Translation
| 107. సూరా అల్ మాఊ న్ 107:1 أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ తీర్పు (దినము)ను ధిక్కరించే వాడిని నీవు చూశావా?! 107:2 فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ వీడే అనాధను గెంటివేసేవాడు. 107:3 وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం (ఇతరులకు) ప్రేరేపించనివాడు. 107:4 فَوَيْلٌ لِّلْمُصَلِّينَ ఆ నమాజీలకు వినాశం తప్పదు (‘వైల్’ అనే నరక స్థానం వారికొరకు ఉన్నది). 107:5 الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. 107:6 الَّذِينَ هُمْ يُرَاءُونَ వారు (ఒకవేళ నమాజు చేసినా)పరులకు చూపటానికి చేస్తారు. 107:7 وَيَمْنَعُونَ الْمَاعُونَ అతి సామాన్యమైన వాడుక వస్తువులు సయితం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |