Translation
| 102. సూరా అత్ తకాసుర్ 102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. 102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు. 102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు. 102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ మరెన్నటికీ కాదు.... మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు. 102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు). 102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ మీరు నరకాన్ని చూసి తీరుతారు. 102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా! 102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ మరి ఆ రోజు (దేవుని) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |