పరిపాలన


''ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి'' అని అల్లాహ్‌ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మీకు చేసే ఉపదేశం ఎంతో చక్క నిది. నిస్సందేహంగా అల్లాహ్‌ అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. సూరా అన్ నిసా 4:58

 

విషయసూచిక

 

న్యాయంగా తీర్పు చేయండి

''ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి'' అని అల్లాహ్‌ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్‌ మీకు చేసే ఉపదేశం ఎంతో చక్క నిది. నిస్సందేహంగా అల్లాహ్‌ అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. సూరా అన్ నిసా 4:58

 

మృదు మనస్కుడు

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ దయవల్లనే నీవు వారి యెడల మృదు మనస్కుడవయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్ళిపోయేవారు. కనుక నువ్వు వారిపట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు, వారి క్షమాపణ కోసం (దైవాన్ని) వేడుకో. కార్య నిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి తుది నిర్ణయానికి వచ్చినప్పుడు, అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా అల్లాహ్‌ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు. సూరా ఆలి ఇమ్రాన్ 3:159

 

అల్లాహ్ ఆజ్ఞ

ఇంకా, వారు తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు. నమాజును నెలకొల్పుతారు. వారి (ప్రతి) పని పరస్పర సలహా సంప్రతింపుల ద్వారా జరుగుతుంది. మేము వారికి ప్రసాదిం చిన దానిలో నుంచి (మా పేరున) ఖర్చుపెడతారు. సూరా ఆష్ షూరా 42:38

 

అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా. ఆపైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్‌ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి మీకు నిజంగా అల్లాహ్‌పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అవశ్యం)! ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమ మైనది. సూరా అన్ నిసా 4:59

 

ఆధారాలు

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/4#58

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/3#159

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/42#38

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/4#59

 

326 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్