Translation
| 25. సూరా అల్ ఫుర్ఖాన్ 25:1 تَبَارَكَ الَّذِي نَزَّلَ الْفُرْقَانَ عَلَىٰ عَبْدِهِ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికిగాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు. 25:2 الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُن لَّهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువునూ సృష్టించి, దానికి తగ్గట్టుగా - దాని లెక్కను నిర్థారించాడు. 25:3 وَاتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً لَّا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ ضَرًّا وَلَا نَفْعًا وَلَا يَمْلِكُونَ مَوْتًا وَلَا حَيَاةً وَلَا نُشُورًا వారు అల్లాహ్‌ను వదలి (బూటకపు) దేవుళ్లను కల్పించుకున్నారు. వారు (అంటే ఆ బూటకపు దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగిలేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణానంతరం) తిరిగి లేచే శక్తి కూడా వారివద్ద లేదు. 25:4 وَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا إِفْكٌ افْتَرَاهُ وَأَعَانَهُ عَلَيْهِ قَوْمٌ آخَرُونَ ۖ فَقَدْ جَاءُوا ظُلْمًا وَزُورًا "ఇది, ఇతను స్వయంగా కల్పించుకున్న అబద్ధం తప్ప మరేమీ కాదు. ఈ విషయంలో ఇతరులు కూడా ఇతనికి సాయపడ్డారు" అని అవిశ్వాసులు చెప్పసాగారు. నిజానికి వారు చాలా అన్యాయానికి, ఆసాంతం అబద్ధానికి ఒడిగట్టారు. 25:5 وَقَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ اكْتَتَبَهَا فَهِيَ تُمْلَىٰ عَلَيْهِ بُكْرَةً وَأَصِيلًا "ఇవి పూర్వీకుల గాథలు. వాటిని ఇతను వ్రాయించాడు. అవి ఉదయం సాయంత్రం అతని ముందు పఠించబడుతున్నాయి" అని కూడా ఈ అవిశ్వాసులు అన్నారు. 25:6 قُلْ أَنزَلَهُ الَّذِي يَعْلَمُ السِّرَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ كَانَ غَفُورًا رَّحِيمًا (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "భూమ్యాకాశాలలో వున్న రహస్యాలన్నింటినీ ఎరిగినవాడు దీనిని (ఈ ఖుర్‌ఆనును) అవతరింపజేశాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు." 25:7 وَقَالُوا مَالِ هَٰذَا الرَّسُولِ يَأْكُلُ الطَّعَامَ وَيَمْشِي فِي الْأَسْوَاقِ ۙ لَوْلَا أُنزِلَ إِلَيْهِ مَلَكٌ فَيَكُونَ مَعَهُ نَذِيرًا అవిశ్వాసులు ఇలా అనసాగారు : "ఏం ప్రవక్తయ్యా ఇతను?! (చూడబోతే అందరిలాగే) ఇతను కూడా అన్నం తింటున్నాడు, బజార్లలో తిరుగుతున్నాడు. ఇతనికి తోడుగా ఉంటూ (ప్రజలను) హెచ్చరించే నిమిత్తం ఒక దైవదూత (అయినా) ఇతని వద్దకు ఎందుకు పంపబడలేదట? 25:8 أَوْ يُلْقَىٰ إِلَيْهِ كَنزٌ أَوْ تَكُونُ لَهُ جَنَّةٌ يَأْكُلُ مِنْهَا ۚ وَقَالَ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَّسْحُورًا "పోనీ ఇతని వద్దకు ఏదైనా ఖజానా ఎందుకు వచ్చిపడలేదు? పోనీ, ఇతను (హాయిగా) తింటూ ఉండటానికి ఇతనికి ఒక తోటన్నా లేదేమిటీ?" "మీరు చేతబడి చేయబడిన ఒక వ్యక్తి వెనుక నడుస్తున్నారు" అని కూడా ఆ దుర్మార్గులు అన్నారు. 