ఇస్లాం ద్వారా స్త్రీల విమోచన


20వ శతకంలో పాశ్చాత్య దేశాల్లో స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, విమోచన లభించిందని ప్రజలు అనుకుంటున్నారు. వాస్తవానికి స్త్రీల విమోచన పురుషుల ద్వారానో, స్త్రీల ద్వారానో మొదలు కాలేదు.  మానవ జాతి మేలు కోసం పంపబడిన తన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా అల్లాహ్ దీన్నిఏడవ శతకంలో అవతరింపజేశాడు. ఇస్లాంలో ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా స్త్రీల హక్కులు, బాధ్యతలు తెలియజేయబడ్డాయి.       

 

విషయసూచిక

 

మానవ హక్కులు

ఇస్లాంలో స్త్రీలు కూడా అల్లాహ్ ను ఆరాధించబడే విషయంలో ప్రశ్నించబడతారు. వారు మంచి ప్రవర్తన విషయంలో ఒకరిని ఒకరు మించిపోవడానికి ప్రయత్నించాలి. మానవత్వపరంగా ఇస్లాంలో స్త్రీ పురుషులు సమానులు. ఖుర్ఆన్ లో ఓ సూరా పేరు ‘సూరా నిసా’ అనగా ‘స్త్రీ’ అని ఉంది. అందులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ మానవులారా!   మిమ్మల్ని   ఒకే ప్రాణి నుంచి పుట్టించి,దాన్నుంచే దాని జతను  కూడా సృష్టించి, ఆ ఇద్దరి  ద్వారా ఎంతో మంది   పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో  మీరు  పరస్పరం  మీకు కావలసిన వాటిని  అడుగుతారో  ఆ  అల్లాహ్‌కు  భయపడండి.  బంధుత్వ సంబంధాల  తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘావేసి ఉన్నాడు.” ఖుర్ఆన్ సూరా నిసా 4:1. స్త్రీ అయినా, పురుషుడైనా జన్మించే విధానం ఒకటే కావున వారు మానవతా దృష్ట్యా సమానులు. కొన్ని మతాలు భావించేటట్లు స్త్రీలు దుష్ట శకునం కారు, పురుషులు కూడా పుట్టుకతో చెడ్డవారు కారు. అలాగే ఎవరిపై ఎవరికీ ప్రాధాన్యత లేదు, ఎందుకంటే అది సమానత్వానికి విరుద్ధం అవుతుంది.

 

పౌర హక్కులు

ఇస్లాంలో స్త్రీలకు తమ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. తను తనకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు.  సన్మార్గం అపమార్గం  నుంచి ప్రస్ఫుటమయ్యింది.” (ఖుర్ఆన్ సూరా బఖరా 2:256) ఇస్లాం స్త్రీలను తమ అభిప్రాయాలను, భావనలను పంచుకునే అవకాశం ఇస్తుంది. అనేక సార్లు స్త్రీలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ను ధర్మం గురించి, అర్థశాస్త్రం గురించి, సామాజిక వ్యవహారాల గురించి ప్రశ్నించేవారు మరియు తమ అభిప్రాయాలను తెలియజేసేవారు అని హదీసుల ద్వారా తెలుస్తుంది. ముస్లిం స్త్రీకి తన భర్తను ఎంచుకునే హక్కు ఉంది. చట్టపరమైన విషయాలలో ముస్లిం స్త్రీ సాక్ష్యం తీసుకోబడుతుంది. వాస్తవికంగా, ఏ విషయాలలో స్త్రీలకు జ్ఞానం ఉందో ఆ విషయాలలో వారి సాక్ష్యానికి విలువ ఇవ్వబడుతుంది.

 

సామాజిక హక్కులు

మాతృత్వం గురించి చెబుతూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది.” ఇబ్న్ మాజా 2771. ఈ విధంగా సామాజిక వృద్ధి, సాఫల్యానికి కారకులు స్త్రీలవుతారు. మానవుని ఎదుగుదలకు మొదటి మెట్టు అతని తల్లి అవుతుంది. ఎందుకంటే తల్లి చూపించే వాత్సల్యం, భద్రత, ఇచ్చే శిక్షణ వల్లే మానవుడు, మంచి పౌరునిగా ఎదుగుతాడు. అందువల్లే ప్రతి స్త్రీ విద్యావంతురాలై ఉంటే ఇటు మానవులకు, అటు సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది.       


ఆర్థిక హక్కులు

ముస్లిం స్త్రీకి ధనం సంపాదించే, ఆస్తి కూడగట్టే, చట్టపరంగా తన ఆస్తుల్ని తన ఇష్టానుసారం కాపాడుకునే హక్కు ఉంది. ముస్లిం స్త్రీకి వ్యాపారం కూడా చేసుకునే హక్కు ఉంది. ఆమె ఆస్తులపై ఎవరికీ, తన భర్తకు కూడా  ఎలాంటి హక్కు లేదు. ఈ విషయం గురించి ఖుర్ఆన్ ఇలా అంటుంది: “అల్లాహ్‌ మీలో కొందరికి మరికొందరిపై  దేని  మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో  దానికోసం ఆశపడకండి. పురుషులు  సంపాదించిన  దానినిబట్టి  వారి  భాగం వారికుంటుంది.  అలాగే స్త్రీలు  సంపాదించిన  దానినిబట్టి వారి భాగం వారికుంటుంది.   కాకపోతే మీరు అల్లాహ్‌ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.” ఖుర్ఆన్ సూరా నిసా 4:32  
 

ముస్లిం స్త్రీకి బంధువుల వారసత్వపు హక్కు ఉంటుంది. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: “తల్లిదండ్రులు,  సమీప  బంధువులు  వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది.  అలాగే   తల్లిదండ్రులు,   సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.” ఖుర్ఆన్ సూరా నిసా 4:7

 

భార్య హక్కులు

ఖుర్ఆన్ లో ఇలా సెలవియ్యబడింది: “మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే;  ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు- మీరు   వారి  వద్ద   ప్రశాంతత  పొందటానికి!ఆయన  మీ  మధ్య  ప్రేమనూ,    దయాభావాన్నీ  పొందుపరచాడు.  నిశ్చయంగా  ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.” ఖుర్ఆన్ సూరా రూమ్ 30:21. ఇస్లాంలో పెళ్లి కేవలం శారీరికమైన కోరిక తీర్చే సాధనం మాత్రమే కాదు. ఇది అల్లాహ్ తరఫున ఓ సూచన మరియు సంకేతం. ఈ బంధుత్వంలో అల్లాహ్ ఆదేశానుసారం పరస్పర హక్కులు, బాధ్యతలు ఇమిడి ఉన్నాయి. అల్లాహ్ స్త్రీ, పురుషులను ఇచ్చి పుచ్చుకునే ప్రకృతి ధర్మంపై పుట్టించాడు. ఖుర్ఆన్ లో తెలియజేయబడిన చట్టాలను అనుసరించిన మీదట వీరి మధ్య సామరస్యపూర్వకమైన సంబంధం స్థాపితమవుతుంది. 

 

పురుషులను అల్లాహ్ స్త్రీల సంరక్షకులుగా చేశాడు. పురుషులు కుటుంబ బాధ్యతలను కూడా నెరవేర్చాలి. జీవితాన్ని అల్లాహ్ ఆదేశానుసారం గడపండని తన కుటుంబాన్ని ఆదేశించడం కూడా అతని బాధ్యతల్లో ఒక ముఖ్యమైన బాధ్యత. కుటుంబ సభ్యుల పట్ల దయాగుణం కలిగి ఉండడంభార్య బాధ్యతల్లో ఓ ముఖ్యమైన బాధ్యత.  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు: “తమ ప్రవర్తనలో మంచివారే ఉత్తమ విశ్వాసులు. మీ భార్యలతో మంచిగా ఉండేవారే మీలో ఉత్తములు.”  

 

భార్య బాధ్యతలు

హక్కులతోపాటు బాధ్యతలు కూడా వస్తాయి. కావున వారి భర్తల బాధ్యతలు వారిపై కొన్ని ఉన్నాయి. ఖుర్ఆన్ లో వివరించబడింది: “తమ  భర్తలు లేని  సమయంలో  అల్లాహ్‌   రక్షణలో  ఉంటూ  (తమ  శీలాన్నీ, భర్త సంపదను) కాపాడుతారు.” ఖుర్ఆన్ సూరా నిసా 4:34. భార్య తన భర్త రహస్యాలను కాపాడాలి. ఎట్టి పరిస్థితిలోనూ భార్య తన భర్త పరువు, గౌరవాలు కాపాడుతూ ఉండాలి. భార్య తన భర్త సంపదను కూడా కాపాడాలి. ఆమె తన ఇంటిని, ఆస్తులను – దొంగతనానికి, నష్టానికి – గురికాకుండా రక్షించాలి. ఇంటి ఖర్చుల్లో  దుబారా ఖర్చు కాకుండా చూడాలి. తన భర్త ఇష్టపడని వ్యక్తిని ఇంటిలోనికి రానివ్వకూడదు. భర్త వేటిపైనైతే ఖర్చు చేయకూడదు అంటాడో వాటిపై ఎలాంటి ఖర్చు చేయకూడదు. భర్తతో అన్ని విషయాలలో పరస్పరం సహకరించుకోవాలి. అల్లాహ్ కు  క్రుతఘ్నుడితో సహకారం కుదరదు. అల్లాహ్ ఆజ్ఞకు విరుద్ధంగా ఏదైనా చేయమంటే ఆమె అతని మాటను త్రోసివేయాలి. భర్త కూడా భార్యను చులకనగా చూడకూడదు. అంతేకాదు, ఆమె అవసరాలను, సంతోషాలను దృష్టిలో ఉంచుకోవాలి.      

 

ముగింపు/ నిర్ధారణ

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు:“(చూడండి) అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త ఏ   వ్యవహారం లోనయినా  ఒక   నిర్ణయం  చేసిన  తరువాత  విశ్వాసులైన ఏ పురుషునికిగానీ,  స్త్రీకి గానీ  తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు  అవిధేయత  చూపితే  అతను స్పష్టమైన అపమార్గానికి  లోనైనట్లే (జాగ్రత్త!).” ఖుర్ఆన్ సూరా అహ్జాబ్ 33:36


ముస్లిం స్త్రీలకు1400సంవత్సరాల క్రితం ఏ పాత్రలు, బాధ్యతలు, హక్కులు ఇవ్వబడ్డాయో అవి నేటి స్త్రీలకు – పాశ్చాత్య దేశాల్లో – కూడా లేవు. సమాజంలో సమతూకం కోసం ఇవి అల్లాహ్ తరఫున అవతరింపజేయబడ్డాయి. ఒక్కోచోట ఏదైనా తప్పినట్టు కనిపిస్తే అది వేరేచోట పూర్తి గావించబడుతుంది. ఇస్లాం ముస్లింలకే కాదు పూర్తి మానవాళికి ఆచరించదగ్గ జీవనసరళి.    

 

ఆధారాలు

http://www.beconvinced.com

 

2028 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్