aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

22. సూరా అల్ హజ్

22:1  يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ
ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం.
22:2  يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ
ఆనాడు మీరు దాన్ని చూస్తారు... పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది.
22:3  وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّبِعُ كُلَّ شَيْطَانٍ مَّرِيدٍ
జ్ఞానం లేకపోయినా అల్లాహ్‌ విషయంలో వాదించేవారు కూడా జనులలో కొందరున్నారు. వారు తలబిరుసు అయిన ప్రతి షైతానును అనుసరిస్తారు.
22:4  كُتِبَ عَلَيْهِ أَنَّهُ مَن تَوَلَّاهُ فَأَنَّهُ يُضِلُّهُ وَيَهْدِيهِ إِلَىٰ عَذَابِ السَّعِيرِ
అతని సహవాసం చేసిన వారినల్లా అతను అపమార్గం పట్టించి, అతన్ని అగ్ని శిక్ష వైపుకు తీసుకుపోతాడని అతని గురించి (విధివ్రాతలో) రాయబడి ఉంది.
22:5  يَا أَيُّهَا النَّاسُ إِن كُنتُمْ فِي رَيْبٍ مِّنَ الْبَعْثِ فَإِنَّا خَلَقْنَاكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِن مُّضْغَةٍ مُّخَلَّقَةٍ وَغَيْرِ مُخَلَّقَةٍ لِّنُبَيِّنَ لَكُمْ ۚ وَنُقِرُّ فِي الْأَرْحَامِ مَا نَشَاءُ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ۖ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْلَا يَعْلَمَ مِن بَعْدِ عِلْمٍ شَيْئًا ۚ وَتَرَى الْأَرْضَ هَامِدَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ وَأَنبَتَتْ مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ
ఓ ప్రజలారా! ఒకవేళ మరణానంతర జీవితం గురించి మీకేదన్నా సందేహం ఉంటే కాస్త ఆలోచించండి... మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, ఆ తరువాత వీర్యపు బొట్టుతో, ఆపైన గడ్డకట్టిన రక్తంతో, అటు పిమ్మట మాంసపు ముద్దతో చేశాము-అప్పటికి అది రూపం కలదిగానూ, రూపరహితంగానూ ఉన్నది. మేము మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకు (ఇదంతా చేస్తున్నాము). మరి మేము కోరిన దానిని నిర్ధారిత సమయం వరకు మాతృగర్భాలలో ఉంచుతున్నాము. ఆ తరువాత మిమ్మల్ని శైశవ దశలో బయటికి తెస్తాము - మరి మీరు నిండు యౌవనానికి చేరుకోవటానికి! మీలో కొందరు (యుక్త వయస్సుకు చేరక ముందే) మృత్యువుకు గురిచేయబడతారు. మరి కొందరు అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ గ్రహించలేనంత నికృష్టమైన వయస్సుకు చేర్చబడతారు. నేల ఎండిపోయి (బీడుగా మారి) ఉండటం నువ్వు చూస్తావు. ఆ తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది, ఉబికి వస్తుంది, అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తిస్తుంది.
22:6  ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّهُ يُحْيِي الْمَوْتَىٰ وَأَنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
అల్లాహ్‌యే సత్యం గనక, మృతులను తిరిగి బ్రతికించేవాడు ఆయనే గనక, అన్నింటిపై ఆయనే అధికారం కలవాడు గనక ఇదంతా జరుగుతోంది సుమా!
22:7  وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَأَنَّ اللَّهَ يَبْعَثُ مَن فِي الْقُبُورِ
(దీంతోపాటు) ప్రళయం రావటం తథ్యం. అందులో సందేహానికి ఆస్కారమే లేదు. నిశ్చయంగా అల్లాహ్‌ సమాధులలో ఉన్నవారిని తిరిగి లేపుతాడు.
22:8  وَمِنَ النَّاسِ مَن يُجَادِلُ فِي اللَّهِ بِغَيْرِ عِلْمٍ وَلَا هُدًى وَلَا كِتَابٍ مُّنِيرٍ
మరి కొంతమంది (కూడా ఉన్నారు. వారు) జ్ఞానంగానీ, మార్గదర్శకత్వంగానీ, జ్యోతిర్మయమైన గ్రంథంగానీ లేకుండానే అల్లాహ్‌ విషయంలో పిడివాదన చేస్తారు.
22:9  ثَانِيَ عِطْفِهِ لِيُضِلَّ عَن سَبِيلِ اللَّهِ ۖ لَهُ فِي الدُّنْيَا خِزْيٌ ۖ وَنُذِيقُهُ يَوْمَ الْقِيَامَةِ عَذَابَ الْحَرِيقِ
గర్వంతో ప్రక్కకు తిరిగిపోయేవాడై! అల్లాహ్‌ మార్గం నుంచి (ప్రజలను) తప్పించాలన్నది వాడి ఉద్దేశం. వాడికి ప్రపంచంలోనూ పరాభవం ఉంది, ప్రళయదినాన కూడా మేమతన్ని నరకంలో దహించివేసే యాతనను చవిచూపిస్తాము.
22:10  ذَٰلِكَ بِمَا قَدَّمَتْ يَدَاكَ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ
నీ చేతులు ముందుగా చేసి పంపుకున్న కర్మల మూలంగా నీకీ ఖర్మ పట్టింది. అల్లాహ్‌ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడన్న సంగతిని తెలుసుకోండి.
22:11  وَمِنَ النَّاسِ مَن يَعْبُدُ اللَّهَ عَلَىٰ حَرْفٍ ۖ فَإِنْ أَصَابَهُ خَيْرٌ اطْمَأَنَّ بِهِ ۖ وَإِنْ أَصَابَتْهُ فِتْنَةٌ انقَلَبَ عَلَىٰ وَجْهِهِ خَسِرَ الدُّنْيَا وَالْآخِرَةَ ۚ ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ
ప్రజలలో మరికొంతమంది (కూడా ఉన్నారు. వారు) ఎలాంటి వారంటే, వారు ఒక అంచున (నిలబడి) అల్లాహ్‌ను ఆరాధిస్తుంటారు. తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. ఏదన్నా ఆపద వచ్చిపడితే మాత్రం అప్పటికప్పుడే ముఖం తిప్పుకునిపోతారు. అలాంటి వారు ప్రాపంచికంగానూ, పారలౌకికంగానూ నష్టపోయారు. స్పష్టంగా నష్టపోవటం అంటే ఇదే.
22:12  يَدْعُو مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُ وَمَا لَا يَنفَعُهُ ۚ ذَٰلِكَ هُوَ الضَّلَالُ الْبَعِيدُ
మరి వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టంగానీ, లాభంగానీ కలిగించలేని వారిని మొరపెట్టుకోసాగుతారు. చాలా దూరపు అపమార్గం అంటే ఇదే.
22:13  يَدْعُو لَمَن ضَرُّهُ أَقْرَبُ مِن نَّفْعِهِ ۚ لَبِئْسَ الْمَوْلَىٰ وَلَبِئْسَ الْعَشِيرُ
ఎవరి నష్టం (కీడు) అతని లాభం కన్నా చేరువలో ఉన్నదో అలాంటి వానిని వారు వేడుకుంటున్నారు. ముమ్మాటికీ అలాంటి వాడు మహా చెడ్డ సహాయకుడు, మహాచెడ్డ స్నేహితుడు.
22:14  إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ إِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
విశ్వసించి, మంచి పనులు చేసిన వారిని అల్లాహ్‌ సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్‌ అనుకున్న దాన్ని చేసి తీరుతాడు.
22:15  مَن كَانَ يَظُنُّ أَن لَّن يَنصُرَهُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ فَلْيَمْدُدْ بِسَبَبٍ إِلَى السَّمَاءِ ثُمَّ لْيَقْطَعْ فَلْيَنظُرْ هَلْ يُذْهِبَنَّ كَيْدُهُ مَا يَغِيظُ
అల్లాహ్‌ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ తన ప్రవక్తకు సహాయం చేయడని తలపోసేవాడు పైనుంచి ఒక త్రాడును కట్టి తన మెడకు ఉరేసుకొని వేలాడాలి. ఆ తరువాత తన ఈ ఉపాయం వల్ల తన కసి తీరిందేమో చూసుకోవాలి.
22:16  وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ آيَاتٍ بَيِّنَاتٍ وَأَنَّ اللَّهَ يَهْدِي مَن يُرِيدُ
ఈ విధంగా మేము ఈ ఖుర్‌ఆన్‌ను సుస్పష్టమైన సూచనలతో అవతరింపజేశాము. అల్లాహ్‌ తాను కోరిన వారికి (మాత్రమే) సన్మార్గ భాగ్యం ప్రసాదిస్తాడు.
22:17  إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئِينَ وَالنَّصَارَىٰ وَالْمَجُوسَ وَالَّذِينَ أَشْرَكُوا إِنَّ اللَّهَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
విశ్వాసులు, యూదులు, సాబియీలు, క్రైస్తవులు, మజూసీలు, బహుదైవారాధకులు - వీరందరి మధ్యా అల్లాహ్‌ ప్రళయదినాన తప్పకుండా తీర్పుచేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు.
22:18  أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يَسْجُدُ لَهُ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ وَالشَّمْسُ وَالْقَمَرُ وَالنُّجُومُ وَالْجِبَالُ وَالشَّجَرُ وَالدَّوَابُّ وَكَثِيرٌ مِّنَ النَّاسِ ۖ وَكَثِيرٌ حَقَّ عَلَيْهِ الْعَذَابُ ۗ وَمَن يُهِنِ اللَّهُ فَمَا لَهُ مِن مُّكْرِمٍ ۚ إِنَّ اللَّهَ يَفْعَلُ مَا يَشَاءُ ۩
ఆకాశాలలో ఉన్నవారూ, భూలోకవాసులు, సూర్యచంద్రులూ, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, చాలా మంది మనుషులుకూడా అల్లాహ్‌ ముందు మోకరిల్లడాన్ని నువ్వు గమనించటం లేదా? (దైవ) శిక్షకు అర్హులైన వారు కూడా చాలా మంది ఉన్నారు. అల్లాహ్‌ పరాభవం పాల్జేసిన వానిని ఎవరూ ఆదరించరు. అల్లాహ్‌ తాను కోరినదాన్ని చేస్తాడు.
22:19  هَٰذَانِ خَصْمَانِ اخْتَصَمُوا فِي رَبِّهِمْ ۖ فَالَّذِينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّن نَّارٍ يُصَبُّ مِن فَوْقِ رُءُوسِهِمُ الْحَمِيمُ
ఆ ఇరువర్గాల వారు తమ ప్రభువు విషయంలో గొడవపడతారు. అయితే అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించబడుతుంది.
22:20  يُصْهَرُ بِهِ مَا فِي بُطُونِهِمْ وَالْجُلُودُ
దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి.
22:21  وَلَهُم مَّقَامِعُ مِنْ حَدِيدٍ
ఇంకా, వారి కొరకు (వారిని చితక బాదటానికి) ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి.
22:22  كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا مِنْ غَمٍّ أُعِيدُوا فِيهَا وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ
ఆ బాధకు తట్టుకోలేక వారు అక్కణ్ణుంచి పారిపోవాలని అనుకున్నప్పుడల్లా తిరిగి అందులోనికే నెట్టివేయబడతారు. "దహనయాతన రుచి చూడండి" (అని వారితో అనబడుతుంది).
22:23  إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَلُؤْلُؤًا ۖ وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ
విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి క్రింద సెలయేరులు పారే (స్వర్గ) వనాలలో అల్లాహ్‌ ప్రవేశం కల్పిస్తాడు. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు - స్వచ్ఛమైన ముత్యాలు కూడా! వారు ధరించే వస్త్రాలు కూడా పట్టు వస్త్రాలై ఉంటాయి.
22:24  وَهُدُوا إِلَى الطَّيِّبِ مِنَ الْقَوْلِ وَهُدُوا إِلَىٰ صِرَاطِ الْحَمِيدِ
పవిత్రమైన మాటలు పలికే బుద్ధి వారికి వొసగబడుతుంది. స్తుతించదగిన వాని మార్గం కూడా వారికి నిర్దేశించబడింది.
22:25  إِنَّ الَّذِينَ كَفَرُوا وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَالْمَسْجِدِ الْحَرَامِ الَّذِي جَعَلْنَاهُ لِلنَّاسِ سَوَاءً الْعَاكِفُ فِيهِ وَالْبَادِ ۚ وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ
నిశ్చయంగా ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్‌ మార్గం నుండి, మస్జిదె హరామ్‌ నుండి (జనులను) అడ్డుకుంటున్నారో, ఇంకా అక్కడ అన్యాయంగా అడ్డదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాం. వాస్తవానికి మేము దానిని సర్వమానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము. స్థానికులకు, బయటి నుంచి వచ్చే వారికి కూడా (ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది.)
22:26  وَإِذْ بَوَّأْنَا لِإِبْرَاهِيمَ مَكَانَ الْبَيْتِ أَن لَّا تُشْرِكْ بِي شَيْئًا وَطَهِّرْ بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْقَائِمِينَ وَالرُّكَّعِ السُّجُودِ
మేము ఇబ్రాహీమునకు కాబా గృహ స్థలాన్ని నిర్థారించినపుడు పెట్టిన షరతు ఇది: నాకు భాగస్వామ్యంగా దేనినీ కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడేవారి కోసం, తల వంచేవారి కోసం, సాష్టాంగపడే వారి కోసం పవిత్రంగా ఉంచాలి.
22:27  وَأَذِّن فِي النَّاسِ بِالْحَجِّ يَأْتُوكَ رِجَالًا وَعَلَىٰ كُلِّ ضَامِرٍ يَأْتِينَ مِن كُلِّ فَجٍّ عَمِيقٍ
హజ్‌ (యాత్ర)కై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలినడకన కూడా వస్తారు, బక్కచిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు.
22:28  لِّيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَّعْلُومَاتٍ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ ۖ فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْبَائِسَ الْفَقِيرَ
వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్‌ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్‌ నామాన్ని స్మరించాలి (ఉచ్చరించాలి). ఆ తరువాత వాటిని మీరూ తినండి, దుర్భర స్థితిలో ఉన్న అగత్య పరులకు కూడా తినిపించండి.
22:29  ثُمَّ لْيَقْضُوا تَفَثَهُمْ وَلْيُوفُوا نُذُورَهُمْ وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ
ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి.(అనంతరం దేవుని) ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి.
22:30  ذَٰلِكَ وَمَن يُعَظِّمْ حُرُمَاتِ اللَّهِ فَهُوَ خَيْرٌ لَّهُ عِندَ رَبِّهِ ۗ وَأُحِلَّتْ لَكُمُ الْأَنْعَامُ إِلَّا مَا يُتْلَىٰ عَلَيْكُمْ ۖ فَاجْتَنِبُوا الرِّجْسَ مِنَ الْأَوْثَانِ وَاجْتَنِبُوا قَوْلَ الزُّورِ
ఇది (హజ్‌ కొరకు నిర్దేశించబడిన పద్ధతి). ఎవడయితే అల్లాహ్‌ విధించిన కట్టుబాట్లను గౌరవిస్తాడో అతనికోసం అతని ప్రభువు వద్ద మేలుంది. మీకు తెలియజేయబడిన (హరాం) జంతువులు తప్ప మిగిలిన పశువులు మీకోసం ధర్మసమ్మతం (హలాల్‌) చేయబడ్డాయి. కాబట్టి మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండాలి, సత్యవిరుద్ధమైన మాటలకు కూడా దూరంగా ఉండాలి.
22:31  حُنَفَاءَ لِلَّهِ غَيْرَ مُشْرِكِينَ بِهِ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ
ఏకాగ్రతతో దేవుని ఏకత్వాన్ని అనుసరిస్తూ, ఆయనకు సాటి కల్పించకుండా ఉండాలి. వినండి! అల్లాహ్‌కు సాటి కల్పించేవాడు ఆకాశం నుంచి క్రిందపడి పోయిన వానితో సమానం. ఇప్పుడతన్ని పక్షులైనా తన్నుకుపోతాయి లేదా పెనుగాలి అయినా ఎత్తి దూరప్రదేశంలో విసిరేస్తుంది.
22:32  ذَٰلِكَ وَمَن يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِن تَقْوَى الْقُلُوبِ
ఇది (తెలుసుకున్నారు కదా! ఇది కూడా తెలుసుకోండి!). అల్లాహ్‌ చిహ్నాలను ఎవరయినా గౌరవిస్తున్నారంటే అది వారి హృదయాలలోని భక్తిభావన వల్లనే సుమా!
22:33  لَكُمْ فِيهَا مَنَافِعُ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ثُمَّ مَحِلُّهَا إِلَى الْبَيْتِ الْعَتِيقِ
ఒక నిర్థారిత గడువు వరకు వాటిలో (ఖుర్బానీ పశువులలో) మీ కోసం కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ తరువాత అవి జిబహ్‌ చేయబడే చోటు ప్రాచీన గృహం (వద్దనే ఉంది).
22:34  وَلِكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا لِّيَذْكُرُوا اسْمَ اللَّهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ ۗ فَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَلَهُ أَسْلِمُوا ۗ وَبَشِّرِ الْمُخْبِتِينَ
తమకు అల్లాహ్‌ ప్రసాదించివున్న పశువులపై అల్లాహ్‌ పేరును స్మరించటానికిగాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్థారించాము. కనుక మీ ఆరాధ్య దేవుడు ఒకే ఆరాధ్యదేవుడని తెలుసుకోండి. కాబట్టి మీరు ఆయన ఆజ్ఞలనే శిరసావహించండి. (కనుక ఓ ముహమ్మద్‌) వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు.
22:35  الَّذِينَ إِذَا ذُكِرَ اللَّهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَالصَّابِرِينَ عَلَىٰ مَا أَصَابَهُمْ وَالْمُقِيمِي الصَّلَاةِ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
(వారిలోని సుగుణం ఏమిటంటే) అల్లాహ్‌ నామం స్మరించినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. తమపై ఏ ఆపద వచ్చిపడినా వారు ఓర్పు వహిస్తారు, నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా మార్గంలో) ఖర్చు చేస్తూ ఉంటారు.
22:36  وَالْبُدْنَ جَعَلْنَاهَا لَكُم مِّن شَعَائِرِ اللَّهِ لَكُمْ فِيهَا خَيْرٌ ۖ فَاذْكُرُوا اسْمَ اللَّهِ عَلَيْهَا صَوَافَّ ۖ فَإِذَا وَجَبَتْ جُنُوبُهَا فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ ۚ كَذَٰلِكَ سَخَّرْنَاهَا لَكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ఖుర్బానీ ఒంటెలను(కూడా) మేము మీకోసం అల్లాహ్‌ చిహ్నాలుగా నిర్థారించాము. వాటిలో మీకు మేలున్నది. కాబట్టి వాటిని వరుసగా నిలబెట్టి, వాటిపై అల్లాహ్‌ పేరును ఉచ్చరించండి. మరి వాటి ప్రక్కలు నేలకొరిగిన తరువాత, వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. ఈ విధంగా మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసలుకునేందుకుగాను మేము ఈ పశువులను మీకు స్వాధీన పరిచాము.
22:37  لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ ۚ كَذَٰلِكَ سَخَّرَهَا لَكُمْ لِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ ۗ وَبَشِّرِ الْمُحْسِنِينَ
వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్‌కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్‌వా) మాత్రం ఆయనకు చేరుతుంది. ఈ విధంగా అల్లాహ్‌ ఈ పశువులను మీకు లోబరిచాడు- ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడటానికి! (ఓ ముహమ్మద్‌!) సదాచార సంపన్నులకు సంతోషవార్త వినిపించు.
22:38  إِنَّ اللَّهَ يُدَافِعُ عَنِ الَّذِينَ آمَنُوا ۗ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ خَوَّانٍ كَفُورٍ
నిశ్చయంగా అల్లాహ్‌ నికార్సయిన విశ్వాసుల నుండి శత్రువులను పారద్రోలుతాడు. విశ్వాస ఘాతకులైన కృతఘ్నులను అల్లాహ్‌ సుతరామూ ఇష్టపడడు.
22:39  أُذِنَ لِلَّذِينَ يُقَاتَلُونَ بِأَنَّهُمْ ظُلِمُوا ۚ وَإِنَّ اللَّهَ عَلَىٰ نَصْرِهِمْ لَقَدِيرٌ
ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతుందో, వారికి (కూడా ప్రతిఘటనకు) అనుమతి ఇవ్వబడుతోంది. ఎందుకంటే వారు (ముస్లిములు) పీడితులు. నిశ్చయంగా అల్లాహ్‌ వారిని ఆదుకోగల శక్తి గలవాడు.
22:40  الَّذِينَ أُخْرِجُوا مِن دِيَارِهِم بِغَيْرِ حَقٍّ إِلَّا أَن يَقُولُوا رَبُّنَا اللَّهُ ۗ وَلَوْلَا دَفْعُ اللَّهِ النَّاسَ بَعْضَهُم بِبَعْضٍ لَّهُدِّمَتْ صَوَامِعُ وَبِيَعٌ وَصَلَوَاتٌ وَمَسَاجِدُ يُذْكَرُ فِيهَا اسْمُ اللَّهِ كَثِيرًا ۗ وَلَيَنصُرَنَّ اللَّهُ مَن يَنصُرُهُ ۗ إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ
వారు అన్యాయంగా తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. (ఇంతకీ వారు చేసిన నేరం) ఏమిటంటే, "మా ప్రభువు అల్లాహ్‌" అని పలకటమే. అల్లాహ్‌యే గనక జనులలో కొందరిని మరి కొందరి ద్వారా అడ్డుకోకపోతే మఠాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, అల్లాహ్‌ పేరు అత్యధికంగా స్మరించబడే మస్జిదులు ధ్వంసం చేయబడేవి. అల్లాహ్‌కు సహాయపడేందుకు సమాయత్తం అయిన వారికి అల్లాహ్‌ కూడా తప్పకుండా సహాయ పడతాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మహా బలుడు, సర్వాధిక్యుడు.
22:41  الَّذِينَ إِن مَّكَّنَّاهُمْ فِي الْأَرْضِ أَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ وَأَمَرُوا بِالْمَعْرُوفِ وَنَهَوْا عَنِ الْمُنكَرِ ۗ وَلِلَّهِ عَاقِبَةُ الْأُمُورِ
(ఈ విశ్వాసులు ఎలాంటివారంటే) మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు ఖచ్చితంగా నమాజును నెలకొల్పుతారు. జకాతు (అనే విధ్యుక్త దానధర్మాన్ని) చెల్లిస్తారు. మంచి పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు. చెడు పనుల నుంచి ఆపుతారు. సమస్త వ్యవహారాల ఫలితం అల్లాహ్‌ అధీనంలోనే ఉంది.
22:42  وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَثَمُودُ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వీళ్లు నిన్ను ధిక్కరిస్తే (ఆశ్చర్యపోనవసరం లేదు), వీరికి పూర్వం నూహ్‌, ఆద్‌, సమూద్‌ జాతుల వారు ధిక్కరించి ఉన్నారు.
22:43  وَقَوْمُ إِبْرَاهِيمَ وَقَوْمُ لُوطٍ
అలాగే ఇబ్రాహీమ్‌ జాతివారు, లూతు జాతి వారు,
22:44  وَأَصْحَابُ مَدْيَنَ ۖ وَكُذِّبَ مُوسَىٰ فَأَمْلَيْتُ لِلْكَافِرِينَ ثُمَّ أَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
మద్‌యన్‌ వారు కూడా (తమ తమ ప్రవక్తలను ధిక్కరించారు). మూసా కూడా ధిక్కరించబడ్డాడు. నేను అవిశ్వాసులకు కాస్త విడుపు ఇచ్చాను. ఆ తరువాత వారిని పట్టుకున్నాను. మరి నా శిక్ష (వారిపై) ఎలా పడిందో! (చూశావుగా!)
22:45  فَكَأَيِّن مِّن قَرْيَةٍ أَهْلَكْنَاهَا وَهِيَ ظَالِمَةٌ فَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَبِئْرٍ مُّعَطَّلَةٍ وَقَصْرٍ مَّشِيدٍ
ఎన్నో పట్టణాలను మేము తుడిచిపెట్టేశాము. ఎందుకంటే అవి దుర్మార్గానికి ఒడిగట్టాయి. అవి తమ కప్పులపై తల క్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు పాడుపడి ఉన్నాయి. మరెన్నో పటిష్టమైన, ఎత్తైన మేడలు నిర్మానుష్యంగా ఉన్నాయి.
22:46  أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَتَكُونَ لَهُمْ قُلُوبٌ يَعْقِلُونَ بِهَا أَوْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۖ فَإِنَّهَا لَا تَعْمَى الْأَبْصَارُ وَلَٰكِن تَعْمَى الْقُلُوبُ الَّتِي فِي الصُّدُورِ
ఏమిటీ, వారు భూమిలో సంచరించలేదా? (ఒకవేళ తిరిగి చూచినట్లయితే) వారి హృదయాలు ఆ విషయాలను గ్రహించగలిగేవి, లేదా వారి చెవులు (ఆ సంఘటనలను గురించి) విని ఉండేవి. అసలు విషయం ఏమిటంటే కళ్లు మాత్రమే గుడ్డివై ఉండవు, రొమ్ములలో ఉన్న హృదయాలు గుడ్డివి అవుతాయి.
22:47  وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَلَن يُخْلِفَ اللَّهُ وَعْدَهُ ۚ وَإِنَّ يَوْمًا عِندَ رَبِّكَ كَأَلْفِ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ
(దైవ) శిక్షకోసం వారు నిన్ను తొందరపెడుతున్నారు. అల్లాహ్‌ ఎట్టిపరిస్థితిలోనూ తన వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కాకపోతే నీ ప్రభువు దగ్గర ఒకరోజు (అంటే) మీరు లెక్కించే వెయ్యేండ్లకు సమానం.
22:48  وَكَأَيِّن مِّن قَرْيَةٍ أَمْلَيْتُ لَهَا وَهِيَ ظَالِمَةٌ ثُمَّ أَخَذْتُهَا وَإِلَيَّ الْمَصِيرُ
ఎన్నో పట్టణాలకు, అవి దారుణంగా చెలరేగిపోయినప్పటికీ నేను ఒకింత విడుపు ఇచ్చాను. తర్వాత వారిని పట్టుకున్నాను. వారు తిరిగి రావలసింది నా దగ్గరకే కదా!
22:49  قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنَّمَا أَنَا لَكُمْ نَذِيرٌ مُّبِينٌ
(ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు: "ఓ మానవులారా! నేను మిమ్మల్ని స్పష్టంగా సావధానపరచేవాడిని మాత్రమే."
22:50  فَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
కనుక విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికే మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి లభిస్తాయి.
22:51  وَالَّذِينَ سَعَوْا فِي آيَاتِنَا مُعَاجِزِينَ أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
మరి మా ఆయతులను లొంగదీసుకోవటానికి ప్రయత్నించేవారు - వారే నరక వాసులవుతారు.
22:52  وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ وَلَا نَبِيٍّ إِلَّا إِذَا تَمَنَّىٰ أَلْقَى الشَّيْطَانُ فِي أُمْنِيَّتِهِ فَيَنسَخُ اللَّهُ مَا يُلْقِي الشَّيْطَانُ ثُمَّ يُحْكِمُ اللَّهُ آيَاتِهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
(ఓ ప్రవక్తా!) మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను, లేదా ఏ సందేశహరుణ్ణి పంపినా - అతను తన మనసులో ఏదైనా సంకల్పం చేసుకున్నప్పుడల్లా షైతాను అతని సంకల్పంలో ఏదో ఒకటి కలుషితం చేసేవాడు. మరయితే అల్లాహ్‌ షైతాన్‌ కల్తీని పారద్రోలి, తన వచనాలను స్థిరపరుస్తాడు. అల్లాహ్‌ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు.
22:53  لِّيَجْعَلَ مَا يُلْقِي الشَّيْطَانُ فِتْنَةً لِّلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْقَاسِيَةِ قُلُوبُهُمْ ۗ وَإِنَّ الظَّالِمِينَ لَفِي شِقَاقٍ بَعِيدٍ
ఎవరి హృదయాలలో రోగం ఉందో, మరెవరి గుండెలు కరకు గుండెలుగా మారిపోయాయో వారిని ఈ షైతాను కలిపే దాని ద్వారా పరీక్షించటానికి అల్లాహ్‌ (ఇదంతా చేశాడు). నిశ్చయంగా దుర్మార్గులు వ్యతిరేకతలో చాలా దూరం వెళ్ళిపోయారు.
22:54  وَلِيَعْلَمَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّكَ فَيُؤْمِنُوا بِهِ فَتُخْبِتَ لَهُ قُلُوبُهُمْ ۗ وَإِنَّ اللَّهَ لَهَادِ الَّذِينَ آمَنُوا إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
జ్ఞాన మొసగబడినవారు, ఇది నీ ప్రభువు తరఫునుంచి వచ్చిన సత్యం అని తెలుసుకుని, దాన్ని విశ్వసించటానికి, ఇంకా వారి హృదయాలు ఆయన వైపుకు మొగ్గటానికి (కూడా ఈ విధంగా చేయబడింది). నిశ్చయంగా అల్లాహ్‌ విశ్వసించిన వారికి రుజుమార్గం వైపునకు దర్శకత్వం వహిస్తాడు.
22:55  وَلَا يَزَالُ الَّذِينَ كَفَرُوا فِي مِرْيَةٍ مِّنْهُ حَتَّىٰ تَأْتِيَهُمُ السَّاعَةُ بَغْتَةً أَوْ يَأْتِيَهُمْ عَذَابُ يَوْمٍ عَقِيمٍ
తమపై అకస్మాత్తుగా ప్రళయ ఘడియ వచ్చిపడేవరకూ లేదా తమ వద్దకు అశుభ దినపు శిక్ష వచ్చేవరకూ అవిశ్వాసులు దైవ సందేశం (వహీ) గురించి సంశయంలోనే పడి ఉంటారు.
22:56  الْمُلْكُ يَوْمَئِذٍ لِّلَّهِ يَحْكُمُ بَيْنَهُمْ ۚ فَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فِي جَنَّاتِ النَّعِيمِ
ఆ రోజు సర్వసత్తాధికారం అల్లాహ్‌దే. ఆయనే వారి మధ్య తీర్పులు చేస్తాడు. మరి విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు వరాలు నిండిన స్వర్గవనాలలో ఉంటారు.
22:57  وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا فَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ
విశ్వసించకుండా, మా ఆయతులను ధిక్కరించినవారి కోసం అవమానభరితమైన శిక్ష ఉంది.
22:58  وَالَّذِينَ هَاجَرُوا فِي سَبِيلِ اللَّهِ ثُمَّ قُتِلُوا أَوْ مَاتُوا لَيَرْزُقَنَّهُمُ اللَّهُ رِزْقًا حَسَنًا ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ خَيْرُ الرَّازِقِينَ
ఎవరయితే అల్లాహ్‌ మార్గంలో (స్వస్థలాన్ని వదలి) వలసపోయారో, తరువాత చంపబడ్డారో లేదా చనిపోయారో, వారికి అల్లాహ్‌ అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదిస్తాడు. నిస్సందేహంగా అల్లాహ్‌ మాత్రమే ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు.
22:59  لَيُدْخِلَنَّهُم مُّدْخَلًا يَرْضَوْنَهُ ۗ وَإِنَّ اللَّهَ لَعَلِيمٌ حَلِيمٌ
వారు ఇష్టపడే చోటికి ఆయన వారిని చేరుస్తాడు. అల్లాహ్‌ అన్నీ తెలిసినవాడు, ఓరిమి కలవాడు.
22:60  ذَٰلِكَ وَمَنْ عَاقَبَ بِمِثْلِ مَا عُوقِبَ بِهِ ثُمَّ بُغِيَ عَلَيْهِ لَيَنصُرَنَّهُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ لَعَفُوٌّ غَفُورٌ
ఇదీ (వారికి లభించే పుణ్యఫలం). తనకు బాధపెట్టబడిన మేరకే ప్రతీకారం తీర్చుకున్న వ్యక్తిపై తిరిగి దౌర్జన్యం జరిపితే,అప్పుడు అల్లాహ్‌ స్వయంగా అతనికి తోడ్పడతాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మన్నించి వదలిపెట్టేవాడు, క్షమాభిక్షపెట్టేవాడూను.
22:61  ذَٰلِكَ بِأَنَّ اللَّهَ يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَأَنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
అల్లాహ్‌ రాత్రిని పగటిలోనూ, పగటిని రాత్రిలోనూ ప్రవేశింపజేస్తూ ఉండటం వల్లనూ, నిశ్చయంగా అల్లాహ్‌ వినేవాడు, చూచే వాడవటం వల్లనూ ఈ విధంగా జరుగుతోంది.
22:62  ذَٰلِكَ بِأَنَّ اللَّهَ هُوَ الْحَقُّ وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ هُوَ الْبَاطِلُ وَأَنَّ اللَّهَ هُوَ الْعَلِيُّ الْكَبِيرُ
ఇంకా అల్లాహ్‌యే సత్యం అవటం మూలంగా, అల్లాహ్‌ను వదలి వారు మొర పెట్టుకునే వారంతా అసత్యం అవటం మూలంగా, ముమ్మాటికీ అల్లాహ్‌యే సర్వోన్నతుడు, గొప్పవాడు అవటం మూలంగా ఇలా జరుగుతోంది.
22:63  أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَتُصْبِحُ الْأَرْضُ مُخْضَرَّةً ۗ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ
ఏమిటీ, అల్లాహ్‌ ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపించటాన్ని, ఆపైన భూమి పచ్చగా కళకళలాడటాన్ని నువ్వు చూడటం లేదా? నిస్సందేహంగా అల్లాహ్‌ దయాశీలి. సర్వాన్నీ ఎరిగినవాడు.
22:64  لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِنَّ اللَّهَ لَهُوَ الْغَنِيُّ الْحَمِيدُ
భూమ్యాకాశాలలో వున్న సమస్తం ఆయనదే. నిశ్చయంగా అల్లాహ్‌యే అక్కర లేనివాడు, ప్రశంసనీయుడు.
22:65  أَلَمْ تَرَ أَنَّ اللَّهَ سَخَّرَ لَكُم مَّا فِي الْأَرْضِ وَالْفُلْكَ تَجْرِي فِي الْبَحْرِ بِأَمْرِهِ وَيُمْسِكُ السَّمَاءَ أَن تَقَعَ عَلَى الْأَرْضِ إِلَّا بِإِذْنِهِ ۗ إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ
ఏమిటీ, అల్లాహ్‌ భూమండలంలో ఉన్న సమస్తాన్నీ, ఆయన ఆదేశానుసారమే సముద్రంలో నడిచే ఓడలను మీకు వశ పరచటాన్ని మీరు చూడటం లేదా? తన అనుజ్ఞ కానంతవరకూ భూమిపై విరుచుకుపడకుండా ఉండేలా ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మనుషులపై దయార్ద్రత కలవాడు, జాలి చూపేవాడు.
22:66  وَهُوَ الَّذِي أَحْيَاكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ۗ إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ
మీకు జీవనం ప్రసాదించినవాడు ఆయనే. మరి ఆయనే మీకు మరణం వొసగుతాడు. మళ్లీ ఆయనే మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాడు. అయినా మానవుడు మేలును మరిచేవాడే.
22:67  لِّكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا هُمْ نَاسِكُوهُ ۖ فَلَا يُنَازِعُنَّكَ فِي الْأَمْرِ ۚ وَادْعُ إِلَىٰ رَبِّكَ ۖ إِنَّكَ لَعَلَىٰ هُدًى مُّسْتَقِيمٍ
ప్రతి అనుచర సమాజానికీ మేము ఒక ఆరాధనా పద్ధతిని నిర్థారించి ఉన్నాము. దాన్ని వారు పాటిస్తున్నారు. కాబట్టి వారు ఈ విషయంలో నీతో గొడవ పడకూడదు. నువ్వు మాత్రం ప్రజలను నీ ప్రభువు వైపు పిలువు. నిశ్చయంగా నువ్వు సన్మార్గాన ఉన్నావు.
22:68  وَإِن جَادَلُوكَ فَقُلِ اللَّهُ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ
ఒకవేళ అప్పటికీ వాళ్లు నీతో వాదులాటకు దిగితే వారికి ఇలా చెప్పెయ్యి: "మీ కర్మల సంగతి అల్లాహ్‌కు బాగా తెలుసు లెండి.
22:69  اللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
"మీరు విభేదించుకుంటున్న విషయాల గురించి అల్లాహ్‌ ప్రళయదినాన మీ మధ్య తప్పకుండా తీర్పు చేస్తాడు."
22:70  أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاءِ وَالْأَرْضِ ۗ إِنَّ ذَٰلِكَ فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించీ అల్లాహ్‌కు తెలుసన్న సంగతి నీకు తెలియదా? అంతా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. నిస్సందేహంగా ఈ విషయం అల్లాహ్‌కు చాలా సులువైనది.
22:71  وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا وَمَا لَيْسَ لَهُم بِهِ عِلْمٌ ۗ وَمَا لِلظَّالِمِينَ مِن نَّصِيرٍ
వారు అల్లాహ్‌ను వదలి ఆయన ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యనటువంటి వాటిని పూజిస్తున్నారు. పోనీ వారికైనా తత్సంబంధిత జ్ఞానం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. దుర్మార్గులను ఆదుకునే వాడెవడూ లేడు.
22:72  وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ تَعْرِفُ فِي وُجُوهِ الَّذِينَ كَفَرُوا الْمُنكَرَ ۖ يَكَادُونَ يَسْطُونَ بِالَّذِينَ يَتْلُونَ عَلَيْهِمْ آيَاتِنَا ۗ قُلْ أَفَأُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكُمُ ۗ النَّارُ وَعَدَهَا اللَّهُ الَّذِينَ كَفَرُوا ۖ وَبِئْسَ الْمَصِيرُ
వారి ముందు స్పష్టమైన మా ఆయతులను చదివి వినిపించినప్పుడు అవిశ్వాసుల ముఖాలపై తిరస్కార (అసహన) భావం తొంగిచూడటాన్ని నువ్వు గ్రహిస్తావు. మా ఆయతులను చదివి వినిపించే వారిపై విరుచుకుపడతారేమో అన్నట్లు వారు కనిపిస్తారు.(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "దీనికన్నా దారుణమైన సమాచారాన్ని నేను మీకు తెలుపనా?! అదే నరకాగ్ని. దాని గురించి అల్లాహ్‌ అవిశ్వాసులకు వాగ్దానం చేసి ఉన్నాడు. అది బహుచెడ్డ గమ్యస్థానం."
22:73  يَا أَيُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوا لَهُ ۚ إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ لَن يَخْلُقُوا ذُبَابًا وَلَوِ اجْتَمَعُوا لَهُ ۖ وَإِن يَسْلُبْهُمُ الذُّبَابُ شَيْئًا لَّا يَسْتَنقِذُوهُ مِنْهُ ۚ ضَعُفَ الطَّالِبُ وَالْمَطْلُوبُ
ఓ ప్రజలారా! ఒక ఉపమానం వివరించబడుతోంది - శ్రద్ధగా వినండి. అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే మొర పెట్టుకుంటున్నారో, వారంతా ఏకమైనా- ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. పైగా ఈగ వారి నుంచి ఏదైనా వస్తువును ఎగరేసుకుపోతే వారు దాన్ని కూడా దాని నుండి విడిపించుకోలేరు. అర్థించేవాడూ, అర్థించబడేవాడూ - ఇరువురూ బలహీనులే.
22:74  مَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ ۗ إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ
వీళ్లు అల్లాహ్‌ స్థాయికి అనుగుణంగా ఆయన గొప్పదనాన్ని గుర్తించనే లేదు. అల్లాహ్‌ మహా శక్తిశాలి, ప్రాబల్యం కలవాడు.
22:75  اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
అల్లాహ్‌యే దైవదూతలలో నుంచి, మానవులలో నుంచి తన సందేశహరులను ఎంపిక చేసుకుంటాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వింటాడు, అన్నీ చూస్తాడు.
22:76  يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۗ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
వారికి ముందున్నదీ, వారికి వెనుక ఉన్నదీ - అంతా ఆయనకు తెలుసు. సమస్త వ్యవహారాలు అల్లాహ్‌ వైపుకే మరలించబడతాయి.
22:77  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ارْكَعُوا وَاسْجُدُوا وَاعْبُدُوا رَبَّكُمْ وَافْعَلُوا الْخَيْرَ لَعَلَّكُمْ تُفْلِحُونَ ۩
ఓ విశ్వాసులారా! రుకూ, సజ్దాలు చేస్తూ ఉండండి. మీ ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. మంచి పనులు చేస్తూ ఉండండి- తద్వారా మీరు సఫలీకృతులవుతారు.
22:78  وَجَاهِدُوا فِي اللَّهِ حَقَّ جِهَادِهِ ۚ هُوَ اجْتَبَاكُمْ وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ ۚ مِّلَّةَ أَبِيكُمْ إِبْرَاهِيمَ ۚ هُوَ سَمَّاكُمُ الْمُسْلِمِينَ مِن قَبْلُ وَفِي هَٰذَا لِيَكُونَ الرَّسُولُ شَهِيدًا عَلَيْكُمْ وَتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ ۚ فَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَاعْتَصِمُوا بِاللَّهِ هُوَ مَوْلَاكُمْ ۖ فَنِعْمَ الْمَوْلَىٰ وَنِعْمَ النَّصِيرُ
అల్లాహ్‌ (ప్రసన్నత) కోసం పాటుపడవలసిన విధంగా పాటుపడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రాహీము (అలైహిస్సలాం) ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖుర్‌ఆన్‌కు పూర్వం కూడా ఆయన (అల్లాహ్‌) మిమ్మల్ని 'ముస్లింలు' గానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా (మీ పేరు అదే). దైవప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాళిపై సాక్షులుగా ఉండటానికి(ఈ విధంగా చేయబడింది). కనుక మీరు నమాజును నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాహ్‌ను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు! (ఆయన) ఎంత చక్కని సంరక్షకుడు! మరెంత చక్కని సహాయకుడు!


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.