భార్యాభర్తల పరస్పర హక్కులు మరియు బాధ్యతలు


 ఇస్లాం ధర్మం భర్త పై భార్య యొక్క బాధ్యతను మరియు భార్య పై భర్త యొక్క బాధ్యతను విధించినది. అలాగే మరి కొన్ని బాధ్యతలను భార్యాభర్తలిద్దరి పైనా  విధించినది.

 

విషయసూచిక

 

భర్త పై భార్యకు గల హక్కులు

భర్త పై భార్యపట్ల ఆర్థికపరమైన హక్కులు ఉన్నాయి. భర్త ఆవిడకు మహర్ అంటే బాడుగ ఇవ్వటం, ఆవిడ ఖర్చులు భరించడం, ఆవిడకు సరైన వసతి కల్పించడం మొదలైనవి.

 

(a)  మహర్ (బాడుగ): ఇది పెళ్ళి జరిగే సమయంలో లేదా శోభన సమయంలో భర్త నుండి భార్య పొందవలసి ఉన్న ధనం. దీనిని తప్పని సరిగా ప్రతి భర్త తన భార్యకు ఇవ్వవలసి ఉంటుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “(పెళ్ళి చేసుకోబోయే) స్త్రీలకు మంచి మనస్సుతో వారి మహర్ ను చెల్లించండి.” [ఖుర్ఆన్, సూరా అన్ నిసా4:4]

 

“ఒకవేళమీరుస్త్రీలనుతాకకుండా,  వారిమహర్‌నునిర్ధారించకుండానేవారికివిడాకులిస్తేఅదికూడామీకుపాపంకాదు.అయితేవారికిఎంతోకొంతప్రయోజనంచేకూర్చండి. స్థితిమంతుడుతనస్థితికితగినట్లుగా,   పేదవాడుతనస్థోమతకుతగినట్లుగాధర్మంప్రకారంప్రయోజనంచేకూర్చాలి. ఉత్తమంగావ్యవహరించేవారికిఇదివిధిగానిర్ణయించబడింది.”[ఖుర్ఆన్, సూరా అల్ బఖరహ్ 2:236]

 

(b) ఖర్చులు - పోషణ:

భార్యను పోషించటమంటే (ఖర్చులు భరించటమంటే) ఆవిడకు సమంజసమైన రీతిలో భోజన సదుపాయాలు మరియు వసతి సౌకర్యాలు కల్పించటం. భార్య ధనవంతురాలైనా సరే ఆ ఖర్చులను భర్త నుండి పొందే పూర్తి హక్కు ఆవిడకు ఉన్నది. ఎందుకంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాని బిడ్డ తండ్రి, (ఆ బిడ్డ) తల్లి యొక్క భోజనసదుపాయాల మరియు దుస్తుల ఖర్చులు సమంజసమైన రీతిలో (రీజనబుల్) భరించవలసి ఉన్నది.” [ఖుర్ఆన్, సూరా బఖరా 2:233]

 

ఆయేషా రజిఅల్లాహు అన్హా ఉల్లేఖించిన హదీస్ లో ఇలా ఉన్నది: “అబూ సుఫ్యాన్ భార్య అయిన హింద్ బిన్తె ఉత్బా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం  వద్దకు వచ్చి, ఇలా పలికెను, ‘ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం, అబూ సుఫ్యాన్ నా పై మరియు నా పిల్లలపై ఖర్చు పెట్టని ఒక పిసినారి మనిషి. ఆయనకు తెలియకుండా ఖర్చుల కోసం నేను ఆయన ధనంలో నుండి కొంత తీసుకుంటూ ఉంటాను. అలా చేయటం వలన నాపై ఏమైనా పాపం ఉంటుందా?’ దానికి జవాబుగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం  ఇలా పలికినారు, ‘నీకు మరియు నీ పిల్లలకు సరిపడేటంత ధనం మాత్రమే ఆయన సంపద నుండి తీసుకో, ఇది సమంజసంగా ఉండవలెను (అవసరాలకు మించి తీసుకోకూడదు).’(బుఖారీ, ముస్లిం)

 

తన అంతిమ హజ్ ప్రసంగంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం  బోధించిన విషయాన్ని జాబిర్ రజిఅల్లాహు అన్హు ఒక హదస్ లో ఇలా ఉల్లేఖించినారు: “స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి! అల్లాహ్ యొక్క రక్షణలో మీరు వారిని తీసుకున్నారు. వారితో సంభోగించటం అల్లాహ్ యొక్క సందేశాల ఆధారంగా ధర్మబద్దం చేయబడినది. మీకు కూడా వారిపై హక్కులు ఉన్నాయి, మీరు ఇష్టపడని వారెవ్వరినీ మీ పరుపు పై కూర్చోనివ్వరాదు[అంటే ఇంటిలోనికి అనుమతించ కూడదు]. కాని ఒకవేళ వారలా చేస్తే, మీరు వారిని శిక్షించండి, కాని తీవ్రంగా కాదు. మీ పై వారికున్న హక్కులు ఏమిటంటే, వారి భోజనసదుపాయాలు, దుస్తులు సమంజసమైన రీతిలో మీరు సమకూర్చటం.” (ముస్లిం)

 

(c) సరైన వసతి: ఇది కూడా భార్య హక్కులలోని ఒక ముఖ్యమైన హక్కు. దీని అర్థం - భర్త తన స్తోమతను, స్థాయిని బట్టి భార్యకు సరైన వసతి కల్పించవలసి ఉంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మీరు నివసించే చోట మీకు అనుకూలమైన విధంగా వారికి వసతి కల్పించండి.” [ఖుర్ఆన్, సూరా అత్తలాఖ్ 65:6]

 

భార్యపై భర్తకు గల హక్కులు

భార్యపై భర్తకు గల హక్కులు చాలా గొప్పవి; నిశ్చయంగా అతనికి ఆమె పై గల హక్కులు, ఆమెకు అతనిపై గల హక్కుల కంటే అధికమైనవి. ఎందుకంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటించినాడు (భావం యొక్క అనువాదం): “మరియు తమపై వారికున్న (భర్తలకున్న) హక్కుల మాదిరిగానే వారు (స్త్రీలు) కూడా తమ భర్తలపై సమంజసమైన హక్కులు కలిగి ఉన్నారు, కాని పురుషులు వారిపై ఒక వంతు అధికమైన హక్కులు కలిగిఉన్నారు.”  [ఖుర్ఆన్, సూరా  బఖరహ్ 2:228]

 

(a) భర్తకు విధేయత చూపటం: అల్లాహ్ స్త్రీల రక్షణ బాధ్యత, పోషణ బాధ్యత చూడమని పురుషుడికి ఆదేశించెను. ఎవరైనా తమ బాధ్యతలో ఉన్నవాటిని ఎలాగైతే తగిన జాగ్రత్తలు తీసుకుని మంచిగా కాపాడు కోవటానికి ప్రయత్నిస్తారో, అలాగే వారికి కూడా సరైన దారి చూపి, తగిన జాగ్రత్తలు తీసుకుని కాపాడమని ఆజ్ఞాపించెను.

 

 ‘ఇబ్నె అబ్బాస్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖన నుండి అలీ ఇబ్నె అబీ తల్హా ఇలా పలికినారు: “పురుషులు, స్త్రీల సంరక్షకులు మరియు పోషకులు” అంటే వారు స్త్రీల బాధ్యత వహించేవారు,అల్లాహ్ ఆదేశించిన విషయాలలో ఆవిడ అతనికి విధేయత చూపవలెను. అతని కుటుంబంతో మంచిగా ప్రవర్తించటం ద్వారా మరియు అతని సంపదను జాగ్రత్తగా కాపాడటం ద్వారా ఆవిడ అతనికి విధేయత చూపగలదు.”

 

(b) భర్తకు అందుబాటులో ఉండటం: భార్య నుండి శారీరకానందం పొందటమనేది భర్త హక్కులలోని ఒక ముఖ్యమైన హక్కు. ఒకవేళ అతను సంభోగం జరుప గలిగే స్త్రీని పెళ్ళి చేసుకున్నట్లయితే, వివాహ ఒప్పందపు నియమం ప్రకారం అతను పిలిచినప్పుడు ఆవిడ తనను తాను తప్పనిసరిగా సమర్పించు కోవలసి ఉంటుంది.  క్రొత్తగా పెళ్ళి అయివున్నప్పుడు ఆవిడ క్రొత్త పరిస్థితులకు అలవాటు పడటానికి కొంత సమయం  అంటే 2లేక 3దినాల సమయం అడిగితే, దానిని ఇవ్వవలసి ఉంటుంది. అయినా అదేమంత ఎక్కువ సమయం కాదు కదా. ఇంకా అలా ఇవ్వటం ఆచారం కూడా. 

 

ఒకవేళ భార్య తన భర్త సంభోగానికి పిలిచినప్పుడు, సరైన కారణం లేకుండా దానిని తిరస్కరించినట్లయితే, ఆవిడ హరాం పని చేసినట్లు మరియు ఘోరమైన పాపం చేసినట్లగును. ఇక్కడ సరైన కారణమంటే – బహిష్టు, తప్పని సరి ఉపవాసం (రమజాన్ ఉపవాసం), అనారోగ్యం మొదలైనవి.

 

అబు హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఇలా ఉపదేశించినారు: ‘ఎవరైనా భర్త తన భార్యను పక్క మీదికి పిలిచినప్పుడు, ఆవిడ పక్క మీదకి రాక తిరస్కరించిటం వలన, కోపంతో అతను నిద్రపోతే, తెల్లవారే వరకు దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు.’ (బుఖారీ, ముస్లిం)

 

(c) భర్తకు అయిష్టమైనవారిని ఇంట్లోనికి అనుమతించక పోవటం: భార్య పై భర్తకు ఉన్న ఇంకో హక్కు ఏమిటoటే, తను ఎవరినైతే ఇష్టపడడో, అటువంటి వారిని ఆవిడ అతని ఇంట్లోనికి రానివ్వకూడదు.

 

అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఇలా బోధించినట్లు తెలుపబడినది: “భర్త ఇంట్లో ఉన్నప్పుడు అతని అనుమతి లేకుండా ఉపవాసం ఉండటానికి లేదా ఇంట్లోకి ఎవరినైనా అనుమతించటానికి ఆవిడకు అనుమతి లేదు. మరియు అతని అనుమతి లేకుండా అతని సంపదలో నుండి ఖర్చుచేయటానికి కూడా.” (బుఖారీ, ముస్లిం)

 

పరస్పర హక్కులు

ఇబ్నె అబ్బాస్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖన వివరణ ఇలా ఉన్నది: ప్రేమాభిమానాలతో మరియు దయతో నిండిన, సమంజసమైన రీతిలో ఉత్తమంగా ప్రవర్తించే మంచి సహచర్యం తన భర్త నుండి పొందే హక్కు భార్యకు ఉంది. దానికి బదులుగా ఆవిడ తన భర్తకు విధేయత చూపవలసి ఉంది, ఆయన మాటను తు.చ. తప్పక శిరసావహించవలసి ఉంది. మరియు భర్తలు తమకు హాని కలిగించకూడదనే హక్కు వారికి ఉంది మరియు అలాంటిదే హక్కు వారిపై భర్తలకు ఉంది.

 

ఇబ్నె జైద్ ఇలా వివరించెను: మీరు వారి గురించి అల్లాహ్ కు భయపడ వలెను. అలాగే వారు కూడా మీ గురించి అల్లాహ్ కు భయపడవలసి ఉంది. 

 

ఆధారాలు

www.islamhouse.com(ఇంగ్లీష్)

2655 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్