Translation
| 105. సూరా అల్ ఫీల్ 105:1 أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ ఏమిటీ, నీ ప్రభువు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా? 105:2 أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ ఏమిటీ, వాళ్ళ కుట్రను (ఆయన) భగ్నం చేయలేదా? 105:3 وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ వాళ్ళపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. 105:4 تَرْمِيهِم بِحِجَارَةٍ مِّن سِجِّيلٍ అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్లను కురిపించసాగాయి. 105:5 فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّأْكُولٍ ఎట్టకేలకు, ఆయన వారిని తిని (తొక్కి వేసి)న తొక్కు మాదిరిగా చేసేశాడు. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |