ముస్లిం ఇస్లాం ను అనుసరించేవాడిని ముస్లిం అంటారు. ముస్లిం అనగా తన ఇచ్ఛాశక్తి ని అల్లాహ్ కు సమర్పించేవాడు. ఇస్లాం మొదటి నియమం షహాద అనగా అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అంతిమ దైవప్రవక్త. దీని విస్తృత అర్ధం తన కోరికలను ఇష్టపూర్వకంగా అల్లాహ్ కు సమర్పించడం. ఇందు మూలంగా తెలిసిందేమిటంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం కు ముందు వచ్చిన ప్రవక్తలందరూ ముస్లింలే, ఎందుకంటే వారు కూడా తమ ఇచ్ఛాశక్తి ని ఇష్టపూర్వకంగా అల్లాహ్ కు సమర్పించారు. ఖుర్ఆన్ అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా ఆదేశించిన విధంగా తన జీవితాన్ని గడిపేవాడు నిజమైన ముస్లిం. ఒక మనిషి తన పుట్టుక ద్వారా కాక, తన విశ్వాసం మరియు కర్మల ద్వారా ముస్లిం అవుతాడు. “ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. ఆయన ఒకే దేవుని వైపు అభిముఖుడైన ముస్లిం. ఖుర్ఆన్, సూరా అల్ ఇమ్రాన్ 3:67 ఖుర్ఆన్ లో అనేక చోట్ల ముస్లిం అనే పేరు వస్తుంది. సూరా బఖర 2:128, 132, 133, ఆలి ఇమ్రాన్ 3:52, 64, 102, అన్ఆమ్ 6:163, ఫుసిలత్ 41:33 ఇంకెన్నో .... హదీస్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “ఎవరి నోరు మరియు చేతులతో ఇతరులు సురక్షితంగా ఉంటారో అతనే ముస్లిం, అల్లాహ్ వీడమన్న దాన్ని వీడే వాడు ముహాజిర్.” సహీహ్ అల్ బుఖారీ vol 6:4999 మహోన్నతుడైన అల్లాహ్ కు తనను తాను సమర్పించే ప్రతీది ముస్లిం అవుతుంది ఎవరైతే తనను తాను అల్లాహ్ కు సమర్పించుకొని అల్లాహ్ ఆదేశాలను శిరసావహిస్తారో వారినే అరబిక్ లో ముస్లిం అంటారు. - అల్లాహ్ ఆజ్ఞ్యతో తల్లి కడుపులో నుండి వచ్చే బిడ్డ దేనిపై ఉంటాడు? ముస్లిం అయి ఉంటాడు.
- భూమి తన మండలానికి చుట్టుగా తిరిగినప్పుడు అది ఏమై ఉంటుంది? అది ముస్లిం అయి ఉంటుంది.
- సూర్యమండలానికి చుట్టూ సూర్యుడు తిరిగినప్పుడు ఏమై ఉంటాడు? ముస్లిం అయి ఉంటాడు.
- చంద్రమండలం చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు ఏమై ఉంటాడు? ముస్లిం అయి ఉంటాడు.
- గురుత్వాకర్షణ శక్తి ఏమిటి? అది కూడా ముస్లిం.
అనగా, అల్లాహ్ కు విధేయత చూపే ప్రతీది ముస్లిం అవుతుంది. కావున, మనస్ఫూర్తిగా అల్లాహ్ కు విధేయత చూపేవారు ముస్లిం అవుతారు. ముస్లిం ల మూడు విశిష్టమైన విషయాలు ఓ ముస్లిం జీవితం మూడు ముఖ్యమైన విషయాలపై ఆధారపడి ఉంది : - ఈమాన్ అనగా విశ్వాసం, అల్లాహ్ పై, దైవదూతలపై, దైవగ్రంథాలపై, దైవప్రవక్తలపై, ప్రళయదినం పై, దైవ విధి(చెడ్డదైన, మంచిదైన)పై;
- 5 మూల స్తంభాలు : విశ్వాసం, ఐదు పూటల నమాజ్, జకాత్, రమజాన్ ఉపవాసాలు, హజ్.
- ఇహ్ సాన్, పై వాటిలో ఆధ్యాత్మికంగా ఎదగడం మరియు ఇతరుల పట్ల ఉత్తమంగా మెలగడం.
ముస్లింల సంగ్రహము ఇస్లామీయ విధానాల ద్వారా ముస్లిం వ్యక్తిత్వం ఇలా తయారవుతుంది: - ముస్లిం నిజాయితీపరుడు, మోసం చేసేవాడు కాదు.
- అతను అణకువగలవాడు, అహంకారి కాదు.
- నీతిగలవాడు, అవినీతిపరుడు కాదు.
- అతను ఇతరులతో ప్రేమగా మెలిగేవాడు, ధిక్కరించేవాడు కాదు.
- అతను మృదు స్వభావి, కఠినమైనవాడు కాదు.
- అతను చాలా వినమ్రుడు మరియు సహాయకారి, ఇతరులను కించపరిచేవాడు, అవమానపరిచేవాడు కాదు.
- అతను ఉదాత్తమైనవాడు, స్వార్ధపరుడు కాదు.
- అతనికి దొరికిన దాంట్లో తృప్తి చెందుతాడు, అసంతృప్తి చెందడు.
- అతను సద్గుణ సంపన్నుడు, కామాంధుడు కాదు.
- అతను అప్రమత్తుడు, పరాకుకలిగిన వాడు కాదు.
- అతను హుందాగలవాడు, దిక్కుమాలినవాడు కాదు.
- అతను నిజాయితీ గలవాడు, కపటుడు కాదు.
- అతను ఎల్లప్పుడూ అల్లాహ్ పై నమ్మకం ఉంచుతాడు, నిరాశ చెందడు
. - అతను తన కర్తవ్యాలను నెరవేర్చేవాడు, అశ్రద్ధ వహించే వాడు కాదు.
- అల్లాహ్ కు కృతజ్ఞత చూపుతూ అతడినే ప్రార్ధిస్తూ ఉంటాడు, అల్లాహ్ కారుణ్యాలను మరచిపోడు.
ఆధారాలు http://www.islamweb.net/emainpage/index.php?page=articles&id=134495 (ఇంగ్లీష్) http://www.islamicfinder.org/articles/article.php?id=1008&lang=english (ఇంగ్లీష్)  |