aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

17. సూరా బనీ ఇస్రాయీల్

17:1  سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ
తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్‌ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే; మేమతనికి మా (శక్తిసామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్‌ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు.
17:2  وَآتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ أَلَّا تَتَّخِذُوا مِن دُونِي وَكِيلًا
మేము మూసాకు గ్రంథాన్ని వొసగాము. దానిని ఇస్రాయీల్‌ సంతతి కోసం మార్గదర్శకంగా చేశాము. "మీరు నన్ను తప్ప వేరెవరినీ మీ కార్యసాధకునిగా చేసుకోకండి" అని (వారికి ఆజ్ఞాపించాము).
17:3  ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا
నూహుతో పాటు మేము (ఓడలో) ఎక్కించిన వారి సంతానమా! అతడు (నూహు) మాత్రం కృతజ్ఞతాపూర్వకంగా మెలగిన మా దాసుడు (అన్న సంగతిని తెలుసుకోండి).
17:4  وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا
మీరు భువిలో రెండుసార్లు కల్లోలాన్ని రేకెత్తిస్తారనీ, మరీ దారుణంగా చెలరేగి పోతారని ఇస్రాయీలు సంతతి వారికి మేము వారి గ్రంథంలో స్పష్టంగా తేల్చివేశాము.
17:5  فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَّنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۚ وَكَانَ وَعْدًا مَّفْعُولًا
ఆ రెండింటిలో మొదటి వాగ్దానం వచ్చేసినప్పుడు, మీకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడే మా దాసులను పంపించాము. వారు మీ ఇళ్ళల్లోనికి చొచ్చుకుని వచ్చారు. ఎందుకంటే ఆ వాగ్దానం నెరవేరటం తథ్యం గనక.
17:6  ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا
మరి ఆ తరువాత మేము మీకు వారిపై ఆధిక్యతను వొసగి, మీ రోజులు మార్చాము. సంపద ద్వారా, సంతానం ద్వారా మీకు సహాయపడ్డాము. ఇంకా మిమ్మల్ని భారీ సంఖ్యాబలం గలవారు చేశాము.
17:7  إِنْ أَحْسَنتُمْ أَحْسَنتُمْ لِأَنفُسِكُمْ ۖ وَإِنْ أَسَأْتُمْ فَلَهَا ۚ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءُوا وُجُوهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَلِيُتَبِّرُوا مَا عَلَوْا تَتْبِيرًا
ఒకవేళ మీరు మంచి చేస్తే ఆ మంచి మీ స్వయం కోసమే. ఒకవేళ మీరు చెడుకు ఒడిగడితే అది మీ పాలిటే హానికరంగా పరిణమిస్తుంది. మరి రెండవ వాగ్దాన సమయం వచ్చినప్పుడు- మీ ముఖాలను వికృతం చేయటానికి మొదటిసారి లాగానే మళ్లీ అదే మస్జిదులోనికి జొరబడటానికి, తమకు దొరికిన దానినల్లా ధ్వంసం చేయటానికి (మేము ఇతరులను మీపైకి పంపాము).
17:8  عَسَىٰ رَبُّكُمْ أَن يَرْحَمَكُمْ ۚ وَإِنْ عُدتُّمْ عُدْنَا ۘ وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ حَصِيرًا
మీ ప్రభువు మీపై కరుణ చూపే అవకాశం ఉంది. కాని మీరు గనక మళ్లీ అలాగే చేయటం మొదలెడితే మేము కూడా మళ్లీ అలాగే చేస్తాము. మేము నరకాన్ని తిరస్కారుల కోసం కారాగారంగా చేసి ఉంచాము.
17:9  إِنَّ هَٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا
నిశ్చయంగా ఈ ఖుర్‌ఆన్‌ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫల ముందన్న శుభవార్తను అది వినిపిస్తుంది.
17:10  وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا
ఇంకా, పరలోకాన్ని నమ్మనివారి కోసం మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము.
17:11  وَيَدْعُ الْإِنسَانُ بِالشَّرِّ دُعَاءَهُ بِالْخَيْرِ ۖ وَكَانَ الْإِنسَانُ عَجُولًا
మానవుడు తన కోసం మేలును అర్థించినట్లే కీడునూ అర్థిస్తున్నాడు. మానవుడు మహా తొందరపాటు స్వభావి.
17:12  وَجَعَلْنَا اللَّيْلَ وَالنَّهَارَ آيَتَيْنِ ۖ فَمَحَوْنَا آيَةَ اللَّيْلِ وَجَعَلْنَا آيَةَ النَّهَارِ مُبْصِرَةً لِّتَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ وَلِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ وَكُلَّ شَيْءٍ فَصَّلْنَاهُ تَفْصِيلًا
మేము రేయింబవళ్ళను (మాశక్తి) సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనంగానూ, పగటి సూచనను కాంతిమంతంగానూ చేశాము - మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించగలగటానికి! సంవత్సరాల సంఖ్యను, లెక్కను తెలుసు కోగలగటానికి!! మేము ప్రతి విషయాన్ని బాగా విడమరచి చెప్పాము.
17:13  وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ ۖ وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا
మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని (అతని సమక్షంలో) బయటపెడతాము. దాన్ని అతను తెరచిన పుస్తకంలా చూసుకుంటాడు.
17:14  اقْرَأْ كِتَابَكَ كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا
"(ఇదిగో!) నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నువ్వే చాలు" (అని అతనితో అనబడుతుంది).
17:15  مَّنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولًا
సన్మార్గాన్ని పొందేవాడు తన మేలు కోసమే సన్మార్గాన్ని పొందుతాడు. పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడౌతాడు. బరువు మోసే వాడెవడూ ఇంకొకరి బరువును తనపై వేసుకోడు. ఒక ప్రవక్తను పంపనంతవరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు.
17:16  وَإِذَا أَرَدْنَا أَن نُّهْلِكَ قَرْيَةً أَمَرْنَا مُتْرَفِيهَا فَفَسَقُوا فِيهَا فَحَقَّ عَلَيْهَا الْقَوْلُ فَدَمَّرْنَاهَا تَدْمِيرًا
మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు, అక్కడి స్థితిమంతులకు (కొన్ని) ఆజ్ఞలు జారీ చేస్తాము. కాని వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు. ఆ విధంగా వారిపై (శిక్షకు సంబంధించిన) మాట నిరూపితమవుతుంది. ఆపై మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తాము.
17:17  وَكَمْ أَهْلَكْنَا مِنَ الْقُرُونِ مِن بَعْدِ نُوحٍ ۗ وَكَفَىٰ بِرَبِّكَ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا بَصِيرًا
మేము నూహు తరువాత కూడా ఎన్నో జాతులను తుద ముట్టించాము. తన దాసుల పాపాలను తెలుసుకోవటానికి, చూడటానికి నీ ప్రభువు (ఒక్కడే) చాలు.
17:18  مَّن كَانَ يُرِيدُ الْعَاجِلَةَ عَجَّلْنَا لَهُ فِيهَا مَا نَشَاءُ لِمَن نُّرِيدُ ثُمَّ جَعَلْنَا لَهُ جَهَنَّمَ يَصْلَاهَا مَذْمُومًا مَّدْحُورًا
ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటాడో అతనికి మేము ఇహంలో తొందరగానే - మేము తలచిన వానికి తలచినంతగా - ఇస్తాము. ఎట్టకేలకు అతని కోసం మేము నరకాన్ని నియమిస్తాము. అందులోకి వాడు అత్యంత నికృష్ట స్థితిలో, కారుణ్యానికి దూరమైనవాడై ప్రవేశిస్తాడు.
17:19  وَمَنْ أَرَادَ الْآخِرَةَ وَسَعَىٰ لَهَا سَعْيَهَا وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ كَانَ سَعْيُهُم مَّشْكُورًا
మరెవరయితే పరలోకాన్ని కోరుకుని, దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, విశ్వాసి అయి ఉంటాడో అలాంటి వాని కృషి అల్లాహ్‌ వద్ద ఆదరణ పొందుతుంది.
17:20  كُلًّا نُّمِدُّ هَٰؤُلَاءِ وَهَٰؤُلَاءِ مِنْ عَطَاءِ رَبِّكَ ۚ وَمَا كَانَ عَطَاءُ رَبِّكَ مَحْظُورًا
వారికీ, వీరికీ - ప్రతి ఒక్కరికీ - మేము (ప్రపంచంలో) నీ ప్రభువు అనుగ్రహాల నుంచి వొసగుతూపోతున్నాము. నీ ప్రభువు ప్రసాదాలు (ఎవరి విషయంలో కూడా) ఆగిపోలేదు.
17:21  انظُرْ كَيْفَ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۚ وَلَلْآخِرَةُ أَكْبَرُ دَرَجَاتٍ وَأَكْبَرُ تَفْضِيلًا
చూడు! వారిలో ఒకరిపై ఇంకొకరికి మేము ఎలా ఆధిక్యతను ఇచ్చి ఉన్నామో! పరలోకం అంతస్థుల రీత్యా మరింత గొప్పది. శ్రేష్ఠతరీత్యా మరింత ఉన్నతమైనది.
17:22  لَّا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَقْعُدَ مَذْمُومًا مَّخْذُولًا
అల్లాహ్‌తో పాటు వేరొక ఆరాధ్యుణ్ణి నిలబెట్టకు. అలా గనక చేస్తే నువ్వు నిందితుడవై, నిస్సహాయుడవై కూర్చుంటావు.
17:23  وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۚ إِمَّا يَبْلُغَنَّ عِندَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُل لَّهُمَا قَوْلًا كَرِيمًا
నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు (విసుగ్గా) "ఊహ్‌'' అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు.
17:24  وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُل رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا
అణకువ, దయాభావం ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణచిపెట్టు. "ఓ ప్రభూ! బాల్యంలో వీరు నన్ను (ప్రేమానురాగాలతో) పోషించినట్లుగానే నీవు వీరిపై దయజూపు" అని వారి కోసం ప్రార్థిస్తూ ఉండు.
17:25  رَّبُّكُمْ أَعْلَمُ بِمَا فِي نُفُوسِكُمْ ۚ إِن تَكُونُوا صَالِحِينَ فَإِنَّهُ كَانَ لِلْأَوَّابِينَ غَفُورًا
మీ ఆంతర్యాలలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా మసలుకుంటే, అలా (మంచి వైపుకు) మరలివచ్చే వారిని అల్లాహ్‌ క్షమిస్తాడు.
17:26  وَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ وَلَا تُبَذِّرْ تَبْذِيرًا
బంధువుల, నిరుపేదల, ప్రయాణీకుల హక్కును వారికి ఇస్తూ ఉండు. దుబారా ఖర్చు చేయకు.
17:27  إِنَّ الْمُبَذِّرِينَ كَانُوا إِخْوَانَ الشَّيَاطِينِ ۖ وَكَانَ الشَّيْطَانُ لِرَبِّهِ كَفُورًا
దుబారా ఖర్చు చేసేవారు షైతానుల సోదరులు. మరి షైతానేమో తన ప్రభువునకు కృతఘ్నుడు.
17:28  وَإِمَّا تُعْرِضَنَّ عَنْهُمُ ابْتِغَاءَ رَحْمَةٍ مِّن رَّبِّكَ تَرْجُوهَا فَقُل لَّهُمْ قَوْلًا مَّيْسُورًا
ఒకవేళ నువ్వు ఆశించే నీ ప్రభువు కారుణ్యాన్ని నువ్వు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల వారి నుంచి ముఖం తిప్పుకోవలసివస్తే మృదువుగా వారికి నచ్చజెప్పు.
17:29  وَلَا تَجْعَلْ يَدَكَ مَغْلُولَةً إِلَىٰ عُنُقِكَ وَلَا تَبْسُطْهَا كُلَّ الْبَسْطِ فَتَقْعُدَ مَلُومًا مَّحْسُورًا
నీ చేతిని నీ మెడకు కట్టి ఉంచకు. అలాగని దానిని విచ్చల విడిగానూ వదలి పెట్టకు. అలా చేశావంటే నువ్వు నిందల పాలవుతావు, దిక్కుమాలిన స్థితికి లోనై కూర్చుంటావు.
17:30  إِنَّ رَبَّكَ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిన వారి కోసం ఉపాధిని విస్తృతపరుస్తాడు. తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు. నిస్సందేహంగా ఆయన తన దాసుల గురించి అన్నీ తెలిసినవాడు, అంతా చూస్తున్నవాడు.
17:31  وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ ۚ إِنَّ قَتْلَهُمْ كَانَ خِطْئًا كَبِيرًا
దారిద్య్ర భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికీ, మీకూ ఉపాధిని ఇచ్చేది మేమే. ముమ్మాటికీ వారి హత్య మహాపాతకం.
17:32  وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا
వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా! ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట. మహా చెడ్డమార్గం.
17:33  وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۗ وَمَن قُتِلَ مَظْلُومًا فَقَدْ جَعَلْنَا لِوَلِيِّهِ سُلْطَانًا فَلَا يُسْرِف فِّي الْقَتْلِ ۖ إِنَّهُ كَانَ مَنصُورًا
న్యాయసమ్మతంగా తప్ప - అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకూడదు. అన్యాయంగా చంపబడినవాని వారసునికి మేము అధికారం ఇచ్చి ఉన్నాము. అయితే అతను వధించటంలో మితి మీరకూడదు. నిశ్చయంగా అతను సహాయం చేయబడిన వాడు.
17:34  وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۚ وَأَوْفُوا بِالْعَهْدِ ۖ إِنَّ الْعَهْدَ كَانَ مَسْئُولًا
అత్యుత్తమమైన పద్ధతిలో తప్ప అనాధ ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి - అతను యుక్త వయస్సుకు చేరేవరకు. వాగ్దానాన్ని (చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని) నెరవేర్చండి. ఎందుకంటే వాగ్దానం (ఒప్పందం) గురించి ప్రశ్నించబడుతుంది.
17:35  وَأَوْفُوا الْكَيْلَ إِذَا كِلْتُمْ وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا
మీరు కొలచి ఇస్తున్నప్పుడు నిండుగా కొలిచి ఇవ్వండి. సరైన త్రాసుతో తూయండి. ఇదే ఉత్తమమైనది. పర్యవసానం రీత్యా కూడా ఇదే మేలైనది.
17:36  وَلَا تَقْفُ مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ ۚ إِنَّ السَّمْعَ وَالْبَصَرَ وَالْفُؤَادَ كُلُّ أُولَٰئِكَ كَانَ عَنْهُ مَسْئُولًا
నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట పడకు. ఎందుకంటే చెవి, కన్ను, హృదయం - వీటన్నింటి గురించి ప్రశ్నించటం జరుగుతుంది.
17:37  وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّكَ لَن تَخْرِقَ الْأَرْضَ وَلَن تَبْلُغَ الْجِبَالَ طُولًا
నేలపై నిక్కుతూ నడవకు - నువ్వు నేలను చీల్చనూ లేవు. పర్వత శిఖరాలను అందుకునే ఎత్తుకు ఎదగనూ లేవు.
17:38  كُلُّ ذَٰلِكَ كَانَ سَيِّئُهُ عِندَ رَبِّكَ مَكْرُوهًا
వీటన్నింటిలో గల చెడుగు నీ ప్రభువు సన్నిధిలో (అత్యధికంగా) అసహ్యించుకోబడుతుంది.
17:39  ذَٰلِكَ مِمَّا أَوْحَىٰ إِلَيْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ ۗ وَلَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتُلْقَىٰ فِي جَهَنَّمَ مَلُومًا مَّدْحُورًا
ఇవన్నీ కూడా నీ ప్రభువు నీ వద్దకు వహీ ద్వారా పంపిన వివేచనాభరిత విషయాలు. నువ్వు అల్లాహ్‌తోపాటు వేరొకరిని ఆరాధ్యునిగా కల్పించకు. ఒకవేళ అలా చేశావంటే నిందితుడవై, ప్రతి మేలుకు దూరమైనవాడై నరకంలోకి నెట్టివేయబడతావు.
17:40  أَفَأَصْفَاكُمْ رَبُّكُم بِالْبَنِينَ وَاتَّخَذَ مِنَ الْمَلَائِكَةِ إِنَاثًا ۚ إِنَّكُمْ لَتَقُولُونَ قَوْلًا عَظِيمًا
ఏమిటీ, మీ ప్రభువు మీ కోసం కొడుకుల్ని కేటాయించి, తన కోసమేమో దూతలను కూతుళ్ళుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు చాలా పెద్ద (ఘోరమైన) మాట అంటున్నారు.
17:41  وَلَقَدْ صَرَّفْنَا فِي هَٰذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا
ప్రజలు హితవు గ్రహించటానికిగాను మేము ఈ ఖుర్‌ఆన్‌లో (విషయాన్ని) పలు విధాలుగా విడమరిచి చెప్పాము. కాని దాని మూలంగా వారిలో సత్యం పట్ల దూరమే మరింతగా పెరుగుతోంది.
17:42  قُل لَّوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا يَقُولُونَ إِذًا لَّابْتَغَوْا إِلَىٰ ذِي الْعَرْشِ سَبِيلًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: వారు చెబుతున్నట్లుగా అల్లాహ్‌తో పాటు వేరే ఆరాధ్య దైవాలు గనక ఉండి ఉంటే వారు ఇప్పటికే సింహాసనాధీశుని వైపుకు వెళ్ళే మార్గాన్ని అన్వేషించి ఉండేవారే.
17:43  سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَقُولُونَ عُلُوًّا كَبِيرًا
ఆయన పరిశుద్ధుడు. వారు అనే ఈ మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు.
17:44  تُسَبِّحُ لَهُ السَّمَاوَاتُ السَّبْعُ وَالْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ وَإِن مِّن شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَٰكِن لَّا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ ۗ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا
సప్తాకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ ఆయన పవిత్రతనే కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతోపాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమాగుణం కలవాడు.
17:45  وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَّسْتُورًا
(ఓ ప్రవక్తా!) నువ్వు ఖుర్‌ఆను పఠిస్తున్నప్పుడు, మేము నీకూ - పరలోకాన్ని నమ్మనివారికీ మధ్య కనిపించని ఒక తెరను వేసేస్తాము.
17:46  وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَىٰ أَدْبَارِهِمْ نُفُورًا
అంటే, వారు దానిని అర్థం చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేసేస్తాము. వారి చెవులను మొద్దుబారజేస్తాము. నువ్వు ఈ ఖుర్‌ఆన్‌లో ఒక్కడైన అల్లాహ్‌ యొక్క ఏకత్వాన్ని (తౌహీద్‌ను) ప్రస్తావించినప్పుడల్లా వారు తీవ్ర అయిష్టతను వ్యక్తం చేస్తూ వెనుతిరిగి వెళ్ళిపోతారు.
17:47  نَّحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَىٰ إِذْ يَقُولُ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَّسْحُورًا
వారు నీ వైపుకు చెవియొగ్గి వింటున్నప్పుడు ఏ ఉద్దేశ్యంతో వింటున్నారో మాకు బాగా తెలుసు. పరస్పరం చెవులు కొరుక్కుంటూ "చేతబడి ప్రభావానికి లోనైన వ్యక్తిని మీరు అనుసరిస్తున్నారు" అని ఆ దుర్మార్గులు పలికేది కూడా (మాకు తెలుసు).
17:48  انظُرْ كَيْفَ ضَرَبُوا لَكَ الْأَمْثَالَ فَضَلُّوا فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا
చూడు, వారు నీ గురించి ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నారో! వారు దారి తప్పుతున్నారు. ఇక వారు దారికి రావట మనేది వారి వల్ల కాని పని.
17:49  وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
"మేము (చచ్చి) ఎముకలై, తుత్తునియలైపోయిన తరువాత, మళ్లీ సరికొత్తగా సృష్టించబడి లేపబడతామా?" అని వారు అంటున్నారు (కదూ!)
17:50  قُلْ كُونُوا حِجَارَةً أَوْ حَدِيدًا
వారికి చెప్పు: "మీరు రాళ్లయిపోయినా, ఇనుమైపోయినా"
17:51  أَوْ خَلْقًا مِّمَّا يَكْبُرُ فِي صُدُورِكُمْ ۚ فَسَيَقُولُونَ مَن يُعِيدُنَا ۖ قُلِ الَّذِي فَطَرَكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ فَسَيُنْغِضُونَ إِلَيْكَ رُءُوسَهُمْ وَيَقُولُونَ مَتَىٰ هُوَ ۖ قُلْ عَسَىٰ أَن يَكُونَ قَرِيبًا
"...లేక మీ మనసులకు ఎంతో కఠినమైనదిగా తోచే మరేదైనా సృష్టిగా మారినా సరే(మీ పునరుత్థానం తథ్యం)." "మమ్మల్ని తిరిగి లేపేవాడెవడు?" అని వారు మళ్లీ అడుగుతారు. "తొలిసారి మిమ్మల్ని సృష్టించినవాడే (మలిసారి కూడా సృష్టిస్తాడు)" అని ఓ ప్రవక్తా! వారికి చెప్పు. దానిపై వారు తమ తలలను ఆడిస్తూ "ఇంతకీ అది ఎప్పుడు సంభవిస్తుందీ?" అని అడుగుతారు. వారికి సమాధానమివ్వు - "అది త్వరలోనే సంభవించవచ్చు".
17:52  يَوْمَ يَدْعُوكُمْ فَتَسْتَجِيبُونَ بِحَمْدِهِ وَتَظُنُّونَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا
ఆ రోజు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. అప్పుడు మీరు ఆయన్ని స్తుతిస్తూ (ఆయన పిలుపుకు) హాజరు పలుకుతారు. అప్పుడు మీరు 'మేము కొద్ది సమయం మాత్రమే (ప్రపంచంలో) ఉన్నామ'ని అనుకుంటారు."
17:53  وَقُل لِّعِبَادِي يَقُولُوا الَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ الشَّيْطَانَ يَنزَغُ بَيْنَهُمْ ۚ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلْإِنسَانِ عَدُوًّا مُّبِينًا
(ఓ ప్రవక్తా!) నా దాసులతో, వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. ఎందుకంటే షైతాన్‌ వారి మధ్య కలతలు రేపుతాడు. నిశ్చయంగా షైతాన్‌ మానవుని పాలిట బహిరంగ శత్రువు.
17:54  رَّبُّكُمْ أَعْلَمُ بِكُمْ ۖ إِن يَشَأْ يَرْحَمْكُمْ أَوْ إِن يَشَأْ يُعَذِّبْكُمْ ۚ وَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ وَكِيلًا
మీ ప్రభువుకు మీ గురించి బాగా తెలుసు. ఆయన తలచుకుంటే మిమ్మల్ని కరుణిస్తాడు లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షిస్తాడు. మేము నిన్ను వారిపై సంరక్షకునిగా చేసి పంపలేదు.
17:55  وَرَبُّكَ أَعْلَمُ بِمَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَىٰ بَعْضٍ ۖ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న వాటన్నింటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి మరి కొందరిపై శ్రేష్ఠతను ప్రసాదించాము. ఇంకా, మేము దావూదుకు జబూరు (గ్రంథం) వొసగాము.
17:56  قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِهِ فَلَا يَمْلِكُونَ كَشْفَ الضُّرِّ عَنكُمْ وَلَا تَحْوِيلًا
వారికి చెప్పు: "మీరు అల్లాహ్‌ను వదలి ఆరాధ్య దైవాలుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి, వారు మీ నుండి ఏ కష్టాన్నీ దూరం చేయటంగానీ, మార్చటంగానీ చేయలేరు."
17:57  أُولَٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا
వీళ్లు ఎవరిని పిలుస్తున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సామీప్యం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారు. తమలో ఎవరు ఎక్కువ సామీప్యం పొందుతారోనని (పోటీపడుతున్నారు). వారు ఖుద్దుగా ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్ష పట్ల భీతిల్లుతున్నారు. (అవును మరి) నీ ప్రభువు శిక్ష భయపడ దగినదే.
17:58  وَإِن مِّن قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا ۚ كَانَ ذَٰلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا
ప్రళయదినానికి ముందే మేము ప్రతి పట్టణాన్ని నాశనం చేయటమో, లేదా దానిని ఘోరమైన విపత్తుకు గురి చేయటమో చేస్తాము. ఈ విషయం గ్రంథంలో లిఖితమై ఉంది.
17:59  وَمَا مَنَعَنَا أَن نُّرْسِلَ بِالْآيَاتِ إِلَّا أَن كَذَّبَ بِهَا الْأَوَّلُونَ ۚ وَآتَيْنَا ثَمُودَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوا بِهَا ۚ وَمَا نُرْسِلُ بِالْآيَاتِ إِلَّا تَخْوِيفًا
పూర్వీకులు సూచనలను (మహిమలను) తిరస్కరించినందు వల్లనే మేము సూచనలను పంపటం ఆపేశాము. మేము సమూదు వారికి స్పష్టమైన సూచనగా ఆడ ఒంటెను ఇచ్చాము. కాని వారు దానిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. మేము (యదార్థానికి) ప్రజలను భయపెట్టడానికి మాత్రమే సూచనలను పంపిస్తాము.
17:60  وَإِذْ قُلْنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِالنَّاسِ ۚ وَمَا جَعَلْنَا الرُّؤْيَا الَّتِي أَرَيْنَاكَ إِلَّا فِتْنَةً لِّلنَّاسِ وَالشَّجَرَةَ الْمَلْعُونَةَ فِي الْقُرْآنِ ۚ وَنُخَوِّفُهُمْ فَمَا يَزِيدُهُمْ إِلَّا طُغْيَانًا كَبِيرًا
నీ ప్రభువు ఈ జనులను చుట్టుముట్టి ఉన్నాడని మేము నీకు చెప్పిన సంగతిని (ఓ ప్రవక్తా!) జ్ఞాపకం చేసుకో. మేము నీకు చూపిన దృశ్యం ప్రజల పాలిట ఓ పరీక్ష. అదేవిధంగా ఖుర్‌ఆనులో శపించబడిన వృక్షం కూడా (ఓ పరీక్షే). మేము వారిని భయ పెడుతూనే ఉన్నాము. కాని మా భయబోధ వారిలోని పెద్ద తలబిరుసుతనాన్ని మరింతగా పెంచుతూ పోతుంది.
17:61  وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قَالَ أَأَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِينًا
"ఆదమ్‌కు సాష్టాంగపడండి" అని మేము దూతలకు ఆజ్ఞాపించినపుడు, ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. (పైగా) వాడు, "ఏమిటీ, నీవు మట్టితో పుట్టించినవానికి నేను సాష్టాంగపడాలా?" అన్నాడు.
17:62  قَالَ أَرَأَيْتَكَ هَٰذَا الَّذِي كَرَّمْتَ عَلَيَّ لَئِنْ أَخَّرْتَنِ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَأَحْتَنِكَنَّ ذُرِّيَّتَهُ إِلَّا قَلِيلًا
ఇంకా ఇలా అన్నాడు: "సరే! చూసుకో, నువ్వు ఇతనికి నాపై శ్రేష్ఠతనైతే వొసగావు. కాని నాకు కూడా ప్రళయదినం వరకూ విడుపు ఇస్తే నేను ఇతని సంతతిలో - కొద్ది మందిని తప్ప - అందరినీ లొంగదీసుకుంటాను."
17:63  قَالَ اذْهَبْ فَمَن تَبِعَكَ مِنْهُمْ فَإِنَّ جَهَنَّمَ جَزَاؤُكُمْ جَزَاءً مَّوْفُورًا
(అల్లాహ్‌) అన్నాడు : "వెళ్లు. వారిలో ఎవరెవరు నిన్ను అనుసరిస్తారో వారికీ, నీకూ - అందరికీ నరకం సంపూర్ణ శిక్షగా ఉండనే ఉంది."
17:64  وَاسْتَفْزِزْ مَنِ اسْتَطَعْتَ مِنْهُم بِصَوْتِكَ وَأَجْلِبْ عَلَيْهِم بِخَيْلِكَ وَرَجِلِكَ وَشَارِكْهُمْ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ وَعِدْهُمْ ۚ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا
"వారిలో ఎవరెవరిని నువ్వు నీ స్వరంతో భ్రష్టులుగా చెయ్యగలవో చేసుకో. (వీలైతే) వారిపై నీ అశ్వబలాన్నీ, పదాతి దళాన్ని తీసుకురా. సిరిసంపదలలోనూ, సంతానంలోనూ వారికి భాగస్వామిగా ఉండు. వారికి (బూటకపు) వాగ్దానాలు చెయ్యి. షైతాను వారికి చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే.
17:65  إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ ۚ وَكَفَىٰ بِرَبِّكَ وَكِيلًا
"(నువ్వు ఎంత చేసినా) నికార్సయిన నా దాసులపై నీకు ఏ అధికారమూ ఉండదు. రక్షకుడుగా నీ ప్రభువు (ఒక్కడే) చాలు."
17:66  رَّبُّكُمُ الَّذِي يُزْجِي لَكُمُ الْفُلْكَ فِي الْبَحْرِ لِتَبْتَغُوا مِن فَضْلِهِ ۚ إِنَّهُ كَانَ بِكُمْ رَحِيمًا
మీ కోసం సముద్రంలో ఓడలను నడిపేవాడే మీ ప్రభువు. తద్వారా మీరు ఆయన ఉపాధిని అన్వేషించాలని. నిశ్చయంగా ఆయన మీ పట్ల ఎంతో దయగలవాడు.
17:67  وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَن تَدْعُونَ إِلَّا إِيَّاهُ ۖ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ ۚ وَكَانَ الْإِنسَانُ كَفُورًا
సముద్రాలలో మీకు ఆపద ఎదురైనప్పుడు - మీరు మొరపెట్టుకునే వారంతా మటుమాయమైపోతారు - ఒక్క అల్లాహ్‌ మాత్రమే మిగిలి ఉంటాడు. మరి ఆయన మిమ్మల్ని కాపాడి ఒడ్డుకు చేర్చగానే మీరు ఆయన నుండి ముఖం త్రిప్పేసుకుంటారు. మానవుడు నిజంగానే చేసిన మేలును మరిచేవాడు.
17:68  أَفَأَمِنتُمْ أَن يَخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوا لَكُمْ وَكِيلًا
ఏమిటీ, (నేల మీదికి చేర్చిన తరువాత) అల్లాహ్‌ మిమ్మల్ని నేలలో కూర్చివేయడనీ, మీపై రాళ్లను కురిపించే తుఫానును పంపించడని మీరు నిర్భయంగా ఉన్నారా? (ఒకవేళ అదే గనక జరిగితే) మీరు మీ కోసం ఏ రక్షకుడినీ పొందజాలరు.
17:69  أَمْ أَمِنتُمْ أَن يُعِيدَكُمْ فِيهِ تَارَةً أُخْرَىٰ فَيُرْسِلَ عَلَيْكُمْ قَاصِفًا مِّنَ الرِّيحِ فَيُغْرِقَكُم بِمَا كَفَرْتُمْ ۙ ثُمَّ لَا تَجِدُوا لَكُمْ عَلَيْنَا بِهِ تَبِيعًا
లేక అల్లాహ్‌ మిమ్మల్ని మరోసారి సముద్రయానానికి తీసుకుపోయి, మీ కృతఘ్నతా వైఖరికి శాస్తిగా మీపై ప్రచండమైన పెనుగాలులను పంపి మిమ్మల్ని ముంచివేయడని మీరు నిశ్చింతగా ఉన్నారా? ఒకవేళ అదేగనక జరిగితే మీ తరఫున దీని గురించి మమ్మల్ని అడిగే వాడెవడూ మీకు దొరకడు.
17:70  وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَىٰ كَثِيرٍ مِّمَّنْ خَلَقْنَا تَفْضِيلًا
మేము ఆదం సంతతికి గౌరవం వొసగాము. వారికి నేలపైనా, నీటిలోనూ నడిచే వాహనాలను ఇచ్చాము. ఇంకా పరిశుద్ధమైన వస్తువులను వారికి ఆహారంగా ప్రసాదించాము. మేము సృష్టించిన ఎన్నో సృష్టితాలపై వారికి ఆధిక్యతను ఇచ్చాము.
17:71  يَوْمَ نَدْعُو كُلَّ أُنَاسٍ بِإِمَامِهِمْ ۖ فَمَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَأُولَٰئِكَ يَقْرَءُونَ كِتَابَهُمْ وَلَا يُظْلَمُونَ فَتِيلًا
ఆ రోజు (తీర్పు దినాన) మేము ప్రతి మానవ సముదాయాన్నీ దాని నాయకుని సమేతంగా పిలుస్తాము. అప్పుడు తమ కర్మల పత్రం కుడి చేతికివ్వబడివారు (ఉత్సాహంగా) తమ కర్మల పత్రాన్ని చదువుకుంటారు. వారికి పీచంత అన్యాయం కూడా జరగదు.
17:72  وَمَن كَانَ فِي هَٰذِهِ أَعْمَىٰ فَهُوَ فِي الْآخِرَةِ أَعْمَىٰ وَأَضَلُّ سَبِيلًا
ఇక ఈ ప్రపంచంలో గుడ్డిగా మెలగినవాడు, పరలోకంలో కూడా గుడ్డివాడుగానే ఉంటాడు. మార్గానికి బహుదూరాన తచ్చాడుతూ ఉంటాడు.
17:73  وَإِن كَادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنَا غَيْرَهُ ۖ وَإِذًا لَّاتَّخَذُوكَ خَلِيلًا
(ఓ ప్రవక్తా!) వాళ్లు, మేము నీ వద్దకు పంపిన వహీ గురించి నిన్ను తడబాటుకు లోనుచేసే ఉద్దేశంతో, దీనికి బదులు మరి దేన్నయినా మా పేరున కల్పించి తీసుకురావాలని కోరుతున్నారు. నువ్వే గనక వారి కోరికను మన్నించి ఉంటే వాళ్లు నిన్ను స్నేహితునిగా చేసుకుని ఉండేవారు.
17:74  وَلَوْلَا أَن ثَبَّتْنَاكَ لَقَدْ كِدتَّ تَرْكَنُ إِلَيْهِمْ شَيْئًا قَلِيلًا
మేమే గనక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే, నువ్వు కొంతైనా వారివైపుకు మొగ్గేవాడివి.
17:75  إِذًا لَّأَذَقْنَاكَ ضِعْفَ الْحَيَاةِ وَضِعْفَ الْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيْنَا نَصِيرًا
ఒకవేళ (నీ తరఫున) అదే గనక జరిగి ఉంటే మేము ఈ జీవితంలోనూ నీకు రెట్టింపు శిక్షను విధించేవాళ్లం. మరణం తర్వాత కూడా రెండింతల శిక్షను విధించి ఉండేవాళ్ళం. మరి మాకు వ్యతిరేకంగా, నువ్వు ఏ సహాయకుడినీ పొందలేక పోయేవాడివి.
17:76  وَإِن كَادُوا لَيَسْتَفِزُّونَكَ مِنَ الْأَرْضِ لِيُخْرِجُوكَ مِنْهَا ۖ وَإِذًا لَّا يَلْبَثُونَ خِلَافَكَ إِلَّا قَلِيلًا
వాళ్లు నిన్ను ఈ భూభాగం నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశంతో నిన్ను నిలదొక్కుకోకుండా చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ అదే జరిగితే నీ తరువాత వాళ్లు కూడా అక్కడ ఎంతో కాలం నిలువ లేరు.
17:77  سُنَّةَ مَن قَدْ أَرْسَلْنَا قَبْلَكَ مِن رُّسُلِنَا ۖ وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِيلًا
నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలకు కూడా ఈ విధానమే వర్తించింది. మా విధానంలో నువ్వు ఎలాంటి మార్పునూ కనుగొనలేవు.
17:78  أَقِمِ الصَّلَاةَ لِدُلُوكِ الشَّمْسِ إِلَىٰ غَسَقِ اللَّيْلِ وَقُرْآنَ الْفَجْرِ ۖ إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا
నమాజును నెలకొల్పు - సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారు జామున ఖుర్‌ఆను పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్‌ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది.
17:79  وَمِنَ اللَّيْلِ فَتَهَجَّدْ بِهِ نَافِلَةً لَّكَ عَسَىٰ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُودًا
రాత్రిపూట కొంతభాగం తహజ్జుద్‌ (నమాజు)లో ఖుర్‌ఆన్‌ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను ''మఖామె మహ్‌మూద్‌''కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు.
17:80  وَقُل رَّبِّ أَدْخِلْنِي مُدْخَلَ صِدْقٍ وَأَخْرِجْنِي مُخْرَجَ صِدْقٍ وَاجْعَل لِّي مِن لَّدُنكَ سُلْطَانًا نَّصِيرًا
ఈ విధంగా పలుకు: "నా ప్రభూ! నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మంచిస్థితిలో తీసుకుని వెళ్ళు. ఎక్కడి నుంచి తీసినా మంచిస్థితిలోనే తియ్యి. నా కోసం నీ వద్ద నుండి అధికారాన్ని, తోడ్పాటును ప్రసాదించు."
17:81  وَقُلْ جَاءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ ۚ إِنَّ الْبَاطِلَ كَانَ زَهُوقًا
ఇంకా ఈ విధంగా ప్రకటించు: "సత్యం వచ్చేసింది. అసత్యం సమసిపోయింది. నిశ్చయంగా, అసత్యం సమసి పోవలసినదే."
17:82  وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ ۙ وَلَا يَزِيدُ الظَّالِمِينَ إِلَّا خَسَارًا
మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని. అయితే దుర్మార్గులకు (దీని వల్ల) నష్టం కలగటం తప్ప మరే వృద్ధీ జరగదు.
17:83  وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ ۖ وَإِذَا مَسَّهُ الشَّرُّ كَانَ يَئُوسًا
మేము మానవుణ్ణి అనుగ్రహించినప్పుడు అతడు వైముఖ్య ధోరణిని ప్రదర్శిస్తూ, ఓప్రక్కకు తిరిగిపోతాడు. బాధ కలిగినప్పుడు మాత్రం నిరాశకు గురవుతాడు.
17:84  قُلْ كُلٌّ يَعْمَلُ عَلَىٰ شَاكِلَتِهِ فَرَبُّكُمْ أَعْلَمُ بِمَنْ هُوَ أَهْدَىٰ سَبِيلًا
వారికి చెప్పు : "ప్రతి ఒక్కడూ తన విధానం ప్రకారం ఆచరిస్తున్నాడు. పూర్తిగా సన్మార్గంపై ఉన్నదెవరో నీ ప్రభువుకే బాగా తెలుసు."
17:85  وَيَسْأَلُونَكَ عَنِ الرُّوحِ ۖ قُلِ الرُّوحُ مِنْ أَمْرِ رَبِّي وَمَا أُوتِيتُم مِّنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا
వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. "ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో (ముడిపడి) ఉంది. మీకు ఒసగబడిన జ్ఞానం బహుస్వల్పం" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
17:86  وَلَئِن شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِ عَلَيْنَا وَكِيلًا
మేము గనక తలచుకుంటే, నీ వద్దకు పంపిన వహీ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలము. ఆ తరువాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే ఏ సహాయకుణ్ణీ నీవు పొందలేవు.
17:87  إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّ فَضْلَهُ كَانَ عَلَيْكَ كَبِيرًا
నీ ప్రభువు అనుగ్రహంతో తప్ప! నిస్సందేహంగా నీపై ఉన్న ఆయన అనుగ్రహం చాలా గొప్పది.
17:88  قُل لَّئِنِ اجْتَمَعَتِ الْإِنسُ وَالْجِنُّ عَلَىٰ أَن يَأْتُوا بِمِثْلِ هَٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا
వారికి చెప్పు: "ఒకవేళ సమస్త మానవులు, యావత్తు జిన్నులు కలిసి ఈ ఖుర్‌ఆను లాంటి గ్రంథాన్ని తేదలచినా - వారు ఒండొకరికి తోడ్పాటును అందజేసుకున్నా ఇటువంటి దానిని తీసుకురావటం వారివల్ల కాని పని.
17:89  وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا
మేము ప్రజల బోధనార్థం ఈ ఖుర్‌ఆనులో అన్ని (విధాలు గాను) ఉపమానాలను ఇచ్చాము. కాని చాలా మంది తమ తిరస్కార వైఖరిని మానుకోలేదు.
17:90  وَقَالُوا لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ تَفْجُرَ لَنَا مِنَ الْأَرْضِ يَنبُوعًا
వారిలా అన్నారు: "నువ్వు మా కోసం భూమి నుంచి నీటి ఊటను ప్రవహింపజేయనంతవరకూ మేము నిన్ను నమ్మేది లేదు.
17:91  أَوْ تَكُونَ لَكَ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَعِنَبٍ فَتُفَجِّرَ الْأَنْهَارَ خِلَالَهَا تَفْجِيرًا
"లేదా నీ కోసమైనా ఖర్జూరాలు, ద్రాక్ష పండ్లు గల తోట ఒకటి ఉండాలి. దాని మధ్యన నువ్వు అనేక కాలువలను ప్రవహింప జేయాలి.
17:92  أَوْ تُسْقِطَ السَّمَاءَ كَمَا زَعَمْتَ عَلَيْنَا كِسَفًا أَوْ تَأْتِيَ بِاللَّهِ وَالْمَلَائِكَةِ قَبِيلًا
"లేదా నువ్వు చెబుతున్నట్లుగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవెయ్యి లేదా నువ్వు ఖుద్దుగా అల్లాహ్‌ను, దూతలను తెచ్చి మా ఎదుట నిలబెట్టు.
17:93  أَوْ يَكُونَ لَكَ بَيْتٌ مِّن زُخْرُفٍ أَوْ تَرْقَىٰ فِي السَّمَاءِ وَلَن نُّؤْمِنَ لِرُقِيِّكَ حَتَّىٰ تُنَزِّلَ عَلَيْنَا كِتَابًا نَّقْرَؤُهُ ۗ قُلْ سُبْحَانَ رَبِّي هَلْ كُنتُ إِلَّا بَشَرًا رَّسُولًا
"లేదా నీ కోసం స్వర్ణ గృహం ఏదన్నా సిద్ధం కావాలి లేదా నువ్వు ఆకాశానికి ఎక్కిపోవాలి. (ఒకవేళ నువ్వు అలా ఎక్కి పోయినా) మేము స్వయంగా చదవగలిగే గ్రంథమేదైనా మాపై అవతరింపజేయనంతవరకూ నీ అధిరోహణను కూడా మేము నమ్మేది లేదు. "(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "నా ప్రభువు పరమ పవిత్రుడు. నేను ప్రవక్తగా పంపబడిన ఒక మానవ మాత్రుణ్ణి మాత్రమే.''
17:94  وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ إِلَّا أَن قَالُوا أَبَعَثَ اللَّهُ بَشَرًا رَّسُولًا
ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన మీదట, విశ్వసించ నీయకుండా వారిని ఆపిన విషయమల్లా ఒక్కటే - "అల్లాహ్‌ ఒక మానవమాత్రుణ్ణి ప్రవక్తగా పంపాడా?!" అని వారన్నారు.
17:95  قُل لَّوْ كَانَ فِي الْأَرْضِ مَلَائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِم مِّنَ السَّمَاءِ مَلَكًا رَّسُولًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "ఒకవేళ దైవదూతలు భూమండలం మీద తిరుగుతూ, నివాసమేర్పరచుకుంటూ ఉన్నట్లయితే, మేము వారి వద్దకు కూడా ఆకాశం నుంచి దైవదూతనే ప్రవక్తగా పంపి ఉండేవారం."
17:96  قُلْ كَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۚ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا
వారితో అను: ''నాకూ - మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ చాలు. తన దాసుల గురించి ఆయనకు అంతా తెలుసు. ఆయన వారిని చూస్తూనే ఉన్నాడు.''
17:97  وَمَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُمْ أَوْلِيَاءَ مِن دُونِهِ ۖ وَنَحْشُرُهُمْ يَوْمَ الْقِيَامَةِ عَلَىٰ وُجُوهِهِمْ عُمْيًا وَبُكْمًا وَصُمًّا ۖ مَّأْوَاهُمْ جَهَنَّمُ ۖ كُلَّمَا خَبَتْ زِدْنَاهُمْ سَعِيرًا
అల్లాహ్‌ ఎవరికి సన్మార్గం చూపుతాడో అతనే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గవిహీనతకు లోనుచేసిన వారికి, ఆయన (శిక్ష)కు విరుద్ధంగా ఇతరులెవరినీ నువ్వు సహాయ కులుగా పొందజాలవు. అలాంటి వారిని మేము ప్రళయ దినాన ముఖాల ఆధారంగా సమీకరిస్తాము. మరి చూడబోతే వారు గుడ్డివారు, మూగవారు, చెవిటివారై ఉంటారు. నరకం వారి నివాసమవుతుంది. అది మందగించినప్పుడల్లా వారి కోసం దాన్ని రాజేస్తూ ఉంటాం.
17:98  ذَٰلِكَ جَزَاؤُهُم بِأَنَّهُمْ كَفَرُوا بِآيَاتِنَا وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا
వారు మా ఆయతులను తిరస్కరించి, "మేము ఎముకలై, తుత్తునియలు అయిపోయిన తరువాత కూడా మళ్లీ సరికొత్తగా పుట్టించబడతామా?!" అని చెప్పినందుకుగాను వారికి (లభించే) ప్రతిఫలం ఇది.
17:99  أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ قَادِرٌ عَلَىٰ أَن يَخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ أَجَلًا لَّا رَيْبَ فِيهِ فَأَبَى الظَّالِمُونَ إِلَّا كُفُورًا
ఏమిటీ,ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్‌ తమ లాంటి వారిని సృష్టించే శక్తి కలిగి ఉన్నాడన్న విషయంపై వారు దృష్టిని సారించలేదా? ఏమాత్రం సంకోచానికి తావులేని ఒక సమయాన్ని ఆయన వారి కోసం నియమించి ఉన్నాడు. కాని దుర్మార్గులు (ఎంత చెప్పినా) తిరస్కరించకుండా ఉండరు.
17:100  قُل لَّوْ أَنتُمْ تَمْلِكُونَ خَزَائِنَ رَحْمَةِ رَبِّي إِذًا لَّأَمْسَكْتُمْ خَشْيَةَ الْإِنفَاقِ ۚ وَكَانَ الْإِنسَانُ قَتُورًا
వారికి చెప్పు: "ఒకవేళ నా ప్రభువు కారుణ్య నిధులే గనక మీ అధీనంలోకి వస్తే, అప్పుడు మీరు అవి ఖర్చయిపోతాయే మోనన్న భయంతో వాటిని ఆపి ఉంచేవారు. (అసలు విషయం ఏమిటంటే) మానవుడు సంకుచిత మనస్కుడు."
17:101  وَلَقَدْ آتَيْنَا مُوسَىٰ تِسْعَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ فَاسْأَلْ بَنِي إِسْرَائِيلَ إِذْ جَاءَهُمْ فَقَالَ لَهُ فِرْعَوْنُ إِنِّي لَأَظُنُّكَ يَا مُوسَىٰ مَسْحُورًا
మేము మూసాకు స్పష్టమైన తొమ్మిది మహిమలను ఇచ్చాము. (కావాలంటే) నువ్వు స్వయంగా ఇస్రాయీల్‌ వంశీయులను అడుగు. అతను వారి వద్దకు వచ్చినప్పుడు, "మూసా! నువ్వు చేతబడి చేయబడ్డావేమోనని నా అనుమానం" అన్నాడు ఫిరౌను.
17:102  قَالَ لَقَدْ عَلِمْتَ مَا أَنزَلَ هَٰؤُلَاءِ إِلَّا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ بَصَائِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَا فِرْعَوْنُ مَثْبُورًا
మూసా ఇలా సమాధానమిచ్చాడు: "గుణపాఠంతో కూడుకున్న ఈ సూచనలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరొకరెవరూ అవతరింపజేయలేదన్న విషయం నీకూ తెలుసు. ఓ ఫిరౌన్‌! నిశ్చయంగా నువ్వు వినాశానికి గురయ్యావని నేను భావిస్తున్నాను."
17:103  فَأَرَادَ أَن يَسْتَفِزَّهُم مِّنَ الْأَرْضِ فَأَغْرَقْنَاهُ وَمَن مَّعَهُ جَمِيعًا
ఆ తరువాత ఫిరౌను, వారిని భూభాగం (రాజ్యం) నుంచే పెకలించి వేయాలని గట్టిగా నిశ్చయించుకున్నప్పుడు మేము వాణ్ణీ, వాడి వెంటవున్న వారినే ముంచివేశాము.
17:104  وَقُلْنَا مِن بَعْدِهِ لِبَنِي إِسْرَائِيلَ اسْكُنُوا الْأَرْضَ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ جِئْنَا بِكُمْ لَفِيفًا
ఆ తరువాత మేము ఇస్రాయీలు సంతతితో, "ఈ భూభాగంపై మీరు ఉండండి. అయితే పరలోక వాగ్దాన తరుణం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి (ఒకే చోటికి) తీసుకువస్తాము" అని చెప్పాము.
17:105  وَبِالْحَقِّ أَنزَلْنَاهُ وَبِالْحَقِّ نَزَلَ ۗ وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا
మేము దీనిని (ఖుర్‌ఆన్‌ను) సత్యసమేతంగా అవతరింపజేశాము. ఇది కూడా సత్యంతోనే అవతరించింది. మేము నిన్ను శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా మాత్రమే పంపాము.
17:106  وَقُرْآنًا فَرَقْنَاهُ لِتَقْرَأَهُ عَلَى النَّاسِ عَلَىٰ مُكْثٍ وَنَزَّلْنَاهُ تَنزِيلًا
నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించటానికి వీలుగా మేము ఖుర్‌ఆను గ్రంథాన్ని కొద్ది కొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని అంచెలవారీగా అవతరింపజేశాము.
17:107  قُلْ آمِنُوا بِهِ أَوْ لَا تُؤْمِنُوا ۚ إِنَّ الَّذِينَ أُوتُوا الْعِلْمَ مِن قَبْلِهِ إِذَا يُتْلَىٰ عَلَيْهِمْ يَخِرُّونَ لِلْأَذْقَانِ سُجَّدًا
వారికి చెప్పు : "మీరు దీనిని నమ్మినా నమ్మకపోయినా, దీనికి పూర్వం జ్ఞానం వొసగబడిన వారి ఎదుట ఇది పఠించబడినప్పుడల్లా వారు ముఖాల ఆధారంగా సాష్టాంగపడి పోతారు."
17:108  وَيَقُولُونَ سُبْحَانَ رَبِّنَا إِن كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولًا
"మా ప్రభువు పరమపవిత్రుడు. మా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం" అని అంటారు.
17:109  وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا ۩
వారు విలపిస్తూ, ముఖాల ఆధారంగా (సాష్టాంగ) పడిపోతారు. ఈ ఖుర్‌ఆన్‌ వారి అణకువను (వినమ్రతను) మరింత పెంచుతుంది.
17:110  قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَّا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَابْتَغِ بَيْنَ ذَٰلِكَ سَبِيلًا
వారికి చెప్పు : "అల్లాహ్‌ను అల్లాహ్‌ అని పిలిచినా, రహ్మాన్‌ అని పిలిచినా - ఏ పేరుతో పిలిచినా - మంచి పేర్లన్నీ ఆయనవే." నువ్వు నీ నమాజును మరీ బిగ్గరగానూ, మరీ మెల్లగానూ పఠించకు. వీటికి నడుమ మధ్యేమార్గాన్ని అవలంబించు.
17:111  وَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي لَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُن لَّهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَلَمْ يَكُن لَّهُ وَلِيٌّ مِّنَ الذُّلِّ ۖ وَكَبِّرْهُ تَكْبِيرًا
ఇంకా ఇలా చెప్పు: "ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములెవరూలేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏ మాత్రం బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు."


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.