దైవవిధిపై విశ్వాసం


ఇది విశ్వాసపు మూలస్తంభాలలో ఒకటి. అల్లాహ్ కు తెలియకుండా ఏ ఒక్క పనీ జరగదని ప్రతి ముస్లిం విశ్వసించాలి .

 

విషయసూచిక

 

విధివ్రాత

ఇస్లాంలో విధివ్రాతకు చాల ప్రాముఖ్యత ఉంది.  అల్లాహ్ కు తెలియకుండా ఏ ఒక్క పనీ జరగదని విశ్వసించాలి . మానవుడు చేసినదీ, చేస్తున్నదీ, చేయబోయేది అన్నీ అల్లాహ్ కు తెలుసు. మన చేష్టల గురించీ వాటి పర్యవసానాల గురించీ అన్నీ అల్లాహ్ కు తెలుసు. విధివ్రాత అంతా అల్లాహ్ చేతుల్లో ఉంది కాని మానవుడు కుడా తన కార్యకలాపాలతో విథివ్రాత కు కట్టుబడి ఉన్నాడు. మంచి ఉద్దేశం దురుద్దేశం కుడా మనిషి క్రియ కర్తల్లోనే వస్తుంది.

 

అల్లాహ్ ఆజ్ఞ

విదివ్రాతపై విశ్వసించడం ముస్లిం జీవితాన్ని సార్ధకం చేస్తుంది. ఒక ముస్లిం జీవితంలో(మంచి,చెడు) ఏది జరిగినా అది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారమే జరిగిందని విశ్వసిస్తాడు.కాని చెడు జరిగినంత మాత్రాన అల్లాహ్ పై నింద వేయకూడదు, మనిషి తో ఏదైనా చెడు జరిగితే దాన్ని అధిగమించడానికి అల్లాహ్ ను ఇంకా ఎక్కువగా ఆరాధిస్తాడు, తన చేష్టల ద్వారా అల్లాహ్ ను సంతోషపరిచే ప్రయత్నం చేస్తాడు మరియు అల్లాహ్ చేయమన్న వాటిని చేస్తూ, వదలమన్న వాటిని  వదలడానికి ప్రయత్నిస్తాడు.దైవాజ్ఞలను శిరసావహిస్తూ పుణ్యకర్యాలు చేస్తూ జీవిస్తాడు ప్రతీ దానికి స్వాభావిక అభిప్రాయాలకు లోనై వివిథ వాదాలకు గురికాడు  దీనినే దైవవిధిపై  ఈమాన్ (విశ్వాసం)అంటారు.        

 

ఆధారాలు

www.teluguislam.net(ఇంగ్లీష్)

1770 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్