దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివ సల్లం హాస్యము


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సాహసం చూపిన, కళ్ళనీళ్ళుగార్చిన, ఇతరులకుసలహాలుఇచ్చినసంఘటనలుమనంచాలాప్రస్తావించగలం. కాని మనలో ఎంతమంది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నవ్వుతున్నట్లు లేదా నవ్విస్తున్నట్లు, కనీసం మూడు ఉదాహరణలు ఇవ్వగలం?

ముస్లింలుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారి ఈ సున్నత్ ను అవలంబించాలి మరియు దీని ప్రాముఖ్యత తెలిపాలి. రుజుమార్గంపై నడవడం అంటే, కోపంగా ఉండడం లేదా ఇతరులు జంకేలా ప్రవర్తించడం కాదు. ఇది ఇస్లాంకు మరియుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ కు పూర్తి విరుద్ధం. ఈ సున్నత్ ను అవలంబించినఇస్లామీయ విద్వాంసులు మరియు పెద్దలు ప్రజల ప్రేమను చూరగొన్నారు. దీని వల్ల ఇతరులువిద్వాంసుల, పెద్దల దగ్గరకు వస్తారు.

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవితంఅన్ని రంగాల్లోనూప్రజలకు ఆదర్శం.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం హాస్యం కూడా చాలా అహ్లాదంగా ఉండేది. ఆయన హాస్యం నేడు కూడా మనకు నవ్వు తెప్పిస్తుంది.

 

విషయసూచిక

 

హదీస్

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జీవితం ద్వారా మనము నవ్వు మరియు హాస్యము కూడా నేర్చుకుంటాము. నవ్వితేదవడ కనిపించేలా గానీ, శరీరం కంపించేలా గానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఎన్నడూ నవ్వలేదు. ఈ రోజుల్లోలా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఎన్నడూ ఇతరులను కించపరిచే విధంగా గానీ లేదా అసభ్యకరమైన రీతిలో గానీ పరిహసించేవారుకాదు. ప్రజలను నవ్వించటానికి అబద్ధమాడకూడదు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మనకు బోధించారు. “ప్రజలను నవ్వించడానికి అబద్ధం చెప్పేవానిపై శాపం పడు గాక.” (అబూ దావూద్)


దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇతర విషయాల్లో సమతుల్యం పాటించినట్లుగా, హాస్యంలో కూడా సమతుల్యాన్ని పాటించేవారు. ఎక్కువగా నవ్వకూడదనిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మనకు హెచ్చరించారు. దీని వల్ల హృదయానికి హాని కలుగుతుందని కూడా చెప్పారు. “ఎక్కువగా నవ్వకండి, ఇది హృదయాన్ని చంపుతుంది.” (తిర్మిజి, ఇబ్నె మాజా)

 

ఓ చిరునవ్వు

జరీర్ ఇబ్న్ అబ్దుల్లా అల్ బజాలి (రజి) ఉల్లేఖించారు:నేను ఇస్లాం స్వీకరించాక దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నన్ను చూసిన ప్రతిసారి చిరునవ్వు చిందించేవారు. నేను గుర్రం పై కుదురుగా కూర్చోలేను అని ఓ సారిదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ముందు అన్నాను.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నా గుండెపై తన చేతితో కొట్టి ఇలా అన్నారు, “ఓ అల్లాహ్! ఇతన్ని దృడంగా చేయి మరియు రుజుమార్గంపై నడిచేవానిగా చేయి.” (ఇబ్న్ మాజా, షేక్ అల్బాని సహీహ్ ఇబ్న్ మాజాలో దీన్ని ధృవీకరించారు.)


ప్రయోజనకరమైన విషయాలు:
a) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన అనుయాయులందరినీ చాలా ప్రత్యేకంగా చూసేవారు. ఇది ఓ విజయవంతమైన నాయకుని, బోధకుని లక్షణం. దీని వల్ల ప్రతి అనుయాయి, విద్యార్ధి తనకు తన నాయకుని దగ్గర లేదా బోధకుని దగ్గర మంచి స్థానం ఉంది అని సంతోషపడుతాడు.
 
b) దీని గురించి ఆలోచించండి: మిమ్మల్ని చూసిన ప్రతిసారి చిరునవ్వు చిందించే వారు ఎవరైనా మీకు తెలుసా? సుబ్ హా నల్లాహ్, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సృష్టికంతటికీ కారుణ్యం.జరీర్(రజి) ఉల్లేఖనం ప్రకారం, తాను ఇస్లాం స్వీకరించినప్పటి నుండి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తనను చూసిన ప్రతిసారి చిరునవ్వు చిందించేవారు. ఒక మనిషిని చూసిన ప్రతిసారి చిరునవ్వు చిందించడానికి ప్రయత్నించండి. దీని వల్ల ఎంత లాభం కలుగుతుందో చూడండి.
 
c) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అందరికీ అందుబాటులో ఉండేవారు. ఈ రోజుల్లో ఎవరైనాపెద్ద మనిషిని కలవాలంటే చాలా కష్టం.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఒక రాజ్యాధినేత అయిననూ, ప్రజలకు చాలా సులువుగా లభ్యమయ్యేవారు. కావున సమాజంలోని పెద్దలు (బోధకులు, ఇమాములు, నేతలు)దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ పై అమలుచేస్తూ, ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండాలి.
 
d) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జరీర్(రజి) కోసం, గుర్రంపై కూర్చునే చిన్న విషయంపై కూడా దుఆ చేశారు. ఇది మనందరికీ ఒక గుణపాఠం. అన్ని పరిస్థితుల్లో అల్లాహ్ వైపే మరలాలి మరియు మన కోసం, ఇతరుల కోసం ఆయన్నే వేడుకోవాలి.

 

ఆడ ఒంటె

అనస్ ఇబ్న్ మాలిక్ (రజి) ఉల్లేఖించారు: ఒక మనిషి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు, “ఓ దైవప్రవక్తా!నేను స్వారీ చేయడానికి మీరు ఒక గుర్రం ఇవ్వండి.” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు, “ఒక ఆడ ఒంటె పిల్లాడు ఉన్నాడు. దాన్ని తీసుకో.” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నాకు ఒక పిల్ల ఒంటెను ఇవ్వదలుస్తున్నారు అని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళసాగాడు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అతన్ని వెనుకకు పిలిచి ఇలా అన్నారు, “ప్రతి ఒంటె (పెద్దదైనా, చిన్నదైనా) ఒక ఆడ ఒంటె పిల్లె కాదా!?” (అబూ దావూద్, షేక్ అల్బాని గారు సహీహ్ అబీ దావూద్ లో దీన్ని ధృవీకరించారు.)

ఉపయోగకరమైన విషయాలు:

a) అనుచరులు(సహాబా) ఎల్లప్పుడూదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను సహాయం కోసం అర్ధించేవారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంఎలాగైనా సహాయం చేస్తారని వారికి తెలుసు.


b) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అతణ్ణి వెనుకకు పిలిచి, తన మాటలోని ఆంతర్యాన్ని (హాస్యాన్ని) వివరించారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అతనికి తన హాస్యాన్ని వివరించిన విధానాన్ని కాస్త ఊహించండి.

 

స్వర్గంలో వృద్ధురాలు

హసన్(రజి) ఉల్లేఖనం ప్రకారం ఒక వృద్ధురాలుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు వచ్చింది. అల్లాహ్ తనకు స్వర్గంలో స్థానం కలిపించేలా అల్లాహ్ ను వేడుకోండి అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో విన్నవించుకుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు: “ఓ ఫలానా వారి తల్లి! స్వర్గంలో వ్రుద్దురాళ్ళు ప్రవేశించరు.” ఇది విని ఆ వృద్ధురాలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆమెను వెనక్కి పిలిపించి ఇలా అన్నారు, అల్లాహ్ చెప్పింది నువ్వు వినలేదా : “నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;వారు ప్రేమించే వారుగానూ, సమ వయస్సుగల వారుగానూ (ఉంటారు). (ఖుర్ఆన్ సూరా వాఖియా 56:35-37)


ప్రయోజనకరమైన విషయాలు:

a) స్త్రీలుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో సునాయాసంగా మాట్లాడేవారు.


b) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుర్ఆన్ లోని సూరా వాఖియా ఆయతు వివరణ ఇచ్చారు. విశ్వాసులైన స్త్రీలు వ్రుద్దులుగా మరణించిననూ, స్వర్గంలోయువతులుగా ప్రవేశిస్తారు.


c) నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావని,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆ వ్రుద్దురలికి జవాబు తిన్నగా ఇవ్వకుండా, ఆమె కోసం తన జవాబును ప్రత్యేకం చేశారు. నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావు గాని యవ్వన స్థితిలో అని ఆమెతో చమత్కరించారు.


d) ఆ వృద్ధురాలు స్వర్గంలో ప్రవేశం లభించదని విన్నప్పుడు,తీవ్రంగా ఏడ్చింది.

 

అల్లాహ్ వద్ద నీకు చాలా విలువ ఉంది.

అనస్ ఇబ్న్ మాలిక్ (రజి) ఉల్లేఖనం, జాహిర్ అనే ఒకతను బజారులో వస్తువులను అమ్ముతున్నాడు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అతణ్ణి వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని, తన పట్టు నుండి విడిపించుకో అని అతనితో అన్నారు. ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అక్కడి నుంచి వెళుతున్న వారితో ఇలా అన్నారు, “ఈ బానిసను ఎవరు కొనదలుస్తున్నారు?” అప్పటికీ ఇంకా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పట్టులోనే ఉన్న అతను నవ్వుతూ ఇలా అన్నాడు, “నాకు విలువ లేదు. నన్ను కొనడానికి ఎవరు ఇష్టపడరు (అతని వయసు మరియు వైకల్యం కారణంగా).”దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు, “కాని అల్లాహ్ వద్ద నీవు వెలకట్టలేనివాడివి (బహుమూల్యమైనవాడివి).” (అహ్మద్)


ప్రయోజనకరమైన విషయాలు:

a) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన సహచరుని వెనుక నుంచి వచ్చి పట్టుకుని, అతనితో కాసేపు ఆడుకున్నారు.


b) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సమయం తీసి, బజారులో అందరి ముందు ఒక క్రింద జాతి వాడిని (జాహిర్ – రజి)కలవడానికి వచ్చారు. ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనం.


c) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పరిహసిస్తు, జాహిర్(రజి)ను, అతను బానిస కానప్పటికీ అమ్మడానికి ప్రయత్నించారు. ఈ విధంగా చిన్న జాతి వారైన జాహిర్ (రజి), నాకు మంచి మిత్రులు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజలకు చాటిచెప్పారు.


d) జాహిర్(రజి), తనను కొనేవారు ఎవరు లేరని బాధపడినప్పుడు,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం, అల్లాహ్ వద్ద అతని విలువ తెలిపి అతణ్ణి ప్రోత్సహించారు.

 

పందెం

ఆయిషా(రజి) ఉల్లేఖించారు, “నేనుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ఒక ప్రయాణంలో వెళ్ళాను. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉండేదాన్ని.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజలతో ఇలా అన్నారు, ‘మీరు ముందుకు వెళ్ళండి.’ ప్రజలు ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నాతో ఇలా అన్నారు, ‘మనం పరుగుపందెం పెట్టుకుందాం.’ మా ఇద్దరి మధ్య పరుగు పందెం జరిగింది. నేను గెలిచాను. కొన్నాళ్ళకు నా బరువు పెరిగింది. ఆ సమయంలో నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ఒక ప్రయాణంలో వెళ్ళాను. ఆయన ప్రజలతో ‘ముందుకు వెళ్ళండి’ అని అన్నారు.వారు ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నాతో, ‘పరుగుపందెం పెట్టుకుందాం’ అన్నారు. మేము పందెం పెట్టుకున్నాము. ఈ సారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గెలిచారు. అప్పుడు ఆయన నవ్వుతూ ఇలా అన్నారు, ‘ఇది ఇంతకు మునుపు దానికి జవాబు.” (అహ్మద్)


ప్రయోజ కరమైన విషయాలు:

a) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం భార్యలు ప్రయాణంలో ఆయనతో పాటు వెళ్ళేవారు.


b) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన భార్యతో ఒంటరిగా సమయం గడపడం కోసం, సైన్యాన్ని ముందుకు పంపారు.


c) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆయిషా(రజి)తో పెళ్లికొత్తలో పరుగు పందెం పెట్టుకున్నారు.అంతే కాదు,దాన్ని గుర్తుంచుకుని కొన్నేళ్ళ తరువాత మళ్ళి అలాంటి పందాన్నే ఆమెతో పెట్టుకున్నారు.


d) ఆయిషా(రజి) పందెం ఓడిపోవడానికి కారణం తాను బరువు పెరగడమే అని ఆమెకు తెలుసు. కాని, ఆ విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆమె ముందుప్రస్తావించలేదు.


e) ప్రయాణంలో అందరూ అలసిపోతారు. అయిననూదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన భార్యను సంతోషపెట్టడానికి పరుగు పందెంలో పాల్గొన్నారు.


ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రేమ మరియు హాస్యం బయటపడుతాయి. ‘ఓ అల్లాహ్!దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై నీ శాంతి మరియు కరుణ కురియుగాక. ఆయనకు అల్ ఫజీల మరియు అల్ వసీల ప్రసాదించుగాక.


మనము ఈ జీవితంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చిరునవ్వును చూసే భాగ్యాన్ని కోల్పోయాము. కావున ఆఖిరత్ లో ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. అల్లాహ్ మమ్మల్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో పాటు ఫిర్దౌస్ అల్ అలా లో స్థానం ప్రసాదించుగాక – ఆమీన్.

 

ఆధారాలు

http://messagemagazine.com.au/archives/403 (ఇంగ్లీష్)
 
 

423 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్