స్త్రీలుఇస్లాంవైపుకు ఎందుకు మరలుతున్నారు ప్రస్తుతం మీడియా ఇస్లాం పై అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ, లేని పోని అభాండాలు వేస్తున్నప్పటికీ, ఇస్లాం స్త్రీలను నొక్కిపెడుతుందని చెబుతున్నప్పటికీఅల్లాహ్ కృప వల్లప్రపంచంలో వేగవంతంగా ప్రజలు స్వీకరిస్తున్న ధర్మం ఇస్లాం.ఇందులో విశేషమేమిటంటే ఇస్లాం స్వీకరిస్తున్న వారిలో ఎక్కువ శాతం ‘స్త్రీలే’. “ఇస్లాం ద్వారా స్త్రీలు పొందుతున్న హోదా మరియు విలువ” ఖుర్ఆన్ ఇస్లాం లో స్త్రీ అయినా, పురుషుడైనా అల్లాహ్ కు సమానం. వారి కర్మలకు చెందినంతవరకు స్త్రీ అయినా, పురుషుడైనా మంచి పనికి మంచి బహుమానం మరియు చెడ్డ పనికి ఘోరమైన శిక్ష అనుభవిస్తారు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది:భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి - కాని ఉత్తమ రీతిలో! కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకింత ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ సర్వాధికుడు, వివేచనాపరుడు.ఖుర్ఆన్ సూరా బఖరా 2:226 హదీస్ ఖచ్చితంగా స్త్రీలు పురుషులు సమాన భాగాలు. తిర్మిజి,113; సహీహ్ హుత్ తిర్మిజిలో అల్బాని గారు దిన్ని ధ్రువీకరించారు. ప్రస్తుత సమాజంలో స్త్రీల పరిస్థితి సమాజంలో స్త్రీల స్థితి కొత్తదీ కాదు, పూర్తిగా పరిష్కరించబడనూలేదు. ఇస్లాం గురించి చెప్పేటప్పుడు స్త్రీలకు స్వేచ్చ లేదనీ, ఇంటివరకే– వంటవరకే పరిమితమైపోయిందనీ ప్రచారం చేస్తారు.కొందరైతే పరదా మూలంగా స్త్రీల స్వేచ్ఛ, ఎదుగుదల ఆగిపోయిందని గంటల కొద్దీ చెబుతూ పోతారు. వారందరికి ఒకే ప్రశ్న చాలు. అదేమిటంటే – యూరోప్, అమెరికాలాంటి నాగరికత దేశాలలో, అక్కడే పుట్టి పెరిగిన ఆడవారు ఇస్లాం ఎందుకు స్వీకరిస్తున్నారు. అక్కడి స్త్రీలు పాశ్చాత్య దేశాలు ఇస్తున్న స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని విడిచి, స్త్రీల స్వేచ్ఛకు అడ్డువేసే ఇస్లాం ను ఎందుకు అవలంబిస్తున్నారు? పాశ్చాత్య దేశాల ‘స్వాతంత్ర్యాన్ని’ తిరస్కరించుట పాశ్చాత్య దేశాల స్వాతంత్ర్యం స్త్రీలను దిగజార్చుతుంది, అదే ఇస్లాం వీరిని ఉన్నత స్థానం ఆపాదిస్తుంది. వారు స్త్రీల కొత్త సమస్యలు లేవనెత్తి పాత సమస్యలను వదిలేస్తున్నారు. మీడియా పురుషులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. అందుకే అక్కడి స్త్రీలు ఇస్లాం వైపు మొగ్గు చూపుతున్నారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అన్నారు: మీరూ, మీ భార్యలూ సంతోషంగా (సగౌరవంగా) స్వర్గంలో ప్రవేశించండి.ఖుర్ఆన్ సూరా జుఖ్రుఫ్ 43:70 ముస్లిం స్త్రీలు ఇస్లాం సమాజంలో స్త్రీలకూ, పురుషులకూ వారి వారి పూర్తి హక్కుల్ని, బాధ్యతల్నితెలియపరుస్తుంది. ఇస్లాంవారిరువురిలో ఎవరినీ అన్యాయం చేయదు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “సత్కార్యాలు చేసేవారు - వారు పురుషులైనా,స్త్రీలైనా- విశ్వసించి ఉంటే, ఇలాంటివారు తప్పకుండా స్వర్గంలో ప్రవేశి స్తారు. వారికి ఖర్జూరపు విత్తనంపై ఉండే గాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు.” ఖుర్ఆన్, సూరా నిసా4:124 నిర్ధారణ ఏ మనిషైతే స్త్రీని గౌరవించి, ఆమెతో న్యాయంగా మెలుగుతాడోఅతనే నిజమైన మగాడు మరియు మర్యాదస్తుడు, అదే ఎవడైతే ఆడవారిని అవమానపరుస్తాడో అతడు చాల చెడ్డ వ్యక్తి అని ఇస్లాం బోధిస్తుంది. “అందరికంటే ఉత్తమమైన వ్యక్తిత్త్వం గలవాడు పూర్తి విశ్వాసి. మీలో మీ ఇంటివారితో ఉత్తమంగా మేలిగేవాడే అందరికంటే ఉత్తముడు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు.తిర్మిజి1162 ఆధారాలు http://www.beconvinced.com/archive/en/article.php?articleid=0073&catid=09&subcatname=Conversion%20To%20Islam(ఇంగ్లీష్) See Also: Women in Islam; Women's_Liberation_Through_Islam (ఇంగ్లీష్)  |