Translation
| 1. సూరా అల్ ఫాతిహా 1:1 بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతొ 1:2 الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, 1:3 الرَّحْمَٰنِ الرَّحِيمِ అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. 1:4 مَالِكِ يَوْمِ الدِّينِ ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. 1:5 إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. 1:6 اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. 1:7 صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు). ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |