Translation
| 104. సూరా అల్ హుమజా హ్ 104:1 وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ (ఇతరుల) తప్పులెన్నుతూ, పరోక్ష నిందకు పాల్పడే ప్రతి ఒక్కడికీ మూడుతుంది. 104:2 الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ వాడు ధనాన్ని పోగుచేసి, పదే పదే లెక్కపెడుతూ ఉంటాడు. 104:3 يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడనుకుంటున్నాడు. 104:4 كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ ఎన్నటికీ అలా జరగదు. వాడు తుత్తునియలు చేసివేసే దాంట్లో విసిరివేయబడతాడు. 104:5 وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ ఆ తుత్తునియలు చేసివేసే దాన్ని గురించి ఏమనుకున్నావు? 104:6 نَارُ اللَّهِ الْمُوقَدَةُ అది అల్లాహ్ రాజేసినటువంటి అగ్ని. 104:7 الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ అది హృదయాల వరకూ చొచ్చుకు పోయేటటువంటిది. 104:8 إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ ఆ అగ్ని వారిపై అన్ని వైపుల నుండీ మూసివేయబడుతుంది. 104:9 فِي عَمَدٍ مُّمَدَّدَةٍ వారు పొడవాటి స్తంభాల (అగ్నికీలల) మధ్య (చిక్కుకుని ఉంటారు). ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |