aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

10. సూరా యూనుస్

10:1  الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْحَكِيمِ
అలిఫ్‌ - లామ్‌ - రా. ఇవి వివేకంతో నిండి వున్న గ్రంథవాక్యాలు.
10:2  أَكَانَ لِلنَّاسِ عَجَبًا أَنْ أَوْحَيْنَا إِلَىٰ رَجُلٍ مِّنْهُمْ أَنْ أَنذِرِ النَّاسَ وَبَشِّرِ الَّذِينَ آمَنُوا أَنَّ لَهُمْ قَدَمَ صِدْقٍ عِندَ رَبِّهِمْ ۗ قَالَ الْكَافِرُونَ إِنَّ هَٰذَا لَسَاحِرٌ مُّبِينٌ
ఏమిటీ, "ప్రజలను హెచ్చరించు, విశ్వసించినవారికి వారి ప్రభువు వద్ద పూర్తి ప్రతిఫలం, ఉన్నత స్థానం ఉందన్న శుభవార్తను వినిపించు" అంటూ వారిలోని ఒక మనిషి వద్దకు మేము వహీ (సందేశం) పంపటం ప్రజలను ఆశ్చర్యచకితుల్ని చేసిందా? (పైగా) తిరస్కారులు, "ఇతడు ముమ్మాటికీ పచ్చిమాంత్రికుడే" అని పలికారు.
10:3  إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۖ يُدَبِّرُ الْأَمْرَ ۖ مَا مِن شَفِيعٍ إِلَّا مِن بَعْدِ إِذْنِهِ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ أَفَلَا تَذَكَّرُونَ
నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్‌యే. ఆయన ఆకాశాలను, భూమినీ ఆరు రోజులలో సృష్టించాడు. తర్వాత సింహాసనాన్ని (అర్ష్‌ను) అధీష్టించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా (ఆయన సమక్షంలో) సిఫారసు చేయగల వాడెవడూలేడు. అటువంటి అల్లాహ్‌యే మీ ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అయినా (ఇంత చెప్పినా) మీరు గుణపాఠం గ్రహించరా?
10:4  إِلَيْهِ مَرْجِعُكُمْ جَمِيعًا ۖ وَعْدَ اللَّهِ حَقًّا ۚ إِنَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ لِيَجْزِيَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ بِالْقِسْطِ ۚ وَالَّذِينَ كَفَرُوا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ
మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనది. నిస్సందేహంగా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు, మరి విశ్వసించి, మంచిపనులు చేసిన వారికి న్యాయసమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు మలిసారి పుట్టించేవాడు కూడా ఆయనే. సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కారవైఖరి మూలంగా త్రాగటానికి సలసలాకాగే నీరు, బాధాకరమైన శిక్ష ఉంటుంది.
10:5  هُوَ الَّذِي جَعَلَ الشَّمْسَ ضِيَاءً وَالْقَمَرَ نُورًا وَقَدَّرَهُ مَنَازِلَ لِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ ۚ مَا خَلَقَ اللَّهُ ذَٰلِكَ إِلَّا بِالْحَقِّ ۚ يُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
సూర్యుణ్ణి ప్రకాశమానంగానూ, చంద్రుణ్ణి కాంతిమంతంగానూ చేసినవాడు ఆయనే. మీరు సంవత్సరాల సంఖ్యను, లెక్కలను తెలుసుకోవటానికి చంద్రుని దశలను కూడా ఆయనే నిర్థారించాడు. అల్లాహ్‌ వీటిని సత్యబద్ధంగా తప్ప (నిరర్థకంగా) పుట్టించలేదు. తెలుసుకోగలవారికోసం ఆయన ఈ సూచనలను విడమరచి చెబుతున్నాడు.
10:6  إِنَّ فِي اخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا خَلَقَ اللَّهُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَتَّقُونَ
నిస్సందేహంగా రేయింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావటంలోనూ, భూమ్యాకాశాలలో అల్లాహ్‌ సృష్టించిన వస్తువులన్నింటిలోనూ దైవభీతి గలవారికోసం సూచనలున్నాయి.
10:7  إِنَّ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا وَرَضُوا بِالْحَيَاةِ الدُّنْيَا وَاطْمَأَنُّوا بِهَا وَالَّذِينَ هُمْ عَنْ آيَاتِنَا غَافِلُونَ
మిమ్మల్ని కలుసుకునే విషయంపై నమ్మకం లేని వారికీ, ప్రాపంచిక జీవితంతోనే సంతోషించిన వారికీ, దానితోనే సంతృప్తి చెందిన వారికీ, మా ఆయతుల పట్ల నిర్లక్ష్యభావం ప్రదర్శించిన వారికీ -
10:8  أُولَٰئِكَ مَأْوَاهُمُ النَّارُ بِمَا كَانُوا يَكْسِبُونَ
వారు ఆర్జించిన దాని ప్రతిఫలంగా వారి నివాసం నరకాగ్ని అవుతుంది.
10:9  إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ يَهْدِيهِمْ رَبُّهُم بِإِيمَانِهِمْ ۖ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ فِي جَنَّاتِ النَّعِيمِ
నిశ్చయంగా - విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా వారిని గమ్యస్థానానికి చేరుస్తాడు – క్రింద కాలువలు ప్రవహించే అనుగ్రహభరితమైన స్వర్గవనాలలోకి!
10:10  دَعْوَاهُمْ فِيهَا سُبْحَانَكَ اللَّهُمَّ وَتَحِيَّتُهُمْ فِيهَا سَلَامٌ ۚ وَآخِرُ دَعْوَاهُمْ أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
''అల్లాహ్‌! నీవు పవిత్రుడవు'' అనేమాట వారినోట వెలువడుతుంది. ''అస్సలాము అలైకుమ్ (మీకు శాంతి కలుగుగాక)! ''అని వారు పరస్పరం శాంతిపూర్వకంగా చెప్పుకుంటారు. ''సర్వలోక ప్రభువగు అల్లాహ్‌కే సకలస్తోత్రాలు'' అన్నది వారి ముగింపు వాక్యం అయి ఉంటుంది.
10:11  وَلَوْ يُعَجِّلُ اللَّهُ لِلنَّاسِ الشَّرَّ اسْتِعْجَالَهُم بِالْخَيْرِ لَقُضِيَ إِلَيْهِمْ أَجَلُهُمْ ۖ فَنَذَرُ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
ప్రజలు లాభం కోసం ఎంత తొందరపెడతారో అంతే తొందరగా అల్లాహ్‌ వారికి నష్టం చేకూర్చితే వారి వాగ్దానం ఎప్పుడో పూర్తయిపోయి ఉండేది. కనుక మా వద్దకు మరలి రావటంపై నమ్మకం లేని వారిని, వారు తమ తలబిరుసుతనంలో తచ్చాడుతూ ఉండేందుకు – వారి మానాన వారిని వదలిపెడతాము.
10:12  وَإِذَا مَسَّ الْإِنسَانَ الضُّرُّ دَعَانَا لِجَنبِهِ أَوْ قَاعِدًا أَوْ قَائِمًا فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهُ مَرَّ كَأَن لَّمْ يَدْعُنَا إِلَىٰ ضُرٍّ مَّسَّهُ ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْمُسْرِفِينَ مَا كَانُوا يَعْمَلُونَ
మనిషికి ఏదైనా కష్టం కలిగినప్పుడు పడుకొని, కూర్చొని, నిలబడీ మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మరి మేము అతని కష్టాన్ని అతన్నుంచి తొలగించినప్పుడు,తనకు కలిగిన ఏ కష్టానికీ, ఎప్పుడూ, మమ్మల్నిప్రార్థించనే లేదన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఈ విధంగా హద్దుమీరిపోయే వారి పనులు వారికి ఎంతో రమణీయంగా చెయ్యబడ్డాయి.
10:13  وَلَقَدْ أَهْلَكْنَا الْقُرُونَ مِن قَبْلِكُمْ لَمَّا ظَلَمُوا ۙ وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَمَا كَانُوا لِيُؤْمِنُوا ۚ كَذَٰلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ
మేము మీకు పూర్వం ఎన్నో జాతులను – వారు అన్యాయానికి ఒడిగట్టినప్పుడు - తుదముట్టించాము. వారి వద్దకు వారి ప్రవక్తలు కూడా సూచనలు తీసుకువచ్చారు. కాని వారు విశ్వసిస్తే కదా?! మేము అపరాధజనులకు ఇలాంటి శిక్షనే విధిస్తాము.
10:14  ثُمَّ جَعَلْنَاكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ مِن بَعْدِهِمْ لِنَنظُرَ كَيْفَ تَعْمَلُونَ
మరి వారి తర్వాత – మీరు ఏ విధంగా పని చేస్తారో చూడటానికి మేము వారి స్థానంలో మిమ్మల్ని భూమికి వారసులుగా తీసుకువచ్చాము.
10:15  وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ ۙ قَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا ائْتِ بِقُرْآنٍ غَيْرِ هَٰذَا أَوْ بَدِّلْهُ ۚ قُلْ مَا يَكُونُ لِي أَنْ أُبَدِّلَهُ مِن تِلْقَاءِ نَفْسِي ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۖ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, మమ్మల్ని కలిసే నమ్మకం లేనివారు "ఇది తప్ప వేరొక ఖుర్‌ఆన్‌ను తీసుకురా లేదా ఇందులో కొంత సవరణ చెయ్యి" అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "నా తరఫున ఇందులో సవరణ చేసే అధికారం నాకే మాత్రం లేదు. నా వద్దకు 'వహీ' ద్వారా పంపబడే దానిని నేను (యధాతథంగా) అనుసరించేవాణ్ణి మాత్రమే. ఒకవేళ నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయతకు పాల్పడినట్లయితే ఒక మహాదినమున విధించబడే శిక్షకు భయపడుతున్నాను."
10:16  قُل لَّوْ شَاءَ اللَّهُ مَا تَلَوْتُهُ عَلَيْكُمْ وَلَا أَدْرَاكُم بِهِ ۖ فَقَدْ لَبِثْتُ فِيكُمْ عُمُرًا مِّن قَبْلِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ
"అల్లాహ్‌ కోరితే దీన్నినేను మీకు చదివి వినిపించటంగానీ, అల్లాహ్‌ దాని గురించి మీకు తెలియజేయటం గానీ జరిగి ఉండేదే కాదు. ఎందుకంటే ఇంతకు ముందు నేను నా జీవితకాలంలో ఓ పెద్దభాగం మీ మధ్యనే గడిపాను. అసలు మీరు బుద్ధిని ఉపయోగించరా?" అని అడుగు.
10:17  فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْمُجْرِمُونَ
కనుక అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టే, లేక ఆయన వాక్యాలను అబద్ధాలుగా ఖరారుచేసే వాడికన్నా పరమదుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి అపరాధులు ఎట్టి పరిస్థితిలోనూ సాఫల్యం పొందరు.
10:18  وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, "అల్లాహ్‌ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి" అని చెబుతున్నారు. "ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?" వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
10:19  وَمَا كَانَ النَّاسُ إِلَّا أُمَّةً وَاحِدَةً فَاخْتَلَفُوا ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ فِيمَا فِيهِ يَخْتَلِفُونَ
మొదట్లో జనులంతా ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభేదించుకున్నారు. నీ ప్రభువు తరఫు నుంచి ముందుగానే ఒక విషయం ఖరారు కాకుండా ఉన్నట్లయితే, వారు విభేదించుకునే విషయం ఎప్పుడో తేల్చివెయ్యబడేది.
10:20  وَيَقُولُونَ لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۖ فَقُلْ إِنَّمَا الْغَيْبُ لِلَّهِ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
"అతని ప్రభువు తరఫున అతనిపై ఏదైనా సూచన ఎందుకు అవతరించదు?" అని వారంటున్నారు. "రహస్య జ్ఞానం అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉంది. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేనూ నిరీక్షిస్తున్నాను" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
10:21  وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً مِّن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُمْ إِذَا لَهُم مَّكْرٌ فِي آيَاتِنَا ۚ قُلِ اللَّهُ أَسْرَعُ مَكْرًا ۚ إِنَّ رُسُلَنَا يَكْتُبُونَ مَا تَمْكُرُونَ
ప్రజలపై ఆపద వచ్చిపడిన తరువాత మేము వారికి (మా) కారుణ్యం రుచి చూపితే, వెంటనే వారు మా ఆయతులకు వ్యతిరేకంగా ఎత్తులు వేయటం మొదలెడతారు. "ఎత్తులు వేయటంలో అల్లాహ్‌ మీకంటే చాలా వేగం" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నిశ్చయంగా మా దూతలు మీఎత్తులను వ్రాస్తున్నారు.
10:22  هُوَ الَّذِي يُسَيِّرُكُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ ۖ حَتَّىٰ إِذَا كُنتُمْ فِي الْفُلْكِ وَجَرَيْنَ بِهِم بِرِيحٍ طَيِّبَةٍ وَفَرِحُوا بِهَا جَاءَتْهَا رِيحٌ عَاصِفٌ وَجَاءَهُمُ الْمَوْجُ مِن كُلِّ مَكَانٍ وَظَنُّوا أَنَّهُمْ أُحِيطَ بِهِمْ ۙ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ لَئِنْ أَنجَيْتَنَا مِنْ هَٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ
ఆయనే మిమ్మల్ని భూమిలోనూ, సముద్రంలోనూ నడుపుతున్నాడు. ఆ విధంగా మీరు ఓడలలో పయనమవుతున్నప్పుడు, అవి ప్రజలను సానుకూలమైన గాలుల ద్వారా తీసుకుపోతుంటాయి. ఆ అనుకూల పవనాలకు ప్రజలు ఆనందడోలికల్లో తేలియాడుతుండగా (అకస్మాత్తుగా) వారిపై ఉధృతమైన గాలి వీస్తుంది. అన్ని వైపుల నుంచీ వారిపై అలలు వచ్చిపడతాయి. తాము (ఆపదలో దారుణంగా) చిక్కుకు పోయామన్న సంగతిని వారు గ్రహిస్తారు. (ఆక్షణంలో) తమ విశ్వాసాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని, "(అల్లాహ్‌!) నువ్వు గనక మమ్మల్ని ఈ ఆపదనుంచి గట్టెక్కిస్తే మేము తప్పకుండా నీకు కృతజ్ఞులమై ఉంటామ" ని మొరపెట్టుకుంటారు.
10:23  فَلَمَّا أَنجَاهُمْ إِذَا هُمْ يَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۗ يَا أَيُّهَا النَّاسُ إِنَّمَا بَغْيُكُمْ عَلَىٰ أَنفُسِكُم ۖ مَّتَاعَ الْحَيَاةِ الدُّنْيَا ۖ ثُمَّ إِلَيْنَا مَرْجِعُكُمْ فَنُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
మరి అల్లాహ్‌ వారిని కాపాడగానే వారు భూమిలో అన్యాయంగా తిరగబడతారు. ప్రజలారా! మీ ఈ తిరుగుబాటు ధోరణి మీకే హానికరం. ప్రాపంచిక జీవితపు ప్రయోజనాలు కొన్నాళ్ళు మాత్రమే. ఆ తరువాత మీరు మా వద్దకే మరలిరావలసి ఉంది. అప్పుడు మేము, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ మీకు తెలియబరుస్తాము.
10:24  إِنَّمَا مَثَلُ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الْأَرْضِ مِمَّا يَأْكُلُ النَّاسُ وَالْأَنْعَامُ حَتَّىٰ إِذَا أَخَذَتِ الْأَرْضُ زُخْرُفَهَا وَازَّيَّنَتْ وَظَنَّ أَهْلُهَا أَنَّهُمْ قَادِرُونَ عَلَيْهَا أَتَاهَا أَمْرُنَا لَيْلًا أَوْ نَهَارًا فَجَعَلْنَاهَا حَصِيدًا كَأَن لَّمْ تَغْنَ بِالْأَمْسِ ۚ كَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ لِقَوْمٍ يَتَفَكَّرُونَ
ప్రాపంచిక జీవితపు ఉపమానం మేము ఆకాశం నుంచి కురిపించిన వర్షపు నీరులాంటిది. ఆ నీటి ద్వారా మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడే భూఉత్పత్తులు దట్టంగా మొలకెత్తాయి. క్రమంగా ఆ నేల అందంగా ముస్తాబై, నవనవ లాడుతున్నప్పుడు, ఇక అది పూర్తిగా తమ స్వంతమైనట్లేనని దాని యజమానులు భావించారు. అప్పుడు అకస్మాత్తుగా రాత్రి పూటనో, పగటిపూటనో మా తరఫున ఒక ఆజ్ఞ (ఆపద) దానిపై వచ్చి పడింది. అసలు నిన్న అక్కడ ఏమీ లేనట్లే మేము దానిని తుడిచి పెట్టేశాము. ఈ విధంగా మేము చింతన చేసే వారికోసం ఆయతులను స్పష్టంగా విడమరచి చెబుతాము.
10:25  وَاللَّهُ يَدْعُو إِلَىٰ دَارِ السَّلَامِ وَيَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అల్లాహ్‌ మిమ్మల్నిశాంతి నిలయం వైపుకు పిలుస్తున్నాడు. ఇంకా, తాను కోరిన వారికి ఆయన రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు.
10:26  لِّلَّذِينَ أَحْسَنُوا الْحُسْنَىٰ وَزِيَادَةٌ ۖ وَلَا يَرْهَقُ وُجُوهَهُمْ قَتَرٌ وَلَا ذِلَّةٌ ۚ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
సత్కార్యాలు చేసిన వారికొరకు మేలున్నది. మరింత బహుమానం కూడా ఉన్నది. వారి ముఖాలపై నలుపుగానీ, పరాభవంగానీ ఆవరించవు. వారు స్వర్గవాసులు. అందులో వారు కలకాలం ఉంటారు.
10:27  وَالَّذِينَ كَسَبُوا السَّيِّئَاتِ جَزَاءُ سَيِّئَةٍ بِمِثْلِهَا وَتَرْهَقُهُمْ ذِلَّةٌ ۖ مَّا لَهُم مِّنَ اللَّهِ مِنْ عَاصِمٍ ۖ كَأَنَّمَا أُغْشِيَتْ وُجُوهُهُمْ قِطَعًا مِّنَ اللَّيْلِ مُظْلِمًا ۚ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
దుష్కార్యాలు చేసిన వారికి వారి దుష్కార్యాలకు సమానంగా శిక్ష విధించబడుతుంది. పరాభవం వారిని క్రమ్ముకుంటుంది. అల్లాహ్‌ నుండి వారిని కాపాడేవాడెవడూ ఉండడు. ఒక విధంగా వారి ముఖాలు రాత్రి యొక్క చీకటి తెరలు చుట్టబడినట్లే ఉంటాయి. వారు నరకవాసులు. అందులో వారు కలకాలం పడి ఉంటారు.
10:28  وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا مَكَانَكُمْ أَنتُمْ وَشُرَكَاؤُكُمْ ۚ فَزَيَّلْنَا بَيْنَهُمْ ۖ وَقَالَ شُرَكَاؤُهُم مَّا كُنتُمْ إِيَّانَا تَعْبُدُونَ
మేము వారందరినీ సమావేశ పరచేరోజు కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము మాకు సహవర్తుల్ని కల్పించే వారి నుద్దేశించి, "ఆగండి, మీరూ, మీరు కల్పించిన సహవర్తులూను!" అని అంటాము. ఆ తరువాత వారి మధ్య చీలికను తెస్తాము. అప్పుడు వారు నిలబెట్టిన భాగస్వాములు "మీరసలు మమ్మల్ని పూజించనేలేదు" (అని అంటారు).
10:29  فَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا بَيْنَنَا وَبَيْنَكُمْ إِن كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغَافِلِينَ
"ఈ వ్యవహారంలో మీకూ – మాకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ చాలు. మీరు మిమ్మల్ని పూజించిన సంగతి కూడా మాకు తెలీదాయె" (అని అంటారు).
10:30  هُنَالِكَ تَبْلُو كُلُّ نَفْسٍ مَّا أَسْلَفَتْ ۚ وَرُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
అక్కడ ప్రతి వ్యక్తీ తాను పూర్వం చేసుకున్న తన కర్మలను పరీక్షించుకుంటాడు. వారు తమ నిజయజమాని అయిన అల్లాహ్‌ వైపుకు మరలించబడతారు. వారు కల్పిస్తూ ఉండిన అబద్ధాలన్నీ వారి నుండి మటుమాయమవుతాయి.
10:31  قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ
"ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడెవడు? చెవులపై, కళ్లపై పూర్తి అధికారం కలవాడెవడు? ప్రాణమున్న దానిని ప్రాణములేని దాని నుండీ, ప్రాణములేని దానిని ప్రాణమున్న దాని నుండీ వెలికి తీసేవాడెవడు? సమస్త కార్యాల నిర్వహణకర్త ఎవరు?" అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. "అల్లాహ్‌యే" అని వారు తప్పకుండా చెబుతారు. "మరలాంటప్పుడు మీరు (దేవుని శిక్షకు) ఎందుకు భయపడరు?
10:32  فَذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمُ الْحَقُّ ۖ فَمَاذَا بَعْدَ الْحَقِّ إِلَّا الضَّلَالُ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ
ఆ అల్లాహ్‌యే మీ నిజప్రభువు. సత్యం తరువాత మార్గవిహీనత తప్ప ఇంకేముంటుందీ? మరి మీరు ఎటుమరలిపోతున్నారు?" అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
10:33  كَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ فَسَقُوا أَنَّهُمْ لَا يُؤْمِنُونَ
ఈ విధంగా "వారు విశ్వసించరు" అన్న నీ ప్రభువు మాట అవిధేయుల విషయంలో సత్యమని రుజువైపోయింది.
10:34  قُلْ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۚ قُلِ اللَّهُ يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
"ఏమిటీ, మీరు భాగస్వాములుగా నిలబెట్టిన వారిలో తొలిసారి సృష్టించి, మలిసారి కూడా దాన్ని పునరావృతం చేసే వాడెవడైనా ఉన్నాడా?" అని వారిని అడుగు. "అల్లాహ్‌యే తొలిసారి సృష్టిస్తాడు. మలిసారి కూడా ఆయనే సృష్టిస్తాడు. మరలాంటప్పుడు మీరు (సత్యం నుండి) ఎటుకొట్టుకు పోతున్నారు?" అని వారిని అడుగు.
10:35  قُلْ هَلْ مِن شُرَكَائِكُم مَّن يَهْدِي إِلَى الْحَقِّ ۚ قُلِ اللَّهُ يَهْدِي لِلْحَقِّ ۗ أَفَمَن يَهْدِي إِلَى الْحَقِّ أَحَقُّ أَن يُتَّبَعَ أَمَّن لَّا يَهِدِّي إِلَّا أَن يُهْدَىٰ ۖ فَمَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
"మీ భాగస్వాములలో సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడెవడయినా ఉన్నాడా?" అని వారిని అడుగు. ''సత్యం వైపుకు మార్గదర్శకత్వం వహించేవాడు అల్లాహ్‌ మాత్రమే. అలాంటప్పుడు సన్మార్గం చూపేవాడు అనుసరణకు ఎక్కువ అర్హుడా? లేక ఇతరులు సన్మార్గం చూపేవరకూ తనంతట తానుగా సన్మార్గం తెలుసుకోలేనివాడా? అసలు మీకేమైపోయింది? మీరు ఇలాంటి నిర్ణయాలు గైకొంటున్నారేమిటి?" అని వారిని అడుగు.
10:36  وَمَا يَتَّبِعُ أَكْثَرُهُمْ إِلَّا ظَنًّا ۚ إِنَّ الظَّنَّ لَا يُغْنِي مِنَ الْحَقِّ شَيْئًا ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا يَفْعَلُونَ
వారిలో అధికులు కేవలం ఊహలను, అనుమానాలను అనుసరిస్తున్నారు. నిశ్చయంగా అనుమానం సత్యం ముందు దేనికీ పనికిరాదు. వారు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
10:37  وَمَا كَانَ هَٰذَا الْقُرْآنُ أَن يُفْتَرَىٰ مِن دُونِ اللَّهِ وَلَٰكِن تَصْدِيقَ الَّذِي بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ الْكِتَابِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ الْعَالَمِينَ
ఈ ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ (పంపిన వహీ ద్వారా) కాకుండా (ఇతరుల ప్రమేయంతో) చేయబడిన కల్పన కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న వాటిని (అవతరించిన గ్రంథాలను) ధృవీకరించేది, ఇంకా గ్రంథం (లోని మౌలిక ఆదేశాలను) విపులీకరించేది. ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుంచి వచ్చిందన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు.
10:38  أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ فَأْتُوا بِسُورَةٍ مِّثْلِهِ وَادْعُوا مَنِ اسْتَطَعْتُم مِّن دُونِ اللَّهِ إِن كُنتُمْ صَادِقِينَ
ఏమిటీ, దీనిని (ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని) అతనే స్వయంగా కల్పించుకున్నాడని వారంటున్నారా? "మరయితే మీరు దీనిలాంటి ఒక్క సూరానైనా (రచించి) తీసుకురండి. ఒకవేళ మీరు సత్యవంతులే అయితే అల్లాహ్‌ను తప్పఎవరెవరిని పిలుచుకుంటారో పిలుచుకోండి" అని వారికి చెప్పు.
10:39  بَلْ كَذَّبُوا بِمَا لَمْ يُحِيطُوا بِعِلْمِهِ وَلَمَّا يَأْتِهِمْ تَأْوِيلُهُ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الظَّالِمِينَ
పైగా వారు తమ జ్ఞానపరిధిలోకి తీసుకోని దానిని అసత్యమని ధిక్కరించారు. ఇంకా దాని అంతిమ ఫలితం వారి ముందుకు రాలేదు. వారికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కరించారు. మరి ఆ దుర్మార్గులకు పట్టిన గతేమిటో చూడు!
10:40  وَمِنْهُم مَّن يُؤْمِنُ بِهِ وَمِنْهُم مَّن لَّا يُؤْمِنُ بِهِ ۚ وَرَبُّكَ أَعْلَمُ بِالْمُفْسِدِينَ
వారిలో కొందరు దీనిని విశ్వసిస్తారు. మరి కొందరు దీనిని విశ్వసించరు. కల్లోల జనకులగురించి నీ ప్రభువుకు బాగా తెలుసు.
10:41  وَإِن كَذَّبُوكَ فَقُل لِّي عَمَلِي وَلَكُمْ عَمَلُكُمْ ۖ أَنتُم بَرِيئُونَ مِمَّا أَعْمَلُ وَأَنَا بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ
ఒకవేళ వారు నిన్ను ధిక్కరిస్తూనే ఉంటే, "నా పని నాది. మీ పని మీది. నా పనుల బాధ్యత మీపై లేదు. మీ పనుల బాధ్యత నాపై లేదు"అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పెయ్యి.
10:42  وَمِنْهُم مَّن يَسْتَمِعُونَ إِلَيْكَ ۚ أَفَأَنتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوا لَا يَعْقِلُونَ
వారిలో కొందరు నీ మాటలను శ్రద్ధగా వింటుంటారు. ఏమిటీ, ఏమాత్రం అర్థం చేసుకోలేని చెవిటి వారికి నీవు వినిపించగలవా?
10:43  وَمِنْهُم مَّن يَنظُرُ إِلَيْكَ ۚ أَفَأَنتَ تَهْدِي الْعُمْيَ وَلَوْ كَانُوا لَا يُبْصِرُونَ
వారిలో కొందరు నిన్ను చూస్తారు. కాని (కొద్దిపాటి) మనో నేత్రం కూడా లేని అంధులకు నువ్వు మార్గం చూపగలవా?
10:44  إِنَّ اللَّهَ لَا يَظْلِمُ النَّاسَ شَيْئًا وَلَٰكِنَّ النَّاسَ أَنفُسَهُمْ يَظْلِمُونَ
అల్లాహ్‌ ప్రజలకు ఏకాస్త అన్యాయం కూడా చేయడు. కాని ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు.
10:45  وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ يَتَعَارَفُونَ بَيْنَهُمْ ۚ قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ وَمَا كَانُوا مُهْتَدِينَ
అల్లాహ్‌ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము (ప్రపంచ జీవితంలో) దినములో ఒక గడియకాలం ఆగి ఉన్నామేమో!? అనిపిస్తుంది. అల్లాహ్‌ను కలుసుకునే విషయాన్ని అసత్యమని త్రోసిపుచ్చిన వారు నిస్సందేహంగా నష్టపోయారు. వారు సన్మార్గం పొందేవారు కారు.
10:46  وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ اللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا يَفْعَلُونَ
మేము వారికి వాగ్దానం చేస్తున్న దానిలో ఎంతో కొంత నీకు చూపించినా లేక (అది పొడసూపకముందే) మేము నీకు మరణమొసగినా - (ఏం జరిగినా సరే) వారు ఎలాగూ మావద్దకు రావలసినవారే. అదీగాక వారి చేష్టలన్నింటికీ అల్లాహ్‌ సాక్షిగా ఉన్నాడు.
10:47  وَلِكُلِّ أُمَّةٍ رَّسُولٌ ۖ فَإِذَا جَاءَ رَسُولُهُمْ قُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ وَهُمْ لَا يُظْلَمُونَ
ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త ఉన్నాడు. కాబట్టి వారి ప్రవక్త వారివద్దకు వచ్చేసినపుడు వారివ్యవహారంలో న్యాయబద్ధంగా తీర్పు చెయ్యబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
10:48  وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ
"మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుంది?" అని వారు అడుగుతున్నారు.
10:49  قُل لَّا أَمْلِكُ لِنَفْسِي ضَرًّا وَلَا نَفْعًا إِلَّا مَا شَاءَ اللَّهُ ۗ لِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۚ إِذَا جَاءَ أَجَلُهُمْ فَلَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "అల్లాహ్‌ తలచినది తప్ప - నా అధీనంలో స్వయంగానా లాభనష్టాలు కూడా లేవు. ప్రతి సమాజానికీ ఒక నిర్ణీత గడువు ఉంది. వారి సమయం వచ్చినప్పుడు వారు ఒక గడియ కూడా వెనకా ముందు జరగరు."
10:50  قُلْ أَرَأَيْتُمْ إِنْ أَتَاكُمْ عَذَابُهُ بَيَاتًا أَوْ نَهَارًا مَّاذَا يَسْتَعْجِلُ مِنْهُ الْمُجْرِمُونَ
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "చెప్పండి, దైవశిక్ష మీపై రాత్రిపూట విరుచుకుపడినా, పగటిపూట వచ్చిపడినా ఆ విషయంలో నేరస్థులకు అంత ఆత్రం ఎందుకట?!"
10:51  أَثُمَّ إِذَا مَا وَقَعَ آمَنتُم بِهِ ۚ آلْآنَ وَقَدْ كُنتُم بِهِ تَسْتَعْجِلُونَ
ఏమిటీ, అది వచ్చిపడినప్పుడు దాన్నివిశ్వసిస్తారా?! ఇప్పుడా విశ్వసించేది?! దీనికోసం మీరు మహాతొందర పెట్టేవారు కదా!"
10:52  ثُمَّ قِيلَ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ الْخُلْدِ هَلْ تُجْزَوْنَ إِلَّا بِمَا كُنتُمْ تَكْسِبُونَ
అప్పుడు దుర్మార్గులతో ఇలా చెప్పబడుతుంది: "ఇక శాశ్వతమైన శిక్షను చవిచూడండి. మీరు సంపాదించుకున్న దాని ఫలితమే మీకు లభించింది."
10:53  وَيَسْتَنبِئُونَكَ أَحَقٌّ هُوَ ۖ قُلْ إِي وَرَبِّي إِنَّهُ لَحَقٌّ ۖ وَمَا أَنتُم بِمُعْجِزِينَ
"ఏమిటీ, అది నిజమేనా?" అని వారు నిన్ను అడుగుతున్నారు. "అవును. నా ప్రభువు తోడు! అది (ఆ శిక్ష) పడటం సత్యం. అది సంభవించకుండా ఆపే శక్తి మీకు లేదు" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
10:54  وَلَوْ أَنَّ لِكُلِّ نَفْسٍ ظَلَمَتْ مَا فِي الْأَرْضِ لَافْتَدَتْ بِهِ ۗ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ ۖ وَقُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ
దుర్మార్గానికి (షిర్క్‌కు) పాల్పడిన ప్రతి మనిషి దగ్గరా భూమి నిండిపోయేంత (సొమ్ము) ఉన్నా సరే అతను దాన్ని పరిహారంగా ఇచ్చి తనను విడిపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. శిక్షను చూసినపుడు వారు లోలోపలే సిగ్గుతో కుమిలిపోతారు. వారి మధ్య న్యాయసమ్మతంగా తీర్పు జరుగుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
10:55  أَلَا إِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ أَلَا إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
వినండి! ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ అల్లాహ్‌ సొత్తే. గుర్తుంచుకోండి! అల్లాహ్‌ వాగ్దానం సత్యం. అయితే చాలామంది (ఈ సత్యాన్ని) తెలుసుకోరు.
10:56  هُوَ يُحْيِي وَيُمِيتُ وَإِلَيْهِ تُرْجَعُونَ
ఆయనే ప్రాణం పోస్తాడు, మరి ఆయనే ప్రాణం తీస్తాడు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు.
10:57  يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం.
10:58  قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "అల్లాహ్‌ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది."
10:59  قُلْ أَرَأَيْتُم مَّا أَنزَلَ اللَّهُ لَكُم مِّن رِّزْقٍ فَجَعَلْتُم مِّنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ
"అల్లాహ్‌ మీకోసం ఆహారాన్ని అవతరింపజేయగా దానిలో కొంతభాగాన్ని మీరు మీకోసం నిషేధించుకుని, మరికొంత భాగాన్ని ధర్మసమ్మతం చేసుకున్నారే దీనికి మీ సమాధానం ఏమిటి!?" అని వారిని అడుగు. "ఏమిటీ, ఈ మేరకు అల్లాహ్‌ మీకు ఆదేశించాడా? లేక మీరే అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతున్నారా?" అని వారిని అడుగు.
10:60  وَمَا ظَنُّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَشْكُرُونَ
అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టే వారు ప్రళయదినం గురించి ఏమనుకుంటున్నారు? నిస్సందేహంగా మానవుల పట్ల అల్లాహ్‌ అనుగ్రహం కలవాడు. కాని వారిలో చాలా మంది కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించరు.
10:61  وَمَا تَكُونُ فِي شَأْنٍ وَمَا تَتْلُو مِنْهُ مِن قُرْآنٍ وَلَا تَعْمَلُونَ مِنْ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيْكُمْ شُهُودًا إِذْ تُفِيضُونَ فِيهِ ۚ وَمَا يَعْزُبُ عَن رَّبِّكَ مِن مِّثْقَالِ ذَرَّةٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَلَا أَصْغَرَ مِن ذَٰلِكَ وَلَا أَكْبَرَ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
(ఓ ప్రవక్తా!) నువ్వు ఏ స్థితిలో వున్నా - ఖుర్‌ఆనులోని ఏ భాగాలను పారాయణం చేసినా, (ప్రజలారా!) మీరు ఏ పనిచేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము. భూమిలో, ఆకాశాలలో ఉన్నరవంత వస్తువు కూడా నీ ప్రభువు నుండి గోప్యంగా లేదు - దానికంటే చిన్నదయినా సరే, పెద్దదయినా సరే - స్పష్టమైన గ్రంథంలో నమోదు కాకుండా లేదు.
10:62  أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
వినండి! అల్లాహ్‌ స్నేహితులకు భయముగానీ, దుఃఖంగానీ ఉండదు.
10:63  الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
వారు విశ్వసించిన వారై, (చెడుల విషయంలో అల్లాహ్‌కు) భయపడేవారై ఉంటారు.
10:64  لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۚ لَا تَبْدِيلَ لِكَلِمَاتِ اللَّهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
ప్రాపంచిక జీవితంలోనూ, పరలోకంలోనూ వారికి శుభవార్త కలదు . అల్లాహ్‌ వాక్కుల్లో మార్పు ఉండదు. ఇదే గొప్ప విజయం.
10:65  وَلَا يَحْزُنكَ قَوْلُهُمْ ۘ إِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا ۚ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
(ఓ ప్రవక్తా!) వారి మాటలు నిన్ను దుఃఖానికి లోను చేయకూడదు. యదార్థానికి సర్వాధిపత్యం అల్లాహ్‌దే. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
10:66  أَلَا إِنَّ لِلَّهِ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ ۗ وَمَا يَتَّبِعُ الَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ شُرَكَاءَ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
ఆకాశాలలో, భూమిలో ఉన్నవారందరూ అల్లాహ్‌వారేనన్న సంగతిని బాగా తెలుసుకోండి. అల్లాహ్‌ను వదలి ఇతరత్రా భాగస్వాములను పూజించేవారు దేన్ని అనుసరిస్తున్నట్లు?! వారు నిరాధారమైన ఊహలను అనుసరిస్తున్నారు. అంచనాలపై ఆధారపడుతున్నారు.
10:67  هُوَ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِتَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ
మీరు విశ్రాంతి తీసుకునేటందుకు ఆయనే మీకోసం రాత్రిని చేశాడు. పగటిని చూడగలగటానికి అనువుగా చేశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికోసం నిదర్శనాలున్నాయి.
10:68  قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا ۗ سُبْحَانَهُ ۖ هُوَ الْغَنِيُّ ۖ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ إِنْ عِندَكُم مِّن سُلْطَانٍ بِهَٰذَا ۚ أَتَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని వారంటున్నారు. సుబ్‌హానల్లాహ్‌! (అల్లాహ్‌ పరమ పవిత్రుడు). ఆయన ఏ అవసరమూ లేనివాడు. ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా ఆయనసొత్తే. దీనికి గాను (మీరు ఆపాదించే అసత్యానికి గాను) మీవద్ద ఏ ఆధారమూ లేదు. అల్లాహ్‌ను గురించి మీకు తెలియని మాటలంటున్నారా?
10:69  قُلْ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ
అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టేవారు ఎట్టి పరిస్థితిలోనూ సాఫల్యం పొందలేరని (ఓప్రవక్తా!) వారికి తెలుపు.
10:70  مَتَاعٌ فِي الدُّنْيَا ثُمَّ إِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ نُذِيقُهُمُ الْعَذَابَ الشَّدِيدَ بِمَا كَانُوا يَكْفُرُونَ
వారికి ఈ ప్రపంచంలో కొద్దిపాటి భోగముంది. ఆ తరువాత వారు మావద్దకు రావలసి ఉంటుంది. ఆ పిదప మేము వారికి వారి తిరస్కారానికి బదులుగా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము.
10:71  وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ نُوحٍ إِذْ قَالَ لِقَوْمِهِ يَا قَوْمِ إِن كَانَ كَبُرَ عَلَيْكُم مَّقَامِي وَتَذْكِيرِي بِآيَاتِ اللَّهِ فَعَلَى اللَّهِ تَوَكَّلْتُ فَأَجْمِعُوا أَمْرَكُمْ وَشُرَكَاءَكُمْ ثُمَّ لَا يَكُنْ أَمْرُكُمْ عَلَيْكُمْ غُمَّةً ثُمَّ اقْضُوا إِلَيَّ وَلَا تُنظِرُونِ
నువ్వు వారికి నూహ్‌ (అలైహిస్సలాం) గాధను వినిపించు. అప్పుడు అతను తన జాతివారితో, "ఓ నాజాతివారలారా! నేను మీ మధ్య ఉండటం, దైవాజ్ఞలను ఉపదేశించటం మీకు సహింపశక్యం కాకపోతే (పోనివ్వండి), నేను మాత్రం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. మీరు మీభాగస్వాములతో కలసి మీ వ్యూహం విషయంలో గట్టి నిర్ణయానికి రండి!. ఆ పిదప మీ వ్యూహరచన మీలో ఎలాంటి శంకకు కారణం కాకూడదు. ఆ పైన నా విషయంలో ఏం చేయాలనుకున్నారో చేయండి. నాకు గడువు ఇవ్వవలసిన అవసరం కూడా లేదు" అని అన్నాడు.
10:72  فَإِن تَوَلَّيْتُمْ فَمَا سَأَلْتُكُم مِّنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ
అప్పటికీ మీరు విముఖత చూపితే, నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలం కోరలేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత కేవలం అల్లాహ్‌ది. ముస్లింగా ఉండాలని నాకు ఆదేశించబడింది.
10:73  فَكَذَّبُوهُ فَنَجَّيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ وَجَعَلْنَاهُمْ خَلَائِفَ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ
అయినా వారు అతన్ని ధిక్కరిస్తూనే ఉన్నారు. అందుచేత మేము అతన్నీ, అతనితోపాటు ఓడలో ఉన్నవారినీ కాపాడాము. వారిని వారసులుగా చేశాము. మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చిన వారిని ముంచి వేశాము. చూడు! హెచ్చరించబడిన వారికి ఏ గతిపట్టిందో!
10:74  ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا بِهِ مِن قَبْلُ ۚ كَذَٰلِكَ نَطْبَعُ عَلَىٰ قُلُوبِ الْمُعْتَدِينَ
మరి నూహ్‌ (అలైహిస్సలాం) అనంతరం మేము అనేకమంది ప్రవక్తలను వారిజాతుల వద్దకు పంపాము. వారు తమ జనుల వద్దకు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని వారు మొదట్లో ధిక్కరించిన విషయాన్ని మళ్లీ అంగీకరించటం అన్నది జరగనేలేదు. ఈ విధంగా మేము హద్దుమీరిపోయే వారి హృదయాలపై సీలు వేసేస్తాము.
10:75  ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِم مُّوسَىٰ وَهَارُونَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ بِآيَاتِنَا فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُّجْرِمِينَ
మరి ఆ ప్రవక్తల తరువాత మేము మూసాను, హారూనును ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు మా సూచనలను ఇచ్చి పంపాము. కాని వారు అహంకారం ప్రదర్శించారు. వారు అపరాధ జనులు.
10:76  فَلَمَّا جَاءَهُمُ الْحَقُّ مِنْ عِندِنَا قَالُوا إِنَّ هَٰذَا لَسِحْرٌ مُّبِينٌ
అటుపిమ్మట మావద్ద నుంచి వారికి సత్యబద్ధమైన నిదర్శనం చేరగా వారు "ఇది పచ్చి మంత్రజాలం" అని అన్నారు.
10:77  قَالَ مُوسَىٰ أَتَقُولُونَ لِلْحَقِّ لَمَّا جَاءَكُمْ ۖ أَسِحْرٌ هَٰذَا وَلَا يُفْلِحُ السَّاحِرُونَ
"ఏమిటీ, సత్యంతో కూడుకున్న నిదర్శనం మీవద్దకు వచ్చేసిన తరువాత దాని గురించి ఇలాంటి మాటలంటారా? ఇది మంత్రజాలమా? మంత్రజాలంచేసే వారు సఫలీకృతులు కాలేరు" అని మూసా (అలైహిస్సలాం) చెప్పాడు.
10:78  قَالُوا أَجِئْتَنَا لِتَلْفِتَنَا عَمَّا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا وَتَكُونَ لَكُمَا الْكِبْرِيَاءُ فِي الْأَرْضِ وَمَا نَحْنُ لَكُمَا بِمُؤْمِنِينَ
దానికి వారు, "మేము మా తాతముత్తాతలను ఏ పద్ధతిపై చూశామో ఆ పద్ధతి నుంచి మమ్మల్ని తప్పించటానికి నువ్వు మావద్దకు వచ్చావా?! ఇలా చేసి మీరిద్దరూ భూమిలో పెద్దరికం పొందాలనుకుంటున్నారా? మేమెన్నటికీ మీ ఇద్దరినీ విశ్వసించబోము" అని చెప్పారు.
10:79  وَقَالَ فِرْعَوْنُ ائْتُونِي بِكُلِّ سَاحِرٍ عَلِيمٍ
"ఆరితేరిన మాంత్రికులందరినీ నాముందు హాజరుపరచండి" అని ఫిర్‌ఔన్‌ ఆదేశించాడు.
10:80  فَلَمَّا جَاءَ السَّحَرَةُ قَالَ لَهُم مُّوسَىٰ أَلْقُوا مَا أَنتُم مُّلْقُونَ
మాంత్రికులు వచ్చినప్పుడు, "మీరు పడవేయాలనుకున్న వాటిని పడవెయ్యండి" అని మూసా వారితో అన్నాడు.
10:81  فَلَمَّا أَلْقَوْا قَالَ مُوسَىٰ مَا جِئْتُم بِهِ السِّحْرُ ۖ إِنَّ اللَّهَ سَيُبْطِلُهُ ۖ إِنَّ اللَّهَ لَا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدِينَ
వారు పడవేయగానే మాంత్రికులతో మూసా ఇలా అన్నాడు: "మీరు తెచ్చినది మంత్రజాలం. అల్లాహ్‌ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు. అల్లాహ్‌ ఇలాంటి కల్లోల జనకుల పనిని చక్కబడనివ్వడు.
10:82  وَيُحِقُّ اللَّهُ الْحَقَّ بِكَلِمَاتِهِ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ
అపరాధులకు మింగుడు పడకపోయినా సరే అల్లాహ్‌ తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు.
10:83  فَمَا آمَنَ لِمُوسَىٰ إِلَّا ذُرِّيَّةٌ مِّن قَوْمِهِ عَلَىٰ خَوْفٍ مِّن فِرْعَوْنَ وَمَلَئِهِمْ أَن يَفْتِنَهُمْ ۚ وَإِنَّ فِرْعَوْنَ لَعَالٍ فِي الْأَرْضِ وَإِنَّهُ لَمِنَ الْمُسْرِفِينَ
మూసా (అలైహిస్సలాం)ను అతని జాతికి చెందిన కొద్దిమంది మాత్రమే విశ్వసించారు. ఆ కొద్దిమంది కూడా, ఫిరౌనుకు, అతని సర్దారులకు – వారు తమను ఎక్కడ వేధిస్తారోనని భయపడుతూ ఉండేవారు. అవును మరి! ఆరాజ్యంలో ఫిరౌన్‌ ప్రాబల్యం కలిగి ఉండేవాడు, దానికి తోడు హద్దు మీరిపోయేవాడు.
10:84  وَقَالَ مُوسَىٰ يَا قَوْمِ إِن كُنتُمْ آمَنتُم بِاللَّهِ فَعَلَيْهِ تَوَكَّلُوا إِن كُنتُم مُّسْلِمِينَ
మూసా (అలైహిస్సలామ్‌)తన వారినుద్దేశించి, "నా జాతిప్రజలారా! మీరు అల్లాహ్‌ను విశ్వసించేవారే అయితే, మీరు ముస్లిములే అయితే ఆయన్నే నమ్ముకోండి" అన్నాడు.
10:85  فَقَالُوا عَلَى اللَّهِ تَوَكَّلْنَا رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظَّالِمِينَ
దానికి వారు, "మేము అల్లాహ్‌నే నమ్ముకున్నాము. మా ప్రభూ! మమ్మల్ని ఈ దుర్మార్గుల పరీక్షా సాధనంగా చేయకు."
10:86  وَنَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكَافِرِينَ
"నీ కృపతో మమ్మల్నిఈ అవిశ్వాసుల చెరనుండి విడిపించు" అని వేడుకున్నారు.
10:87  وَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ وَأَخِيهِ أَن تَبَوَّآ لِقَوْمِكُمَا بِمِصْرَ بُيُوتًا وَاجْعَلُوا بُيُوتَكُمْ قِبْلَةً وَأَقِيمُوا الصَّلَاةَ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ
"మీరిద్దరూ మీ వాళ్ళకోసం ఈజిప్టులో నివాసగృహాలను ఏర్పాటు చేయండి. ఆ ఇళ్లు ఖిబ్లా దిశలో ఉండేట్లు చూసుకోండి. నమాజును నెలకొల్పండి. (మూసా!) నీవు విశ్వాసులకు శుభవార్తను అందజేయి" అని మేము మూసాకు, అతని సోదరునికీ వహీ పంపాము.
10:88  وَقَالَ مُوسَىٰ رَبَّنَا إِنَّكَ آتَيْتَ فِرْعَوْنَ وَمَلَأَهُ زِينَةً وَأَمْوَالًا فِي الْحَيَاةِ الدُّنْيَا رَبَّنَا لِيُضِلُّوا عَن سَبِيلِكَ ۖ رَبَّنَا اطْمِسْ عَلَىٰ أَمْوَالِهِمْ وَاشْدُدْ عَلَىٰ قُلُوبِهِمْ فَلَا يُؤْمِنُوا حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ
మూసా ఇలా విన్నవించుకున్నాడు : "మా ప్రభూ! నీవు ఫిరౌనుకు, అతని సర్దారులకు ప్రపంచ జీవితంలో అందమైన సాధన సంపత్తులను, ఐశ్వర్యాన్నీ ఇచ్చావు. వారు ప్రజలను నీమార్గం నుంచి తప్పించటానికే ఇదంతా ఇచ్చావా ప్రభూ!? మాప్రభూ! వారి సిరిసంపదలను సర్వనాశనం చెయ్యి! బాధాకరమైన శిక్షను చూసేవరకూ వారు విశ్వసించకుండా ఉండేలా వారిగుండెలను కఠినమైనవి గానేఉంచు.''
10:89  قَالَ قَدْ أُجِيبَت دَّعْوَتُكُمَا فَاسْتَقِيمَا وَلَا تَتَّبِعَانِّ سَبِيلَ الَّذِينَ لَا يَعْلَمُونَ
"మీరిద్దరి విన్నపం ఆమోదించబడింది. కాబట్టి మీరు నిలకడగా ఉండండి. జ్ఞానం లేనివారి మార్గాన్ని అనుసరించకండి" అని అల్లాహ్‌ సెలవిచ్చాడు.
10:90  وَجَاوَزْنَا بِبَنِي إِسْرَائِيلَ الْبَحْرَ فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ وَجُنُودُهُ بَغْيًا وَعَدْوًا ۖ حَتَّىٰ إِذَا أَدْرَكَهُ الْغَرَقُ قَالَ آمَنتُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا الَّذِي آمَنَتْ بِهِ بَنُو إِسْرَائِيلَ وَأَنَا مِنَ الْمُسْلِمِينَ
మేము ఇస్రాయీలు వంశీయులను సముద్రం దాటించాము. వారి వెనుకే ఫిరౌను తన సైన్యాన్ని తీసుకుని దౌర్జన్యానికి, అతిక్రమణకు పాల్పడే ఉద్దేశంతో వెంబడించాడు. తీరా (సముద్రంలో) మునిగిపోతున్నప్పుడు; ''బనీఇస్రాయీల్‌ విశ్వసించిన దేవుణ్ణి నేనూ విశ్వసిస్తున్నాను. ఆ దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నేనూ ముస్లింలలోని వాడనే'' అని ఫిరౌను పలికాడు.
10:91  آلْآنَ وَقَدْ عَصَيْتَ قَبْلُ وَكُنتَ مِنَ الْمُفْسِدِينَ
ఇప్పుడా విశ్వసించేది?! ఇంతకు ముందు తలబిరుసుతనాన్ని ప్రదర్శిస్తూ, కల్లోల జనకులలో చేరి ఉండేవాడివి కదా!
10:92  فَالْيَوْمَ نُنَجِّيكَ بِبَدَنِكَ لِتَكُونَ لِمَنْ خَلْفَكَ آيَةً ۚ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ عَنْ آيَاتِنَا لَغَافِلُونَ
కాబట్టి ఈ రోజు, నీవు నీ తర్వాతి తరాలకు గుణపాఠం అయ్యే నిమిత్తం నీ శవాన్ని మాత్రమే రక్షిస్తాము. యదార్థమేమిటంటే జనులలో చాలామంది మా సూచనలను నిర్లక్ష్యం చేస్తారు (అని సమాధానం ఇవ్వబడింది).
10:93  وَلَقَدْ بَوَّأْنَا بَنِي إِسْرَائِيلَ مُبَوَّأَ صِدْقٍ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ فَمَا اخْتَلَفُوا حَتَّىٰ جَاءَهُمُ الْعِلْمُ ۚ إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
మేము ఇస్రాయీలు సంతతి వారికి చాలా మంచి నివాసస్థలాన్ని, తినటానికి పరిశుద్ధమైన ఆహారపదార్థాలను ఇచ్చాము. వారి వద్దకు (మంచీ చెడుల) జ్ఞానం వచ్చిన తరువాతే వారు విభేదించుకున్నారు! నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయదినాన వారు విభేదించుకుంటూ ఉన్న విషయాలపై వారి మధ్య తీర్పు చేస్తాడు.
10:94  فَإِن كُنتَ فِي شَكٍّ مِّمَّا أَنزَلْنَا إِلَيْكَ فَاسْأَلِ الَّذِينَ يَقْرَءُونَ الْكِتَابَ مِن قَبْلِكَ ۚ لَقَدْ جَاءَكَ الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
మరి మేము నీ వద్దకు పంపిన దానిపై ఏమాత్రం సందేహమున్నా నీకు పూర్వపు గ్రంథాన్ని పారాయణం చేస్తున్నవారిని అడిగి చూడు. నిశ్చయంగా నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుంచి సత్యం (తోకూడిన గ్రంథం) వచ్చింది. కనుక నువ్వు ఎంతమాత్రం శంకించేవారిలో చేరకు.
10:95  وَلَا تَكُونَنَّ مِنَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ فَتَكُونَ مِنَ الْخَاسِرِينَ
అల్లాహ్‌ ఆయతులను అసత్యాలని ధిక్కరించిన వారిలో కూడా చేరకు. నువ్వు గనక అలాచేశావంటే నష్టపోయినవారిలో చేరిపోతావు సుమా!
10:96  إِنَّ الَّذِينَ حَقَّتْ عَلَيْهِمْ كَلِمَتُ رَبِّكَ لَا يُؤْمِنُونَ
ఎవరి విషయంలో నీ ప్రభువు మాట నిజమని నిరూపితమయిందో వారు ఎన్నటికీ విశ్వసించరు.
10:97  وَلَوْ جَاءَتْهُمْ كُلُّ آيَةٍ حَتَّىٰ يَرَوُا الْعَذَابَ الْأَلِيمَ
ఒకవేళ వారివద్దకు నిదర్శనాలన్నీ చేరినా సరే-వ్యధాభరితమైన శిక్షను చూడనంతవరకూ (వారు విశ్వసించరు).
10:98  فَلَوْلَا كَانَتْ قَرْيَةٌ آمَنَتْ فَنَفَعَهَا إِيمَانُهَا إِلَّا قَوْمَ يُونُسَ لَمَّا آمَنُوا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ
(ఈ విధంగా ఆపదకు చేరువయిన తరువాత) విశ్వాస ప్రకటనచేసే వారి విశ్వాసం – ఒక్క యూనుస్‌ జాతివారికి తప్ప ఇతర బస్తీ వాసులెవరికీ లాభదాయకం కాలేదు. వారు (యూనుస్‌ జాతి ప్రజలు) విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకూ జీవనలాభం పొందే అవకాశం వారికి కల్పించాము.
10:99  وَلَوْ شَاءَ رَبُّكَ لَآمَنَ مَن فِي الْأَرْضِ كُلُّهُمْ جَمِيعًا ۚ أَفَأَنتَ تُكْرِهُ النَّاسَ حَتَّىٰ يَكُونُوا مُؤْمِنِينَ
నీ ప్రభువు గనక తలచుకుంటే భూమండలంలోని జనులంతా విశ్వసించి ఉండేవారే. అలాంటప్పుడు (ఓముహమ్మద్‌- స!) జనులు విశ్వసించాల్సిందేనని నువ్వు వారిపై బలవంతంచేస్తావా?
10:100  وَمَا كَانَ لِنَفْسٍ أَن تُؤْمِنَ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَيَجْعَلُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يَعْقِلُونَ
వాస్తవానికి దైవాజ్ఞ కానంత వరకూ ఎవడూ విశ్వసించడు. బుద్ధిహీనులపై అల్లాహ్‌ అశుద్ధతను వేసేస్తాడు.
10:101  قُلِ انظُرُوا مَاذَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَا تُغْنِي الْآيَاتُ وَالنُّذُرُ عَن قَوْمٍ لَّا يُؤْمِنُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "ఆకాశాలలో, భూమిలో ఏ వస్తువులయితే ఉన్నాయో వాటిని కాస్త (నిశిత దృష్టితో) చూడండి!" విశ్వసించని వారికి సూచనలుగానీ, హెచ్చరికలుగానీ లాభదాయకం కాజాలవు.
10:102  فَهَلْ يَنتَظِرُونَ إِلَّا مِثْلَ أَيَّامِ الَّذِينَ خَلَوْا مِن قَبْلِهِمْ ۚ قُلْ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
బహుశా వీళ్లు తమకు పూర్వం గతించిన వారికి ఎదురయిన సంఘటనల లాంటి వాటికోసం ఎదురుచూస్తున్నారేమో! ''సరే. అలా అయితే మీరూ నిరీక్షించండి. మీతోపాటే నేనూ నిరీక్షిస్తాను'' అని (ఓప్రవక్తా!) వారికి చెప్పు.
10:103  ثُمَّ نُنَجِّي رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا ۚ كَذَٰلِكَ حَقًّا عَلَيْنَا نُنجِ الْمُؤْمِنِينَ
మరి మేము మా ప్రవక్తలను, విశ్వసించినవారిని కాపాడేవారము. అదే విధంగా విశ్వసించిన వారిని కాపాడటం మా విధి.
10:104  قُلْ يَا أَيُّهَا النَّاسُ إِن كُنتُمْ فِي شَكٍّ مِّن دِينِي فَلَا أَعْبُدُ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ وَلَٰكِنْ أَعْبُدُ اللَّهَ الَّذِي يَتَوَفَّاكُمْ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
(ప్రవక్తా!) వారికి చెప్పు: "ప్రజలారా! నాధర్మం పట్ల మీకు సందేహం ఉంటే (వినండి), అల్లాహ్‌ను వదలిపెట్టి మీరు పూజించే వారిని నేను పూజించను. అయితే మీప్రాణాలను స్వాధీనం చేసుకునే అల్లాహ్‌ను నేను ఆరాధిస్తున్నాను. విశ్వసించేవారిలో ఉండాలని నాకు ఆదేశించబడింది."
10:105  وَأَنْ أَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ
"పూర్తి ఏకాగ్రతతో (ఈ) ధర్మం వైపుకు అభిముఖం కావాలనీ, షిర్క్‌ చేసేవారిలో చేరిపోరాద" ని కూడా నాకు చెప్పబడింది.
10:106  وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ
"అల్లాహ్‌ను వదలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్ని గానీ, కీడును గానీ కలిగించలేని దానిని నువ్వు ఆరాధించకు. ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకడివవుతావు" (అని హెచ్చరించబడింది).
10:107  وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ
ఒకవేళ అల్లాహ్‌ నిన్ను ఏదైనా బాధకు గురిచేస్తే ఆయన తప్ప మరొకరెవరూ దానిని దూరం చేయలేడు. ఒకవేళ ఆయన నీకు ఏదైనా మేలు చెయ్యగోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన తన కృపను తన దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.
10:108  قُلْ يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَنِ اهْتَدَىٰ فَإِنَّمَا يَهْتَدِي لِنَفْسِهِ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۖ وَمَا أَنَا عَلَيْكُم بِوَكِيلٍ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "ప్రజలారా! మీ వద్దకు మీప్రభువు తరఫు నుంచి సత్యం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎవడైనా సన్మార్గానికి వస్తే అతడు తన (మంచి) కోసమే సన్మార్గానికి వస్తాడు. మరెవడైనా అపమార్గానికి లోనైతే ఆ అపమార్గం అతనికే హానికరం అవుతుంది. నేను మీపై నియమించబడిన కావలివాణ్ణి మాత్రం కాను."
10:109  وَاتَّبِعْ مَا يُوحَىٰ إِلَيْكَ وَاصْبِرْ حَتَّىٰ يَحْكُمَ اللَّهُ ۚ وَهُوَ خَيْرُ الْحَاكِمِينَ
(ఓ ప్రవక్తా!) నువ్వు నీవద్దకు పంపబడే వహీని అనుసరిస్తూ ఉండు. అల్లాహ్‌ తీర్పు చేసేవరకూ ఓపిక పట్టు. ఆయన తీర్పుచేసే వారిలోకెల్లా శ్రేష్ఠుడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.