Translation
| 113. సూరా అల్ ఫలఖ్ 113:1 قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ చెప్పు: నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను – 113:2 مِن شَرِّ مَا خَلَقَ ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి, 113:3 وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి, 113:4 وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ (మంత్రించి)ముడులలో ఊదే వారి కీడు నుండి, 113:5 وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ అసూయపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను). ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |