aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

28. సూరా అల్ ఖసస్

28:1  طسم
తా - సీన్‌ - మీమ్‌.
28:2  تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ
ఇవి తేటతెల్లమైన గ్రంథానికి చెందిన ఆయతులు.
28:3  نَتْلُو عَلَيْكَ مِن نَّبَإِ مُوسَىٰ وَفِرْعَوْنَ بِالْحَقِّ لِقَوْمٍ يُؤْمِنُونَ
విశ్వసించిన జనుల కోసం మేము నీకు మూసా, ఫిరౌనుల వృత్తాంతం (లోని కొంత భాగాన్ని) ఉన్నదున్నట్లుగా వినిపిస్తున్నాము.
28:4  إِنَّ فِرْعَوْنَ عَلَا فِي الْأَرْضِ وَجَعَلَ أَهْلَهَا شِيَعًا يَسْتَضْعِفُ طَائِفَةً مِّنْهُمْ يُذَبِّحُ أَبْنَاءَهُمْ وَيَسْتَحْيِي نِسَاءَهُمْ ۚ إِنَّهُ كَانَ مِنَ الْمُفْسِدِينَ
నిజంగానే ఫిరౌను భువిలో (ఈజిప్టు రాజ్యంలో) చెలరేగి పోయాడు. అక్కడి ప్రజలను విభిన్న వర్గాలుగా విభజించాడు. వారిలో ఒక వర్గం వారిని మరీ బలహీనుల్ని చేసేశాడు. వారి మగ పిల్లలను చంపేసి, వారి ఆడపిల్లల్ని మాత్రం బ్రతక నిచ్చేవాడు. నిశ్చయంగా వాడు కల్లోలాన్ని రేకెత్తించినవారి కోవకు చెందినవాడు.
28:5  وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى الَّذِينَ اسْتُضْعِفُوا فِي الْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُ الْوَارِثِينَ
భువిలో మరీ బలహీనుల్ని చేసి అణచివేయబడిన ఆ జనులను అనుగ్రహించాలనీ, వారికి సారథ్య బాధ్యతలు అప్పగించాలనీ, వారిని (భూమికి) వారసులుగా చేయాలనీ మేము కోరుకున్నాం.
28:6  وَنُمَكِّنَ لَهُمْ فِي الْأَرْضِ وَنُرِيَ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا مِنْهُم مَّا كَانُوا يَحْذَرُونَ
భువిలో వారికి ప్రాబల్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదించాలనీ, ఫిరౌను, హామాను మరియు వారి సైన్యాలకు వారు దేనికి భయపడుతూ ఉండేవారో దాన్నే చూపాలని (మేము అభిలషించాము).
28:7  وَأَوْحَيْنَا إِلَىٰ أُمِّ مُوسَىٰ أَنْ أَرْضِعِيهِ ۖ فَإِذَا خِفْتِ عَلَيْهِ فَأَلْقِيهِ فِي الْيَمِّ وَلَا تَخَافِي وَلَا تَحْزَنِي ۖ إِنَّا رَادُّوهُ إِلَيْكِ وَجَاعِلُوهُ مِنَ الْمُرْسَلِينَ
మేము మూసా (అలైహిస్సలాం) తల్లికి ఇలా సూచించాము: "నువ్వతనికి పాలిస్తూ ఉండు. అతని విషయంలో నువ్వు ఎప్పుడు ప్రమాదాన్ని పసిగట్టినా అతన్ని నదిలో విడిచిపెట్టు. భయపడకు. దుఃఖించకు. నిశ్చయంగా మేమతన్ని నీ వైపుకే మరలిస్తాము. ఇంకా, మేమతన్ని మా ప్రవక్తలలో ఒకడుగా చేసుకుంటాము."
28:8  فَالْتَقَطَهُ آلُ فِرْعَوْنَ لِيَكُونَ لَهُمْ عَدُوًّا وَحَزَنًا ۗ إِنَّ فِرْعَوْنَ وَهَامَانَ وَجُنُودَهُمَا كَانُوا خَاطِئِينَ
చివరకు ఫిరౌను కుటుంబీకులు ఆ పసికందును ఎత్తుకున్నారు - ఎట్టకేలకు ఈ పసివాడే వారికి శత్రువుగా తయారై, వారి విషాదానికి కారకుడయ్యేందుకు. మొత్తానికి ఫిరౌను, హామాను, వారి సేనలు - వారందరూ పాపాత్ములనటంలో సందేహమే లేదు.
28:9  وَقَالَتِ امْرَأَتُ فِرْعَوْنَ قُرَّتُ عَيْنٍ لِّي وَلَكَ ۖ لَا تَقْتُلُوهُ عَسَىٰ أَن يَنفَعَنَا أَوْ نَتَّخِذَهُ وَلَدًا وَهُمْ لَا يَشْعُرُونَ
ఫిరౌను భార్య (తన భర్తతో), "(ఏవండీ!) ఈ అబ్బాయి మీకూ, నాకూ కన్నుల పండువగా ఉన్నాడండీ! ఇతన్ని మాత్రం చంపకండీ! బహుశా ఇతను మనకు ఉపయోగపడవచ్చండీ! లేదంటే మనం ఇతన్ని మన పుత్రునిగానైనా దత్తత తీసుకోవచ్చండి!" అని ప్రాధేయపడింది. కాని (దాని పర్యవసానం గురించి) వారికి తెలీదు.
28:10  وَأَصْبَحَ فُؤَادُ أُمِّ مُوسَىٰ فَارِغًا ۖ إِن كَادَتْ لَتُبْدِي بِهِ لَوْلَا أَن رَّبَطْنَا عَلَىٰ قَلْبِهَا لِتَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
మూసా తల్లి మనసు తల్లడిల్లి పోయింది. ఆమె విశ్వాసులలోనే స్థిరంగా ఉండడానికి మేము ఆమె మనసును కుదుటపరచి ఉండకపోతే, ఆ విషయాన్ని ఆమె బయటపెట్టి ఉండేదే!
28:11  وَقَالَتْ لِأُخْتِهِ قُصِّيهِ ۖ فَبَصُرَتْ بِهِ عَن جُنُبٍ وَهُمْ لَا يَشْعُرُونَ
మూసా తల్లి, అతని అక్కతో, "నువ్వు ఇతని వెనకాలే వెళ్ళు" అని చెప్పింది. అందువల్ల ఆమె దూరం నుంచే గమనిస్తూ పోయింది. కాని ఆ సంగతి వారికి (ఫిరౌనీయులకు) తెలియదు.
28:12  وَحَرَّمْنَا عَلَيْهِ الْمَرَاضِعَ مِن قَبْلُ فَقَالَتْ هَلْ أَدُلُّكُمْ عَلَىٰ أَهْلِ بَيْتٍ يَكْفُلُونَهُ لَكُمْ وَهُمْ لَهُ نَاصِحُونَ
అంతకుముందే మేము మూసా కొరకు దాదుల పాలను నిషేధించాము. (పరిస్థితుల స్వరూపాన్ని గమనించిన) ఆ బాలిక వారితో, "మీ కోసం ఈ బాలుణ్ణి పోషించే, ఇతని బాగోగులను కోరే ఇంటి వారిని గురించి నేను మీకు తెలుపనా?!" అని చెప్పింది.
28:13  فَرَدَدْنَاهُ إِلَىٰ أُمِّهِ كَيْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ وَلِتَعْلَمَ أَنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
ఆ విధంగా మేము అతన్ని తిరిగి అతని తల్లి దగ్గరకు చేర్చాము - తద్వారా ఆమె కన్నులు చల్లబడాలనీ, ఆమె దుఃఖితురాలు కాకుండా ఉండాలనీ, అల్లాహ్‌ వాగ్దానం సత్యమని ఆమె తెలుసుకోవాలని (మేమిలా చేశాము). కాని చాలా మందికి (ఇందలి పరమార్థం) తెలియదు.
28:14  وَلَمَّا بَلَغَ أَشُدَّهُ وَاسْتَوَىٰ آتَيْنَاهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
మూసా తన యుక్త వయస్సుకు చేరుకుని, పరిపక్వతను పొందిన మీదట మేమతనికి వివేకాన్నీ, (ధర్మ) జ్ఞానాన్నీ ప్రసాదించాము. సద్వర్తనులకు మేము ఇలాగే (ఉత్తమ) ప్రతిఫలాన్ని ఇస్తుంటాము.
28:15  وَدَخَلَ الْمَدِينَةَ عَلَىٰ حِينِ غَفْلَةٍ مِّنْ أَهْلِهَا فَوَجَدَ فِيهَا رَجُلَيْنِ يَقْتَتِلَانِ هَٰذَا مِن شِيعَتِهِ وَهَٰذَا مِنْ عَدُوِّهِ ۖ فَاسْتَغَاثَهُ الَّذِي مِن شِيعَتِهِ عَلَى الَّذِي مِنْ عَدُوِّهِ فَوَكَزَهُ مُوسَىٰ فَقَضَىٰ عَلَيْهِ ۖ قَالَ هَٰذَا مِنْ عَمَلِ الشَّيْطَانِ ۖ إِنَّهُ عَدُوٌّ مُّضِلٌّ مُّبِينٌ
(ఒకసారి) నగరవాసులు ఏమరుపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి వచ్చాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడు కోవటం చూశాడు. వారిలో ఒకతను తన వర్గానికి చెందినవాడు, ఇంకొకతను వైరి వర్గానికి చెందినవాడు. తన వర్గానికి చెందిన వ్యక్తి, శత్రువర్గానికి చెందినవానికి వ్యతిరేకంగా తనకు సహాయపడమని మూసాను పిలిచాడు. మూసా అతనికి ఒకే ఒక గుద్దు గుద్దాడు. అంతే, అది అతన్ని కడతేర్చింది. (అప్పుడు) మూసా "ఇది షైతాను పని. నిశ్చయంగా షైతాన్‌ బద్ధ విరోధి. స్పష్టంగా పెడదారి పట్టించేవాడు" అని పలికాడు.
28:16  قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي فَغَفَرَ لَهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
ఆ తరువాత అతను "నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. నన్ను క్షమించు" అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు అల్లాహ్‌ అతన్ని క్షమించాడు. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, దయామయుడు.
28:17  قَالَ رَبِّ بِمَا أَنْعَمْتَ عَلَيَّ فَلَنْ أَكُونَ ظَهِيرًا لِّلْمُجْرِمِينَ
"నా ప్రభూ! నీవు నన్ను అనుగ్రహించినట్లే నేను కూడా ఇకమీదట ఏ నేరస్థునికీ సహాయపడను" అని మూసా విన్నవించుకున్నాడు.
28:18  فَأَصْبَحَ فِي الْمَدِينَةِ خَائِفًا يَتَرَقَّبُ فَإِذَا الَّذِي اسْتَنصَرَهُ بِالْأَمْسِ يَسْتَصْرِخُهُ ۚ قَالَ لَهُ مُوسَىٰ إِنَّكَ لَغَوِيٌّ مُّبِينٌ
(మరునాడు) తెల్లవారుతుండగా మూసా భయపడుతూనే- నలువైపులా పరికిస్తూ - నగరంలోకి వెళ్ళాడు. అంతలోనే నిన్న సహాయం కోసం తనను అభ్యర్థించిన వ్యక్తే మళ్లీ తనకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు మూసా అతన్నుద్దేశించి, "నువ్వు పూర్తిగా మార్గం తప్పినవాడిలా ఉన్నావు" అన్నాడు.
28:19  فَلَمَّا أَنْ أَرَادَ أَن يَبْطِشَ بِالَّذِي هُوَ عَدُوٌّ لَّهُمَا قَالَ يَا مُوسَىٰ أَتُرِيدُ أَن تَقْتُلَنِي كَمَا قَتَلْتَ نَفْسًا بِالْأَمْسِ ۖ إِن تُرِيدُ إِلَّا أَن تَكُونَ جَبَّارًا فِي الْأَرْضِ وَمَا تُرِيدُ أَن تَكُونَ مِنَ الْمُصْلِحِينَ
ఆ తరువాత మూసా, తామిద్దరికీ శత్రువు అయిన వ్యక్తిని పట్టుకోబోతుండగా, "మూసా! ఏమిటీ, నువ్వు నిన్న ఒక వ్యక్తిని చంపేసినట్లే నన్ను కూడా చంపేయాలనుకుంటున్నావా? నువ్వు రాజ్యంలో దౌర్జన్యపరునిలా ప్రవర్తిస్తున్నావు. దిద్దుబాటు కోసం ప్రయత్నించాలన్న ధ్యాస నీలో ఏ కోశానా లేదే?!" అని ఆ వ్యక్తి అన్నాడు.
28:20  وَجَاءَ رَجُلٌ مِّنْ أَقْصَى الْمَدِينَةِ يَسْعَىٰ قَالَ يَا مُوسَىٰ إِنَّ الْمَلَأَ يَأْتَمِرُونَ بِكَ لِيَقْتُلُوكَ فَاخْرُجْ إِنِّي لَكَ مِنَ النَّاصِحِينَ
నగరం అటు చివరి నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి, "మూసా! ఇక్కడి పెద్దలు నిన్ను తుదముట్టించేందుకు సంప్రతింపులు జరుపుతున్నారు. అందుకే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో (నా మాట నమ్ము). నీ మంచిని కోరే వారిలో నేనూ ఒకణ్ణి" అన్నాడు.
28:21  فَخَرَجَ مِنْهَا خَائِفًا يَتَرَقَّبُ ۖ قَالَ رَبِّ نَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
అప్పుడు మూసా, భయపడుతూనే, (అటూ ఇటూ) చూసుకుంటూ అక్కణ్ణుంచి బయటపడ్డాడు. "ప్రభూ! నన్ను దుర్మార్గ జనుల చెర నుండి కాపాడు" అని వేడుకోసాగాడు.
28:22  وَلَمَّا تَوَجَّهَ تِلْقَاءَ مَدْيَنَ قَالَ عَسَىٰ رَبِّي أَن يَهْدِيَنِي سَوَاءَ السَّبِيلِ
అతను (మూసా) మద్‌యన్‌ దిక్కుకు ప్రయాణమైనప్పుడు, "నా ప్రభువు నన్ను సరైన మార్గంలోనే తీసుకుపోతాడని ఆశిస్తున్నాను" అన్నాడు.
28:23  وَلَمَّا وَرَدَ مَاءَ مَدْيَنَ وَجَدَ عَلَيْهِ أُمَّةً مِّنَ النَّاسِ يَسْقُونَ وَوَجَدَ مِن دُونِهِمُ امْرَأَتَيْنِ تَذُودَانِ ۖ قَالَ مَا خَطْبُكُمَا ۖ قَالَتَا لَا نَسْقِي حَتَّىٰ يُصْدِرَ الرِّعَاءُ ۖ وَأَبُونَا شَيْخٌ كَبِيرٌ
అతను మద్‌యన్‌ నీటి (బావి) వద్దకు చేరుకున్నప్పుడు, అక్కడ ఓ ప్రజా సమూహం (తమ పశువులకు) నీరు త్రాగిస్తున్నట్లు చూశాడు. మరో వైపు ఇద్దరు స్త్రీలు వేరుగా నిలబడి తమ (పశువుల)ను ఆపుతూ ఉండటం కనిపించింది. "ఇంతకీ మీ సమస్య ఏమిటీ?" అని మూసా దర్యాప్తు చేయగా, "ఈ పశువుల కాపరులు తిరిగిపోనంతవరకూ మేము (మా పశువులకు) నీరు త్రాగించలేము. మా నాన్నగారేమో మరీ ముసలివారు" అని ఆ పడతులు చెప్పారు.
28:24  فَسَقَىٰ لَهُمَا ثُمَّ تَوَلَّىٰ إِلَى الظِّلِّ فَقَالَ رَبِّ إِنِّي لِمَا أَنزَلْتَ إِلَيَّ مِنْ خَيْرٍ فَقِيرٌ
అందువల్ల అతను (స్వయంగా ముందుకు వచ్చి) వారి పశువులకు నీరు త్రాగించాడు. ఆ తరువాత నీడ వున్న చోటికి తిరిగి వచ్చి, "ప్రభూ! నువ్వు నా వద్దకు ఏ మేలును పంపినా నాకు దాని అవసరం ఎంతైనా వుంది" అని చెప్పుకున్నాడు.
28:25  فَجَاءَتْهُ إِحْدَاهُمَا تَمْشِي عَلَى اسْتِحْيَاءٍ قَالَتْ إِنَّ أَبِي يَدْعُوكَ لِيَجْزِيَكَ أَجْرَ مَا سَقَيْتَ لَنَا ۚ فَلَمَّا جَاءَهُ وَقَصَّ عَلَيْهِ الْقَصَصَ قَالَ لَا تَخَفْ ۖ نَجَوْتَ مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
అంతలోనే ఆ ఇద్దరు యువతులలో ఒకామె బిడియంతో అతని దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, "మీరు మా (పశువుల)కు నీరు త్రాగించిన దానికి ప్రతిఫలం ఇవ్వటానికి, మా నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు" అని చెప్పింది. మూసా ఆయన వద్దకు వచ్చినప్పుడు, తన వృత్తాంతమంతా వివరించాడు. "భయపడకు. నువ్వు దుర్మార్గ జనుల బారి నుంచి విముక్తి పొందావు" అని ఆయన ఓదార్చాడు.
28:26  قَالَتْ إِحْدَاهُمَا يَا أَبَتِ اسْتَأْجِرْهُ ۖ إِنَّ خَيْرَ مَنِ اسْتَأْجَرْتَ الْقَوِيُّ الْأَمِينُ
ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒకామె, "ఓ నాన్నా! ఈయన్ని జీతంపై పెట్టుకోండి. ఎందుకంటే, మీరు జీతంపై నియమించుకునే వారిలో బలవంతునిగా, నమ్మకస్థునిగా ఉండేవాడే ఉత్తముడు" అని అన్నది.
28:27  قَالَ إِنِّي أُرِيدُ أَنْ أُنكِحَكَ إِحْدَى ابْنَتَيَّ هَاتَيْنِ عَلَىٰ أَن تَأْجُرَنِي ثَمَانِيَ حِجَجٍ ۖ فَإِنْ أَتْمَمْتَ عَشْرًا فَمِنْ عِندِكَ ۖ وَمَا أُرِيدُ أَنْ أَشُقَّ عَلَيْكَ ۚ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّالِحِينَ
(ఆ పెద్ద మనిషి) ఇలా అన్నాడు: "నా ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. అయితే- నువ్వు (మహరుగా) ఎనిమిది సంవత్సరాలు నా దగ్గర సేవకునిగా ఉండాలి. ఒకవేళ నువ్వు పది సంవత్సరాలు పూర్తి చేయగలిగితే, అది నీ తరుఫు నుంచి (నాకు చేసిన మేలు అవుతుంది.) నిన్ను ఇబ్బందులపాలు చేయాలన్నది నా అభిమతం ఎంతమాత్రం కాదు. దైవచిత్తమయితే మున్ముందు నువ్వు నన్ను మంచివానిగా పొందుతావు."
28:28  قَالَ ذَٰلِكَ بَيْنِي وَبَيْنَكَ ۖ أَيَّمَا الْأَجَلَيْنِ قَضَيْتُ فَلَا عُدْوَانَ عَلَيَّ ۖ وَاللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌ
"మీకూ - నాకూ మధ్య ఇది (ఈ ఒప్పందం) కుదిరినట్లే. నేను ఈ రెండు గడువులలో ఏ ఒక్కటి పూర్తిచేసినా- ఆ తరువాత నాపై ఎలాంటి ఒత్తిడీ రాకూడదు. మనం చెప్పుకునే మాటలకు అల్లాహ్‌ సాక్షిగా ఉన్నాడు" అని మూసా పలికాడు.
28:29  فَلَمَّا قَضَىٰ مُوسَى الْأَجَلَ وَسَارَ بِأَهْلِهِ آنَسَ مِن جَانِبِ الطُّورِ نَارًا قَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَّعَلِّي آتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ جَذْوَةٍ مِّنَ النَّارِ لَعَلَّكُمْ تَصْطَلُونَ
మరి మూసా ఆ గడువును పూర్తి చేసి, తన ఇంటివారిని తీసుకుని వెళుతుండగా తూరు (పర్వతం) వైపు అగ్ని కనిపించింది. ఆయన తన ఇంటామెతో, "ఇక్కడే ఉండండి. నేను అగ్నిని చూశాను. బహుశా అక్కణ్ణుంచి నేను ఏదైనా సమాచారాన్నిగానీ, లేదా మీరు చలి కాచుకోవటానికి నిప్పు రవ్వనుగానీ తెస్తాను" అన్నాడు.
28:30  فَلَمَّا أَتَاهَا نُودِيَ مِن شَاطِئِ الْوَادِ الْأَيْمَنِ فِي الْبُقْعَةِ الْمُبَارَكَةِ مِنَ الشَّجَرَةِ أَن يَا مُوسَىٰ إِنِّي أَنَا اللَّهُ رَبُّ الْعَالَمِينَ
తీరా అక్కడకు చేరుకోగానే, ఆ లోయకు కుడి అంచున గల శుభప్రదమైన స్థలంలోని ఒక వృక్షం నుంచి, "మూసా! నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ను" అని పిలుపు వినవచ్చింది.
28:31  وَأَنْ أَلْقِ عَصَاكَ ۖ فَلَمَّا رَآهَا تَهْتَزُّ كَأَنَّهَا جَانٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَا مُوسَىٰ أَقْبِلْ وَلَا تَخَفْ ۖ إِنَّكَ مِنَ الْآمِنِينَ
"నీ చేతికర్రను పడవెయ్యి" (అన్న వాణి కూడా వినిపించింది). మరి ఆ కర్ర పాము మాదిరిగా మెలికలు తిరగటం చూసి, అతను వెనుతిరిగి పారిపోసాగాడు. కనీసం తిరిగి (దాని వంక) చూడనైనా లేదు. "ఓ మూసా! ముందుకు రా! భయపడకు. నిశ్చయంగా నువ్వు అన్ని విధాలా సురక్షితంగా ఉన్నావు."
28:32  اسْلُكْ يَدَكَ فِي جَيْبِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ وَاضْمُمْ إِلَيْكَ جَنَاحَكَ مِنَ الرَّهْبِ ۖ فَذَانِكَ بُرْهَانَانِ مِن رَّبِّكَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ ۚ إِنَّهُمْ كَانُوا قَوْمًا فَاسِقِينَ
"నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో. అది ఎలాంటి లోపం లేకుండానే - తెల్లగా మెరిసిపోతూ - బయటికి వస్తుంది. భీతావహస్థితి నుంచి (సురక్షితంగా ఉండటానికి) నీ చేతిని (మడచి) నీ పార్శ్యానికి ఆనించిపెట్టు. నువ్వు ఫిరౌను మరియు అతని అధికారుల వద్ద సమర్పించటానికి నీ ప్రభువు తరఫు నుంచి నీకు ఇవ్వబడిన రెండు మహిమలు ఇవి! నిశ్చయంగా వారంతా అవిధేయులుగా తయారయ్యారు" (అని మేమన్నాము).
28:33  قَالَ رَبِّ إِنِّي قَتَلْتُ مِنْهُمْ نَفْسًا فَأَخَافُ أَن يَقْتُلُونِ
మూసా ఇలా విన్నవించుకున్నాడు: "ప్రభూ! నేను వాళ్ల మనిషినొకతన్ని చంపి ఉన్నాను. కాబట్టి వాళ్ళిప్పుడు నన్ను హతమారుస్తారేమోనని నాకు భయంగా ఉంది."
28:34  وَأَخِي هَارُونُ هُوَ أَفْصَحُ مِنِّي لِسَانًا فَأَرْسِلْهُ مَعِيَ رِدْءًا يُصَدِّقُنِي ۖ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ
"నా సోదరుడైన హారూను నా కంటే మంచి వాక్పటిమ కలవాడు. అందువల్ల నన్ను ధృవీకరించే నిమిత్తం అతన్ని నా సహాయకునిగా చేసి పంపు. వాళ్ళు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది."
28:35  قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِأَخِيكَ وَنَجْعَلُ لَكُمَا سُلْطَانًا فَلَا يَصِلُونَ إِلَيْكُمَا ۚ بِآيَاتِنَا أَنتُمَا وَمَنِ اتَّبَعَكُمَا الْغَالِبُونَ
"మేము నీ సోదరునిచే నీ బాహువులను బలపరుస్తాము. మీరిద్దరికీ ప్రాబల్యాన్ని ఇస్తాము. వాళ్లు అసలు మీ దాకా రాలేరు. మా సూచనల ఆధారంగా మీరు, మీ అనుయాయులు విజయం సాధిస్తారు" అని అల్లాహ్‌ సెలవిచ్చాడు.
28:36  فَلَمَّا جَاءَهُم مُّوسَىٰ بِآيَاتِنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَٰذَا إِلَّا سِحْرٌ مُّفْتَرًى وَمَا سَمِعْنَا بِهَٰذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ
ఆ తరువాత మూసా, మేము ప్రసాదించిన స్పష్టమైన మహిమలను తీసుకుని వారి వద్దకు వచ్చినప్పుడు, "ఇది కాల్పనిక మాంత్రిక విద్యలా ఉంది. మేము మా పూర్వీకులైన మా తాత ముత్తాతల కాలంలో కూడా దీన్ని గురించి ఎన్నడూ వినలేదు" అని వారన్నారు.
28:37  وَقَالَ مُوسَىٰ رَبِّي أَعْلَمُ بِمَن جَاءَ بِالْهُدَىٰ مِنْ عِندِهِ وَمَن تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۖ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
మూసా ఇలా చెప్పాడు: "తన వద్ద నుంచి మార్గదర్శకత్వాన్ని తెచ్చే వ్యక్తి గురించి, పరలోక పరిణామం రీత్యా కృతార్థులయ్యే వారి గురించి నా ప్రభువుకు బాగా తెలుసు. దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు."
28:38  وَقَالَ فِرْعَوْنُ يَا أَيُّهَا الْمَلَأُ مَا عَلِمْتُ لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرِي فَأَوْقِدْ لِي يَا هَامَانُ عَلَى الطِّينِ فَاجْعَل لِّي صَرْحًا لَّعَلِّي أَطَّلِعُ إِلَىٰ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ مِنَ الْكَاذِبِينَ
అప్పుడు ఫిరౌన్‌ ఇలా అన్నాడు: "ఓ ప్రముఖులారా! నేను తప్ప మీకు మరో దేవుడున్నాడన్న సంగతి నాకు తెలీదు. హామాన్‌! విను. నువ్వు నా కోసం మట్టిని కాల్చు (ఇటుకలు తయారు చేయి). నా కోసం ఓ ఎత్తయిన ఆకాశహర్మ్యం నిర్మించు. (దాని పైకెక్కి) మూసా దేవుణ్ణి (అసలున్నాడో లేడో) తొంగి చూస్తాను. ఇతను మాత్రం అసత్యవాదుల్లో ఒకడని నా అనుమానం."
28:39  وَاسْتَكْبَرَ هُوَ وَجُنُودُهُ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَظَنُّوا أَنَّهُمْ إِلَيْنَا لَا يُرْجَعُونَ
వాడూ, వాడి సైనికులూ అకారణంగా రాజ్యంలో అహంకారం ప్రదర్శించారు. మా వద్దకు మరలి రావటం అనేది జరగదని వారు తలపోశారు.
28:40  فَأَخَذْنَاهُ وَجُنُودَهُ فَنَبَذْنَاهُمْ فِي الْيَمِّ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظَّالِمِينَ
ఎట్టకేలకు మేము వాణ్ణి, వాడి సైన్యాలను పట్టుకున్నాము. మరి వాళ్ళను సముద్రంలో పారేశాము. మరి చూడు, ఆ దుర్మార్గులకు ఏ గతిపట్టిందో!
28:41  وَجَعَلْنَاهُمْ أَئِمَّةً يَدْعُونَ إِلَى النَّارِ ۖ وَيَوْمَ الْقِيَامَةِ لَا يُنصَرُونَ
మేము వాళ్ళను నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. ప్రళయ దినాన వారు ఏ సహాయానికీ నోచుకోరు.
28:42  وَأَتْبَعْنَاهُمْ فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً ۖ وَيَوْمَ الْقِيَامَةِ هُم مِّنَ الْمَقْبُوحِينَ
మేము ఈ ప్రపంచంలో కూడా వారి వెనుక శాపాన్ని తగిలించాము. ప్రళయ దినాన కూడా వారు దౌర్భాగ్యుల జాబితాలో చేర్తారు.
28:43  وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ مِن بَعْدِ مَا أَهْلَكْنَا الْقُرُونَ الْأُولَىٰ بَصَائِرَ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةً لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ
ఈ పాత తరాన్ని అంతమొందించిన తరువాత మేము మానవులకు వెలుగుగా, మార్గదర్శనంగా, కారుణ్యంగా ఉండే గ్రంథాన్ని మూసాకు ప్రసాదించాము - తద్వారా వారు గుణపాఠం గ్రహిస్తారని!
28:44  وَمَا كُنتَ بِجَانِبِ الْغَرْبِيِّ إِذْ قَضَيْنَا إِلَىٰ مُوسَى الْأَمْرَ وَمَا كُنتَ مِنَ الشَّاهِدِينَ
(ఓ ముహమ్మద్‌-స!) మేము మూసాకు ఆజ్ఞను అందజేసినప్పుడు నువ్వు (తూరు పర్వతం) పశ్చిమం వైపున లేవు. దానికి నువ్వు సాక్షివి కూడా కావు.
28:45  وَلَٰكِنَّا أَنشَأْنَا قُرُونًا فَتَطَاوَلَ عَلَيْهِمُ الْعُمُرُ ۚ وَمَا كُنتَ ثَاوِيًا فِي أَهْلِ مَدْيَنَ تَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا وَلَٰكِنَّا كُنَّا مُرْسِلِينَ
కాని మేము ఎన్నో తరాల వారిని ప్రభవింపజేశాము. వారిపై సుదీర్ఘకాలం గడచిపోయింది. అయితే నువ్వు మద్‌యన్‌ వాసుల మధ్య కూడా - మా ఆయతులను చదివి వినిపించడానికి అక్కడ నివసించి ఉండలేదు. కాని మేము మాత్రం ప్రవక్తలను పంపిస్తూనే ఉండేవారము.
28:46  وَمَا كُنتَ بِجَانِبِ الطُّورِ إِذْ نَادَيْنَا وَلَٰكِن رَّحْمَةً مِّن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّا أَتَاهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
మేము (మూసాను) పిలిచినప్పుడు కూడా నువ్వు తూర్‌ (పర్వతం) వైపున లేవు. నిజానికి నీకు పూర్వం అప్రమత్తం చేసే వాడెవడూ రాని జాతిని నువ్వు అప్రమత్తం చేయడానికి; నీ ప్రభువు తరఫున (నీకు వొసగబడిన) కారుణ్యం ఇది. దీనిద్వారా వారు బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమో!
28:47  وَلَوْلَا أَن تُصِيبَهُم مُّصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَيَقُولُوا رَبَّنَا لَوْلَا أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًا فَنَتَّبِعَ آيَاتِكَ وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
వారు తమ చేతులారా ముందుగా చేసి పంపుకున్న (చెడు) కర్మల కారణంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చిపడిన పక్షంలో, "మా ప్రభూ! నువ్వు మా వద్దకు ఏ ప్రవక్తనయినా ఎందుకు పంపలేదు? (పంపి ఉంటే) మేము నీ ఆయతులను అనుసరించి, విశ్వాసులలో చేరి ఉండేవారము కదా!" అని అనేవారు. వారలా అనకుండా ఉండేపక్షంలో (మేము వారి వద్దకు ప్రవక్తను పంపి ఉండేవారమే కాదు).
28:48  فَلَمَّا جَاءَهُمُ الْحَقُّ مِنْ عِندِنَا قَالُوا لَوْلَا أُوتِيَ مِثْلَ مَا أُوتِيَ مُوسَىٰ ۚ أَوَلَمْ يَكْفُرُوا بِمَا أُوتِيَ مُوسَىٰ مِن قَبْلُ ۖ قَالُوا سِحْرَانِ تَظَاهَرَا وَقَالُوا إِنَّا بِكُلٍّ كَافِرُونَ
మరి వారి వద్దకు మా తరఫు నుంచి సత్యం వచ్చినప్పుడు, "మూసాకు ఇవ్వబడినదే ఈయనకు ఎందుకు ఇవ్వబడలేదు?" అని అనసాగారు. మరైతే ఇంతకు మునుపు మూసాకు ఇవ్వబడిన దానిపట్ల జనులు తిరస్కార వైఖరిని అవలంబించలేదా ఏమిటి? "వీరిద్దరూ (ఆరితేరిన) మాంత్రికులే. ఒండొకరికి చేదోడు వాదోడుగా ఉన్నారు" అని తేల్చి చెప్పేశారు. "మేము వీళ్ళందరినీ త్రోసి పుచ్చుతున్నాము" అని కూడా అన్నారు.
28:49  قُلْ فَأْتُوا بِكِتَابٍ مِّنْ عِندِ اللَّهِ هُوَ أَهْدَىٰ مِنْهُمَا أَتَّبِعْهُ إِن كُنتُمْ صَادِقِينَ
"ఒకవేళ మీరు సత్యవంతులే అయితే ఈ రెండింటికన్నా ఎక్కువగా సన్మార్గం చూపే గ్రంథాన్ని అల్లాహ్‌ వద్దనుంచి తీసుకురండి. నేను దానిని అనుసరిస్తాను" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
28:50  فَإِن لَّمْ يَسْتَجِيبُوا لَكَ فَاعْلَمْ أَنَّمَا يَتَّبِعُونَ أَهْوَاءَهُمْ ۚ وَمَنْ أَضَلُّ مِمَّنِ اتَّبَعَ هَوَاهُ بِغَيْرِ هُدًى مِّنَ اللَّهِ ۚ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
మరి వారు గనక నీ సవాలును స్వీకరించకపోతే, వారు తమ మనోవాంఛలను అనుసరించే జనులని తెలుసుకో. అల్లాహ్‌ మార్గ దర్శకత్వాన్ని కాకుండా తన మనోవాంఛల వెనుక నడిచేవాని కన్నా ఎక్కువ మార్గభ్రష్టుడెవడుంటాడు? అల్లాహ్‌ దుర్మార్గులకు ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు.
28:51  وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ الْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
ప్రజలు హితబోధను గ్రహించగలందులకు మేము మాత్రం వారికి మా వాక్కును నిరంతరం పంపించాము.
28:52  الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ مِن قَبْلِهِ هُم بِهِ يُؤْمِنُونَ
మేము లోగడ ఎవరికయితే గ్రంథం వొసగామో వారు దీనిని (ఖుర్‌ఆన్‌ను) కూడా విశ్వసిస్తారు.
28:53  وَإِذَا يُتْلَىٰ عَلَيْهِمْ قَالُوا آمَنَّا بِهِ إِنَّهُ الْحَقُّ مِن رَّبِّنَا إِنَّا كُنَّا مِن قَبْلِهِ مُسْلِمِينَ
వారికి, దానిని (ఖుర్‌ఆన్‌ను) చదివి వినిపించినప్పుడు, "ఇది మా ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం అని మేము విశ్వసిస్తున్నాము. అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లిములుగా ఉన్నాము" అని వారు చెబుతారు.
28:54  أُولَٰئِكَ يُؤْتَوْنَ أَجْرَهُم مَّرَّتَيْنِ بِمَا صَبَرُوا وَيَدْرَءُونَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
తాము చూపిన నిలకడ (సహన స్థయిర్యాల)కు గాను వారు రెండింతల ప్రతిఫలం ప్రసాదించబడతారు. వారు మంచి ద్వారా చెడును పారద్రోలుతారు. మేము ప్రసాదించిన దానిలో నుంచి (దానధర్మాల రూపేణా) ఖర్చుపెడతారు.
28:55  وَإِذَا سَمِعُوا اللَّغْوَ أَعْرَضُوا عَنْهُ وَقَالُوا لَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ سَلَامٌ عَلَيْكُمْ لَا نَبْتَغِي الْجَاهِلِينَ
వారు ఏదైనా పనికిమాలిన విషయం విన్నప్పుడు, వినీవిననట్లుగా తరలిపోతారు. "మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. అయ్యా! మీకో సలాం. అజ్ఞానులతో వాదించదలచుకోలేదు" అని చెప్పేస్తారు.
28:56  إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు కోరిన వారినల్లా సన్మార్గానికి తేలేవు. అయితే అల్లాహ్‌ తాను కోరిన వారిని సన్మార్గానికి తీసుకువస్తాడు. సన్మార్గానికి రాగలిగేవారెవరో ఆయనకు బాగా తెలుసు.
28:57  وَقَالُوا إِن نَّتَّبِعِ الْهُدَىٰ مَعَكَ نُتَخَطَّفْ مِنْ أَرْضِنَا ۚ أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
"మేమే గనక నీతో చేరి సన్మార్గాన్ని అనుసరిస్తే మా భూభాగం నుంచి మేము తరిమివేయబడటం ఖాయం" అని వారు గగ్గోలు చెందసాగారు. ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు.
28:58  وَكَمْ أَهْلَكْنَا مِن قَرْيَةٍ بَطِرَتْ مَعِيشَتَهَا ۖ فَتِلْكَ مَسَاكِنُهُمْ لَمْ تُسْكَن مِّن بَعْدِهِمْ إِلَّا قَلِيلًا ۖ وَكُنَّا نَحْنُ الْوَارِثِينَ
ఇంకా మేము, భోగభాగ్యాల మూలంగా మిడిసిపడే ఎన్నో జనవాసాలను తుదముట్టించాము. అవిగో, అవే వారి నివాస స్థలాలు! వారి తదనంతరం చాలా కొద్దిమంది మాత్రమే అక్కడ ఉండగలిగారు. ఆఖరికి అన్నింటికీ వారసులం అయ్యేది మేమే సుమా!
28:59  وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ الْقُرَىٰ حَتَّىٰ يَبْعَثَ فِي أُمِّهَا رَسُولًا يَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا ۚ وَمَا كُنَّا مُهْلِكِي الْقُرَىٰ إِلَّا وَأَهْلُهَا ظَالِمُونَ
జనవాసాల ముఖ్య పట్టణంలో తన ఆయతులను చదివి వినిపించే ప్రవక్తను పంపనంతవరకూ నీ ప్రభువు ఏ జనవాసాన్నీ (ఊరకే) నాశనం చేయడు. జనవాసాలలోని వారు దౌర్జన్య కాండకు ఒడిగట్టినప్పుడు మాత్రమే మేము వాటిని అంత మొందిస్తాము.
28:60  وَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا وَزِينَتُهَا ۚ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ وَأَبْقَىٰ ۚ أَفَلَا تَعْقِلُونَ
మీకు ఏదైతే ఇవ్వబడిందో అది (అశాశ్వితమైన) ప్రాపంచిక జీవిత సామగ్రి, దాని పైపూత (అలంకరణ) మాత్రమే. అయితే అల్లాహ్‌ వద్ద ఉన్నది అత్యుత్తమమైనది, శాశ్వితమైనదీను. ఏమిటి, మీరు ఆ మాత్రం గ్రహించరా?
28:61  أَفَمَن وَعَدْنَاهُ وَعْدًا حَسَنًا فَهُوَ لَاقِيهِ كَمَن مَّتَّعْنَاهُ مَتَاعَ الْحَيَاةِ الدُّنْيَا ثُمَّ هُوَ يَوْمَ الْقِيَامَةِ مِنَ الْمُحْضَرِينَ
మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని పొందిన వ్యక్తీను, మేము ప్రాపంచిక జీవితపు కొన్ని లాభాలను ప్రసాదించిన తరువాత ప్రళయదినాన (శిక్షకై) బంధించి తేబడిన వ్యక్తీను - ఇద్దరూ ఒక్కటవుతారా?
28:62  وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ
ఆ రోజు ఆయన వారిని పిలిచి, "మీరు నాకు భాగస్వాములుగా తలపోసినవారెక్కడ?" అని అడుగుతాడు.
28:63  قَالَ الَّذِينَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ رَبَّنَا هَٰؤُلَاءِ الَّذِينَ أَغْوَيْنَا أَغْوَيْنَاهُمْ كَمَا غَوَيْنَا ۖ تَبَرَّأْنَا إِلَيْكَ ۖ مَا كَانُوا إِيَّانَا يَعْبُدُونَ
ఎవరెవరికి ఈ మాట వర్తిస్తుందో వారిలా జవాబిస్తారు: "మా ప్రభూ! మేము దారి తప్పించింది ఇదిగో వీళ్ళనే. మేము దారి తప్పినట్లుగానే వీళ్ళను కూడా దారి తప్పించాము. ఇక వాళ్ళతో మాకెలాంటి సంబంధం లేదని నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. వీళ్లు మమ్మల్ని పూజించేవారు కారు."
28:64  وَقِيلَ ادْعُوا شُرَكَاءَكُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَرَأَوُا الْعَذَابَ ۚ لَوْ أَنَّهُمْ كَانُوا يَهْتَدُونَ
"మీరు మీ 'భాగస్వాములను' పిలుచుకోండి" అని వారితో అనబడుతుంది. వారు వారిని (తమ భాగస్వాములను) పిలుస్తారు. కాని వారు కనీసం వారికి సమాధానం కూడా ఇవ్వరు. మరి వారంతా శిక్షను చూస్తారు. వారు సన్మార్గం పొంది ఉంటే ఎంత బావుండేది!
28:65  وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ مَاذَا أَجَبْتُمُ الْمُرْسَلِينَ
ఆ రోజు (అల్లాహ్‌) వారిని పిలిచి, "ఇంతకీ మీరు ప్రవక్తలకు ఏం సమాధానమిచ్చారు?" అని అడుగుతాడు.
28:66  فَعَمِيَتْ عَلَيْهِمُ الْأَنبَاءُ يَوْمَئِذٍ فَهُمْ لَا يَتَسَاءَلُونَ
మరి ఆ రోజు వారి నిదర్శనాలన్నీ మాయమయిపోతాయి. వారు పరస్పరం ఏమీ అడగనూ లేరు.
28:67  فَأَمَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا فَعَسَىٰ أَن يَكُونَ مِنَ الْمُفْلِحِينَ
అయితే ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సదాచరణ చేస్తారో వారు సాఫల్యం పొందేవారిలో చేరే అవకాశం ఎంతైనా ఉందని ఆశించవచ్చు.
28:68  وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ ۗ مَا كَانَ لَهُمُ الْخِيَرَةُ ۚ سُبْحَانَ اللَّهِ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిలో ఎవరికీ ఎటువంటి అధికారం లేదు. అల్లాహ్‌ పరమ పవిత్రుడు. వారు కల్పించే భాగస్వామ్యాలన్నింటికీ ఆయన అతీతుడు, ఉన్నతుడు.
28:69  وَرَبُّكَ يَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ
వారి హృదయాలలో దాగి ఉండేదీ, వారు బయటపెట్టేది - అంతా నీ ప్రభువుకు తెలుసు.
28:70  وَهُوَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْحَمْدُ فِي الْأُولَىٰ وَالْآخِرَةِ ۖ وَلَهُ الْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ
ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప వేరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు. ఆదిలోనూ, అంతంలోనూ ఆయనే స్తుతింపదగిన వాడు. శాసించే అధికారం కూడా ఆయనకే చెల్లుతుంది. (ఎట్టకేలకు) మీరంతా ఆయన వైపుకే మరలించబడతారు.
28:71  قُلْ أَرَأَيْتُمْ إِن جَعَلَ اللَّهُ عَلَيْكُمُ اللَّيْلَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُم بِضِيَاءٍ ۖ أَفَلَا تَسْمَعُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు : "చూడండి! ఒకవేళ అల్లాహ్‌ ప్రళయదినం వరకూ మీపై రాత్రిని - శాశ్వతంగా - ఆవరింపజేస్తే, అట్టి పరిస్థితిలో అల్లాహ్‌ తప్ప మీ వద్దకు (పగటి) వెలుతురును తెచ్చే దేముడు ఎవడున్నాడు? మరి మీరు వినరేమిటి?"
28:72  قُلْ أَرَأَيْتُمْ إِن جَعَلَ اللَّهُ عَلَيْكُمُ النَّهَارَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ مَنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُم بِلَيْلٍ تَسْكُنُونَ فِيهِ ۖ أَفَلَا تُبْصِرُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: "చూడండి! ఒకవేళ అల్లాహ్‌ ప్రళయదినం వరకూ మీపై పగలును - శాశ్వతంగా - విధించినట్లయితే అప్పుడైనా అల్లాహ్‌ తప్ప మీ వద్దకు - మీరు విశ్రాంతిని పొందేందుకు రాత్రిని తేగల దేవుడెవడు? మరి మీరు గమనించరేమిటి?"
28:73  وَمِن رَّحْمَتِهِ جَعَلَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ لِتَسْكُنُوا فِيهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
ఆయనే తన కృపతో మీకోసం రేయింబవళ్ళను చేశాడు - మీరు రాత్రిపూట విశ్రాంతిని పొందటానికి, పగటిపూట ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికీను! మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారనే ఇదంతా చేయబడింది.
28:74  وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ
ఆ రోజు ఆయన వారిని పిలిచి, "మీరు ఎవరెవరిని నా భాగస్వాములుగా తలపోసేవారో వారెక్కడ?" అని అడుగుతాడు.
28:75  وَنَزَعْنَا مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا فَقُلْنَا هَاتُوا بُرْهَانَكُمْ فَعَلِمُوا أَنَّ الْحَقَّ لِلَّهِ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
ఇంకా, మేము ప్రతి మానవ సముదాయం నుంచి ఒక్కో సాక్షిని తీసుకుంటాము. ఆ తరువాత, "ఏదీ, మీ ప్రమాణాన్ని తీసుకురండి" అని అంటాము. అప్పుడు వారు, సత్యం అల్లాహ్‌ పక్షానే ఉందని తెలుసుకుంటారు. వారు అల్లే కట్టుకథలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి.
28:76  إِنَّ قَارُونَ كَانَ مِن قَوْمِ مُوسَىٰ فَبَغَىٰ عَلَيْهِمْ ۖ وَآتَيْنَاهُ مِنَ الْكُنُوزِ مَا إِنَّ مَفَاتِحَهُ لَتَنُوءُ بِالْعُصْبَةِ أُولِي الْقُوَّةِ إِذْ قَالَ لَهُ قَوْمُهُ لَا تَفْرَحْ ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْفَرِحِينَ
చూడబోతే, ఖారూన్‌ కూడా మూసా జాతికి చెందినవాడే. కాని వాడు తన వారిపైనే దురాగతాలకు పాల్పడసాగాడు. మేము వాడికి ఎంత ఖజానాను ప్రసాదించామంటే దాని తాళపుచెవులను అనేక మంది బలాఢ్యులు కలసి కూడా అతి కష్టమ్మీద ఎత్తగలిగే వారు. ఒకసారి అతని జాతివారు అతన్నుద్దేశించి ఇలా అన్నారు: "మిడిసిపడకు. మిడిసిపడే వారిని అల్లాహ్‌ ఇష్ట పడడు.
28:77  وَابْتَغِ فِيمَا آتَاكَ اللَّهُ الدَّارَ الْآخِرَةَ ۖ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا ۖ وَأَحْسِن كَمَا أَحْسَنَ اللَّهُ إِلَيْكَ ۖ وَلَا تَبْغِ الْفَسَادَ فِي الْأَرْضِ ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُفْسِدِينَ
"అల్లాహ్‌ నీకు ప్రసాదించిన దానితో పరలోక స్థానాన్ని కూడా అన్వేషించు. మరి నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువబోకు. అల్లాహ్‌ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదేవిధంగా నువ్వు కూడా (ప్రజల పట్ల) సద్వ్యవహారం చెయ్యి. భువిలో అరాచకం కోసం ఆరాటపడకు. అరాచకం సృష్టించగోరే వారిని అల్లాహ్‌ ఎంతమాత్రం ఇష్టపడడు."
28:78  قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَىٰ عِلْمٍ عِندِي ۚ أَوَلَمْ يَعْلَمْ أَنَّ اللَّهَ قَدْ أَهْلَكَ مِن قَبْلِهِ مِنَ الْقُرُونِ مَنْ هُوَ أَشَدُّ مِنْهُ قُوَّةً وَأَكْثَرُ جَمْعًا ۚ وَلَا يُسْأَلُ عَن ذُنُوبِهِمُ الْمُجْرِمُونَ
"ఇదంతా నాకున్న ప్రజ్ఞాపాటవాల మూలంగానే నాకు వొసగబడింద"ని వాడు (ఖారూన్‌) చెప్పాడు. ఏమిటి, ఇతనికి మునుపు ఇతనికన్నా ఎక్కువ బలవంతులను, మూలధనాన్ని ప్రోగు చేసిన వారినెంతో మందిని అల్లాహ్‌ అంతమొందించాడన్న సంగతి ఇతనికి తెలియదా? అట్టి పరిస్థితిలో పాపాత్ములను వారి పాపాల గురించి అడగటం జరగదు.
28:79  فَخَرَجَ عَلَىٰ قَوْمِهِ فِي زِينَتِهِ ۖ قَالَ الَّذِينَ يُرِيدُونَ الْحَيَاةَ الدُّنْيَا يَا لَيْتَ لَنَا مِثْلَ مَا أُوتِيَ قَارُونُ إِنَّهُ لَذُو حَظٍّ عَظِيمٍ
మరి వాడు అంగరంగ వైభవంతో తన జాతి జనులలోకి కదలి వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక జీవితాన్ని కోరుకునే వారు, "ఖారూనుకు ప్రసాదించబడినదే మాకు కూడా లభిస్తే ఎంత బాగుండును! నిజంగా ఇతను గొప్ప భాగ్యవంతుడు" అన్నారు.
28:80  وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَيْلَكُمْ ثَوَابُ اللَّهِ خَيْرٌ لِّمَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا وَلَا يُلَقَّاهَا إِلَّا الصَّابِرُونَ
అప్పుడు (ధర్మ) జ్ఞానం వొసగబడిన వారు వారిని బోధపరుస్తూ ఇలా అన్నారు: (మీ పరిస్థితి) కడు శోచనీయం! పుణ్యం రూపంలో అల్లాహ్‌ ఇచ్చేదే విశ్వసించి, సదాచరణ చేసే వారి కొరకు మేలైనది సుమా! అయితే ఈ విషయం (భాగ్యం) సహనశీలురైన వారికే ప్రాప్తిస్తుంది."
28:81  فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ فَمَا كَانَ لَهُ مِن فِئَةٍ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مِنَ الْمُنتَصِرِينَ
(ఎట్టకేలకు) మేమతన్ని, అతని నిలయాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్‌ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.
28:82  وَأَصْبَحَ الَّذِينَ تَمَنَّوْا مَكَانَهُ بِالْأَمْسِ يَقُولُونَ وَيْكَأَنَّ اللَّهَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ ۖ لَوْلَا أَن مَّنَّ اللَّهُ عَلَيْنَا لَخَسَفَ بِنَا ۖ وَيْكَأَنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ
నిన్నటి రోజున అతని స్థాయికి చేరుకోవాలని కాంక్షించిన వారంతా నేటి ఉదయం ఇలా చెప్పుకున్నారు : "ఆహ్‌! అల్లాహ్‌ తన దాసులలో తాను కోరినవారి ఉపాధిని విస్తృతపరుస్తాడు. మరి తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు. అల్లాహ్‌ కృపయే గనక మాపై లేకుండాపోతే ఆయన మమ్మల్ని కూడా నేలలో కూర్చివేసి ఉండేవాడే. దేవుని మేళ్లను మరచినవారెన్నటికీ సాఫల్యం పొందలేరన్న సంగతిని మీరు గమనించటం లేదా?"
28:83  تِلْكَ الدَّارُ الْآخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوًّا فِي الْأَرْضِ وَلَا فَسَادًا ۚ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ
ఎవరు భువిలో బడాయిని ప్రదర్శించకుండా, కల్లోలాన్ని రేకెత్తించకుండా ఉంటారో వారి కోసమే మేము ఈ పరలోక నెలవును ప్రత్యేకించాము. సత్ఫలితం భయభక్తులు గల వారి కొరకే సుమా!
28:84  مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ خَيْرٌ مِّنْهَا ۖ وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَى الَّذِينَ عَمِلُوا السَّيِّئَاتِ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
(తీర్పుదినాన) మంచిని తెచ్చిన వానికి, దానికన్నా మేలైనది లభిస్తుంది. ఇక చెడును తెచ్చినవారికి; వారి చెడు కర్మ మేరకే ప్రతిఫలం ఇవ్వబడుతుంది.
28:85  إِنَّ الَّذِي فَرَضَ عَلَيْكَ الْقُرْآنَ لَرَادُّكَ إِلَىٰ مَعَادٍ ۚ قُل رَّبِّي أَعْلَمُ مَن جَاءَ بِالْهُدَىٰ وَمَنْ هُوَ فِي ضَلَالٍ مُّبِينٍ
(ఓ ప్రవక్తా!) నీపై ఖుర్‌ఆన్‌ను అవతరింపజేసినవాడు నిన్ను తిరిగి పూర్వస్థలానికి చేర్చనున్నాడు. ఈ విధంగా చెప్పు: సన్మార్గాన్ని తీసుకువచ్చిన వారెవరో నా ప్రభువుకు బాగా తెలుసు. స్పష్టమైన అపమార్గంలో పడిఉన్నదెవరో కూడా ఆయనకు తెలుసు."
28:86  وَمَا كُنتَ تَرْجُو أَن يُلْقَىٰ إِلَيْكَ الْكِتَابُ إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ ظَهِيرًا لِّلْكَافِرِينَ
నీ వద్దకు గ్రంథం పంపబడుతుందని నువ్వు కనీసం ఊహించనైనా లేదు. అయితే నీ ప్రభువు దయవల్ల (ఇది నీ వద్దకు పంపబడింది). కాబట్టి ఇక నువ్వు అవిశ్వాసులకు సహాయకుడవు కారాదు.
28:87  وَلَا يَصُدُّنَّكَ عَنْ آيَاتِ اللَّهِ بَعْدَ إِذْ أُنزِلَتْ إِلَيْكَ ۖ وَادْعُ إِلَىٰ رَبِّكَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ
అల్లాహ్‌ ఆయతులు నీవద్దకు పంపబడిన తరువాత వారు (ఈ అవిశ్వాసులు) నిన్ను దైవాదేశాల (ప్రచారం) నుండి ఆపరాదు సుమా! కనుక నువ్వు నీ ప్రభువు వైపునకు పిలుస్తూ ఉండు. షిర్క్‌ చేసేవారిలో చేరిపోకు.
28:88  وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۘ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ كُلُّ شَيْءٍ هَالِكٌ إِلَّا وَجْهَهُ ۚ لَهُ الْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ
అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు. ఆయన ముఖం తప్ప ప్రతిదీ నశించిపోయేదే. ఆజ్ఞాపించే అధికారం ఆయనకే చెల్లు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.