Translation
| 112. సూరా అల్ ఇఖ్లాస్ 112:1 قُلْ هُوَ اللَّهُ أَحَدٌ (ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. 112:2 اللَّهُ الصَّمَدُ అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). 112:3 لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. 112:4 وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |