చిత్తశుద్ది (ఇఖ్లాస్)


ఇతరుల పొగడ్తల కోసం చేసే పనిలో చిత్తశుద్ది (ఇఖ్లాస్) ఉండదు. ఇలాంటి వారు ప్రజల విమర్శలను తట్టుకోలేకపోతారు. విమర్శలకు దూరంగా పరుగెడతారు. తమ మనోవాంఛల ప్రకారం ఎల్లప్పుడూ పొగడ్తలనే కోరుకుంటారు.


మనోవాంఛలకు అతీతంగా కేవలం అల్లాహ్ ప్రసన్నత మరియు స్వర్గం గురించి ఆలోచించే వారే నిజాయితిగా మెలుగుతారు.
 

“మరెవరైతే పరలోకాన్ని కోరుకుని, దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషి చేస్తాడో, విశ్వాసి అయి ఉంటాడో అలాంటి వాని కృషి అల్లాహ్ వద్ద ఆదరణ పొందుతుంది.” (ఖుర్ఆన్ సూరా బనీ ఇస్రాయీల్ 17:19)

 

విషయసూచిక

 

చిత్తశుద్ది (ఇఖ్లాస్) కు అనేక అర్ధాలు

  1. మనోవాంఛలకు దూరంగా, అల్లాహ్ సామీప్యాన్ని కోరడం 
     
  2. అన్ని రకాల ఆరాధనలు కేవలం అల్లాహ్ కే అంకితం అవ్వాలి
     
  3. సృష్టితాలను మరచిసృష్టికర్తపైధ్యానం పెట్టడం
     
  4. చెడు కార్యాలను దాచినట్లే, మంచి కార్యాలను కూడా దాయడం

 

చిత్తశుద్ది (ఇఖ్లాస్) అర్ధాల్లో ఒకటి –“ఆరాధన హక్కు అల్లాహ్ కు తప్ప ఎవరికీ లేదు,ఆరాధన కేవలం అల్లాహ్ కొరకే ఉండాలి.”

 
ఖుర్ఆన్

కేవలం విశ్వాసం (ఈమాన్) వలన మీ ఆరాధన స్వీకరించబడదు. అల్లాహ్ పై విశ్వాసం (ఈమాన్)తో పాటు, అల్లాహ్ కు సహవర్తులను కల్పించని నిజాయితీ గల ఆరాధనే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో సెలవిచ్చాడు: “విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గం (షిర్కు)తో కలగాపులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే.” (ఖుర్ఆన్, సూరా అల్ అన్ ఆమ్ 6:82)
ఇక్కడఅన్యాయం, దుర్మార్గం అంటే షిర్క్(బహుదైవారాధన) అని దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం తన అనుచరులతో అన్నారు. దీన్నిబుఖారీ కితాబుత్-తఫ్సీర్ లో పేర్కొన్నారు.


విశ్వాసం (ఈమాన్) పరిపూర్ణం కావాలంటే అల్లాహ్ ఓ షరతు విధించాడు. అది చిత్తశుద్ది (ఇఖ్లాస్). ఇది మనిషిని షిర్క్ నుండి కాపాడి రుజుమార్గం వైపుకు తీసుకెళుతుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు: “వారు అల్లాహ్ నే ఆరాధించాలని,ధర్మాన్ని అయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన, సవ్యమైన ధర్మం.” (ఖుర్ఆన్ సూరా బయ్యినహ్ 98:5)

 
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఆరాధనను అల్లాహ్కే ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని నాకు ఆజ్ఞాపించబడింది.” (ఖుర్ఆన్, సూరా జుమర్ 39:11)

 
హదీస్

“నాకు ఎవరి అవసరమూ లేదు. నాకు భాగస్వాముల అక్కరా లేదు. కావున, ఎవరైనా నాతో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తే , అతని ఆరాధన తిరస్కరించబడుతుంది.” (ముస్లిం)


ఆరాధనలో చిత్తశుద్ది (ఇఖ్లాస్) చాలా అవసరం

చిత్తశుద్ది విశ్వాసంలోని ఒక భాగం. అల్లాహ్ తప్ప ఇతరులెవరూ ఆరాధనకు అర్హులు కారు. ఈ భావంతో నిజాయితిగా అల్లాహ్ ఆరాధన చేయాలి.అల్లాహ్ ఖుర్ఆన్ లో సెలవిచ్చాడు: “విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గం (షిర్కు)తో కలగాపులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే.” (ఖుర్ఆన్, సూరా అల్ అన్ ఆమ్ 6:82)


ఇక్కడ అన్యాయం, దుర్మార్గం అంటే షిర్క్ (బహుదైవారాధన) అని దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం తన అనుచరులతో అన్నారు. దీన్ని బుఖారీ కితాబుత్-తఫ్సీర్ లో పేర్కొన్నారు.


విద్వాంసుల కోణం

అల్లాహ్ కు సహవర్తులను కల్పించినచో ఆ చర్య అల్లాహ్ వద్ద ఎట్టి పరిస్థితిలోనూస్వీకారయోగ్యం కాదు. యూసుఫ్ బిన్ అల్ హుస్సేన్ అర్ రాజీ రహమతుల్లాహ్ ఇలా అన్నారు: “ఈ ప్రపంచంలో చాలా కఠినమైనది ఇఖ్లాస్. ఎన్నో సార్లు నన్ను నేను రియా(ఇతరులను చూపించడానికి చేసే పని)నుంచికాపాడుకోవాలని చూశాను. కాని అది ఏదో ఒక రూపంలో మళ్ళి ప్రత్యక్షమయ్యేది.” [ఇబ్న్ రజబ్ అల్ హంబలి రహమతుల్లాహ్ గారిజామి ఉల్ ఉలూమ్ వల్హికాం]


ఆధారాలు

Author: Abu 'Iyadfrom'The Book of Worship' (ఇంగ్లీష్)

Taken from the Book [Al-Ikhlaas] by Abu Muhammad ibn Sa'eed al- Baylaawee(ఇంగ్లీష్)

 

316 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్