aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

19. సూరా మర్యం

19:1  كهيعص
కాఫ్‌ - హా - యా - ఐన్‌ - సాద్‌. –
19:2  ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهُ زَكَرِيَّا
నీ ప్రభువు తన దాసుడైన జకరియ్యాపై దయదలచినప్పటి ప్రస్తావన ఇది.
19:3  إِذْ نَادَىٰ رَبَّهُ نِدَاءً خَفِيًّا
అతను తన ప్రభువును గోప్యంగా మొరపెట్టుకున్నప్పుడు (జరిగిన సంఘటన ఇది).
19:4  قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا
అతనిలా విన్నవించుకున్నాడు: "నా ప్రభూ! నా ఎముకలు బలహీనమైపోయాయి. వార్థక్యం వల్ల నా తల నెరసిపోయింది. నిన్ను ప్రార్థించి నేనెన్నడూ విఫలుణ్ణి కాలేదు.
19:5  وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا
"నా తదనంతరం నా ఆప్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు. కాబట్టి (ఓ అల్లాహ్‌!) నాకు వారసుడు ఇవ్వు .
19:6  يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا
నాకు వారసుడుగా ఉండటంతోపాటు, యాఖూబు సంతతికి కూడా వారసుడు అయ్యే ఒక వారసుణ్ణి నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు. ప్రభూ! నువ్వతన్ని ప్రియతమునిగా చేయి."
19:7  يَا زَكَرِيَّا إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ اسْمُهُ يَحْيَىٰ لَمْ نَجْعَل لَّهُ مِن قَبْلُ سَمِيًّا
"ఓ జకరియ్యా! మేము నీకు ఒక కుమారుని శుభవార్తను వినిపిస్తున్నాము - అతని పేరు యహ్యా. మేము ఇంతకు ముందు ఈ పేరుగల వానిని చేయలేదు" (అని సెలవీయబడింది).
19:8  قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا وَقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِيًّا
"నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నా భార్యయేమో గొడ్రాలు. నేనేమో వృద్ధాప్యపు ఆఖరి దశకు చేరుకున్నవాణ్ణి" అని జకరియ్యా చెప్పుకున్నాడు.
19:9  قَالَ كَذَٰلِكَ قَالَ رَبُّكَ هُوَ عَلَيَّ هَيِّنٌ وَقَدْ خَلَقْتُكَ مِن قَبْلُ وَلَمْ تَكُ شَيْئًا
"అలాగే అవుతుంది" అని సెలవీయబడింది. "అది నాకు చాలా తేలిక. ఇంతకు ముందు నీకంటూ ఒక అస్థిత్వమే లేనపుడు నేను నిన్ను పుట్టించలేదా?!" అని నీ ప్రభువు అన్నాడు.
19:10  قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۚ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَ لَيَالٍ سَوِيًّا
"నా ప్రభూ! (మరయితే) నా కొరకు ఏదన్నా సూచనను నిర్ణయించు" అని అతను విన్నవించుకోగా,"నువ్వు కులాసాగా ఉన్నప్పటికీ మూడు రాత్రుల వరకూ ప్రజలతో మాట్లాడలేవు. ఇదే నీ కొరకు ఆనవాలు" అని సెలవీయబడింది.
19:11  فَخَرَجَ عَلَىٰ قَوْمِهِ مِنَ الْمِحْرَابِ فَأَوْحَىٰ إِلَيْهِمْ أَن سَبِّحُوا بُكْرَةً وَعَشِيًّا
అందువల్ల అతను తన కుటీరం నుంచి తన జాతి ప్రజల వద్దకు వచ్చి, ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడమని సైగ ద్వారా ఉపదేశించసాగాడు.
19:12  يَا يَحْيَىٰ خُذِ الْكِتَابَ بِقُوَّةٍ ۖ وَآتَيْنَاهُ الْحُكْمَ صَبِيًّا
"ఓ యహ్యా! నా గ్రంథాన్ని గట్టిగా పట్టుకో." మేమతనికి బాల్యం నుంచే విజ్ఞతను వొసగాము.
19:13  وَحَنَانًا مِّن لَّدُنَّا وَزَكَاةً ۖ وَكَانَ تَقِيًّا
ఇంకా మా వద్ద నుంచి వాత్సల్యాన్నీ, పవిత్రతను కూడా ప్రసాదించాము. అతను భయభక్తులు గలవాడు.
19:14  وَبَرًّا بِوَالِدَيْهِ وَلَمْ يَكُن جَبَّارًا عَصِيًّا
అతను తన తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతను దౌర్జన్యపరుడూ కాడు, అవిధేయుడూ కాడు.
19:15  وَسَلَامٌ عَلَيْهِ يَوْمَ وُلِدَ وَيَوْمَ يَمُوتُ وَيَوْمَ يُبْعَثُ حَيًّا
అతను పుట్టిన రోజునా, మరణించే రోజునా, అతను తిరిగి బ్రతికించి లేపబడే రోజునా అతనికి శాంతి కల్గుగాక!
19:16  وَاذْكُرْ فِي الْكِتَابِ مَرْيَمَ إِذِ انتَبَذَتْ مِنْ أَهْلِهَا مَكَانًا شَرْقِيًّا
(ఓ ముహమ్మద్‌ - స!) ఈ గ్రంథంలో మర్యమ్‌ విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడామె తన వాళ్ళనుంచి వేరై, తూర్పు వైపుకు వచ్చింది.
19:17  فَاتَّخَذَتْ مِن دُونِهِمْ حِجَابًا فَأَرْسَلْنَا إِلَيْهَا رُوحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِيًّا
ఆ తరువాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ (జిబ్రయీలు అలైహిస్సలాం)ను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు.
19:18  قَالَتْ إِنِّي أَعُوذُ بِالرَّحْمَٰنِ مِنكَ إِن كُنتَ تَقِيًّا
"నేను నీ బారి నుంచి కరుణామయుని (అల్లాహ్‌) శరణు వేడుతున్నాను, నువ్వు ఏ మాత్రం దైవభీతి గలవాడవైనా (ఇక్కణ్ణుంచి వెళ్ళిపో)" అని ఆమె చెప్పింది.
19:19  قَالَ إِنَّمَا أَنَا رَسُولُ رَبِّكِ لِأَهَبَ لَكِ غُلَامًا زَكِيًّا
"నేను నీ ప్రభువు తరఫున పంపబడిన దూతను. నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వటానికి వచ్చాను" అని అతనన్నాడు.
19:20  قَالَتْ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ وَلَمْ أَكُ بَغِيًّا
"నాకు పిల్లవాడు కలగటమేమిటీ? నన్ను ఏ మగాడూ కనీసం తాకనైనా లేదే! నేను దుర్నడత గల దాన్ని కూడా కానే!!" అని ఆమె అన్నది.
19:21  قَالَ كَذَٰلِكِ قَالَ رَبُّكِ هُوَ عَلَيَّ هَيِّنٌ ۖ وَلِنَجْعَلَهُ آيَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ وَكَانَ أَمْرًا مَّقْضِيًّا
"జరిగేది మాత్రం ఇదే. 'అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం' అని నీ ప్రభువు సెలవిచ్చాడు" అని అతను వివరించాడు.
19:22  فَحَمَلَتْهُ فَانتَبَذَتْ بِهِ مَكَانًا قَصِيًّا
అంతే, ఆమె గర్భవతి అయింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది.
19:23  فَأَجَاءَهَا الْمَخَاضُ إِلَىٰ جِذْعِ النَّخْلَةِ قَالَتْ يَا لَيْتَنِي مِتُّ قَبْلَ هَٰذَا وَكُنتُ نَسْيًا مَّنسِيًّا
ఆ తరువాత పురిటినొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు క్రిందికి చేర్చాయి. "అయ్యో! నేను ఇంతకు మునుపే చచ్చిపోయి వుంటే, లోకులు నన్ను మరచిపోయి ఉంటే బావుండునే!" అని ఆమె బాధపడసాగింది.
19:24  فَنَادَاهَا مِن تَحْتِهَا أَلَّا تَحْزَنِي قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِيًّا
అంతలో (దైవదూత) క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు: "బాధ పడకు. నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు.
19:25  وَهُزِّي إِلَيْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسَاقِطْ عَلَيْكِ رُطَبًا جَنِيًّا
"ఆ ఖర్జూరపు మొదలును నీ వైపుకు ఊపు. తాజా ఖర్జూర పండ్లు నీపై రాల్తాయి.
19:26  فَكُلِي وَاشْرَبِي وَقَرِّي عَيْنًا ۖ فَإِمَّا تَرَيِنَّ مِنَ الْبَشَرِ أَحَدًا فَقُولِي إِنِّي نَذَرْتُ لِلرَّحْمَٰنِ صَوْمًا فَلَنْ أُكَلِّمَ الْيَوْمَ إِنسِيًّا
"ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏమనిషైనా నీకు తారసపడితే, 'నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను' అని చెప్పు."
19:27  فَأَتَتْ بِهِ قَوْمَهَا تَحْمِلُهُ ۖ قَالُوا يَا مَرْيَمُ لَقَدْ جِئْتِ شَيْئًا فَرِيًّا
ఆ తరువాత ఆమె ఆ పసివాణ్ణి ఎత్తుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. "ఓ మర్యమ్‌! నువ్వు పెద్ద పాపం చేశావు.
19:28  يَا أُخْتَ هَارُونَ مَا كَانَ أَبُوكِ امْرَأَ سَوْءٍ وَمَا كَانَتْ أُمُّكِ بَغِيًّا
ఓ హారూన్‌ సోదరీ! నీ తండ్రీ చెడ్డవాడు కాడు. నీ తల్లి కూడా చెడు నడత గల స్త్రీ కాదే!" అని అందరూ అన్నారు.
19:29  فَأَشَارَتْ إِلَيْهِ ۖ قَالُوا كَيْفَ نُكَلِّمُ مَن كَانَ فِي الْمَهْدِ صَبِيًّا
మర్యమ్‌ తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. "ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమెలా మాట్లాడగలం?" అన్నారు వారంతా.
19:30  قَالَ إِنِّي عَبْدُ اللَّهِ آتَانِيَ الْكِتَابَ وَجَعَلَنِي نَبِيًّا
ఆ పసివాడు ఇలా పలికాడు: "నేను అల్లాహ్‌ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు.
19:31  وَجَعَلَنِي مُبَارَكًا أَيْنَ مَا كُنتُ وَأَوْصَانِي بِالصَّلَاةِ وَالزَّكَاةِ مَا دُمْتُ حَيًّا
"నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు."
19:32  وَبَرًّا بِوَالِدَتِي وَلَمْ يَجْعَلْنِي جَبَّارًا شَقِيًّا
"ఇంకా - ఆయన నన్ను నా తల్లికి సేవచేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగానూ, దౌర్భాగ్యునిగానూ చేయలేదు.
19:33  وَالسَّلَامُ عَلَيَّ يَوْمَ وُلِدتُّ وَيَوْمَ أَمُوتُ وَيَوْمَ أُبْعَثُ حَيًّا
"నేను పుట్టిన రోజూ, నేను చనిపోయే రోజూ, నేను సజీవినై తిరిగి లేపబడేరోజూ నాపై శాంతి కలుగుతుంది."
19:34  ذَٰلِكَ عِيسَى ابْنُ مَرْيَمَ ۚ قَوْلَ الْحَقِّ الَّذِي فِيهِ يَمْتَرُونَ
ఇదీ మర్యమ్‌ కుమారుడైన ఈసా యదార్థ గాథ. ప్రజలు సంశయంలో పడివున్న సత్యవాక్కు ఇదే.
19:35  مَا كَانَ لِلَّهِ أَن يَتَّخِذَ مِن وَلَدٍ ۖ سُبْحَانَهُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
అల్లాహ్‌కు సంతానం ఉండటం అనేది ఎంత మాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు 'అయిపో' అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది.
19:36  وَإِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
నిశ్చయంగా నాకూ, మీకందరికీ ప్రభువు అల్లాహ్‌ మాత్రమే. కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం (అని ఈసా - ఏసుక్రీస్తు - బోధించాడు).
19:37  فَاخْتَلَفَ الْأَحْزَابُ مِن بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن مَّشْهَدِ يَوْمٍ عَظِيمٍ
మరి ఈ ముఠాలు పరస్పరం విభేదించుకున్నాయి. కాబట్టి సత్యతిరస్కారులు ఒక మహా (కఠినమైన) దినాన హాజరైనపుడు, వారికి మూడుతుంది.
19:38  أَسْمِعْ بِهِمْ وَأَبْصِرْ يَوْمَ يَأْتُونَنَا ۖ لَٰكِنِ الظَّالِمُونَ الْيَوْمَ فِي ضَلَالٍ مُّبِينٍ
వారు మా సమక్షంలో హాజరైన రోజు ఎంత బాగా వింటూ, చూస్తూ ఉంటారు! కాని ఈ దుర్మార్గులు ఈనాడు మాత్రం స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు.
19:39  وَأَنذِرْهُمْ يَوْمَ الْحَسْرَةِ إِذْ قُضِيَ الْأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ وَهُمْ لَا يُؤْمِنُونَ
వ్యవహారం తేల్చబడి వారు బాధపడే రోజు గురించి (ఓ ముహమ్మద్‌ - సఅసం!) వారిని హెచ్చరించు. (ఏమైనా) వారు పరధ్యానానికి గురై ఉన్నారు. వారు విశ్వసించే రకం కాదు.
19:40  إِنَّا نَحْنُ نَرِثُ الْأَرْضَ وَمَنْ عَلَيْهَا وَإِلَيْنَا يُرْجَعُونَ
స్వయంగా మేమే భూమికీ, భూమిపై ఉండే వారందరికీ వారసులమవుతాము. వారంతా మా వద్దకే మరలించబడతారు.
19:41  وَاذْكُرْ فِي الْكِتَابِ إِبْرَاهِيمَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا
ఈ గ్రంథంలో ఇబ్రాహీము (అలైహిస్సలాం) వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ప్రవక్త.
19:42  إِذْ قَالَ لِأَبِيهِ يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ وَلَا يُغْنِي عَنكَ شَيْئًا
అతను తన తండ్రితో, "ఓ నాన్నా! వినలేని, చూడలేని, మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు?
19:43  يَا أَبَتِ إِنِّي قَدْ جَاءَنِي مِنَ الْعِلْمِ مَا لَمْ يَأْتِكَ فَاتَّبِعْنِي أَهْدِكَ صِرَاطًا سَوِيًّا
"ఓ పితామహా! చూడండి! మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది. కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను.
19:44  يَا أَبَتِ لَا تَعْبُدِ الشَّيْطَانَ ۖ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلرَّحْمَٰنِ عَصِيًّا
"ఓ తండ్రీ! మీరు షైతాను దాస్యాన్ని విడనాడండి. నిశ్చయంగా షైతాన్‌ కరుణామయుడైన అల్లాహ్‌కు అవిధేయుడు.
19:45  يَا أَبَتِ إِنِّي أَخَافُ أَن يَمَسَّكَ عَذَابٌ مِّنَ الرَّحْمَٰنِ فَتَكُونَ لِلشَّيْطَانِ وَلِيًّا
"ఓ నా తండ్రీ! తమరు ఎక్కడ కరుణామయుని ఆగ్రహానికి గురవుతారోనని, షైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది" అని అన్నప్పుడు...
19:46  قَالَ أَرَاغِبٌ أَنتَ عَنْ آلِهَتِي يَا إِبْرَاهِيمُ ۖ لَئِن لَّمْ تَنتَهِ لَأَرْجُمَنَّكَ ۖ وَاهْجُرْنِي مَلِيًّا
"ఓ ఇబ్రాహీం! నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా? విను! నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదలిపెట్టు" అని అతని తండ్రి అన్నాడు.
19:47  قَالَ سَلَامٌ عَلَيْكَ ۖ سَأَسْتَغْفِرُ لَكَ رَبِّي ۖ إِنَّهُ كَانَ بِي حَفِيًّا
"సరే (నాన్నా). మీకు సలాం! నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటూనే ఉంటాను. నిశ్చయంగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు.
19:48  وَأَعْتَزِلُكُمْ وَمَا تَدْعُونَ مِن دُونِ اللَّهِ وَأَدْعُو رَبِّي عَسَىٰ أَلَّا أَكُونَ بِدُعَاءِ رَبِّي شَقِيًّا
"నేను మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదలి పోతున్నాను. కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకుని విఫలుణ్ణి కానన్న నమ్మకం నాకుంది" అని (ఇబ్రాహీం) చెప్పాడు.
19:49  فَلَمَّا اعْتَزَلَهُمْ وَمَا يَعْبُدُونَ مِن دُونِ اللَّهِ وَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۖ وَكُلًّا جَعَلْنَا نَبِيًّا
ఆ విధంగా ఇబ్రాహీం వాళ్ళందరినీ, వారు అల్లాహ్‌ను కాదని పూజించే వారందరినీ వదలి పోయినప్పుడు, మేమతనికి ఇస్‌హాఖ్‌ను, యాఖూబును అనుగ్రహించాము. వారిద్దరినీ ప్రవక్తలుగా చేశాము.
19:50  وَوَهَبْنَا لَهُم مِّن رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِيًّا
వారందరికీ మేము మా కరుణను ప్రసాదించి, (భావి తరాల నోట) వారి శుభ నామస్మరణను ఉన్నతం చేశాము.
19:51  وَاذْكُرْ فِي الْكِتَابِ مُوسَىٰ ۚ إِنَّهُ كَانَ مُخْلَصًا وَكَانَ رَسُولًا نَّبِيًّا
ఈ ఖుర్‌ఆను గ్రంథంలో మూసా విషయాన్ని కూడా ప్రస్తావించు. అతను ఎన్నుకోబడినవాడు, సందేశ వాహకుడైన ప్రవక్త.
19:52  وَنَادَيْنَاهُ مِن جَانِبِ الطُّورِ الْأَيْمَنِ وَقَرَّبْنَاهُ نَجِيًّا
మేమతన్ని తూరు పర్వతం కుడివైపు నుంచి పిలిచాము. రహస్య సంభాషణ నిమిత్తం అతన్ని దగ్గరకు చేర్చాము.
19:53  وَوَهَبْنَا لَهُ مِن رَّحْمَتِنَا أَخَاهُ هَارُونَ نَبِيًّا
ఇంకా మా ప్రత్యేక కృపతో అతని సోదరుడైన హారూనును ప్రవక్తగా చేసి అతనికి (సహాయకునిగా) ఇచ్చాము.
19:54  وَاذْكُرْ فِي الْكِتَابِ إِسْمَاعِيلَ ۚ إِنَّهُ كَانَ صَادِقَ الْوَعْدِ وَكَانَ رَسُولًا نَّبِيًّا
ఈ గ్రంథంలో ఇస్మాయీలు వృత్తాంతాన్ని గురించి కూడా ప్రస్తావించు. అతను వాగ్దాన పాలనలో సత్యవంతుడు. మా తరఫున పంపబడిన సందేశహరుడు, ప్రవక్త కూడా.
19:55  وَكَانَ يَأْمُرُ أَهْلَهُ بِالصَّلَاةِ وَالزَّكَاةِ وَكَانَ عِندَ رَبِّهِ مَرْضِيًّا
అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాత్‌ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు.
19:56  وَاذْكُرْ فِي الْكِتَابِ إِدْرِيسَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا
ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితిపరుడైన ప్రవక్తే.
19:57  وَرَفَعْنَاهُ مَكَانًا عَلِيًّا
మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము.
19:58  أُولَٰئِكَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ مِن ذُرِّيَّةِ آدَمَ وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوحٍ وَمِن ذُرِّيَّةِ إِبْرَاهِيمَ وَإِسْرَائِيلَ وَمِمَّنْ هَدَيْنَا وَاجْتَبَيْنَا ۚ إِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُ الرَّحْمَٰنِ خَرُّوا سُجَّدًا وَبُكِيًّا ۩
అల్లాహ్‌ అనుగ్రహించిన ప్రవక్తలు వీరు. వారు ఆదం సంతతికి చెందినవారు. నూహుతో పాటు మేము ఓడలోకి ఎక్కించిన వారి వంశీయులు. ఇబ్రాహీము, యాఖూబు (ఇస్రాయీలు)సంతతికి చెందినవారు. వారంతా మా ద్వారా సన్మార్గం పొందినవారు, మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు. వారి ముందు కరుణామయుడైన దేవుని వచనాలు పారాయణం చేయబడినప్పుడు వారు విలపిస్తూ సాష్టాంగపడేవారు.
19:59  فَخَلَفَ مِن بَعْدِهِمْ خَلْفٌ أَضَاعُوا الصَّلَاةَ وَاتَّبَعُوا الشَّهَوَاتِ ۖ فَسَوْفَ يَلْقَوْنَ غَيًّا
ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి, నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు.
19:60  إِلَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ شَيْئًا
కాని పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు (మాత్రం నష్టపోరు). వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవంత కూడా అన్యాయం జరగదు.
19:61  جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدَ الرَّحْمَٰنُ عِبَادَهُ بِالْغَيْبِ ۚ إِنَّهُ كَانَ وَعْدُهُ مَأْتِيًّا
అగోచరాలైన, శాశ్వత స్వర్గవనాలలోకి (వారు ప్రవేశిస్తారు.) వాటిని గురించి కరుణామయుడు (అయిన అల్లాహ్‌) తన దాసులకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నెరవేరటం తథ్యం.
19:62  لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا إِلَّا سَلَامًا ۖ وَلَهُمْ رِزْقُهُمْ فِيهَا بُكْرَةً وَعَشِيًّا
అక్కడ వారు 'సలామ్‌' తప్ప వ్యర్థమైన మాటలేవీ వినరు. వారికోసం అక్కడ ఉదయం సాయంత్రం వారి ఆహారం సమకూరుతూ ఉంటుంది.
19:63  تِلْكَ الْجَنَّةُ الَّتِي نُورِثُ مِنْ عِبَادِنَا مَن كَانَ تَقِيًّا
మేము మా దాసులలో భయభక్తులు కలిగి ఉండేవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే.
19:64  وَمَا نَتَنَزَّلُ إِلَّا بِأَمْرِ رَبِّكَ ۖ لَهُ مَا بَيْنَ أَيْدِينَا وَمَا خَلْفَنَا وَمَا بَيْنَ ذَٰلِكَ ۚ وَمَا كَانَ رَبُّكَ نَسِيًّا
నీ ప్రభువు ఆజ్ఞ లేకుండా (దైవదూతలమైన) మేము దిగి రాలేము. మాకు ముందూ, వెనుకా, వాటికి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయన సొత్తే. నీ ప్రభువు మరచిపోయేవాడు కాడు.
19:65  رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهِ ۚ هَلْ تَعْلَمُ لَهُ سَمِيًّا
ఆకాశాలకూ, భూమికీ, వాటి మధ్య నున్న సమస్తానికీ ప్రభువు ఆయనే. కనుక నువ్వు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనపైనే స్థిరంగా ఉండు. నీకు తెలిసినంతవరకూ ఆయన పేరు గలవాడు ఎవడయినా ఉన్నాడా?
19:66  وَيَقُولُ الْإِنسَانُ أَإِذَا مَا مِتُّ لَسَوْفَ أُخْرَجُ حَيًّا
"ఏమిటీ, నేను చచ్చిన తరువాత మళ్లీ బ్రతికించి బయటికి తీయబడతానా?" అని మనిషి అంటున్నాడు.
19:67  أَوَلَا يَذْكُرُ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِن قَبْلُ وَلَمْ يَكُ شَيْئًا
ఇంతకుముందు అతనికంటూ ఒక అస్థిత్వం లేనపుడు మేమతన్ని సృష్టించామన్న సంగతి ఈ మనిషికి జ్ఞాపకం లేదా?
19:68  فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَالشَّيَاطِينَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِيًّا
నీ ప్రభువు సాక్షి! నిశ్చయంగా మేము వాళ్ళను, (వాళ్ళతో పాటు) షైతానులను కూడా పోగు చేసి, నరకం చుట్టూ వారిని మోకాళ్ళ మీద పడి ఉన్న స్థితిలో హాజరు పరుస్తాము.
19:69  ثُمَّ لَنَنزِعَنَّ مِن كُلِّ شِيعَةٍ أَيُّهُمْ أَشَدُّ عَلَى الرَّحْمَٰنِ عِتِيًّا
ఆ తరువాత కరుణామయుడైన అల్లాహ్‌ పట్ల ఎక్కువగా అహంకారంతో విర్రవీగే వారిని మేము ఒక్కో వర్గం నుంచి వేరు పరుస్తాము.
19:70  ثُمَّ لَنَحْنُ أَعْلَمُ بِالَّذِينَ هُمْ أَوْلَىٰ بِهَا صِلِيًّا
ఇంకా నరకంలోకి త్రోయబడటానికి ఎక్కువ అర్హులెవరో మాకు బాగా తెలుసు.
19:71  وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا
మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావలసిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే బాధ్యత ఆయనపై ఉంది.
19:72  ثُمَّ نُنَجِّي الَّذِينَ اتَّقَوا وَّنَذَرُ الظَّالِمِينَ فِيهَا جِثِيًّا
తర్వాత మేము భయభక్తులు కలిగివున్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో మోకాళ్లపైపడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము.
19:73  وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَيُّ الْفَرِيقَيْنِ خَيْرٌ مَّقَامًا وَأَحْسَنُ نَدِيًّا
స్పష్టమైన మా ఆయతులను వారి ముందు చదివి వినిపించినపుడు అవిశ్వాసులు "ఇంతకీ మన ఇరు వర్గాలలో ఎవరు మంచి స్థితిలోఉన్నారో, ఎవరి సభలు ఉత్తమంగా ఉన్నాయో చెప్పండి?" అని ముస్లిములతో అంటారు.
19:74  وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَحْسَنُ أَثَاثًا وَرِئْيًا
మేము వీరికి మునుపు వీళ్లకన్నాఎక్కువ సాధన సంపత్తులను, అట్టహాసాలను కలిగి ఉన్న ఎన్నో సముదాయాలను తుదముట్టించాము.
19:75  قُلْ مَن كَانَ فِي الضَّلَالَةِ فَلْيَمْدُدْ لَهُ الرَّحْمَٰنُ مَدًّا ۚ حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ إِمَّا الْعَذَابَ وَإِمَّا السَّاعَةَ فَسَيَعْلَمُونَ مَنْ هُوَ شَرٌّ مَّكَانًا وَأَضْعَفُ جُندًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "అపమార్గానికి లోనై ఉన్నవారికి కరుణామయుడైన అల్లాహ్‌ బాగా గడువు ఇస్తాడు. కడకు వారు- తమకు వాగ్దానం చేయబడుతున్న శిక్షను లేదా ప్రళయ గడియను చూచినపుడు ఎవరి స్థానం నికృష్టమైనదో, ఎవరి సమూహం బలహీనమైనదో తెలుసుకుంటారు."
19:76  وَيَزِيدُ اللَّهُ الَّذِينَ اهْتَدَوْا هُدًى ۗ وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ مَّرَدًّا
ఇంకా, సన్మార్గం పొందినవారి సన్మార్గంలో అల్లాహ్‌ వృద్ధిని వొసగుతాడు. మిగిలి ఉండే సత్కార్యాలు పుణ్యఫలం రీత్యానూ, పరిణామం రీత్యానూ నీ ప్రభువు సన్నిధిలో ఎంతో మేలైనవి.
19:77  أَفَرَأَيْتَ الَّذِي كَفَرَ بِآيَاتِنَا وَقَالَ لَأُوتَيَنَّ مَالًا وَوَلَدًا
మా ఆయతులను తిరస్కరించి, "నాకు సిరిసంపదలు, సంతానం తప్పకుండా వొసగబడతాయి" అని చెప్పేవాడిని నువ్వు చూశావా?
19:78  أَطَّلَعَ الْغَيْبَ أَمِ اتَّخَذَ عِندَ الرَّحْمَٰنِ عَهْدًا
అగోచర విషయమేదయినా అతనికి తెలిసిపోయిందా? లేదా ఆ మేరకు కరుణామయుడైన అల్లాహ్‌ నుంచి ఏదన్నా వాగ్దానం పొంది ఉన్నాడా?
19:79  كَلَّا ۚ سَنَكْتُبُ مَا يَقُولُ وَنَمُدُّ لَهُ مِنَ الْعَذَابِ مَدًّا
కానే కాదు. వాడు చెప్పేదంతా మేము వ్రాసిపెడతాము. వాడి కోసం శిక్షను పెంచుతూ పోతాము.
19:80  وَنَرِثُهُ مَا يَقُولُ وَيَأْتِينَا فَرْدًا
వాడు చెబుతున్న వస్తువులన్నింటినీ వాడి తదనంతరం మేము తీసేసుకుంటాము. వాడు ఒంటరిగా మా ముందు హాజరవుతాడు.
19:81  وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لِّيَكُونُوا لَهُمْ عِزًّا
వారు అల్లాహ్‌ను కాదని, ఇతరులను – తమకు ఆదరువుగా నిలుస్తారన్న ఉద్దేశంతో - ఆరాధ్యులుగా చేసుకున్నారు.
19:82  كَلَّا ۚ سَيَكْفُرُونَ بِعِبَادَتِهِمْ وَيَكُونُونَ عَلَيْهِمْ ضِدًّا
కాని అలా జరగనేరదు. వారి పూజలను వాళ్లు (వారి మిధ్యా దైవాలు) త్రోసి పుచ్చుతారు. పైగా వారికి శత్రువులుగా (వ్యతిరేకులుగా) మారతారు.
19:83  أَلَمْ تَرَ أَنَّا أَرْسَلْنَا الشَّيَاطِينَ عَلَى الْكَافِرِينَ تَؤُزُّهُمْ أَزًّا
సత్యాన్ని తిరస్కరించేవారిని అదేపనిగా పురిగొల్పుతూ ఉండే షైతానులను మేము వారిపైకి వదలటాన్ని నువ్వు చూడలేదా?
19:84  فَلَا تَعْجَلْ عَلَيْهِمْ ۖ إِنَّمَا نَعُدُّ لَهُمْ عَدًّا
నువ్వు వారి విషయంలో ఏమాత్రం తొందరపడకు. మేము స్వయంగా వారి గడువును లెక్కిస్తున్నాము.
19:85  يَوْمَ نَحْشُرُ الْمُتَّقِينَ إِلَى الرَّحْمَٰنِ وَفْدًا
భయభక్తులు గలవారిని కరుణామయుడైన అల్లాహ్‌ సన్నిధిలో అతిథులుగా మేము సమావేశపరచే రోజున,
19:86  وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا
అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము.
19:87  لَّا يَمْلِكُونَ الشَّفَاعَةَ إِلَّا مَنِ اتَّخَذَ عِندَ الرَّحْمَٰنِ عَهْدًا
అప్పుడు కరుణామయుడు అయిన అల్లాహ్‌ తరఫున హామీ పొందినవారు తప్ప ఇతరులెవరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు.
19:88  وَقَالُوا اتَّخَذَ الرَّحْمَٰنُ وَلَدًا
కరుణామయుడైన అల్లాహ్‌కు సంతానం ఉంది అని వారంటున్నారు.
19:89  لَّقَدْ جِئْتُمْ شَيْئًا إِدًّا
నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని తెచ్చారు.
19:90  تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ مِنْهُ وَتَنشَقُّ الْأَرْضُ وَتَخِرُّ الْجِبَالُ هَدًّا
త్వరలోనే ఆకాశాలు పగిలి, భూమి బ్రద్దలై, పర్వతాలు తుత్తునియలై పోతాయేమో,
19:91  أَن دَعَوْا لِلرَّحْمَٰنِ وَلَدًا
కరుణామయుడైన అల్లాహ్‌కు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా.
19:92  وَمَا يَنبَغِي لِلرَّحْمَٰنِ أَن يَتَّخِذَ وَلَدًا
సంతానం కలిగి ఉండటం అనేది కరుణామయుని (ఔన్నత్యాని)కి ఏమాత్రం శోభించదు.
19:93  إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَٰنِ عَبْدًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే.
19:94  لَّقَدْ أَحْصَاهُمْ وَعَدَّهُمْ عَدًّا
వారందరినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్కపెట్టి ఉంచాడు.
19:95  وَكُلُّهُمْ آتِيهِ يَوْمَ الْقِيَامَةِ فَرْدًا
వారంతా ప్రళయదినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు.
19:96  إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَيَجْعَلُ لَهُمُ الرَّحْمَٰنُ وُدًّا
నిశ్చయంగా విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారి యెడల కరుణామయుడైన అల్లాహ్‌ ప్రేమానురాగాలను సృజిస్తాడు.
19:97  فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ الْمُتَّقِينَ وَتُنذِرَ بِهِ قَوْمًا لُّدًّا
నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీదీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము.
19:98  وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هَلْ تُحِسُّ مِنْهُم مِّنْ أَحَدٍ أَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًا
మేము వీరికి మునుపు ఎన్నో సమూహాలను తుదముట్టించాము. వారిలో ఏ ఒక్కరి జాడనైనా నువ్వు పసిగట్ట గలుగుతున్నావా? లేక కనీసం వారి నిట్టూర్పునైనా వింటున్నావా??


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.