25:9 انظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا (ఓ ముహమ్మద్!) చూశావా! వాళ్లు నీ గురించి ఎలాంటి ఉదాహరణల్ని ఇస్తున్నారో! (అది కాదులే), నిజానికి వాళ్లు అసలు మార్గం తప్పారు. ఇక వాళ్లు మార్గానికి రావటం అనేది జరగదు. 25:10 تَبَارَكَ الَّذِي إِن شَاءَ جَعَلَ لَكَ خَيْرًا مِّن ذَٰلِكَ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ وَيَجْعَل لَّكَ قُصُورًا అల్లాహ్ శుభకరుడు. ఆయన గనక తలచుకుంటే వాళ్ళు ఉదాహరించిన తోటకన్నా మేలైన ఎన్నో తోటల్ని - క్రింద కాలువలు ప్రవహించే తోటల్ని - నీ కోసం సమకూర్చగలడు. ఇంకా నీ కోసం ఎన్నో (బ్రహ్మాండమైన) మేడల్ని కూడా చేయగలడు. 25:11 بَلْ كَذَّبُوا بِالسَّاعَةِ ۖ وَأَعْتَدْنَا لِمَن كَذَّبَ بِالسَّاعَةِ سَعِيرًا (అది కాదు). వారసలు ఆ ఘడియ (తీర్పుదినము)ను ధిక్కరిస్తున్నారు. అయితే ఆ ఘడియను ధిక్కరించేవారి కోసం మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. 25:12 إِذَا رَأَتْهُم مِّن مَّكَانٍ بَعِيدٍ سَمِعُوا لَهَا تَغَيُّظًا وَزَفِيرًا దూరం నుంచే అది వారిని చూసినప్పుడు, ఆగ్రహంతో అది ఉడికిపోతూ, గర్జిస్తూ ఉండటాన్ని వారు వింటారు. 25:13 وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. 25:14 لَّا تَدْعُوا الْيَوْمَ ثُبُورًا وَاحِدًا وَادْعُوا ثُبُورًا كَثِيرًا "ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి" (అని వారితో అనబడుతుంది). 25:15 قُلْ أَذَٰلِكَ خَيْرٌ أَمْ جَنَّةُ الْخُلْدِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۚ كَانَتْ لَهُمْ جَزَاءً وَمَصِيرًا వారికి చెప్పు:"ఇది మేలా? లేక భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గం మేలా? అది వారి ప్రతిఫలం. వారు చేరుకోవలసిన (చివరి) గమ్యస్థానం." 25:16 لَّهُمْ فِيهَا مَا يَشَاءُونَ خَالِدِينَ ۚ كَانَ عَلَىٰ رَبِّكَ وَعْدًا مَّسْئُولًا వారు (స్వర్గవాసులు) కోరుకున్నదల్లా అందులో వారికి లభిస్తుంది. వారందులో శాశ్వతంగా ఉంటారు. అర్థించదగిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నీ ప్రభువుపై ఉంది. 25:17 وَيَوْمَ يَحْشُرُهُمْ وَمَا يَعْبُدُونَ مِن دُونِ اللَّهِ فَيَقُولُ أَأَنتُمْ أَضْلَلْتُمْ عِبَادِي هَٰؤُلَاءِ أَمْ هُمْ ضَلُّوا السَّبِيلَ ఆ రోజున అల్లాహ్ వారినీ, అల్లాహ్‌ను వదిలి వారు పూజించే వారినీ సమావేశపరచి, "నా ఈ దాసులను మీరు అపమార్గం పట్టించారా? లేక వీళ్ళంతట వీళ్లే మార్గం తప్పారా?" అని అడుగుతాడు. 25:18 قَالُوا سُبْحَانَكَ مَا كَانَ يَنبَغِي لَنَا أَن نَّتَّخِذَ مِن دُونِكَ مِنْ أَوْلِيَاءَ وَلَٰكِن مَّتَّعْتَهُمْ وَآبَاءَهُمْ حَتَّىٰ نَسُوا الذِّكْرَ وَكَانُوا قَوْمًا بُورًا వారు ఇలా విన్నవించుకుంటారు: "(ఓ అల్లాహ్) నీవు పవిత్రుడవు. నిన్ను కాదని, వేరొకరిని మా రక్షకుడిగా చేసుకోవటం మాకు సయితం తగదు. కాని (అసలు విషయం ఏమిటంటే) నీవు వీళ్ళకీ, వీరి తాతముత్తాతలకీ సాధనసంపత్తులను పుష్కలంగా ప్రసాదించావు. తుదకు వీరు హితబోధను విస్మరించారు. ఆ విధంగా వీరు వినాశం పొందేవారయ్యారు." 25:19 فَقَدْ كَذَّبُوكُم بِمَا تَقُولُونَ فَمَا تَسْتَطِيعُونَ صَرْفًا وَلَا نَصْرًا ۚ وَمَن يَظْلِم مِّنكُمْ نُذِقْهُ عَذَابًا كَبِيرًا "(చూశారా!) మీరు చెప్పే మాటలన్నింటినీ వారు కాదన్నారు. కనుక శిక్షలను తొలగించుకునే శక్తిగానీ, సహాయాన్ని పొందే స్థోమతగానీ ఇప్పుడు మీకు లేదు. మీలో దుర్మార్గానికి పాల్పడిన ఒక్కొక్కడికీ మేము పెద్ద శిక్షను చవి చూపిస్తాము" (అని అల్లాహ్ అంటాడు). 25:20 وَمَا أَرْسَلْنَا قَبْلَكَ مِنَ الْمُرْسَلِينَ إِلَّا إِنَّهُمْ لَيَأْكُلُونَ الطَّعَامَ وَيَمْشُونَ فِي الْأَسْوَاقِ ۗ وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً أَتَصْبِرُونَ ۗ وَكَانَ رَبُّكَ بَصِيرًا (ఓ ముహమ్మద్ -సఅసం!) మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరూ కూడా అన్నంతినేవారు, బజారులలో సంచరించే వారే. మేము మీలో కొందరిని మరికొందరి కోసం పరీక్షా సాధనంగా చేశాము. మరి మీరు ఓపికపట్టగలరా? నీ ప్రభువు సర్వాన్నీ చూస్తున్నాడు. 25:21 وَقَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا لَوْلَا أُنزِلَ عَلَيْنَا الْمَلَائِكَةُ أَوْ نَرَىٰ رَبَّنَا ۗ لَقَدِ اسْتَكْبَرُوا فِي أَنفُسِهِمْ وَعَتَوْا عُتُوًّا كَبِيرًا మమ్మల్ని కలుసుకునే (విషయంపై) ఆశలేని వారు, "దైవ దూతలు మా వద్దకు ఎందుకు పంపబడటం లేదు? పోనీ, మేమైనా మా కళ్లతో మా ప్రభువును ఎందుకు చూడలేక పోతున్నాము?" అని అంటారు. వారు, తమలో తామే చాలా గొప్ప వారుగా ఊహించుకుంటున్నారు. అహంకారంతో మరీ బరితెగించి పోతున్నారు. 25:22 يَوْمَ يَرَوْنَ الْمَلَائِكَةَ لَا بُشْرَىٰ يَوْمَئِذٍ لِّلْمُجْرِمِينَ وَيَقُولُونَ حِجْرًا مَّحْجُورًا వారు ఏ రోజున దైవదూతలను చూస్తారో ఆ రోజు ఆ అపరాధులకు ఎంత మాత్రం సంతోషం కలగదు. "(శుభవార్తలన్నీ) సంతోషదాయక వార్తలన్నీ మీకు పూర్తిగా నిషిద్ధం" అని (దైవదూతలు) అంటారు. 25:23 وَقَدِمْنَا إِلَىٰ مَا عَمِلُوا مِنْ عَمَلٍ فَجَعَلْنَاهُ هَبَاءً مَّنثُورًا వారు (ప్రాపంచిక జీవితంలో) చేసి వున్న కర్మల వైపుకు మేము వచ్చి వాటిని ఎగిరిన దుమ్ము ధూళివలే చేసేశాము. 25:24 أَصْحَابُ الْجَنَّةِ يَوْمَئِذٍ خَيْرٌ مُّسْتَقَرًّا وَأَحْسَنُ مَقِيلًا అయితే ఆ రోజు స్వర్గవాసుల నివాసం చాలా బావుంటుంది. వారి విశ్రాంతి నిలయం కూడా అత్యుత్తమంగా ఉంటుంది. 25:25 وَيَوْمَ تَشَقَّقُ السَّمَاءُ بِالْغَمَامِ وَنُزِّلَ الْمَلَائِكَةُ تَنزِيلًا ఏ రోజున ఆకాశం మేఘాల సమేతంగా బద్దలైపోతుందో, మరి దైవదూతలు వరుసగా దింపబడతారో, 25:26 الْمُلْكُ يَوْمَئِذٍ الْحَقُّ لِلرَّحْمَٰنِ ۚ وَكَانَ يَوْمًا عَلَى الْكَافِرِينَ عَسِيرًا ఆ రోజు అసలు సిసలు అధికారం కరుణామయునిదై ఉంటుంది. ఆ రోజు అవిశ్వాసుల పాలిట గడ్డురోజై ఉంటుంది. 25:27 وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: "అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!" 25:28 يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا "అయ్యో! నా పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది! 25:29 لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسَانِ خَذُولًا "నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!" 25:30 وَقَالَ الرَّسُولُ يَا رَبِّ إِنَّ قَوْمِي اتَّخَذُوا هَٰذَا الْقُرْآنَ مَهْجُورًا అప్పుడు దైవప్రవక్త, "నా ప్రభూ! నిశ్చయంగా నా జాతివారు ఈ ఖుర్‌ఆన్‌ను వదలిపెట్టారు" అని పలుకుతాడు. 25:31 وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا مِّنَ الْمُجْرِمِينَ ۗ وَكَفَىٰ بِرَبِّكَ هَادِيًا وَنَصِيرًا ఈ విధంగా మేము ప్రతి ప్రవక్తకూ కొందరు పాపాత్ములను శత్రువులుగా చేశాము. మార్గదర్శకత్వం వహించడానికి, సహాయం చేయడానికి నీ ప్రభువు (ఒక్కడే) సరిపోతాడు. 25:32 وَقَالَ الَّذِينَ كَفَرُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ الْقُرْآنُ جُمْلَةً وَاحِدَةً ۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِ فُؤَادَكَ ۖ وَرَتَّلْنَاهُ تَرْتِيلًا "ఇతనిపై ఖుర్‌ఆన్ సాంతం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు?" అని అవిశ్వాసులు అంటారు. దీనిద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే (కొద్ది కొద్దిగా), అంచెలవారీగా పంపాము. 25:33 وَلَا يَأْتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئْنَاكَ بِالْحَقِّ وَأَحْسَنَ تَفْسِيرًا వారు నీ వద్దకు ఏ సందేహాన్ని తీసుకువచ్చినా దానికి సత్యంతో కూడిన సమాధానాన్నీ, అత్యుత్తమమైన వివరణను నీకు తెలియజేస్తాము. 25:34 الَّذِينَ يُحْشَرُونَ عَلَىٰ وُجُوهِهِمْ إِلَىٰ جَهَنَّمَ أُولَٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ سَبِيلًا ముఖాలను నేలకు రాస్తూ నరకం వైపుకు ఈడ్చబడేవారే నీచమైన నివాస స్థానం కలవారు, బాగా పెడత్రోవ పట్టిన వారు. 25:35 وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَا مَعَهُ أَخَاهُ هَارُونَ وَزِيرًا నిశ్చయంగా (ఇంతకు మునుపు) మేము మూసాకు గ్రంథాన్ని వొసగాము. అతనితోపాటు అతని సోదరుడైన హారూనును అతని సహాయకునిగా నియమించాము. 25:36 فَقُلْنَا اذْهَبَا إِلَى الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا فَدَمَّرْنَاهُمْ تَدْمِيرًا "మీరిద్దరూ, మా ఆయతులను ధిక్కరిస్తున్న జనుల వద్దకు వెళ్ళండి" అని మేము వారికి ఆదేశించాము. ఆ తరువాత మేము వారిని (తిరస్కారులను) పూర్తిగా తుదముట్టించాము. 