aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

30. సూరా ఆర్ రూమ్

30:1  الم
అలిఫ్‌ - లామ్‌ - మీమ్‌.
30:2  غُلِبَتِ الرُّومُ
రోమనులు ఓడిపోయారు-
30:3  فِي أَدْنَى الْأَرْضِ وَهُم مِّن بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ
సమీప భూభాగంలో. అయితే (ఈ) అపజయం తరువాత త్వరలోనే వారు విజేతలవుతారు.
30:4  فِي بِضْعِ سِنِينَ ۗ لِلَّهِ الْأَمْرُ مِن قَبْلُ وَمِن بَعْدُ ۚ وَيَوْمَئِذٍ يَفْرَحُ الْمُؤْمِنُونَ
కొన్నేండ్లలోనే (తొమ్మిదేండ్లలోపే!). దానికి ముందైనా, తరువాతైనా నిర్ణయాధికారం అల్లాహ్‌దే. ఆ రోజు ముస్లింలు సంతోషిస్తారు-
30:5  بِنَصْرِ اللَّهِ ۚ يَنصُرُ مَن يَشَاءُ ۖ وَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
అల్లాహ్‌ అండదండల వల్ల. ఆయన తాను కోరిన వారికి సహాయం చేస్తాడు. ఆయన మాత్రమే సర్వాధికుడు, దయాశీలి.
30:6  وَعْدَ اللَّهِ ۖ لَا يُخْلِفُ اللَّهُ وَعْدَهُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
(ఇది) అల్లాహ్‌ వాగ్దానం. అల్లాహ్‌ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కాని చాలామంది (ఈ సంగతిని) తెలుసుకోరు.
30:7  يَعْلَمُونَ ظَاهِرًا مِّنَ الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ عَنِ الْآخِرَةِ هُمْ غَافِلُونَ
వారికి ప్రాపంచిక జీవితపు పై పై విషయాలు (మాత్రమే) తెలుసు. పరలోకం గురించి వారికి బొత్తిగా తెలీదు.
30:8  أَوَلَمْ يَتَفَكَّرُوا فِي أَنفُسِهِم ۗ مَّا خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ بِلِقَاءِ رَبِّهِمْ لَكَافِرُونَ
ఏమిటీ, వారు తమ (పుట్టుక) గురించి (లోతుగా) ఆలోచించటం లేదా? అల్లాహ్‌ భూమ్యాకాశాలనూ, వాటి మధ్యనున్న సమస్తాన్నీ అత్యుత్తమ రీతిలో, నిర్ణీత కాలం కొరకు మాత్రమే సృష్టించాడు. అయితే చాలా మంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు.
30:9  أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا الْأَرْضَ وَعَمَرُوهَا أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
ఏమిటీ, వారు భువిలో సంచరించి, తమ పూర్వీకులకు పట్టిన గతేమిటో చూడలేదా? వారు బలపరాక్రమాలలో వీళ్ళ కన్నా మరింత గట్టివారే. వారు (కూడా) భూమిని బాగా దున్నారు. వీళ్ళకన్నా బాగా సేద్యం చేశారు (వసింపజేశారు). వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లాహ్‌ వారికి అన్యాయం చేయలేదు. కాని (యదార్థానికి) వారు తమకు తామే అన్యాయం చేసుకునేవారు.
30:10  ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِينَ أَسَاءُوا السُّوأَىٰ أَن كَذَّبُوا بِآيَاتِ اللَّهِ وَكَانُوا بِهَا يَسْتَهْزِئُونَ
మరి ఎట్టకేలకు - దుర్మార్గాలకు ఒడిగట్టిన వారికి దుర్గతే పట్టింది. ఎందుకంటే వారు అల్లాహ్‌ ఆయతులను ధిక్కరించే వారు. వాటిని పరిహసించేవారు.
30:11  اللَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
సృష్టి (ప్రక్రియ)ని మొదలెట్టేవాడు అల్లాహ్‌యే. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. మరి మీరంతా ఆయన వైపునకే మరలించబడతారు.
30:12  وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُبْلِسُ الْمُجْرِمُونَ
ప్రళయం నెలకొన్ననాడు అపరాధులు దిగ్భ్రాంతి చెందుతారు.
30:13  وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَائِهِمْ شُفَعَاءُ وَكَانُوا بِشُرَكَائِهِمْ كَافِرِينَ
వారు కల్పించే భాగస్వాములలో ఏ ఒక్కరూ వారికోసం సిఫారసు చేయరు. మరి (వీళ్లు సైతం) తమ భాగస్వాములను త్రోసిపుచ్చుతారు.
30:14  وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ
ఏ రోజున ప్రళయ ఘడియ నెలకొంటుందో ఆ రోజు (మానవులు) విభిన్న వర్గాలుగా విడిపోతారు.
30:15  فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَهُمْ فِي رَوْضَةٍ يُحْبَرُونَ
మరి విశ్వసించి, మంచి పనులు చేసిన వారు స్వర్గంలో ఆనందంతో పరవశించిపోతూ ఉంటారు.
30:16  وَأَمَّا الَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا وَلِقَاءِ الْآخِرَةِ فَأُولَٰئِكَ فِي الْعَذَابِ مُحْضَرُونَ
మరెవరయితే తిరస్కార వైఖరిని అనుసరిస్తూ, మా ఆయతులను, పరలోక సమావేశాన్ని ధిక్కరిస్తారో వారందరూ శిక్షలో నిర్బంధించబడి ఉంటారు.
30:17  فَسُبْحَانَ اللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ
కనుక మీరు పొద్దుగూకినప్పుడు, తెల్లవారినప్పుడు అల్లాహ్‌ పవిత్రతను కొనియాడండి.
30:18  وَلَهُ الْحَمْدُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ
భూమ్యాకాశాలలో సమస్త స్తోత్రాలకు అర్హుడు ఆయన మాత్రమే. సాయం సమయాన, మధ్యాహ్న సమయాన కూడా (అల్లాహ్‌ పవిత్రతను కొనియాడండి).
30:19  يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَيُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ وَكَذَٰلِكَ تُخْرَجُونَ
ఆయనే సజీవిని నిర్జీవి నుంచి, నిర్జీవిని సజీవి నుంచి వెలికి తీస్తాడు. ఆయనే భూమిని అది చచ్చిన తరువాత బ్రతికిస్తాడు. మీరు (కూడా) అలాగే తీయబడతారు.
30:20  وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَا أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ
ఆయన సూచనలలో ఒకటేమంటే; ఆయన మిమ్మల్ని మట్టితో పుట్టించాడు. ఆ తరువాత మీరు మానవులుగా మారి వ్యాపిస్తున్నారు.
30:21  وَمِنْ آيَاتِهِ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا لِّتَسْكُنُوا إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే; ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు - మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి! ఆయన మీ మధ్య ప్రేమనూ, దయాభావాన్నీ పొందుపరచాడు. నిశ్చయంగా ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
30:22  وَمِنْ آيَاتِهِ خَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافُ أَلْسِنَتِكُمْ وَأَلْوَانِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْعَالِمِينَ
భూమ్యాకాశాల సృష్టి, మీ భాషల్లో, రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలున్నాయి.
30:23  وَمِنْ آيَاتِهِ مَنَامُكُم بِاللَّيْلِ وَالنَّهَارِ وَابْتِغَاؤُكُم مِّن فَضْلِهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ
(ఇంకా) ఆయన (శక్తి) సూచనలలో రాత్రివేళ, పగటిపూట మీరు నిద్రపోవటం, మీరు ఆయన కృపను (జీవనోపాధిని) అన్వేషించటం కూడా ఉన్నాయి. (జాగ్రత్తగా) వినేవారికి ఇందులో అనేక సూచనలున్నాయి.
30:24  وَمِنْ آيَاتِهِ يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ السَّمَاءِ مَاءً فَيُحْيِي بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
ఇంకా ఆయన సూచనలలో (ఇంకొకటి) ఏమిటంటే; ఆయన మిమ్మల్ని భయపెట్టటానికి, ఆశపెట్టటానికి మెరుపును చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు. మరి దాని ద్వారా మృతభూమికి జీవం పోస్తున్నాడు. ఇందులో కూడా బుద్ధిజీవుల కోసం ఎన్నో నిదర్శనాలున్నాయి.
30:25  وَمِنْ آيَاتِهِ أَن تَقُومَ السَّمَاءُ وَالْأَرْضُ بِأَمْرِهِ ۚ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ الْأَرْضِ إِذَا أَنتُمْ تَخْرُجُونَ
ఆయన సూచనలలో (వేరొకటి) ఇది కూడా ఉంది : భూమ్యాకాశాలు ఆయన ఆదేశంతోనే నెలకొని ఉన్నాయి. మరి ఆయన మిమ్మల్ని పిలువగానే, ఒక్క పిలుపుపైనే మీరంతా భూమిలో నుంచి బయటికి వస్తారు.
30:26  وَلَهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ كُلٌّ لَّهُ قَانِتُونَ
ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతి వస్తువూ ఆయనదే. అన్నీ ఆయన ఆజ్ఞకే లోబడి ఉన్నాయి.
30:27  وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ ۚ وَلَهُ الْمَثَلُ الْأَعْلَىٰ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆయనే సృష్టి (ప్రక్రియ)ని ప్రారంభిస్తున్నాడు. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఆయన గుణగణాల దర్పమే సర్వోన్నతమైనది. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
30:28  ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ ۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَانُكُم مِّن شُرَكَاءَ فِي مَا رَزَقْنَاكُمْ فَأَنتُمْ فِيهِ سَوَاءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْقِلُونَ
అల్లాహ్‌ మీ కోసం స్వయంగా మీకు సంబంధించిన ఉదాహరణనే ఇస్తున్నాడు - మేము మీకు ప్రసాదించిన సంపదలో మీతో సమంగా పంచుకునే మీ బానిసలు ఎవరయినా ఉన్నారా? మీరు మీ తోటి వారికి భయపడినట్లు వారికి భయపడుతున్నారా? బుద్ధీ వివేచనలున్న వారి కోసం మేము ఈ విధంగా సూచనలను విడమరచి చెబుతుంటాము.
30:29  بَلِ اتَّبَعَ الَّذِينَ ظَلَمُوا أَهْوَاءَهُم بِغَيْرِ عِلْمٍ ۖ فَمَن يَهْدِي مَنْ أَضَلَّ اللَّهُ ۖ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
అసలు విషయం ఏమిటంటే ఈ దుర్మార్గులు జ్ఞానంతో నిమిత్తం లేకుండానే తమ కోర్కెలను అనుసరిస్తున్నారు. అల్లాహ్‌ అపమార్గం పట్టించినవాణ్ణి ఎవడు సన్మార్గానికి తేగలడనీ? అలాంటి వారికి తోడ్పడేవాడు ఎవడూ లేడు.
30:30  فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని (అల్లాహ్‌) ధర్మంపై నిలుపు. అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్‌ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరైన ధర్మం. కాని చాలామంది తెలుసుకోరు.
30:31  مُنِيبِينَ إِلَيْهِ وَاتَّقُوهُ وَأَقِيمُوا الصَّلَاةَ وَلَا تَكُونُوا مِنَ الْمُشْرِكِينَ
(ప్రజలారా!) అల్లాహ్‌ వైపునకే మరలి, ఆయనకు భయపడుతూ ఉండండి. నమాజును నెలకొల్పండి. ముష్రికులలో చేరకండి.
30:32  مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
వారు తమ ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది.
30:33  وَإِذَا مَسَّ النَّاسَ ضُرٌّ دَعَوْا رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَا أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ
ప్రజల (పరిస్థితి ఎలాంటిదంటే; వారి) పై ఎప్పుడైనా, ఏదైనా ఆపద వచ్చిపడితే తమ ప్రభువు వైపునకు (పూర్తిగా) మరలి ప్రార్థనలు చేస్తారు. మరి ఆయన తన తరఫు నుంచి కారుణ్య రుచిని చూపించగానే, వారిలోని ఒక వర్గం తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించసాగుతుంది-
30:34  لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا فَسَوْفَ تَعْلَمُونَ
మేము వారికి అనుగ్రహించిన దానిపై కృతఘ్నత చూపటానికి?! సరే. లబ్ది పొందండి! అతి త్వరలోనే (పరిణామం) మీకు తెలిసిపోతుంది.
30:35  أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَانًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا بِهِ يُشْرِكُونَ
ఏమిటీ; వారు పాల్పడే షిర్కును సమర్థిస్తూ మాట్లాడే ప్రమాణాన్ని దేన్నయినా మేము వారిపై దించామా?
30:36  وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً فَرِحُوا بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ
మరి మేము ప్రజలకు కారుణ్యం రుచిని చూపించినపుడు వారు ఆనందంతో ఉబ్బిపోతారు. మరి ఒకవేళ తమ చేజేతులా చేసుకున్న చేష్టల మూలంగా వారికి ఏదైనా కీడు కలిగితే మాత్రం పూర్తిగా నిరాశచెందుతారు.
30:37  أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
ఏమిటీ, అల్లాహ్‌ తాను కోరిన వారికి విస్తృతంగా జీవనోపాధిని ఇచ్చి, తాను కోరిన వారికి కుదించి ఇవ్వటాన్ని వారు చూడలేదా? నిశ్చయంగా ఇందులో కూడా విశ్వసించేవారికి సూచనలు ఉన్నాయి.
30:38  فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ اللَّهِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
కనుక సమీప బంధువుకు అతని హక్కును ఇవ్వు. అగత్యపరునికి, బాటసారికి కూడా (వారి హక్కులను ఇవ్వాలి). అల్లాహ్‌ సమ్ముఖ దర్శన భాగ్యం పొందగోరేవారికి ఈ పద్ధతి ఉత్తమమైనది. సాఫల్యం పొందేవారంటే వీరే.
30:39  وَمَا آتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَ فِي أَمْوَالِ النَّاسِ فَلَا يَرْبُو عِندَ اللَّهِ ۖ وَمَا آتَيْتُم مِّن زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الْمُضْعِفُونَ
ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్‌ దృష్టిలో ఎంతమాత్రం వృద్ధి చెందదు. అయితే అల్లాహ్‌ ముఖాన్ని చూచేందుకు (ప్రసన్నతను చూరగొనేందుకు) మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే - అలాంటి వారే (తమ సంపదలను) ఎన్నోరెట్లు వృద్ధిపరచుకున్న వారవుతారు.
30:40  اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۖ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَيْءٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
ఆ అల్లాహ్‌యే మిమ్మల్ని సృష్టించాడు, తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే మిమ్మల్ని చంపుతాడు, ఆ తరువాత మిమ్మల్ని బ్రతికిస్తాడు. చెప్పండి! ఈ పనులలో దేన్నయినా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవడయినా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు.
30:41  ظَهَرَ الْفَسَادُ فِي الْبَرِّ وَالْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِي النَّاسِ لِيُذِيقَهُم بَعْضَ الَّذِي عَمِلُوا لَعَلَّهُمْ يَرْجِعُونَ
ప్రజలు చేజేతులా చేసుకున్న (పాప) కార్యాల మూలంగానే భూమిలోనూ, సముద్రంలోనూ కల్లోలం వ్యాపించింది. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లాహ్‌ వారికి చవి చూపించటానికి (ఇలా జరిగింది). బహుశా వారు (దీనివల్ల) దారికి తిరిగి రావచ్చేమోనని (కూడా ఈ విధంగా జరిగింది).
30:42  قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلُ ۚ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "భూమిలో సంచరించి, (మీ) పూర్వీకులకు ఏ గతి పట్టిందో కాస్త చూడండి! వారిలో అనేకులు ముష్రికులే."
30:43  فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ الْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُ مِنَ اللَّهِ ۖ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ
కనుక (ఓ ప్రవక్తా!) ఏ రోజు అల్లాహ్‌ తరఫునుంచి తొలగిపోయే అవకాశం ఎంతమాత్రం లేదో ఆ రోజు రాకముందే నీ ముఖాన్ని సత్యమైన, స్థిరమైన ధర్మం వైపు మరల్చుకో. ఆ రోజు అందరూ (రెండు వర్గాలుగా) వేర్వేరు అయిపోతారు.
30:44  مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَمَنْ عَمِلَ صَالِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ
తిరస్కారానికి పాల్పడిన వారిపై వారి తిరస్కారపు పాపఫలం పడుతుంది. ఇక సత్కార్యాలు చేసేవారు తమ సౌఖ్యం కోసం (స్వర్గ) మార్గం సుగమం చేసుకుంటున్నారు.
30:45  لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِن فَضْلِهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْكَافِرِينَ
విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి అల్లాహ్‌ తన కృపతో (మంచి) ప్రతిఫలం వొసగటానికి! ఎట్టి పరిస్థితిలోనూ ఆయన అవిశ్వాసులను ఇష్టపడడు.
30:46  وَمِنْ آيَاتِهِ أَن يُرْسِلَ الرِّيَاحَ مُبَشِّرَاتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِ وَلِتَجْرِيَ الْفُلْكُ بِأَمْرِهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
శుభవార్తలను అందజేసే గాలులను పంపటం కూడా ఆయన శక్తి సూచనలలోనిదే. ఎందుకంటే మీకు తన కనికారపు రుచి చూపించటానికి, తన ఆజ్ఞతో నావలు నడవటానికీ, తన కృపను (ఉపాధిని) మీరు అన్వేషించటానికి, మీరు కృతజ్ఞతా పూర్వకంగా మసలుకోవటానికిగాను (ఆయన ఇదంతా చేస్తున్నాడు).
30:47  وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَانتَقَمْنَا مِنَ الَّذِينَ أَجْرَمُوا ۖ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ الْمُؤْمِنِينَ
మేము నీకు పూర్వం కూడా ప్రవక్తలను వారి జనుల వద్దకు పంపాము. వారు వారి వద్దకు నిదర్శనాలను తీసుకుని వెళ్ళారు. ఆ తరువాత మేము అపరాధులకు ప్రతీకారం చేశాము. (ఎందుకంటే) విశ్వాసులకు సహాయపడటం మా బాధ్యత.
30:48  اللَّهُ الَّذِي يُرْسِلُ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُ فِي السَّمَاءِ كَيْفَ يَشَاءُ وَيَجْعَلُهُ كِسَفًا فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَالِهِ ۖ فَإِذَا أَصَابَ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ
అల్లాహ్‌యే గాలులను పంపిస్తున్నాడు. అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత అల్లాహ్‌ తన అభీష్టానికనుగుణంగా వాటిని ఆకాశంలో విస్తరింపజేస్తాడు. మరి వాటిని తునాతునకలుగా చేస్తాడు. ఆ తరువాత వాటి మధ్యలో నుంచి వర్షపు నీటి బిందువులు వెలువడటాన్ని నువ్వు చూస్తావు. ఆ తరువాత అల్లాహ్‌ ఆ వర్షపు నీటిని తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించినపుడు వారు ఆనందంతో పులకించిపోతారు.
30:49  وَإِن كَانُوا مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِ لَمُبْلِسِينَ
మరి నిజానికి ఆ వర్షం తమపై కురవకముందు వారు నిరాశా నిస్పృహలకు లోనై ఉండేవారు.
30:50  فَانظُرْ إِلَىٰ آثَارِ رَحْمَتِ اللَّهِ كَيْفَ يُحْيِي الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ ذَٰلِكَ لَمُحْيِي الْمَوْتَىٰ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
మరి నువ్వు అల్లాహ్‌ కారుణ్య చిహ్నాలను చూడు- భూమిని, చచ్చిన తరువాత ఏ విధంగా ఆయన బ్రతికిస్తున్నాడో!? ఆయన మృతులను బ్రతికిస్తాడన్న విషయంలో కూడా ఎలాంటి సందేహానికి తావులేదు. ఆయనకు ప్రతిదీ చేయగల శక్తి ఉంది.
30:51  وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا مِن بَعْدِهِ يَكْفُرُونَ
ఒకవేళ మేము తీవ్రమైన (చెడు) గాలిని పంపినట్లయితే, తమ పంట పొలాలు పసుపుపచ్చగా వాడిపోవటం చూసి, అటు పిమ్మట వారు కృతఘ్నులుగా తయారవుతారు.
30:52  فَإِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَىٰ وَلَا تُسْمِعُ الصُّمَّ الدُّعَاءَ إِذَا وَلَّوْا مُدْبِرِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ మృతులకు వినిపించలేవు. నీవు పిలిచినప్పుడు వెన్నుచూపి వెళ్ళిపోయే చెవిటి వారికి కూడా (నీ వాణిని) వినిపించలేవు.
30:53  وَمَا أَنتَ بِهَادِ الْعُمْيِ عَن ضَلَالَتِهِمْ ۖ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِآيَاتِنَا فَهُم مُّسْلِمُونَ
నువ్వు గుడ్డివారిని కూడా వారు పయనిస్తున్న పెడత్రోవ నుంచి సన్మార్గానికి తేలేవు. మా ఆయతులను విశ్వసించే వారికి మాత్రమే నువ్వు (నీ సందేశాన్ని) వినిపించగలవు. వారు మాత్రమే విధేయత చూపుతారు.
30:54  اللَّهُ الَّذِي خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِن بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِن بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۖ وَهُوَ الْعَلِيمُ الْقَدِيرُ
అల్లాహ్‌ - ఆయనే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించాడు. మరి ఈ బలహీనత తరువాత (మీకు) బలాన్ని ఇచ్చాడు. మరి ఈ బలం తరువాత మళ్లీ (మీకు) బలహీనతను ఇచ్చాడు, వృద్ధాప్యానికి చేర్చాడు. ఆయన తాను తలచినది సృష్టిస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, అన్నింటిపై అధికారం కలవాడు.
30:55  وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُقْسِمُ الْمُجْرِمُونَ مَا لَبِثُوا غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا يُؤْفَكُونَ
ప్రళయ ఘడియ సంభవించిననాడు అపరాధులు, తాము (ప్రపంచంలో) ఒక్క గడియకాలం కన్నా ఎక్కువగా ఉండలేదని ప్రమాణాలు చేస్తారు. (ఇహలోకంలో కూడా) వారు ఇలాగే తిరిగిపోతూ ఉండేవారు.
30:56  وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَالْإِيمَانَ لَقَدْ لَبِثْتُمْ فِي كِتَابِ اللَّهِ إِلَىٰ يَوْمِ الْبَعْثِ ۖ فَهَٰذَا يَوْمُ الْبَعْثِ وَلَٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ
అయితే జ్ఞానమూ, విశ్వాసమూ వొసగబడినవారు ఇలా సమాధానమిస్తారు: "మీరు దైవగ్రంథంలో (లిఖించబడి) ఉన్నట్లే ప్రళయదినం వరకూ ఆగి ఉన్నారు. నేటి ఈ దినం ప్రళయదినమే. కాని మీరు మాత్రం నమ్మేవారే కాదు."
30:57  فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ الَّذِينَ ظَلَمُوا مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
కాబట్టి ఆ రోజు దుర్మార్గులకు, వారు చెప్పుకునే క్షమాపణలు (సంజాయిషీలు) వారికి ఎలాంటి లాభాన్నీ చేకూర్చవు. "క్షమాపణలు కోరుకోండి" అని వారితో అనటం కూడా జరగదు.
30:58  وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ ۚ وَلَئِن جِئْتَهُم بِآيَةٍ لَّيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ
నిశ్చయంగా మేము ఈ ఖుర్‌ఆన్‌లో జనుల కోసం అన్నిరకాల దృష్టాంతాలనూ వివరించాము. నువ్వు వారి దగ్గరకు ఏ సూచనను తెచ్చినా, "మీరంతా మిథ్యావాదులే" అని ఈ అవిశ్వాసులు చెబుతారు.
30:59  كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ قُلُوبِ الَّذِينَ لَا يَعْلَمُونَ
ఈ విధంగా అల్లాహ్‌ అజ్ఞానుల హృదయాలకు సీలు వేసేస్తాడు.
30:60  فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ وَلَا يَسْتَخِفَّنَّكَ الَّذِينَ لَا يُوقِنُونَ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు సహనం వహించు. నిశ్చయంగా అల్లాహ్‌ వాగ్దానం సత్యమైంది. నమ్మకం లేనివారు నిన్ను తడబాటుకు లోనుచేసే స్థితి రాకూడదు సుమా!


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.