గర్భస్రావం


ఎబార్షన్ అనేది లాటిన్ భాష పదం. దీని భావం గర్భస్రావం. వైద్య విద్య ప్రకారం గర్భాన్ని ముందుగానే అంతంచేయడం.

 

విషయసూచిక

 

గణాంకాలు

WHO సంస్థ నిర్ధారణ ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు 40-50 మిలియన్ గర్భస్రావాలు జరుగుతున్నాయి. అనగా రోజుకు 1,25,000.[2][3]


US లో జరిగిన గర్భస్రావాలు 1973-2011లలో 54.5 మిలియన్


దాదాపు 1,000 పుట్టుకలకు 234 గర్భస్రావాలు(సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ ప్రకారం)


సంవత్సరానికి గర్భస్రావాలు – 1.2 మిలియన్


ప్రతి రోజు జరిగే గర్భస్రావాలు– 3,288


గంటకు జరిగే గర్భస్రావాలు– 137


ప్రతి 4 నిమిషాలకు9 గర్భస్రావాలు


ప్రతి 26 సెకండ్లకు 1గర్భస్రావం [4] [5] [6]

 

ఖుర్ఆన్

“దారిద్ర్య భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి. వారికీ, మీకూ ఉపాధిని ఇచ్చేది మేమే.ముమ్మాటికీ వారి హత్య మహాపాతకం.” ఖుర్ఆన్, సూరా బనీ ఇస్రాయీల్ 17:31


(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీ పై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్ కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము. సిగ్గు మాలిన పనులు – అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా – వాటి దరిదాపులక్కూడా వెళ్ళకండి. సత్య(న్యాయ) బద్ధంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. మీరుఆలోచించి పనిచేస్తారని, అల్లాహ్ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు.” ఖుర్ఆన్ సూరా అల్ అన్ ఆమ్ 6:151


“ఓ ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించబోము అనీ, దొంగతనం చేయబోము అనీ, వ్యభిచారానికి పాల్పడబోము అనీ, తమ సంతానాన్ని చంపబోము అనీ, తమ కాళ్ళు చేతుల మధ్య నుండి ఎలాంటి అభాండాన్నీ కల్పించబోము అనీ, ఏ సత్కార్యంలోనూ నీకు అవిధేయత చూపబోము అని ప్రమాణం చేస్తే నువ్వు వారి చేత ప్రమాణం చేయించు.వారి క్షమాపణ కొరకు అల్లాహ్ ను ప్రార్ధించు.నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి.” ఖుర్ఆన్, సూరా అల్ ముమ్ తహినహ్ 60:12


ఈఉన్నతమైన ఆయతులు రాకముందు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడకముందు బహుదైవారాధకులైన అరబ్బులు తమ కూతుళ్ళను 4 ఏళ్ల లోపే సజీవంగా పూడ్చిపెట్టేవారు. దీనికి కారణాలు – (1) కూతురు పుడితే కుటుంబం సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది అనే భావన ఉండేది. (2) కుటుంబంబీదరికంలో ఉండడం వల్ల ఎక్కడ తమ కూతుర్ని ఇతరులకు అమ్ముకోవాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయపడేవారు.
1500 సంవత్సరాల క్రితం గర్భస్రావ ఆస్పత్రులు లేనప్పుడు, తల్లి కడుపుపై కొట్టి లేదా ఆమెను విపరీతంగా భయపెట్టి గర్భస్రావం చేసేవారు.

 

హదీస్

అబ్దుల్లా ఉల్లేఖించారు:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “(మీ సృష్టి గురించి చెబుతూ) ప్రతి ఒక్కరు మొదటి నలభై రోజుల్లో తమ తల్లి కడుపులో సేకరించబడతారు, ఆ తరువాతి నలభై రోజుల్లో రక్తపు ముద్దగా మారుతాడు, తదుపరి నలభై రోజుల్లో మాంసపు ముద్దగా మారుతాడు. ఆ పై అల్లాహ్ ఓ దైవదూతను పంపించి నాలుగు విషయాలు వ్రాయిస్తాడు : అతని కర్మలు, అతని మరణసమయం, అతని జీవనోపాధి,ఆటను దౌర్భాగ్యవంతుడవుతాడో లేక దీవించబడ్డవాడుఅవుతాడో (ధర్మంలో). ఆ తరువాత అతని శరీరంలో ఆత్మ ఊదబడుతుంది.సహీహ్ అల్ బుఖరీ vol 4:549, 8:593 [7]

 

వైద్యవిద్యా ఆవిష్కరణ

వైద్యవిద్యాశాస్త్రంపై హదీసును నిరూపిస్తుంది.


పిండం తల్లి కడుపులో 120 రోజులకు జీవం పోసుకుంటుంది.[8][9][10]

 

విద్వాంసుల కోణం

షేక్సాలిహ్ అల్ ఫౌజాన్ చెప్పారు:


మొదటిది:

గర్భస్రావం చేయించడం ఇస్లాం లో అనుమతించబడలేదు. ఇది అల్లాహ్ ఆదేశానుసారం జరిగేది కాబట్టి ఇలా చేయడం హరాం అవుతుంది. దీనికి పాల్పడినవారు శిక్షకు గురిఅవుతారు.


రెండోది:

పిండంలో ప్రాణం ఉండడం వల్ల గర్భస్రావం చేసినచో ఓ ఆత్మను చంపిన నేరస్తులవుతారు. దానికిప్రాయశ్చితంగా ఒక బానిసను విముక్తిఇవ్వాలి. అలా చేయలేని పక్షంలోవరుసగా రెండు నెలలు ఉపవాసాలు పాటించాలి. నాలుగు నెలల తరువాత అనగా ప్రాణం పోయబడ్డాక గర్భస్రావం చేసినచో ఈ శిక్ష పాటించాల్సి ఉంటుంది. ఇది చాలా గంభీరమైన విషయం. దీన్ని తేలికగా తీసుకోరాదు.ఎవరైనా అనారోగ్యం కారణంగా గర్భాన్ని మోయలేని స్థితిలో ఉంటే, అలాంటి వారు ముందుగా మందులు వాడి గర్భం రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం చక్కబడ్డాక గర్భం దాల్చవచ్చు. అల్ మున్తఖా 5/301,302

 

ఆధారాలు

[1] http://www.medicalnewstoday.com/releases/145870.php (ఇంగ్లీష్)
[2] http://www.worldometers.info/abortions/ (ఇంగ్లీష్)
[3] http://www.abort73.com/abortion_facts/worldwide_abortion_statistics/ (ఇంగ్లీష్)
[4] http://www.all.org/nav/index/heading/OQ/cat/MzQ/id/NjA3OQ/ (ఇంగ్లీష్)
[5] http://www.abort73.com/abortion_facts/us_abortion_statistics/ (ఇంగ్లీష్)
[6] http://www.lifeissues.org/abortion/ (ఇంగ్లీష్)
[7] http://www.answering-christianity.com/abortion_is_crime_after_120_days.htm (ఇంగ్లీష్)
[8] http://www.answering-christianity.com/mahir/fetus_alive_after_120_days.htm (ఇంగ్లీష్)
[9] http://baby2see.com/development/week18.html

[10] http://en.wikipedia.org/wiki/Human_fetal_development#development (ఇంగ్లీష్)
[11] http://islamqa.info/en/ref/82334 (ఇంగ్లీష్)

[12] http://www.babycentre.co.uk/18-weeks-pregnant (ఇంగ్లీష్)

 

345 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్