Translation
| 111. సూరా అల్ లహబ్ 111:1 تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ అబూ లహబ్ చేతులు రెండూ విరిగి పోయాయి. వాడు సయితం నాశనం అయిపోయాడు. 111:2 مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ వాడి ధనంగానీ, వాడి సంపాదన గాని వాడికే మాత్రం పనికి రాలేదు. 111:3 سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ త్వరలోనే వాడు భగ భగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు. 111:4 وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ఇంకా అతని భార్య; పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా (నరకానికి పోతుంది). 111:5 فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ఆమె మెడలో (ఖర్జూర ఆకుతో) గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |