దైవగ్రంథాలపై విశ్వాసం


దైవగ్రంథాలను విశ్వసించడం విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి. అల్లాహ్ తన దయ వల్ల తన దాసులకు రుజుమార్గం చూపించటానికి మరియు ఇహ పర లోకాలలో సాఫల్యం పొందటానికి దైవగ్రంథాలను అవతరింపజేశాడు.

 

విషయసూచిక

 

ఖుర్ఆన్ వెలుగులో

“ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది.” (ఖుర్ఆన్ సూరా మాయిదా 5:48)

 

“మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము.  మరి మేమే దీనిని రక్షిస్తాము.” (ఖుర్ఆన్ సూరా హిజ్ర్ 15:9)

 

పూర్వపు గ్రంథాలలో మార్పులు చేర్పులు

దివ్య ఖుర్ఆన్ కు ముందు అవతరించిన అన్ని దైవగ్రంథాలలో మార్పులు చేయబడ్డాయి.

 

చిట్టచివరి దైవ గ్రంథం

ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎలాంటి మార్పు జరగకుండా ఉన్న ఏకైక దైవగ్రంథం దివ్య ఖుర్ఆన్ ఒక్కటే. ఇందులోని ఒక్కొక్క పదం అల్లాహ్ అవతరి౦పజేసినదే అని నమ్మడం, అల్లాహ్ ఉనికిని విశ్వసించడమే. ఖుర్ఆన్ ద్వారానే  ఇస్లాం స్థాపించబడింది. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం అల్లాహ్ అవతరింపజేసినదే.

 

ధర్మ సందేశం

అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా అవతరింపజేసిన ధర్మం ఇస్లాం. ఆ ప్రవక్తల్లో మూసా (అలైహిస్సలాం) ద్వారా తౌరాత్,  దావూద్  (అలైహిస్సలాం)  ద్వారా జబూర్, ఈసా (అలైహిస్సలాం) ద్వారా ఇంజీల్  అవతరిoపజేయబడ్డాయి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహుఅలైహివసల్లమ్) ద్వారా పంపబడిన అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్, అంతకు ముందు పంపబడిన దైవగ్రంథాలలో చివరిది,మరియు ప్రళయదినం వరకు సమస్త మానవాళికి మార్గదర్శకత్వం చేసేది.

 

ఆధారాలు

www.teluguislam.net(ఇంగ్లిష్)

685 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్