దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లంగురించిబైబిల్లో


బైబిల్ రెండు భాగాలు. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. పాత నిబంధనను యూదులు ధార్మిక గ్రంథంగాభావిస్తారు. పాత నిబంధన మరియు కొత్త నిబంధన రెండిటినీ క్రైస్తవులు తమ ధార్మిక గ్రంథంగా భావిస్తారు.

 

విషయసూచిక

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పాత నిబంధనలో

1. బుక్ ఆఫ్ డ్యూట్రోనామి చాప్టర్ 18 వర్స్ 18:

మహోన్నతుడైన అల్లాహ్ మూసా అలైహిస్సలాంతోబుక్ ఆఫ్ డ్యూట్రోనామి చాప్టర్ 18 వర్స్ 18 లో ఇలా అన్నారు:

వారి సహోదరులలో నుండి నీవంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను.అతని నోట నా మాట ఉంచుదును. నేను అతని ఆజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను. 


క్రైస్తవులు ఇది జీసస్(ఈసా) అలైహిస్సలాం గురించి చెప్పబడింది అని అంటారు. ఎందుకంటే జీసస్ మోసెస్ (మూస) అలైహిస్సలాం లాంటి వారు, అంటే ఇద్దరూ యూదులు అని వారు అంటారు. కాని వారు దీన్ని నిరూపించలేరు. మోసెస్ మరియు జీసస్- ఇద్దరూ దైవప్రవక్తలే.


దీని ప్రకారం చూస్తే, బైబిల్ లోమోసెస్ తరువాత వచ్చిన సోలోమన్, ఇసాయ, ఎజ్కిల్, డానియెల్, హోసి, జోయెల్, మలాచి, జాన్ మొదలగు వారికి ఈ దైవవాణి వర్తిస్తుంది. ఎందుకంటే వారందరూ యూదులు మరియు ప్రవక్తలు.

 

 • ఇది కేవలం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కే వర్తిస్తుంది. ఎందుకంటే, మోసెస్ అలైహిస్సలాం మరియుదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం– ఇద్దరికీ తల్లి, తండ్రి ఉన్నారు. అదే జీసస్ అలైహిస్సలాం విషయంలో, ఆయనఅత్యద్భుతంగా తండ్రి లేకుండా జన్మించారు. దీన్ని మాథ్యు 1:18 మరియు లూక్ 1:35 లో ద్రువీకరించబడింది. అంతిమ దైవగ్రంథమైన ఖుర్ఆన్ లో కూడా దీని గురించి ఇలా సెలవీయబడింది. “దైవదూతలు, ''ఓ మర్యమ్‌! అల్లాహ్‌ నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్‌ ఈసా బిన్‌ మర్‌యమ్‌. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతను (అల్లాహ్‌) సామీప్యం పొందిన వారిలో ఒకడు.అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెద్దవాడైనప్పుడూను ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనులలోని వాడై ఉంటాడు'' అని అన్నప్పుడు;ఆమె, ''నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడ్తాడు? నన్ను ఏ మనిషీ తాకలేదే!'' అని అన్నది. ''అలాగే జరుగుతుంది. అల్లాహ్‌ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని చేయ సంకల్పించుకుని 'అయిపో' అని అంటే చాలు, అది 'అయిపోతుంది' అని (దైవదూత ద్వారా) సమాధానం లభించింది.(ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్ 3:45-47)
   
 • ఇద్దరికీపెళ్లిల్లయ్యాయి మరియు పిల్లలూ పుట్టారు. బైబిల్ ప్రకారం జీసస్ కు పెళ్లి కాలేదు, పిల్లలు కూడా లేరు.
   
 • ఇద్దరికీ సహజమైన మృత్యువు వచ్చింది. జీసస్ పైకి లేపుకోబడ్డారు.హీబ్రివ్ 5:7-8.

ఇంకా - “మర్యమ్‌ పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము” అని అనటం వల్ల - (వారు శిక్షను చవిచూశారు). నిజానికి వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే, వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు.  ఈసా విషయంలో విభేదించినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు.  అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు.  అసలు వారు ఆయన్ని చంపలేదు,పైగా అల్లాహ్‌ ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్‌ సర్వాధిక్యుడు, మహావివేకి.(ఖుర్ఆన్, సూరా నిసా 4:157-158)

 • దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మోసెస్ కు సోదరులవుతారు. అరబ్బులు యూదులకు సోదరులు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఇద్దరు కొడుకులు. ఇస్మాయీల్ మరియు ఇస్హాఖ్ అలైహిముస్సలాం. అరబ్బులు ఇస్మాయీల్ అలైహిస్సలాం వంశీయులు. యూదులు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వంశీయులు.
   
 • దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిరక్షరాసి. అల్లాహ్ ద్వారా ఆయనపై అవతరించిన వహీని ఆయన యధాతధంగా ఉచ్చరించేవారు. “వారి సహోదరులలో నుండి నీవంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాట ఉంచుదును. నేను అతని ఆజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను.” డ్యూట్రోనోమి 18:18
   
 • ఇద్దరూ ప్రవక్తలతో పాటు రాజులు కూడా అయ్యారు. వారు మొత్తం రాజ్యాన్నే శాసించారు. కాని జీసస్ ఇలా అన్నారు: “నా రాజ్యం ఈ ప్రపంచం కాదు.” గోస్పెల్ ఆఫ్ జాన్ 18:36
   
 • ఇద్దరూతమ జీవిత కాలంలోనే తమ ప్రజల ద్వారా ప్రవక్తలుగా స్వీకరించబడ్డారు. అదే జీసస్ ను ఆయన ప్రజలు తిరస్కరించారు.జాన్ చాప్టర్ 1 వర్స్ 11.
   
 • వారిద్దరూ తమ జాతి ప్రజల కోసం కొత్త చట్టాలను తెచ్చారు. కాని, జీసస్ ఎలాంటి కొత్త చట్టం తేలేదని బైబిల్ చెబుతోంది. మాత్యివ్5:17-18.

 
2. బుక్ ఆఫ్ ఇసాయహ్ 29:12

బుక్ ఆఫ్ ఇసాయహ్ 29:12 లో ఇలా అనబడింది:


“ఆయనపై ఒక గ్రంథం అవతరించింది. అందులోచదువు అని అనబడింది. నేను నిరక్షరాసిని అని ఆయన అన్నారు.”


ఖుర్ఆన్ లోని సూరా ఇఖ్రా సూరా నెం 93 లోని మొదటి ఆయతులలో ఇదే విధంగా అనబడింది.


3. సాంగ్స్ ఆఫ్ సోలోమోన్ చాప్టర్ 5 వర్స్ 16

సాంగ్స్ ఆఫ్ సోలోమోన్ చాప్టర్ 5 వర్స్ 16లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పేరుతో వివరించబడ్డారు.


అందులో ఇలా చెప్పబడింది: “హిక్కో మమిత్తకిం వె కుల్లో ముహమ్మదిమ్ జెహ్ దూదెహ్ వ జెహ్ రాయి బైన జెరుసలెం.”

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కొత్త నిబంధనలో

“మీతో చిరకాలం ఉండి, మీకు సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని పంపుమని నేను తండ్రిని అడుగుతాను.” ఇక్కడ‘ఉత్తరవాది’ అనే పదం ముహమ్మద్  సల్లల్లాహు అలైహివ సల్లం కోసం ఉపయోగించబడింది.గోస్పెల్ ఆఫ్ జాన్ 14:16


“నేను నా తండ్రి నుండి సత్య స్వరూపియైన ఆత్మను మీకు ఆదరణకర్తగా పంపుతాను. తండ్రిలో నుండి వచ్చిన ఈ ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిస్తాడు.” గోస్పెల్ ఆఫ్ జాన్ 15:26


కాని నేను వెళ్ళటం మీ మంచి కోసమే. ఇది నిజం. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదరణకర్త రాడు. నేను వెళ్తే ఆయన్ని పంపగలను.” గోస్పెల్ ఆఫ్ జాన్ 16:7

 

ఖుర్ఆన్

“ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాసి  అయిన  ఈ ప్రవక్తను అనుసరించేవారు (కరుణించబడతారు), అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు  గ్రంథాలలో  లిఖితపూర్వకంగా లభిస్తుంది......”(ఖుర్ఆన్, సూరా ఆరాఫ్ 7:157)
 

రాబోయే ప్రవక్త అరేబియా నుంచి వస్తారు

డ్యూట్రోనోమి 33:1-2లో మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం గురించి చెప్పబడింది. దైవజనుడైన మోషే మ్రుతినోన్డక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను – యోహోవాసీనాయి నుండి వచ్చెను. శేయీరులోనుండి వారికి ఉదయించెను. ఆయనపారాను కొండనుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహములమధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడి పార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను. PSALMS 84:4-6లో ఇలా అనబడింది:నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములువారికి అతి ప్రియములు. వారుబాకా లోయలో బడి వెళ్ళుచుదానిని జలమయముగా చేయుదురు.తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. జెనెసిస్25:13లో ఇలా అనబడింది: ఇస్మాయీల్ రెండో కొడుకు పేరు కేదార్. ఆయన ప్రవక్త ముహమ్మద్ పూర్వీకులు.

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కా నుంచి మదీనా వలస: బైబిల్ లో చెప్పబడిందా?

హబక్కుక్ 3;3 లో ఇలా ఉంది: దేవుడు తేమానులో నుండి వస్తున్నాడు. పరిశుద్ధుడుపారాను పర్వతంమీది నుండి వస్తున్నాడు. యోహోవా మహిమ ఆకాశాన్ని కప్పివేసింది. ఆయన ప్రభావంతో భూమి నిండి పోయింది. ఇసాయ 21:13-17లో ఇలా ఉంది:అరేబియాను గూర్చిన దేవోక్తి దేదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి ఎడారిలో దిగవలెను. తేమాదేశ నివాసులారా, దప్పిగొన్న వారికి నీళ్ళు తెండి పారిపోవుచున్న వారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి. ఖడ్గ భయము చేతను దూసిన ఖడ్గ భయము చేతను ఎక్కుపెట్టబడిన ధనస్సుల భయము చేతను క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవుచున్నారు. ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడు – కూలి వారు ఎంచునట్లుగాఒకయేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాధ్యుల విలుకాండ్లలో శేషించువారుకొద్దివారగుదురు. ఈలాగు జరుగునవిఇశ్రాయేలుదేవుడైనయొహోవా సెలవిచ్చియున్నాడు.

 

ధార్మిక నాయకత్వం మారుతుందని ముందుగానే చెప్పబడిందా?

అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను.(జెనిసిస్ 21:13)


నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.(జెనిసిస్ 21:18)


యేసు దారి ప్రక్క నున్న ఒక అన్జూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇకమీదట నీకు ఫలం కలుగకుండా ఉండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్ల ఎండిపోయింది?” అని అడిగారు. యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వసిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టుమీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్లి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది.(మాథ్యు 21:19-21)


అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన రాజ్యాన్ని మీ నుండి తీసుకుని, ఆ రాజ్యానికి తగిన విధంగా ప్రవర్తించే వాళ్ళకు ఇస్తాడు. ఈ బండ మీద పడ్డ వాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.(మాథ్యు 21:43,44)

 

ముగింపు/ విశ్లేషణ

బైబిల్ లో ఇలాంటి ఎన్నో వచనాలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గురించి ఉన్నాయి.


“ఎవరయినా ఇస్లాంను  కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు.   అలాంటి  వ్యక్తి  పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.” (ఖుర్ఆన్, సూరా ఆలె ఇమ్రాన్ 3:85)

 

ఆధారాలు

http://sunnahonline.com/library/the-call-of-islam/483-bible-verses-about-the-prophet-muhammad (ఇంగ్లీష్)

 

240 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్