Translation
| 32. సూరా అస్ సజ్ ద హ్ 32:1 الم అలిఫ్ - లామ్ - మీమ్. 32:2 تَنزِيلُ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ الْعَالَمِينَ (ఇది) సర్వలోకాల ప్రభువు తరఫున అవతరింపజేయబడిన గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. 32:3 أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۚ بَلْ هُوَ الْحَقُّ مِن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَهْتَدُونَ ఏమిటీ, ఇతను (ప్రవక్త) స్వయంగా దీనిని కల్పించుకున్నాడని వారంటున్నారా? (ముమ్మాటికీ కాదు) వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం - నీకు పూర్వం హెచ్చరించే వాడెవడూ రాని వారిని నువ్వు హెచ్చరించటానికి, తద్వారా వారు సన్మార్గానికి రావటానికిగాను (ఇది పంపబడినది). 32:4 اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ مَا لَكُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا شَفِيعٍ ۚ أَفَلَا تَتَذَكَّرُونَ అల్లాహ్‌యే ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని (అర్ష్‌ను) అధిష్టించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడూ, మరే సిఫారసు చేసేవాడూ లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటీ? 32:5 يُدَبِّرُ الْأَمْرَ مِنَ السَّمَاءِ إِلَى الْأَرْضِ ثُمَّ يَعْرُجُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ أَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ ఆయనే ఆకాశాలు మొదలుకుని భూమి వరకు (ప్రతి) పనిని నడుపుతున్నాడు. మరి అది (ఆ పని) మీరు లెక్కించే వెయ్యి సంవత్సరాలంతటి ఒకానొక రోజున పైకి ఆయన వద్దకు చేరిపోతుంది. 32:6 ذَٰلِكَ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْعَزِيزُ الرَّحِيمُ ఆయనే గోప్యంగా, బహిర్గతంగా ఉన్న వాటిని ఎరిగినవాడు- అపార శక్తిసంపన్నుడు, అనంత కరుణామయుడు. 32:7 الَّذِي أَحْسَنَ كُلَّ شَيْءٍ خَلَقَهُ ۖ وَبَدَأَ خَلْقَ الْإِنسَانِ مِن طِينٍ ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టిని మట్టితో మొదలుపెట్టాడు. 32:8 ثُمَّ جَعَلَ نَسْلَهُ مِن سُلَالَةٍ مِّن مَّاءٍ مَّهِينٍ ఆ తరువాత అతని సంతతిని అత్యంత అల్పమైన నీటి సారం (వీర్యం)తో కొనసాగించాడు. 32:9 ثُمَّ سَوَّاهُ وَنَفَخَ فِيهِ مِن رُّوحِهِ ۖ وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ ఆ తరువాత తగు రీతిలో దానిని మలచి, అందులో తన వద్ద నుండి ఆత్మను ఊదాడు. మరి ఆయనే మీ చెవులను, కళ్లను, హృదయాలను చేశాడు. (ఈ ఉపకారాలకు కూడా) మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువే. 32:10 وَقَالُوا أَإِذَا ضَلَلْنَا فِي الْأَرْضِ أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۚ بَلْ هُم بِلِقَاءِ رَبِّهِمْ كَافِرُونَ "ఏమిటీ, మేము మట్టిలో కలసి, మాయమయిపోయిన తరువాత కూడా మళ్లీ సరికొత్తగా సృష్టించబడతామా?" అని అంటారు. అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభువును కలుసుకోవటాన్ని త్రోసిపుచ్చుతున్నారు. 32:11 قُلْ يَتَوَفَّاكُم مَّلَكُ الْمَوْتِ الَّذِي وُكِّلَ بِكُمْ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "మీపై నియమించబడివున్న మృత్యుదూత మీ ప్రాణాలను వశపరచుకుంటాడు. ఆ తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు." 32:12 وَلَوْ تَرَىٰ إِذِ الْمُجْرِمُونَ نَاكِسُو رُءُوسِهِمْ عِندَ رَبِّهِمْ رَبَّنَا أَبْصَرْنَا وَسَمِعْنَا فَارْجِعْنَا نَعْمَلْ صَالِحًا إِنَّا مُوقِنُونَ అపరాధులు తమ ప్రభువు సమక్షంలో తలలు వంచుకుని ఉండటాన్ని నువ్వు చూస్తే ఎంత బావుంటుంది! (వారిలా అంటారు): "మా ప్రభూ! మేమంతా చూసుకున్నాము. (అంతా) విన్నాము. ఇక మమ్మల్ని తిరిగి పంపించు. (ఇక నుంచి) మేము సత్కార్యాలు చేస్తాము. మాకిక పూర్తి నమ్మకం కలిగింది." 32:13 وَلَوْ شِئْنَا لَآتَيْنَا كُلَّ نَفْسٍ هُدَاهَا وَلَٰكِنْ حَقَّ الْقَوْلُ مِنِّي لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ మేము గనక తలచుకుంటే, ప్రతి ఒక్కరికీ సన్మార్గం ప్రసాదించి ఉండేవాళ్ళం. అయితే, "నేను నరకాన్ని జిన్నులతోనూ, మనుషులతోనూ తప్పకుండా నింపుతాను" అన్న నా మాట నిజమయింది. 32:14 فَذُوقُوا بِمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا إِنَّا نَسِينَاكُمْ ۖ وَذُوقُوا عَذَابَ الْخُلْدِ بِمَا كُنتُمْ تَعْمَلُونَ ఇక మీరు, మీకు చెందిన ఈనాటి సమావేశాన్ని విస్మరించినందుకు (శిక్ష) రుచిని చూడండి. మేము కూడా మిమ్మల్ని విస్మరించాము. ఇక మీరు చేసుకున్న చేష్టలకు (పర్యవసానంగా) శాశ్వతమైన శిక్ష రుచిచూడండి. 32:15 إِنَّمَا يُؤْمِنُ بِآيَاتِنَا الَّذِينَ إِذَا ذُكِّرُوا بِهَا خَرُّوا سُجَّدًا وَسَبَّحُوا بِحَمْدِ رَبِّهِمْ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ ۩ మా ఆయతులు బోధించబడినప్పుడు సజ్దాలో పడిపోయేవారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడేవారు, గర్వపడనివారు మాత్రమే మా సూక్తులను నమ్ముతారు. 32:16 تَتَجَافَىٰ جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దానినుండి ఖర్చుపెడతారు. 32:17 فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు. 32:18 أَفَمَن كَانَ مُؤْمِنًا كَمَن كَانَ فَاسِقًا ۚ لَّا يَسْتَوُونَ ఏమిటి? విశ్వసించిన వ్యక్తిని అవిధేయునితో సరిపోల్చటం తగునా? వారిద్దరు ఎన్నటికీ సమానులు కాజాలరు. 32:19 أَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ جَنَّاتُ الْمَأْوَىٰ نُزُلًا بِمَا كَانُوا يَعْمَلُونَ ఎవరు విశ్వసించి, సత్కార్యాలు కూడా చేశారో వారు చేసుకున్న కర్మలకు బదులుగా వారికి శాశ్వతమైన స్వర్గనివాసం ఆతిథ్యంగా లభిస్తుంది. 32:20 وَأَمَّا الَّذِينَ فَسَقُوا فَمَأْوَاهُمُ النَّارُ ۖ كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا وَقِيلَ لَهُمْ ذُوقُوا عَذَابَ النَّارِ الَّذِي كُنتُم بِهِ تُكَذِّبُونَ మరెవరు అవిధేయతకు ఒడిగట్టారో వారి నివాసస్థలం నరకం అవుతుంది. దాన్నుంచి బయటపడేందుకు వారు ప్రయత్నించినప్పుడల్లా అందులోనికే నెట్టివేయబడతారు. "మీరు తిరస్కరిస్తూ ఉండిన అగ్ని శిక్షను చవిచూడండి" అని వారితో అనబడుతుంది. 32:21 وَلَنُذِيقَنَّهُم مِّنَ الْعَذَابِ الْأَدْنَىٰ دُونَ الْعَذَابِ الْأَكْبَرِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ఆ పెద్ద శిక్షకు ముందు మేము వారికి సమీపంలోని కొన్ని (చిన్నపాటి) శిక్షల రుచి తప్పకుండా చూపిస్తూ ఉంటాము- (ఆ విధంగానయినా) వారు దారికి వస్తారని! 32:22 وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْهَا ۚ إِنَّا مِنَ الْمُجْرِمِينَ مُنتَقِمُونَ తన ప్రభువు ఆయతుల ఆధారంగా బోధపరచినప్పటికీ వాటి నుండి ముఖం త్రిప్పుకుపోయిన వాని కంటే దుర్మార్గుడెవడుంటాడు? మేము కూడా (అలాంటి) పాపాత్ములకు తప్పకుండా ప్రతీకారం చేస్తాము. 32:23 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَلَا تَكُن فِي مِرْيَةٍ مِّن لِّقَائِهِ ۖ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ నిశ్చయంగా మేము మూసాకు గ్రంథం వొసగి ఉన్నాము. కాబట్టి అతన్ని కలుసుకునే విషయంలో నువ్వు ఏమాత్రం సంశయంలో పడకూడదు. మేము దానిని ఇస్రాయీల్ సంతతి వారికోసం మార్గదర్శక సాధనంగా చేశాము. 32:24 وَجَعَلْنَا مِنْهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا لَمَّا صَبَرُوا ۖ وَكَانُوا بِآيَاتِنَا يُوقِنُونَ మరి వారు సహన స్థయిర్యాలను కనబరచినప్పుడు, మా ఆదేశానుసారం జనులకు మార్గదర్శకత్వం వహించే నాయకులను మేము వారిలో చేశాము. వారు మా ఆయతులపై దృఢ విశ్వాసం కలిగి ఉండేవారు. 32:25 إِنَّ رَبَّكَ هُوَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ వారు పరస్పరం విభేదించుకుంటున్న విషయాలపై ప్రళయ దినాన నీ ప్రభువు వారి మధ్య (తప్పకుండా) తీర్పు చేస్తాడు. 32:26 أَوَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ ۖ أَفَلَا يَسْمَعُونَ ఏమిటీ, మేము వారికి పూర్వం ఎన్నో సమాజాలను తుద ముట్టించిన సంగతి కూడా వారికి సన్మార్గం చూపలేదా? మరి (చూడబోతే) వాళ్ళు నివసించిన స్థలాలలోకి వారు వస్తూ పోతూనే ఉన్నారు. నిశ్చయంగా ఇందులో (గొప్ప) సూచనలున్నాయి. అయినప్పటికీ వారు వినరా? 32:27 أَوَلَمْ يَرَوْا أَنَّا نَسُوقُ الْمَاءَ إِلَى الْأَرْضِ الْجُرُزِ فَنُخْرِجُ بِهِ زَرْعًا تَأْكُلُ مِنْهُ أَنْعَامُهُمْ وَأَنفُسُهُمْ ۖ أَفَلَا يُبْصِرُونَ ఏమిటీ, వీళ్లు గమనించటం లేదా? - మేము నీళ్ళను బంజరు భూమి వైపుకు ప్రవహింపజేస్తూ తీసుకుపోతున్నాము, మరి దాని ద్వారా పంటలను వెలికి తీస్తున్నాము. వాటిని వారి పశువులూ తింటున్నాయి. స్వయంగా వారు కూడా (తింటున్నారు). అయినా వాళ్ళు దృష్టిని సారించరా? 32:28 وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْفَتْحُ إِن كُنتُمْ صَادِقِينَ "ఇంతకీ ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? మీరు సత్యవంతులే అయితే (చెప్పండి)" అని వారంటున్నారు. 32:29 قُلْ يَوْمَ الْفَتْحِ لَا يَنفَعُ الَّذِينَ كَفَرُوا إِيمَانُهُمْ وَلَا هُمْ يُنظَرُونَ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "తీర్పు జరిగే దినాన విశ్వసించటం అవిశ్వాసులకు ఏ విధంగానూ ఉపకరించదు. వారికి గడువు కూడా ఇవ్వబడదు." 32:30 فَأَعْرِضْ عَنْهُمْ وَانتَظِرْ إِنَّهُم مُّنتَظِرُونَ కనుక (ఓ ముహమ్మద్ - స!) వాళ్ళ సంగతిని వదలిపెట్టు. నిరీక్షించు. వాళ్ళు కూడా నిరీక్షిస్తున్నారు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |