హరీస్


హరీస్ అనేది ఓ అమోఘమైన వంటకం. దీన్ని మేక మాంసం మరియు గోధుమ పిండి మొదలగు వాటితో  తయారు చేస్తారు. ఇది అరబు వంటకం. అరబుల ద్వారా ఇది హైదరాబాద్ రాష్ట్రానికి (భారత దేశానికి) నిజాం పాలనలో వచ్చింది.

 

విషయసూచిక

 

మూలం 

నగరానికి చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు సజ్జాద్ షాహిద్ ఏమన్నాడంటే, సుల్తాన్ సైఫ్ నవాజ్ జంగ్ హలీంని ప్రసిద్ధిగావించారు. యమన్ లో  గల  హద్రమౌత్ అనే ఓ చిన్న రాజ్యానికి పాలకుడైన సైఫ్ నవాజ్ జంగ్ అల్ ఖువైతి రాజ వంశానికి చెందినవాడు. అతడు నిజాం పరిపాలకులకు విధేయుడు కావడం వలన అతడు తను ఇచ్చే అన్ని విందులలో హరీస్ ని సమర్పించేవాడు.        

 

పదార్థాలు

ఎముకలు లేని మాంసం

1 కిలో

గోధుమ (పిండి రవ్వ)

500 గ్రాములు

ఎముకలు (లుకాన)

500 గ్రాములు

మాష్ పప్పు

20 గ్రాములు

వంట నూనె 

300 గ్రాములు 

స్వచ్చమైన నెయ్యి 

150 గ్రాములు 

ఎర్ర కారపు పొడి

1 పెద్ద చెంచ

పాలు

1 లీటర్

ఉల్లిపాయ

500 గ్రాములు

కొతిమీర్

6 కట్టలు

పుదీనా

3 కట్టలు

పెరుగు

250 గ్రాములు 

కాజు

50 గ్రాములు 

చిరంజీ

50 గ్రాములు 

ఇలైచి

10 గ్రాములు

షాజీర

10 గ్రాములు 

దాల్చిని

20 గ్రాములు 

నల్ల కారపు పొడి

20 గ్రాములు 

పచ్చ కారం

10 గ్రాములు 

నిమ్మకాయ

2 చిన్న కాయలు 

పసుపు 1 పెద్ద చెంచ

 

GI ధృవీకర

రుచికరమైన హరీస్ రమజాన్ మాసంలో ‘హైదరాబాద్ హరీస్’ గా geographical  indication వారి ద్వారా పేర్కొనబడింది.  geographical  indication (GI) అనేది భారత ప్రభుత్వ సంస్థ. హైదరాబాదీ హరీస్ ను ఈ సంస్థ 2010లో ధృవీకరించింది. మాంసపు వంటకాలలో ఈ విధంగా ధ్రువీకరించబడడం భారత దేశంలో మొట్ట మొదటిది ఇదే. హైదరాబాదీ హరీస్ (GI) సంస్థ ద్వారా ధ్రువీకరించబడడం వల్ల దీన్ని దాని ఉన్నత విలువలకు తగ్గించి అమ్మడం ఎట్టి పరిస్థితిలోనూ సరికాదు. 

 

పౌష్టికాహార విలువలు

హరీస్ లో చాలా పౌష్టికాహారాలు ఉన్నాయి. ఇది మనిషికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో తొందరగా అరిగిపోయే పదార్థాలు ఉంటాయి. ఇది మెల్లగా జీర్ణం అవుతుంది. ఇందులో చాలా ప్రోటీన్ లు ఉంటాయి, అవి మనిషి శరీరానికి చాలా అవసరం.

 

వైవిధ్యాలు

ఇందులో వేసే పదార్థాలను బట్టి హరీస్ లో రెండు రకాలు గలవు. ఒకదాంట్లో మేక మాంసంతో పాటు గోధుమ పిండి, బార్లీ మొదలగు పదార్థాలు ఉంటాయి. రెండో రకంలో అనేక రకాల కాయధాన్యాలు ఉంటాయి. కొవ్వు తగ్గించుకునేవారి కొరకు కోడి మాంసపు హరీస్ తయారుచేయబడుతుంది.  

 

ఆధారాలు 

http://www.ovguide.com/hyderabadi-haleem-9202a8c04000641f8000000006b50b37#

http://articles.timesofindia.indiatimes.com/2012-08-17/food-reviews/32829098_1_haleem-hyderabadi-dish-madina-hotel

Contributed by Syeds family

http://currentaffairsappsc.blogspot.in/2010/09/gi-certificate-for-hyderabadi-haleem.html

http://ipindia.nic.in/girindia/journal/Journal_37.pdf

http://articles.timesofindia.indiatimes.com/2012-08-17/food-reviews/32829098_1_haleem-hyderabadi-dish-madina-hotel

1907 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్