నాస్తికుడు


మానవజాతిలో నేడు రెండు వర్గాలు కలవు. ఒక వర్గం అల్లాహ్ పై విశ్వసిస్తుంది. వీరినిఆస్తికులు అంటారు. రెండవ వర్గం అల్లాహ్ పై విశ్వసించదు. వీరిని నాస్తికులు అంటారు.


నాస్తికత్వం అనగా ఒక మహోన్నతమైన శక్తి / అల్లాహ్ను నిరాకరించడం. వారి వాదన ప్రకారం ఈ సృష్టి తనకుతానే ఉనికిలోకి వచ్చింది. దీని వెనుక ఏ శక్తి లేదు.

 

విషయసూచిక

 

వైజ్ఞానిక, తార్కిక దృష్టిలో నాస్తికత్వం

నాస్తికులు ప్రతి విషయాన్ని వైజ్ఞానిక దృష్టితో చూస్తారు. కావున మనం వైజ్ఞానిక దృష్టి ద్వారానే నాస్తికుల వాదాన్ని పరిశీలిద్దాం.


విశ్వం ఉనికిలో ఉందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇది నిజం.విశ్వం ఉనికిలోకి రావడానికి ఇందులో ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది:

 

 1. ఇది స్వయంగా ఉనికిలోకి వచ్చి ఉంటుంది, అనగా ఇది స్వయంకృతం.
   
 2. ఇది శాశ్వతమైనది, ఇది సృష్టించబడలేదు మరియు అంతమూ కాదు.
   
 3. ఇది ఓ సృష్టికర్త ద్వారా సృష్టించబడినది.

 

సంభవం 1

ఇది స్వయంగా ఉనికిలోకి వచ్చి ఉంటుంది, అనగా ఇది స్వయంకృతం


ఈ విశ్వం స్వయంకృతం అనుకుంటే ఇది మొదటి నుంచి లేదు, తర్వాత ఉనికిలోకి వచ్చిందనితెలుస్తుంది. ఇది ఎలా ఉందంటే కలం (పెన్) లేదా మానవుడు స్వయంగా తనను తానే సృష్టించుకున్నాడు. ఇది తార్కికంగా కానీ, వైజ్ఞానికంగా కానీ సాధ్యం కానిది. కావున ఇది స్వయంగా ఉనికిలోకి వచ్చింది అనేదిఅసంభవం.

 

సంభవం 2

ఇది శాశ్వతమైనది, ఇది సృష్టించబడలేదు మరియు అంతమూ కాదు  


పోనీ, ఈ విశ్వం మొదటి నుంచీ ఉంది మరియు ఇది అంతం కానిది అనుకుంటే,వైజ్ఞానికంగా నిరూపించబడిన ‘బిగ్ బాంగ్ థియరీ’ తప్పని తేలుతుంది. ‘బిగ్ బాంగ్ థియరీ’ ద్వారా తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే, ఈ విశ్వానికి మొదలూ ఉంది, అంతమూ ఉంది. కాబట్టి ఇది కూడా అసంభవం.

 

సంభవం 3

ఇది ఓ సృష్టికర్త ద్వారా సృష్టించబడినది


ఇక మిగిలింది ఒకే ఒక్కటి. అదేమిటంటే, ఈ విశ్వాన్ని సృష్టించినవాడు ఒకడున్నాడు – అతనే అల్లాహ్ – సర్వాధిక్యుడు, సర్వోన్నతుడు. ఈ విశ్వానికి ఓ మొదలు అనేది ఉంది మరియు ఇది స్వయంకృతం కూడా కాదు – దీన్నిఓ మహోన్నతుడు సృష్టించాడు మరియు అతడు ఈ విశ్వంలోని భాగం కాడు, కావునఅతనికి ఈ విశ్వపు చట్టాలు వర్తించవు.


ఉదాహరణకు, అమెరికాలోనివసించేవ్యక్తికిభారతదేశపులేదాశ్రీలంకచట్టాలువర్తించవు. అలాగేసృష్టికర్తఅయినఅల్లాహ్ఈసృష్టిలోనివాడుకాదు. అందుచేతఅతనికిఈసృష్టిచట్టాలుఏవివర్తించవు. కావున:

 1. విశ్వం ప్రకృతి చట్టాల ప్రకారం నడుస్తుంది. సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ చట్టాలకు అతీతుడు. ఈ సృష్టిని సృష్టించినదే అతడు కావడం వల్ల సృష్టి యొక్క చట్టాలను కూడా అతడే సృష్టిస్తాడు.
   
 2. విశ్వానికిఆది, అంతం ఉండడం వల్ల ఇది ఓ పద్ధతి మరియు సమయం ప్రకారం నడుస్తుంది.
   
 3. సృష్టికర్త అయిన అల్లాహ్ కు ఆది అంతం అంటూ ఉండదు. కావున అతను అన్ని రకాల చట్టాలకు అతీతుడు.
   
 4. అల్లాహ్ ఈ విశ్వానికి లోబడి లేడు కాబట్టి మానవుడు అల్లాహ్ గురించి (అతని ఆకారం వగైరా) తెలుసుకోలేడు. ఎందుకంటే విశ్వానికి బయట గల విషయాలు మానవుని బుద్ధికి చేరుకోలేవు. దీని ద్వారా తెలిసిందేమిటంటే మానవుని జ్ఞానం ఈ సృష్టి పట్ల చాలా పరిమితమైనది.
   
 5. అల్లాహ్ ఈ సృష్టి చట్టాలకు అతీతుడు కావడం వలన ఈ సృష్టితాలు ఉన్నా లేకున్నా అతనికి ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ విశ్వం అంతమై పోయిననూ అతని ఉనికికి ఎలాంటి ప్రభావం ఉండదు.

 

నాస్తికత్వం మరియు నైతికత

సమాజంలో ఉండే మానవులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్న కొన్ని చట్టాలకు లోబడిన మీదటే ఈ సమాజంలో శాంతి నెలకొంటుంది. నాస్తికత్వం ఈ విశ్వానికి సృష్టికర్తను త్రోసిపుచ్చుతుంది. అలాంటి పరిస్థితిలో మానవులందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను తీర్చిదిద్దే బాధ్యత మానవుడిపై ఉంటుంది. సమాజంలో నివసించే మానవులే ఏది మంచో-ఏది చెడో నిర్ణయించాల్సి ఉంటుంది.


మంచి చెడు ప్రతి మానవుని ప్రకారం మారుతూ ఉంటుంది. దీని వల్లసామాజిక నైతిక విలువలు దెబ్బతింటాయి. నిజాయితీ, దయ, న్యాయం విషయంలో మానవులందరూ ఏకీభవిస్తారు కదా అని కొందరు అంటారు. కానీ ఇది నిజం కాదు మరియు ఆచరణలో పెట్టడం కష్టం.


ఉత్పాదకునికి తన ఉత్పాదన గురించి బాగా తెలుస్తుంది. అలాగే మానవుల గురించి ఈ విశ్వాన్ని సృష్టించిన అల్లాహ్ కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. అల్లాహ్ మన సృష్టికర్త కావున అతనికి మన మంచి చెడులన్నీ బాగా తెలుసు.చట్టాలు మానవుల చేతిలో ఉన్నచో వారు తమ స్వప్రయోజనాల కోసం వాటిని వాడె అవకాశం ఉంటుంది. తమ ఆధిపత్యం కోసం ఎన్నో పెద్ద దేశాలు చిన్న దేశాలను నాశనం చేయడం మనం చూస్తూనే ఉన్నాం.


దీని మూలంగా తెలిసేదేమిటంటే, నాస్తికత్వం సామాజిక నైతిక విలువల పునాదులనేపడగొడుతుంది. ఇది సమాజంలో శాంతికి శాపంగా మారుతుంది.

 

నాస్తికత్వం మరియు వికాసం

నాస్తికులు వికాస సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నారు. కానీ ఇది ఒక సిద్ధాంతం మాత్రమే. దీనికి ఎలాంటి వైజ్ఞానిక సాక్ష్యం లేదు. ఎందరో శాస్త్రవేత్తలు ఇది నిరాధారమని నిరూపించారు.


ఒకవేళ వికాస సిద్ధాంతాన్ని ఒప్పుకున్నా, నాస్తికులు విశ్వం ఎలా ఏర్పడిందో నిరూపించలేరు.


ఇక మనకు మిగిలింది ఒకే మార్గం, అదేమిటంటే ఓ మహోన్నతుడైన అల్లాహ్ఈ విశ్వాన్ని సృష్టించి అతని చట్టాలకనుగుణంగా నడిపిస్తున్నాడు.

 

ముస్లిం ఎవరు?

అరబిక్ పదం ‘ముస్లిం’ అనగా తనను తాను అల్లాహ్ కు సమర్పించుకోవడం.విధేయత చూపటం


మన చుట్టూ ప్రకృతిలో ఉన్న కొన్నిటిని పరిశీలిద్దాం.


ప్ర: సూర్యుడు ఎవరు, ఏమిటి?

జ: సూర్యుడు తన కక్ష్యలో తిరుగుతాడు. సూర్యుడు అల్లాహ్ చట్టానికి లోబడి నడుస్తున్నాడు, కాబట్టి సూర్యుడు ముస్లిం.(విదేయతం)


ప్ర: భూమి ఎవరు, ఏమిటి?

జ: భూమి తన కక్ష్యలో తిరుగుతుంది. అది అల్లాహ్ చట్టాన్ని శిరసవహిస్తుంది, కావున అది ముస్లిం. (విదేయతం)


ప్ర: మనిషి శరీరంలో రక్తం ఏమిటి?
జ: రక్తం మనిషి శరీరంలో అన్ని వైపులా ప్రవహిస్తుంది. అది అల్లాహ్ ఆజ్ఞానుసారం నడుస్తుంది. కావున అది కూడా ముస్లిం. (విదేయతం)


కావున ఏదైనా –ప్రకృతి అయినా లేదా మానవ శరీరంలోని అవయవాలైనా –అల్లాహ్ ఆజ్ఞానుసారం నడిచిన మీదట అది ముస్లిం అవుతుంది. (విదేయతం)

 

ముగింపు    

వైజ్ఞానిక మరియు తార్కిక  కోణం నాస్తికత్వానికి వ్యతిరేకంగా ఈ విశ్వానికి ఓ ప్రభువు ఉన్నాడని నిరూపిస్తుంది.


ఈ విశ్వానికి ప్రభవు వీటి చట్టాలకు అతీతుడు.


విశ్వప్రభువు అల్లాహ్ కు ఆది అంతం ఉండదు. ప్రాపంచిక చట్టాలు, సమయం అతనికి వర్తించదు.


అల్లాహ్ ప్రాపంచిక చట్టాలకు అతీతుడు కావడం వల్ల ఈ సృష్టి, అందులోని సృష్టితాలు ఉన్నా లేకున్నా అతనిపై ఎలాంటి ప్రభావం ఉండదు.  


నాస్తికత్వం ద్వారా నైతిక విలువలు కాపాడడం అసంభవం.


నాస్తికత్వం ద్వారా లభించే నైతికత్వం సామాజిక పునాదులనే కుదిపేస్తుంది.


అల్లాహ్, మన సృష్టికర్త కావడం వల్ల మానవుల మంచి చెడులు అతనికే బాగా తెలుసు.


వికాసపు వాదన ఒక సిద్ధాంతం మాత్రమే. వైజ్ఞానికంగా ఇది నిరూపితం కాలేదు. ఈ సిద్ధాంతం  విశ్వం సృష్టించబడటానికి కారణం చెప్పజాలదు

 

ఆధారాలు

http://dawah.invitetogod.com/category-1/debunking-atheism (ఇంగ్లీష్)

 

468 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్