బహుదైవారాధన


అల్లాహ్ పై విశ్వాసంలో రెండు రకాలు ఉన్నాయి. ఏకదైవారాధన, బహుదైవారాధన. ఏకదైవారాధన అనగా ఒకే దేవుణ్ణి (అల్లాహ్) ఆరాధించడం. మరి బహుదైవారాధన అనగా అనేక దేవుళ్ళను ఆరాధించడం.

 

విషయసూచిక

 

భావం

బహుదైవారాధన అనగా అల్లాహ్ తో పాటు ఇతరులను సహవర్తులుగా చేసి పూజించడం. దానినే  ‘షిర్క్’ అంటారు. అల్లాహ్ తో పాటు ఇతరేతర మానవులకు, వస్తువులకు దైవ లక్షణాలను ఆపాదించడం. ముఖ్యంగా దైవ నిర్ణయాల్లో, పేర్లలో, లక్షణాల్లో అల్లాహ్ తో  సహచరులను కూడగట్టడం. అల్లాహ్ తో పాటు ఇతరులకు కూడా మంచి – చెడు కలగజేసే సామర్ధ్యం ఉంటుందని నమ్మడం.   

 

బహుదైవారాధానలో రకాలు

బహుదైవారాధనలో ముఖ్యంగా మూడు రకాలు, అవి :

(1)   అష్ షిర్కుల్ అక్బర్ (పెద్ద ‘షిర్క్’)

(2)   అష్ షిర్కుల్ అస్గర్  (చిన్న షిర్క్)

(3)   అష్ షిర్కుల్ ఖఫి  (మనకు తెలియకుండా జరిగిపోయే ‘షిర్క్’)

వివరణ  :

(1)   అష్ షిర్కుల్ అక్బర్ (పెద్ద ‘షిర్క్’):    ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి :

 

(అ) షిర్కుద్దుఆ – విన్నవించుకోవడంలో, వేడుకోవడంలో అల్లాహ్ తో ఇతరులను జతపరచడం.

అల్లాహ్ సెలవిచ్చాడు : వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని, ఆయననే ప్రార్ధిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేలమీదకు తీసుకురాగానే ఆయనకు సాటి కల్పించసాగుతారు. ఖుర్ఆన్, సూరా అన్ కబూత్ 29 : 65

                (ఆ) షిర్కున్నియ్యహ్ : ఆరాధనలో తమ భావాల్ని  అల్లాహ్ కు కాకుండా ఇతరేతర దేవుళ్ళకు  తెలియజేయడం, వ్యక్తపరచడం.

అల్లాహ్ సెలవిచ్చాడు : ఎవరు ప్రాపంచిక జీవిత సౌకర్యాలు మరియు దాని అలంకరణ కోరుకుంటారో మేము వారి కర్మల ఫలితాన్ని, ఈ జీవితంలోనే పూర్తిగా చెల్లిస్తాము మరియు అందులో వారికెలాంటి లోపం జరుగదు. అలాoటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు.  వారు ఇందు (ఈ లోకం)లో పాటుపడిoదoతా వ్యర్ధమైపోతుంది మరియు వారు చేసిన కర్మలన్నీ విఫలమవుతాయి. ఖుర్ఆన్, 11:15,16

                 (ఇ) షిర్కుత్తాఅహ్ : అల్లాహ్ నిషేధించిన వాటిని విధేయత చూపడం.

అల్లాహ్ సెలవిచ్చాడు : వారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్ ను వదలి తమ యూద మతాచారు (అహ్ బారు)లను మరియు (క్రైస్తవ) సన్యాసు (రుహ్ బాను)లను మరియు మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు)ను తమ ప్రభువులుగా చేసుకున్నారు.  వాస్తవానికి, వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఆయన వారు సాటికల్పించే వాటికి అతీతుడు. ఖుర్ఆన్, సూరా తౌబహ్ 9:31   

ఒకసారి దైవప్రవక్త (సఅసం), పై ఖుర్ఆన్ ఆయత్ ను పఠిస్తుoడగా, అది బిన్ హాతిం (రజి) ఇలా అన్నారు : ఓ దైవప్రవక్త! వాళ్ళు వారిని (అహ్ బారు, రుహ్ బాను లను) పూజించరు. అప్పుడు దైవప్రవక్త (సఅసం) ఇలా అన్నారు : వారు పూజిస్తారు. వారు (అహ్ బారు, రుహ్ బాను)లు నిషేధించబడని వాటిని నిషేధించుకున్నారు మరియు నిషేధించబడిన వాటిని నిషేధించబడనివిగా చేసుకున్నారు; మరియు యూదులు, క్రైస్తవులు వారిని అనుసరించారు; ఇలా చేసిన కారణంగా వారు వారిని పూజించినట్లే. (తఫ్సీర్ అత్తబరి లో  అహ్మద్, అత్తిర్మిజీ, ఇబ్న్ జరీర్ ఉటంకించారు).  

  (ఈ) షిర్కుల్ మహబ్బహ్ : అల్లాహ్ కు చూపించవలసిన ప్రేమను(అల్లాహ్ ను తప్ప) ఇతరులకు చూపించడం.

అల్లాహ్ సెలవిచ్చాడు : అయినా ఈ మానవులలో కొందరు ఇతరులను, అల్లాహ్ కు సాటిగా కల్పించుకొని, అల్లాహ్ ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరి కంటే అత్యధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు.సర్వశక్తులూ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయనీఅల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్‌ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునేబదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్‌ పాపానికి ఒడిగట్టరు).ఖుర్ఆన్ సూరా బఖరహ్ 2:165      

(2) అష్ షిర్కుల్ అస్గర్  (చిన్న షిర్క్):  అందులో ‘అర్రియాఅంటే ప్రదర్శన : ప్రపంచపు పేరూ, కీర్తీ పొందాలని ఆశించి ఆరాధించడం.

(ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: నేను మీ లాంటి మానవుడిని మాత్రమే. (కాకపోతే) మీ ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం అన్న సందేశం (వహీ) నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చెయ్యాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు. ఖుర్ఆన్, సూరా కహఫ్ 18:110    

(3) అష్ షిర్కుల్ ఖఫి’  (మనకు తెలియకుండా జరిగిపోయే ‘షిర్క్’): అల్లాహ్ మనపై విదిష్టించిన దానితో సంతృప్తిపడకపోవడం, ఏకీభవించకపోవడం. ఎల్లప్పుడూ ఇలా జరిగితే బాగుండేది, అలా జరిగితే బాగుండేది అని భావించడం.

దైవప్రవక్త (సఅసం) సెలవిచ్చారు : చీమ నడుక కంటే మెల్లగా షిర్క్ మీలో ప్రవేశిస్తుంది. నేను మీకో విషయం చెబుతాను. అది చేస్తే, మీ నుంచి పెద్ద షిర్క్, చిన్న షిర్క్ అన్నీ దూరమవుతాయి. ఈ దుఆ చదవండి  – ‘అల్లాహుమ్మ ఇన్ని అఊజు బిక అన్ ఉష్రిక బిక వ అన ఆలము వ అస్తఘ్ఫిరుక లిమా లా ఆలము.’ (అనువాదం – నేను తెలిసి, తెలియకుండా చేసిన షిర్క్ నుండి నీ శరణు కోరుతున్నాను. దీని కోసం నీ క్షమాపణ వేడుకుంటున్నాను.) [సహీహ్ అల్ జామి3731]

 

అవిశ్వాసం – బహుదైవారాధనలో వ్యత్యాసాలు

“కష్ ఫుష్ షుబ్ హాత్”లో ప్రఖ్యాత ఇస్లామియా పండితులు ముహమ్మద్ బిన్ అబ్దుల్

వహ్హాబ్  ఇలా రాశారు,ఇస్లామియా విధానం ప్రకారం అవిశ్వాసం ఇస్లాం (ఈమాన్)కు వ్యతిరేకం. అవిశ్వాసంలో అనేక రకాలు  ఉన్నాయి.ఇందులో ఒకటి నిరాకరించడం,

అనగా ప్రవక్త(సల్లల్లాహు అలైహివ సల్లం) మరియు ఖుర్ఆన్ ను నిరాకరించడం). రెండోది సత్యాన్ని  తెలుసుకున్న తరువాత కూడా గర్వం, మదంలో పడి ఆచరించకపోవడం. ఈ అవిశ్వాసం ఇబ్లీస్ మరియు ఫిర్ఔన్ ను  పోలినది. మూడోది అవిశ్వాసంలో మానవుడు అనుమానం, సందేహంలో పడి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) మరియు  ఖుర్ఆన్ ను నిరాకరిస్తాడు. ఇలాంటి అవిశ్వాసం అవివేకులైన ముస్లిమేతరులలో కానవస్తుంది. దైవప్రవక్త     (సల్లల్లాహు అలైహివ సల్లం) మరియు ఖుర్ఆన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన ఏ మానవుడు ఇలాంటి సందేహలలో పడడు. ఇందులో మరో రకం ‘నిఫాక్ కుఫ్ర్’. ఇందులో మనిషి బయటకు తాను ముస్లిం అని అంటాడు కాని మనస్ఫూర్తిగా అతను ఇస్లాం స్వీకరించడు. షిర్క్ (బహుదైవారాధన) కూడా కుఫ్ర్ లాంటిదే.

 

ప్రఖ్యాత ఇస్లామిక్ పండితులు షేక్  ఇబ్న్ తైమియా (రహిమహుల్లా) ఇలా వ్రాశారు : ఎవరైతే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విధేయత చూపడో అతడు అవిశ్వాసి అవుతాడు. ఇంకా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పెంది అబద్ధం అని అనేవాడు, ఇంకా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అనుసరించక తన కోరికలకు దాసుడైనవాడు కూడ, మరి పొగరు మూలంగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అనుసరించనివాడు లేదా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తెచ్చిన దైవజ్ఞాలపై అనుమానం గలవాడు అవిధేయుడు అవుతాడు. ఇంకా అతను కూడ ఎవరైతే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తీసుకొచ్చిన దైవాజ్ఞలను తిరస్కరిస్తాడో అతనూ అవిధేయుడే. ఇంకా అతడు కూడ ఎవరైతే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించడో అతనూ అవిశ్వాసే.     

ఈ విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) తెచ్చిన ధర్మాన్ని తిరస్కరించినవాడు అవిధేయుడు. ‘షిర్క్’ (బహుదైవారాధన) చేసేవాడు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) సందేశాన్ని తిరస్కరించిన వాడవుతాడు. 

 

 పెద్ద షిర్క్ (బహుదైవారాధన) లోని ప్రతి కర్మ అవిశ్వాసంలో వస్తుంది, కాని అవిశ్వాసంలోని ప్రతీది షిర్క్ (బహుదైవారాధన)లోకి రాదు. సాధారణంగా ఏ కార్యం, వివరణ, నమ్మకం అయితే మనిషిని ఇస్లాం నుండి తీసివేస్తాయో దానిని కుఫ్ర్ (అవిశ్వాసం) అంటారు. షిర్క్ (బహుదైవారాధన) దాదాపు అవిశ్వాసం లాంటిదే. అయితే ఇది సర్వసాధారణం అయిపోయింది.

ఇబ్లీస్ మరి కొందరు యూదులు (వారు కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తారు, తౌరాత్ ను అనుసరిస్తారు కాని ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహివ సల్లం)ను నిరాకరిస్తారు.)   

 

బహుదైవారాధన నుండి కాపాడుకోవడం

 ఏకదైవారాధన పై విశ్వాసం మరియు అల్లాహ్ ను ప్రార్ధించే పద్ధతిని శుద్ధపరచడం కోసం ప్రయత్నించాలి :

ü  అల్లాహ్ ను తప్ప ఇతరులను పూజించరాదు, అల్లాహ్ ను ప్రశంసించినట్లు ఇతరులను ప్రశంసించరాదు

మనం అల్లాహ్ ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్ ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు. ఖుర్ఆన్ సూరా ఆలి ఇమ్రాన్ 3:64

ü  అల్లాహ్ తప్ప ఇతరులు రక్షించేవారు, ఉపకారులు కాజాలరు   

కాని అల్లాహ్ ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్ ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. ఖుర్ఆన్ సూరా బఖరహ్ 2:165   

ఉదాహరణకు అరబ్ పూర్వికులు తమ విగ్రహాలను ప్రేమిస్తూ, పూజిస్తూ భయపడేవారు. ఇలాంటి చర్యలు కేవలం అల్లాహ్ కొరకే చేయాలి.

ü  అల్లాహ్ సూచనలు తప్ప ఇతరులవి పాటించకూడదు, అల్లాహ్ కు విధేయత చూపినట్లుగా ఇతరులకు విధేయత చూపరాదు  

మానవాళి సమస్యలకు పరిష్కారం కేవలం అల్లాహ్ వద్దే ఉంది. అల్లాహ్ యే తన సృష్టితాల గురించి అన్నీ తెలిసినవాడు, మానవుల పట్ల అందరి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు, మనకు ఏది మంచో ఏది చెడో తెలిసినవాడు.

(ఓ ప్రవక్తా!) నీ పై అవతరించినదాన్నీ, నీకు పూర్వం వారిపై అవతరించిన దాన్నీ విశ్వసించాము అని అంటూనే తమ వ్యవహారాలను తీర్పు కోసం దైవేతరుల (తాగూత్) వద్దకు తీసుకు పోగోరే వారిని నీవు చూడలేదా? మరి నిజానికి షైతాన్ ను (తాగూత్ ను) తిరస్కరించమని వారికి (స్పష్టంగా) ఆదేశించటం జరిగింది. షైతానైతే వారిని మార్గం తప్పించి చాలా దూరంలో పడవేయాలని కోరుతున్నాడు. అల్లాహ్ అవతరింపజేసిన దాని వైపుకు, ప్రవక్త (సఅసం) వైపుకు రండి అని వారితో అన్నప్పుడల్లా, ఈ కపటులు నీ నుండి అయిష్టంగా ముఖం త్రిప్పుకొని పోవటాన్ని నీవు గమనిస్తావు. ఖుర్ఆన్, సూరా నిసా 4:60-61     

 

ముగింపు

మనలను షిర్క్ లో పడవేయటానికి సమాజంలో మన చుట్టూ ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం గ్రహించాలి.

మనం ముస్లిములము కాబట్టి ముస్లిమేతరులను అనుసరించకూడదు.

మనం స్వచ్చమైన ముస్లింలా – సహాబా (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల్లా) జీవితాన్ని గడపాలి. షిర్క్ (బహుదైవారాధన) లో పడవేయడానికి ప్రపంచంలో ఇరువైపులా జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన కలిగి ఉండాలి.    

 

ఆధారాలు

http://www.allaahuakbar.net/shirk/crime.htm(ఇంగ్లీష్)

http://islamqa.info/en/ref/34817(ఇంగ్లీష్)

 

 

 

 

1204 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్