aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

15. సూరా అల్ హిజ్ర్

15:1  الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ وَقُرْآنٍ مُّبِينٍ
అలిఫ్‌ లామ్‌ రా. ఇవి దైవగ్రంథపు వాక్యాలు. స్పష్టమైన ఖుర్‌ఆన్‌లోనివి.
15:2  رُّبَمَا يَوَدُّ الَّذِينَ كَفَرُوا لَوْ كَانُوا مُسْلِمِينَ
తాము ముస్లింలమై ఉంటే బావుండేదే! అని అవిశ్వాసులు ఆశపడే సమయం కూడా వస్తుంది.
15:3  ذَرْهُمْ يَأْكُلُوا وَيَتَمَتَّعُوا وَيُلْهِهِمُ الْأَمَلُ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
నువ్వు వాళ్ళను తింటూ, అనుభవిస్తూ, (బూటకపు) ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు. త్వరలోనే (వాస్తవం) స్వయంగా వారికే తెలిసివస్తుంది.
15:4  وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُومٌ
మేము ఏ పట్టణాన్ని తుదముట్టించినా రాసిపెట్టిన ఒక నిర్థారిత గడువు ప్రకారమే తుదముట్టించాము.
15:5  مَّا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ
ఏ సముదాయం కూడా తన నిర్థారిత సమయానికి ముందు గానీ, వెనుకగానీ పోజాలదు.
15:6  وَقَالُوا يَا أَيُّهَا الَّذِي نُزِّلَ عَلَيْهِ الذِّكْرُ إِنَّكَ لَمَجْنُونٌ
"ఓ జిక్ర్‌ (ఖుర్‌ఆన్‌) అవతరించిన మనిషీ! ఖచ్చితంగా నువ్వు పిచ్చివాడివే."
15:7  لَّوْ مَا تَأْتِينَا بِالْمَلَائِكَةِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
"ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే దైవదూతలను మా వద్దకు ఎందుకు తీసుకురావు?" అని వారు అంటారు.
15:8  مَا نُنَزِّلُ الْمَلَائِكَةَ إِلَّا بِالْحَقِّ وَمَا كَانُوا إِذًا مُّنظَرِينَ
సత్యబద్ధత లేకుండా మేము (మా) దూతలను పంపము. ఆ సమయంలో వారికి గడువు ఇవ్వబడదు.
15:9  إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.
15:10  وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي شِيَعِ الْأَوَّلِينَ
మేము నీకు పూర్వం గతించిన సమాజాలలో కూడా ప్రవక్తలను పంపాము.
15:11  وَمَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
అయితే తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వాళ్ళు అతన్ని పరిహసించేవారు.
15:12  كَذَٰلِكَ نَسْلُكُهُ فِي قُلُوبِ الْمُجْرِمِينَ
ఈ విధంగానే మేము అపరాధుల హృదయాల్లోకి దీనిని (అవిశ్వాసాన్ని) పోనిస్తాము.
15:13  لَا يُؤْمِنُونَ بِهِ ۖ وَقَدْ خَلَتْ سُنَّةُ الْأَوَّلِينَ
వారు దానిని విశ్వసించరు. పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది.
15:14  وَلَوْ فَتَحْنَا عَلَيْهِم بَابًا مِّنَ السَّمَاءِ فَظَلُّوا فِيهِ يَعْرُجُونَ
ఒకవేళ మేము వారికోసం ఆకాశద్వారం తెరిచినా, అందులోకి వారు ఎక్కిపోతున్నా సరే,
15:15  لَقَالُوا إِنَّمَا سُكِّرَتْ أَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُورُونَ
"మాకేదో కనికట్టు లాంటిది చేయబడింది. అంతేకాదు, మాకేదో చేతబడి చేయబడింది" అని అంటారు వారు.
15:16  وَلَقَدْ جَعَلْنَا فِي السَّمَاءِ بُرُوجًا وَزَيَّنَّاهَا لِلنَّاظِرِينَ
నిశ్చయంగా మేము ఆకాశంలో బురుజులను నిర్మించాము. చూపరుల కోసం దానిని అందంగా ముస్తాబు చేశాము.
15:17  وَحَفِظْنَاهَا مِن كُلِّ شَيْطَانٍ رَّجِيمٍ
ఇంకా, దానిని ధూత్కారి అయిన ప్రతి షైతాను బారి నుంచి రక్షించాము.
15:18  إِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَأَتْبَعَهُ شِهَابٌ مُّبِينٌ
కాకపోతే దొంగచాటుగా (ఎవడైనా అక్కడి రహస్య విషయాలను) వినటానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాడ్ని వెంటాడుతుంది.
15:19  وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ شَيْءٍ مَّوْزُونٍ
ఇంకా మేము భూమిని పరచి, దానిపై పర్వతాలను పాతి పెట్టాము. మరి అందులో ప్రతి వస్తువునూ నిర్ణీత మోతాదులో మొలిపించాము.
15:20  وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَايِشَ وَمَن لَّسْتُمْ لَهُ بِرَازِقِينَ
అందులోనే మేము మీ జీవనోపాధికి వనరులను సమకూర్చాము ఇంకా మీరు జీవనోపాధి కల్పించని వాటికి కూడా.
15:21  وَإِن مِّن شَيْءٍ إِلَّا عِندَنَا خَزَائِنُهُ وَمَا نُنَزِّلُهُ إِلَّا بِقَدَرٍ مَّعْلُومٍ
అన్నివస్తువుల ఖజానాలు మా వద్దనే ఉన్నాయి. ప్రతి వస్తువునూ మేము తగు మోతాదులో అవతరింపజేస్తాము.
15:22  وَأَرْسَلْنَا الرِّيَاحَ لَوَاقِحَ فَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً فَأَسْقَيْنَاكُمُوهُ وَمَا أَنتُمْ لَهُ بِخَازِنِينَ
మేమే బరువైన గాలులను పంపిస్తున్నాము. మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, దాన్ని మీకు త్రాపిస్తున్నాము. ఈ (జల) నిధిని సమకూర్చుకోవటం అన్నది మీ వల్ల కాని పని.
15:23  وَإِنَّا لَنَحْنُ نُحْيِي وَنُمِيتُ وَنَحْنُ الْوَارِثُونَ
ప్రాణం పోసేదీ, ప్రాణం తీసేది కూడా మేమే. (ఎట్టకేలకు) వారసులం కూడా మేమే.
15:24  وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَقْدِمِينَ مِنكُمْ وَلَقَدْ عَلِمْنَا الْمُسْتَأْخِرِينَ
మీకు పూర్వం సాగిపోయిన వారినీ మేము ఎరుగుదుము. తరువాత వచ్చే వారిని కూడా ఎరుగుదుము.
15:25  وَإِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ
నీ ప్రభువు వారందరినీ సమీకరిస్తాడు. నిశ్చయంగా అతడు మహా వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు.
15:26  وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
మేము మనిషిని కుళ్ళి, బాగా ఎండిన మట్టితో సృష్టించాము.
15:27  وَالْجَانَّ خَلَقْنَاهُ مِن قَبْلُ مِن نَّارِ السَّمُومِ
అంతకు ముందు మేము జిన్నాతులను తీవ్రమైన ఉష్ణ జ్వాలతో సృష్టించాము.
15:28  وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِّن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
"కుళ్ళి, బాగా ఎండిపోయిన (నల్లని) మట్టితో నేను ఒక మానవుణ్ణి సృష్టించబోతున్నాను" అని నీ ప్రభువు దూతలతో అన్నాడు.
15:29  فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ
"నేను అతణ్ణి పూర్తిగా తయారుచేసి, అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి."
15:30  فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ
దూతలందరూ సాష్టాంగపడ్డారు -
15:31  إِلَّا إِبْلِيسَ أَبَىٰ أَن يَكُونَ مَعَ السَّاجِدِينَ
ఒక్క ఇబ్లీసు తప్ప! సాష్టాంగపడే వారితో చేరటానికి వాడు నిరాకరించాడు.
15:32  قَالَ يَا إِبْلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ السَّاجِدِينَ
"ఓ ఇబ్లీస్‌! సాష్టాంగపడేవారితో నువ్వు ఎందుకు చేరలేదు?" అని (అల్లాహ్‌) నిలదీశాడు.
15:33  قَالَ لَمْ أَكُن لِّأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُ مِن صَلْصَالٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
"కుళ్ళి, ఎండిన (నల్లని) మట్టితో నీవు సృష్టించిన మనిషి ముందు నేను మోకరిల్లబోను" అని వాడు (షైతాను తెగేసి) చెప్పాడు.
15:34  قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
"అయితే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో, నువ్వు ధూత్కరించబడ్డావు.
15:35  وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَىٰ يَوْمِ الدِّينِ
ప్రళయదినం వరకూ నీపై నా అభిశాపం ఉంటుంది" అని అల్లాహ్‌ సెలవిచ్చాడు.
15:36  قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
"ప్రభూ! ప్రజలు (మరణానంతరం) తిరిగి లేపబడే రోజు వరకూ నాకు గడువు ఇవ్వు" అని వాడు విన్నవించుకున్నాడు.
15:37  قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
"సరే! నీకు గడువు ఇవ్వబడింది" అని అల్లాహ్‌ సెలవిచ్చాడు.
15:38  إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
"ఆ నిర్ధారిత సమయం వచ్చే రోజు వరకూ" (అన్నాడు).
15:39  قَالَ رَبِّ بِمَا أَغْوَيْتَنِي لَأُزَيِّنَنَّ لَهُمْ فِي الْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
"ఓ ప్రభూ! నీవు నన్నుఅపమార్గం పట్టించినందువల్ల, నేను వారికి (మానవులకు) భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను. వారినందరినీ పెడత్రోవ పట్టిస్తాను" అని ఇబ్లీసు చెప్పాడు.
15:40  إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ
"నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప" (అన్నాడు).
15:41  قَالَ هَٰذَا صِرَاطٌ عَلَيَّ مُسْتَقِيمٌ
(అల్లాహ్‌) ఇలా సెలవిచ్చాడు : ''నన్ను చేరే రుజుమార్గం మాత్రం ఇది.
15:42  إِنَّ عِبَادِي لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَانٌ إِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغَاوِينَ
"నా దాసులపై నీ అధికారం సాగదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది."
15:43  وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ
(అలాంటి) వారందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు నరకం.
15:44  لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ
దానికి ఏడు ద్వారాలు ఉంటాయి. ఒక్కో ద్వారం వారిలోని ఒక్కో వర్గం కోసం కేటాయించబడింది.
15:45  إِنَّ الْمُتَّقِينَ فِي جَنَّاتٍ وَعُيُونٍ
నిశ్చయంగా దైవభక్తిగలవారు ఉద్యానవనాల, సెలయేరుల మధ్యన ఉంటారు.
15:46  ادْخُلُوهَا بِسَلَامٍ آمِنِينَ
ప్రశాంతంగా, నిశ్చింతగా అందులోనికి ప్రవేశించండి (అని వారితో అనబడుతుంది).
15:47  وَنَزَعْنَا مَا فِي صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَانًا عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
వారి హృదయాలలో ఏ కాస్త కోపం, ద్వేషం మిగిలివున్నా దాన్ని మేము తొలగిస్తాము. వారంతా అన్నదమ్ములై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చుని ఉంటారు.
15:48  لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ
అక్కడ వారికి ఏ బాధా అంటుకోదు. అక్కణ్ణుంచి వారిని ఎన్నటికీ వెళ్ళగొట్టడం కూడా జరగదు.
15:49  نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ
(ఓ ప్రవక్తా!) నేను అమితంగా క్షమించేవాడిననీ, అపారంగా కరుణించేవాడిననీ, నా దాసులకు తెలియజేయి.
15:50  وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ
అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని (చెప్పు).
15:51  وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَاهِيمَ
వారికి ఇబ్రాహీమ్‌ అతిథుల గురించి (కూడా) వినిపించు.
15:52  إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ
వారు అతని దగ్గరకు వచ్చి 'సలామ్‌' చెప్పినప్పుడు" మిమ్మల్ని చూస్తే మాకెందుకో భయమేస్తున్నది" అని అతను అన్నాడు.
15:53  قَالُوا لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ عَلِيمٍ
"భయపడకు. మేము నీకు జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడతాడన్న శుభవార్తను అందజేస్తున్నాము" అని వారన్నారు.
15:54  قَالَ أَبَشَّرْتُمُونِي عَلَىٰ أَن مَّسَّنِيَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ
"ఏమిటీ, వృద్ధాప్యం వచ్చేసిన తరువాత మీరు నాకు ఈ శుభవార్త వినిపిస్తున్నారా? ఈ శుభవార్తను అసలు మీరు ఎలా వినిపిస్తున్నారు?" అని అతను అన్నాడు.
15:55  قَالُوا بَشَّرْنَاكَ بِالْحَقِّ فَلَا تَكُن مِّنَ الْقَانِطِينَ
దానికి వారు, "మేము నిజమైన శుభవార్తనే నీకు అందజేస్తున్నాము. కాబట్టి నువ్వు నిరాశచెందిన వారిలో చేరకు" అని సమాధానమిచ్చారు.
15:56  قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِ إِلَّا الضَّالُّونَ
"మార్గభ్రష్టులు మాత్రమే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు" అని అతను (ఇబ్రాహీము) అన్నాడు.
15:57  قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ
(ఆ తరువాత ఇబ్రాహీం వారినుద్దేశించి) "ఓ అల్లాహ్‌ తరఫున పంపబడినవారలారా! ఇంతకీ మీరు వచ్చిన పనేమిటి? అని ప్రశ్నించాడు.
15:58  قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
వారు ఇలా సమాధానమిచ్చారు:" మేమొక నేరస్థుల మూక వైపు పంపబడ్డాము.
15:59  إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ
"అయితే లూత్‌ కుటుంబీకులందరినీ మేము కాపాడుతాము-
15:60  إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا ۙ إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ
"ఒక్క అతని (లూత్‌) భార్యను తప్ప! ఆమె (కూడా) వెనుక ఉండిపోయేవారిలో చేరిపోతుందని మేము నిర్థారించాము."
15:61  فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ
పంపబడిన దూతలు లూత్‌ ఇంటివారల వద్దకు వచ్చినప్పుడు,
15:62  قَالَ إِنَّكُمْ قَوْمٌ مُّنكَرُونَ
"మీరు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే!" అని అతను (లూత్‌) అన్నాడు.
15:63  قَالُوا بَلْ جِئْنَاكَ بِمَا كَانُوا فِيهِ يَمْتَرُونَ
"కాదు, కాని వీళ్లు ఏ విషయంలో అనుమానానికి లోనై ఉన్నారో దాన్ని మేము నీ దగ్గరకు తీసుకువచ్చాము.
15:64  وَأَتَيْنَاكَ بِالْحَقِّ وَإِنَّا لَصَادِقُونَ
"మేము నీ వద్దకు (స్పష్టమైన) సత్యాన్ని తెచ్చాము. మేము చెప్పేది నిజం.
15:65  فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ اللَّيْلِ وَاتَّبِعْ أَدْبَارَهُمْ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ وَامْضُوا حَيْثُ تُؤْمَرُونَ
"నువ్వు నీ కుటుంబ సమేతంగా ఈ రాత్రికి రాత్రే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నువ్వు మాత్రం వీళ్ళ వెనుక ఉండాలి. (జాగ్రత్త!) మీలో ఎవరూ వెనుతిరిగి కూడా చూడకూడదు. మీకు ఆదేశించబడిన వైపుకు వెళ్ళిపోండి" అని వారు చెప్పారు.
15:66  وَقَضَيْنَا إِلَيْهِ ذَٰلِكَ الْأَمْرَ أَنَّ دَابِرَ هَٰؤُلَاءِ مَقْطُوعٌ مُّصْبِحِينَ
(ఈ విధంగా) తెలతెలవారుతుండగా వారు సమూలంగా త్రుంచి వేయబడతారన్న మా నిర్ణయాన్ని మేము అతనికి తెలియజేశాము.
15:67  وَجَاءَ أَهْلُ الْمَدِينَةِ يَسْتَبْشِرُونَ
నగరవాసులు మహా సంబరపడుతూ (లూత్‌ ఇంటికి) వచ్చారు.
15:68  قَالَ إِنَّ هَٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ
"వీళ్ళు నా అతిథులు. మీరు (వీళ్ళ ముందు) నా పరువు తీయకండి" అని (లూత్‌) అన్నాడు.
15:69  وَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ
"అల్లాహ్‌కు భయపడండి. నన్ను అవమానపరచకండి" (అని అన్నాడు).
15:70  قَالُوا أَوَلَمْ نَنْهَكَ عَنِ الْعَالَمِينَ
"ఏమిటీ, లోకంలోని జనులందరినీ వెనకేసుకు రావద్దని మేము నిన్ను వారించలేదా?" అని వారంతా అన్నారు.
15:71  قَالَ هَٰؤُلَاءِ بَنَاتِي إِن كُنتُمْ فَاعِلِينَ
"మీకు అంతగా కావాలనుకుంటే, ఇదిగో నా ఈ కూతుళ్ళు ఉన్నారు" అని (లూత్‌) ప్రాధేయపడ్డాడు.
15:72  لَعَمْرُكَ إِنَّهُمْ لَفِي سَكْرَتِهِمْ يَعْمَهُونَ
(ఓ ముహమ్మద్‌!) నీ ఆయుష్షు సాక్షిగా! వారు తమ (ముదనష్టపు) కైపులో గుడ్డివారయి పోయారు.
15:73  فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ
సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది.
15:74  فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసివేశాము. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము.
15:75  إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ
నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
15:76  وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ
ఈ పట్టణం (జనులు) వచ్చేపోయే రహదారిపైనే ఉంది.
15:77  إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ
విశ్వసించిన వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది.
15:78  وَإِن كَانَ أَصْحَابُ الْأَيْكَةِ لَظَالِمِينَ
అయ్‌కా వారు (అడవి జనులు) కూడా దుర్మార్గులే.
15:79  فَانتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ
(ఆఖరికి) వారికి కూడా మేము ప్రతీకారం చేశాం. ఈ రెండు పట్టణాలు కూడా ప్రధాన రహదారి మీదే ఉన్నాయి.
15:80  وَلَقَدْ كَذَّبَ أَصْحَابُ الْحِجْرِ الْمُرْسَلِينَ
హిజ్ర్‌ వారు కూడా ప్రవక్తలను ధిక్కరించారు.
15:81  وَآتَيْنَاهُمْ آيَاتِنَا فَكَانُوا عَنْهَا مُعْرِضِينَ
(మరి చూడబోతే) మేము వారికి మా సూచనలను కూడా వొసగాము. అయినప్పటికీ వారు వాటి పట్ల విముఖతే చూపుతూ వచ్చారు.
15:82  وَكَانُوا يَنْحِتُونَ مِنَ الْجِبَالِ بُيُوتًا آمِنِينَ
వారు నిర్భయంగా పర్వతాలను తొలచి ఇండ్లు నిర్మించేవారు.
15:83  فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُصْبِحِينَ
ఆఖరికి వారిపై కూడా తెల తెలవారుతుండగా ఒక కేక విరుచుకుపడింది.
15:84  فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ
అంతే! వారి సంపాదన వారికి ఏమాత్రం పనికిరాకుండా పోయింది.
15:85  وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ ۗ وَإِنَّ السَّاعَةَ لَآتِيَةٌ ۖ فَاصْفَحِ الصَّفْحَ الْجَمِيلَ
మేము ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్త వస్తువులనూ సత్యబద్ధంగానే సృష్టించాము. ప్రళయ ఘడియ రావటం తథ్యం. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు హుందాగా (వారిని) మన్నిస్తూ ఉండు.
15:86  إِنَّ رَبَّكَ هُوَ الْخَلَّاقُ الْعَلِيمُ
నిశ్చయంగా నీ ప్రభువే (సర్వాన్నీ) సృష్టించినవాడు, (సర్వమూ) తెలిసినవాడు.
15:87  وَلَقَدْ آتَيْنَاكَ سَبْعًا مِّنَ الْمَثَانِي وَالْقُرْآنَ الْعَظِيمَ
మేము నీకు ఏడు ఆయతులను ఇచ్చి ఉన్నాము. అవి పదే పదే పునరావృతం అవుతుంటాయి. ఇంకా మహోన్నతమైన ఖుర్‌ఆన్‌ను నీకు ప్రసాదించాము.
15:88  لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَاخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ
వారిలోని పలు వర్గాల వారికి మేము ఇచ్చిన ప్రాపంచిక సంపద వైపుకు నువ్వు ఆబగా చూడకు. వారి స్థితిపై దిగులు చెందకు. విశ్వాసుల కోసం నీ (వాత్సల్య భరిత) రెక్కలను వంచిపెట్టు.
15:89  وَقُلْ إِنِّي أَنَا النَّذِيرُ الْمُبِينُ
"నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే" అని వారికి చెప్పు.
15:90  كَمَا أَنزَلْنَا عَلَى الْمُقْتَسِمِينَ
ఆ విభజనకారులపై మేము పంపినటువంటిదే (ఇది).
15:91  الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ
వారు ఈ దైవగ్రంథాన్ని ముక్క చెక్కలుగా చేశారు.
15:92  فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ
నీ ప్రభువు సాక్షిగా! మేము వారందరినీ తప్పకుండా నిలదీసి అడుగుతాము,
15:93  عَمَّا كَانُوا يَعْمَلُونَ
వారు చేస్తూ ఉండిన పనుల గురించి.
15:94  فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
కాబట్టి (ఓ ప్రవక్తా!) నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమరచి చెప్పు. బహుదైవారాధకులను (ముష్రిక్కులను) పట్టించుకోకు.
15:95  إِنَّا كَفَيْنَاكَ الْمُسْتَهْزِئِينَ
నిన్ను పరిహసించే వారి సంగతి చూసుకోవటానికి మేము చాలు.
15:96  الَّذِينَ يَجْعَلُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ ۚ فَسَوْفَ يَعْلَمُونَ
వారు అల్లాహ్‌తో పాటు వేరే ఆరాధ్యుడిని నిలబెడుతున్నారు. త్వరలోనే (యదార్థం) వారికి తెలిసిపోతుంది.
15:97  وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ
వారి మాటల వల్ల నీకు మనస్తాపం కలుగుతుందన్నసంగతి మాకు బాగా తెలుసు.
15:98  فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُن مِّنَ السَّاجِدِينَ
అందుకే నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన్ని స్తుతిస్తూ ఉండు. సాష్టాంగపడేవారిలో చేరిపో.
15:99  وَاعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ الْيَقِينُ
నిశ్చయమైనది (అనగా మరణం) వచ్చేవరకూ నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.