aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

26. సూరా ఆష్ షుఅరా

26:1  طسم
తా - సీన్‌ - మీమ్‌.
26:2  تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ
ఇవి స్పష్టమైన గ్రంథ వచనాలు.
26:3  لَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ أَلَّا يَكُونُوا مُؤْمِنِينَ
(ఓ ముహమ్మద్‌-స!) వారు విశ్వసించలేదే! అన్న బెంగతో నువ్వు నీ ప్రాణాలను పోగొట్టుకుంటావు కాబోలు!
26:4  إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ السَّمَاءِ آيَةً فَظَلَّتْ أَعْنَاقُهُمْ لَهَا خَاضِعِينَ
మేము గనక తలచుకుంటే ఆకాశం నుంచి ఒక (గొప్ప) నిదర్శనాన్ని అవతరింపజేసి, దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం.
26:5  وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّنَ الرَّحْمَٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا عَنْهُ مُعْرِضِينَ
కరుణామయుని (అల్లాహ్‌) తరఫు నుంచి వారివద్దకు ఏ నూతన ఉపదేశం వచ్చినా వారు దాని పట్ల విముఖత చూపకుండా ఉండలేదు.
26:6  فَقَدْ كَذَّبُوا فَسَيَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
వారు ధిక్కరించారు. కాబట్టి వారు అవహేళన చేసిన విషయాల వార్తలు త్వరలోనే వారివద్దకు చేరుతాయి.
26:7  أَوَلَمْ يَرَوْا إِلَى الْأَرْضِ كَمْ أَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ
ఏమిటీ, వారు భూమిపై దృష్టిని సారించలేదా? అందులో మేము అన్నిరకాల శ్రేష్ఠమైన జంట వస్తువులను ఎలా ఉత్పన్నం చేసి ఉన్నామో! (చూడలేదా?)
26:8  إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిస్సందేహంగా అందులో ఓ సూచన ఉంది. అయినప్పటికీ వారిలో చాలా మంది విశ్వసించరు.
26:9  وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా నీ ప్రభువు, ఆయనే - సర్వశక్తుడు, దయాశీలుడు.
26:10  وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ
నీ ప్రభువు మూసాను పిలిచి, "నువ్వు దుర్మార్గులైన ప్రజల వద్దకు వెళ్ళు (అని చెప్పిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకో).
26:11  قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ
"అంటే ఫిర్‌ఔను జనుల వద్దకు! వారు (అల్లాహ్‌కు) భయపడరా?"
26:12  قَالَ رَبِّ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ
(మూసా) ఇలా అన్నాడు : "నా ప్రభూ! వారు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది.
26:13  وَيَضِيقُ صَدْرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرْسِلْ إِلَىٰ هَارُونَ
"నా గుండె కుంచించుకుపోతోంది. నా నోరు సరిగ్గా (స్వేచ్ఛగా) పెగలటం లేదు. అందుకే హారూను వైపుకు కూడా సందేశం (వహీ) పంపించు.
26:14  وَلَهُمْ عَلَيَّ ذَنبٌ فَأَخَافُ أَن يَقْتُلُونِ
"వారి తరఫున నాపై ఒక నేరారోపణ కూడా ఉంది. అందువల్ల వారు నన్ను చంపేస్తారేమోనని భయపడుతున్నాను."
26:15  قَالَ كَلَّا ۖ فَاذْهَبَا بِآيَاتِنَا ۖ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ
(అల్లాహ్‌) ఇలా సెలవిచ్చాడు: "ఎట్టి పరిస్థితిలోనూ అలా జరగదు. మీరిద్దరూ నా నిదర్శనాలను తీసుకుని వెళ్ళండి. మేము స్వయంగా మీ వెంట ఉండి అంతా వింటూ ఉంటాము.
26:16  فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَا إِنَّا رَسُولُ رَبِّ الْعَالَمِينَ
"మీరిద్దరూ ఫిర్‌ఔను దగ్గరకు వెళ్ళి, 'నిశ్చయంగా మేము సర్వలోక ప్రభువు తరఫున పంపబడ్డాము' అని పలకండి."
26:17  أَنْ أَرْسِلْ مَعَنَا بَنِي إِسْرَائِيلَ
'నువ్వు ఇస్రాయీలు సంతతి వారిని మా వెంట పంపించు' అని అనండి.
26:18  قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ
(మూసాతో ఫిరౌను) ఇలా అన్నాడు : "ఏమిటీ? మేము నీ పసితనంలో నిన్ను మా దగ్గర పోషించలేదా? నీ జీవితంలోని అనేక సంవత్సరాలు నువ్వు మా వద్ద గడిపావు కూడా!
26:19  وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِي فَعَلْتَ وَأَنتَ مِنَ الْكَافِرِينَ
"ఆ తరువాత నువ్వు చేయాల్సింది చేసి వెళ్ళావు. మొత్తానికి చేసిన మేలును మరచిన వారిలో నువ్వూ ఒకడివి."
26:20  قَالَ فَعَلْتُهَا إِذًا وَأَنَا مِنَ الضَّالِّينَ
మూసా ఈ విధంగా సమాధానమిచ్చాడు : "(అవును). నేను దారితప్పి వున్న స్థితిలో ఆ పని చేశాను.
26:21  فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِي رَبِّي حُكْمًا وَجَعَلَنِي مِنَ الْمُرْسَلِينَ
"ఆ తరువాత నేను మీకు భయపడి మీ నుంచి పారిపోయాను. ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని వొసగాడు. నన్ను తన సందేశహరులలో చేర్చుకున్నాడు.
26:22  وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَيَّ أَنْ عَبَّدتَّ بَنِي إِسْرَائِيلَ
"ఇక నువ్వు నాకు ఉపకారం చేశావని ఎత్తిపొడుస్తున్న విషయమంటావా? వాస్తవానికి నువ్వు ఇస్రాయీలు సంతతిని బానిసలుగా చేసి పెట్టుకున్నావు."
26:23  قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعَالَمِينَ
"ఇంతకీ సకల లోకాల ప్రభువు అంటే ఏమిటి?" అని ప్రశ్నించాడు ఫిరౌను.
26:24  قَالَ رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ
"మీరు నమ్మగలవారే అయితే (వినండి) ఆయన ఆకాశాలకూ, భూమికీ, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు" అని మూసా జవాబిచ్చాడు.
26:25  قَالَ لِمَنْ حَوْلَهُ أَلَا تَسْتَمِعُونَ
ఫిరౌను తన చుట్టూ ఉన్న వారినుద్దేశించి, "(ఇతనేమంటున్నాడో) మీరు వినటంలేదా?" అన్నాడు.
26:26  قَالَ رَبُّكُمْ وَرَبُّ آبَائِكُمُ الْأَوَّلِينَ
"ఆయన మీకూ ప్రభువే, మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలకు కూడా ప్రభువే" అన్నాడు మూసా.
26:27  قَالَ إِنَّ رَسُولَكُمُ الَّذِي أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ
"(ప్రజలారా!) మీ వద్దకు పంపబడిన ఈ మీ ప్రవక్త ముమ్మాటికీ పిచ్చివాడే" అని ఫిరౌన్‌ అన్నాడు.
26:28  قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ
"మీరు గనక గ్రహించగలిగితే, ప్రాక్పశ్చిమాలకు, వాటి మధ్య నున్న సమస్తానికీ ఆయనే ప్రభువు" అని మూసా చెప్పుకుపోతున్నాడు.
26:29  قَالَ لَئِنِ اتَّخَذْتَ إِلَٰهًا غَيْرِي لَأَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُونِينَ
"(ఇదిగో జాగ్రత్తగా విను!) నువ్వు నన్ను గాక వేరెవరినయినా ఆరాధ్య దైవంగా చేసుకున్నావంటే నేను నిన్ను కారాగారంలో పడవేస్తాను" అని ఫిరౌను హెచ్చరించాడు.
26:30  قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَيْءٍ مُّبِينٍ
"ఏమిటీ? నేను స్పష్టమైన వస్తువును నీ వద్దకు తెచ్చినప్పటికీ (నువ్వు దారికి రావా?)" అని మూసా పలికాడు.
26:31  قَالَ فَأْتِ بِهِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
"నువ్వు సత్యవంతుడవే అయితే అదేదో చూపు" అని ఫిరౌన్‌ అన్నాడు.
26:32  فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِيَ ثُعْبَانٌ مُّبِينٌ
అతను (అప్పటికప్పుడే) తన చేతి కర్రను పడవేయగానే అదొక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది.
26:33  وَنَزَعَ يَدَهُ فَإِذَا هِيَ بَيْضَاءُ لِلنَّاظِرِينَ
అతను తన చేతిని (చంకలో నుంచి) బయటికి లాగగానే, అది చూపరులకు తెల్లగా (మెరిసిపోతూ ఉన్నట్లు) కానవచ్చింది.
26:34  قَالَ لِلْمَلَإِ حَوْلَهُ إِنَّ هَٰذَا لَسَاحِرٌ عَلِيمٌ
ఫిరౌను తన దగ్గరున్న పెద్దలనుద్దేశించి ఇలా అన్నాడు : "ఇతను ఆరితేరిన మాంత్రికునిలా ఉన్నాడు.
26:35  يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِ فَمَاذَا تَأْمُرُونَ
"తన మాంత్రిక బలంతో మిమ్మల్ని మీ భూమి నుంచి వెళ్ళ గొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు మీఆదేశం ఏమిటో చెప్పండి."
26:36  قَالُوا أَرْجِهْ وَأَخَاهُ وَابْعَثْ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
"తమరు ఇతనికీ, ఇతని సోదరునికి కొంత గడువు ఇవ్వండి. పట్టణాలన్నింటికీ మీ ప్రకటన కర్తలను పంపించండి -
26:37  يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ
మాంత్రిక విద్యలో ప్రవీణులైన వారందరిని వారు మీ వద్దకు తీసుకు వస్తారు" అని వారంతా సలహా ఇచ్చారు.
26:38  فَجُمِعَ السَّحَرَةُ لِمِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ
ఆ తరువాత ఒక నిర్ధారిత దినాన నిర్దేశిత స్థలంలో మాంత్రికులంతా సమావేశపరచబడ్డారు.
26:39  وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ
ప్రజలతో, "మీరు కూడా సమావేశానికి హాజరవుతారా?!" అని అనబడింది.
26:40  لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ إِن كَانُوا هُمُ الْغَالِبِينَ
"ఒకవేళ (మన) మాంత్రికులు గనక గెలిస్తే మనమంతా వాళ్ళ (మతము)నే అనుసరిద్దాం" (అని చెప్పటం జరిగింది).
26:41  فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالُوا لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ الْغَالِبِينَ
మంత్రగాళ్ళు వచ్చాక, ఫిర్‌ఔనుతో, "మేము గెలిస్తే మాకేదన్నా పారితోషికం ఉంటుందా?" అని అడిగారు.
26:42  قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًا لَّمِنَ الْمُقَرَّبِينَ
"అవును. మీరు నా సన్నిహితులుగా ఉంటారు" అని చెప్పాడు ఫిరౌన్‌ (సంబరపడుతూ).
26:43  قَالَ لَهُم مُّوسَىٰ أَلْقُوا مَا أَنتُم مُّلْقُونَ
మూసా మాంత్రికులనుద్దేశించి, "మీరు పడవేయదలచుకున్న వాటిని పడవెయ్యండి" అన్నాడు.
26:44  فَأَلْقَوْا حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ الْغَالِبُونَ
వాళ్లు తమ త్రాళ్లను, కర్రలను పడవేసి, "ఫిరౌను గౌరవ మర్యాదల సాక్షిగా! ముమ్మాటికీ మేమే గెలుస్తాము" అని పలికారు.
26:45  فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِيَ تَلْقَفُ مَا يَأْفِكُونَ
మరి మూసా కూడా తన చేతికర్రను పడవేశాడు. అమాంతం అది వారి బూటకపు విన్యాసాలను మ్రింగటం మొదలెట్టింది.
26:46  فَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
అంతే! మాంత్రికులంతా (అనూహ్యంగా) సాష్టాంగపడి పోయారు.
26:47  قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
వారు (స్పష్టంగా) ఇలా అన్నారు: "మేము సర్వలోక ప్రభువైన అల్లాహ్‌ను విశ్వసించాము
26:48  رَبِّ مُوسَىٰ وَهَارُونَ
అంటే మూసా, హారూనుల ప్రభువును (విశ్వసించాము)."
26:49  قَالَ آمَنتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
"ఏమిటీ? నేను అనుమతి ఇవ్వక ముందే మీరతన్ని విశ్వసించారా? నిశ్చయంగా ఇతడు మీకందరికీ మంత్ర విద్యను నేర్పిన పెద్ద (గురువు)లా ఉన్నాడు. సరే, ఇప్పుడే మీకు తెలుస్తుంది.... నేనిప్పుడే మీ కాళ్లు చేతుల్ని వ్యతిరేక దిశలో నరికి, మీ అందరికీ శిలువవేస్తాను" అని ఫిరౌన్‌ గర్జించాడు.
26:50  قَالُوا لَا ضَيْرَ ۖ إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ
దానికి వారు ఇలా అన్నారు : "మరేమీ ఫరవాలేదు. మేమెలాగూ మా ప్రభువు వద్దకు మరలి వెళ్ళవలసిన వారమే.
26:51  إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَايَانَا أَن كُنَّا أَوَّلَ الْمُؤْمِنِينَ
"అందరికంటే ముందు మేము విశ్వసించాము. కనుక మా ప్రభువు మా పాపాలన్నింటినీ క్షమిస్తాడన్న ఆశ మాకుంది."
26:52  وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي إِنَّكُم مُّتَّبَعُونَ
"రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని వెళ్ళిపో. మీరంతా వెంబడించబడతారు" అని మేము మూసాకు వహీ పంపాము.
26:53  فَأَرْسَلَ فِرْعَوْنُ فِي الْمَدَائِنِ حَاشِرِينَ
ఫిరౌన్‌ అన్ని పట్టణాలకూ తన వార్తాహరులను పంపించాడు.
26:54  إِنَّ هَٰؤُلَاءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ
"చూడబోతే వాళ్లు (ఇస్రాయీలు సంతతివారు) అతికొద్ది మంది మాత్రమే.
26:55  وَإِنَّهُمْ لَنَا لَغَائِظُونَ
"కాని వాళ్లు మమ్మల్ని ఆగ్రహోదగ్రుల్ని చేస్తున్నారు.
26:56  وَإِنَّا لَجَمِيعٌ حَاذِرُونَ
"యదార్థానికి మా సమూహం (చాలా పెద్దది) సదా అప్రమత్తంగా ఉండేది" (అంటూ ఫిరౌను జాతి ప్రజలను రెచ్చ గొట్టటం జరిగింది)."
26:57  فَأَخْرَجْنَاهُم مِّن جَنَّاتٍ وَعُيُونٍ
ఎట్టకేలకు మేము వాళ్ళను (వారి) తోటల నుండి, చెలమల నుండి బైటికి లాగాము.
26:58  وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ
ధనాగారాల నుండి, గౌరవప్రదమైన స్థానాల నుండి (బయటికి ఈడ్చాము).
26:59  كَذَٰلِكَ وَأَوْرَثْنَاهَا بَنِي إِسْرَائِيلَ
ఈ విధంగా జరిగింది. మరి మేము ఈ వస్తువులకు ఇస్రాయీలు సంతతివారిని వారసులుగా చేశాము.
26:60  فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ
సూర్యోదయమవగానే వారు (ఫిరౌనీయులు) ఇస్రాయీల్‌ జాతిని వెంబడించసాగారు.
26:61  فَلَمَّا تَرَاءَى الْجَمْعَانِ قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఇరు పక్షాలవారు ఒండొకరిని చూడగానే, "ఇక మనం పట్టుబడిపోయినట్లే" అని మూసా సహచరులు (ఆందోళనతో) పలికారు.
26:62  قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
"అలా ఎంతమాత్రం జరగదు. నిశ్చయంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాకు తప్పకుండా దారి చూపుతాడు" అని మూసా అన్నాడు.
26:63  فَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنِ اضْرِب بِّعَصَاكَ الْبَحْرَ ۖ فَانفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ
"నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు" అని మేము మూసాకు వహీ పంపాము. అంతే! అప్పటికప్పుడే సముద్రం చీలిపోయింది. ప్రతి చీలిక భాగం పెద్ద పర్వతంలా అయిపోయింది.
26:64  وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ
మేము ఆ స్థలానికి దగ్గరగా రెండో సమూహాన్ని చేర్చాము.
26:65  وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُ أَجْمَعِينَ
మూసాను, అతని వెంటవున్న సహచరులందరినీ కాపాడాము.
26:66  ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
మరి మిగతా వారందరినీ ముంచి వేశాము.
26:67  إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా ఇందులో గొప్ప సూచన ఉంది. (అయినప్పటికీ) వారిలో అత్యధికులు విశ్వసించేవారు కారు.
26:68  وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిస్సందేహంగా నీ ప్రభువు శక్తిశాలి, దయాశీలి.
26:69  وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَاهِيمَ
వారికి ఇబ్రాహీమ్‌ సమాచారాన్ని కూడా చదివి వినిపించు.
26:70  إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا تَعْبُدُونَ
"మీరెవరిని పూజిస్తున్నారు?" అని అతను తన తండ్రిని, తన జాతి వారిని అడిగినప్పుడు,
26:71  قَالُوا نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَاكِفِينَ
"మేము విగ్రహాలను పూజిస్తున్నాము. (ఎల్లప్పుడూ) వాటి సేవకే అంకితమై ఉన్నాము" అని వారు సమాధానమిచ్చారు.
26:72  قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ
ఆయన వారిని ఇలా అడిగారు: "మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపును వింటాయా?
26:73  أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ
లేదా మీకు లాభంగానీ, నష్టంగానీ కలిగిస్తాయా?"
26:74  قَالُوا بَلْ وَجَدْنَا آبَاءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ
"(అదంతా మాకు అనవసరం) మా తాతముత్తాతలు ఈ విధంగా చేస్తుండగా మేము చూశాము" అని వారు బదులిచ్చారు.
26:75  قَالَ أَفَرَأَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ
- అతను (ఇబ్రాహీం) ఇలా అన్నాడు : "మీరు పూజిస్తున్నవాటిని (కాస్తయినా) గమనించారా?
26:76  أَنتُمْ وَآبَاؤُكُمُ الْأَقْدَمُونَ
"మీరుగానీ, మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ!
26:77  فَإِنَّهُمْ عَدُوٌّ لِّي إِلَّا رَبَّ الْعَالَمِينَ
"వారంతా నా శత్రువులు. ఒక్క సకలలోక ప్రభువు తప్ప.
26:78  الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ
"ఆయనే నన్ను సృష్టించాడు, మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు.
26:79  وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ
"ఆయనే నన్ను తినిపిస్తున్నాడు, త్రాగిస్తున్నాడు.
26:80  وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ
"నేను జబ్బు పడినప్పుడు, ఆయనే నన్ను నయం చేస్తున్నాడు.
26:81  وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ
"ఆయనే నన్ను చంపుతాడు, మళ్లీ తిరిగి బ్రతికిస్తాడు.
26:82  وَالَّذِي أَطْمَعُ أَن يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ
"ప్రతిఫలదినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకుంది."
26:83  رَبِّ هَبْ لِي حُكْمًا وَأَلْحِقْنِي بِالصَّالِحِينَ
(తరువాత ఇబ్రాహీమ్‌ ఇలా ప్రార్థించాడు): "నా ప్రభూ! నాకు 'ప్రజ్ఞ'ను ప్రసాదించు. నన్ను సద్వర్తనులలో కలుపు.
26:84  وَاجْعَل لِّي لِسَانَ صِدْقٍ فِي الْآخِرِينَ
"భావితరాల వారి (నోటి)లో నన్ను కీర్తిశేషునిగా ఉంచు.
26:85  وَاجْعَلْنِي مِن وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ
"అనుగ్రహభరితమైన స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను (కూడా ఒకడిగా) చెయ్యి.
26:86  وَاغْفِرْ لِأَبِي إِنَّهُ كَانَ مِنَ الضَّالِّينَ
"నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా ఆయన మార్గభ్రష్టులలోనివాడు.
26:87  وَلَا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ
"ప్రజలు మళ్లీ తిరిగి లేపబడే రోజున నన్ను అవమానపరచకు."
26:88  يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ
ఆ రోజు సిరిసంపదలుగానీ, సంతానంగానీ దేనికీ పనికిరావు.
26:89  إِلَّا مَنْ أَتَى اللَّهَ بِقَلْبٍ سَلِيمٍ
నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్‌ సన్నిధిలోకి వచ్చినవాడు మాత్రమే (ఆనాడు మోక్షం పొందుతాడు).
26:90  وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ
(ఆ రోజు) దైవభక్తిపరుల కోసం స్వర్గం దగ్గరకు తేబడుతుంది.
26:91  وَبُرِّزَتِ الْجَحِيمُ لِلْغَاوِينَ
నరకం మార్గభ్రష్టుల ముందు ప్రత్యక్ష పరచబడుతుంది.
26:92  وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ
"అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే పూజించే వారో వారేరి?
26:93  مِن دُونِ اللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ
వారు మీకేదన్నా సాయం చేస్తున్నారా? పోనీ, వారు తమకు తామైనా సహాయం చేసుకోగలుగుతున్నారా?" అని వారితో అనటం జరుగుతుంది.
26:94  فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ
మరి వారూ, మార్గభ్రష్టులైన వారందరూ నరకంలో బోర్ల పడవేయబడతారు.
26:95  وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ
ఇబ్లీసు సైనికులంతా కూడా (నరకం లోనికే నెట్టబడతారు).
26:96  قَالُوا وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ
వారు పరస్పరం గొడవపడుతూ ఇలా అంటారు -
26:97  تَاللَّهِ إِن كُنَّا لَفِي ضَلَالٍ مُّبِينٍ
"అల్లాహ్‌ సాక్షి! మేము స్పష్టమైన అపమార్గానికి పాల్పడ్డాము,
26:98  إِذْ نُسَوِّيكُم بِرَبِّ الْعَالَمِينَ
మిమ్మల్ని సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కు సమానులుగా భావించినపుడు.
26:99  وَمَا أَضَلَّنَا إِلَّا الْمُجْرِمُونَ
"మమ్మల్ని పెడదారి పట్టించింది ఈ పాపాత్ములే (వేరెవరూ కాదు.)
26:100  فَمَا لَنَا مِن شَافِعِينَ
"కనుక ఇప్పుడు మా కోసం సిఫారసు చేసేవారెవరూ లేకుండా పోయారు.
26:101  وَلَا صَدِيقٍ حَمِيمٍ
"(మా బాధను అర్థం చేసుకునే) ఆప్తమిత్రుడు కూడా లేకుండా పోయాడు.
26:102  فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
"ఒకవేళ మమ్మల్నే గనక మరోసారి తిరిగి పంపటం జరిగితే (నిజమైన) విశ్వాసులమవుతాము!"
26:103  إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా ఈ వృత్తాంతంలో గొప్ప గుణపాఠ సూచన ఉంది. అయితే వారిలో అనేకులు విశ్వసించేవారు కారు.
26:104  وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా నీ ప్రభువు మాత్రమే శక్తిశాలి, దయాశీలి.
26:105  كَذَّبَتْ قَوْمُ نُوحٍ الْمُرْسَلِينَ
నూహు జాతి వారు (కూడా) దైవ ప్రవక్తలను ధిక్కరించారు.
26:106  إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ
అప్పుడు వారి సోదరుడైన నూహు వారినుద్దేశించి ఇలా అన్నాడు : "ఏమిటి, మీరు అల్లాహ్‌కు భయపడరా?
26:107  إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
"వినండి! నేను మీ వైపుకు పంపబడిన నమ్మకస్తుణ్ణి అయిన దైవప్రవక్తను.
26:108  فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
"కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి, నేను చెప్పినట్లు వినండి.
26:109  وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
"దీనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుది.
26:110  فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
"కాబట్టి మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి."
26:111  قَالُوا أَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْأَرْذَلُونَ
(దానికి అతని) జాతివారు, "ఏమిటీ? మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు" అని సమాధానమిచ్చారు.
26:112  قَالَ وَمَا عِلْمِي بِمَا كَانُوا يَعْمَلُونَ
(దానికి నూహ్‌) ఇలా అన్నాడు: "లోగడ వారేం చేసేవారో నాకేం తెలుసు?
26:113  إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّي ۖ لَوْ تَشْعُرُونَ
"మీరు గనక అర్థం చేసుకోగలిగితే, వారి లెక్క తీసుకునే బాధ్యత నా ప్రభువుది.
26:114  وَمَا أَنَا بِطَارِدِ الْمُؤْمِنِينَ
"నేను మాత్రం విశ్వాసులను గెంటివేసే వాణ్ణికాను.
26:115  إِنْ أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ
"నేను (ప్రజలను) స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే."
26:116  قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا نُوحُ لَتَكُونَنَّ مِنَ الْمَرْجُومِينَ
వారిలా పలికారు: "ఓ నూహు! నువ్వు గనక (ఈ పనిని) మానుకోకపోతే, నిన్ను రాళ్లతో కొట్టడం (చంపటం) ఖాయం."
26:117  قَالَ رَبِّ إِنَّ قَوْمِي كَذَّبُونِ
అప్పుడు అతనిలా ప్రార్థించాడు: "నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు.
26:118  فَافْتَحْ بَيْنِي وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِي وَمَن مَّعِيَ مِنَ الْمُؤْمِنِينَ
"కాబట్టి నీవు నాకూ - వారికీ మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులనూ కాపాడు."
26:119  فَأَنجَيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ الْمَشْحُونِ
తుదకు మేము అతన్నీ, అతని సహచరులను నిండు నౌకలో (ఎక్కించి) కాపాడాము.
26:120  ثُمَّ أَغْرَقْنَا بَعْدُ الْبَاقِينَ
ఆ తరువాత మిగిలివున్న వారందరినీ మేము ముంచి వేశాము.
26:121  إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా ఇందులో (చాలా పెద్ద) సూచన ఉంది. కాని వారిలో పెక్కుమంది విశ్వసించే రకం కాదు.
26:122  وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిస్సందేహంగా నీ ప్రభువు సర్వాధిక్యుడు, దయాశీలి.
26:123  كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ
ఆద్‌ జాతి వారు (కూడా) దైవ ప్రవక్తలను ధిక్కరించారు.
26:124  إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ
అప్పుడు వారి సోదరుడైన హూద్‌, (వారినుద్దేశించి) ఇలా అన్నాడు : "మీరు బొత్తిగా భయపడరా?
26:125  إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
"నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుణ్ణి అయిన ప్రవక్తను.
26:126  فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
"కనుక అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:127  وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
"ఈ పనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది.
26:128  أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ
"ఏమిటీ, మీరు ఎత్తయిన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా?
26:129  وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
"మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన (పటిష్టమైన) భవనాలను నిర్మిస్తున్నారే!
26:130  وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ
"మీరు ఎప్పుడు, ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్య పూరితంగా పంజా విసురుతున్నారే!?
26:131  فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
"కనుక, మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:132  وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ
"మీకు తెలిసివున్న సమస్త (మంచి) వస్తువులను మీకు వొసగి, మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి.
26:133  أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ
"ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా తోడ్పడ్డాడు.
26:134  وَجَنَّاتٍ وَعُيُونٍ
"తోటల ద్వారా, చెలమల ద్వారా (సహాయపడ్డాడు).
26:135  إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
"నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను."
26:136  قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ
వారిలా అన్నారు : "నువ్వు మాకు బోధించినా, బోధించే వారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే.
26:137  إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
"ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.
26:138  وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
"ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము."
26:139  فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
ఆద్‌ (జాతి) వారు అతనిని (హూదును) ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది. కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు.
26:140  وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
మరి నిస్సందేహంగా నీ ప్రభువు అపార శక్తిసంపన్నుడు, పరమ కృపాశీలుడు.
26:141  كَذَّبَتْ ثَمُودُ الْمُرْسَلِينَ
సమూదు (జాతి) వారు కూడా దైవసందేశహరులను ధిక్కరించారు.
26:142  إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَالِحٌ أَلَا تَتَّقُونَ
అప్పుడు వారి సోదరుడైన సాలెహ్‌ వారినుద్దేశించి ఇలా అన్నాడు: "ఏమిటీ? మీరు (అల్లాహ్‌కు) భయపడరా?
26:143  إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
"నేను మీ వైపునకు పంపబడిన విశ్వసనీయుడనైన ప్రవక్తను.
26:144  فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
"అందుకే మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:145  وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
"ఈ పనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది.
26:146  أَتُتْرَكُونَ فِي مَا هَاهُنَا آمِنِينَ
"ఏమిటీ, ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మీరు ప్రశాంతంగా (ఉండగలిగేలా) వదలివేయబడతారా?
26:147  فِي جَنَّاتٍ وَعُيُونٍ
"అంటే - ఈ తోటలలో, ఈ చెలమలలో...
26:148  وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ
"ఈ పొలాల్లో, సుతిమెత్తని, కోమలమైన పండ్ల గెలలు గల ఈ ఖర్జూర తోటలలో (కలకాలం ఉంటామని అనుకుంటున్నారా?)
26:149  وَتَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا فَارِهِينَ
"మీరు పర్వతాలను చెక్కి ఆడంబరమైన ఇండ్లను తయారు చేస్తున్నారు.
26:150  فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
"కనుక, మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.
26:151  وَلَا تُطِيعُوا أَمْرَ الْمُسْرِفِينَ
"హద్దుమీరి పోయేవారికి విధేయత చూపటం మానండి-
26:152  الَّذِينَ يُفْسِدُونَ فِي الْأَرْضِ وَلَا يُصْلِحُونَ
"వారు భువిలో కల్లోలాన్ని రేకెత్తిస్తున్నారు. ఎలాంటి సంస్కరణా కార్యాలు చేయరు."
26:153  قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ
దానికి వారు ఇచ్చిన జవాబు ఇది : "నువ్వు చేతబడికి గురయిన వానిలా ఉన్నావు.
26:154  مَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا فَأْتِ بِآيَةٍ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
"నువ్వూ మాలాంటి ఒక మామూలు మనిషివే. ఒకవేళ నువ్వు నిజంగా సత్యవంతుడవే అయితే ఏదైనా నిదర్శనాన్ని తీసుకురా."
26:155  قَالَ هَٰذِهِ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَّعْلُومٍ
అతను ఇలా అన్నాడు : "ఇదిగో ఆడ ఒంటె! నీరు త్రాగటానికి ఒక వంతు దీనిది. ఒక నిర్ధారిత దినం మీది.
26:156  وَلَا تَمَسُّوهَا بِسُوءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ
"(జాగ్రత్త!) దీన్ని దురుద్దేశంతో తాకకండి. (ఒకవేళ మీరు అలా చేశారంటే) పర్యవసానంగా ఒక మహాదినపు విపత్తు మిమ్మల్ని చుట్టుముట్టుతుంది."
26:157  فَعَقَرُوهَا فَأَصْبَحُوا نَادِمِينَ
అయినాసరే వాళ్లు దాని కాలి గిట్టెలను నరికేశారు. ఆ తరువాత వారు బాధపడసాగారు.
26:158  فَأَخَذَهُمُ الْعَذَابُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
అంతే! శిక్ష వారిని కబళించింది. నిశ్చయంగా ఇందులో గుణపాఠ సూచన ఉంది. కాని వారిలో చాలామంది విశ్వసించలేదు.
26:159  وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా నీ ప్రభువు సర్వాధిక్యుడు, కరుణామయుడు.
26:160  كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ
లూత్‌ జాతివారు (కూడా) ప్రవక్తలను ధిక్కరించారు.
26:161  إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ
- వారి సోదరుడైన లూత్‌ వారినుద్దేశ్యించి ఇలా అన్నాడు: "మీరు (అల్లాహ్‌కు) భయపడరా?
26:162  إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
"నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుడనైన ప్రవక్తను.
26:163  فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
"కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.
26:164  وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
"దీనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌పై ఉంది.
26:165  أَتَأْتُونَ الذُّكْرَانَ مِنَ الْعَالَمِينَ
"మీరు లోకంలో(ని) పురుషుల వద్దకు పోతున్నారేమిటీ?
26:166  وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَاجِكُم ۚ بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ
"అల్లాహ్‌ మీ కొరకు జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెడుతున్నారే! మీరు బొత్తిగా హద్దుమీరిపోయే జనంలా ఉన్నారు."
26:167  قَالُوا لَئِن لَّمْ تَنتَهِ يَا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ
దానికి వారు "ఓ లూత్‌! నువ్వు (నీ ధోరణిని) మానుకోకపోతే, ఇక్కణ్ణుంచి వెళ్ళగొట్టబడతావు (జాగ్రత్త!)" అని చెప్పారు.
26:168  قَالَ إِنِّي لِعَمَلِكُم مِّنَ الْقَالِينَ
"మీ చేష్టలను నేను తీవ్రంగా అసహ్యించుకుంటున్నాను" అన్నాడు లూత్‌.
26:169  رَبِّ نَجِّنِي وَأَهْلِي مِمَّا يَعْمَلُونَ
(తరువాత అతను ఇలా ప్రార్థించాడు): "ప్రభూ! వీళ్లు చేసే నీతిమాలిన పని (దుష్ఫలితం) నుంచి నన్నూ, నా ఇంటివారినీ కాపాడు."
26:170  فَنَجَّيْنَاهُ وَأَهْلَهُ أَجْمَعِينَ
అందువల్ల మేము అతన్నీ, అతని సంబంధీకులందరినీ రక్షించాము.
26:171  إِلَّا عَجُوزًا فِي الْغَابِرِينَ
ఒక ముసలావిడను తప్ప! - ఆమె (మాత్రం) వెనుక ఉండిపోయేవారిలో చేరిపోయింది.
26:172  ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ
మరి మేము మిగిలిన వారందరినీ నాశనం చేశాము.
26:173  وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا ۖ فَسَاءَ مَطَرُ الْمُنذَرِينَ
మేము వారిపై ఒక ప్రత్యేకమైన (రాళ్ల) వర్షం కురిపించాము. హెచ్చరించబడిన వారిపై కురిసిన ఆ వర్షం చాలా చెడ్డది.
26:174  إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
ఈ వృత్తాంతం కూడా ఆసాంతం గుణపాఠంతో కూడుకున్నది. కాని వారిలో అధికులు విశ్వాసులు కారు.
26:175  وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా నీ ప్రభువు ఆధిపత్యం కలవాడు, జాలిచూపే వాడూను.
26:176  كَذَّبَ أَصْحَابُ الْأَيْكَةِ الْمُرْسَلِينَ
'అయికా' జనులు కూడా దైవప్రవక్తలను ధిక్కరించారు.
26:177  إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ
అప్పుడు షుఐబ్‌ (అలైహిస్సలాం) వాళ్ళనుద్దేశించి ఇలా ప్రబోధించాడు: "మీరు (బొత్తిగా) భయపడరా?
26:178  إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
"నేను మీ వద్దకు పంపబడిన నమ్మదగ్గ ప్రవక్తను.
26:179  فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
"కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయులై ఉండండి.
26:180  وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
"దీనికిగాను నేను మీనుంచి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్‌పై ఉంది.
26:181  أَوْفُوا الْكَيْلَ وَلَا تَكُونُوا مِنَ الْمُخْسِرِينَ
"మీరు (కొలచి ఇస్తున్నప్పుడు) పూర్తిగా ఇవ్వండి. తగ్గించి ఇవ్వకండి.
26:182  وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ
"తూచి ఇస్తే సరైన త్రాసుతో తూకం వేసి ఇవ్వండి.
26:183  وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
"ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భువిలో విచ్చలవిడిగా కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరగకండి.
26:184  وَاتَّقُوا الَّذِي خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْأَوَّلِينَ
"మిమ్మల్నీ, మీ పూర్వీకుల్ని సృష్టించిన వానికి భయపడండి."
26:185  قَالُوا إِنَّمَا أَنتَ مِنَ الْمُسَحَّرِينَ
దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది: "అసలు నువ్వు చేతబడికి గురైన వాడివి.
26:186  وَمَا أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ الْكَاذِبِينَ
"నువ్వూ మాలాంటి ఒక మనిషివే. నువ్వు అబద్ధం చెప్పే వారిలో ఒకడివని మేము భావిస్తున్నాము.
26:187  فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِّنَ السَّمَاءِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
"ఒకవేళ నువ్వు సత్యవంతులలో ఒకడివైతే ఆకాశం నుంచి ఏదైనా తునకను మాపై పడవెయ్యి."
26:188  قَالَ رَبِّي أَعْلَمُ بِمَا تَعْمَلُونَ
"మీరు చేసేదంతా నా ప్రభువుకు బాగా తెలుసు" అని అతను (షుఐబ్‌) చెప్పాడు.
26:189  فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ الظُّلَّةِ ۚ إِنَّهُ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
మొత్తానికి వారు అతన్ని ధిక్కరించిన కారణంగా (కారు మబ్బుతో కూడిన) ఛాయావృత దినపు విపత్తు వారిని కబళించింది. నిజంగానే అది మహాదినపు శిక్ష!
26:190  إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ
నిశ్చయంగా ఇందులో గొప్ప నిదర్శనం ఉంది. మరైతే వారిలో చాలా మంది విశ్వాసులు కారు.
26:191  وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిస్సందేహంగా నీ ప్రభువు మహా శక్తిమంతుడు, పరమ కృపాశీలుడు.
26:192  وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ
నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది.
26:193  نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ
విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు.
26:194  عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ
(ఓ ముహమ్మద్‌ - సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది.
26:195  بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ
(ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది.
26:196  وَإِنَّهُ لَفِي زُبُرِ الْأَوَّلِينَ
పూర్వీకుల గ్రంథాలలో కూడా దీని (ఖుర్‌ఆన్‌) ప్రస్తావన ఉంది.
26:197  أَوَلَمْ يَكُن لَّهُمْ آيَةً أَن يَعْلَمَهُ عُلَمَاءُ بَنِي إِسْرَائِيلَ
ఈ సంగతి (ఖుర్‌ఆన్‌ వాస్తవికత) ఇస్రాయీలు సంతతికి చెందిన విద్వాంసులకు సయితం తెలిసి ఉండటం వారికొక నిదర్శనం కాదా?
26:198  وَلَوْ نَزَّلْنَاهُ عَلَىٰ بَعْضِ الْأَعْجَمِينَ
ఒకవేళ మేము దీన్ని ఏ అరబ్బేతరునిపైనో అవతరింపజేసి వుంటే,
26:199  فَقَرَأَهُ عَلَيْهِم مَّا كَانُوا بِهِ مُؤْمِنِينَ
మరి అతడు దానిని వారి ముందు చదివి వినిపించి వున్నట్లయితే, వారు దాన్ని విశ్వసించేవారు కాదు.
26:200  كَذَٰلِكَ سَلَكْنَاهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ
మేము పాపాత్ముల హృదయాలలో ఇలాగే ఈ తిరస్కార భావాన్ని జొప్పించాము.
26:201  لَا يُؤْمِنُونَ بِهِ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ
వ్యధాభరితమైన శిక్షను చూచేవరకూ వారు దాన్ని విశ్వసించరు.
26:202  فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
మరి ఆ శిక్ష అకస్మాత్తుగా వారిపై వచ్చిపడుతుంది. దాని గురించిన ధ్యాస కూడా వారికుండదు.
26:203  فَيَقُولُوا هَلْ نَحْنُ مُنظَرُونَ
అప్పుడు వారు, "మాకేమన్నా కాస్త గడువు ఇవ్వబడుతుందా?" అంటారు.
26:204  أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
ఇంతకీ వారు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా?
26:205  أَفَرَأَيْتَ إِن مَّتَّعْنَاهُمْ سِنِينَ
దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా? ఒకవేళ మేము కొన్ని సంవత్సరాల పాటు వారికి లబ్దిపొందే అవకాశం కల్పించినా....
26:206  ثُمَّ جَاءَهُم مَّا كَانُوا يُوعَدُونَ
తరువాత వారికి హెచ్చరించబడే ఆ శిక్ష వచ్చిపడినప్పుడు,
26:207  مَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يُمَتَّعُونَ
వారు అనుభవిస్తూ వచ్చిన సుఖసౌఖ్యాలు, సాధన సంపత్తులు వారికెలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చలేవు.
26:208  وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ
హెచ్చరిక చేసేవారు రాకుండా మేము ఎన్నడూ ఏ జనవాసాన్నీ అంతమొందించలేదు.
26:209  ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ
(వారు) హితబోధ (చేసిన పిమ్మటే మేము జోక్యం చేసుకున్నాము). మేము అన్యాయం చేసేవారంకాము.
26:210  وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ
దీనిని (ఈ ఖుర్‌ఆను గ్రంథాన్ని) షైతానులు తీసుకుని దిగలేదు.
26:211  وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
దానికి వారు యోగ్యులూ కారు, దాన్ని తెచ్చే స్థోమత కూడా వారికి లేదు.
26:212  إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ
పైగా వారు దానిని (కనీసం) వినకుండా - దూరం - చేయబడ్డారు.
26:213  فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!
26:214  وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
నీ సమీప బంధువులను హెచ్చరించు.
26:215  وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ
విశ్వసించి, నిన్ను అనుసరించేవారి పట్ల మృదువుగా మసలుకో.
26:216  فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّي بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ
ఒకవేళ వారు గనక నీకు అవిధేయత చూపితే, "మీ పోకడలతో నాకు ఎటువంటి సంబంధం లేదు" అని చెప్పు.
26:217  وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ
సర్వాధిక్యుడు, కరుణామయుడు అయిన అల్లాహ్‌నే నమ్ముకో.
26:218  الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ
నువ్వు (ఒంటరిగా ఆరాధనలో) నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు.
26:219  وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ
సాష్టాంగపడేవారి మధ్య (కూడా) నీ కదలికలను (కనిపెట్టుకుని ఉంటాడు).
26:220  إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు.
26:221  هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ الشَّيَاطِينُ
(ప్రజలారా!) షైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలుపనా?
26:222  تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ
అబద్ధాలకోరు, పాపాత్ముడు అయిన ప్రతి ఒక్కరిపై వారు దిగుతారు.
26:223  يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُونَ
వినీవినని కొన్ని మాటల్ని చెవుల్లో వేస్తారు. వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే.
26:224  وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ
ఇకపోతే కవులు - దారి తప్పినవారే వారి వెనుక నడుస్తారు.
26:225  أَلَمْ تَرَ أَنَّهُمْ فِي كُلِّ وَادٍ يَهِيمُونَ
ఏమిటీ, వారు ప్రతి లోయలోనూ ఎలా తచ్చాడుతూ తిరుగుతున్నారో నీవు చూడలేదా?
26:226  وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ
చెయ్యని దాన్ని గురించి (తమ కవనంలో) ఎలా గొప్పలు చెబుతున్నారో (నీవు గమనించలేదా?)
26:227  إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَذَكَرُوا اللَّهَ كَثِيرًا وَانتَصَرُوا مِن بَعْدِ مَا ظُلِمُوا ۗ وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنقَلَبٍ يَنقَلِبُونَ
అయితే విశ్వసించి, మంచి పనులు చేసేవారు, అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించేవారు, తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతిగా చర్య తీసుకునేవారు అలాంటి వారు కారు. ఇక అన్యాయానికి ఒడిగట్టేవారు తమకు ఏ గతి పడుతుందో శీఘ్రంగానే తెలుసుకుంటారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.