజనం తయారయ్యేవరకు వేచి ఉండే విధంగా కాదు. మరి భోజనం చేసిన వెంటనే బయలుదేరండి. కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోకండి. ఈ రకమయిన మీ ప్రవర్తనవల్ల ప్రవక్తకు బాధ కలుగుతుంది. మొహమాటం కొద్దీ అతను మీకేమీ చెప్పడు. అయితే అల్లాహ్‌ మాత్రం నిజం చెప్పటానికి మొహమాటపడడు. మీరు ప్రవక్త సతీమణులను ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు తెర వెనుక నుంచి అడగండి. మీ ఆంతర్యాల, వారి హృదయాల పరిశుద్ధత కోసం ఇదే సముచితమైన పద్ధతి. దైవప్రవక్తకు మనస్తాపం కలిగించటంగానీ, అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటంగానీ ఎన్నటికీ మీకు ధర్మసమ్మతం కాదు. అల్లాహ్‌ దృష్టిలో ఇది మహా పాతకం (అని తెలుసుకోండి).
33:54  إِن تُبْدُوا شَيْئًا أَوْ تُخْفُوهُ فَإِنَّ اللَّهَ كَانَ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
మీరేదన్నా విషయాన్ని బాహాటం చేసినా లేక గోప్యంగా ఉంచినా - అల్లాహ్‌ మాత్రం ప్రతిదీ తెలిసినవాడు.
33:55  لَّا جُنَاحَ عَلَيْهِنَّ فِي آبَائِهِنَّ وَلَا أَبْنَائِهِنَّ وَلَا إِخْوَانِهِنَّ وَلَا أَبْنَاءِ إِخْوَانِهِنَّ وَلَا أَبْنَاءِ أَخَوَاتِهِنَّ وَلَا نِسَائِهِنَّ وَلَا مَا مَلَكَتْ أَيْمَانُهُنَّ ۗ وَاتَّقِينَ اللَّهَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدًا
ఆ స్త్రీలు (ప్రవక్త సతీమణులు) తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల ఎదుట, తమ సహోదరుల పుత్రుల ఎదుట, తమ అక్కాచెల్లెళ్ళ కొడుకుల ఎదుట, తమతో కలసి మెలసి ఉండే స్త్రీల ఎదుట, తమ యాజమాన్యంలో వున్నవారి (బానిసల, బానిస స్త్రీల) ఎదుట రావటం పాపం కాదు. (మహిళా మణులారా!) అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడు.
33:56  إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి 'సలాములు' పంపుతూ ఉండండి.
33:57  إِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِينًا
అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను బాధించేవారిపై ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్‌ శాపం పడుతుంది. ఇంకా వారి కోసం అత్యంత అవమానకరమైన శిక్ష సిద్ధంగా ఉంది.
33:58  وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا
తప్పు చేయని విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు (చాలా పెద్ద) అభాండాన్ని, స్పష్టమైన పాపభారాన్ని మోసినవారవుతారు.
33:59  يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ وَبَنَاتِكَ وَنِسَاءِ الْمُؤْمِنِينَ يُدْنِينَ عَلَيْهِنَّ مِن جَلَابِيبِهِنَّ ۚ ذَٰلِكَ أَدْنَىٰ أَن يُعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్‌ క్షమించేవాడు, కనికరించేవాడు.
33:60  لَّئِن لَّمْ يَنتَهِ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْمُرْجِفُونَ فِي الْمَدِينَةِ لَنُغْرِيَنَّكَ بِهِمْ ثُمَّ لَا يُجَاوِرُونَكَ فِيهَا إِلَّا قَلِيلًا
ఈ కపటులు, హృదయాలలో రోగమున్నవారు, మదీనాలో తప్పుడు వదంతులను వ్యాపింపజేస్తున్నవారు (ఇప్పటికైనా తమ దుష్ట వైఖరిని) మానుకోకపోతే, (వారికి వ్యతిరేకంగా చర్య తీసుకోవటానికి) మేము నిన్ను వారిపై నియమిస్తాము. ఆ తరువాత వారు కొన్నాళ్ళు మాత్రమే నీతోపాటు ఇక్కడ (ఈ నగరంలో) ఉండగలుగుతారు.
33:61  مَّلْعُونِينَ ۖ أَيْنَمَا ثُقِفُوا أُخِذُوا وَقُتِّلُوا تَقْتِيلًا
వారు శాపగ్రస్తులయ్యారు - ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకోబడతారు. దారుణంగా చంపబడతారు.
33:62  سُنَّةَ اللَّهِ فِي الَّذِينَ خَلَوْا مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ اللَّهِ تَبْدِيلًا
వీరి పూర్వీకుల విషయంలో కూడా అల్లాహ్‌ యొక్క ఈ సంప్రదాయమే ఉండేది. అల్లాహ్‌ సంప్రదాయంలో నువ్వు ఎలాంటి మార్పునూ కానలేవు.
33:63  يَسْأَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّهِ ۚ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ تَكُونُ قَرِيبًا
ప్రళయ ఘడియ గురించి జనులు నిన్ను ప్రశ్నిస్తున్నారు కదూ! 'ఆ సంగతి అల్లాహ్‌కే తెలుసు' అని వారికి చెప్పు. నీకేం తెలుసు? బహుశా ప్రళయం అతి సమీపంలోనే ఉందేమో!
33:64  إِنَّ اللَّهَ لَعَنَ الْكَافِرِينَ وَأَعَدَّ لَهُمْ سَعِيرًا
అల్లాహ్‌ అవిశ్వాసులను శపించాడు. ఇంకా వారి కోసం మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాడు.
33:65  خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ لَّا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا
అందులో వారు ఎల్లకాలం పడి ఉంటారు. వారు ఏ సంరక్షకుణ్ణీ, సహాయకుణ్ణీ పొందలేరు.
33:66  يَوْمَ تُقَلَّبُ وُجُوهُهُمْ فِي النَّارِ يَقُولُونَ يَا لَيْتَنَا أَطَعْنَا اللَّهَ وَأَطَعْنَا الرَّسُولَا
ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింపబడతాయి. అప్పుడు వారు, "అయ్యో! మేము అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బావుండేది?" అని అంటారు.
33:67  وَقَالُوا رَبَّنَا إِنَّا أَطَعْنَا سَادَتَنَا وَكُبَرَاءَنَا فَأَضَلُّونَا السَّبِيلَا
ఇంకా ఇలా అంటారు : "ప్రభూ! మేము మా సర్దారులు, పెద్దలు చెప్పినట్లు విన్నాము. వారు మమ్మల్ని పెడత్రోవ పట్టించారు.
33:68  رَبَّنَا آتِهِمْ ضِعْفَيْنِ مِنَ الْعَذَابِ وَالْعَنْهُمْ لَعْنًا كَبِيرًا
"ప్రభూ! నీవు వారికి రెండింతల శిక్షను విధించు. వారిపై పెద్ద శాపాన్ని అవతరింపజెయ్యి."
33:69  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَكُونُوا كَالَّذِينَ آذَوْا مُوسَىٰ فَبَرَّأَهُ اللَّهُ مِمَّا قَالُوا ۚ وَكَانَ عِندَ اللَّهِ وَجِيهًا
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు మూసాను కష్టపెట్టిన వారి మాదిరిగా తయారవకండి. మరి వారు అన్న మాట నుంచి అల్లాహ్‌ అతన్ని-మచ్చలేని వానిగా - నిగ్గుతేల్చాడు. అతను అల్లాహ్‌ దృష్టిలో ఎంతో ఆదరణీయుడుగా ఉండేవాడు.
33:70  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).
33:71  يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا
తద్వారా అల్లాహ్‌ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు.
33:72  إِنَّا عَرَضْنَا الْأَمَانَةَ عَلَى السَّمَاوَاتِ وَالْأَرْضِ وَالْجِبَالِ فَأَبَيْنَ أَن يَحْمِلْنَهَا وَأَشْفَقْنَ مِنْهَا وَحَمَلَهَا الْإِنسَانُ ۖ إِنَّهُ كَانَ ظَلُومًا جَهُولًا
మేము మా అప్పగింత(అమానతు)ను ఆకాశాల ముందూ, భూమి ముందూ, పర్వతాల ముందూ ఉంచాము. కాని అవన్నీ దాన్ని మోయటానికి నిరాకరించాయి. దానికి భయపడిపోయాయి. (అయితే) మానవుడు మాత్రం దాన్ని ఎత్తుకున్నాడు. అవును, వాడు అక్రమానికి ఒడిగట్టేవాడు, మూర్ఖుడు.
33:73  لِّيُعَذِّبَ اللَّهُ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ وَيَتُوبَ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
అల్లాహ్‌ కపటులైన పురుషులను, కపటులైన స్త్రీలను, ముష్రిక్కులైన పురుషులను, ముష్రిక్కులైన స్త్రీలను శిక్షించటానికి, విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి (ఇదంతా జరిగింది). అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.