ఏకేశ్వరోపాసన


ఏకేశ్వరోపాసన అనగా ఒకే ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్ ను  మాత్రమే ఆరాధించడం, పూజించడం.  

 

విషయసూచిక

 

అరబిక్ పదం తౌహీద్ ను తెలుగులో ఏకేశ్వరోపాసన అంటారు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది. ‘ఇన్నఇలాహకుమ్ ఇలాహున్ వాహిద్’ అనగా నిస్సందేహంగా మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే. ఖుర్ఆన్, సూరా సాఫ్ఫాత్ 37:4

 

ఖుర్ఆన్ మరియు సున్నహ్ ప్రకారం తౌహీద్ ను ఇలా విభజించవచ్చు :

 

తౌహీదుర్ రుబూబియహ్  –   అల్లాహ్ ఏకాధిపత్యం

 

తౌహీదుల్ ఉలూహియ  -  ఆరాధనలో ఏకత్వం

 

తౌహీద్ అస్మా వ సిఫాత్  -  అల్లాహ్ పేర్లలో, లక్షణాల్లో ఏకత్వం

 

తౌహీద్ (ఏకేశ్వరోపాసన) గురించి ఇంకా తెలుసుకోవాలంటే అస్క్ఇస్లాంపీడియా.కామ్ సైటులోని హోమ్ పేజీ లో తౌహీద్ వ్యాసం చదవండి.

 

 

ప్రాముఖ్యత

ఇస్లాం మూలస్తంభం ఏకేశ్వరోపాసన. ఇస్లాం స్వికరించాలంటే అల్లాహ్ ఒక్కడే, ఆయనే ఈ సృష్టిని సృష్టించాడు, ఈ సృష్టిలోని అన్నిటిపై అధికారం ఆయనదే, ఆయన ఆజ్ఞ లేనిదే ఈ సృష్టిలో ఏదీ జరగదు అని తప్పనిసరిగా విశ్వసించాలి. 

 

అల్లాహ్ ఒక్కడే, ఆయనకి భాగస్వాములు ఎవరూ లేరు, సంతానం లేదు, సమానులూ లేరు. ఆయన చాలా దయగలవాడు, చాలా వివేకవంతుడు, చాలా న్యాయం చేసేవాడు. ఆయన అన్నీ విoటాడు, అన్నీ చూస్తాడు, అన్నీ తెలిసినవాడు. ఆరాధనలన్నీ ఆయనకే చెందును.  

 

ఖుర్ఆన్ వెలుగులో

ఖుర్ఆన్ లోని సూరా ఇఖ్లాస్ సూరా నెం 112 లో తౌహీద్  (ఏకేశ్వరోపాసన) గురించి వివరంగా చెప్పబడింది. మనం ఎవరిని ఆరాధించాలి, ఎవరు ఆరాధ్యానికి అర్హులో ఇందులో స్పష్టంగా తెలియజేయబడింది.

 

ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు : ఆయన అల్లాహ్, (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు (ఏ అక్కరా లేనివాడు).ఆయన (ఎవరినీ)కనలేదు. ఆయన (కూడా)ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగినవాడు)ఎవడూ లేడు. (సూరా ఇఖ్లాస్ 112: 1-4)

 

అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని స్వయంగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞాన సంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు , వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ  ఆరాధనకు అర్హులు కారు.(సూరా, అల్ ఇమ్రాన్ 3:18)

 

కనుక ఓ ప్రవక్తా! అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. నీ పొరపాట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్ర్తీలందరి మన్నింపు కోసం కూడా వేడుకుంటూ ఉండు. మీ రాకపోకల గురించి, మీ విశ్రాంతి స్థలాల గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. (ఖుర్ఆన్ సూరా ముహమ్మద్ 47:19)

 

వారికి చెప్పు :  “అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరంతా ఏకాగ్ర చిత్తం కల ఇబ్రాహీమ్ ధర్మాన్నే అనుసరించండి. ఆయన బహుదైవోపాసకులలోని వాడు కాడు.”(ఖుర్ఆన్, సూరా అల్ ఇమ్రాన్ 3:95)

 

పూర్తి ఏకాగ్రతతో ఈ ధర్మం వైపుకు అభిముఖం కావాలనీ, షిర్క్ చేసే వారిలో చేరిపోరాదని కూడా నాకు చెప్పబడింది. (ఖుర్ఆన్ సూరా యూనుస్  10:105)

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లoమనకు ఆదర్శమూర్తులు

నిశ్చయంగా దైవప్రవక్తలలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది – అల్లాహ్ పట్ల , అంతిమ దినo పట్ల,ఆశ కలిగి ఉంది, అల్లాహ్ ను అత్యదికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు. (ఖుర్ఆన్ సూరా ఆహ్ జాబ్ 33:21)

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లoతన జీవితకాలంలో ఏనాడూ ఏకేశ్వరోపాసన తప్ప ఇతర విషయాల వైపుకు మానవాళిని పిలిచినట్లు మనకు కనబడదు. అయన సల్లల్లాహు అలైహి వసల్లoవిగ్రహారాధనను తిరస్కరించారు. మానవులను విగ్రహారాధన చేయకూడదని బోధించారు మరియు స్వర్గానికి తీసుకెళ్ళే రుజుమర్గాన్ని చూపారు.

 

గుణపాఠం

ఇస్లాం ను అనుసరించేవారు ఎల్లప్పుడూ ఎలాంటి సమయాలలోనైనా తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ను వీడకూడదు. అల్లాహ్ ఒక్కడే, ఆయనికి సరిసమానులు ఎవ్వరూ లేరు అని విశ్వసించడం వల్ల మన మనోబలం కూడా పెరుగుతుంది. మంచి సమయాల్లో, చెడు సమయాల్లో రెండింటిలోనూ సర్వలోకాలకు సృష్టికర్త అయిన ఆ ఒక్క  అల్లాహ్ నే విశ్వసించాలి. మూర్ఖత్వంతో హద్దులు దాటి సృష్టించబడిన వాటిని ఆరాధించకూడదు లేదా అల్లాహ్ కు భాగస్వాముల్ని సృష్టించకూడదు. 

 

ఆధారాలు

http://www.islamtomorrow.com/articles/tawheed_nuradeen.htm (ఇంగ్లీష్)

http://www.muhajabah.com/tawhid.htm(ఇంగ్లీష్)

 

889 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్