aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

13. సూరా ఆర్ రాద్

13:1  المر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ ۗ وَالَّذِي أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
అలిఫ్‌ - లామ్‌ - మీమ్‌ - రా. ఇవి ఖుర్‌ఆన్‌ గ్రంథ వాక్యాలు. నీ ప్రభువు తరఫునుంచి నీపై అవతరింపజేయబడేదంతా పరమ సత్యం. కాని చాలా మంది విశ్వసించరు.
13:2  اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا ۖ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ يُدَبِّرُ الْأَمْرَ يُفَصِّلُ الْآيَاتِ لَعَلَّكُم بِلِقَاءِ رَبِّكُمْ تُوقِنُونَ
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్‌. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్‌ (సింహాసనం) పై ఆసీనుడయ్యాడు. సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే - ప్రతి ఒక్కటీ నిర్థారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే. మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తున్నాడు.
13:3  وَهُوَ الَّذِي مَدَّ الْأَرْضَ وَجَعَلَ فِيهَا رَوَاسِيَ وَأَنْهَارًا ۖ وَمِن كُلِّ الثَّمَرَاتِ جَعَلَ فِيهَا زَوْجَيْنِ اثْنَيْنِ ۖ يُغْشِي اللَّيْلَ النَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ
ఆయనే భూమిని విశాలంగా పరచి అందులో పర్వతాలను, నదీనదాలను సృష్టించాడు. ఇంకా అందులో అన్నిరకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పేస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో పలు నిదర్శనాలున్నాయి.
13:4  وَفِي الْأَرْضِ قِطَعٌ مُّتَجَاوِرَاتٌ وَجَنَّاتٌ مِّنْ أَعْنَابٍ وَزَرْعٌ وَنَخِيلٌ صِنْوَانٌ وَغَيْرُ صِنْوَانٍ يُسْقَىٰ بِمَاءٍ وَاحِدٍ وَنُفَضِّلُ بَعْضَهَا عَلَىٰ بَعْضٍ فِي الْأُكُلِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
భూమిలో అనేక (రకాల) నేలలు ఒక దానికొకటి ఆనుకుని ఉన్నాయి. (అందులో) ద్రాక్ష తోటలూ ఉన్నాయి, పంటపొలాలూ ఉన్నాయి. ఖర్జూరపు చెట్లూ ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా, మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వాటన్నింటికీ ఒకే నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరోదానిపై శ్రేష్ఠతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
13:5  وَإِن تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ أَإِذَا كُنَّا تُرَابًا أَإِنَّا لَفِي خَلْقٍ جَدِيدٍ ۗ أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ وَأُولَٰئِكَ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే; "ఏమిటీ, మేము (మరణించి) మట్టి అయిపోయిన తరువాత మళ్లీ క్రొత్తగా పుట్టించబడతామా?!" అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. పట్టాలు వేయబడేది వీరి మెడలలోనే. నరకవాసులు కూడా వారే. అందులో వారు కలకాలం ఉంటారు.
13:6  وَيَسْتَعْجِلُونَكَ بِالسَّيِّئَةِ قَبْلَ الْحَسَنَةِ وَقَدْ خَلَتْ مِن قَبْلِهِمُ الْمَثُلَاتُ ۗ وَإِنَّ رَبَّكَ لَذُو مَغْفِرَةٍ لِّلنَّاسِ عَلَىٰ ظُلْمِهِمْ ۖ وَإِنَّ رَبَّكَ لَشَدِيدُ الْعِقَابِ
మేలుకు ముందే వారు కీడు కోసం నిన్ను తొందరపెడుతున్నారు కదూ! వారికి పూర్వం అలాంటి ఉదాహరణలు (శిక్షలు) గడచి ఉన్నాయి. నిశ్చయంగా ప్రజలు దుర్మార్గాలకు పాల్పడిన తరువాత కూడా నీ ప్రభువు వారిపట్ల క్షమాశీలుడుగా ఉంటాడు. అయితే నీ ప్రభువు శిక్షించే విషయంలో కూడా మహా కఠినుడు సుమా!
13:7  وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۗ إِنَّمَا أَنتَ مُنذِرٌ ۖ وَلِكُلِّ قَوْمٍ هَادٍ
''అతనిపై అతని ప్రభువు తరఫున ఏదైనా సూచన (మహిమ)ఎందుకు అవతరించలేదు?''అని అవిశ్వాసులు అంటున్నారు. (ఓ ప్రవక్తా!) వాస్తవానికి నువ్వు వారిని హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతికీ మార్గదర్శకుడంటూ ఒకడున్నాడు.
13:8  اللَّهُ يَعْلَمُ مَا تَحْمِلُ كُلُّ أُنثَىٰ وَمَا تَغِيضُ الْأَرْحَامُ وَمَا تَزْدَادُ ۖ وَكُلُّ شَيْءٍ عِندَهُ بِمِقْدَارٍ
ప్రతి స్త్రీ తన గర్భంలో మోసే దానిని గురించి, గర్భం తరగటం, పెరగటం గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. ప్రతి వస్తువుకూ ఆయన వద్ద ఒక పరిమాణం నిర్ధారితమై ఉంది.
13:9  عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ الْكَبِيرُ الْمُتَعَالِ
ఆయన గోప్యంగా ఉన్నదానినీ, బహిర్గతమై ఉన్నదానినీ ఎరిగినవాడు, అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు.
13:10  سَوَاءٌ مِّنكُم مَّنْ أَسَرَّ الْقَوْلَ وَمَن جَهَرَ بِهِ وَمَنْ هُوَ مُسْتَخْفٍ بِاللَّيْلِ وَسَارِبٌ بِالنَّهَارِ
మీలో ఎవరయినాసరే తమ మాటను మెల్లిగా చెప్పినా, బిగ్గరగా చెప్పినా, ఎవరయినా రాత్రిపూట దాక్కున్నా, పగటిపూట సంచరిస్తున్నా - అల్లాహ్‌కు మాత్రం వారంతా సమానమే.
13:11  لَهُ مُعَقِّبَاتٌ مِّن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ يَحْفَظُونَهُ مِنْ أَمْرِ اللَّهِ ۗ إِنَّ اللَّهَ لَا يُغَيِّرُ مَا بِقَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنفُسِهِمْ ۗ وَإِذَا أَرَادَ اللَّهُ بِقَوْمٍ سُوءًا فَلَا مَرَدَّ لَهُ ۚ وَمَا لَهُم مِّن دُونِهِ مِن وَالٍ
మనిషికి ముందూ వెనుకా (ఆయన నియమించిన) కావలి వాళ్ళు అంటి ఉన్నారు. వారు దైవాజ్ఞానుసారం అతన్ని కనిపెట్టుకుని ఉంటారు. ఏ జాతి అయినా సరే స్వయంగా తన మనోమయ స్థితిని మార్చుకోనంతవరకూ అల్లాహ్‌ కూడా దాని స్థితిని మార్చడు . అల్లాహ్‌ ఏ జాతినయినా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. ఆయన తప్ప వారిని రక్షించే వారు కూడా ఎవరూ ఉండరు.
13:12  هُوَ الَّذِي يُرِيكُمُ الْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنشِئُ السَّحَابَ الثِّقَالَ
ఆయనే మీకు మెరుపులను చూపిస్తున్నాడు. వాటివల్ల మీకు భయం కలగటంతోపాటు, మీలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఇంకా (ఆయనే) బరువైన మబ్బులను సృజిస్తున్నాడు.
13:13  وَيُسَبِّحُ الرَّعْدُ بِحَمْدِهِ وَالْمَلَائِكَةُ مِنْ خِيفَتِهِ وَيُرْسِلُ الصَّوَاعِقَ فَيُصِيبُ بِهَا مَن يَشَاءُ وَهُمْ يُجَادِلُونَ فِي اللَّهِ وَهُوَ شَدِيدُ الْمِحَالِ
ఉరుము సయితం ఆయన పవిత్రతను కొనియాడుతోంది, ఆయన్ని ప్రశంసిస్తోంది. దూతలు కూడా ఆయన భీతివల్ల ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయనే పిడుగులను పంపి, తాను కోరినవారిపై పడవేస్తున్నాడు. అవిశ్వాసులు అల్లాహ్‌ విషయంలో పిడి వాదానికి దిగుతున్నారు! ఆయన మహా శక్తిమంతుడు!
13:14  لَهُ دَعْوَةُ الْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَسْتَجِيبُونَ لَهُم بِشَيْءٍ إِلَّا كَبَاسِطِ كَفَّيْهِ إِلَى الْمَاءِ لِيَبْلُغَ فَاهُ وَمَا هُوَ بِبَالِغِهِ ۚ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
ఆయన్ని (అల్లాహ్‌ను) వేడుకోవటమే సత్యం. ఆయన్ని వదలి వారు వేడుకుంటున్న వారంతా వారి ప్రార్థనలకు ఏ సమాధానమూ ఇవ్వలేరు. ఒక వ్యక్తి తన రెండు చేతులనూ నీళ్ళ వైపుకు చాచి, ఆ నీరు తన నోటిలోనికి వచ్చి పడాలని అనుకుంటే అది అతని నోటిలోనికి రాదు. (అల్లాహ్‌ను కాదని చిల్లర దేవుళ్లను పిలిచేవారి) ఈ పిలుపు కూడా అంతే. ఈ అవిశ్వాసుల ప్రార్థనలన్నీ అధర్మమైనవే.
13:15  وَلِلَّهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ ۩
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సృష్టితాలన్నీ - తమకు ఇష్టమున్నా, లేకపోయినా - అల్లాహ్‌కు సాష్టాంగపడుతున్నాయి. వాటి నీడలు సయితం ఉదయం సాయంత్రం (ఆయనకే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి).
13:16  قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ أَمْ هَلْ تَسْتَوِي الظُّلُمَاتُ وَالنُّورُ ۗ أَمْ جَعَلُوا لِلَّهِ شُرَكَاءَ خَلَقُوا كَخَلْقِهِ فَتَشَابَهَ الْخَلْقُ عَلَيْهِمْ ۚ قُلِ اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ الْوَاحِدُ الْقَهَّارُ
"భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" అని వారిని అడుగు. "అల్లాహ్‌యే" అని వారికి చెప్పు. "అయినప్పటికీ మీరు ఆయన్ని కాదని, తమ స్వయానికి సయితం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చలేని వారిని మీ రక్షకులుగా చేసుకుంటున్నారా?" అని వారిని అడుగు. "గుడ్డివాడూ - చూడగలిగేవాడు సమానులు కాగలరా? అంధకారాలూ - వెలుగూ ఒకటి కాగలవా? పోనీ, వారి దృష్టిలో 'సృష్టి' అనేది సందేహాస్పదం కావటానికి, వారు అల్లాహ్‌కు భాగస్వాములుగా చేర్చినవారుగాని అల్లాహ్‌ మాదిరిగా దేన్నయినా సృష్టించారా?" అని కూడా వారిని అడుగు. "అల్లాహ్‌యే అన్నింటినీ సృష్టించినవాడు. ఆయన ఒక్కడే. ఆయన సర్వాధిక్యుడు" అని వారికి స్పష్టంగా చెప్పు.
13:17  أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَسَالَتْ أَوْدِيَةٌ بِقَدَرِهَا فَاحْتَمَلَ السَّيْلُ زَبَدًا رَّابِيًا ۚ وَمِمَّا يُوقِدُونَ عَلَيْهِ فِي النَّارِ ابْتِغَاءَ حِلْيَةٍ أَوْ مَتَاعٍ زَبَدٌ مِّثْلُهُ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ الْحَقَّ وَالْبَاطِلَ ۚ فَأَمَّا الزَّبَدُ فَيَذْهَبُ جُفَاءً ۖ وَأَمَّا مَا يَنفَعُ النَّاسَ فَيَمْكُثُ فِي الْأَرْضِ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ الْأَمْثَالَ
ఆయనే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. ప్రతి నదీ, ప్రతి కాలువా తన వైశాల్యాన్నిబట్టి ఆ నీటిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ళ ఉపరితలంపైకి నురుగు కూడా వచ్చింది. నగల తయారీ కోసం, సామానుల కోసం అగ్నిలో కాల్చే వాటిపై (లోహాలపై) కూడా (ఈ విధమైన) నురుగే వస్తుంది. ఈ విధంగా అల్లాహ్‌ సత్యాసత్యాల ఉదాహరణను స్పష్టపరుస్తున్నాడు. కడకు నురుగంతా పనికి రాకుండా (ఎగిరి) పోతుంది. ప్రజలకు ఉపయోగపడే వస్తువు మాత్రం భూమిలో మిగిలి ఉంటుంది. ఈ విధంగా అల్లాహ్‌ ఉదాహరణల ద్వారా (విషయాన్ని) వివరిస్తున్నాడు.
13:18  لِلَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمُ الْحُسْنَىٰ ۚ وَالَّذِينَ لَمْ يَسْتَجِيبُوا لَهُ لَوْ أَنَّ لَهُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ ۚ أُولَٰئِكَ لَهُمْ سُوءُ الْحِسَابِ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمِهَادُ
తమ ప్రభువు ఆజ్ఞను పాటించేవారి కొరకు మేలు ఉంది. ఆయన ఆజ్ఞను పాటించనివారు భూమిలో ఉన్న సమస్త సంపదకు యజమానులైనా, అంతకు మరింత సంపద కూడా వారికి ఉన్నా, దాన్నంతటినీ తమకు (విధించబడే శిక్షకు) బదులుగా ఇవ్వటానికి సిద్ధమవుతారు. చెడ్డ (కఠినమైన) లెక్క తీసుకోబడేది వారి నుంచే. నరకం వారి నివాసమవుతుంది. అది బహుచెడ్డ స్థలం.
13:19  أَفَمَن يَعْلَمُ أَنَّمَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ الْحَقُّ كَمَنْ هُوَ أَعْمَىٰ ۚ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ
ఏమిటీ, నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది నిలువెల్లా సత్యమని తెలుసుకున్న వాడునూ, గుడ్డివాడు ఒక్కటే అవుతారా? విజ్ఞులు మాత్రమే హితబోధను గ్రహిస్తారు.
13:20  الَّذِينَ يُوفُونَ بِعَهْدِ اللَّهِ وَلَا يَنقُضُونَ الْمِيثَاقَ
(వారి గుణగణాలు ఇవి:) వారు అల్లాహ్‌కు ఇచ్చిన మాటను నిలుపుకుంటారు. చేసుకున్న ఒప్పందాన్ని భంగపరచరు.
13:21  وَالَّذِينَ يَصِلُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَن يُوصَلَ وَيَخْشَوْنَ رَبَّهُمْ وَيَخَافُونَ سُوءَ الْحِسَابِ
వేటినయితే కలిపి ఉంచమని అల్లాహ్‌ ఆదేశించాడో వాటిని కలిపి ఉంచుతారు. వారు తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమోనని జడుస్తూ ఉంటారు.
13:22  وَالَّذِينَ صَبَرُوا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِمْ وَأَقَامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً وَيَدْرَءُونَ بِالْحَسَنَةِ السَّيِّئَةَ أُولَٰئِكَ لَهُمْ عُقْبَى الدَّارِ
వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు. నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుపెడతారు. చెడును సయితం మంచితనంతో పారద్రోలుతారు. అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కొరకే.
13:23  جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۖ وَالْمَلَائِكَةُ يَدْخُلُونَ عَلَيْهِم مِّن كُلِّ بَابٍ
శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యాబిడ్డలలో సజ్జనులైనవారు కూడా (వారితోపాటే స్వర్గానికి వెళతారు). దైవదూతలు అన్ని ద్వారాల నుండి వారివద్దకు వస్తారు.
13:24  سَلَامٌ عَلَيْكُم بِمَا صَبَرْتُمْ ۚ فَنِعْمَ عُقْبَى الدَّارِ
"మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక! (మీకు లభించిన) ఈ అంతిమ గృహం ఎంత మంచిది!" అని వారు అంటారు.
13:25  وَالَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۙ أُولَٰئِكَ لَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ
మరెవరయితే అల్లాహ్‌తో చేసుకున్న ఒడంబడికను దృఢపరచిన తరువాత భంగపరుస్తారో, ఇంకా అల్లాహ్‌ కలపమని ఆజ్ఞాపించిన వాటిని త్రెంచేస్తారో, భూమిలో అలజడిని సృష్టిస్తారో వారే శాపానికి అర్హులు. వారికోసం బహుచెడ్డ నిలయం ఉంది.
13:26  اللَّهُ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ وَيَقْدِرُ ۚ وَفَرِحُوا بِالْحَيَاةِ الدُّنْيَا وَمَا الْحَيَاةُ الدُّنْيَا فِي الْآخِرَةِ إِلَّا مَتَاعٌ
అల్లాహ్‌ తాను కోరినవారి ఉపాధిని పెంచుతాడు, తాను కోరిన వారికి తగ్గిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలోనే పూర్తిగా లీనమైపోయారు. యదార్థానికి పరలోకం ముందు ప్రాపంచిక జీవితం అత్యంత (అల్పమైన) సామగ్రి మాత్రమే.
13:27  وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۗ قُلْ إِنَّ اللَّهَ يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي إِلَيْهِ مَنْ أَنَابَ
"అతనిపై (ముహమ్మద్‌పై) అతని ప్రభువు తరఫు నుంచి ఏదైనా మహిమ ఎందుకు అవతరించదు?" అని అవిశ్వాసులు అంటున్నారు. "అల్లాహ్‌ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు, తన వైపుకు మరలేవారికి ఆయన సన్మార్గం చూపుతాడు" అని వారికి చెప్పు.
13:28  الَّذِينَ آمَنُوا وَتَطْمَئِنُّ قُلُوبُهُم بِذِكْرِ اللَّهِ ۗ أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ
విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్‌ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి! అల్లాహ్‌ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి.
13:29  الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ طُوبَىٰ لَهُمْ وَحُسْنُ مَآبٍ
విశ్వసించి, మంచిపనులు చేసినవారు సౌభాగ్యవంతులు. వారి కొరకు మంచి నివాసం ఉంటుంది.
13:30  كَذَٰلِكَ أَرْسَلْنَاكَ فِي أُمَّةٍ قَدْ خَلَتْ مِن قَبْلِهَا أُمَمٌ لِّتَتْلُوَ عَلَيْهِمُ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَهُمْ يَكْفُرُونَ بِالرَّحْمَٰنِ ۚ قُلْ هُوَ رَبِّي لَا إِلَٰهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ مَتَابِ
(ఓ ముహమ్మద్‌!) అదే విధంగా మేము నిన్ను ఈ సమాజంలోకి పంపాము - ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి - మా తరఫున నీపై అవతరించిన వాణిని నువ్వు వారికి చదివి వినిపించటానికి. కరుణామయుడైన అల్లాహ్‌ను వారు తిరస్కరిస్తున్నారు. వారికి చెప్పు: "ఆయనే నా పోషకుడు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కానేకారు. నేను ఆయన్నే నమ్ముకున్నాను - ఆయన వైపుకే నేను మరలుతున్నాను."
13:31  وَلَوْ أَنَّ قُرْآنًا سُيِّرَتْ بِهِ الْجِبَالُ أَوْ قُطِّعَتْ بِهِ الْأَرْضُ أَوْ كُلِّمَ بِهِ الْمَوْتَىٰ ۗ بَل لِّلَّهِ الْأَمْرُ جَمِيعًا ۗ أَفَلَمْ يَيْأَسِ الَّذِينَ آمَنُوا أَن لَّوْ يَشَاءُ اللَّهُ لَهَدَى النَّاسَ جَمِيعًا ۗ وَلَا يَزَالُ الَّذِينَ كَفَرُوا تُصِيبُهُم بِمَا صَنَعُوا قَارِعَةٌ أَوْ تَحُلُّ قَرِيبًا مِّن دَارِهِمْ حَتَّىٰ يَأْتِيَ وَعْدُ اللَّهِ ۚ إِنَّ اللَّهَ لَا يُخْلِفُ الْمِيعَادَ
ఒకవేళ ఏదైనా(ఆకాశగ్రంథమైన)ఖుర్‌ఆన్‌ ద్వారా పర్వతాలు నడిపింపబడినా, భూమి బ్రద్దలు కొట్టబడినా, లేదా శవాల చేత మాట్లాడించినా (వీళ్లు మాత్రం విశ్వసించేవారు కారు) - వాస్తవానికి ఈ పనులన్నీ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్‌ గనక తలచుకుంటే సమస్త మానవాళినీ సన్మార్గంపైకి తేగలడు. విశ్వాసుల మనసు కుదుటపడటానికి ఈ ఒక్క విషయం సరిపోదా? అవిశ్వాసులకు వారి అవిశ్వాస పోకడల ఫలితంగా ఎల్లప్పుడూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది లేదా వారి ఇళ్లకు సమీపంలోనే అది వచ్చిపడుతూ ఉంటుంది. అల్లాహ్‌ వాగ్దానం నెరవేరే వరకూ ఈ స్థితి నెలకొనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్‌ వాగ్దానానికి వ్యతిరేకంగా చేయడు.
13:32  وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَأَمْلَيْتُ لِلَّذِينَ كَفَرُوا ثُمَّ أَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి నేను కూడా అవిశ్వాసులకు (కొంత) విడుపు ఇచ్చాను. ఆ తరువాత (అకస్మాత్తుగా) పట్టుకున్నాను. అప్పుడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉందో(చూశారా!)
13:33  أَفَمَنْ هُوَ قَائِمٌ عَلَىٰ كُلِّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۗ وَجَعَلُوا لِلَّهِ شُرَكَاءَ قُلْ سَمُّوهُمْ ۚ أَمْ تُنَبِّئُونَهُ بِمَا لَا يَعْلَمُ فِي الْأَرْضِ أَم بِظَاهِرٍ مِّنَ الْقَوْلِ ۗ بَلْ زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا مَكْرُهُمْ وَصُدُّوا عَنِ السَّبِيلِ ۗ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
ఏమిటీ, ఒక్కొక్క ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షిస్తున్నటువంటి అల్లాహ్‌కా వీళ్లు సహవర్తుల్ని కల్పించేది? వారిని అడుగు: "కాస్త వారి పేర్లయినా చెప్పండి! ఏమిటీ, భూమిలో అల్లాహ్‌కే తెలియని విషయాలు మీరు ఆయనకు తెలియపరుస్తున్నారా? లేక పై పై మాటలు చెబుతున్నారా? అసలు విషయం ఏమిటంటే తిరస్కార వైఖరిపై మొండికేసిన వారికి, వారి కుతంత్రాలు అందంగా (కానవచ్చేలా) చేయబడ్డాయి. వారు సన్మార్గం నుంచి ఆపివేయబడ్డారు. అల్లాహ్‌ అపమార్గానికి లోనుచేసినవారిని ఎవరూ సన్మార్గానికి తేలేరు.
13:34  لَّهُمْ عَذَابٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَشَقُّ ۖ وَمَا لَهُم مِّنَ اللَّهِ مِن وَاقٍ
అలాంటి వారికి ప్రాపంచిక జీవితంలోనూ శిక్ష ఉంది. ఇక పరలోక శిక్ష అయితే ఇంతకంటే ఎంతో కఠినమైనది. అల్లాహ్‌ ఆగ్రహం నుంచి వాళ్ళను కాపాడే వాడెవడూ ఉండడు.
13:35  مَّثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ أُكُلُهَا دَائِمٌ وَظِلُّهَا ۚ تِلْكَ عُقْبَى الَّذِينَ اتَّقَوا ۖ وَّعُقْبَى الْكَافِرِينَ النَّارُ
(అల్లాహ్‌ పట్ల) భయభక్తులు కలిగివుండే వారికి వాగ్దానం చేయబడిన స్వర్గం ఇలా ఉంటుంది : దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి. దాని నీడ కూడా శాశ్వితమైనది. భయభక్తులు కలవారి అంతిమ పరిణామం ఇది. కాగా; తిరస్కారుల అంతిమ పరిణామం నరకం.
13:36  وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَفْرَحُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ ۖ وَمِنَ الْأَحْزَابِ مَن يُنكِرُ بَعْضَهُ ۚ قُلْ إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّهَ وَلَا أُشْرِكَ بِهِ ۚ إِلَيْهِ أَدْعُو وَإِلَيْهِ مَآبِ
(ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చి ఉన్నామో వారు, నీపై అవతరింపజేయబడే దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు. ఇతర వర్గాలవారు ఇందులోని కొన్ని భాగాలను తిరస్కరిస్తున్నారు. "నేను అల్లాహ్‌ను ఆరాధించాలనీ, ఆయనకు భాగస్వామ్యం కల్పించరాదని మాత్రమే నాకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆయన వైపుకే నేను పిలుపు ఇస్తున్నాను. ఆయన వైపే నేను మరలుతున్నాను" అని నువ్వు వారికి చెప్పేయి.
13:37  وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ حُكْمًا عَرَبِيًّا ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم بَعْدَمَا جَاءَكَ مِنَ الْعِلْمِ مَا لَكَ مِنَ اللَّهِ مِن وَلِيٍّ وَلَا وَاقٍ
ఇదే విధంగా మేము ఈ ఖుర్‌ఆన్‌ను అరబీ భాషలో(ఉన్న) ఉత్తర్వుగా పంపాము. జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా నువ్వు గనక వారి కోరికలను అనుసరించావంటే అల్లాహ్‌ (శిక్ష) నుండి నీకు సహాయపడేవాడు గాని, నిన్ను రక్షించేవాడు గాని ఎవడూ ఉండడు.
13:38  وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ وَجَعَلْنَا لَهُمْ أَزْوَاجًا وَذُرِّيَّةً ۚ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۗ لِكُلِّ أَجَلٍ كِتَابٌ
నీకు పూర్వం కూడా మేము చాలా మంది ప్రవక్తలను పంపి ఉన్నాము. మేము వారిని భార్యాబిడ్డలు కలవారుగానే చేశాము. అల్లాహ్‌ అనుజ్ఞ లేకుండా ఏ నిదర్శనాన్నయినా తీసుకురావటమనేది ఏ ప్రవక్త వల్ల కూడా కాని పని. ప్రతి నిర్థారిత వాగ్దానం లిఖితమై ఉంది.
13:39  يَمْحُو اللَّهُ مَا يَشَاءُ وَيُثْبِتُ ۖ وَعِندَهُ أُمُّ الْكِتَابِ
అల్లాహ్‌ తాను కోరినదాన్ని చెరిపివేస్తాడు, తాను కోరినదాన్నిఅలాగే ఉండనిస్తాడు. మూలగ్రంథం (లౌహె మహ్‌ఫూజ్‌) ఆయన దగ్గరే ఉంది.
13:40  وَإِن مَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ وَعَلَيْنَا الْحِسَابُ
(ఓ ప్రవక్తా!) వారికి చేసివున్న వాగ్దానాలలో దేన్నయినా మేము నీకు చూపించినా లేక (అంతకు ముందే) మేము నీ ప్రాణాన్ని స్వాధీనం చేసుకున్నా (ఏది ఏమైనాసరే...) సందేశాన్ని చేరవేయటమే నీ పని. లెక్క తీసుకునే బాధ్యత మాది.
13:41  أَوَلَمْ يَرَوْا أَنَّا نَأْتِي الْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَا ۚ وَاللَّهُ يَحْكُمُ لَا مُعَقِّبَ لِحُكْمِهِ ۚ وَهُوَ سَرِيعُ الْحِسَابِ
మేము భూమిని దాని అంచుల (ఎల్లల)నుంచి ఎలా కుదించుకుంటూ వస్తున్నామో వారు గమనించటం లేదా? అల్లాహ్‌ ఆదేశాలు జారీ చేస్తాడు, ఆయన ఆదేశాలను పునఃపరిశీలించే వాడెవడూ లేడు. ఆయన చాలా వేగంగా లెక్క తీసుకునేవాడు కూడా.
13:42  وَقَدْ مَكَرَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَلِلَّهِ الْمَكْرُ جَمِيعًا ۖ يَعْلَمُ مَا تَكْسِبُ كُلُّ نَفْسٍ ۗ وَسَيَعْلَمُ الْكُفَّارُ لِمَنْ عُقْبَى الدَّارِ
వీరికి పూర్వం (గతించిన) ప్రజలు కూడా పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. అయితే (అసలు సిసలు) తంత్రాలన్నీ అల్లాహ్‌ అధీనంలో ఉన్నాయి. ఎవరేం చేస్తున్నదీ ఆయనకు తెలుసు. ఇహలోక పుణ్యఫలం ఎవరి కోసం ఉందో అవిశ్వాసులు త్వరలోనే తెలుసుకుంటారు.
13:43  وَيَقُولُ الَّذِينَ كَفَرُوا لَسْتَ مُرْسَلًا ۚ قُلْ كَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ وَمَنْ عِندَهُ عِلْمُ الْكِتَابِ
"నువ్వు ప్రవక్తవు కావు" అని ఈ అవిశ్వాసులు అంటున్నారు. "ఈ విషయమై నాకూ - మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ చాలు. గ్రంథజ్ఞానం గలవారు కూడా (ఈ విషయానికి సాక్షులుగా ఉంటారు)" అని వారికి చెప్పు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.