Translation
| 109. సూరా అల్ ఖాఫిరూన్ 109:1 قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ (ఓ ప్రవక్తా! వారికి) చెప్పు : “ఓ తిరస్కారులారా!” 109:2 لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు. 109:3 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు. 109:4 وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ మీరు ఆరాధించే వాటిని నేను అరాధించబోను. 109:5 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ మరి నేను ఆరాధించేవానిని మీరెలాగూ ఆరాధించరు. 109:6 لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ మీ ధర్మం మీది, నా ధర్మం నాది.” ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |