aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

31. సూరా లుక్మాన్

31:1  الم
అలిఫ్‌ - లామ్‌ - మీమ్‌.
31:2  تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ
ఇవి వివేకంతో కూడిన గ్రంథ వాక్యాలు.
31:3  هُدًى وَرَحْمَةً لِّلْمُحْسِنِينَ
సద్వర్తనుల కొరకు మార్గదర్శకం, (నిలువెల్లా) కారుణ్యం.
31:4  الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ
వారు (ఆ సద్వర్తనులు) నమాజులను నెలకొల్పుతారు. జకాతు ఇస్తూ ఉంటారు. పరలోకంపై (పూర్తి) విశ్వాసం కలిగి ఉంటారు.
31:5  أُولَٰئِكَ عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
వారే తమ ప్రభువు తరఫు నుంచి సన్మార్గంపై ఉన్నవారు. వారే సాఫల్యం పొందేవారు.
31:6  وَمِنَ النَّاسِ مَن يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّخِذَهَا هُزُوًا ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ
జ్ఞానంతో నిమిత్తం లేకుండానే ప్రజలను అల్లాహ్‌ మార్గం నుంచి తప్పించటానికి, దాన్ని వేళాకోళం చేయడానికి మనసును వశీకరించే విషయాలను కొనుగోలు చేసేవాడు కూడా మనుషుల్లో ఉన్నాడు. పరాభవం పాల్జేసే శిక్ష ఉన్నది ఇలాంటి వారికోసమే.
31:7  وَإِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا وَلَّىٰ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا كَأَنَّ فِي أُذُنَيْهِ وَقْرًا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ
వాడి ముందు మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు వాడు అహంకారంతో, తాను వాటిని అసలు విననే లేదన్నట్లుగా, తన రెండు చెవులలోనూ చెవుడు ఉన్నట్లుగా ముఖం త్రిప్పుకుని పోతాడు. కాబట్టి నువ్వు వాడికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను వినిపించు.
31:8  إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتُ النَّعِيمِ
నిశ్చయంగా ఎవరు విశ్వసించి, (ప్రవక్త సంప్రదాయం ప్రకారం) సత్కార్యాలు కూడా చేశారో వారి కోసం అనుగ్రహ భరితమైన స్వర్గవనాలున్నాయి.
31:9  خَالِدِينَ فِيهَا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్‌ వాగ్దానం నిజమవుతుంది. ఆయన గౌరవము, ప్రాబల్యము కలవాడు, పరిపూర్ణ వివేచనాపరుడు.
31:10  خَلَقَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ ۚ وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً فَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ
ఆయన ఆకాశాలను ఎలాంటి స్థంభాలు లేకుండానే సృష్టించాడు. మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన భూమిలో పర్వతాలను నెలకొల్పాడు - అది (భూమి) మీతో పాటు ఒరిగి పోకుండా ఉండేటందుకు! ఇంకా అన్నిరకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు. ఇంకా మేము ఆకాశం నుంచి వర్షపు నీటిని కురిపించి భూమిలో అన్ని రకాల మేలు జాతి జంటలను (మొలకలను) ఉత్పన్నం చేశాము.
31:11  هَٰذَا خَلْقُ اللَّهِ فَأَرُونِي مَاذَا خَلَقَ الَّذِينَ مِن دُونِهِ ۚ بَلِ الظَّالِمُونَ فِي ضَلَالٍ مُّبِينٍ
ఇదీ అల్లాహ్‌ సృష్టి! ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి? (ఏమీ సృష్టించలేదు) నిజానికి ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నారు.
31:12  وَلَقَدْ آتَيْنَا لُقْمَانَ الْحِكْمَةَ أَنِ اشْكُرْ لِلَّهِ ۚ وَمَن يَشْكُرْ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِ ۖ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ
నిశ్చయంగా మేము లుఖ్మానుకు వివేచనను ప్రసాదించి, "నువ్వు అల్లాహ్‌కు కృతజ్ఞుడవై ఉండు" అని చెప్పాము. కృతజ్ఞతా పూర్వకంగా మసలుకునే ప్రతి ఒక్కడూ తన (మేలు) కొరకే కృతజ్ఞుడవుతాడు. మరెవరయినా కృతఘ్నతకు పాల్పడితే, అల్లాహ్‌ అక్కరలు లేనివాడు, ప్రశంసనీయుడు (అన్న సంగతిని అతను తెలుసుకోవాలి).
31:13  وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: "ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం."
31:14  وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ
మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.
31:15  وَإِن جَاهَدَاكَ عَلَىٰ أَن تُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِي الدُّنْيَا مَعْرُوفًا ۖ وَاتَّبِعْ سَبِيلَ مَنْ أَنَابَ إِلَيَّ ۚ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో. అయితే (మార్గానుసరణ విషయంలో మాత్రం) నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తరువాత మీరంతా నా వైపుకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ తెలియపరుస్తాను."
31:16  يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ
(లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) "నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్‌ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు.
31:17  يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ
"ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.
31:18  وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ
"జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ డాబులు చెప్పుకునే గర్విష్టిని ఇష్టపడడు.
31:19  وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ
"నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం."
31:20  أَلَمْ تَرَوْا أَنَّ اللَّهَ سَخَّرَ لَكُم مَّا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَسْبَغَ عَلَيْكُمْ نِعَمَهُ ظَاهِرَةً وَبَاطِنَةً ۗ وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَلَا هُدًى وَلَا كِتَابٍ مُّنِيرٍ
అల్లాహ్‌ భూమ్యాకాశాల్లో ఉన్న వస్తువులన్నింటినీ మీ పనిలో తగిలించి, తన గోచర అగోచర వరాలను పుష్కలంగా మీకు ప్రసాదించిన విషయాన్ని మీరు చూడటం లేదా? కొంతమంది జ్ఞానం లేకుండా, మార్గదర్శకత్వం లేకుండా, ప్రకాశవంతమైన గ్రంథం లేకుండానే అల్లాహ్‌ గురించి వాదులాడుతున్నారు.
31:21  وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ الشَّيْطَانُ يَدْعُوهُمْ إِلَىٰ عَذَابِ السَّعِيرِ
అల్లాహ్‌ అవతరింపజేసిన దానిని (వహీని) అనుసరించండి అని వారితో అన్నప్పుడు, "లేదు. మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా చూసిన విధానాన్నే మేము అనుసరిస్తాము" అని వారంటారు. ఒకవేళ షైతాను వారి పెద్దలను నరకయాతన వైపుకు పిలుస్తూ ఉన్నప్పటికీ (వారు దాన్నే అనుసరిస్తారా?)
31:22  وَمَن يُسْلِمْ وَجْهَهُ إِلَى اللَّهِ وَهُوَ مُحْسِنٌ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ ۗ وَإِلَى اللَّهِ عَاقِبَةُ الْأُمُورِ
ఎవరయితే సద్వర్తనుడయి ఉండి-తన్ను తాను అల్లాహ్‌కు సమర్పించుకున్నాడో, అతను నిశ్చయంగా గట్టి కడియాన్ని పట్టుకున్నాడు. సమస్త వ్యవహారాల తుది నిర్ణయం అల్లాహ్‌ అధీనంలోనే ఉంటుంది.
31:23  وَمَن كَفَرَ فَلَا يَحْزُنكَ كُفْرُهُ ۚ إِلَيْنَا مَرْجِعُهُمْ فَنُنَبِّئُهُم بِمَا عَمِلُوا ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
(ఓ ముహమ్మద్‌-స!) అవిశ్వాసుల అవిశ్వాస వైఖరిపై నువ్వు కుమిలిపోకూడదు. చివరకు వారంతా మరలి రావలసింది మా వైపుకే. అప్పుడు మేము వారు చేసుకున్నదాన్ని వారికి తెలియపరుస్తాము. నిశ్చయంగా అల్లాహ్‌ గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు.
31:24  نُمَتِّعُهُمْ قَلِيلًا ثُمَّ نَضْطَرُّهُمْ إِلَىٰ عَذَابٍ غَلِيظٍ
మేము వారికి (ఇక్కడ) కొన్ని ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ, (తుదకు) వారిని కడు నిస్సహాయ స్థితిలో కఠినమైన శిక్ష వైపుకు తరుముకుంటూ పోతాము.
31:25  وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلِ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
ఆకాశాలను, భూమిని సృష్టించిన వారెవరు? అని నువ్వు వారిని అడిగితే "అల్లాహ్‌" అని వారు తప్పకుండా చెబుతారు. "సమస్త స్తోత్రాలు అల్లాహ్‌కే శోభిస్తాయి" అని నువ్వు వారికి చెప్పు, కాని వారిలో చాలామంది (సత్యాన్ని) తెలుసుకోరు.
31:26  لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّ اللَّهَ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే. నిశ్చయంగా అల్లాహ్‌ ఏ అక్కరా లేనివాడు, స్తుతింపదగినవాడు.
31:27  وَلَوْ أَنَّمَا فِي الْأَرْضِ مِن شَجَرَةٍ أَقْلَامٌ وَالْبَحْرُ يَمُدُّهُ مِن بَعْدِهِ سَبْعَةُ أَبْحُرٍ مَّا نَفِدَتْ كَلِمَاتُ اللَّهِ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
భూమండలంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సిరాగా మారినా, ఆపైన మరో సప్త సముద్రాలు (సిరాగా) చేరినా అల్లాహ్‌ మాటలు (రాయటానికి) పూర్తికావు. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధికుడు, వివేకవంతుడు.
31:28  مَّا خَلْقُكُمْ وَلَا بَعْثُكُمْ إِلَّا كَنَفْسٍ وَاحِدَةٍ ۗ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
మీ అందరినీ సృష్టించటం, మరణానంతరం తిరిగిలేపటం ఒక్క ప్రాణిని (సృష్టించి, బ్రతికించి లేపటం) వంటిదే. నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వినేవాడు, చూసేవాడు.
31:29  أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي إِلَىٰ أَجَلٍ مُّسَمًّى وَأَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
అల్లాహ్‌ ఏ విధంగా రాత్రిని పగటి లోనికి, పగటిని రాత్రి లోనికి చొప్పిస్తున్నాడో నువ్వు గమనించటం లేదా? ఆయనే సూర్యచంద్రులను కూడా నియమబద్ధంగా చేశాడు. ప్రతి ఒక్కటి నిర్ణీత సమయం వరకు సాగిపోతున్నాయి. మీరు చేసేదంతా కూడా అల్లాహ్‌కు తెలుసు.
31:30  ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ وَأَنَّ اللَّهَ هُوَ الْعَلِيُّ الْكَبِيرُ
అల్లాహ్‌యే సత్యం గనక, ఆయన్ని వదలి ప్రజలు మొర పెట్టుకునేవన్నీ అసత్యం గనక, అల్లాహ్‌యే మహోన్నతుడూ గొప్పవాడు గనక ఇదంతా (ఈ విధంగా) సజావుగా సాగుతోంది.
31:31  أَلَمْ تَرَ أَنَّ الْفُلْكَ تَجْرِي فِي الْبَحْرِ بِنِعْمَتِ اللَّهِ لِيُرِيَكُم مِّنْ آيَاتِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
అల్లాహ్‌ అనుగ్రహంతో ఓడలు సముద్రంలో నడవటాన్ని నువ్వు గమనించటం లేదా? ఆయన తన సూచనలను మీకు చూపించటానికి (ఇదంతా చేస్తున్నాడు). నిశ్చయంగా ఇందులో సహనం వహించే, కృతజ్ఞతా భావం కలిగి ఉండే ప్రతి ఒక్కరికీ ఎన్నో సూచనలున్నాయి.
31:32  وَإِذَا غَشِيَهُم مَّوْجٌ كَالظُّلَلِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ فَمِنْهُم مُّقْتَصِدٌ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا كُلُّ خَتَّارٍ كَفُورٍ
మరి వారిపై (సముద్ర) కెరటాలు నీడల మాదిరిగా క్రమ్ముకున్నప్పుడు, వారు తమ నమ్మకాన్ని పూర్తిగా అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని, ఆయన్ని మొరపెట్టుకుంటారు. మరి ఆయన వారిని రక్షించి నేలమీదకు చేర్చిన తరువాత వారిలో కొందరు (విశ్వాసానికీ - అవిశ్వాసానికి) మధ్యలో ఊగిసలాడతారు. నమ్మకద్రోహి, చేసినమేలును మరచినవాడు తప్ప వేరెవరూ మా ఆయతులను త్రోసిపుచ్చరు.
31:33  يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ وَاخْشَوْا يَوْمًا لَّا يَجْزِي وَالِدٌ عَن وَلَدِهِ وَلَا مَوْلُودٌ هُوَ جَازٍ عَن وَالِدِهِ شَيْئًا ۚ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيَاةُ الدُّنْيَا وَلَا يَغُرَّنَّكُم بِاللَّهِ الْغَرُورُ
ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. ఏ తండ్రీ తన కుమారునికి ఉపయోగపడని, ఏ కుమారుడూ తన తండ్రికి ఏ విధంగానూ ఉపయోగపడని దినానికి భయపడండి. అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనది (అని తెలుసుకోండి). ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చటంగానీ, మోసగాడు (షైతాను) మిమ్మల్ని మోసగించటంగానీ జరగరాదు సుమా!
31:34  إِنَّ اللَّهَ عِندَهُ عِلْمُ السَّاعَةِ وَيُنَزِّلُ الْغَيْثَ وَيَعْلَمُ مَا فِي الْأَرْحَامِ ۖ وَمَا تَدْرِي نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ
నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలీదు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు (అని తెలుసుకోండి).


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.