Translation
| 110. సూరా అన్ నస్ర్ 110:1 إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ (ఓ ప్రవక్తా!) అల్లాహ్ సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, 110:2 وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا ప్రజలు గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు, 110:3 فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు, మన్నింపుకై ఆయన్ని ప్రార్ధించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించే వాడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |