Translation
| 101. సూరా అల్ ఖారియ హ్ 101:1 الْقَارِعَةُ ఎడా పెడా బాదేది. 101:2 مَا الْقَارِعَةُ ఏమిటీ, ఆ ఎడా పెడా బాదేది? 101:3 وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ ఆ ఎడా పెడా బాదే దాని గురించి నీకేం తెలుసు? 101:4 يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ ఆ రోజు మనుషులు చెల్లాచెదురైన దీపపు పురుగుల్లా అయిపోతారు. 101:5 وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ పర్వతాలు ఏకిన రంగు రంగుల దూది పింజాల్లా (లేక ఉన్నిలా) అయిపోతాయి. 101:6 فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో. 101:7 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. 101:8 وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో, 101:9 فَأُمُّهُ هَاوِيَةٌ అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది. 101:10 وَمَا أَدْرَاكَ مَا هِيَهْ అదేమిటో (‘హావియా’ అంటే ఏమిటో) నీకేం తెలుసు? 101:11 نَارٌ حَامِيَةٌ అది దహించివేసే అగ్ని. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |