aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

16. సూరా అన్ నహ్ల్

16:1  أَتَىٰ أَمْرُ اللَّهِ فَلَا تَسْتَعْجِلُوهُ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
అల్లాహ్‌ ఆజ్ఞ వచ్చేసింది. కనుక దాని కోసం తొందర పెట్టకండి. ఆయన పరమ పవిత్రుడు. వీరు కల్పించే భాగస్వామ్యాల నుండి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు.
16:2  يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنذِرُوا أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاتَّقُونِ
"నేను తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. కనుక మీరు నాకు భయపడండి" అని ప్రజలను హెచ్చరించటానికి, ఆయనే దూతలకు తన 'వహీ'ని ఇచ్చి, తన ఆదేశానుసారం దాన్ని తన దాసులలో తాను కోరిన వారిపై అవతరింపజేస్తాడు-
16:3  خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ تَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు (షిర్కుకు) ఆయన అతీతుడు, ఉన్నతుడు.
16:4  خَلَقَ الْإِنسَانَ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ
ఆయన మనిషిని వీర్యపు బొట్టుతో సృష్టించాడు. కాని వాడు పచ్చి తగవులమారిగా తయారయ్యాడు.
16:5  وَالْأَنْعَامَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ وَمِنْهَا تَأْكُلُونَ
ఆయనే పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరికొన్ని (పశువులు) మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి.
16:6  وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ
మీరు వాటిని మేపుకుని రావటంలోనూ, మేపటానికి తోలుకు పోవటంలోనూ అందం (కళ) ఉట్టిపడుతూ ఉంటుంది.
16:7  وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَّمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ
మీరెంతో ప్రయాసపడితేగాని చేరుకోలేని ప్రదేశాలకు అవి మీ బరువులను మోసుకునిపోతాయి. నిశ్చయంగా మీ ప్రభువు వాత్సల్యం కలవాడు, దయామయుడు.
16:8  وَالْخَيْلَ وَالْبِغَالَ وَالْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ
మీరు స్వారీ చేయటానికీ, మీకు శోభాయమానంగా ఉండటానికి ఆయన గుర్రాలనూ, కంచర గాడిదలనూ, గాడిదలనూ సృష్టించాడు. మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు.
16:9  وَعَلَى اللَّهِ قَصْدُ السَّبِيلِ وَمِنْهَا جَائِرٌ ۚ وَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ
సన్మార్గం చూపే బాధ్యత అల్లాహ్‌పై ఉంది. కొన్ని వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గాన నడిపించేవాడే.
16:10  هُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً ۖ لَّكُم مِّنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ
ఆయనే మీ కోసం ఆకాశం నుంచి నీళ్ళను కురిపిస్తున్నాడు. దాన్ని మీరూ త్రాగుతారు. దానివల్ల మొలకెత్తిన పచ్చికను (వృక్షాలను) మీ పశువులకు కూడా మేపుతారు.
16:11  يُنبِتُ لَكُم بِهِ الزَّرْعَ وَالزَّيْتُونَ وَالنَّخِيلَ وَالْأَعْنَابَ وَمِن كُلِّ الثَّمَرَاتِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
దాంతోనే (ఆ నీటితోనే) ఆయన మీ కోసం పొలాలను పండిస్తాడు. జైతూను (ఆలివ్‌), ఖర్జూరం, ద్రాక్ష మరియు అన్ని రకాల పండ్లను పండిస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది.
16:12  وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ۖ وَالنُّجُومُ مُسَخَّرَاتٌ بِأَمْرِهِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
ఆయనే మీ కోసం రేయింబవళ్ళనూ, సూర్యచంద్రులను నియంత్రణలో పెట్టాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనాలున్నాయి.
16:13  وَمَا ذَرَأَ لَكُمْ فِي الْأَرْضِ مُخْتَلِفًا أَلْوَانُهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَذَّكَّرُونَ
ఇంకా రంగురంగుల వస్తువులెన్నింటినో ఆయన మీకోసం భూమిలో సృష్టించాడు. నిస్సందేహంగా గుణపాఠం గ్రహించే వారికోసం ఇందులో చాలా పెద్ద సూచన ఉంది.
16:14  وَهُوَ الَّذِي سَخَّرَ الْبَحْرَ لِتَأْكُلُوا مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى الْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
ఆయనే సముద్రాన్ని మీకు వశపరిచాడు - మీరు అందులో నుంచి (తీయబడిన) తాజా మాంసాన్ని తినటానికీ, మీరు తొడిగే ఆభరణాలను అందులో నుంచి వెలికితీయటానికీ. నీవు చూస్తావు! ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతుంటాయి. మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి, కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవటానికి (ఈ ఏర్పాటు చేయబడింది).
16:15  وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَأَنْهَارًا وَسُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ
భూమి మిమ్మల్ని తీసుకుని కంపించకుండా ఉండటానికి ఆయన పర్వతాలను అందులో పాతిపెట్టాడు. మీరు మీ గమ్యాలను చేరుకోవటానికి ఆయన నదులను, త్రోవలను కూడా సృష్టించాడు.
16:16  وَعَلَامَاتٍ ۚ وَبِالنَّجْمِ هُمْ يَهْتَدُونَ
ఇంకా ఎన్నో సూచనలను నిర్ణయించి పెట్టాడు. నక్షత్రాల ద్వారా కూడా జనులు మార్గాలను కనుగొంటారు.
16:17  أَفَمَن يَخْلُقُ كَمَن لَّا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ
ఏమిటీ, (సర్వాన్నీ) సృష్టించేవాడూ - ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరూ ఒకటేనా? మీరు బొత్తిగా ఆలోచించరా?
16:18  وَإِن تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا ۗ إِنَّ اللَّهَ لَغَفُورٌ رَّحِيمٌ
ఒకవేళ మీరు అల్లాహ్‌ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిశ్చయంగా అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.
16:19  وَاللَّهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ
మీరు గోప్యంగా ఉంచేదీ, బహిర్గతం చేసేదీ - అంతా అల్లాహ్‌కు తెలుసు.
16:20  وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ لَا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ
అల్లాహ్‌ను వదలి వాళ్లు పిలుస్తున్నవారు ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు.
16:21  أَمْوَاتٌ غَيْرُ أَحْيَاءٍ ۖ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ
వారు నిర్జీవులేగాని సజీవులు కారు. తాము ఎప్పుడు (బ్రతికించి) లేపబడతారో కూడా వారికి తెలీదు.
16:22  إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۚ فَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٌ وَهُم مُّسْتَكْبِرُونَ
మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్‌ ఒక్కడే. అయితే పరలోకం పట్ల నమ్మకం లేనివారి హృదయాలు ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నాయి. వారు స్వయంగా అహంకారంతో విర్రవీగుతున్నారు.
16:23  لَا جَرَمَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْتَكْبِرِينَ
నిశ్చయంగా అల్లాహ్‌కు వారు దాచేది, బహిర్గతం చేసేది-అంతా తెలుసు. గర్విష్టులను ఆయన ఏ మాత్రం ఇష్టపడడు.
16:24  وَإِذَا قِيلَ لَهُم مَّاذَا أَنزَلَ رَبُّكُمْ ۙ قَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ
"ఇంతకీ మీ ప్రభువు ఏం అవతరింపజేశాడ"ని వారిని అడిగి నప్పుడు, "పాతకాలపు కట్టుకథలు" అని చెబుతారు.
16:25  لِيَحْمِلُوا أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ الْقِيَامَةِ ۙ وَمِنْ أَوْزَارِ الَّذِينَ يُضِلُّونَهُم بِغَيْرِ عِلْمٍ ۗ أَلَا سَاءَ مَا يَزِرُونَ
పర్యవసానంగా ప్రళయదినాన వారు తమ (పాప) భారమంతటినీ మోయటంతోపాటు, అజ్ఞానంతో తాము పెడదారి పట్టించిన వారి బరువును మోయటంలో కూడా భాగస్థులవుతారు. చూడండి! ఎంత చెడ్డ బరువును వారు తమ నెత్తిపై వేసుకుంటున్నారో!
16:26  قَدْ مَكَرَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَى اللَّهُ بُنْيَانَهُم مِّنَ الْقَوَاعِدِ فَخَرَّ عَلَيْهِمُ السَّقْفُ مِن فَوْقِهِمْ وَأَتَاهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ
వీరి పూర్వీకులు కూడా కుట్రలు పన్నారు. (చివరికి) అల్లాహ్‌ వారి (కుట్రల) కట్టడాలను కూకటి వ్రేళ్లతో పెకలించివేశాడు. వారి (కట్టడాల) కప్పులు వారి (నెత్తి) మీదే పడ్డాయి. వారు ఊహించనైనాలేని చోటునుంచి వారిపై శిక్ష వచ్చి పడింది.
16:27  ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يُخْزِيهِمْ وَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تُشَاقُّونَ فِيهِمْ ۚ قَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ إِنَّ الْخِزْيَ الْيَوْمَ وَالسُّوءَ عَلَى الْكَافِرِينَ
మళ్ళీ ప్రళయదినాన కూడా అల్లాహ్‌ వారిని పరాభవానికి లోనుచేస్తాడు. "నా భాగస్వాములు ఏరి? వారి గురించి మీరు జగడమాడేవారు కదా?!" అని వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు జ్ఞానమొసగబడిన వారు చెబుతారు -"ఈ రోజు పరాభవం, కీడు పడేది అవిశ్వాసులపైనే" అని!
16:28  الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ ۖ فَأَلْقَوُا السَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِن سُوءٍ ۚ بَلَىٰ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا كُنتُمْ تَعْمَلُونَ
వారు తమ ఆత్మలకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు, వెంటనే పూర్తిగా లొంగిపోయి వారు, "మేము ఏ పాపం ఎరుగం" అని అంటారు. "ఎందుకెరుగరు? మీరు ఏమేం చేసే వారో అల్లాహ్‌కు బాగా తెలుసు.
16:29  فَادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَلَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
"ఇక మీరు కలకాలం ఉండేందుకు గాను నరకద్వారాలలో ప్రవేశించండి" అని వారితో అనబడుతుంది. గర్విష్ఠుల నివాస స్థానం ఎంత చెడ్డది!?"
16:30  وَقِيلَ لِلَّذِينَ اتَّقَوْا مَاذَا أَنزَلَ رَبُّكُمْ ۚ قَالُوا خَيْرًا ۗ لِّلَّذِينَ أَحْسَنُوا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۚ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ ۚ وَلَنِعْمَ دَارُ الْمُتَّقِينَ
"మీ ప్రభువు ఏం అవతరింపజేశాడు?" అని దైవభీతిపరులను అడిగినప్పుడు "మేలైనదాన్నే (అవతరింపజేశాడు)" అని వారు చెబుతారు. మేలు చేసిన వారికి ఈ ప్రపంచంలో మేలు చేకూరుతుంది. ఇక పరలోక నిలయమైతే మరింత మేలైనది. దైవభీతిపరులకు లభించే ఈ నిలయం ఎంత చక్కనిది!
16:31  جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَاءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِي اللَّهُ الْمُتَّقِينَ
కలకాలం ఉండే స్వర్గ వనాలలో వారు ప్రవేశిస్తారు. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు కోరినదల్లా వారి కోసం ఉంటుంది. భయభక్తులు కలవారికి అల్లాహ్‌ ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాడు మరి.
16:32  الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَامٌ عَلَيْكُمُ ادْخُلُوا الْجَنَّةَ بِمَا كُنتُمْ تَعْمَلُونَ
వారు పవిత్రులుగా ఉన్న స్థితిలో దైవదూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకుంటూ, "మీకు శాంతి కల్గుగాక! మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ప్రవేశించండి" అని అంటారు.
16:33  هَلْ يَنظُرُونَ إِلَّا أَن تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ أَمْرُ رَبِّكَ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّهُ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
ఏమిటీ, తమ వద్దకు దైవదూతలు రావాలనో లేక నీ ప్రభువు ఉత్తర్వు రావాలనో వీళ్ళు ఎదురు చూస్తున్నారా? వీరి పూర్వీకులు కూడా అలాగే చేశారు. అల్లాహ్‌ వారికి ఎలాంటి అన్యాయమూ చేయలేదు. వారంతట వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు.
16:34  فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
కాబట్టి వారి దుష్కర్మల ఫలితాలు వారికి లభించాయి. దేని గురించి వారు నవ్విపోయేవారో అదే వారిని చుట్టుముట్టింది.
16:35  وَقَالَ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّهُ مَا عَبَدْنَا مِن دُونِهِ مِن شَيْءٍ نَّحْنُ وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِن دُونِهِ مِن شَيْءٍ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى الرُّسُلِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
ముష్రిక్కులు ఇలా అన్నారు : "అల్లాహ్‌ గనక తలచుకుని ఉంటే మేమూ, మా తాతముత్తాతలూ ఆయన్ని తప్ప ఇంకొక రెవరినీ ఆరాధించేవాళ్ళం కాము. ఆయన ఉత్తర్వులేకుండా ఏ వస్తువునూ నిషేధించే వాళ్ళం కాము. "వీరి పూర్వీకులు చేసింది కూడా అదే. కనుక ప్రవక్తల బాధ్యత సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప మరొకటి కాదు.
16:36  وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ ۖ فَمِنْهُم مَّنْ هَدَى اللَّهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ الضَّلَالَةُ ۚ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా (ప్రజలారా!) "అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి" అని బోధపరచాము. ఆ తరువాత అల్లాహ్‌ కొందరికి సన్మార్గం చూపాడు. మరికొందరిపై అపమార్గం రూఢీ అయిపోయింది. ధిక్కరించినవారికి పట్టిన గతేమిటో మీరు స్వయంగా భువిలో తిరిగి చూడండి.
16:37  إِن تَحْرِصْ عَلَىٰ هُدَاهُمْ فَإِنَّ اللَّهَ لَا يَهْدِي مَن يُضِلُّ ۖ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు వారిని సన్మార్గానికి తీసుకురావాలని తీవ్రంగా కోరుకున్నప్పటికీ, అల్లాహ్‌ తాను అపమార్గాన వదిలేసిన వారికి సన్మార్గం చూపడు. వారిని ఆదుకునేవారు కూడా ఎవరూ ఉండరు.
16:38  وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ لَا يَبْعَثُ اللَّهُ مَن يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
"చనిపోయిన వారిని అల్లాహ్‌ తిరిగి లేపడు" అని వారు అల్లాహ్‌పై గట్టిగా ప్రమాణాలు చేసి మరీ చెబుతారు. ఎందుకు లేపడు? (తప్పకుండా మళ్లీ బ్రతికించి లేపుతాడు) ఇది ఆయన వాగ్దానం - దాన్ని నెరవేర్చటాన్ని ఆయన విధిగా చేసుకున్నాడు. కాని చాలామందికి ఈ విషయం తెలియదు.
16:39  لِيُبَيِّنَ لَهُمُ الَّذِي يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ كَانُوا كَاذِبِينَ
వారు విభేదించుకునే విషయాన్ని అల్లాహ్‌ వారికి స్పష్టంగా తెలియజేయటానికి,తాము అబద్ధాలకోరులం అని అవిశ్వాసులు స్వయంగా తెలుసుకోవటానికి (వారిని తిరిగి బ్రతికించటం జరుగుతుంది).
16:40  إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَن نَّقُولَ لَهُ كُن فَيَكُونُ
మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు 'అయిపో' అని అంటే చాలు, అది అయిపోతుంది.
16:41  وَالَّذِينَ هَاجَرُوا فِي اللَّهِ مِن بَعْدِ مَا ظُلِمُوا لَنُبَوِّئَنَّهُمْ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَلَأَجْرُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
దౌర్జన్యానికి గురైన తరువాత దైవమార్గంలో (ఇల్లూ వాకిలిని వదలి) వలసపోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది. ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బావుండు!
16:42  الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
వారు సహన స్థయిర్యాలను ప్రదర్శిస్తూ, (సతతం) తమ పరిపోషకుణ్ణే నమ్ముకుని ఉండేవారు.
16:43  وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِمْ ۚ فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము పురుషులనే (ప్రవక్తలుగా నియమించి) పంపాము. వారి వద్దకు మా వహీని పంపేవారము. ఒకవేళ మీకు తెలియకపోతే (గ్రంథ) జ్ఞానం గల వారిని అడిగి తెలుసుకోండి.
16:44  بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ ۗ وَأَنزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ وَلَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
(మేము వారిని) స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ (పంపి ఉన్నాము. అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము.
16:45  أَفَأَمِنَ الَّذِينَ مَكَرُوا السَّيِّئَاتِ أَن يَخْسِفَ اللَّهُ بِهِمُ الْأَرْضَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ
ఏమిటి నీచాతి నీచమైన కుట్రలు పన్నేవారు, అల్లాహ్‌ తమను నేలలో కూరుకుపోయేలా చేస్తాడనిగానీ లేక తాము ఊహించనైనా లేని చోటు నుంచి తమ వైపుకు శిక్ష వచ్చిపడుతుందని గానీ భయపడటం లేదా?
16:46  أَوْ يَأْخُذَهُمْ فِي تَقَلُّبِهِمْ فَمَا هُم بِمُعْجِزِينَ
లేదా తాము విహరిస్తుండగా తమను పట్టుకుంటాడని గానీ - అలా అయితే వారు ఎట్టి పరిస్థితిలోనూ (అల్లాహ్‌ను) నిస్సహాయుణ్ణి చేయలేరు సుమా!
16:47  أَوْ يَأْخُذَهُمْ عَلَىٰ تَخَوُّفٍ فَإِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ
లేదా తమను భయాందోళనలకు లోనుచేసి పట్టుకుంటాడని గానీ వారు భయపడటం లేదా? నిశ్చయంగా నీ ప్రభువు అసామాన్య వాత్సల్యం కలవాడు, అనంత కరుణామయుడు.
16:48  أَوَلَمْ يَرَوْا إِلَىٰ مَا خَلَقَ اللَّهُ مِن شَيْءٍ يَتَفَيَّأُ ظِلَالُهُ عَنِ الْيَمِينِ وَالشَّمَائِلِ سُجَّدًا لِّلَّهِ وَهُمْ دَاخِرُونَ
ఏమిటీ, వారు అల్లాహ్‌ సృష్టించిన వాటిలో ఏ వస్తువును కూడా (నిశిత దృష్టితో) చూడలేదా? వాటి నీడలు కుడివైపు, ఎడమ వైపు వాలుతూ, అల్లాహ్‌ సన్నిధిలో సాష్టాంగపడుతుంటాయి. తమ వినమ్రతను చాటుకుంటూ ఉంటాయి. (దీన్ని వారు గమనించటం లేదా?).
16:49  وَلِلَّهِ يَسْجُدُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مِن دَابَّةٍ وَالْمَلَائِكَةُ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ
నిశ్చయంగా ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్త ప్రాణులు, దూతలు - అందరూ అల్లాహ్‌ సన్నిధిలో సాష్టాంగపడుతున్నారు - ఏమాత్రం అహంకారం చూపటం లేదు.
16:50  يَخَافُونَ رَبَّهُم مِّن فَوْقِهِمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ ۩
తమపైనున్న ప్రభువు పట్ల వారు భయంతో వణికిపోతున్నారు. తమకు ఆజ్ఞాపించబడిన దానినల్లా పాటిస్తున్నారు.
16:51  وَقَالَ اللَّهُ لَا تَتَّخِذُوا إِلَٰهَيْنِ اثْنَيْنِ ۖ إِنَّمَا هُوَ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَإِيَّايَ فَارْهَبُونِ
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: "ఇద్దరు ఆరాధ్య దైవాలను కల్పించుకోకండి. ఆరాధ్య దైవం మటుకు ఆయన ఒక్కడే. కాబట్టి మీరంతా కేవలం నాకే భయపడండి."
16:52  وَلَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَهُ الدِّينُ وَاصِبًا ۚ أَفَغَيْرَ اللَّهِ تَتَّقُونَ
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆయనదే. ఆయన్ని ఆరాధించటం సదా అవశ్యం. మరలాంటప్పుడు మీరు అల్లాహ్‌కు గాక ఇతరులకు భయపడతారా?
16:53  وَمَا بِكُم مِّن نِّعْمَةٍ فَمِنَ اللَّهِ ۖ ثُمَّ إِذَا مَسَّكُمُ الضُّرُّ فَإِلَيْهِ تَجْأَرُونَ
మీ దగ్గరున్న భాగ్యాలన్నీ అల్లాహ్‌ ప్రసాదించినవే. ఇప్పటికీ మీకేదైనా కష్టంవస్తే మీరు ఆయనకే మొరపెట్టుకుంటారు.
16:54  ثُمَّ إِذَا كَشَفَ الضُّرَّ عَنكُمْ إِذَا فَرِيقٌ مِّنكُم بِرَبِّهِمْ يُشْرِكُونَ
మరి ఆయన ఆ కష్టాన్ని మీనుండి తొలగించినప్పుడు మీలోని కొందరు తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు.
16:55  لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
మా ప్రసాదితాల పట్ల కృతఘ్నతా వైఖరిని అవలంబించటానికే వారలా చేస్తారు! సరే. కొంత లబ్దిని పొందండి. చివరకు (దాని పర్యవసానం ఏమిటో) మీకే తెలుస్తుంది.
16:56  وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًا مِّمَّا رَزَقْنَاهُمْ ۗ تَاللَّهِ لَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَفْتَرُونَ
మేము ప్రసాదించిన ఉపాధిలోనుంచి ఒక భాగాన్ని వారు తమకు ఏమాత్రం తెలియని వారి కోసం కేటాయిస్తున్నారు. అల్లాహ్‌ సాక్షి! మీరు అంటగడుతున్న ఈ అబద్ధం గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
16:57  وَيَجْعَلُونَ لِلَّهِ الْبَنَاتِ سُبْحَانَهُ ۙ وَلَهُم مَّا يَشْتَهُونَ
వారు పరమ పవిత్రుడైన అల్లాహ్‌ కోసం కూతుళ్ళను నిర్ణయించి, తమ కోసమేమో తమ మనసు కోరిన దాన్ని నిర్ధారించుకుంటున్నారు.
16:58  وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِالْأُنثَىٰ ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ
వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే, వాడి మొహం నల్లగా మారిపోతుంది. లోలోపలే కుత కుత లాడిపోతాడు.
16:59  يَتَوَارَىٰ مِنَ الْقَوْمِ مِن سُوءِ مَا بُشِّرَ بِهِ ۚ أَيُمْسِكُهُ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُ فِي التُّرَابِ ۗ أَلَا سَاءَ مَا يَحْكُمُونَ
ఈ దుర్వార్త విన్న తరువాత (ఇక లోకులకు ముఖం ఎలా చూపేది? అని) అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టిపెట్టుకోవాలా? లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా? అని (పరిపరి విధాలుగా) ఆలోచిస్తాడు. చూడు! ఎంతటి జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు!?
16:60  لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ مَثَلُ السَّوْءِ ۖ وَلِلَّهِ الْمَثَلُ الْأَعْلَىٰ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
పరలోకాన్ని విశ్వసించనివారి ఉపమానం మాత్రమే చెడ్డది. అల్లాహ్‌ అత్యున్నతమైన గుణగణాల దర్పం కలవాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు కూడా.
16:61  وَلَوْ يُؤَاخِذُ اللَّهُ النَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَابَّةٍ وَلَٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ
అల్లాహ్‌యే గనక ప్రజలు పాల్పడే (ఒక్కో) అఘాయిత్యంపై వారిని నిలదీసినట్లయితే భూమండలంపై ఒక్క ప్రాణి కూడా మిగిలి ఉండదు. కాని ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు విడుపునిస్తున్నాడు. మరి వారి కోసం నిర్ణయించబడిన ఆ సమయం వచ్చేసిందంటే వారు ఒక్క ఘడియ వెనక్కిగానీ, ముందుకు గానీ జరగలేరు.
16:62  وَيَجْعَلُونَ لِلَّهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ الْكَذِبَ أَنَّ لَهُمُ الْحُسْنَىٰ ۖ لَا جَرَمَ أَنَّ لَهُمُ النَّارَ وَأَنَّهُم مُّفْرَطُونَ
వారు తమ కోసం ఇష్టపడని దానిని అల్లాహ్‌కు కేటాయిస్తున్నారు. తమకు మంచే జరుగుతుందని వారి నోళ్లు అబద్ధాలు ప్రేలుతున్నాయి. అసంభవం. వారి కోసం ఉన్నది నరకాగ్ని మాత్రమే. అందరికన్నా ముందు అందులోకి పోయేది వాళ్ళే.
16:63  تَاللَّهِ لَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَهُوَ وَلِيُّهُمُ الْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
అల్లాహ్‌ సాక్షి! (ఓ ప్రవక్తా!) మేము నీకు పూర్వం గతించిన సమాజాల వద్దకు కూడా మా ప్రవక్తలను పంపి ఉన్నాము. కాని షైతాన్‌ వారి దుష్కర్మలను వారికి అందమైనవిగా చేసి చూపాడు. నేటికీ ఆ షైతాను వారి నేస్తంగా ఉన్నాడు. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది.
16:64  وَمَا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ
వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం.
16:65  وَاللَّهُ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَسْمَعُونَ
అల్లాహ్‌ ఆకాశం నుంచి నీళ్ళను కురిపించి, దాని ద్వారా - భూమి చచ్చిపోయిన తరువాత దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. వినేవారి కోసం నిశ్చయంగా ఇందులో నిదర్శనం ఉంది.
16:66  وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِي بُطُونِهِ مِن بَيْنِ فَرْثٍ وَدَمٍ لَّبَنًا خَالِصًا سَائِغًا لِّلشَّارِبِينَ
మీ కోసం పశువులలో కూడా ఒక గుణపాఠం ఉంది. వాటి కడుపులలో ఉన్న పేడకు - రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిస్తున్నాము. త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది.
16:67  وَمِن ثَمَرَاتِ النَّخِيلِ وَالْأَعْنَابِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَعْقِلُونَ
ఇంకా ఖర్జూరం, ద్రాక్షపండ్ల నుంచి మీరు మత్తుపానీయాన్ని తయారు చేస్తారు. (వాటి నుంచి) మంచి ఆహారాన్ని కూడా గ్రహిస్తున్నారు. విజ్ఞత గలవారి కోసం ఇందులోనూ గొప్ప సూచన ఉంది.
16:68  وَأَوْحَىٰ رَبُّكَ إِلَى النَّحْلِ أَنِ اتَّخِذِي مِنَ الْجِبَالِ بُيُوتًا وَمِنَ الشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ
నీ ప్రభువు తేనెటీగకు ఈ సంకేతమిచ్చాడు: "కొండల్లో, చెట్లలో, ప్రజలు కట్టుకున్నఎత్తయిన పందిళ్ళలో నీ ఇండ్లను (తెట్టెలను) నిర్మించుకో.
16:69  ثُمَّ كُلِي مِن كُلِّ الثَّمَرَاتِ فَاسْلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلًا ۚ يَخْرُجُ مِن بُطُونِهَا شَرَابٌ مُّخْتَلِفٌ أَلْوَانُهُ فِيهِ شِفَاءٌ لِّلنَّاسِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
"అన్ని రకాల పండ్లను తిను. నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు." వాటి కడుపులలో నుంచి పానకం ఒకటి వెలువడుతుంది. దాని రంగులు వేర్వేరుగా ఉంటాయి. అందులో ప్రజలకు స్వస్థత ఉంది. ఆలోచించేవారి కోసం ఇందులో (గొప్ప) సూచన ఉంది.
16:70  وَاللَّهُ خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّاكُمْ ۚ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْ لَا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْئًا ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ قَدِيرٌ
అల్లాహ్‌యే మిమ్మల్నందరినీ పుట్టించాడు. మరి ఆయనే మీకు చావునిస్తాడు. మీలో అత్యంత దుర్భరమైన వయస్సుకు చేర్చబడే వారు కూడా ఉంటారు-అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని వారవటానికి! నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వాధికారి.
16:71  وَاللَّهُ فَضَّلَ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ فِي الرِّزْقِ ۚ فَمَا الَّذِينَ فُضِّلُوا بِرَادِّي رِزْقِهِمْ عَلَىٰ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَهُمْ فِيهِ سَوَاءٌ ۚ أَفَبِنِعْمَةِ اللَّهِ يَجْحَدُونَ
అల్లాహ్‌యే ఉపాధి విషయంలో మీలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను వొసగి ఉన్నాడు. ఆధిక్యత వొసగబడినవారు తమ ఉపాధిని తమ క్రిందనున్న బానిసలకు తామూ-వారూ సమానులయ్యేలా ఇవ్వరు. మరి వీరు అల్లాహ్‌ అనుగ్రహాలనే తిరస్కరిస్తున్నారా?
16:72  وَاللَّهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَاجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَتِ اللَّهِ هُمْ يَكْفُرُونَ
అల్లాహ్‌ మీ కోసం స్వయంగా మీలో నుంచే మీ భార్యలను సృష్టించాడు. మరి మీ భార్యల ద్వారా మీ కొరకు మీ కుమారులను, మీ మనవళ్ళను పుట్టించాడు. ఇంకా, మీకు తినటానికి మంచి మంచి వస్తువులను సమకూర్చాడు. అయినప్పటికీ ప్రజలు మిథ్యనే నమ్ముకుంటున్నారా? వారు అల్లాహ్‌ అనుగ్రహాల పట్ల కృతఘ్నతకు పాల్పడుతున్నారా??
16:73  وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ شَيْئًا وَلَا يَسْتَطِيعُونَ
వారు అల్లాహ్‌ను వదలి, తమకు ఆకాశాల నుంచిగానీ, భూమి నుంచిగానీ ఎలాంటి ఉపాధినీ సమకూర్చలేని వారిని, ఏ శక్తిసామర్థ్యమూ లేనివారిని పూజిస్తున్నారా?
16:74  فَلَا تَضْرِبُوا لِلَّهِ الْأَمْثَالَ ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
కాబట్టి అల్లాహ్‌కు పోలికలను కల్పించకండి. నిశ్చయంగా అల్లాహ్‌కు అన్నీ తెలుసు. మీకు తెలియదు.
16:75  ضَرَبَ اللَّهُ مَثَلًا عَبْدًا مَّمْلُوكًا لَّا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَمَن رَّزَقْنَاهُ مِنَّا رِزْقًا حَسَنًا فَهُوَ يُنفِقُ مِنْهُ سِرًّا وَجَهْرًا ۖ هَلْ يَسْتَوُونَ ۚ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
అల్లాహ్‌ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు: ఇతరుల యాజమాన్యంలో ఉన్న ఒక బానిస ఉన్నాడు. అతనికి ఏ అధికారమూ లేదు. కాగా; మరో వ్యక్తి ఉన్నాడు - అతనికి మేము మా వద్ద నుంచి మంచి ఉపాధిని సమకూర్చాము. అందులో నుంచి అతడు రహస్యంగానూ, బహిర్గతంగానూ ఖర్చుపెడతాడు. మరి వీరిద్దరూ సమానులేనా? సర్వస్తోత్రాలూ అల్లాహ్‌ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలీదు.
16:76  وَضَرَبَ اللَّهُ مَثَلًا رَّجُلَيْنِ أَحَدُهُمَا أَبْكَمُ لَا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوْلَاهُ أَيْنَمَا يُوَجِّههُّ لَا يَأْتِ بِخَيْرٍ ۖ هَلْ يَسْتَوِي هُوَ وَمَن يَأْمُرُ بِالْعَدْلِ ۙ وَهُوَ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అల్లాహ్‌ మరో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా ఇస్తున్నాడు: వారిలో ఒకడు మూగవాడు. ఏదీ చెయ్యలేడు. పైగా అతను తన యజమానికి భారంగా తయారయ్యాడు. అతన్ని ఎక్కడికి పంపినా మేలును తీసుకురాడు. మరొకతను న్యాయం గురించి ఆదేశిస్తున్నాడు. పైగా అతను సన్మార్గాన ఉన్నాడు. వీరిద్దరూ ఒకటేనా?
16:77  وَلِلَّهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَا أَمْرُ السَّاعَةِ إِلَّا كَلَمْحِ الْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న నిగూఢ విషయాలు అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ప్రళయ వ్యవహారం రెప్పపాటు కాలంలో, లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు.
16:78  وَاللَّهُ أَخْرَجَكُم مِّن بُطُونِ أُمَّهَاتِكُمْ لَا تَعْلَمُونَ شَيْئًا وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُونَ
అల్లాహ్‌ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి - మీకేమీ తెలీని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్లను, హృదయాలను తయారుచేసినది ఆయనే - మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని!
16:79  أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్‌ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి.
16:80  وَاللَّهُ جَعَلَ لَكُم مِّن بُيُوتِكُمْ سَكَنًا وَجَعَلَ لَكُم مِّن جُلُودِ الْأَنْعَامِ بُيُوتًا تَسْتَخِفُّونَهَا يَوْمَ ظَعْنِكُمْ وَيَوْمَ إِقَامَتِكُمْ ۙ وَمِنْ أَصْوَافِهَا وَأَوْبَارِهَا وَأَشْعَارِهَا أَثَاثًا وَمَتَاعًا إِلَىٰ حِينٍ
అల్లాహ్‌ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయనే మీ కోసం పశువుల చర్మాలతో ఇళ్ళను చేశాడు. ప్రయాణ దినాన, విడిది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా - అనువైనవిగా - ఉంటాయి. ఇంకా వాటి ఉన్నితోనూ, రోమాలతోనూ, వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను, కొంతకాలం వరకూ ఉపయోగపడే వస్తువులనూ తయారుచేశాడు.
16:81  وَاللَّهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَالًا وَجَعَلَ لَكُم مِّنَ الْجِبَالِ أَكْنَانًا وَجَعَلَ لَكُمْ سَرَابِيلَ تَقِيكُمُ الْحَرَّ وَسَرَابِيلَ تَقِيكُم بَأْسَكُمْ ۚ كَذَٰلِكَ يُتِمُّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُونَ
మరి అల్లాహ్‌యే మీ కోసం తాను సృష్టించిన వస్తువులతో నీడను ఏర్పాటు చేశాడు. మరి ఆయనే మీకోసం కొండలలో గుహలను చేశాడు. ఇంకా ఆయనే మీకోసం, మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయాలలో మీకు రక్షా కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు. ఈ విధంగా ఆయన - మీరు ఆజ్ఞల్ని శిరసావహించే వారౌతారని - తన అనుగ్రహాలను పరిపూర్తి చేస్తున్నాడు.
16:82  فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ الْمُبِينُ
అప్పటికీ వారు విముఖత చూపినట్లయితే (ఓ ప్రవక్తా!) విషయాన్ని స్పష్టంగా అందజేయటం వరకే నీ బాధ్యత.
16:83  يَعْرِفُونَ نِعْمَتَ اللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ الْكَافِرُونَ
వీరు అల్లాహ్‌ అనుగ్రహాలను గుర్తించి కూడా నిరాకరిస్తున్నారు. పైగా వారిలో చాలా మంది చేసిన మేలును మరిచేవారే.
16:84  وَيَوْمَ نَبْعَثُ مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا ثُمَّ لَا يُؤْذَنُ لِلَّذِينَ كَفَرُوا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
ఏ రోజున మేము ప్రతి సమాజం నుంచీ ఒక సాక్షిని నిలబెడతామో (ఆ రోజున) అవిశ్వాసులకు (సంజాయిషీ ఇచ్చుకునే) అనుమతి ఇవ్వబడదు. 'పశ్చాత్తాప పడండి' అని కూడా వారితో అనటం జరగదు.
16:85  وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ
ఆ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు దాన్ని వారి నుంచి తేలిక చేయటంగానీ, వారికి విడుపు ఇవ్వటంగానీ జరగదు.
16:86  وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ ۖ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ
ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే, "ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే" అని అంటారు. అప్పుడు వారు (ఆ భాగస్వాములు), "మీరు చెప్పేది పచ్చి అబద్ధం" అని వారి మాటను ఖండిస్తారు.
16:87  وَأَلْقَوْا إِلَى اللَّهِ يَوْمَئِذٍ السَّلَمَ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
ఆ రోజు వారంతా అల్లాహ్‌ సమక్షంలో పూర్తిగా లొంగి పోవటానికి సిద్ధమవుతారు. వారు చేస్తూ ఉండిన కల్పనలన్నీ వారి నుంచి మటుమాయమౌతాయి.
16:88  الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوا يُفْسِدُونَ
ఎవరు తిరస్కరించారో, అల్లాహ్‌ మార్గం నుంచి (జనులను) ఆపారో వారికి మేము శిక్షపై శిక్షను పెంచుతూపోతాము. వారి దురాగతాలకు ఫలితం అది.
16:89  وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِم مِّنْ أَنفُسِهِمْ ۖ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَٰؤُلَاءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ
ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుంచీ వారిపై ఒక సాక్షిని నిలబెడతాము. మరి (ఓ ప్రవక్తా!) నిన్ను వారందరిపై సాక్షిగా తీసుకువస్తాము. మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి (ముస్లింలకు) అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త.
16:90  إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَىٰ وَيَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَالْبَغْيِ ۚ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
అల్లాహ్‌ న్యాయం చేయమనీ, ఉపకారం (ఇహ్‌సాన్‌) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా - నీతిబాహ్యమైన పనుల నుండీ, చెడుల నుండీ, దౌర్జన్యం నుండీ ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించటానికి ఆయన స్వయంగా మీకు ఉపదేశిస్తున్నాడు.
16:91  وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدتُّمْ وَلَا تَنقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ
మీరు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అల్లాహ్‌కు ఇచ్చిన మాటను నిలుపుకోండి. ప్రమాణాలను ఖరారు చేసుకున్న మీదట భంగపరచకండి. (ఎందుకంటే) మీరు అల్లాహ్‌ను మీ సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయనకు తెలుసు.
16:92  وَلَا تَكُونُوا كَالَّتِي نَقَضَتْ غَزْلَهَا مِن بَعْدِ قُوَّةٍ أَنكَاثًا تَتَّخِذُونَ أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ أَن تَكُونَ أُمَّةٌ هِيَ أَرْبَىٰ مِنْ أُمَّةٍ ۚ إِنَّمَا يَبْلُوكُمُ اللَّهُ بِهِ ۚ وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ الْقِيَامَةِ مَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
తన నూలును గట్టిగా వడికిన తరువాత, తనే స్వయంగా ముక్కలుముక్కలుగా త్రెంచివేసిన స్త్రీ మాదిరిగా అయిపోకండి. ఒక వర్గం మరో వర్గం కంటే మించిపోవాలన్న ఉద్దేశంతో మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకునే సాధనాలుగా చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ ప్రమాణం ద్వారా అల్లాహ్‌ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రళయదినాన మీరు విభేదించుకునే విషయాలన్నింటినీ మీకు విడమరచి చెబుతాడు.
16:93  وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِن يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَعْمَلُونَ
అల్లాహ్‌ గనక తలచుకుంటే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను తలచిన వారిని అపమార్గానికి లోనుచేస్తాడు, తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు. మీరు చేస్తున్న పనులన్నింటి గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు.
16:94  وَلَا تَتَّخِذُوا أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا السُّوءَ بِمَا صَدَدتُّمْ عَن سَبِيلِ اللَّهِ ۖ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ
మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి సాధనాలుగా చేసుకోకండి. (మీ ధోరణి గనక ఇలాగే ఉంటే) నిలదొక్కుకున్న మీదట (మీ) అడుగులు తడబడతాయి. మీరు కఠినమైన శిక్షను చవిచూడవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు అల్లాహ్‌ మార్గాన అడ్డు తగిలారు. మీకు పెద్ద శిక్షపడుతుంది.
16:95  وَلَا تَشْتَرُوا بِعَهْدِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ۚ إِنَّمَا عِندَ اللَّهِ هُوَ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
మీరు అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని కొద్దిపాటి మూల్యానికి అమ్మివేయకండి. గుర్తుంచుకోండి! మీరు గనక తెలుసుకోగలిగితే అల్లాహ్‌ వద్ద ఉన్నదే మీ కొరకు శ్రేయోదాయకమైనది.
16:96  مَا عِندَكُمْ يَنفَدُ ۖ وَمَا عِندَ اللَّهِ بَاقٍ ۗ وَلَنَجْزِيَنَّ الَّذِينَ صَبَرُوا أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ
మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. అల్లాహ్‌ వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఓర్పు వహించేవారికి మేము వారి సదాచరణలకుగాను మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము.
16:97  مَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَيَاةً طَيِّبَةً ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ
సత్కార్యాలు చేసేవారు పురుషులైనా, స్త్రీలయినా-విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము.
16:98  فَإِذَا قَرَأْتَ الْقُرْآنَ فَاسْتَعِذْ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(ఓ ముహమ్మద్‌!) ఖుర్‌ఆన్‌ పఠనానికి ఉపక్రమించినపుడు శాపగ్రస్తుడైన షైతాను బారి నుంచి అల్లాహ్‌ శరణు వేడుకో.
16:99  إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి, తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి ఎలాంటి అధికారం ఉండదు.
16:100  إِنَّمَا سُلْطَانُهُ عَلَى الَّذِينَ يَتَوَلَّوْنَهُ وَالَّذِينَ هُم بِهِ مُشْرِكُونَ
అయితే వాడితో స్నేహం చేసి, వాడిని అల్లాహ్‌కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది.
16:101  وَإِذَا بَدَّلْنَا آيَةً مَّكَانَ آيَةٍ ۙ وَاللَّهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوا إِنَّمَا أَنتَ مُفْتَرٍ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ
మేము ఒక ఆయతు స్థానంలో మరో ఆయతును మార్చినప్పుడు "నువ్వే కల్పిస్తున్నావు" అని వారంటారు. వాస్తవానికి తాను అవతరింపజేసిన దానిని గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. అయితే వారిలో అత్యధికులకు అసలు విషయం తెలియదు.
16:102  قُلْ نَزَّلَهُ رُوحُ الْقُدُسِ مِن رَّبِّكَ بِالْحَقِّ لِيُثَبِّتَ الَّذِينَ آمَنُوا وَهُدًى وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్‌) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు."
16:103  وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُ بَشَرٌ ۗ لِّسَانُ الَّذِي يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِيٌّ وَهَٰذَا لِسَانٌ عَرَبِيٌّ مُّبِينٌ
"అతనికి ఒక మనిషి నేర్పుతున్నాడ"ని ఈ అవిశ్వాసులు పలకటం మాకు బాగా తెలుసు. వాస్తవానికి వారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అలా అంటున్నారో అతని భాష అరబ్బేతర (అజమీ) భాష. కాగా; ఈ ఖుర్‌ఆన్‌ స్వచ్ఛమైన, స్పష్టమైన అరబీ భాషలో ఉంది.
16:104  إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ لَا يَهْدِيهِمُ اللَّهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
అల్లాహ్‌ ఆయతులను విశ్వసించని వారికి అల్లాహ్‌ తరఫున సన్మార్గం లభించదు. వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది.
16:105  إِنَّمَا يَفْتَرِي الْكَذِبَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّهِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْكَاذِبُونَ
అల్లాహ్‌ ఆయతులపై విశ్వాసం లేనివారు మాత్రమే అబద్ధాలను కల్పిస్తారు. వారే అసలు అబద్ధాలకోరులు.
16:106  مَن كَفَرَ بِاللَّهِ مِن بَعْدِ إِيمَانِهِ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُ مُطْمَئِنٌّ بِالْإِيمَانِ وَلَٰكِن مَّن شَرَحَ بِالْكُفْرِ صَدْرًا فَعَلَيْهِمْ غَضَبٌ مِّنَ اللَّهِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
ఎవరయితే విశ్వసించిన తరువాత అల్లాహ్‌ పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతాడో - కాని బలవంతం చేయబడి (తిరస్కారాన్ని ప్రకటిస్తే), అదే సమయంలో అతని హృదయం విశ్వాసంపై స్థిరంగా ఉంటే (అది వేరే విషయం) - అలాగాకుండా ఎవరైనా హృదయపూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది.
16:107  ذَٰلِكَ بِأَنَّهُمُ اسْتَحَبُّوا الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَأَنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఎందుకంటే వారు పరలోకంకన్నా ప్రాపంచిక జీవితాన్ని ఎక్కువగా ప్రేమించారు. నిశ్చయంగా అల్లాహ్‌ అవిశ్వాసులకు సన్మార్గం చూపడు.
16:108  أُولَٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْغَافِلُونَ
వారి హృదయాలపై, వారి చెవులపై, వారి కళ్లపై అల్లాహ్‌ ముద్ర వేసేశాడు. విస్మరణకు (పరధ్యానానికి) గురైన వారంటే వీరే.
16:109  لَا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْخَاسِرُونَ
పరలోకంలో వారు ఘోరంగా నష్టపోతారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు.
16:110  ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا مِن بَعْدِ مَا فُتِنُوا ثُمَّ جَاهَدُوا وَصَبَرُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ
మరెవరయితే బాధలు భరించిన తరువాత (దైవ మార్గంలో) వలసపోయారో, తర్వాత (అల్లాహ్‌ మార్గంలో) పోరాటం చేశారో, సహన స్థయిర్యాలను కనబరిచారో వారిని నీ ప్రభువు - వీటన్నింటి తరువాత - క్షమిస్తాడు, కరుణిస్తాడు.
16:111  يَوْمَ تَأْتِي كُلُّ نَفْسٍ تُجَادِلُ عَن نَّفْسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
ఆ రోజు ప్రతి ఒక్కడూ తన ఆత్మ రక్షణ కోసం వాదులాడుతూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ అతను చేసుకున్న కర్మల ప్రతిఫలమంతా ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.
16:112  وَضَرَبَ اللَّهُ مَثَلًا قَرْيَةً كَانَتْ آمِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ
అల్లాహ్‌ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్‌ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు.
16:113  وَلَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظَالِمُونَ
వారి వద్దకు స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. అయినప్పటికీ వారతన్ని ధిక్కరించారు. ఫలితంగా శిక్ష వారిని పట్టుకున్నది. ఎందుకంటే వారు పరమ దుర్మార్గులుగా ఉండేవారు.
16:114  فَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ حَلَالًا طَيِّبًا وَاشْكُرُوا نِعْمَتَ اللَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించేవారు అయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి, అల్లాహ్‌ అనుగ్రహాలకుగాను కృతజ్ఞత చూపండి.
16:115  إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
నిశ్చయంగా, ఆయన చచ్చిన పశువు, రక్తం, పందిమాంసం, అల్లాహ్‌ పేరుగాక ఇతరుల పేరు ఉచ్చరించబడినవి మీకు నిషేధించాడు. అయితే ఎవరయినా ఇష్టంతో కాకుండా, మితిమీరే ఉద్దేశం కూడా లేకుండా- గత్యంతరంలేని పరిస్థితిలో- (వాటిని తిన్నట్లయితే) అల్లాహ్‌ క్షమించేవాడు, జాలి చూపేవాడు.
16:116  وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هَٰذَا حَلَالٌ وَهَٰذَا حَرَامٌ لِّتَفْتَرُوا عَلَى اللَّهِ الْكَذِبَ ۚ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ
ఏ వస్తువునయినా తమ నోటితో 'ఇది ధర్మసమ్మతం' అని, 'ఇది నిషిద్ధమనీ' ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి, అల్లాహ్‌కు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాహ్‌కు అబద్ధాలు ఆపాదించే వారు సాఫల్యాన్ని పొందలేరు.
16:117  مَتَاعٌ قَلِيلٌ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
వారికి లభించే ప్రయోజనం బహు స్వల్పం. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది.
16:118  وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَيْكَ مِن قَبْلُ ۖ وَمَا ظَلَمْنَاهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
యూదుల కొరకు మేము నిషేధించిన వాటిని గురించి మేము ఇంతకు ముందే నీకు వినిపించి ఉన్నాము. మేము వారికి అన్యాయం చేయలేదు. కాని వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు.
16:119  ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُوا السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ
మరి ఎవరయినా అజ్ఞానం వల్ల దురాగతాలకు పాల్పడి, ఆపైన పశ్చాత్తాపం చెందితే, దిద్దుబాటు కూడా చేసుకుంటే అప్పుడు నిశ్చయంగా నీ ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు.
16:120  إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ
నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయ నాయకుడు. నికార్సయిన దైవవిధేయుడు. అల్లాహ్‌ యందే మనస్సు నిలిపిన వాడు. అతడు బహుదైవారాధకులలో చేరినవాడు కాడు.
16:121  شَاكِرًا لِّأَنْعُمِهِ ۚ اجْتَبَاهُ وَهَدَاهُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అల్లాహ్‌ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు. అల్లాహ్‌ అతన్ని ఎన్నుకున్నాడు. అతనికి రుజుమార్గం చూపించాడు.
16:122  وَآتَيْنَاهُ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ
మేమతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము. పరలోకంలోనూ అతను సజ్జనులలో చేరి ఉంటాడు.
16:123  ثُمَّ أَوْحَيْنَا إِلَيْكَ أَنِ اتَّبِعْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
తరువాత మేము, ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము. అతడు బహుదైవోపాసకులలో చేరినవాడు కాడు.
16:124  إِنَّمَا جُعِلَ السَّبْتُ عَلَى الَّذِينَ اخْتَلَفُوا فِيهِ ۚ وَإِنَّ رَبَّكَ لَيَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
ఎవరు శనివారం విషయంలో విభేదించుకున్నారో వారికి మాత్రమే దాని విశిష్ఠత విధించబడింది. అసలు విషయమేమిటంటే నీ ప్రభువు స్వయంగా ప్రళయదినాన వారి విభేదంపై వారి మధ్య తీర్పు చేస్తాడు.
16:125  ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.
16:126  وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا بِمِثْلِ مَا عُوقِبْتُم بِهِ ۖ وَلَئِن صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِّلصَّابِرِينَ
ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలచినా, మీకు ఏ మేరకు బాధపెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి. ఒకవేళ మీరు ఓర్చుకున్నట్లయితే, ఓర్పు వహించేవారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది.
16:127  وَاصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِاللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ
(ఓ ముహమ్మద్‌- స!) నువ్వు సహనం వహించు. (అయితే) అల్లాహ్‌ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు.
16:128  إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ
నిశ్చయంగా అల్లాహ్‌ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.