25:37 وَقَوْمَ نُوحٍ لَّمَّا كَذَّبُوا الرُّسُلَ أَغْرَقْنَاهُمْ وَجَعَلْنَاهُمْ لِلنَّاسِ آيَةً ۖ وَأَعْتَدْنَا لِلظَّالِمِينَ عَذَابًا أَلِيمًا నూహ్ జాతి వారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించినపుడు మేము వారిని ముంచివేశాము. ప్రజల కొరకు వారిని గుణపాఠ సూచనగా చేశాము. మేము దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము. 25:38 وَعَادًا وَثَمُودَ وَأَصْحَابَ الرَّسِّ وَقُرُونًا بَيْنَ ذَٰلِكَ كَثِيرًا ఇంకా ఆదు జాతివారినీ, సమూదు జాతివారినీ, బావి వారినీ, వారి మధ్యన ఉన్న మరెన్నో తరాలను కూడా (తుడిచి పెట్టేశాము). 25:39 وَكُلًّا ضَرَبْنَا لَهُ الْأَمْثَالَ ۖ وَكُلًّا تَبَّرْنَا تَتْبِيرًا మేము వారికి ఉదాహరణలతో సహా బోధపరచాము. ఆ తరువాత ప్రతి ఒక్కరినీ సమూలంగా తుడిచిపెట్టాము. 25:40 وَلَقَدْ أَتَوْا عَلَى الْقَرْيَةِ الَّتِي أُمْطِرَتْ مَطَرَ السَّوْءِ ۚ أَفَلَمْ يَكُونُوا يَرَوْنَهَا ۚ بَلْ كَانُوا لَا يَرْجُونَ نُشُورًا దారుణంగా (రాళ్ళ) వర్షం కురిపించబడిన పట్టణం సమీపం నుంచి వారు (అవిశ్వాసులు) రాకపోకలు సాగిస్తున్నారు. అయినా వారు దానిని చూడటం లేదా? అసలు విషయం ఏమిటంటే వారికి మరణానంతరం తిరిగి లేపబడతామన్న దానిపై ఆశలేదు. 25:41 وَإِذَا رَأَوْكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي بَعَثَ اللَّهُ رَسُولًا వారు (అవిశ్వాసులు) నిన్ను చూచినప్పుడల్లా, నీతో పరిహాసానికి దిగుతారు. "దేవుడు ప్రవక్తగా చేసి పంపినది ఈయనగారి నేనా?! 25:42 إِن كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَن صَبَرْنَا عَلَيْهَا ۚ وَسَوْفَ يَعْلَمُونَ حِينَ يَرَوْنَ الْعَذَابَ مَنْ أَضَلُّ سَبِيلًا "మేము మా దేముళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే, ఇతడు మమ్మల్ని మా దేవుళ్ల నుంచి తప్పించి ఉండేవాడే" అని అంటారు. పూర్తిగా మార్గభ్రష్టతకు గురై ఉన్నదెవరో శిక్షలను చూసినపుడు వారికి స్పష్టంగా తెలిసివస్తుంది. 25:43 أَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَٰهَهُ هَوَاهُ أَفَأَنتَ تَكُونُ عَلَيْهِ وَكِيلًا (ఓ ప్రవక్తా!) తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వానిని నువ్వు చూశావా? నువ్వు అలాంటి వ్యక్తి(ని రుజుమార్గానికి తెచ్చే) బాధ్యత తీసుకోగలవా? 25:44 أَمْ تَحْسَبُ أَنَّ أَكْثَرَهُمْ يَسْمَعُونَ أَوْ يَعْقِلُونَ ۚ إِنْ هُمْ إِلَّا كَالْأَنْعَامِ ۖ بَلْ هُمْ أَضَلُّ سَبِيلًا ఏమిటీ, వారిలో అత్యధికమంది వింటారనీ, అర్థం చేసుకుంటారని నువ్వు (ఇప్పటికీ) అనుకుంటున్నావా? వారు వట్టి పశువుల్లాంటి వారు. పైగా వాటికన్నా ఎక్కువగా దారితప్పారు. 25:45 أَلَمْ تَرَ إِلَىٰ رَبِّكَ كَيْفَ مَدَّ الظِّلَّ وَلَوْ شَاءَ لَجَعَلَهُ سَاكِنًا ثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَيْهِ دَلِيلًا ఏమిటి, నీ ప్రభువు నీడను ఎలా వ్యాపింపజేశాడో నువ్వు చూడలేదా? ఆయన గనక తలచుకుంటే దాన్ని నిలిచి ఉండేదిగానే చేసేవాడు. మరి మేము సూర్యుణ్ణి దానికి నిదర్శనంగా చేశాము. 25:46 ثُمَّ قَبَضْنَاهُ إِلَيْنَا قَبْضًا يَسِيرًا మరి మేము దాన్ని క్రమక్రమంగా మా వైపుకు లాక్కున్నాము. 25:47 وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِبَاسًا وَالنَّوْمَ سُبَاتًا وَجَعَلَ النَّهَارَ نُشُورًا మరి ఆయనే మీకోసం రాత్రిని తెర (ఆసరా)గానూ, నిద్రను విశ్రాంతిగానూ చేశాడు. ఇంకా పగటిని లేచి తిరిగే సమయంగా చేశాడు. 25:48 وَهُوَ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ بُشْرًا بَيْنَ يَدَيْ رَحْمَتِهِ ۚ وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً طَهُورًا తన కారుణ్యానికి (వర్షానికి) ముందు శుభవార్తను మోసుకు వచ్చే గాలులను పంపేవాడు ఆయనే. మరి మేము ఆకాశం నుంచి స్వచ్ఛమైన నీళ్లను కురిపిస్తాము. 25:49 لِّنُحْيِيَ بِهِ بَلْدَةً مَّيْتًا وَنُسْقِيَهُ مِمَّا خَلَقْنَا أَنْعَامًا وَأَنَاسِيَّ كَثِيرًا తద్వారా మృత ప్రదేశాన్ని బ్రతికించటానికి, మా సృష్టితాల లోని అనేక జంతువులకు, మనుషులకు (నీరు) త్రాగించటానికి (మేము ఈ ఏర్పాటును చేస్తున్నాము). 25:50 وَلَقَدْ صَرَّفْنَاهُ بَيْنَهُمْ لِيَذَّكَّرُوا فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا వారు గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని వారి మధ్య పలు విధాలుగా విశదీకరించాము. అయినప్పటికీ మానవులలో చాలామంది అవిశ్వాసం, కృతఘ్నతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్కరిస్తున్నారు. 25:51 وَلَوْ شِئْنَا لَبَعَثْنَا فِي كُلِّ قَرْيَةٍ نَّذِيرًا మేము కోరుకుంటే ఒక్కో ఊరిలో ఒక్కో హెచ్చరిక చేసేవాణ్ణి పంపి ఉండేవారం. 25:52 فَلَا تُطِعِ الْكَافِرِينَ وَجَاهِدْهُم بِهِ جِهَادًا كَبِيرًا కాబట్టి నువ్వు తిరస్కారుల మాట వినకు. ఖుర్‌ఆన్ (బోధన) మూలముగా వారితో గొప్ప పోరాటపటిమను ప్రదర్శిస్తూ ఉండు. 25:53 وَهُوَ الَّذِي مَرَجَ الْبَحْرَيْنِ هَٰذَا عَذْبٌ فُرَاتٌ وَهَٰذَا مِلْحٌ أُجَاجٌ وَجَعَلَ بَيْنَهُمَا بَرْزَخًا وَحِجْرًا مَّحْجُورًا రెండు సముద్రాలను - పరస్పరం - కలిపి ఉంచినవాడు ఆయనే. వాటిలో ఒకటి తియ్యనిది, రుచికరమైనది. మరొకటి ఉప్పగా, చేదుగా ఉంది. ఆ రెండింటి మధ్య ఒక తెర (అడ్డు గోడగా) ఉంది. అది వాటిని వేరుగా ఉంచుతుంది. 25:54 وَهُوَ الَّذِي خَلَقَ مِنَ الْمَاءِ بَشَرًا فَجَعَلَهُ نَسَبًا وَصِهْرًا ۗ وَكَانَ رَبُّكَ قَدِيرًا నీటితో మానవుణ్ణి సృష్టించినవాడు ఆయనే. ఆ తరువాత అతనికి వంశపారంపర్యాన్ని, అత్తగారి బంధుత్వాన్ని కల్పించాడు. నిశ్చయంగా నీ ప్రభువు (ప్రతిదీ చేయగల) శక్తి గలవాడు. 25:55 وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُهُمْ وَلَا يَضُرُّهُمْ ۗ وَكَانَ الْكَافِرُ عَلَىٰ رَبِّهِ ظَهِيرًا వారు అల్లాహ్‌ను వదలి తమకు లాభాన్నిగానీ, నష్టాన్నిగానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తున్నారు. ఎంతయినా అవిశ్వాసి మటుకు తన ప్రభువుకు వ్యతిరేకంగా (షైతానుకు) తోడ్పడేవాడే. 25:56 وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا అయితే (ఓ ప్రవక్తా!) మేము మాత్రం నిన్ను శుభవార్తాహరునిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. 25:57 قُلْ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِلَّا مَن شَاءَ أَن يَتَّخِذَ إِلَىٰ رَبِّهِ سَبِيلًا "ఈ ఖుర్‌ఆన్ సందేశాన్ని అందజేసి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. కాని ఎవరయినా తన ప్రభువు వైపు వెళ్ళే మార్గాన్ని (రుజుమార్గాన్ని) అవలంబిస్తే చాలు" అని వారికి చెప్పు. 25:58 وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا ఎన్నటికీ మరణించనివాడూ, నిత్యుడూ అయిన అల్లాహ్‌ను నమ్ముకో. స్తోత్రసమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాలను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు. 25:59 الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ الرَّحْمَٰنُ فَاسْأَلْ بِهِ خَبِيرًا ఆయనే ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్త వస్తువులను ఆరు దినాలలో సృష్టించాడు. ఆ తరువాత అధికార పీఠంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన కరుణామయుడు. కావాలంటే (ఆయన వైభవాన్ని గురించి) తెలిసిన వానిని అడుగు. 25:60 وَإِذَا قِيلَ لَهُمُ اسْجُدُوا لِلرَّحْمَٰنِ قَالُوا وَمَا الرَّحْمَٰنُ أَنَسْجُدُ لِمَا تَأْمُرُنَا وَزَادَهُمْ نُفُورًا ۩ "కరుణామయునికి సాష్టాంగపడండి" అని వారితో అన్నప్పుడు, 'కరుణామయుడంటే ఏమిటీ? (ఆయనెవడు?) నువ్వు ఆజ్ఞాపించినవానికి మేము సాష్టాంగపడాలా?' అని వారంటారు. ఇది (ఈ ధర్మబోధ) వారి ద్వేషాన్ని మరింత అధికం చేసింది. 25:61 تَبَارَكَ الَّذِي جَعَلَ فِي السَّمَاءِ بُرُوجًا وَجَعَلَ فِيهَا سِرَاجًا وَقَمَرًا مُّنِيرًا ఆకాశంలో బురుజులను నిర్మించి, అందులో ప్రజ్వలమైన దీపాన్ని, కాంతిమంతమైన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు శుభకరుడు. 25:62 وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ أَرَادَ أَن يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا ఆయనే రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది. 25:63 وَعِبَادُ الرَّحْمَٰنِ الَّذِينَ يَمْشُونَ عَلَى الْأَرْضِ هَوْنًا وَإِذَا خَاطَبَهُمُ الْجَاهِلُونَ قَالُوا سَلَامًا కరుణామయుని (విశ్వాసపాత్రులైన) దాసులెవరంటే, వారు నేలపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారితో మాట్లాడినప్పుడు 'మీకు సలాం' అంటూ సాగిపోతారు. 25:64 وَالَّذِينَ يَبِيتُونَ لِرَبِّهِمْ سُجَّدًا وَقِيَامًا వారు తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడుతూ, నిలబడుతూ రాత్రులు గడుపుతారు. 25:65 وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ ۖ إِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا వారిలా ప్రార్థిస్తూ ఉంటారు: "మా ప్రభూ! మాపై నుంచి నరకశిక్షను తొలగించు. ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనిది." 25:66 إِنَّهَا سَاءَتْ مُسْتَقَرًّا وَمُقَامًا నిశ్చయంగా అది చాలా చెడ్డచోటు. చెడ్డ నివాస స్థలం. 25:67 وَالَّذِينَ إِذَا أَنفَقُوا لَمْ يُسْرِفُوا وَلَمْ يَقْتُرُوا وَكَانَ بَيْنَ ذَٰلِكَ قَوَامًا వారు - ఖర్చుపెట్టే సమయంలో కూడా అటు మరీ దుబారా ఖర్చు చేయకుండా, ఇటు మరీ పిసినారితనం కూడా చూపకుండా - రెండింటికీ మధ్య - సమతూకాన్ని పాటిస్తారు. 25:68 وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ يَلْقَ أَثَامًا వారు అల్లాహ్‌తోపాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప - అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. ఈ చేష్టలకు ఒడిగట్టినవాడు పాపఫలాన్ని పొంది తీరుతాడు. 25:69 يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا ప్రళయదినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవంపాలై, అత్యంత నికృష్టస్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. 25:70 إِلَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు. 25:71 وَمَن تَابَ وَعَمِلَ صَالِحًا فَإِنَّهُ يَتُوبُ إِلَى اللَّهِ مَتَابًا మరెవరయితే పశ్చాత్తాపం చెంది, సదాచరణ చేస్తాడో అతడు (వాస్తవంగా) అల్లాహ్ వైపునకు మరలి వచ్చినవాడవుతాడు. 25:72 وَالَّذِينَ لَا يَشْهَدُونَ الزُّورَ وَإِذَا مَرُّوا بِاللَّغْوِ مَرُّوا كِرَامًا వారు (కరుణామయుని సిసలైన దాసులు) అసత్యానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వ్యర్థమైనవాటి గుండా పోవలసి వస్తే, హుందాగా ముందుకు సాగిపోతారు. 25:73 وَالَّذِينَ إِذَا ذُكِّرُوا بِآيَاتِ رَبِّهِمْ لَمْ يَخِرُّوا عَلَيْهَا صُمًّا وَعُمْيَانًا వారికి వారి ప్రభువు వాక్యాల ఆధారంగా బోధపరచినపుడు, వారు గుడ్డివారుగా, చెవిటివారుగా వాటి మీద పడిపోరు. 25:74 وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు : "ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తిపరుల (ముత్తఖీన్‌ల) నాయకునిగా చేయి." 25:75 أُولَٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا ఇలాంటి వారికే వారి సహన స్థయిర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి. 25:76 خَالِدِينَ فِيهَا ۚ حَسُنَتْ مُسْتَقَرًّا وَمُقَامًا వారందులో (స్వర్గవనాలలో) కలకాలం ఉంటారు. అదెంతో రమణీయమైన స్థలం, అత్యుత్తమ నివాసం. 25:77 قُلْ مَا يَعْبَأُ بِكُمْ رَبِّي لَوْلَا دُعَاؤُكُمْ ۖ فَقَدْ كَذَّبْتُمْ فَسَوْفَ يَكُونُ لِزَامًا "ఒకవేళ మీరు మొరపెట్టుకోకపోతే, నా ప్రభువు మిమ్మల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టేవాడే కాదు. మీరెలాగూ ధిక్కరించారు. ఇప్పుడు శీఘ్రంగానే తప్పించనలవికాని శిక్ష మిమ్మల్ని అంటుకుంటుంది" అని (ఓ ప్రవక్తా! తిరస్కార జనులకు) చెప్పు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |