Translation
| 100. సూరా అల్ ఆదియాత్ 100:1 وَالْعَادِيَاتِ ضَبْحًا రొప్పుతూ, రివ్వున దూసుకుపోయే గుర్రాల సాక్షిగా! 100:2 فَالْمُورِيَاتِ قَدْحًا మరి డెక్కల రాపిడితో నిప్పు రవ్వలను చెరిగేవాటి సాక్షిగా! 100:3 فَالْمُغِيرَاتِ صُبْحًا మరి ప్రభాత సమయాన (ప్రత్యర్ధులపై) మెరుపుదాడి చేసేవాటి సాక్షిగా! 100:4 فَأَثَرْنَ بِهِ نَقْعًا – మరి ఆ సమయంలో అవి దుమ్ము ధూళిని రేపుతాయి. 100:5 فَوَسَطْنَ بِهِ جَمْعًا మరి దాంతో పాటు (శత్రు) సైనిక పంక్తుల మధ్యలోకి చొచ్చుకు పోతాయి. 100:6 إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ అసలు విషయం ఏమిటంటే మానవుడు తన ప్రభువు (విషయంలో) చేసిన మేలును మరచినవాడుగా తయారయ్యాడు. 100:7 وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ నిజానికి ఈ విషయానికి స్వయంగా అతనే సాక్షి! 100:8 وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ యదార్ధానికి అతను ధన ప్రేమలో మహా ఘటికుడు. 100:9 أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ ఏమిటి, సమాధుల్లోని వాటిని బయటికి కక్కించబడే సమయం గురించి అతనికి తెలియదా? 100:10 وَحُصِّلَ مَا فِي الصُّدُورِ గుండెల్లోని గుట్టంతా రట్టు చేయబడే సమయం గురించి (అతనికి తెలీదా?) 100:11 إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ నిశ్చయంగా ఆ రోజు వారి ప్రభువుకు వారి గురించి బాగా తెలిసి ఉంటుంది. ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది. |